Gate way of india
-
పర్యాటక పడవను ఢీకొట్టిన నేవీ బోట్
ముంబై: ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాన్ని వీక్షించేందుకు బయల్దేరిన ప్రయాణికులు అనూహ్యంగా పడవ ప్రమాదంలో జలసమాధి అయ్యారు. 13 మంది ప్రాణాలను బలితీసుకున్న ఈ ఘోర పడవ ప్రమాదం దేశ ఆర్థిక రాజధాని ముంబై సమీపంలోని అరేబియా సముద్రజలాల్లో బుధవారం మధ్యాహ్నం నాలుగుగంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ముంబై పోలీసులు, భారతీయ నావికాదళం తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 100మందికిపైగా పర్యాటకులతో ‘నీల్కమల్’ పర్యాటక పడవ ముంబైలో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి బయల్దేరి ఎలఫెంటా ఐలాండ్‌కు వెళ్తోంది. కరంజా ప్రాంతానికి రాగానే శరవేగంగా వచ్చిన భారత నేవీకి చెందిన ఒక బోట్ ఈ పడవను ఢీకొట్టింది. దీంతో పర్యాటకుల పడవ మునిగిపోయింది. తప్పించుకునే వీలులేక 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నీటలో పడ్డ ప్రయాణికులను రక్షించేందుకు నావికా, తీర గస్తీ దళాలు రంగంలోకి దిగాయి. 99 మందిని ఈ దళాల సహాయక బృందాలు కాపాడాయి. నాలుగు నేవీ హెలికాప్టర్లు, 11 నావల్ క్రాఫ్ట్‌లు, ఒక తీర గస్తీ బోటు, మూడు మెరైన్ పోలీస్ బోట్లు ముమ్మర గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. మొత్తంగా 99 మందిని కాపాడినట్లు వార్తలొ చ్చాయి. గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో ఒక నేవీ అధికారి, ఇద్దరు నేవీక్రాఫ్ట్ కొత్త ఇంజన్ సంబంధిత నిపుణులు ఉన్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. కొత్త ఇంజన్‌ను నేవీక్రాఫ్ట్కు బిగించి పరీక్షిస్తున్న సమయంలో బోట్ అదుపుతప్పి మెరుపువేగంతో ప్రయాణించి అటుగా వెళ్తున్న పర్యాటక పడవను ఢీకొట్టిందని నేవీ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. 101 మందిని కాపాడినట్లు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.Mumbai boat accident VIDEO । बोटींच्या अपघाताचा EXCLUSIVE थरारक व्हिडीओ #NDTVMarathi #MumbaiBoatAccident #gatewayofindia pic.twitter.com/aQsaWhGRCs— NDTV Marathi (@NDTVMarathi) December 18, 2024VIDEO CREDITS: NDTV Marathi एलिफंटाकडे जाणारी प्रवासी बोट उलटली;बचावकार्य युद्धपातळीवर सुरु #gatewayofindia #eliphanta #Inframtb @TheMahaMTB pic.twitter.com/Oo3DtaKxp5— Gayatri Shrigondekar (@GShrigondekar) December 18, 2024 -
గేట్‌వే ముట్టడి భగ్నం..
ముంబై : జేఎన్‌యూ క్యాంపస్‌లో హింసాకాండను వ్యతిరేకిస్తూ ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద నిరసనలకు దిగిన ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు వారిని ఆజాద్ మైదాన్‌లో ఈ కార్యక్రమానికి అనుమతించారు. గేట్‌వే ఆఫ్ ఇండియా ప్రాంతాన్ని ఖాళీ చేయాలని, ఈ ప్రాంతంలో ధర్నాకు దిగితే టూరిస్టుల రాకకు అవాంతరాలు ఏర్పాడతాయని ముంబై పోలీసులు ఆందోళనకారులను కోరారు. పోలీసుల సూచనతో ఆజాద్ మైదాన్‌లో నిరసనలు చేపట్టేందుకు ఆందోళనకారులు అంగీకరించకపోవడంతో వారిని బలవంతంగా ఆజాద్ మైదాన్‌కు తరలించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత గేట్‌వే ఆఫ్ ఇండియా ప్రాంతాన్ని నిరసనకారులు ఖాళీ చేశారని పోలీసులు తెలిపారు. గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ఆందోళనలతో ఆ ప్రాంతానికి దారితీసే రోడ్లు బ్లాక్ కావడంతో సగటు ముంబై వాసి సహా టూరిస్టులు ఇబ్బందులు ఎదుర్కొనే క్రమంలో ఆజాద్ మైదాన్‌కు నిరసనకారులను తరలించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి : జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నేతపై కేసు -
కాలగర్భంలోకి విక్టోరియా బగ్గీలు
ముంబై: నగర సందర్శనకు వచ్చిన పర్యాటకులకు చారిత్రక ప్రాధాన్యతగల ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ను సందర్శించడం, నారిమన్ పాయింట్ దిశలో సూర్యాస్తమయాన్ని తిలకించడం ఓ మరిచిపోలేని అనుభూతి. అయితే చారిత్రక వారసత్వపు ఆనవాళ్లుగా కొనసాగుతున్న గుర్రపు బగ్గీలో రాజ కుటుంబీకులవలె దర్జాగా కూర్చొని దక్షిణ ముంబై సముద్రపు ఒడ్డున ముందుకు సాగడం, ఒడ్డుకు తాకుతున్న అలల సవ్వడిని వినడం, అలల మీదుగా శరీరాన్ని తాకే చల్ల గాలులను ఆస్వాదించడం మరింత మరచిపోలేని మధురానుభూతి. ఇక ఈ అనుభూతి మరెన్నో రోజులు అందుబాటులో ఉండదు. స్థానికంగా విక్టోరియాస్ అని పిలిచే ఈ బగ్గీలు జూన్ ఒకటవ తేదీ నుంచి కాలగర్భంలో కలసిపోనున్నాయి. జంతుకారుణ్య సంస్థ ‘పెటా’ సుదీర్ఘకాలంగా చేసిన పోరాటం ఫలితంగా వెండి రంగుల్లో తలతలలాడుతూ, రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించే ఈ గుర్రపు బగ్గీలను ముంబై హైకోర్టు గతేడాదే నిషేధించింది. వచ్చే జూన్ ఒకటవ తేదీ నుంచి నగరంలో ఒక్క విక్టోరియా కూడా కనిపించకూడదని, అప్పటిలోగా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను వెతుక్కోవాల్సిందిగా గుర్రపు బగ్గీల యజమానులను, వాటిని తోలే కార్మికులను ఆదేశించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం నగరంలో 130 విక్టోరియా బగ్గీలు తిరుగుతున్నాయి. 19వ శతాబ్దంలో కార్లు, ట్రాములు లేనికాలంలో ఈ విక్టోరియా గుర్రపు బగ్గీలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఆ తార్వత కార్లు, ఇతర మోటారు వాహనాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాక కూడా పర్యాటకులకు ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటికి వింటేజ్ హోదా కూడా లభించాయి. వీటికి వ్యతిరేకంగా పెటా ఆందోళన తీవ్రతరం కావడంతో హైకోర్టు వీటిని నిషేధించాల్సి వచ్చింది. పెటా ఉద్యమానికి బాలివుడ్ తారలు ఎంతో మంది మద్దతు తెలపడంతో ఉద్యమం ఊపందుకుంది. ఒకప్పుడు బాలివుడ్లో పాపులరైన బహరాని–శ్రీలంక నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్, జీనతమన్, హేమమాలిని, రిచా చద్దా, అనుష్క శర్మ, జాన్ అబ్రహం లాంటి వాళ్లు ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. అయితే నగరంలో వారి కార్లు వేగంగా దూసుకుపోయేందుకు వీళ్లేకుండా ఈ గుర్రపు బగ్గీలు అడ్డుపడుతున్నాయనే కోపంతోనే పెటా ఉద్యమానికి వారు వంత పాడారని గుర్రపు బగ్గీల యజమానులు విమర్శించారు. జూన్ తర్వాత మనం ఈ విక్టోరియా బగ్గీల స్వారీని చూడాలంటే 1952లో వచ్చిన సిఐడీ, 1972లో వచ్చిన విక్టోరియా నెంబర్ 23లను మళ్లీ చూడాల్సిందే. ఆ సినిమాల్లో ఈ బగ్గీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. షోలో చిత్రంలో హేమమాలిని నడిపేది కూడా విక్టోరియా బగ్గీనే.