ఘోర ప్రమాదం.. జాలర్లను రక్షించిన సైన్యం | Fishermen Boat Catches Fire Near Mumbai Check Latest Details Here | Sakshi
Sakshi News home page

ముంబై తీరంలో ఘోర ప్రమాదం.. జాలర్లను రక్షించిన సైన్యం

Feb 28 2025 2:09 PM | Updated on Feb 28 2025 3:59 PM

Fishermen Boat Catches Fire Near Mumbai Check Latest Details Here

ముంబై: అరేబియా సముద్రంలో ఘోర ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం జాలర్లతో వెళ్లిన ఓ బోటు మంటల్లో చిక్కుకుంది. అయితే భారత సైన్యం సకాలంలో స్పందించడంతో అందులో ఉన్నవాళ్లంతా ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.

శుక్రవారం వేకువజామున రాయ్‌గఢ్‌ జిల్లా అక్షి అలీబాగ్‌ వద్ద సముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు చెలరేగి బోటు నుంచి పొగ వస్తుండడం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, ఇండియన్‌ నేవీలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. బోటులో చిక్కుకున్న జాలర్లను క్షేమంగా బయటకు తెచ్చాయి.

బోటు 80 శాతం కాలిపోగా.. 20 మంది జాలర్లు ప్రమాదం నుంచి బయటపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన బోటు సాాకరక్షి గ్రామానికి చెందిన రాకేష్‌ మూర్తికి చెందిందిగా నిర్ధారించారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రానప్పటికీ. .  షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement