Arabian Sea
-
పర్యాటక పడవను ఢీకొట్టిన నేవీ బోట్
ముంబై: ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాన్ని వీక్షించేందుకు బయల్దేరిన ప్రయాణికులు అనూహ్యంగా పడవ ప్రమాదంలో జలసమాధి అయ్యారు. 13 మంది ప్రాణాలను బలితీసుకున్న ఈ ఘోర పడవ ప్రమాదం దేశ ఆర్థిక రాజధాని ముంబై సమీపంలోని అరేబియా సముద్రజలాల్లో బుధవారం మధ్యాహ్నం నాలుగుగంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ముంబై పోలీసులు, భారతీయ నావికాదళం తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 100మందికిపైగా పర్యాటకులతో ‘నీల్కమల్’ పర్యాటక పడవ ముంబైలో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి బయల్దేరి ఎలఫెంటా ఐలాండ్‌కు వెళ్తోంది. కరంజా ప్రాంతానికి రాగానే శరవేగంగా వచ్చిన భారత నేవీకి చెందిన ఒక బోట్ ఈ పడవను ఢీకొట్టింది. దీంతో పర్యాటకుల పడవ మునిగిపోయింది. తప్పించుకునే వీలులేక 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నీటలో పడ్డ ప్రయాణికులను రక్షించేందుకు నావికా, తీర గస్తీ దళాలు రంగంలోకి దిగాయి. 99 మందిని ఈ దళాల సహాయక బృందాలు కాపాడాయి. నాలుగు నేవీ హెలికాప్టర్లు, 11 నావల్ క్రాఫ్ట్‌లు, ఒక తీర గస్తీ బోటు, మూడు మెరైన్ పోలీస్ బోట్లు ముమ్మర గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. మొత్తంగా 99 మందిని కాపాడినట్లు వార్తలొ చ్చాయి. గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో ఒక నేవీ అధికారి, ఇద్దరు నేవీక్రాఫ్ట్ కొత్త ఇంజన్ సంబంధిత నిపుణులు ఉన్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. కొత్త ఇంజన్‌ను నేవీక్రాఫ్ట్కు బిగించి పరీక్షిస్తున్న సమయంలో బోట్ అదుపుతప్పి మెరుపువేగంతో ప్రయాణించి అటుగా వెళ్తున్న పర్యాటక పడవను ఢీకొట్టిందని నేవీ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. 101 మందిని కాపాడినట్లు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.Mumbai boat accident VIDEO । बोटींच्या अपघाताचा EXCLUSIVE थरारक व्हिडीओ #NDTVMarathi #MumbaiBoatAccident #gatewayofindia pic.twitter.com/aQsaWhGRCs— NDTV Marathi (@NDTVMarathi) December 18, 2024VIDEO CREDITS: NDTV Marathi एलिफंटाकडे जाणारी प्रवासी बोट उलटली;बचावकार्य युद्धपातळीवर सुरु #gatewayofindia #eliphanta #Inframtb @TheMahaMTB pic.twitter.com/Oo3DtaKxp5— Gayatri Shrigondekar (@GShrigondekar) December 18, 2024 -
మునిగిపోయిన వాణిజ్య నౌక..
పోర్బందర్: అరేబియా సముద్ర జలాల్లో పయనిస్తున్న ఓ వాణిజ్య నౌక మునిగిపోవడంతో అందులో ఉన్న మొత్తం 12 మంది భారతీయ సిబ్బందిని మన తీర రక్షక దళం(ఐసీజీ) కాపాడింది. మన ప్రాదేశిక జలాల ఆవల చోటుచేసుకున్న ఈ ఘటనలో పాకిస్తాన్ మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ(పీఎంఎస్ఏ)సత్వరమే స్పందించి, సహకారం అందించినట్లు ఐసీజీ వెల్లడించింది. ఎంఎస్వీ ఏఐ పిరన్పిర్ అనే వాణిజ్య నౌక సరుకుతో ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు నుంచి ఈనెల 2న గుజరాత్‌లోని పోర్బందర్కు బయలుదేరింది. అయితే, బుధవారం ఉదయం సముద్రంలోని అల్లకల్లోల పరిస్థితులతో లోపలికి భారీగా నీరు చేరి పాక్ ఆర్థిక జోన్ పరిధిలో ద్వారకకు పశ్చిమాన 270 కిలోమీటర్ల దూరంలో మునిగిపోయింది. ఓడలోని సిబ్బంది ముంబైలోని ఐసీజీ విభాగం మారిటైం రెస్క్యూ కో ఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్సీసీ)కు రక్షించాలంటూ సందేశం పంపారు. దీనిని ఎంఆర్సీసీ గాందీనగర్‌లోని ఐసీజీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయానికి చేరవేసింది. వెంటనే రంగంలోకి దిగిన ఐసీజీ విభాగం ఘటన జరిగిన పీఎంఎస్ఏ విభాగానికి అత్యవసర మెయిల్ పంపించింది. పిరన్పిర్ ఓడలోని సిబ్బంది చిన్న లైఫ్ బోట్లో తప్పించుకున్నారని, దాని జాడ కనిపెట్టాలని కోరింది. తక్షణమే స్పందించిన పీఎంఎస్ఏ ఆ సమీపంలోని మరో వాణిజ్య నౌకకు, నేవీకి సమాచారం అందించింది. ఐసీజీతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పీఎంఎస్ఏ సిబ్బంది విమానం ద్వారా గాలించి చివరికి లైఫ్ బోట్ జాడ కనిపెట్టారు. ఆ మేరకు ఐసీజీ సార్థక్ ఓడలో మొత్తం 12 మందినీ తీసుకుని, పోర్బందర్కు తరలించింది. పాక్ అధికారులు తక్షణమే స్పందించి, పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ మొత్తం ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని ఐసీజీ పేర్కొంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే అంతర్జాతీయ చట్టాలను గౌరవించడంతోపాటు ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడంలో పీఎంఎస్ఏ చూపిన నిబద్ధతను కొనియాడింది. -
అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
సముద్ర గర్భ మైనింగ్ వేలం ప్రారంభం
న్యూఢిల్లీ: సముద్ర గర్భ ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాల వేలం మొదటి రౌండ్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. వీటిలో 13 మైన్స్‌ను విక్రయానికి ఉంచడం జరిగింది. ఈ మైన్స్‌లో మూడు సున్నపు మట్టి, మూడు నిర్మాణ ఇసుక, ఏడు పాలీమెటాలిక్ నాడ్యూల్స్– క్రస్ట్లు ఉన్నాయి. సముద్రగర్భ ఖనిజ వనరుల అన్వేషణ విషయంలో భారత్ పురోగతిని ఈ కేటాయింపులు సూచిస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. ఈ ఖనిజాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి, హైటెక్ తయారీ, గ్రీన్ ఎనర్జీ పరివర్తనకు కీలకం కావడం గమనార్హం. వేలానికి సిద్ధమైన ఆఫ్‌షోర్ ప్రాంతాలలో ప్రాదేశిక జలాలు, కాంటినెంటల్ షెల్ఫ్, ప్రత్యేక ఆర్థిక మండలి, దేశంలోని ఇతర సముద్ర మండలాలు ఉన్నాయి. ఖనిజ సంపద పటిష్టతను సూచిస్తోంది: మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రారంభ కార్యక్రమంలో బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఆఫ్‌షోర్ బ్లాకుల అన్వేషణ వల్ల దేశంలోని ఖనిజ సంపద మరింత పటిష్టం అవుతుందని తెలిపారు. భారతదేశంలో కీలకమైన ఖనిజాల కోసం డిమాండ్ పెరుగుతోందని వివరించారు. లిథియం డిమాండ్ ఎనిమిది రెట్లు పెరుగుతుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్ త్వరలో క్రిటికల్ మినరల్స్ మిషన్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భాగస్వాములకోసం అన్వేషణ: వీఎల్ కాతా రావు ఖనిజ అన్వేషణ, అభివృద్ధి విభాగంలో భాగస్వాముల కోసం ప్రభుత్వం ప్రయతి్నస్తున్నట్లు గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు ఈ సందర్భంగా తెలిపారు. ఖనిజాలపై పరిశోధన– అభివృద్ధిపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు. సముద్ర గర్భ మైనింగ్ వేలం పక్రియ ప్రారంభం నేపథ్యంలో దేశ, విదేశాల్లో రెండు మూడు రోడ్‌షోలు చేయడానికి తాము సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. గనుల అదనపు కార్యదర్శి సంజయ్ లోహియా మాట్లాడుతూ, ఆఫ్‌షోర్ మినరల్ బ్లాక్‌లను విజయవంతంగా వేలం వేయడానికి అవసరమైన అన్ని నిబంధనలను పూర్తి చేసినట్లు చెప్పారు. ఆఫ్‌షోర్ ప్రాంతాలలో మైనింగ్‌ను చేపట్టే చర్యలు తీసుకోవడమే మనకు సవాలు అని ఆయన పేర్కొంటూ, అయితే ఆయా చర్యల్లో విజయవంతం అవుతామన్న భరోసాను వ్యక్తం చేశారు. కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, పాలీమెటాలిక్ నాడ్యూల్స్ వంటి అధిక డిమాండ్ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి అలాగే సప్లై చైన్‌ను స్థిరీకరించడానికి భారత్ విభిన్న ఖనిజ వనరులను అభివృద్ధి చేయాలని గనుల మంత్రిత్వ శాఖ తెలిపింది.గ్లోబల్ లీడర్‌గా ఎదగడమే లక్ష్యం ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 2002ను పార్లమెంటు గత ఏడాది ఆగస్టులో సవరించింది. ఆఫ్‌షోర్ ప్రాంతాలలో ఖనిజ బ్లాకుల కేటాయింపు విధానంగా వేలాన్ని తప్పనిసరి చేసింది. వనరుల అన్వేషణ–వెలికితీత కోసం ఉత్పత్తి లీజులు, మిశ్రమ లైసెన్స్‌ల మంజూరును క్రమబదీ్ధకరణ వంటి చర్యలను తీసుకోడానికి ప్రభుత్వాన్ని ఈ సవరణ అనుమతిస్తుంది. భారత్ సముద్రగర్భంలో ఖనిజాల అన్వేషణలో అడుగుపెట్టినప్పుడు, దాని పారిశ్రామిక–గ్రీన్ ఎనర్జీ రంగాలను పెంపొందించడమే కాకుండా కీలకమైన ఖనిజాలలో గ్లోబల్ లీడర్‌గా తన స్థానాన్ని పొందడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. -
అరేబియా సముద్రంలో తుపానా?
న్యూఢిల్లీ: ఆగస్ట్ నెలలో అరేబియా సముద్రంలో తుపాను పుట్టి భారత వాతావరణ శాఖ అధికారులను సైతం సంభ్రమాశ్చర్యాలకు, ఒకింత ఆందోళనకు గురిచేసింది. ఎందుకంటే అరేబియా సముద్రంలో ఆగస్ట్ నెలలో తుపాన్లు ఏర్పడటం చాలా అరుదైన విషయం. అరేబియా సముద్ర పశ్చిమ ప్రాంత జలాలు ఎల్లప్పుడూ చల్లగా ఉంటాయి. చల్లని జలాలు అనేవి తుపాన్లు ఏర్పడేందుకు అనువైన వాతావరణం కాదు. అరేబియా ద్వీపకల్ప భూభాగాల నుంచి వీచే పొడిగాలులు సైతం ఇక్కడ తుపాన్లను ఏర్పర్చలేవు. అయితే తాజాగా గుజరాత్ తీరాన్ని దాటుతూ తుపాను ఏర్పడటం వాతావరణ శాఖ అధికారులను సైతం ఆలోచనల్లో పడేసింది. చివరిసారిగా 1976లో అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడింది. అది కూడా ఒడిశా మీదుగా ఏర్పడిన అల్పపీడనం చివరకు పశ్చిమ–వాయవ్య దిశగా కదిలి చివరకు అరేబియా సముద్రంలో తుపానుగా రూపాంతరం చెందింది. తర్వాత అది అలాగే వెళ్లి ఒమన్ తీరం వద్ద బలహీనపడింది. అరేబియాలో తుపాన్లు ఎందుకు రావంటే?వర్షాకాల సీజన్లో అరేబియా సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌కన్నా తక్కువకు పడిపోతుంది. దీంతో జూలై, సెప్టెంబర్‌లో తుపాన్లు ఏర్పడటం కష్టం. అల్పపీడనం ఏర్పడినపుడు గాలులు గంటకు 52–61 కి.మీ.ల వేగంతో వీస్తాయి. అదే తుపాను ఏర్పడితే గంటకు 63–87 కి.మీ.ల వేగంతో వీస్తాయి. తుపాను ఏర్పడాలంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కచ్చితంగా 26.5 డిగ్రీల సెల్సియస్‌ను మించి ఉండాలి. అయితే అరేబియా జలాలు ఇంత వేడి ఉండవు. అదే బంగాళాఖాతంలో ఉండే వాతావరణం తుపాన్లు ఏర్పడటానికి అత్యంత అనువుగా ఉంటుంది. చారిత్రకంగా బంగాళాఖాతం, అరేబియాసముద్రాన్ని కలిపి హిందూ మహాసముద్ర ఉత్తరప్రాంతంగా పరిగణిస్తారు. హిందూ మహాసముద్రం ఉత్తరాన 1976 తర్వాత తుపాను ఏర్పడటం ఇదే తొలిసారికావడం విశేషం. 1891 ఏడాది నుంచి చూస్తే ఇప్పటిదాకా ఈ ప్రాంతంలో ఆగస్ట్నెలలో కేవలం నాలుగుసార్లే తుపాన్లు ఏర్పడ్డాయి. అరేబియా సముద్రప్రాంతంతో పోలిస్తే బంగాళాఖాతంలో తుపాన్లు వచ్చే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ. మే, నవంబర్ మధ్యలో ఇవి విజృంభిస్తాయి. భూతాపం కారణమా?మితిమీరిన కాలుష్యం, విచ్చలవిడిగా పెరిగి పోయిన మానవ కార్యకలాపాలు, పారిశ్రా మికీకరణ, శిలాజ ఇంధనాలను మండించడంతో భూతాపోన్నతి కారణంగా వాతావ రణ మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో అరేబియా సముద్రంలో తుపాన్లకు ఈ భూతాపోన్నతికి సంబంధం ఉందేమోనని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. భూతాపం కారణంగా ఇది సంభవించినా ఆశ్చర్యపడా ల్సిన పనిలేదని భారత భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ అభిప్రాయపడ్డారు. ‘‘దశాబ్దాలుగా ప్రాంతీయ వాతావరణంపై శాస్త్రవేత్తలకు ఉన్న అంచనాలను ఈ కొత్త పరిస్థితులు తలకిందులు చేస్తున్నాయి. వాతావరణ మార్పుల్లో కొత్త ధోరణులు అరేబియా సముద్రప్రాంతంపై మరింత లోతైన అధ్యయనం అవసరమని చాటిచెప్తున్నాయి. శతాబ్దాలుగా కొనసాగే వర్షాకాల సీజన్, అల్ప పీడనాలు, తుపాన్ల సీజన్లపై మనకున్న అవగాహనను మరింతగా అప్డేట్ చేసుకో వాల్సిన సమయమొచ్చింది. వాతావరణంలో తరచూ ఇలాంటివే సంభవిస్తే మన ఉష్ణమండల ప్రాంత పరిస్థితుల్లోనూ మార్పులు గణనీయంగా రావొచ్చు. ఇలాంటి తుపాన్లు ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులను వాతావరణ శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం చేయాలి’’ అని రాజీవన్ వ్యాఖ్యానించారు. -
దురాశ తెచ్చిన దుఃఖం
అత్యాశే మనిషికి పెను శాపంగా మారుతోంది. వయనాడ్ విలయమే ఇందుకు తాజా ఉదాహరణ. అసలే కేరళకు పశ్చిమాన అరేబియా సముద్రం. ఆపై తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు. దాంతో పుష్కలమైన వానలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఏకంగా 310 సెంటీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం నమోదవుతుంది. ఇందులో మూడొంతుల వానలు జూన్–సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలోనే కురుస్తాయి. కేరళలో పశ్చిమ కనుమల అందాలు కన్ను తిప్పుకోనివ్వవు. వాటిని ఆస్వాదించేందుకు పర్యాటకుల రాక కొన్నేళ్లుగా ఊహాతీతంగా పెరుగుతోంది. దాంతో ఎకో టూరిజం పేరిట హోటళ్లు, రిసార్టుల నిర్మాణం అడ్డూ అదుపూ లేకుండాపోయింది. అందుకోసం అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. కొండ ప్రాంతాలను కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా తవ్వేయడం నిత్యకృత్యంగా మారింది. వీటిని కట్టడి చేసి సమతుల్యత పాటించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వమూ వీటిని వీలైనంతగా ప్రోత్సహిస్తూ వస్తోంది. పర్యావరణపరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ విపరిణామాలను తట్టుకోలేకపోతున్నాయి. ఫలితమే విపరీతమైన వాతావరణ మార్పులు. అవి కేరళలో కొన్నేళ్లుగా పరిపాటిగా మారాయి. 2017, 2018, 2019ల్లో వరుసగా తుఫాన్లు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అతి భారీ వర్షాలు ఇకపై మరింత పెరుగుతాయని ఈ ట్రెండ్ చెబుతోంది. విపరీత వాతావరణ పరిస్థితులు... వయనాడ్ విధ్వంసానికి మనిషి దురాశే ప్రధాన కారణమని లండన్ ఇంపీరియల్ కాలేజ్ రీసెర్చ్ అసోసియేట్ మరియం జకారియా అన్నారు. ‘‘వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండ ప్రాంతాలపై నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిణమించింది. దాంతో ఒకప్పుడు చల్లగా ఉండే వయనాడ్ ప్రాంతం ఇప్పుడు వేడిగా, పొడిగా మారిపోయింది. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయి. దాంతో కొండచరియలు విరిగిపడే ముప్పు నానాటికీ పెరుగుతోంది. బాగా ఎండిన నేలల్లో వాననీరు తక్కువగా ఇంకుతుంది. కొండల పైభాగంలో రాతి శిఖరాలను ఆవరించి ఉండే మట్టి పొరలు వదులుగా ఉంటాయి. భారీ వర్షాలకు తడిసి, వరద ఉధృతికి కొట్టుకుపోతాయి. తాజా విలయమే ఇందుకు ఉదాహరణ’’ అని వివరించారు. ‘‘వాయు, సముద్ర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఈ విపరీత వాతావరణ పరిస్థితులకు దోహదపడుతోంది. గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల వంటివి తీవ్రతను మరింతగా పెంచుతున్నాయి. ఫలితంగా ఉన్నట్టుండి కుంభవృష్టి కురిసి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తుంది’’ అని జకారియా వివరించారు.అటకెక్కిన కమిటీ సిఫార్సులు... అత్యంత సున్నితమైన భౌగోళిక పరిస్థితులు కేరళ ప్రత్యేకత. కొంత ప్రాంతాలు ఎక్కువ కావడంతో దాదాపుగా సగం రాష్ట్రం 20 డిగ్రీల ఏటవాలు కోణంలో ఉంటుంది. పెలుసుబారిన మట్టితో కూడిన కొండల పై ప్రాంతాలు భారీ వర్షాలకు విరిగిపడటం పరిపాటి...→ గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు నమోదైంది కేరళలోనే! దేశమంతటా 3,782 ఘటనలు జరిగితే వీటిలో కేరళ వాటాయే 2,239!→ 2021లో కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. → పశ్చిమ కనుమల్లో 61 శాతాన్ని పర్యావరణపరంగా అతి సున్నిత ప్రాంతంగా ప్రకటించి పరిరక్షించాలని మాధవ్ గాడ్గిల్ కమిటీ 13 ఏళ్ల క్రితమే కేంద్రానికి సిఫార్సు చేసింది. → కేరళలో కొంత ప్రాంతాలన్నింటినీ ఈ జాబితాలో చేర్చి ఎలాంటి అభివృద్ధి, నిర్మాణ పనులూ జరగకుండా చూడాలని పేర్కొంది. → గనుల తవ్వకాలు, ఇసుక తవ్వకాలు, జల–పవన విద్యుత్కేంద్రాలు, కాలుష్యకారక పరిశ్రమల నిర్మాణం తదితరాలను పూర్తిగా నిషేధించాలని సూచించింది. → కానీ ప్రజల జీవనోపాధికి, రాష్ట్రాభివృద్ధికి ఈ సిఫార్సులు గొడ్డలిపెట్టంటూ కమిటీ నివేదికను కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. → వయనాడ్‌లో గత 50 ఏళ్లలోనే పచ్చదనం ఏకంగా 60 శాతానికి పైగా హరించుకుపోయిందని 2022లో జరిగిన అధ్యయనం తేల్చింది. → అదే సమయంలో జిల్లావ్యాప్తంగా తేయాకు తోటల సాగు ఏకంగా 1,800 శాతం పెరిగిపోయిందని వివరించింది. → కొండ ప్రాంతాల్లో నేల పై పొరల్ని గట్టిగా పట్టి ఉంచే చెట్లు తదితరాలు లేకపోవడం కొద్దిపాటి వర్షాలకే మట్టిపెళ్లలు విరిగిపడటం పరిపాటిగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత నేవీ మరో సాహసం.. 23 మంది పాకిస్థానీలను కాపాడి..
భారత నేవీ మరో సాహసం చేసింది. అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన చేపల బోటులో ఉన్న 23 మంది పాకిస్థానీయులను కాపాడింది. కాగా, సముద్రాల్లో యాంటీ పైరసీలో భాగంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు భారీ నేవీ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో దేశాలతో సంబంధం లేకుండా సముద్ర, నావికుల భద్రత విషయంలో ఎల్లప్పుడూ కట్టుబడిఉన్నట్లు నేవీ ప్రకటించింది. వివరాల ప్రకారం.. ఇతర దేశాల నౌకలు ఆపదలో ఉన్న ప్రతీసారి మేము ఉన్నామంటూ భారత నేవీ ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలోనే నేవీ అధికారులు మరో సహాసం చేశారు. అరేబియాలోని గల్ఫ్ ఏడెన్‌కు సమీపంలో ఉన్న సోకోట్రా ద్వీపసమూహానికి 90 నాటికల్ మైళ్ల దూరంలో గురువారం ఇరాన్‌కు చెందిన చేపల బోటు హైజాక్‌కు గురైంది. తొమ్మిది మంది సముద్ర పైరేట్స్ పడవను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. #IndianNavy Responds to Piracy Attack in the #ArabianSea. Inputs received on a potential piracy incident onboard Iranian Fishing Vessel 'Al-Kambar' late evening on #28Mar 24, approx 90 nm South West of Socotra. Two Indian Naval ships, mission deployed in the #ArabianSea for… pic.twitter.com/PdEZiCAu3t — SpokespersonNavy (@indiannavy) March 29, 2024 దీంతో, ఆ బోటును, సిబ్బందిని రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపడుతున్నట్లు భారత నేవీ శుక్రవారం రాత్రి ప్రకటించింది. దీంతో తొలుత ఐఎన్ఎస్ సుమేధా సముద్రపు దొంగల అదుపులో ఉన్న ‘ఏఐ కంబార్’ బోటును అడ్డగించింది. ఆ తర్వాత ఐఎన్ఎస్ త్రిశూల్ నౌక దానికి తోడైంది. దాదాపు 12 గంటల ప్రత్యేక ఆపరేషన్ అనంతరం బోటులో ఉన్న పైరేట్లు లొంగిపోయారు. 23 మంది పాకిస్థానీయులు సురక్షితంగా బయటపడ్డట్లు నేవీ పేర్కొంది. ఇక, రక్షించిన బోటును సురక్షిత రక్షిత ప్రాంతానికి తరలించడానికి భారత్ నేవీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. -
దటీట్ భారత్ నేవీ.. 40 గంటల రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
ఢిల్లీ: భారత నావికాదళం మరోసారి సత్తా చాటింది. అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన నౌకలో ఉన్న 17 మందిని ఎంతో సాహసోపేతంగా కాపాడింది. సుమారు 40 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిపి నౌకలో ఉన్న 35 మంది సముద్రపు దొంగలను పట్టుకుంది. వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్ 14న అరేబియా సముద్రంలో ఎంవీ రుయెన్ నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. సముద్రంలో దోపిడీకి ఈ నౌకను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నౌనకు రక్షించేందుకు భారత నేవీ రంగంలోకి దిగింది. నౌక రక్షణ కోసం ఆపరేషన్ చేపట్టింది. సుమారు 40 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి నౌకను రక్షించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 35 మంది సముద్రపు దొంగలు లొంగిపోగా.. నౌకలోని 17 మంది సిబ్బంది సురక్షింతంగా ఉన్నట్టు నేవీ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఐఎన్ఎస్ కోల్కత్తా, యుద్ధనౌక ఐఎన్ఎస్ సుభద్ర, ఆధునిక డ్రోన్లు, P8I పెట్రోలింగ్ విమానాలు ఉపయోగించినట్టు ఇండియన్ నేవీ తెలిపింది. హైజాక్‌కు గురైన ఎంవీ రుయెన్ పూర్తిగా భారత నావికాదళం ఆధీనంలో ఉన్నట్టు పేర్కొంది. Indian Navy warship INS Kolkata has taken 35 sea pirates in custody on board and started sailing towards the Indian west coast along with the 17 crew members of the merchant vessel MV Ruen. Indian Navy had forced the pirates to surrender after a major operation on high seas:… pic.twitter.com/CvZ6cC8NtR — ANI (@ANI) March 17, 2024 ఇదిలా ఉండగా.. ఈ నెల 15వ తేదీన భారత నేవీ ఆపరేషన్ చేపట్టే ముందు సముద్రపు దొంగలను లొంగిపోవాలని సూచించింది. లేకపోతే వారిపై దాడులు ప్రారంభించాలని మెరైన్ కమాండోలకు నేవీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమాలియా సముద్రపు దొంగలు నేవీ అధికారులపై కాల్పులు జరిపారు. అనంతరం ఏ మాత్రం బెదరకుండా రెస్క్యూ కొనసాగించిన నేవీ సముద్రపు దొంగలు లొంగి పోయేలా చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను కూడా ఇండియన్ నేవీ రిలీజ్ చేసింది. #IndianNavy thwarts designs of Somali pirates to hijack ships plying through the region by intercepting ex-MV Ruen. The ex-MV Ruen, which had been hijacked by Somali pirates on #14Dec 23, was reported to have sailed out as a pirate ship towards conducting acts of #piracy on high… pic.twitter.com/gOtQJvNpZb — SpokespersonNavy (@indiannavy) March 16, 2024 ఇక,అంతకుముందు బంగ్లాదేశ్‌కు చెందిన ఓ నౌకను సైతం ఇండియన్ నేవీ రక్షించింది. భారత నావికాదళం అరేబియా సముద్రంలో జరిగిన సంఘటనలను తక్షణమే పరిష్కరించడం, వాణిజ్య నౌకలను రక్షించడానికి అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది. దీంతో, భారత నావికాదళంపై ప్రపంచదేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. -
అరేబియన్ సముద్ర జలాల్లో 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్ర జలాల్లో భారీ మొత్తంలో మత్తుపదార్థాలను భారత నౌకాదళం స్వా«దీనం చేసుకుంది. సముద్రజలాలపై ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ను స్వా«దీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఇరాన్‌లోని ఛబహర్ నౌకాశ్రయం నుంచి బయల్దేరి మంగళవారం ఉదయం అరేబియా సముద్రంలో అంతర్జాతీయ సముద్రజలాల సరిహద్దు(ఐఎంబీఎల్)కు 60 నాటికల్ మైళ్ల దూరంలో భారత్ వైపు వస్తున్న ఒక అనుమానిత చేపల పడవను భారత నావికాదళ నిఘా విమానం కనిపెట్టి వెంటనే ప్రధాన కార్యాలయానికి సమాచారం చేరవేసింది. అక్కడి నుంచి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)కి సమాచారం అందింది. వెంటనే నేవీ, ఎన్సీబీ, గుజరాత్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. పీ8ఐ నేవీ విమానం, యుద్ధనౌక, హెలికాప్టర్లు ఆ పడవను చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. నౌకను ఎన్సీబీ అధికారులు తనికీచేయగా దాదాపు 3,300 కేజీల మాదకద్రవ్యాలున్న ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ ప్యాకెట్లలో 3,110 కేజీల ఛరస్/హషి‹Ù, 158.3 కేజీల స్ఫటికరూప మెథామ్ఫెటమైన్, 24.6 కేజీల హెరాయిన్ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి మొత్తం విలువ గరిష్టంగా రూ.2,000 ఉండొచ్చని ఢిల్లీలో ఎన్సీబీఐ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ అంచనావేశారు. ఆ ప్యాకెట్ల మీద ‘రాస్ అవద్ గూడ్స్ కంపెనీ, పాకిస్తాన్ తయారీ’ అని రాసి ఉంది. మత్తుపదార్థాల ప్యాకెట్లతోపాటు పడవలో ఉన్న ఐదుగురు విదేశీయులను అరెస్ట్‌చేశారు. వీరి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. వీరిని పాక్ లేదా ఇరాన్ దేశస్తులుగా భావిస్తున్నారు. వీరి నుంచి ఒక శాటిటైల్ ఫోన్, నాలుగు స్మార్ట్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. ‘భారత నావికాదళం, ఎన్సీబీ, గుజరాత్ పోలీసులు సాధించిన ఈ విజయం మత్తుపదార్థాల రహిత భారత్ కోసం కేంద్రం చేస్తున్న కృషికి నిదర్శనం’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సముద్ర జలాల్లో ఇన్ని కేజీల డ్రగ్స్ పట్టివేత ఇదే తొలిసారి. అంతకుముందు 2023 మేలో కేరళ తీరంలో 2,500 కేజీల మత్తుపదార్థాలను ఎన్సీబీ, నేవీ పట్టుకున్నాయి. -
మరో 26/11కు కుట్ర... భగ్నం చేసిన పోలీసులు!
అహ్మదాబాద్: ముంబై తరహా దాడులకు మరోసారి జరిగిన ప్రయత్నాన్ని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) పోలీసులు భగ్నం చేశారు. నలుగురు ఇరాన్ జాతీయులతో గుజరాత్ తీరానికి వస్తున్న ఇరాన్ బోటును సముద్రం మధ్యలోనే అడ్డుకుని అందులోని నలుగురు ఇరాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దు వద్ద నిర్వహించిన ఈ ఆపరేషన్ విజయవంతమైంది. బోటులో ఉన్నవారి వద్ద నుంచి సుమారు రూ.3300 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌లో చరస్(హాషీష్ ఆయిల్)సహా ఇతర మాదక ద్రవ్యాలున్నాయి. భారత నేవీ, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, గుజరాత్ యాంటీ టెరర్రిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఇదీ చదవండి.. జయప్రదను అరెస్ట్ చేయండి -
ద్వారకలో స్కూబా డైవింగ్
ద్వారక: ఆరేబియా సముద్ర గర్భంలోని ద్వారకా నగరాన్ని మోదీ ఆదివారం దర్శించుకున్నారు. గుజరాత్‌లోని ద్వారక పట్టణ తీరంలో పాంచ్కుయి బీచ్ నుంచి స్కూబా డైవింగ్ ద్వారా సముద్ర అడుగు భాగానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి కాసేపు గడిపారు. ‘‘సముద్ర గర్భంలో భగవంతుడికి పూజలు చేయడం అద్భుతమైన అనుభూతి! సాక్షాత్తూ దేవుడి సన్నిధిలో గడిపినట్లుగా ఉంది’’ అన్నారు. తెల్లని డైవింగ్ హెల్మెట్ ధరించి నేవీ సిబ్బంది సాయంతో స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రంలోకి చేరుకున్నారు. కృష్ణుడికి పూజలు చేసి నెమలి పింఛాన్ని సమర్పించుకున్నారు. అనంతరం తన అనుభవాన్ని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఫొటోలను సైతం పంచుకున్నారు. ఇది సాహసం కంటే ఎక్కువని, ఇదొక విశ్వాసమని పేర్కొన్నారు. అనంతరం గుజరాత్లో ఒక సభలో మాట్లాడారు. సముద్రంలో ప్రాచీన ద్వారకా నగరాన్ని చేతల్లో తాకగానే, 21వ శతాబ్దపు వైభవోపేత భారతదేశ చిత్రం తన కళ్ల ముందు మెదిలిందని తెలిపారు. సముద్ర గర్భంలో కనిపించిన ద్వారక దృశ్యం దేశ అభివృద్ధి పట్ల తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేసిందని వివరించారు. ఆధ్యాతి్మక వైభవంతో కూడిన ప్రాచీన కాలంలో అనుసంధానమైనట్లు భావించానని చెప్పారు. శ్రీకృష్ణుడు మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రాచీన ద్వారకా నగరాన్ని సందర్శించాలన్న తన దశాబ్దాల కల నెరవేరిందని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. గుజరాత్ సముద్ర తీరంలో ద్వారక పట్టణంలోని శ్రీకృష్ణుడి ఆలయంలోనూ మోదీ పూజలు చేశారు. -
జలాంతర్గామి నుంచి ద్వారక దర్శనం
భగవాన్ శ్రీకృష్ణుడు పరిపాలించిన నగరం ద్వారక. హిందువులకు పరమ పవిత్రమైన ఈ పురాతన నగరం వేలాది సంవత్సరాల క్రితం అరేబియా సముద్రంలో మునిగిపోయింది. నగర ఆనవాళ్లు ఇప్పటికీ సముద్రంలో భద్రంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సముద్ర గర్భంలోని ద్వారకను స్వయంగా దర్శించే అరుదైన అవకాశం భక్తులకు, పర్యాటకులకు లభించనుంది. జలాంతార్గమిలో ప్రయాణించి, ద్వారకను దర్శించుకోవచ్చు. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉపరితలం నుంచి 300 అడుగుల మేర లోతుకి వెళ్లి ద్వారకను చూడొచ్చు. సముద్ర జీవులను కూడా తిలకించవచ్చు. ఈ సదుపాయం వచ్చే ఏడాది జన్మాష్టమి లేదా దీపావళి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. జలాంతర్గామి యాత్ర రెండు నుంచి రెండున్నర గంటలపాటు ఉంటుందని సమాచారం. ఈ సబ్‌మెరైన్ బరువు 35 టన్నులు. లోపల పూర్తిగా ఏసీ సౌకర్యం కలి్పస్తారు. ఒకేసారి 30 మంది ప్రయాణించవచ్చు. ఇందులో భక్తులు 24 మంది మాత్రమే ఉంటారు. మిగిలిన ఆరుగురు జలాంతర్గామిని నడిపించే సిబ్బంది, సహాయకులు. భక్తులకు ఆక్సిజన్ మాస్్క, ఫేస్ మాస్క్, స్కూబా డ్రెస్ అందజేస్తారు. అయితే, ద్వారక దర్శనానికి ఎంత రుసుము వసూలు చేస్తారన్న గుజరాత్ ప్రభుత్వం ప్రకటించలేదు. జలాంతర్గామిలో ప్రయాణం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. సామాన్యుల కోసం ప్రభుత్వం రాయితీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ద్వారక కారిడార్ అభివృద్ధికి గుజరాత్ ప్రభుత్వం డాక్ షిప్‌యార్డ్ కంపెనీతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అరేబియా సముద్రంలో మునిగిన షిప్.. నేవీ ఉద్యోగి మృతి
శ్రీకాకుళం: మండలంలోని బొగాబెణి పంచాయతీ జెన్నాగాయి గ్రామానికి చెందిన ఉమ్మిడి సింహాచలం(21) ఇరాన్లో అరేబియా సముద్రంలో షిప్ మునిగిన ఘటనలో మృతి చెందినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సింహాచలం ఇంటర్మీడియట్ వరకు చదివాడు. నెలరోజుల క్రితం మధ్యప్రదేశ్‌కు చెందిన రుద్రాక్ష ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ ద్వారా మర్చెంట్ నేవీలో చేరాడు. తనతోపాటు మరికొంతమంది సహచరులతో కలిసి విధుల్లో ఉండగా షిప్ మునిగిపోయింది. మూడు రోజుల క్రితం షిప్ మునిగిందన్న విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఈ విషయమై స్థానిక ఎంపీపీ పైల దేవదాస్రెడ్డిని సంప్రదించగా ఆయన కన్సల్టెన్సీ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడారు. సింహాచలంతో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు షిప్ ప్రమాదంలో మృతిచెందారని, రెండు మృతదేహాలు ఇప్పటి వరకు లభ్యమయ్యాయని, మరో మృతదేహం దొరకాల్సి ఉందని చెప్పారు. సింహాచలం మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే ఇండియన్ ఎంబసీతో సంప్రదించామని కన్సల్టెన్సీ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా, సింహాచలంకు తల్లిదండ్రులు రామయ్య, ఊర్మిళ, ఇద్దరు అక్కలు ఉన్నారు. ఒక సోదరికి వివాహం కావాల్సి ఉంది. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. -
Drone Attacks: భారత నేవీ కీలక నిర్ణయం
ముంబై: అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుసగా డ్రోన్ దాడులు జరుగుతుండడంతో ఇండియన్ నేవి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సముద్రంలో గస్తీ కోసం మూడు ఐఎన్ఎస్ వార్‌షిప్పులను రంగంలోకి దింపింది. వీటితో పాటు తీరంలో పెట్రోలింగ్ విమానాలతో నిఘా ఉంచనుంది. ‘ఇటీవల వాణిజ్య నౌకలపై పెరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని మూడు వార్‌షిప్పులను పశ్చిమ తీరంలో గస్తీ కోసం రంగంలోకి దింపాం. వీటికి మిసైళ్లను, డ్రోన్లను అడ్డుకుని నాశనం చేసే సామర్థ్యం ఉంది. ఇవి కాక లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ విమానాలు తీరం వెంబడి నిఘా పెడతాయి. కోస్ట్‌గార్డ్‌లతో సమన్వయం చేసుకుని పరిస్థితిని నిషితంగా పరిశీలిస్తున్నాం’ అని నేవీ వెస్టర్న్ కమాండ్ అధికారి ఒకరు తెలిపారు. సౌదీ అరేబియా నుంచి భారత్‌లోని మంగళూరు వస్తున్న క్రూడాయిల్ నౌక కెమ్ ఫ్లూటోపై పోర్బందర్ తీరానికి 400 నాటికల్ మైళ్ల దూరంలో ఇటీవలే డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్ ఇరాన్ నుంచి వచ్చిందని అమెరికా రక్షణశాఖ ముఖ్య కార్యాలయం పెంటగాన్ ప్రటించడం సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత ఎర్ర సముద్రంలో మరో క్రూడాయిల్ నౌకపైనా డ్రోన్ దాడి జరిగింది. మరోవైపు దాడి తర్వాత ముంబై డాక్‌యార్డుకు చేరుకున్న కెమ్ ఫ్లూటోను ఫోరెన్సిక్ అధికారులు తనిఖీ చేశారు. ఇదీచదవండి..ఉత్తరాదిని ‘కమ్ముకున్న పొగమంచు’ -
అరేబియా సముద్రంలో భారత్‌కు వస్తున్న నౌకపై డ్రోన్ దాడి..
అరేబియా సముద్రం ద్వారా భారత్ వస్తున్న ఓ వాణిజ్య నౌకపై గుజరాత్ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. పోరుబందర్ తీరానికి 401 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించింది. డ్రోన్ దాడి కారణంగా నౌకలోని రసాయన పదార్థాలున్న ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. అయితే ఆ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నౌక మాత్రం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో 20 మంది భారతీయులు నౌకలో ఉన్నారు. ఈ విషయాన్ని బ్రిటన్ సముద్ర మారిటైమ్ ఎజెన్సీ అంబ్రే శనివారం పేర్కొంది. లైబేరియన్ జెండాతో ఉన్న ఈ నౌక.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎంవీ కెమ్ ఫ్ల్యూటో అనే వాణిజ్య నౌక. ప్రమాదంపై సమాచారం అందుకున్న భారత నేవీ అధికారులు..‘ఐసీజీఎస్ విక్రమ్’ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సాయం చేసేందుకు సదరు ప్రాంతంలోని అన్ని నౌకలను విక్రమ్ అలర్ట్ చేసినట్లు నేవీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం భారత కోస్ట్‌గార్డ్‌కు చెందిన గస్తీ నౌక ఐసీజీఎస్ విక్రమ్ ఘటనాస్థలానికి వెళ్లి వాణిజ్య నౌకలో మంటలను ఆర్పివేసింది. కాగా ఈ నౌక సౌదీ అరేబియా ఓడరేవు నుంచి క్రూడాయిల్‌తో మంగళూరుకు వైపు వెళుతోంది. అయితే.. ఆ నౌకపై డ్రోన్ దాడికి బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. చదవండి: Temple Vandalised: భారత్ స్ట్రాంగ్ రియాక్షన్ -
అరేబియా సముద్రంలో నౌక హైజాక్ !
న్యూఢిల్లీ: మాల్టా దేశానికి చెందిన సరుకు రవాణా నౌక ఒకటి అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైంది. ఈ ఘటన జరిగినపుడు నౌకలో 18 మంది సిబ్బంది ఉన్నారు. హైజాక్ విషయం తెల్సుకున్న భారత నావికాదళాలు వెంటనే స్పందించి ఆ వైపుగా పయనమయ్యాయి. సముద్రపు దొంగలు ఆ నౌకను తమ అ«దీనంలోకి తీసుకుని నడుపుతుండగా భారత యుద్ధనౌక దానిని విజయవంతంగా అడ్డుకుంది. అక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు భారత నావికాదళం శనివారం తెలిపింది. ప్రస్తుతం నౌక సోమాలియా తీరం వైపుగా వెళ్తోంది. సంబంధిత వివరాలను ఇండియన్ నేవీ వెల్లడించింది. అరేబియా సముద్ర జలాల్లో గురువారం ‘ఎంవీ రుయెన్’ నౌకను ఆరుగురు సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. పైరేట్లు నౌకలోకి చొరబడుతుండగానే నౌకలోని సిబ్బంది ఆ విషయాన్ని బ్రిటన్ సముద్ర రవాణా పోర్టల్‌కు అత్యవసర సందేశం(మేడే)గా తెలియజేశారు. హైజాక్ విషయం తెల్సిన వెంటనే భారత నావికా దళాలు అప్రమత్తమయ్యాయి. అదే ప్రాంతంలో గస్తీ కాస్తున్న భారత గస్తీ విమానం, గల్ఫ్ ఆఫ్ ఆడెన్ వద్ద విధుల్లో ఉన్న భారత నావికాదళ యాంటీ–పైరసీ పెట్రోల్ యుద్ధనౌకలు రంగంలోకి దిగాయి. హైజాక్‌కు గురైన నౌక ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అటుగా దూసుకెళ్లి ఆ నౌకను శనివారం ఉదయం విజయవంతంగా అడ్డుకున్నాయి. ‘ రవాణా నౌకల సురక్షిత ప్రయాణానికి భారత నావికాదళం కట్టుబడి ఉంది. అంతర్జాతీయ భాగస్వాములు, మిత్ర దేశాలకు సాయపడటంతో ఎప్పుడూ ముందుంటుంది’ అని భారత నేవీ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. -
36 కిలోమీటర్లు సముద్రాన్ని ఈదిన మహిళ.. వైరల్ వీడియో
నీళ్లతో ఆడుకోవడం చాలా మందికి సరదా. అందుకే చాలామంది ఈత అంటే ఇష్టపడతారు. అయితే.. ఎంతసేపు ఈత కొట్టగలుగుతారు? ఎంత దూరం ఈద గలుగుతారు? ఓ కిలోమీటర్కూడా కష్టమే కదా! కానీ ఏకంగా 36 కిలోమీటర్లు ఏకబిగిన ఈదిందో మహిళ. అరేబియా సముద్రంలో వర్లీ సీలింక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు 36 కి.మీ ఈత కొట్టి రికార్డు సృష్టించారు ముంబైకి చెందిన సుచేతా బర్మన్. ఈత వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో పంచుకున్నారు. ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఆ్రల్టా–మారథాన్ స్విమ్మర్ అయిన సుచేతా దేవ్ బర్మన్.. పోస్ట్ ఇన్‌స్ట్రాగామ్‌లో దాదాపు 4 మిలియన్ల మంది చూశారు. ఆమె సాధించిన విజయాన్ని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు అరేబియా సముద్రంలో ఈతేంటి? అత్యంత కలుషితమైన ఆ నీటిలో ఈత కొట్టడం ప్రమాదాలే ఎక్కువని కామెంట్స్ చేశారు. ఇలాంటి ఇన్ఫ్లూయర్స్మనకు కావాలి, వీళ్లే చాలామందిని ప్రభావితం చేస్తారని మరికొందరు స్ఫూర్తిదాయకంగా రాశారు. ముంబై ట్రాఫిక్ని చూస్తే, ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే బెటరేమో అనిపిస్తుందని మరో వినియోగదారు రాశారు. 36 కి.మీ ఈత కొట్టడానికి ఎంత సమయం, పట్టుదల కావాలో నాకు తెలుసంటూ ఓ స్విమ్మర్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా.. కొన్ని గంటలపాటు పదుల కిలోమీటర్లు సముద్రంలో ఈదడమంటే మామూలు విషయం కాదుకదా అంటున్నారు. View this post on Instagram A post shared by Sucheta Deb Burman (@suchetadebburman) -
గుజరాత్లో బిపర్జాయ్ బీభత్సం.. భీకర గాలులు, కుండపోత
ఢిల్లీ: మహోగ్ర రూపంతో దూసుకొచ్చిన బిపర్జాయ్ తుపాన్ కోట్ లఖ్‌పత్ సమీపంలో గుజరాత్ తీరాన్ని తాకింది. ఈ ప్రభావంతో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో కూడిన భీకరమైన గాలులు, మరోవైపు కుండపోత వర్షంతో కురుస్తోంది. తీరం దాటే సమయానికి వాయు వేగం ఇంకా పెరగనుంది. గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో బిపర్జోయ్ పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటాక తీవ్ర తుపానుగా.. ఆపై వాయుగుండంగా బలహీనపడుతుంది. ఆ సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే ఛాన్స్ ఉంది. గుజరాత్‌లోని సముద్ర తీరం వెంట ఉన్న 8 జిల్లాల అధికార యంత్రాంగం ఇప్పటికే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. తుపాను తీరానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దూసుకొచ్చే ఈ తుపాను తీరాన్ని పూర్తిగా దాటడానికి ఆరు గంటల సమయం పడుతుంది అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మహోపాత్ర వివరించారు. 🌀 సౌరాష్ట్ర, కచ్ తీరాన్ని దాటుకుని జఖౌ పోర్ట్ వద్ద మాండ్వీ, కరాచీ(పాకిస్థాన్) వైపుగా మళ్లీ అక్కడ తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. 🌀 తుపాను కేటగిరీ-3 ప్రకారం.. ఇది అత్యంత తీవ్రమైన తుపానుగా పరిగణించనున్నారు. 🌀 కచ్‌తో పాటు దేవ్‌భూమి ద్వారకా, జామ్నానగర్ జిల్లాల్లో ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. అంచనాకు తగ్గట్లే ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కచ్ జిల్లాలో 120 గ్రామాల ప్రజలను(తీరానికి పది కిలోమీటర్ల రేంజ్లో..) ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 🌀 తుపాన్‌పై గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. మొత్తం గుజరాత్ అరేబియా సముద్ర తీరం వెంట ఉన్న ఎనిమిది జిల్లాల నుంచి లక్ష మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 🌀 కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ తరపున ఎనిమిది బృందాలు, రాష్ట్రం తరపున ఎస్టీఆర్ఎఫ్ బృందాలు 12, రోడ్లు భవనాల విభాగం నుంచి 115 బృందాలు, విద్యుత్ విభాగం నుంచి 397 బృందాలను తీరం వెంబడి జిల్లాల్లో మోహరింపజేశారు. 🌀 ఇక కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సైతం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటన చేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డు సిద్ధంగా ఉన్నాయి. 🌀 సరిగ్గా రెండేళ్ల తర్వాత గుజరాత్‌ను తాకబోయే తుపాను ఇది. #CycloneBiparjoy As the landfall process of Cyclone #Biparjoy commences, the shed of a petrol pump starts crumbling- WATCH.@rrakesh_pandey briefs about the destruction that has taken place on the ground. pic.twitter.com/pyS3nmXCy4 — TIMES NOW (@TimesNow) June 15, 2023 Video Credits: TIMES NOW -
బిపర్‌జోయ్‌తో ఊహించని రేంజ్లో డ్యామేజ్!!
వింతగా మారిన అరేబియా సముద్ర వాతావరణం.. తీర ప్రాంత ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. బిపర్జోయ్ తుపాను విరుచుకుపడే నేపథ్యంలో.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, నేవీ, కోస్టల్‌గార్డు, ఆర్మీని మోహరింపజేసింది. సముద్ర తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్లను ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు 21 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే బిపర్జోయ్ కలిగించబోయే నష్టం మామూలుగా ఉండకపోవచ్చని అంటున్నారు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర. తుపాను ఇప్పటికే బలహీనపడి చాలా తీవ్రమైన తుపానుగా మారిందని గుర్తు చేస్తున్నారాయన. గురువారం అది తీరం తాకే సమయంలో తీవ్ర స్థాయిలోనే నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెబుతున్నారాయన. గురువారం కచ్, దేవ్‌భూమి ద్వారకా, జామ్‌నగర్, పోర్బందర్, రాజ్‌కోట్, జునాఘడ్, మోర్బీ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, తీరానికి అదిచేరుకునే సమయానికి గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని, భారీ వర్షం తో పాటు గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంగా ఈదరుగాలులు వీస్తాయని మహోపాత్ర వివరించారు. ఆ ప్రభావం చెట్లు నేలకొరిగే అవకాశం ఉన్నందునా.. అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులను ఆయన హెచ్చరించారు. అలాగే పంట నష్టం కూడా తీవ్రంగా ఉండొచ్చని చెబుతున్నారు. తుపాను ప్రభావంతో సౌరాష్ట్ర, కచ్ కోస్టల్ ఏరియాల్లో ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడతాయని చెప్పారాయన. కాబట్టి, ఆయా ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. జూన్ 6వ తేదీ నుంచి బిపర్జోయ్ ఉదృతి కొనసాగుతోందని, ఆ మరుసటి నాటికే అది తీవ్ర రూపం దాల్చిందని, జూన్ 11 నాటికి మహోగ్ర రూపానికి చేరుకుందని, ఈ ఉదయానికి కాస్త బలహీనపడి తీవ్రమైందిగా మారిందని మహోపాత్ర తెలిపారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఉదయం డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిత్వ శాఖతో భేటీ అయ్యి.. తుపాను సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించారాయన. #CycloneBiparjoy moves menacingly towards Dwaraka, Jamnagar, Kutch in Gujarat at 135 kmph on Tuesday . At landfall on Thursday it may peak at 190kmph . pic.twitter.com/GxxevyPKlv — P.V.SIVAKUMAR #Amrit Kaal On 🇮🇳 (@PVSIVAKUMAR1) June 13, 2023 Live visuals from #Okha Port , Indian Coast Guard on Alert Okha IMD recorded 91mm #Rainfall between 8:30am-5:30pm#Gujarat #CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #BiparjoyUpdate pic.twitter.com/Yt12KUKr2h — Siraj Noorani (@sirajnoorani) June 13, 2023 జూహూ బీచ్‌లో విషాదం ఇదిలా ఉంటే.. సైక్లోన్ బిపర్‌జోయ్‌తో పశ్చిమ రైల్వేలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 67 రైళ్లు ఇప్పటికే రద్దు అయ్యాయి. ముంబైలో భారీ వర్షం కురుస్తుండగా.. ఎయిర్‌పోర్టులోనూ గందరగోళం నెలకొంది. పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు జుహూ బీచ్‌లో విషాదం నెలకొంది. ఐదుగురు గల్లంతు కాగా.. అందులో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. -
అతి తీవ్ర తుఫాన్ గా మారిన బిపర్ జాయ్
-
ఉగ్రరూపం దాలుస్తున్న బిపర్ జోయ్ తుఫాను
-
పాకిస్తాన్ అండతో హాజీ సలీం భారీ దందా .. తాజాగా రూ.25 వేల కోట్ల డ్రగ్స్
అతనిది అత్యంత విలాసవంతమైన జీవన శైలి. అడుగు కదిలితే చుట్టూ అత్యాధునిక ఏకే ఆయుధాలతో అంగరక్షకుల భారీ భద్రత. ఎటు వెళ్లాలన్నా ముందే పలు అంచెల తనిఖీలు, దారి పొడవునా మూడో కంటికి అగుపడని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. ఇది ఏ దేశాధ్యక్షుని పరిచయమో కాదు. భారత్‌తో సహా పలు ఆసియా దేశాలకు కొన్నేళ్లుగా కంటిపై కునుకు లేకుండా చేస్తున్న డ్రగ్ కింగ్ హాజీ సలీం జల్సా లైఫ్ స్టైల్! శనివారం కోచి సమీపంలో అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో భారీగా డ్రగ్స్ మోసుకెళ్తున్న ఓ నౌకను పక్కా సమాచారం మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అడ్డగించి ముంచేయడం తెలిసిందే. అందులో ఏకంగా 2.5 టన్నుల మెథంఫెటామిన్ దొరకడం అధికారులనే విస్మయపరిచింది. ఇది ఎన్సీబీకి మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ అయిన హాజీదేనని దాడిలో పట్టుబడ్డ 29 ఏళ్ల పాక్ జాతీయుడు వెల్లడించాడు. భారత్, శ్రీలంక, సీషెల్స్ తదితర దేశాల్లో సరఫరా నిమిత్తం దీన్ని పాక్ దన్నుతో దొంగచాటుగా తరలిస్తున్నట్టు విచారణలో అంగీకరించాడు. మన దేశంలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి! అంతేగాక పలు దేశాల్లో సరఫరా నిమిత్తం అత్యంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ను మోసుకెళ్తున్న మదర్ షిప్ ఎన్సీబీకి చిక్కడమూ ఇదే మొదటిసారి! దాని విలువను రూ.12 వేల కోట్లుగా అధికారులు తొలుత పేర్కొన్నారు. కానీ ఇప్పటిదాకా దొరికిన డ్రగ్స్లోకెల్లా ఇదే అత్యంత హెచ్చు నాణ్యతతో కూడినదని తాజాగా పరీక్షల్లో తేలింది. దాంతో దీని విలువను సవరించి ఏకంగా రూ.25,000 కోట్లుగా తేల్చారు! పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాటుకు హాజీ ముఠా అన్నిరకాలుగా సాయపడుతున్నట్టు కూడా తేలింది. పాక్ అడ్డాగా... పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఉగ్ర సంస్థ లష్కరే తొయిబా అండదండలతో అరేబియా సముద్రంలో హాజీ విచ్చలవిడిగా డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. పాక్, ఇరాన్, అఫ్గానిస్తాన్ అతని అడ్డాలు! ఎక్కడా స్థిరంగా ఉండకుండా తరచూ స్థావరాలు మార్చడం హాజీ స్టైల్. అతని ప్రస్తుత అడ్డా పాకిస్తాన్. బలూచిస్తాన్‌లో మకాం వేసి కథ నడుపుతున్నాడు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ హాజీకి దగ్గరి లింకులున్నట్టు ఎన్సీబీ అనుమానం. గమ్మత్తైన సంకేతాలు.. తేలు, ఎగిరే గుర్రం, డ్రాగన్, కొమ్ముగుర్రం, 555, 777, 999. ఇవన్నీ డ్రగ్స్ సరఫరాలో హాజీ ముఠా వాడే సంకేతాల్లో కొన్ని. డ్రగ్స్ ప్యాకెట్లపై ఉండే ఈ ప్రత్యేకమైన గుర్తులు వాటిలోని డ్రగ్స్, దాని నాణ్యతకు సంకేతాలు. కొనుగోలుదారులు మాత్రమే వీటిని గుర్తిస్తారు. హాజీ మనుషులు డ్రగ్స్‌ను ఏడు పొరలతో పటిష్టంగా ప్యాక్ చేస్తారు. నీళ్లలో పడ్డా దెబ్బతినకుండా ఈ జాగ్రత్త. ఇలా డ్రగ్స్ సరఫరా, విక్రయంలో హాజీది విలక్షణ శైలి. హాజీ అప్పుగానే డ్రగ్స్ సరఫరా చేస్తాడు. తనకు హవాలా మార్గంలోనే సొమ్ము పంపాలని చెబుతాడు. వ్యాపారానికి శ్రీలంక పడవలు వాడుతుంటాడు. అవి పాక్, ఇరాన్ సముద్ర తీరాల్లో మదర్ షిప్ నుంచి డ్రగ్స్ నింపుకొని రహస్యంగా భారత్‌కు చేరుకుంటాయి. క్వింటాళ్ల కొద్దీ ఉన్న నిల్వను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి గమ్యానికి తరలిస్తారు. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని భారతీయ నావికా దళం ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ– డీఆర్డీఓ దేశీయంగా రూపొందించిన ఈ క్షిపణి షిప్ లాంచ్డ్ వెర్షన్‌ను అరేబియా సముద్రంలో పరీక్షించినట్లు సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. భారత్–రష్యా సంయుక్త భాగస్వామ్య బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జలాంతర్గాములు, విమానాలు, ఓడలతోపాటు నేలపై నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేస్తోంది. బ్రహ్మోస్ క్షిపణులు ధ్వని వేగానికి దాదాపు మూడు రెట్ల వేగంతో ప్రయాణించగలవు. వీటిని భారత్ ఎగుమతి కూడా చేస్తోంది. ఇందుకు సంబంధించి గత ఏడాది ఫిలిప్పీన్స్‌తో 375 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి యాంటీ షిప్ వెర్షన్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో భారత్ విజయవంతంగా ప్రయోగించింది. -
ఓఎన్జీసీ రూ.16వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఓఎన్జీసీ చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టింది. అరేబియా సముద్రంలో 103 బావుల్లో వచ్చే 2–3 ఏళ్లలో డ్రిల్లింగ్ చేయనున్నట్టు ప్రకటించింది. ‘‘దీనివల్ల 100 మిలియన్ టన్నుల ఆయిల్, గ్యాస్ అదనంగా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అదనంగా ఉత్పత్తయ్యే మేర దిగుమతుల భారం తగ్గుతుంది’’ అని ఓఎన్జీసీ ప్రకటించింది. మనదేశ చమురు అవసరాల్లో 85 శాతం మేర దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే సహజవాయువు అవసరాల్లో సగం మేర దిగుమతులైనే ఆధారపడి ఉన్నాం. దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చమురు కంపెనీలను కోరడం గమనార్హం. ఓఎన్జీసీ ఉత్పత్తి గత కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోంది. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఉత్పత్తి క్షీణత ఉండదని ఓఎన్జీసీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు ఉత్పత్తి 22.83 మిలియన్ టన్నులుగా, గ్యాస్ ఉత్పత్తి 22.099 బీసీఎంకు పెరుగుతుందని భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చమురు ఉత్పత్తి 24.63 మిలియన్ టన్నులు, గ్యాస్ ఉత్పత్తి 25.68 బీసీఎంకు చేరుకుంటుందన్న అంచనాతో ఉంది. -
నేవీ నారీ శక్తి ఘనత
న్యూఢిల్లీ: పూర్తిగా మహిళా అధికారులతో కూడిన నావికాదళ బృందం ఉత్తర అరేబియా సముద్రంపై నిఘా మిషన్‌ను సొంతంగా నిర్వహించిన అరుదైన ఘనత సాధించింది. పోర్బందర్లోని ‘ఐఎన్ఏఎస్ 314’కు చెందిన మహిళా అధికారుల ఫ్రంట్‌లైన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ బుధవారం ఈ చరిత్ర సృష్టించిందని నేవీ తెలిపింది. లెఫ్టినెంట్ కమాండర్ ఆంచల్ శర్మ సారథ్యంలోని ఈ బృందంలో పైలెట్లు లెఫ్టినెంట్ శివాంగి, లెఫ్టినెంట్ అపూర్వ గీతె, టాక్టికల్, సెన్సార్ ఆఫీసర్లు లెఫ్టినెంట్ పూజా పాండా, సబ్ లెఫ్టినెంట్ పూజా షెకావత్ ఉన్నారని వెల్లడించింది. వీరంతా అత్యాధునిక డోర్నియర్ విమానం ద్వారా నిఘా విధులు నిర్వర్తించారని నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వాల్ తెలిపారు. వీరు చేపట్టిన మొట్టమొదటి మిలిటరీ ఫ్లయింగ్ మిషన్ ప్రత్యేకమైందని, వైమానిక దళంలోని మహిళా అధికారులు మరిన్ని బాధ్యతలను స్వీకరించడానికి, మరిన్ని సవాళ్లతో కూడిన విధులను చేపట్టేందుకు మార్గం సుగమం చేస్తుందని కమాండర్ మధ్వాల్ అన్నారు. ‘ఈæ మిషన్ సాయుధ దళాలు సాధించిన ఒక ప్రత్యేక విజయానికి సూచిక’అని ఆయన అన్నారు. ఈ మిషన్ నారీ శక్తిలో నిజమైన స్ఫూర్తిని నింపుతుందని ఆయన పేర్కొన్నారు. -
సముద్రంలో ఓఎన్జీసీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి,ముంబై: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ)కి చెందిన హెలికాప్టర్ ముంబైలోని అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. 9 మంది వ్యక్తులతో ప్రయాణిస్తున్న (ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు) హెలికాప్టర్లో లోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చిందని ఓఎన్జీసీ ట్వీట్ చేసింది. అయితే సాగర్ కిరణ్ రెస్క్యూ బోటు ద్వారా ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలతో బయటపడగా, మిగిలిన వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి. #Helicopter carrying 7 passengers & 2 pilots makes emergency landing in #Arabian Sea near #ONGC rig Sagar Kiran in #Mumbai High. Four rescued. Rescue operations in full swing. @HardeepSPuri @Rameswar_Teli @PetroleumMin — Oil and Natural Gas Corporation Limited (ONGC) (@ONGC_) June 28, 2022 ముంబైలో సాగర్ కిరణ్ వద్ద రిగ్ సమీపంలో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లతో కూడిన హెలికాప్టర్ అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని కంపెనీ ఒక ట్వీట్లో తెలిపింది. ఇప్పటి వరకు నలుగర్ని రక్షించామని ట్వీట్ చేసింది. ఆ తరువాత రెస్క్యూ బోట్ మరో ఇద్దరిని రక్షించారు. రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా ఇంటర్నేషనల్ సేఫ్టీ నెట్‌ను యాక్టివేట్ చేశామని, ఇండియన్ నేవీ, ఓఎన్జీసీ సమన్వయంతో పనిచేస్తున్నామని అధికారులు తెలిపారు. మరో నౌక ముంబై నుంచి సహాయక చర్యల్లో నిమగ్నమైందన్నారు. -
తరుముకొస్తున్న మరో తుఫాను.. పేరేంటో తెలుసా?
న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముందుగా తీవ్ర అల్పపీడనంగా మారి తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. ఉత్తర అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఇది వ్యాప్తి చెంది ఉంది. మాయాబందర్ (అండమాన్ దీవులు)కి ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో, యాంగోన్ (మయన్మార్)కి నైరుతి దిశలో 530 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. వచ్చే 12 గంటల్లో తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 48 గంటల్లో ఇది ఉత్తర దిశగా మయన్మార్ తీరం వైపు పయనించనుందని పేర్కొంది. బుధవారం తెల్లవారుజామున తాండ్వే (మయన్మార్) సమీపంలో తీరం దాటనుందని వెల్లడించింది. సైక్లోన్ 'అసాని' కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం.. తుఫానుగా మారితే 'అసాని' అనే పేరుతో పిలుస్తారు. ఈ పేరును శ్రీలంక పెట్టింది. శ్రీలంకలోని అధికారిక భాషలలో ఒకటైన సింహళంలో 'అసాని' అంటే 'కోపం' అనే అర్థం వస్తుంది. అయితే 'అసాని' తుఫాను ప్రభావం అంత భయంకరంగా ఉండకపోవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నా.. అధిక తీవ్రత కలిగిన తుఫానుగా మారబోదని చెప్పారు. ఉష్ణమండల తుఫానులకు పేరు పెట్టే వాటిలో ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఆరింటిలో భారత వాతావరణ శాఖ కూడా ఒకటి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, ఉత్తర హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడే ఉష్ణమండల తుఫానులకు 13 సభ్య దేశాలు పేర్లు ప్రతిపాదించడానికి ఐఎండీ ఒక ప్రామాణిక విధానాన్ని అనుసరిస్తుంది. 13 దేశాలు.. 169 పేర్లు ఇండియాతో సహా బంగ్లాదేశ్, ఇండియా, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయ్‌లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్.. ఇప్పటికే పేర్లను ప్రతిపాదించాయి. ఒక్కో దేశం 13 పేర్లు చొప్పున ప్రతిపాదించగా.. మొత్తం 169 పేర్లతో 2020లో జాబితాను రూపొందించారు. దేశాల పేర్లను అక్షర క్రమంలో ఉంచారు. వీటి ఆధారంగా ఆయా దేశాలు పెట్టిన పేర్లను వరుసగా తీసుకుంటారు. ఉదాహరణకు గతేడాది అక్టోబర్‌లో ఏర్పడిన తుఫానుకు ‘షహీన్’ అని పేరు పెట్టారు. ఖతార్ ఈ పేరు పెట్టింది. డిసెంబర్లో వచ్చిన తుఫానుకు సౌదీ అరేబియా సూచించిన ‘జవాద్’ పేరు పెట్టారు. అక్షర క్రమంలో సౌదీ తర్వాత ఉన్న శ్రీలంక వంతు ఇప్పుడు వచ్చింది. కాబట్టి శ్రీలంక సూచించిన 'అసాని' పేరును తాజాగా వాడుతున్నారు. IMD issues new list of Names of Tropical Cyclones over north Indian Ocean. The current list has a total of 169 names including 13 names each from 13 WMO/ESCAP member countries. Detailed Press Release available at https://t.co/dArV0Ug8nh and https://t.co/wRl94BzRXr pic.twitter.com/ge0oVz4riD — India Meteorological Department (@Indiametdept) April 28, 2020 పేర్లు ఎందుకు పెడతారు? ఒకే సమయంలో తుఫానులు ఏర్పడినపుడు గందరగోళాన్ని నివారించడానికి తుఫానులకు పేర్లు పెడుతున్నారు. ముందస్తు పటిష్ట నిరోధక చర్యలు తీసుకోవడానికి.. ఏయే తుఫాను వల్ల ఎంత నష్టం జరిగిందనే వివరాలు నమోదు చేయడానికి ఈ విధానం తోడ్పతుంది. ఏ తుఫాను సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకున్నామో విశ్లేషించడం ద్వారా ముందస్తు చర్యలకు వీలు పడుతుంది. (క్లిక్: కంచు కోటలు బద్దలు కొట్టారు.. చరిత్ర సృష్టించారు!) 'అసాని'తో అప్రమత్తం! 'అసాని' తుఫాను ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. ముందు జాగ్రత్తగా అండమాన్ నికోబార్ దీవుల్లో మార్చి 22 వరకు పర్యాటక కార్యకలాపాలు నిలిపివేశారు. అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు ఐఎండీ సూచించింది. విద్యుత్, సమాచార వ్యవస్థలకు పాక్షికంగా అంతరాయం కలిగే అవకాశముంది. (క్లిక్: బ్లాక్ చెయిన్‌పై ఆసక్తి చూపిస్తున్న కింగ్ నాగార్జున?) -
అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు వక్ర భాష్యాలా?
ముంబై: భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డ్రాగన్ దేశం చైనాపై మరోసారి పరోక్షంగా నిప్పులు చెరిగారు. కొన్ని బాధ్యతారాహిత్యమైన దేశాలు సంకుచిత ప్రయోజనాలే లక్ష్యంగా ఆధిపత్య ధోరణితో, పక్షపాతంతో వ్యవహరిస్తున్నామని ఆరోపించారు. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు(యూఎన్క్లాస్) వక్ర భాష్యాలు చెబుతూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాయని విమర్శించారు. కొన్ని దేశాలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఈ చట్టాలను బలహీన పరుస్తుండడం ఆందోళనకరమని అన్నారు. దేశీయంగా నిర్మించిన క్షిపణుల విధ్వంసక వాహక నౌక ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ ఆదివారం మహారాష్ట్రలోని ముంబై తీరంలో రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా అరేబియాలో సముద్రంలో జల ప్రవేశం చేసింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన భారత్ బాధ్యతాయుతంగా పనిచేస్తోందని, అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలను గౌరవిస్తోందని చెప్పారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని తాము కోరుకుంటున్నట్లు గుర్తుచేశారు. ఇక్కడ అన్ని భాగస్వామ్య దేశాల ప్రయోజనాలకు రక్షణ లభించాలన్నదే తమ ఆకాంక్ష అని వివరించారు. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో దేశాల స్థిరత్వం, ఆర్థిక పురోగతి, ప్రపంచాభివృద్ధి కోసం నిబంధనలతో కూడిన స్వేచ్ఛాయుత నౌకాయానం, సముద్ర మార్గాల రక్షణ చాలా అవసరమని వివరించారు. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు సొంత భాష్యాలు చెబుతూ ఉల్లంఘిస్తుండడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఇలాంటివి స్వేచ్ఛాయుత నౌకాయానికి అడ్డంకులు సృష్టిస్తాయని చెప్పారు. భారత నావికాదళం పాత్ర కీలకం ఇండో–పసిఫిక్ ప్రాంతం కేవలం ఇక్కడి దేశాలకే కాదు, మొత్తం ప్రపంచానికి చాలా కీలకమని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. ఈ ప్రాంత భద్రత విషయంలో భారత నావికాదళం తనవంతు కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. భారతదేశ ప్రయోజనాలు హిందూ మహాసముద్రంతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నాయని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇండో–పసిఫిక్ ప్రాంతం ఒక ఆయువు పట్టు అని ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు సైనిక సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటున్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. ఆయుధాలు, సైనిక రక్షణ పరికరాలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రక్షణ ఖర్చు 2.1 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని తెలిపారు. రక్షణ రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశీయ పరిజ్ఞానంతో నౌకల నిర్మాణంలో భారత్‌ను కేంద్ర స్థానంగా మార్చాలన్నారు. శత్రువుల పాలిట సింహస్వప్నం ఐఎన్ఎస్ విశాఖపట్నం.. హిందూ మహా సముద్ర ప్రాంత రక్షణలో కీలకంగా మారనుంది. సముద్ర ఉపరితలం నుంచి సముద్ర ఉపరితలానికి, సముద్ర ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను మోసుకెళ్లనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విశాఖపట్నం శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. బరువు: 7,400 టన్నులు పొడవు: 163 మీటర్లు వెడల్పు: 17.4 మీటర్లు వేగం: గంటకు 30 నాటికల్ మైళ్లు పరిధి: ఏకధాటిగా 4,000 నాటికల్ మైళ్లు ప్రయాణం చేయగలదు ఆయుధాలు: 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ ర్యాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్లు నాలుగు, రెండు జలాంతర్గామి విధ్వంసక రాకెట్ లాంచర్లు, కాంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్, రాకెట్ లాంచర్, అటోమేటెడ్ పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్. – సాక్షి, విశాఖపట్నం -
తరుముకొస్తున్న షహీన్
ముంబై: గులాబ్ తుపాను కల్లోలం ముగిసిందో లేదో మరో తుపాను తరుముకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుపాను క్రమంగా బలపడుతోంది. ఏడు రాష్ట్రాల్లో ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం హెచ్చరించింది. గుజరాత్, బిహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ‘ఉత్తర అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుపాను మధ్య అరేబియా తీర ప్రాంతాలవైపు దూసుకొస్తోంది. ఆ తర్వాత అది తీవ్ర తుపానుగా మారి పాకిస్తాన్లో మాక్రన్ తీర ప్రాంతాన్ని తాకుతుంది. ఆ తర్వాత 36 గంటల్లో దిశ మార్చుకొని గల్ఫ్ ప్రాంతాలపై వెళ్లి ఆ తర్వాత బలహీనపడుతుంది’’అని వాతావరణ శాఖ వెల్లడించింది. గులాబ్ తుపాను ప్రభావం కారణంగా ఏర్పడిన షహీన్ తుపానుతో ఏడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
కేరళ: వెలుగులోకి రహస్య దీవి.. ఫోటోలు వైరల్
తిరువనంతపురం: అరేబియా సముద్రం కేరళ తీరంలో బీన్ షేప్‌లో ఉన్న ఓ అనూమానాస్పద దీవి అనూహ్యంగా వెలుగు చూసింది. గూగుల్ ఎర్త్‌లో కనిపిస్తున్న ఈ మర్మ దీవి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గూగుల్ ఎర్త్‌లో కనిపించిన ఈ దీవి అరేబియా సముద్రం కొచ్చి తీరానికి పశ్చిమానా 7 కిలోమీటర్ల దూరంలో వెలుగు చూసింది. కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ పరిశోధకులు ఈ నిర్మాణం ఏంటి.. ఇది ఎలా ఏర్పడింది.. అనే అంశాలను పరిశోధించనున్నారు. చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న ఈ దీవిలాంటి నిర్మాణాన్ని తొలిసారి చెల్లమ్ కర్షిక టూరిజమ్ డెవలప్మెంట్ సొసైటీ గుర్తించింది. గూగుల్ ఎర్త్ ఇక్కడ దీవి లాంటి ఆకారం ఉందని చూపిస్తోందని తెలపడమే కాక ఇందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్బుక్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇవి చర్చనీయాంశంగా మారాయి. 8 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పుతో ఈ నిర్మాణం ఏర్పడినట్లు చెల్లనమ్ కర్షిక టూరిజం డెవలప్మెంట్ సొసైటీ తెలిపింది. దీనిపై అధ్యాయనం చేయాలని కేరళ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్‌ని కోరినట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ మాజీ డైరెక్టర్- రీసర్చ్ జయచంద్రన్ మాట్లాడుతూ.. ‘‘దీని గురించి నేను చదివిన దాని ప్రకారం ఈ రహస్య నిర్మాణం ఏర్పడానికి పాచి ఒక కారణంగా భావిస్తున్నాను. ఇలాంటి నిర్మాణాలను ఉపగ్రహ చిత్రాల ద్వారా మాత్రమే గుర్తించగలం. మట్టి నిక్షేపం వల్ల ఇది ఏర్పడినట్లు నేను భావించడం లేదు. సాధారణంగా ఇలాంటి నిర్మణాలను దేవాలయాల సమీపంలో ఉండే చెరువుల్లో గుర్తించగలం’’ అని తెలిపారు. చదవండి: వైరల్ : 100 ఏళ్లుగా అది ఒంటరి ఇళ్లు -
ద్వీపంలో అలజడి!
అరేబియా సముద్రంలో దూరంగా విసిరేసినట్టు... తన లోకం తనదన్నట్టు వుండే లక్షద్వీప్‌లో ఆర్నెల్లుగా అగ్గి రాజుకుంటోంది. పేరుకు లక్షద్వీప్ అయినా ఇది 36 ద్వీపాల సముదాయం. ఒక ద్వీపం పరాలీ సముద్ర జలాల కోతవల్ల దాదాపు నీట మునిగి, నివాసయోగ్యం కాకుండా పోయింది. కేరళకు పశ్చిమాన 300 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ సముదాయమంతా కలిసి కేవలం 32 చదరపు కిలోమీటర్ల ప్రాంతం. ఒకే ఒక్క జిల్లా... అందులో పది డివిజన్లు. ఈ లక్షద్వీప్ పాలనా వ్యవహర్తగా గుజరాత్ బీజేపీ నేత ప్రఫుల్ ఖోడా పటేల్ వచ్చినప్పటినుంచీ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు ఈ ఆగ్రహావేశాలకు కారణం. పాలన వేరు... పెత్తనం వేరు. పాలకులుగా వున్నవారు ప్రజల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి దోహదపడాలి. ప్రజాస్వామ్య భావనలు ఇంతగా పెరిగిన ఈ కాలంలో కూడా పెత్తనం మీదే ఆసక్తి కనబరిస్తే, స్థానికుల మనోభావాలు పట్టించుకోవడంలో విఫలమైతే సహజంగానే అది అశాంతికి దారితీస్తుంది. ద్వీపాల పాలనను నేరుగా కేంద్రం పర్యవేక్షించటానికి రెండు కారణాలుంటాయి. దేశ భద్రతలో ద్వీపాలది కీలకపాత్ర. సముద్రమార్గంలో అక్కడ అవాంఛనీయ శక్తులు చొరబడకుండా చూడటం అవసరం. అలాగే స్థానికులకు పాలనలో భాగస్వామ్యం కల్పించి, వారికి ప్రజాస్వామిక సంస్కృతి అలవాటు చేయడం కూడా ముఖ్యమైనదే. నిజానికి లక్షద్వీప్ ఎప్పుడూ సమస్యాత్మకం కాలేదు. ఇబ్బందంతా తరచు వచ్చే తుపానులతోనే. జనాభా కేవలం 64,000 కావడంతో నేరాల రేటు సహ జంగానే తక్కువ. దారుణమైన నేరాలు చాలా అరుదు. అలాంటిచోట ఉత్తపుణ్యాన గూండా చట్టం లాంటి కఠినమైన చట్టం అవసరమని పటేల్‌కు ఎందుకనిపించిందో అనూహ్యం. ఆ చట్టంకింద ఎవరినైనా కారణం చూపకుండా ఏడాదిపాటు నిర్బంధించే వీలుంది. అంతేకాదు... జనాభాలో 65 శాతం మందివుండే ఆదివాసీల్లో ఎక్కువమంది ముస్లింలు. వృత్తిపరంగా జాలర్లు. వారికి పశు మాంసమే ప్రధానాహారం. పటేల్ నిబంధన ప్రకారం అక్కడి హోటళ్లు పశుమాంసంతో వంటకాలు చేయకూడదు. దుకాణాల్లో అమ్మకూడదు. గోవధ నిషేధం సరేసరి. వీటిని ఉల్లంఘిస్తే ఏడేళ్ల జైలు శిక్ష. పిల్లలకు పెట్టే మధ్యాహ్నభోజనంలో మాంసం నిషిద్ధం! కానీ విచిత్రంగా మద్యపానం అలవాటే లేని లక్షద్వీప్‌లో కొత్తగా మద్యం దుకాణాలకు అనుమతించారు. ఇద్దరు పిల్లలున్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులంటూ తీసుకొచ్చిన నిబంధన కూడా వివాదాస్పదమైంది. ప్రభుత్వ విభాగాల్లో క్యాజువల్, కాంట్రాక్టు సిబ్బందిగా పనిచేస్తున్నవారిని ఆయన ఒక్కవేటుతో తొలగించారు. సరుకు రవాణాకు స్థానికంగా వున్న బైపోర్ పోర్టును తప్పించారు. కర్ణాటకలోని మంగళూరు పోర్టునుంచే కార్యకలాపాలుండాలని ఆదేశించారు. వలలు, ఇతర ఉపకరణాలు భద్ర పరుచుకోవ డానికి మత్స్యకారులు తీరంలో ఏర్పాటు చేసుకునే షెడ్లు తీరప్రాంత రక్షణ నిబంధనలు ఉల్లంఘిస్తు న్నాయంటూ తొలగించారు. అభివృద్ధి కోసం భూమి స్వాధీనానికి వీలుకల్పించే ముసాయిదా స్థాని కుల ఆస్తిహక్కుకు మంగళం పాడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందులో కొన్ని ప్రతిపాద నల స్థాయిలో వుంటే కొన్ని అమలవుతున్నాయి. ఏ ఒక్క అంశంలోనూ ప్రజాప్రతినిధులనూ, స్థాని కులనూ సంప్రదించకపోవటం సహజంగానే అసంతృప్తికి దారితీసింది. ఇన్నాళ్లూ అత్యవసర చికిత్స అవసరమైనవారిని హెలికాప్టర్లో కేరళకు తరలించే సౌకర్యం వుండేది. దాన్ని పటేల్ రద్దుచేశారు. ఉన్నతాధికారులనూ, అలా పనిచేసి రిటైరైనవారిని గవర్నర్లుగా, లెఫ్టినెంటు గవర్నర్లుగా, పాలనా వ్యవహర్తలుగా నియమించడాన్ని కొందరు తప్పుబడతారు. వారు నిబంధనలకు విలువి చ్చినంతగా జనం మనోభావాలకు విలువనివ్వరన్న అభిప్రాయం ఎప్పటినుంచో వుంది. అడపా దడపా అది నిజమేనన్నట్టు వ్యవహరించేవారూ లేకపోలేదు. అయితే గతంలో లక్షద్వీప్‌కు ఐఏఎస్‌లే పాలనా వ్యవహర్తలుగా వున్నారు. స్థానికుల్లో వారిపై అసంతృప్తి రాజుకున్న వైనం ఎప్పుడూ లేదు. కానీ ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా అనుభమున్న ప్రఫుల్ ఖోడా పటేల్‌లో నిరంకుశాధికార పోకడలే వుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 2016లో ఆయన్ను కేంద్ర పాలిత ప్రాంతం దామన్ డయూల పాలనా వ్యవహర్తగా నియమించగా అక్కడ సైతం ఆయనకు వివాదాలు తప్పలేదు. ఎన్నికల సమ యంలో కోడ్‌ను ఉల్లంఘించేవిధంగా ఆయన ఆదేశాలిస్తున్నారని, ప్రశ్నించినందుకు తనకు షోకాజ్ నోటీసు జారీచేశారని అప్పటి దాద్రా నాగర్ హవేలీ కలెక్టర్ కణ్ణన్ గోపీనాథన్ ఫిర్యాదు చేయగా... ఎన్ని కల కమిషన్ ఆ నోటీసును ఉపసంహరించుకోవాలని పటేల్‌ను ఆదేశించింది. ఆ యువ ఐఏఎస్ అధికారి ఎన్నికల అనంతరం సర్వీస్‌కు గుడ్‌బై చెప్పి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటు న్నారు. దాద్రా నాగర్ హవేలీ ఎంపీగా ఆరోసారి ఎన్నికైన మోహన్ దేల్కర్ మొన్న ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖలో పటేల్ నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొన్నట్టు ప్రస్తావించడం కూడా వివాదానికి దారితీసింది. అయితే అందులో నిజానిజాలేమిటో ఇంకా నిర్ధారణ కావాల్సివుంది. కాంగ్రెస్ నేత శశిథరూర్ గత ఫిబ్రవరిలో తొలిసారి పటేల్ నిర్ణయాలపై గళమెత్తారు. ఇప్పుడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మొదలుకొని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వరకూ అందరూ పటేల్ పోకడలపై ఆగ్రహంతో వున్నారు. స్థానిక బీజేపీ నేతలు, శ్రేణులు కూడా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఎప్పుడూ ప్రశాంతంగా వుండే లక్షద్వీప్‌లో పరిస్థితి మరింత దిగజారకముందే కేంద్రం జోక్యం చేసు కుని సరిదిద్దాలి. స్థానికుల మనోభావాలకు విలువనిచ్చే వాతావరణాన్ని కల్పించాలి. -
రెండు రాష్ట్రాల తీరాల్లో 10 మృతదేహాలు
ముంబై/వల్సద్: టౌటే తుఫాను తీరం దాటుతున్న సమయంలో అరేబియా సముద్రంలో ఉన్న పీ– 305 బార్జ్ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో గల్లంతైన వారివిగా భావిస్తున్న 10 మృతదేహాలు మహారాష్ట్ర, గుజరాత్‌లలోని పలు తీరాలకు కొట్టుకొచ్చాయి. మృతదేహాలపై ఉన్న దుస్తులు, లైఫ్ జాకెట్లను బట్టి వారిని పీ– 305 బార్జ్‌కు చెందిన వారిగా భావిస్తున్నామని పోలీసులు ఆదివారం వెల్లడించారు. అయితే ఆ వ్యక్తులు ఎవరన్న దానిపై విచారణ సాగుతోందని చెప్పారు. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో దొరికిన మృతదేహాల్లో మాండ్వా తీరంలో అయిదు, అలీబౌగ్‌లో రెండు, మురుద్‌లో ఒకటి ఉన్నాయని చెప్పారు. మరోవైపు గుజరాత్‌లోని వల్సద్ జిల్లాలో ఆదివారం రెండు మృతదేహాలు కనిపించాయి. శనివారం నుంచి మొత్తం ఆరు మృతదేహాలు దొరికినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. మొత్తం 261 మంది ఉన్న పీ305 పడవ మునిగిపోగా వారిలో 186 మందిని రక్షించగలిగారు. ఇప్పటివరకూ ఈ పడవకు సంబంధించి 66 మంది మరణించారు. (చదవండి: SC Committee: ఈ–కోర్టుల మొబైల్ సేవలు) -
‘పీ 305’ ప్రమాదంలో 49 మంది మృతి
ముంబై: భీకర టౌటే తుపాను కారణంగా సముద్రంలో మునిగిపోయిన పీ–305 బార్జ్‌లోని సిబ్బందిలో మరో 26 మంది ఆచూకీ తెలియలేదని నౌకాదళం గురువారం పేర్కొంది. బార్జ్‌లో ఉన్న మొత్తం 261 మందిలో 49 మంది చనిపోయారని, మిగతా 186 మందిని రక్షించామని తెలిపింది. వరప్రద టగ్ బోట్ నుంచి మరో ఇద్దరిని కాపాడామని పేర్కొంది. అందులోని మరో 11 మంది కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపింది. సెర్చ్లైట్ల సాయంతో రాత్రింబవళ్లు గాలింపు జరుపుతున్నామని, ప్రమాదం జరిగి నాలుగు రోజులైనందున గల్లంతైన వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు తక్కువేనని పేర్కొంది. టౌటే తుపాను ప్రభావంతో సముద్రంలో కొట్టుకుపోయిన పీ–305 బార్జ్ సోమవారం మునిగిపోయిన విషయం తెలిసిందే. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన నౌకాదళ విపత్తు సహాయ బృందం గాలింపు, రక్షణ చర్యలు ప్రారంభించింది. యుద్ధనౌకలు ఐఎన్ఎస్ కొచి, ఐఎన్ఎస్ కోల్‌కతా, ఐఎన్ఎస్ బియాస్, ఐఎన్ఎస్ బెట్వా, ఐఎన్ఎస్ తేజ్‌లతో పాటు పీ–81 నిఘా విమానం, ఇతర నౌకాదళ హెలికాప్టర్లు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయి. మొత్తంగా 600 మందికిపైగా ఓఎన్జీసీ సిబ్బందిని కాపాడామని నౌకాదళ అధికార ప్రతినిధి వెల్లడించారు. పశ్చిమతీరంలోని చమురు వెలికీతీత కేంద్రాల్లోని మొత్తం 6,961 ఉద్యోగులు, ఇతర సిబ్బంది క్షేమంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కెప్టెన్ తేలిగ్గా తీసుకున్నాడు టౌటే తుపాను హెచ్చరికను పీ–305 బార్జ్ కెప్టెన్ బల్విందర్ సింగ్ తేలికగా తీసుకున్నారని దాని చీఫ్ ఇంజనీర్ రహమాన్ షేక్ ఆరోపించారు. గాలుల వేగం పెద్దగా ఉండదని, తుపాన్ ప్రభావం గంటసేపు మాత్రమే ఉంటుందని చెబుతూ... హెచ్చరికలను తేలికగా తీసుకొని ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టానికి కారణమయ్యారని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రహమాన్ ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. కెప్టెన్ బల్విందర్ గల్లంతైన వారిలో ఉన్నారు. -
Cyclone Tauktae: కడలి కబళించింది
ముంబై: టౌటే తుపాను కారణంగా సముద్రంలో కొట్టుకుపోయి, మునిగిపోయిన పీ 305 బార్జ్‌లోని సిబ్బందిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 49 మంది ఆచూకీ తెలియరాలేదు. 186 మందిని నౌకాదళం రక్షించింది. సముద్రంలో అత్యంత తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ నౌకాదళ సభ్యులు ఈ సహాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ బార్జ్‌పై మొత్తం 261 మంది (తొలుత 273 మంది అని ప్రకటించినా దీనిని నిర్వహిస్తున్న కంపెనీ 261 మందే ఉన్నారని బుధవారం తెలిపింది) సిబ్బంది ఉన్నారు. ‘గల్లంతైన వారిని గుర్తించి, రక్షించే కార్యక్రమం కొనసాగుతోంది. అయితే సమయం గడుస్తున్న కొద్దీ వారిని రక్షించే అవకాశాలు సన్నగిల్లుతాయి’ అని నౌకాదళ అధికార ప్రతినిధి బుధవారం తెలిపారు. సముద్రంలో కొట్టుకుపోయిన మరో రెండు బార్జ్‌లు, ఒక ఆయిల్ రిగ్‌లోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారన్నారు. జీఏఎల్ కన్స్ట్రక్టర్ బార్జ్‌లోని మొత్తం 137 మంది సిబ్బందిని మంగళవారమే నేవీ, కోస్ట్‌గార్డ్స్ రక్షించిన విషయం తెలిసిందే. ఎస్ఎస్ (సపోర్ట్ స్టేషన్) 3 బార్జ్‌లోని 196 మంది సిబ్బంది, సాగర్ భూషణ్ ఆయిల్ రిగ్‌పై ఉన్న 101 మంది సురక్షితంగా ఉన్నారని నేవీ వెల్లడించింది. చనిపోయిన 26 మంది మృతదేహాలను ఐఎన్ఎస్ కొచి యుద్ధనౌకలో ముంబైకి తీసుకువచ్చారు. ఐఎన్ఎస్ తేజ్, ఐఎన్ఎస్ బెట్వా, ఐఎన్ఎస్ బియాస్, ఐఎన్ఎస్ తల్వార్, పీ 81 యుద్ధ విమానం, సీ–కింగ్ చాపర్లు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. ఓఎన్జీసీ, ఎస్సీఐ వినియోగిస్తున్న నౌకలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పీ 305 బార్జ్ సోమవారం సాయంత్రం నుంచి సముద్రంలో మునగడం ప్రారంభమయింది. గత నాలుగు దశాబ్దాల్లో ఇది అత్యంత క్లిష్టమైన గాలింపు, సహాయ కార్యక్రమమని డెప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ మురళీధర్ సదాశివ్ పవార్ వ్యాఖ్యానించారు. సహాయం కోరుతూ అభ్యర్థన వచ్చిన వెంటనే రంగంలోకి దిగామని, సోమవారం నుంచి సమన్వయంతో, సముద్రంలో నెలకొన్న దారుణమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ గాలింపు, సహాయ చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. సహాయ చర్యలపై పీఎం ఆరా టౌటే తుపాను వల్ల అరేబియా సముద్రంలో మునిగిపోయిన బార్జ్ పీ 305లోని సిబ్బందిని రక్షించే సహాయ చర్యలపై బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. నేవీ సీనియర్ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నాం బార్జ్ మునిగిపోతోంది. మరో మార్గం లేదు... అరేబియా సముద్రంలోకి దూకేయడమే. చుట్టూ చిమ్మచీకటి, 15 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలలు. బలమైన గాలులు. లైఫ్ జాకెట్లు వేసుకున్నా... కల్లోల కడలిలో ఏం జరుగుతోందోననే భయం. ఎవరైనా సాయానికి వస్తారా? ఎప్పటికి చేరుకుంటారు? అసలు బతికి బట్టకడతామా? జలసమాధి కావాల్సిందేనా? ఎన్నెన్నో ప్రశ్నలు. భయాలు. ఏకంగా 12 గంటలపాటు జీవన్మరణ పోరాటం... చివరకు మంగళవారం ఉదయం నేవీ రక్షణ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. రక్షించిన వారిలో 125 మందిని ఐఎన్ఎస్ బుధవారం ముంబైకి తీసుకొచ్చింది. ముంబైకి నైరుతి దిశలో 70 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో హీరా ఆయిల్‌ఫీల్డ్ ఉంది. ఇందులో పనిచేసే వారికోసం పీ–305 బార్జ్పైన తాత్కాలిక నివాసాలున్నాయి. టౌటే తుపాను తీవ్రతకు సోమవారం దీని లంగరు తెగిపోయి సముద్రంలోకి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. రాత్రికి మునిగిపోయింది. అప్పుడు దీనిపై 261 మంది ఉన్నారు. వీరిలో 186 మందిని నేవీ రక్షించింది. అచ్చు టైటానిక్ దృశ్యాలే ‘‘టైటానిక్ ఓడ మునిగిపోవడం, అందులోని ప్రయాణికులు ప్రాణభయంతో నీళ్లలో దూకేయడం, చుట్టూ శవాలు, వాటి మధ్యలో కొందరి జీవన్మరణ పోరాటం... ఇవన్నీ ప్రజలు సినిమాలో చూసుంటారు. కానీ మా కళ్ల ముందే ఇదంతా జరిగింది. టైటానిక్ కంటే దారుణంగా ఉండింది పరిస్థితి. చుట్టూ నీళ్లపై మా సహచరుల మృతదేహాలు తేలియాడుతున్నాయి. లైఫ్‌జాకెట్ సహాయంతో 14 గంటలు అలా నీళ్లపై తేలుతూ ఉన్నాను. ఏమీ కాదు.. బతుకుతామని ఒకరికొకరం ధైర్యం చెప్పుకున్నాం. చివరకు నేవీ సిబ్బంది దేవుళ్లలా వచ్చి కాపాడారు’ అని 28 ఏళ్ల విశ్వజీత్ బంద్‌గార్ తెలిపారు. ‘అత్యంత భీతావహ పరిస్థితి. ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నాం. బతికి బయటపడతానని అనుకోలేదు. ఏడు, ఎనిమిది గంటల పాటు అలా నీళ్లలో ఈదుతూ ఉన్నాను. చివరికి నేవీ వచ్చి రక్షించింది.’ అని మనోజ్ గీతే తెలిపాడు. కొల్హాపూర్‌కు చెందిన 19 గీతే నెలరోజుల కిందటే హెల్పర్‌గా ఆయిల్రిగ్పై పనికి కుదిరాడు. పీడకల లాంటి అనుభవం తర్వాత మళ్లీ తాను రిగ్‌పైకి వెళ్లబోనని తేల్చిచెప్పాడు. ‘బతికున్నాను... అదే సంతోషం’ అన్నాడు. తుపాను దెబ్బకు తన డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్ సముద్రంలో కలిసిపోయాయన్నాడు. నేవీ వల్లే బతికాం.. లేకపోతే ఏమయ్యేదో... అంటూ ఉబికివస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పాడు మరో కార్మికుడు. -
తౌక్టే తుపాను: 9 మందిని కాపాడిన కోస్ట్‌గార్డ్
బనశంకరి: తౌక్టే తుపాను వల్ల కన్నడనాట తీరప్రాంత జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పెనుగాలులు, అలల తాకిడికి మంగళూరు వద్ద అరేబియా సముద్రంలో చిన్న చేపల పడవ మునిగిపోయింది. స్థానికులు ముగ్గురిని కాపాడగా, ఇద్దరు చనిపోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. తుపాన్ ప్రభావంతో ఈ నెల 20 తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కావేరినది నీటిమట్టం గణనీయంగా పెరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలో 108 ఇళ్లు దెబ్బతిన్నాయి. 380 మందిని సహాయక కేంద్రాలకు తరలించారు. ఇళ్లు కూలి, విద్యుత్ ప్రమాదాలతో ఆరుగురు దాకా మరణించారు. సురక్షితం అరేబియా సముద్రంలో చిక్కుకున్న 9 మందిని 40 గంటల అనంతరం సురక్షితంగా కాపాడారు. మంగళూరు నుంచి 13 నాటికల్ మైళ్ల దూరంలో రాతిబండల మధ్య కోరమండల్ అనే టగ్‌బోట్‌లో 9 మంది మంగళూరు రిఫైనరీ కాంట్రాక్టు ఉద్యోగులు శనివారం నుంచి చిక్కుకున్నారు. తుపాను వల్ల ముందుకు వెళ్లలేకపోయారు. రక్షించాలని వీడియో కాల్ ద్వారా విజ్ఞప్తి చేయడంతో సోమవారం కోస్టుగార్డు సిబ్బంది నౌకలు, ఒక హెలికాప్టర్‌తో చేరుకుని అందరినీ సురక్షితంగా కాపాడారు. ఐదుమందిని హెలికాప్టర్ ద్వారా మంగళూరుకు తీసుకొచ్చారు. తుపాను మృతులకు పరిహారం తుపాన్‌తో ఇళ్లు కూలిపోయినవారికి రూ.5 లక్షలు, బోట్ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు. ఓ మోస్తరు ఇంటి మరమ్మతుల కోసం రూ. లక్ష చొప్పున అందిస్తామన్నారు. తుపాను వల్ల రాష్ట్రంలో 6 మంది మృతిచెందగా 22 జిల్లాల్లో 121 పల్లెల్లో 333 ఇళ్లు దెబ్బతిన్నాయి. 30 హెక్టార్లలో పంటలు నాశనమైయ్యాయని 57 కిలోమీటర్లు రోడ్లు దెబ్బతిన్నాయని రాష్ట్ర ప్రకృతి విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
Cyclone Tauktae: టౌటే ఉగ్రరూపం
పుట్టుకొచ్చిన మూడు నాలుగు రోజుల్లోనే మహోగ్రంగా రూపుదాల్చిన టౌటే తుపాను గుజరాత్లో తీరం దాటబోతోంది. ఒకపక్క కరోనా వైరస్ మహమ్మారితో దేశమంతా పోరాడుతున్న వేళ పడమటి తీర ప్రాంత రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌లను ఈ తుపాను వణికించింది. మన దేశానికి తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం తుపానులకు నిలయాలు. గత అయిదు దశాబ్దాల్లో వచ్చిన తుపానులు, వరదలు, ఇతరత్రా తీవ్ర వాతావరణ పరిస్థితులవల్ల దాదాపు లక్షన్నరమంది ప్రాణాలు కోల్పోయారని అంచనా. ఈ తుపానుల కారణంగా జరిగే ఆస్తుల విధ్వంసం కూడా అపారమైనది. కోట్లాది రూపాయల విలువైన పంట నాశనమవుతుంది. లక్షల ఇళ్లు దెబ్బతింటాయి. బంగాళాఖాతంతో పోలిస్తే అరేబియా సముద్రంలో తుపానుల తాకిడి మొదటినుంచీ తక్కువే. కానీ ఇదంతా మారింది. ఇప్పుడు బంగాళాఖాతంతో సమానంగా అరేబియా సముద్రంలోనూ తుపానులు విరుచుకుపడుతున్నాయి. ఎప్పుడో అరుదుగా తుపానులేర్పడే ఈ ప్రాంతంలో గత నాలుగేళ్లుగా ఏటా రుతుపవనాల రాకకు ముందు ఠంచనుగా ఒక తుపాను తప్పడం లేదు. ఈ నాలుగు తుపానుల్లో మూడు గుజరాత్, మహారాష్ట్రలను తాకగా 2018లో వచ్చిన మెకాను తుపాను ఒమన్ దేశంపై విరుచుకుపడింది. నిరుడు కరోనాపై పోరుతో మహారాష్ట్ర సతమతమవుతుండగా నిసర్గ తుపాను విరుచుకుపడింది. అయితే కొంతలో కొంత ఉపశమనం ఏమంటే...ముంబై మహానగరం వందేళ్లలో కనీవినీ ఎరుగని స్థాయి ఉపద్రవాన్ని చవిచూడబోతున్నదని నిపుణులు అంచనా వేసినా తీరం దగ్గరవుతుండగా అది బలహీనపడింది. ఆరుగురు మరణించడంతోపాటు పెనుగాలులతో ఇళ్లు కూలడం, చెట్లు విరిగిపడటంవంటి ఉదంతాలైతే తప్పలేదు. ఉష్ణమండల తుపానులకు సముద్ర జలాలు వేడెక్కడం ప్రధానమైన షరతు. ఆ వేడి జలాలే తుపానుల పుట్టుకకు కారణం కావడంతోపాటు, వాటికి కావలసినంత శక్తిని సమకూరుస్తాయి. బంగాళాఖాతంలోని జలాలు ఎప్పుడూ 28 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతతో వుంటాయి. కనుకనే అక్కడ తుపానుల తాకిడి అధికం. దాంతో పోలిస్తే అరేబియా సముద్ర జలాలు ఎప్పుడూ ఒకటి, రెండు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతల్లో వుండేవి. కానీ నానాటికీ పెరుగుతున్న భూతాపం దీన్ని తలకిందులు చేసింది. గత వందేళ్లలో అరేబియా సముద్ర జలాల ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. తరచు అవి పరిమితులను దాటుతున్నాయి. సముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఉపరితలంలో 50 మీటర్లలోతు వరకూ వుండే నీరు ఆవిరై భారీ వర్షాలకూ, పెను తుపానులకూ దారితీస్తుంది. వాతావరణంలోకి ఏమేరకు ఆవిరి విడుదలవుతుందో ఆ మేరకు వాతావరణ పీడనం పడిపోతుంది. ఒకసారంటూ అల్పపీడనం ఏర్పడితే అది వివిధ స్థాయిల్లోకి పరివర్తన చెందడం తప్పదు. బంగాళాఖాతం, అరేబియా సముద్రం సగటున ఏటా అయిదు తుపానులు తీసుకొస్తున్నాయి. అరేబియా సముద్రంలోని తుపానులు ఎక్కువగా లక్షద్వీప్ సమీపంలో బయల్దేరతాయి. వేరే దేశాలవైపు సాగిపోతాయి. కానీ ఇటీవలకాలంలో ఈ ధోరణి కూడా మారుతోంది. ఓఖ్రి, ఫణి, ఆంఫన్ తుపానులు నిజానికి చాలా బలహీనంగా మొదలై అతితక్కువ వ్యవధిలో తీవ్రత పెంచుకోవడం నిపుణులను ఆశ్చర్యపరిచింది. వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదని నానుడి. కానీ వాతావరణ అధ్యయనంలో రూపొందే నమూనాలు ఆ పరిస్థితిని చాలావరకూ మార్చాయి. అయితే పర్యావరణం సైతం శాస్త్రవేత్తలతో పోటీ పడుతూ రూపు మార్చుకుంటూ కొత్త సవాళ్లు విసురుతోంది. ఎంతో అధునాతన సాంకేతిక సంపత్తితో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నా, సముద్ర జలాల తీరుతెన్నులు దానికి అందకుండా పోతున్నాయి. ఇలా దోబూచులాడుతూ విరుచుకుపడే తుపానులు ప్రభుత్వాలకు తలనొప్పి సృష్టిస్తాయి. జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తగిన వ్యవధి దొరకదు. తుపానుల రాకడనూ, వాటి నడతనూ, తీవ్రతనూ అంచనా వేయడానికి ఆకాశంలో తిరుగాడే ఉపగ్రహాలు మొదలుకొని సముద్ర తీరాల్లో అమర్చే పరికరాల వరకూ అన్నింటి అవసరమూ శాస్త్రవేత్తలకు వుంటుంది. ఈ సమస్త డేటానూ వినియోగించి వేర్వేరు నమూనాలను రూపొందించి, ఏమేరకు తీవ్రత పెరిగితే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో శాస్త్రవేత్తలు అంచనాకొస్తారు. తుపానులైనా, ఇతర విలయాలైనా భూతాపం పెంచే కార్యకలాపాలకు దూరంగా వుండాలని మనిషిని హెచ్చరిస్తున్నాయి. 2030కల్లా భూతాపాన్ని 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ మేర తగ్గించాలని 2015నాటి పారిస్ ఒడంబడిక లక్ష్యంగా పెట్టుకుంది. ట్రంప్ ఏలుబడిలో అమెరికా ఆ ఒడంబడికనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించినా, బైడెన్ వచ్చాక ఆ నిర్ణయాన్ని మార్చారు. అయితే ఆస్ట్రేలియా, కొన్ని ఇతర దేశాల శాస్త్రవేత్తలు మాత్రం ఆ లక్ష్యసాధన అసాధ్యమన్నట్టు ఇటీవల మాట్లాడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశం. ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తే... ధనిక దేశాలు వెనకబడిన దేశాలకు ఉదారంగా పర్యావరణ అనుకూల సాంకేతికతలను బదిలీ చేస్తే పెద్ద కష్టంకాదని నిపుణులు చెబుతున్న మాట. ఈ విషయంలో బ్రిటన్, యూరప్ యూనియన్ ఉమ్మడిగా కృషి చేస్తున్నాయి. ఈ ఏడాది ఆఖరుకు గ్లాస్గోలో జరగబోయే కాప్–26 శిఖరాగ్ర సదస్సు ప్రత్యేకించి పారిస్ ఒడంబడిక ప్రధాన లక్ష్యాన్ని సాధించడంపై కార్యాచరణను ఖరారు చేయబోతోంది. ఇవన్నీ సక్రమంగా అమలైతేనే భూగోళం సురక్షితంగా మనగలుగుతుంది. -
‘టౌటే’ ప్రభావంతో వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/సాక్షి, అమరావతి: అరేబియా సముద్రంలో ఏర్పడిన టౌటే తుపాను కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో తక్కువ ఎత్తులో దక్షిణ/ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. వీటివల్ల రానున్న 48 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నంలో ఆదివారం భిన్న వాతావరణం నెలకొంది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా.. ఇంకొన్నిచోట్ల ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడ్డారు. అప్రమత్తమైన వ్యవసాయ శాఖ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వీస్తున్న ఈదురు గాలులు, చిరు జల్లులతో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి మబ్బులు కమ్మి ఉండడంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన చిరు జల్లులు కురిశాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ రైతులను అప్రమత్తం చేస్తోంది. చేలల్లోని పంటను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలని, పరదాలు కప్పి పంట తడవకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. తడిసిన ఉత్పత్తులను ఆరబెట్టే డ్రైయర్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. రైతులు ఆరబెట్టిన మిర్చి, మొక్కజొన్న, ధాన్యాన్ని జాగ్రత్త చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈదురు గాలులకు పండ్లు, కూరగాయల పంటలకు నష్టం జరిగే అవకాశం ఉండడంతో అరటి చెట్లకు కర్రలు కట్టి ఊతమిస్తున్నారు. రైతులకు అవసరమైన సాయం అందించేలా అధికారులు అందుబాటులో ఉండాలని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ ఆదేశాలిచ్చారు. -
Arabian Sea: వాయుగుండంగా మారిన అల్పపీడనం
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం దక్షిణ గుజరాత్ తీరప్రాతానికి 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా అల్పపీడనం బలపడి ఈ నెల 16 నాటికి తుపాన్‌గానూ, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర, అతి తీవ్ర తుపాన్‌గా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న నాలుగు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడున్నాయని పేర్కొంది. ఈ తుపానుకు 'తౌక్టే' అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది. 'తౌక్టే' తీవ్ర తుపానుగా మారి ఈనెల 18న గుజరాత్ వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా తౌక్టే' తుపాన్ ప్రభావంతో కేరళలో భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ, యానాం, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రపై తుపాను ప్రభావం ఉండనుందని, అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో ‘తౌక్టే’ ప్రభావం అరేబియా సముద్రంలో లక్షద్వీప్ వద్ద అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ గుజరాత్ తీర ప్రాంతానికి 920 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుఫాన్.. మరో 12 గంటల్లో తీవ్రమైన తుఫానుగా రూపాంతరం చెందనుందని వాతావరణ కేంద్ర తెలిపింది. ఆ తర్వాత అతి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉందని. గుజరాత్ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను ప్రభావంతో ఏపీ, తెలంగాణ, రాయలసీమ పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయని, ఋతుపవనాల రాకకు ఇది శుభ సంకేతమని వాతావరణ శాఖ పేర్కొంది. చదవండి: తుఫాన్ అలర్ట్: దూసుకొస్తున్న ‘తౌక్టే’ -
తుఫాన్ అలర్ట్: దూసుకొస్తున్న ‘తౌక్టే’
సాక్షి, విశాఖపట్నం: ఆఫ్రికా ఖండం నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఆగ్నేయæ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది కేరళ, కర్ణాటక వైపుగా పయనించే సూచనలున్నాయి. క్రమంగా అల్పపీడనం బలపడి ఈ నెల 16 నాటికి తుపాన్‌గానూ, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర, అతి తీవ్ర తుపాన్‌గా రూపాంతరం చెందుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుపాన్‌కు మయన్మార్ సూచించిన ‘తౌక్టే’ పేరుని పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇది 18వ తేదీ నాటికి గుజరాత్‌కు చేరుకుంటుందని, అయితే ఎక్కడ తీరం దాటుతుందనే అంచనా చిక్కడం లేదని చెబుతున్నారు. తౌక్టే ప్రభావం రాష్ట్రంపై ఏమాత్రం ఉండబోదని తెలిపారు. అయితే బంగాళాఖాతం నుంచి తేమ గాలుల్ని అల్పపీడనం తీసుకునేందుకు ప్రయత్నిస్తుండటం వల్ల రెండు మూడు రోజుల పాటు రాయలసీమలో జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని తెలిపారు. ఈ తుఫాన్ నైరుతి రుతుపవనాల రాకపై ఏమాత్రం ప్రభావం చూపించబోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రుతు పవనాలు సాధారణంగా జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. కానీ ఈ తుఫాను వల్ల సకాలంలో గానీ, అంతకంటే రెండు మూడు రోజుల ముందే నైరుతి రాష్ట్రాన్ని తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకూ ఉత్తర దక్షిణ ద్రోణి వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో తేమ గాలులు ఉత్తరాంధ్ర జిల్లాలవైపు విస్తరిస్తున్నాయి. ఫలితంగా కోస్తా, రాయలసీమల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లా కుందుర్పిలో 4 సెం.మీ, కల్యాణదుర్గం, రాయదుర్గం, సెత్తూరులో 3, సింహాద్రిపురం, కంబదూరు, లేపాక్షిలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
రూ.3,000 కోట్ల విలువచేసే డ్రగ్స్ స్వాధీనం
కొచ్చి: అరేబియా సముద్రంలో భారత నేవీ రూ.3వేల కోట్ల విలువైన మత్తుపదార్థాలను పట్టుకున్నట్లు రక్షణశాఖ సోమవారం వెల్లడించింది. చేపలు పట్టే ఓ పడవలో మత్తుపదార్థాలను గుర్తించినట్లు పేర్కొంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత నేవీకి చెందిన సువర్ణ షిప్ పాట్రోలింగ్ నిర్వహిస్తుండగా, వారికొక చేపలు పట్టే పడవ కనిపించింది. అందులోని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో నేవీ అధికారులు అందులోకి దిగి సోదాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో వారికి 300 కేజీల మత్తు పదార్థాలు కనిపించాయి. దీంతో బోటులోని వ్యక్తు లను కొచ్చి తీరానికి తరలించి విచారణ జరుపు తున్నారు. బోటులోని అయిదుగురు శ్రీలంకు చెందినవారు. ఆ బోటు శ్రీలంకకు చెందినదని, పాకిస్తాన్ నుంచి బయలుదేరి భారత్, శ్రీలంక వైపుగా పయనిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుకున్న మత్తు పదార్థాల విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ. 3 వేల కోట్లు ఉంటుందని వెల్లడించారు. తదుపరి విచారణను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి అప్పగించనున్నారు. -
బ్రేకింగ్: రూ. 3 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
న్యూఢిల్లీ: భారత నావికా దళం సుమారు 3,000 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. అరేబియా సముద్రంలో చేపలు పట్టే ఓ నౌక నుంచి 300 కిలోగ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్ నేవి న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి వెల్లడించింది. వీటి విలువ సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేసింది. అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తోన్న ఐఎన్ఎస్ సువర్ణ ఈ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకుంది. అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఐఎన్ఎస్ సువర్ణ.. చేపలు పట్టే నౌక ఒకటి సముద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని గమనించింది. వెంటనే రంగంలోకి దిగి.. సదరు నౌక సిబ్బందిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడమే కాక నౌకలో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో షిప్లో 300 కేజీలకు పైగా డ్రగ్స్ ఉండటం గమనించింది. వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవడమే కాక.. విచారణ నిమిత్తం నౌక, దానిలో ఉన్న సిబ్బందిని కేరళ కొచ్చి తీరానికి తరలించింది. ఈ నౌక ఎవరికి సంబంధించింది.. దీనిలో రవాణ చేస్తున్న డ్రగ్స్ ఎవరికి సంబంధించినవి తదితర వివరాలను రాబట్టనుంది. చదవండి: సంచలనం: బెంగళూరు డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులు -
బుల్లెట్‌కి బలయ్యే అవకాశమివ్వండి
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో మిగ్–29 కె శిక్షణా విమానం కూలిన ఘటనలో గల్లంతైన కమాండర్ నిశాంత్ సింగ్, గతంలో తన వివాహ అనుమతి కోరుతూ పై అధికారులకు హాస్యపూరితమైన లేఖను రాశారు. తన పెళ్లిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ ‘బుల్లెట్ దెబ్బకు బలయ్యే అవకాశాన్నివ్వండి’అంటూ ఆయన రాసిన చమత్కారపూరితమైన లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గురువారం మిగ్–29 కె శిక్షణా విమానం అరేబియా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఒక పైలెట్‌ని రక్షించగలిగారు, నిశాంత్ సింగ్ మాత్రం గల్లంతయ్యారు. లాక్డౌన్ కాలంలో తన వివాహానికి అనుమతినివ్వాలని కోరుతూ మే 9వ తేదీన తన వృత్తిలోని అంశాలకు సృజనాత్మకతను జోడిస్తూ అధికారులకు కమాండర్ నిశాంత్‌సింగ్ హాస్యపూర్వకంగా లేఖ రాశారు. దీనికి ‘మంచిపనులన్నీ శుభం కార్డుతో ముగుస్తాయి, నరకానికి స్వాగతం’’అని నిశాంత్ సింగ్ సీనియర్ అధికారి ప్రతి స్పందించారు. (ఫ్రాన్స్‌లో భద్రతా బిల్లుపై జనాగ్రహం) -
భారత నౌక దళానికి కొత్త బలం ‘వగీర్’
ముంబై: ఇండియన్ నౌక దళానికి కొత్త శక్తి తోడైంది. ప్రాజెక్ట్ 75లో భాగంగా తయారు చేసిన 5వ శ్రేణి స్కార్పిన్ జలంతర్గామి ‘వగీర్’ని నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. అరేబియా సముద్రంలోని మజగావ్ డాక్ వద్ద రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపద్ నాయక్ వీడియో కాన్సరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. ఫ్రెంచి నౌక రక్షణ సంస్ధ డీసీఎన్ఎస్ భాగస్వామ్యంతో భారత నౌక దళ ప్రాజెక్ట్-75లో ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఈ వగీర్ జలంతర్గామిని నిర్మించింది. భారత నౌక దళ అవసరాలకు అనుగుణంగా ఆరు స్కార్పిన్ జలంతర్గాములను నిర్మించడానికి మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్‌కు బాధ్యతలను అప్పగించింది. వీటిలో ఐఎన్ఎస్ కల్వరీని 2015లో మొదట ప్రారంభించగా, 2017 నుంచి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత ఖాందేరీ, కరంజ్, వేలా జలంతర్గాములను ప్రారంభించారు. (చదవండి:మలబార్ డ్రిల్‌లో ఆస్ట్రేలియా ) ‘వగీర్’ సేవలను వచ్చే సంవత్సరం నుంచి ఉపయోగించుకోవచ్చునని పశ్చిమ నౌక దళ వైస్ ఆడ్మిరల్ ఆర్బి పండిట్ అన్నారు. ‘ఇప్పటికే ఉన్న రెండు కల్వరీ జలంతర్గాములు చురుగ్గా పని చేస్తున్నాయి. మిగిలిన నాలుగు కూడా ఇందులో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని’ ఆయన అన్నారు. ఈ రకం జలంతర్గాములు భూమిపైన, లోపల జరిగే యుద్ధాలలో సేవలు అందిచడంలో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. దేశాన్ని ముందుకు నడిపించే యుద్ధ నౌకల నిర్మాణంలో మజగావ్ డాక్ సంస్థ ముందుంటుంది. ఇప్పటి వరకు ఈ సంస్థ గోదావరి యుద్ధ నౌకలు, రేస్ కార్లు, మిసైల్ బోట్స్ ఇతరేతర శత్రు వినాశనిలను తయారు చేసింది. -
మలబార్ డ్రిల్‌లో ఆస్ట్రేలియా
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం రగులుతున్న నేపథ్యంలో ఇదొక అత్యంత కీలక పరిణామం. కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు చెక్ పెట్టడానికి భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఒక్కతాటిపైకి వస్తున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో నవంబర్‌లో జరగనున్న మలబార్ విన్యాసాల్లో అమెరికా, జపాన్‌తోపాటు ఆస్ట్రేలియా పొల్గొంటుందని భారత్ సోమవారం ప్రకటించింది. ఉమ్మడి శత్రువైనా చైనాకు వ్యతిరేకంగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు చతుర్భుజ కూటమి(క్వాడ్) పేరిట జట్టు కట్టిన సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం జరిగే ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్ నావికా దళాలు పాల్గొనడం పరిపాటి. తాజాగా ఇందులో ఆస్ట్రేలియా కూడా చేరింది. క్వాడ్‌లోని నాలుగు సభ్య దేశాలు సైనిక స్థాయిలో ఒకే వేదికపైకి రానుండడం ఇదే మొదటిసారి. తూర్పు లద్దాఖ్‌లో భారత్‌లో చైనా తరచుగా ఘర్షణకు దిగుతున్న నేపథ్యంలో నాలుగు దేశాల డ్రిల్ ప్రాధాన్యం సంతరించుకుంది. దీని ద్వారా చైనాకు బలమైన హెచ్చరికలు పంపినట్లవుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబార్ ఎక్సర్సైజ్ ద్వారా నాలుగు దేశాల నావికా దళాల మధ్య సహకారం మరింత పెరుగుతుందని భారత రక్షణశాఖ పేర్కొంది. -
మళ్లీ వాయుగుండం
సాక్షి, హైదరాబాద్: తూర్పు మధ్య అరేబియా సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సౌరాష్ట్రకు దక్షిణ దిశగా, ముంబై నగరానికి పశ్చిమ వాయవ్య దిశగా ఈ వాయుగుండం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. దీని ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వివరించింది. ఈ వాయుగుండం ప్రభావం రానున్న 48గంటల పాటు కొనసాగి క్రమంగా బలహీనపడే అవకాశముందని పేర్కొంది. కాగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈనెల 19న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఇది తదుపరి 24 గంటల్లో బలపడనుందని హెచ్చరించింది. -
ఒమెన్ నుంచి ముంబై వైపు మిడతల యాత్ర!
సాధారణంగా తూర్పు ఆఫ్రికా నుంచి ఇరాన్, పాకిస్తాన్ మీదుగా మన దేశం (రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతం)లోకి గాలి వాటున ఎడారి మిడతల దండ్లు వస్తూ ఉంటాయి. అయితే, ఈ ఏడాది అసాధారణంగా ఎన్నో రెట్లు ఎక్కువగా మిడతలు పుట్టుకొచ్చినందున ఇప్పుడు సముద్రం వైపు నుంచి కూడా మిడతల దాడి ప్రారంభం అయ్యింది. అరేబియా మహాసముద్రం మీదుగా మిడతల దండు నేరుగా మన దేశంలో పశ్చిమ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్.ఎ.ఓ.) ఈ విషయమై కొద్ది నెలలు ముందే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తొలి దండు ఒమెన్ దేశం నుంచి జూన్ 12న అరేబియా మహాసముద్రం మీదుగా ఆకాశ మార్గాన భారత్ వైపు బయలుదేరిందని ఎఫ్.ఎ.ఓ. తాజా బులిటెన్‌లో తెలిపింది. ఈ దండు ప్రయాణం సజావుగా కొనసాగితే జూన్ 17 నాటికి మహారాష్ట్ర సముద్ర తీరప్రాంతానికి చేరుకోవచ్చని ఎఫ్.ఎ.ఓ. పేర్కొంది. వాతావరణం అనుకూలించకపోతే మిడతలు సముద్రంలో పడి మరణించ వచ్చు కూడా అని తెలిపింది. ♦ ఒమెన్–ముంబై మధ్య 1,566 కిలోమీటర్ల దూరం ఉంది. మిడతల దండు ఇంత దూరం ఏకబిగిన తిండీ తిప్పలు లేకుండా, అలసట లేకుండా ఎగరగలుగుతుందా? అసాధ్యం కాదని చరిత్ర చెబుతోంది. ♦ మిడతలు గంటకు 16–19 కి.మీ. ప్రయాణించగలవు. మిడతల దండ్లు 5 నుంచి 130 కి. మీ. లేదా అంతకన్నా ఎక్కువ దూరం ఎగరగలవు. మిడతల ప్రయాణ వేగం గాలుల వేగంపై ఆధారపడి ఉంటుంది. ♦ మిడతల దండు అనేక రోజుల పాటు ఆకాశంలోనే ఉండి గాలి వాటున ప్రయాణించ గలదు. ఆ సమయంలో అతి తక్కువ శక్తిని మాత్రమే ఖర్చు చేయగల ఒడుపు మిడతలకు తెలుసునట. 300 కి.మీ. వెడల్పు ఉండే ఎర్ర సముద్రాన్ని తరచూ అలవోకగా దాటేస్తుంటాయి. ♦ 1954లో వాయువ్య ఆఫ్రికా నుంచి బయలుదేరి బ్రిటన్ చేరుకున్నాయి. 1988లో పశ్చిమ ఆఫ్రికా నుంచి కరిబియన్ చేరాయి. 5 వేల కి.మీ. దూరాన్ని కేవలం పది రోజుల్లో మిడతల దండులు చేరుకున్నాయి. ♦ తూర్పు ఆఫ్రికా, ఒమెన్, ఎమెన్ తదితర దేశాల్లో కుప్పలు తెప్పలుగా గత 70 ఏళ్లలో ఎరుగనంత ఎక్కువ సంఖ్యలో మిడతలు పుట్టుకొస్తున్నాయి. కాబట్టి, అక్కడి నుంచి నేరుగా అరేబియా మహాసముద్రం మీదుగా మన దేశంలోని పశ్చిమ తీర ప్రాంతానికి మిడతల దండులు తాకే ముప్పు ఉంది. అక్కడి నుంచి గాలులు అనుకూలిస్తే దక్షిణాది రాష్ట్రాలపై కూడా వచ్చే కొద్ది వారాల్లో మిడతలు దండుయాత్ర చెయ్యొచ్చు. ♦ అటు రాజస్థాన్ నుంచి కూడా ఇంతకు ముందుకన్నా ఎక్కువ సంఖ్యలో మిడతల గుంపులు దక్షిణాది వైపు రావచ్చు. ఎఫ్.ఎ.ఓ. ఎప్పటికప్పుడు మిడతల స్థితిగతులపై బాధిత దేశాలకు సమాచారం ఇస్తూ ఉంటుంది. జూన్ 22 నుంచి జూలై 19 వరకు రాజస్థాన్ మీదుగా మిడతల దండయాత్ర మరింత ఉధృతం కాబోతున్నదని, సర్వసన్నద్ధంగా ఉండాలని ఎఫ్.ఎ.ఓ. భారత ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా 16 రాష్ట్రాలను హెచ్చరించినట్లు సమాచారం. మిడతల నియంత్రణకు ట్రాక్టర్లు, ఫైరింజన్లతోపాటు డ్రోన్ల ద్వారా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పురుగుమందులు పిచికారీ చేస్తున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేపనూనె పిచికారీ చేయాలి: స్వామినాథన్ ♦ ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎమ్మెస్ స్వామినాథన్ సహా పలువురు శాస్త్రవేత్తలు రైతులు రసాయనాలు పచికారీ చేయవద్దని సూచిస్తున్నారు. మిడతల రాకకు ముందు రోజుల్లో పంటలపై వేప నూనె కలిపిన నీటిని పిచికారీ చేయాలని డా. స్వామినాథన్ ఇటీవల ట్వీట్ చేశారు. వేప నూనె వాసన, రుచికి పంటలను మిడతలు తినకుండా వెళ్లి పోతాయి. అంతేకాదు, వేప నూనె పోషకంగా కూడా పంటలకు పనిచేస్తుందన్నారు. ♦ మిడతల దండును మట్టుబెట్టేందుకు పురుగుమందులు చల్లిన ప్రాంతాల్లో విషతుల్యమైన మిడతలు చచ్చి పడి ఉంటాయి. కాబట్టి, కనీసం వారం రోజుల వరకు పశువులు, కోళ్లు అటువైపు వెళ్లి విషతుల్యమైన మిడతలను తినకుండా రైతులు జాగ్రత్తపడాలి. ♦ ఎడారి మిడతలు దండు కట్టక ముందు బాల్య దశలో సాధారణ స్థితిలో ఉన్నప్పుడు రాత్రి వేళల్లో ఎగురుతాయి. పెరిగి పెద్దయి దండులో చేరిన తర్వాత పగటి పూట ఎగురుతాయి. చెట్లు, పంటలపై వాలి రాత్రి పూట కూడా ఆకులు, కంకులు తింటూనే ఉంటాయి. రైతులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వాల సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ గండం గట్టెక్కాల్సిన సీజన్ ఇది. -
నేడు, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు
-
రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుం చి 40 కి.మీ. వేగంతో) పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్ది పేట, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలలో ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 24 గంటలలో మధ్య అరేబియా సముద్రం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాలలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా ప్రయాణించి మంగళవారం తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాలలో పాంజిమ్ (గోవా)కు పశ్చిమ దిశగా 280 కి.మీ., ముంబైకు దక్షిణ నైరుతి దిశగా 450 కి.మీ., సూరత్ (గుజరాత్)కు దక్షిణ నైరుతి దిశగా 670 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల 12 గంటలలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
అలర్ట్: ఐఎన్ఎస్ విక్రమాదిత్య మోహరింపు
న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను అరేబియా సముద్రంలో మోహరించారు. చైనా- పాకిస్తాన్‌లు సంయుక్తంగా సోమవారం నుంచి అరేబియా సముద్రంలో తొమ్మిది రోజుల పాటు భారీ నావికాదళ విన్యాసాలు చేపట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతలో భాగంగా భారత్ తన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను తీరప్రాంతంలో మోహరించింది. మిగ్ 29కె యుద్ధవిమానంతో కూడిన ఐఎన్ఎస్ విక్రమాదిత్యను వ్యూహాత్మక మిషన్‌లో భాగంగా పంపినట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ వాహక నౌకను మోహరించే సమయంలో నావికాదళ ప్రధాన కార్యాలయ ఉన్నతాధి కారులు అందులో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య అంతర్ కార్యాచరణ, వ్యూహాత్మక సహకారం లక్ష్యంగా 'సీ గార్డియన్స్' పేరుతో చైనా- పాక్‌లు ఈ విన్యాసాలను ప్రారంబించనున్నాయి. ఇందులో ఇరుదేశాల జలాంతర్గాములు, విధ్వంసక నౌకలు, యుద్ధనౌకలు భాగం కానున్నాయి. -
అరేబియా జలాల్లో నేవీ హై అలర్ట్
న్యూఢిల్లీ: పుల్వామా ఆత్మాహుతి దాడి నేపథ్యంలో భారత నావికా దళం అప్రమత్తమైంది. పాకిస్తాన్ పాల్పడే ఎలాంటి దుస్సాహసాన్నైనా తిప్పికొట్టేందుకు అణు జలాంతర్గాములు సహా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలతో కూడిన భారీ ఆయుధ సంపత్తిని ఉత్తర అరేబియా సముద్ర జలాల్లో మోహరించింది. పుల్వామా దాడి సమయంలో ట్రాపెక్స్–2019 పేరుతో నేవీ భారీ యుద్ధ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఇందులో యుద్ధ వాహన నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అణు జలాంతర్గాములు ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ చక్రం, 60 యుద్ధ నౌకలు, 12 తీరరక్షక ఓడలు, 60 యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి. ఘటన జరిగిన వెంటనే ఈ మొత్తం ఆయుధ సంపత్తిని రక్షణ శాఖ పాక్‌తో సరిహద్దు జలాల్లోకి తరలించి యుద్ధ సన్నద్ధతను ప్రకటించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఈ బలగాలు ఇంకా అక్కడే ఉన్నాయని నేవీ ప్రతినిధి తెలిపారు. -
రూ.3643 కోట్లతో భారీ శివాజీ విగ్రహం
ముంబై : అరేబియా మహాసముద్రంలో ఏర్పాటు చేయనున్న మరాఠీ మహారాజు ఛత్రపతి శివాజీ మహా విగ్రహానికి(శివ్ స్మారక్) కావాల్సిన నిధులను మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. విగ్రహ ఏర్పాటుకై రూ.3643.78 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత నెల 1న రాష్ట్ర కేబినెట్ సమావేశమై విగ్రహ ఏర్పాటుకు రూ.3700.84 కోట్లు కేటాయించింది. అయితే అధికారికంగా మాత్రం రూ. 56.70కోట్లు తగ్గించి రూ.3643.78కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ విగ్రహాన్ని 2022-2023 ఏడాదికల్లా పూర్తి చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. -
అంతరించిపోతున్న సొర చేపలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అరేబియా సముద్రంలో సొర చేపలు (షార్క్స్) నశించిపోతున్నాయి. ప్రధానంగా వేట వల్లనే ఈ పరిస్థితి వస్తున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. సొర చేపలను వేటాడంలో ప్రపంచంలోనే ఇండోనేసియా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. సొర చేపల్లోని ప్రతి అవయంతోని ఉపయోగం ఉండడమే అందుకు కారణం. సొర చేప చర్మాన్ని పాద రక్షలు, బ్యాగుల తయారీకి ఉపయోగించడం, దాని లివర్ నుంచి వచ్చే నూనెకు డిమాండ్ ఎక్కువగా ఉండడం, దానిలోని మదులాస్థిని ఔషధాల్లో ఉపయోగించడం లాంటి ఉపయోగాలెన్నో. మానవులకన్నా, వక్షాలకన్నా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే, అంటే దాదాపు 35 కోట్ల క్రితం నుంచి జీవిస్తున్న సొర చేపల్లో 153 రకాల సొర చేపలు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే 50 శాతం రకాలు అంతరించిపోయినట్లు డాక్టర్ రిమా జమాడో తెలియజేశారు. ఆయనతోపాటు పలు దేశాలకు చెందిన 24 మంది బయోలాజిస్టులు 2017లో ఆరేబియా సముద్రంతోపాటు పక్కనే ఉన్న ఎర్ర సముద్రం, ఓమన్ సముద్రంతోపాటు 20 దేశాలకు ఆనుకున్న సముద్రాల్లో వారు సొర చేపల మనుగడపై అధ్యయనం చేశారు. వారిలో భారత్‌కు చెందిన బయోలాజిస్టు కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిషరీస్ కారణంగానే సొర చేపలకు ముప్పు వస్తోందని బయోలాజిస్టుల అధ్యయనంలో తేలింది. వాణిజ్యపరంగా డిమాండ్ ఉన్న ఇతర చేపల లక్ష్యంగా ఫిషరీస్ విభాగాలు వేటాడుతుంటే సొరచేపలు ఎక్కువ పడుతున్నాయి, వాటిని మళ్లీ నీటిలోకి వదలకుండా వాటి అవయవాలకు కూడా డిమాండ్ ఉండడంతో అవి ఎక్కువ ఎగుమతి అవుతున్నాయి. అన్ని సొర చేపల లివర్ ఆయిల్‌కు డిమాండ్ ఉండదు. వెయ్యి అడుగుల లోతుల్లో తిరుగాడే సొర చేపల లివర్ ఆయిల్‌కే డిమాండ్ ఉంటుంది. వాటిలోనే ఔషధ గుణాలు ఉంటాయన్న నమ్మకం. ఇంతకుముందు మాల్దీవుల్లో, ఇప్పుడు జపాన్ ఈ లివర్ ఆయిల్‌ను ఉత్పత్తి చేసే పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. -
అరేబియా సముద్రంలో అరుదైన వాతావరణం
-
మార్చి నెలలోనే అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్ : ఎండలు ఠారెత్తిస్తున్నప్పుడు, ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి చేరుకున్నప్పుడు అల్పపీడనాలు ఏర్పడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడం సాధారణమైన విషయం. కానీ ఈ ఏడాది వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అరేబియా సముద్రం మీదుగా అరుదైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మార్చి నెలలోనే, ఇంకా అంతగా ఎండలు ముదరకుండానే అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ముంబైలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) వెల్లడించింది. సర్వసాధారణంగా అరేబియా సముద్రంలో ఏప్రిల్, మే నెలల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఈ సారి మార్చిలోనే ఈ పరిస్థితి రావడం అత్యంత అరుదైనదని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 125 సంవత్సరాల్లో ఈ తరహా వాతావరణాన్ని చూడడం ఇదే తొలిసారని అంటున్నారు. 1891వ సంవత్సరం నుంచి అరేబియా సముద్రంలో వాతావరణానికి సంబంధించిన రికార్డుల్ని పరిశీలిస్తే మార్చి నెలలోనే అల్పపీడనం ఏర్పడడం ఇదే మొదటిసారని వారు తేల్చి చెప్పారు. దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనాలున్నాయి. కొంకణ్, సెంట్రల్ మహారాష్ట్ర, విదర్భ, మరఠ్వాడా ప్రాంతాల్లో వడగళ్ల వానలు కూడా కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కారణంగావీస్తున్న బలమైన గాలులు లక్షద్వీప్, కేరళను చుట్టుముట్టాయి. గంటకి 55 కి.మీ.వేగంతో గాలులు వీస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ముంబై, పుణె, నాసిక్‌లలో ఇప్పటికే మబ్బుపట్టిన వాతావరణం, చిరుజల్లులు ప్రజల్ని సేద తీరుస్తున్నాయి. కానీ ఇప్పటికే నిండా అప్పుల్లో మునిగిపోయిన రైతన్నలకు ఈ వాతావరణ పరిస్థితులు దడపుట్టిస్తున్నాయి. రబీ పంటల సమయంలో వాతావరణంలో ఇలాంటి మార్పులు, అకాలవర్షాల వల్ల రైతులకు ఎంత నష్టం వాటిల్లుతుందోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఎందుకీ పరిస్థితి వచ్చింది ? హిందూ మహాసముద్రంలో భూమధ్యరేఖకు సమీపంలో మార్చి 10న ఏర్పడిన అతి తక్కువ స్థాయి అల్పపీడనం అరేబియా సముద్రంవైపునకు వచ్చి అల్పపీడనంగా మారింది. అది గంటకు 20 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ లక్షద్వీప్ వద్ద బలహీనపడింది. ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉన్నప్పుడు సముద్ర ఉపరితలం వేడెక్కి, సముద్ర జలాలు ఆవిరిగా మారి అల్పపీడనాలు ఏర్పడుతూ ఉంటాయి. గత దశాబ్దకాలంలో భూమధ్య రేఖకు సమీపంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి హిందూమహా సముద్రం ఉపరితల జలాలు అసాధారణ స్థాయిలో వేడెక్కిపోవడం మొదలైంది. దాని ప్రభావం అరేబియా సముద్రం వైపు మళ్లిందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల కారణంగా కాలం కాని కాలంలో అల్పపీడనాలు, తుఫాన్లు ఏర్పడుతున్నాయి. సాధారణంగా బంగాళఖాతంతో పోల్చి చూస్తే అరేబియా సముద్రంలో అల్పపీడనాలు తక్కువగానే ఏర్పడతాయి. కానీ గత నాలుగేళ్లుగా అరేబియా సముద్రంలో అల్పపీడనాలు, తుఫాన్లు ఎక్కువైపోతున్నాయి. ఈ సముద్ర తీర ప్రాంతంలో మానవ కార్యకలాపాలు పెరిగిపోవడం, పారిశ్రామిక వాడలు ఎక్కువైపోవడం వల్ల కూడా వాతావరణంలో అనూహ్యమార్పులు చోటు చేసుకుంటున్నాయని తాజాసర్వేలు వెల్లడిస్తున్నాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
నేడు ఈదురుగాలులు, తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి, కోస్తాంధ్రకు దగ్గరలో బంగాళాఖాతంలో యాంటీ సైక్లోన్ ఏర్పడటం... ఈ మూడు కారణాల వల్ల శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా గత 24 గంటల్లో రామగుండంలో అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఆదిలాబాద్, భద్రాచలం, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్‌ల్లో 39 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అన్నిచోట్లా రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 5 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో 5 డిగ్రీలు అధికంగా 27 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత రికార్డు అయింది. హకీంపేట, నిజామాబాద్‌ల్లో 4 డిగ్రీలు అధికంగా 25 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
ముగిసిన త్రివిధ దళాల విన్యాసాలు
ముంబై : అరేబియా సముద్రంలో మూడు వారాలుగా జరుగుతున్న త్రివిధ దళాల విన్యాసాలు గురువారంతో ముగిశాయి. ఇందులో నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి చెందిన ఫైటర్ జెట్లు, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, పదాతిదళాలు పాల్గొన్నాయి. ‘పశ్చిమ్ లెహర్’పేరుతో పశ్చిమ తీర ప్రాంతంలో ఫిబ్రవరి 12న ఈ విన్యాసాలను ప్రారంభించారు. త్రివిధ దళాల పరస్పర సామర్థ్యాలను, కార్యాచరణ సంసిద్ధతను పరీక్షించేందుకే ఈ విన్యాసాలు చేపట్టామని నేవీ వెల్లడించింది. ఇందులో నేవీకి చెందిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఈస్ట్రర్న్, వెస్ట్రర్న్ నావిక దళాలు, జలాంతర్గాములు, 22వ కిల్లర్ స్క్వాడ్రన్, గస్తీ నౌకలు, తేలికపాటి యుద్ధ విమానాలు మిగ్ 29కె, పీ–8ఐ, ఐఎల్–38ఎస్డీ, రిమోట్‌తో నడిచే విమానాలు, పాల్గొన్నాయని తెలిపింది. -
నీళ్లు – నిప్పులు
అంతా సవ్యంగా ఉందనుకుంటుండగా మళ్లీ నదీ జలాల్లో నిప్పు రాజుకుంది. కర్ణాటకలో మహాదాయిగా, గోవాలో మాండోవిగా పారుతున్న నది తాజా వివాదానికి కేంద్ర బిందువు. ఆ నది నీళ్లు విడుదల చేయాలంటూ కర్ణాటక రైతాంగం, వివిధ కన్నడ సంస్థలు దాదాపు నెలరోజులుగా ఆందోళన చేస్తున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్త బంద్ జరిగింది. బెంగళూరుకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 4న వస్తున్నందున ఆ రోజు నగర బంద్‌కు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి పోటీగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చే రోజైన ఫిబ్రవరి 10న బీజేపీ బంద్ పాటించబోతోంది. పడమటి కనుమల్లో పుట్టి గోవాలో అరేబియా సముద్రంలో కలిసే మహాదాయి కర్ణాటక కన్నా గోవాలోనే ఎక్కువ మేర పారుతుంది. దాని నిడివి 77 కిలోమీటర్లు కాగా అందులో కర్ణాటకలో ప్రవహించేది 29 కిలోమీటర్ల మేర మాత్రమే. జలాలను కృష్ణా ఉపనది మలప్రభ బేసిన్‌కు మళ్లించి నాలుగు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించాలన్నది కర్ణాటక ప్రతిపాదన. ఇందు కోసం మహాదాయిపై ఆనకట్టలు, కాలువలు నిర్మించాలని 80వ దశకంలో నిర్ణయిం చింది. ఇందువల్ల తమకున్న ఏకైక మంచినీటి నది ఎండిపోతుందని, భారీమొ త్తంలో అడవి నాశనమవుతుందని, పర్యావరణం దెబ్బతింటుందని 2002లో గోవా సుప్రీంకోర్టుకెళ్లింది. పర్యవసానంగా ఆ నిర్మాణాలను న్యాయస్థానం ఆపేసింది. అప్పటినుంచీ ప్రతి సీజన్లోనూ మలప్రభ ప్రాంతానికి నీరివ్వాలని ఆందోళనలు రేగడం, ఏదో మేరకు అంగీకారం కుదిరి వాటిని చల్లార్చడం రివాజు. ఈ వివాదంపై 2010లో ట్రిబ్యునల్ నియమించినా అది ఇంతవరకూ అవార్డు ప్రకటించలేదు. రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ పక్షాల జోక్యంతో ఉద్రిక్తతలు పెరగడం, అశాంతి రగలడం తప్పడం లేదు. నదీజలాల వివాదంపై మన రాజ్యాంగంలోని 262వ అధికరణ మాట్లాడు తోంది. ఈ అధికరణ ప్రకారం నదీజలాల వినియోగం, పంపిణీ, నియంత్రణ వంటి అంశాల్లో రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తినా, ఫిర్యాదులు వచ్చినా పరి ష్కారం కోసం తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 1956లో నదీ జలాల బోర్డు చట్టం, అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం తీసుకొచ్చింది. బోర్డు ఇంతవరకూ సాకారం కాలేదుగానీ, అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం కింద దేశంలో ఏడు ట్రిబ్యునళ్లు ఏర్పడ్డాయి. ఇందులో కృష్ణా నదికి సంబంధించి రెండు ట్రిబ్యునళ్లుం డగా... రావి–బియాస్, గోదావరి, నర్మద, కావేరి, మహాదాయి, వంశధార వివా దాలపై ఇతర ట్రిబ్యునళ్లు ఏర్పడ్డాయి. అసలు ట్రిబ్యునళ్ల ఏర్పాటులోనే అంతులేని జాప్యం చోటుచేసుకోగా, వాటిల్లో కొన్ని సుదీర్ఘ సమయం వెచ్చించి ప్రకటించిన నిర్ణయాలకు సైతం దిక్కూ మొక్కూ లేకుండా పోతోంది. దేశంలో ఇంతవరకూ కృష్ణా ట్రిబ్యునల్–1, గోదావరి ట్రిబ్యునల్, నర్మద ట్రిబ్యునల్ మాత్రమే అవార్డులు ప్రకటించాయి. మిగిలినవి ప్రకటించినా వివిధ దశల్లో ఆగిపోయాయి. కొన్ని అవా ర్డులపై వివాదాలు సుప్రీంకోర్టుకెళ్లాయి. ఇవిగాక మహారాష్ట్రలోని బాభలీ ప్రాజెక్టుపై 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు, ముళ్ల పెరియార్ డ్యామ్ వివా దం విషయంలో అదే కోర్టు 2014లో ఇచ్చిన ఆదేశాల అమలుకు కేంద్రం ముగ్గురు సభ్యులతో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రపంచ పునరుత్పాదక జల వనరుల్లో మన దేశంలో ఉన్నవి కేవలం 4 శాతం మాత్రమే. ప్రకృతి సహకరిస్తే సమృద్ధిగా వానలు పడతాయి. నదులు, సరస్సులు, చెరువులు, కుంటలు నిండుతాయి. అది పగబడితే చుక్క నీటికి దిక్కుండదు. భూగర్భ జలాలు కూడా అడుగంటుతాయి. వాతావరణంలో పెనుమార్పుల పర్యవ సానంగా రుతువులు గతి తప్పుతున్నాయి. అయితే అతివృష్టి...లేకపోతే అనావృష్టి తప్ప సవ్యంగా వర్షాలు పడటం అరుదుగా మారింది. కనుక ఉన్నకొద్దీ జలవివా దాలు పెరుగుతాయే తప్ప తగ్గవు. అయితే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ సమస్యపై నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి, శాశ్వత పరిష్కారం కనుగొన డానికి ముందుకు రావడం లేదు. సమస్య తలెత్తినప్పుడు తాత్కాలికంగా సర్దుబాటు చేసి, గండం గట్టెక్కితే చాలనుకుంటున్నారు. ట్రిబ్యునళ్లు అవార్డులివ్వ డంలో జాప్యం చేసినా, ఇచ్చిన అవార్డుల అమలు అసాధ్యమవుతున్నా పట్టిం చుకునే దిక్కులేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, డిక్రీలు సైతం బేఖాతరైన సందర్భాలు న్నాయి. ప్రతి అవార్డుపైనా, ఆదేశాలపైనా తిరిగి న్యాయస్థానాలను ఆశ్రయించడం పరిపాటి. ఇతరత్రా సమయాల్లో జాతి గురించి, జాతి ప్రయోజనాల గురించి గుండెలు బాదుకునేవారు నదీజలాల వివాదం వచ్చేసరికి ‘ప్రాంతీయ పూనకం’లో అన్నీ మరిచిపోతారు. చర్చలకంటే, పరిష్కారాలకంటే స్థానికుల్ని రెచ్చగొట్టడమే పార్టీలకు ప్రధానమైపోతుంది. వివాద పరిష్కారంలో జాప్యం జరిగితే అది మరింత ఉగ్రరూపం దాలుస్తుంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ల మధ్య ఉన్న రావి– బియాస్ వివాదం మొదలై 31 ఏళ్లవుతోంది. ఇప్పుడున్న ట్రిబ్యునళ్లను రద్దు చేసి వాటిస్థానంలో బహుళ బెంచ్‌లు ఉండే ఒక శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని రెండేళ్లక్రితం కేంద్రం నిర్ణయించింది. అందు కోసం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల(సవరణ)బిల్లు రూపొందించింది. నిరుడు మార్చిలో లోక్‌సభలో ఆ బిల్లు ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఏ వివాదాన్నయినా ముందు నిపుణుల కమిటీ పరిశీలించి ఏడాదిలోగా ఒక పరిష్కారాన్ని సూచిస్తుంది. అప్పటికీ వివాదం సమసిపోనట్టయితే అది ట్రిబ్యునల్ ముందుకొస్తుంది. అలాగే నిరంతరం వివిధ నదుల్లోని జల పరిమాణానికి సంబంధించిన డేటా సేకరణకు ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పుతారు. ఈ బిల్లులో ఇతర అంశాలేమిటి, వాటిలోని లోటు పాట్లేమిటన్న సంగతలా ఉంచి దానిపై ఇంకా చర్చే మొదలుకాలేదు. కనీసం వచ్చే సమావేశాల్లోనైనా దానిపై లోతుగా చర్చించి వీలైనంత త్వరలో చట్టం చేసి పనులు మొదలు పెడితే మహాదాయిలాంటి అనేక వివాదాల పరిష్కారంవైపు తొలి అడుగు పడుతుంది. అందుకోసం అందరూ చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. -
నౌక విధ్వంస క్షిపణిని పరీక్షించిన పాక్
ఇస్లామాబాద్ : నావికాదళ యుద్ధ సన్నాహాలను చూసి తాను గర్విస్తున్నానని పాకిస్థాన్ నేవీ చీఫ్ జకౌల్లా అన్నారు. శనివారం పాకిస్థాన్ నౌకలను విధ్వంసం చేసే క్షిపణిని పరీక్షించింది. సీ కింగ్ అనే హెలికాప్టర్ నుంచి దీనిని ఉత్తర అరేబియా సముద్రంలో పరీక్షించింది. ఈ పరీక్ష విజయవంతమైనట్టు పాక్ నేవీ తెలిపింది. నేవీ చీఫ్ జకౌల్లా సమక్షంలో ఈ పరీక్ష నిర్వహించినట్టు వెల్లడించింది. తమది అణుదేశమని ప్రకటించడంతోపాటు భారత్‌ను ఎదుర్కొనేందుకు కొన్ని అణ్వాయుధాలను కూడా సిద్ధంగా పెట్టుకున్నామని పాక్ అధ్యక్షుడు ప్రకటించిన నేపథ్యంలో జరిగిన తాజా పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. 'మా నేవీ పట్ల నేను ఆత్మసంతృప్తిగా ఉన్నాను. పాక్ సముద్ర తలాన్ని రక్షించేందుకు కట్టుబడి ఉంది. అన్ని తీరాల ప్రయోజనాలకు రక్షణ కవచంగా ఉంది' అని జకౌల్లా పేర్కొన్నట్లు పాక్ రేడియో తెలిపింది. -
విహారయాత్రలో విషాదం
- బీచ్‌లో 11 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు - 8 మృతదేహాలు లభ్యం సాక్షి, ముంబై/బనశంకరి(బెంగళూరు): విద్యార్థుల విహారయాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్టడీటూర్ ముగించుకుని సరదాగా బీచ్ స్నానానికి వెళ్లిన వారిలో 8 మంది విగతజీవులుగా ఒడ్డుకు కొట్టుకొచ్చారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని వాయరి బీచ్‌లో శనివారం ఈ ఘోరం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం బెళగావిలోని మరాఠా ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన 47 మంది విద్యార్థులు స్టడీటూర్ నుంచి తిరిగి వస్తూ శనివారం విహారయాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో బీచ్‌లో ఈత కొడుతుండగా.. ప్రమాదవశాత్తూ 8 మంది అరేబియా సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలోని లోతైన ప్రాంతానికి వెళ్లడంతో ఒక్కసారిగా రాకాసి అలలు వారిని మింగేశాయి. మృతుల్లో ఐదుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారని పోలీసులు తెలిపారు. మునిగిపోతున్న విద్యార్థుల్ని రక్షించేందుకు మిగతా విద్యార్థులు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమైందని సింధుదుర్గ్ ఎస్పీ అమోఘ్ గోయంకర్ చెప్పారు. మొత్తం ఎనిమిది మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా పోలీసుల సాయంతో ముగ్గురు విద్యార్థుల్ని ఒడ్డుకు తీసుకురాగా చికిత్స కోసం వారిని సమీపంలోని మాల్వన్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో ఒకమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. స్టడీటూర్‌లో భాగంగా గత గురువారం మహారాష్ట్రలోని పుణేలో ఇండస్ట్రియల్ మీట్‌కు ఈ విద్యార్థులు హాజరయ్యారు. మృతదేహాల్ని సింధుదుర్గ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనతో కర్ణాటకలోని బెళగావి నగరంలో విషాదం అలముకుంది. స్టడీ టూర్‌కు అనుమతి లేదు: ప్రిన్సిపాల్ ఘటనపై మరాఠా మండల కాలేజీ ప్రిన్సిపాల్ విశ్వనాథ్ ఉడుపి స్పందిస్తూ... విద్యార్థుల స్టడీ టూర్‌కు అనుమతి నిరాకరించినా వెళ్లారని చెప్పారు. ఇండస్ట్రియల్ మీట్ పూర్తి కాగానే నేరుగా కాలేజీకి రావాలని విద్యార్థులకు సూచించామన్నారు. -
జాలర్లపై దాడి
ఇన్నాళ్లు బంగాళాఖాతంలో శ్రీలంక సేనలు తమిళ జాలర్ల మీద విరుచుకు పడుతుంటే, తాజాగా అరేబియా సముద్రంలో వేటకు వెళ్లిన కన్యాకుమారి జాలర్లను ఇంగ్లాండ్ సేనలు బందీగా పట్టుకు వెళ్లాయి. సాక్షి, చెన్నై: తమిళ జాలర్ల మీద శ్రీలంక సేనలు సృష్టిస్తున్న వీరంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం దాడులు, బందీలుగా పట్టుకెళ్లడం సర్వసాధారణం. ఇప్పటి వరకు వందకు పైగా పడవలు, పదుల సంఖ్యలో జాలర్లు ఆ దేశ చెరలో ఉన్నారు. వీరిని విడిపించేందుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం, జాలర్ల సంఘాలు తీవ్రంగానే ఒత్తిడి తెస్తున్నా ఫలితం శూన్యం. ఇన్నాళ్లు శ్రీలంక సేనల నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందనుకుంటే, తాజాగా ఇంగ్లాండ్(బ్రిటీష్)దేశ సేనలు సైతం ప్రతాపం చూపించడం జాలర్లలో ఆందో ళనకు దారి తీస్తోంది. బంగాళా ఖాతంలో భద్రత కరువుతో కన్యాకుమారి జాలర్లు అరేబియా సముద్రం వైపుగా వేట సాగిస్తూ వస్తున్నారు. కేరళ సరిహద్దుల్లోని తమిళ గ్రామాల్లోని జాలర్లు కొచ్చి మీదుగా తమ చేపల వేట సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోకన్యాకుమారి జిల్లా నిత్ర విలై సమీపంలోని ఇరువి బుద్ధన్ గ్రామానికి చెందిద్ధాల్బర్ట్ పడవలో డేని, ప్రడీ, సోని, జోషప్, ఆంటోని, షాజీలు, కొచ్చికి చెందిన మరొకరి బోటులో కుమరికి చెందిన మరి కొందరు ఆదివారం వేటకు వెళ్లారు. అరేబియా సముద్రంలో ఓ దీవులకు సమీపంలో వేటలో ఉన్న వీరిని బ్రిటీషు నావికాదళం చుట్టుముట్టింది. నాలుగైదు పడవల్ని, 32 మందిని బందీలుగా పట్టుకెళ్లింది. ఈ సమాచారం కొచ్చిలోని మత్స్య శాఖ వర్గాల ద్వారా కన్యాకుమారికి సమాచారం చేరింది. కన్యాకుమారికి చెందిన జాలర్లు పదిహేను మందికి పైగా ఇంగ్లాండ్ సేనల వద్ద బందీలుగా ఉన్న సమాచారంతో ఆందోళన బయల్దేరింది. తమ వాళ్లను విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీలంకతో పాటుగా ఇతర దేశాల చెరలో ఉన్న తమిళ జాలర్లను విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. పదవిని కాపాడుకునే ప్రయత్నంలో జాలర్లను విస్మరించ వద్దు అని సీఎంకు హితవు పలికారు. -
మూడు సముద్రాల తీరరేఖ కలిగిన ప్రదేశం?
భారతదేశ తీర మైదానాలు దక్కన్ పీఠభూమికి ఇరువైపులా అరేబియా సముద్రం, బంగాళాఖాతం వెంబడి వివిధ వెడల్పుల్లో తీర మైదానాలున్నాయి. ఇవి రెండు రకాలు.. అవి.. పశ్చిమ తీర మైదానం తూర్పు తీర మైదానం పశ్చిమ తీర మైదానం ఈ మైదానం దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున, అరేబియా సముద్రం మధ్య వ్యాపించి ఉంది. ఈ మైదానం సన్నగా, అసమానంగా అక్కడక్కడా కొండలున్న భూభాగంతో గుజరాత్ తీరంలోని ‘రాణా ఆఫ్ కచ్’ నుంచి దక్షిణాన ‘కన్యాకుమారి’ వరకు విస్తరించి ఉంది. ఈ మైదానాలు ఇరుగ్గా, తక్కువ వెడల్పుతో ఉంటాయి (10–25 కి.మీ). ఈ మైదానాల్లో డెల్టాలు, కయ్యలు మాత్రమే ఉన్నాయి. గమనిక: నదులు తమతోపాటు తెచ్చిన ఒండ్రు మట్టిని వాటి ముఖద్వారం వద్ద నిక్షేపించకుండా సముద్రంలో కలిస్తే ఆ ప్రాంతాలను కయ్యలు అంటారు. పశ్చిమ తీర రేఖ సచ్ఛిద్రంగా రంపపు పళ్ల నిర్మాణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ మైదానంపై భ్రంశాలు ఏర్పడ్డాయి. అందువల్ల ఈ మైదానం సహజ ఓడ రేవులకు ప్రసిద్ధి చెందింది. పశ్చిమ కనుమల పశ్చిమ వాలు ఎక్కువగా ఉండటం, పశ్చిమ కనుమలకు, అరేబియా సముద్రానికి మధ్య దూరం తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ డెల్టాలు లేవు. పశ్చిమ తీర మైదానాన్ని వివిధ రకాలుగా విభజించవచ్చు. అవి.. 1. గుజరాత్ మైదానం ఇది గుజరాత్‌లోని ‘రాణా ఆఫ్ కచ్’ నుంచి ‘డామన్’ వరకు విస్తరించి ఉంది. ఇక్కడున్న తీరాన్ని గుజరాత్ తీరం/కాండ్లా తీరం/ కథియవార్ తీరం/గిర్నార్ తీరం అని పిలుస్తారు. ఈ మైదానం అటుపోట్లకు ప్రసిద్ధి. ఈ తీర మైదానంలో ప్రవహించే నదులు– నర్మద, తపతి, సబర్మతి. ఈ మైదాన తీరంలో ‘గిర్నార్’ కొండలున్నాయి. ఈ కొండల్లో ఎత్తయిన శిఖరం – గిర్ శిఖరం. గిర్నార్ కొండల్లో ‘గిర్ నేషనల్ పార్క్’ (జునాగఢ్ – గుజరాత్) ఉంది. 2. కొంకణ్ మైదానం ఈ మైదానం డామన్ నుంచి గోవా వరకు విస్తరించి ఉంది. ఇది మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఉంది. ఈ తీర మైదానం బసాల్ట్ నేలలకు ప్రసిద్ధి. దీన్ని కొంకణ్ తీరం అని కూడా పిలుస్తారు. 3. కర్ణాటక మైదానం ఇది ‘గోవా’ నుంచి కన్ననూర్ వరకు విస్తరించి ఉంది. దీన్ని కెనరా తీరం అని కూడా పిలుస్తారు. ఈ మైదానం గుండా శరావతి, నేత్రావతి నదులు ప్రవహిస్తున్నాయి. ఈ మైదానంలో ప్రవహించే శరావతి నదిపై దేశంలోకెల్లా అతి ఎత్తయిన జలపాతం జోగ్(జర్సొప్పా) ఉంది. దీని ఎత్తు సుమారు 275 మీ. ఈ తీర మైదానం కయ్యలకు ప్రసిద్ధి. 4. కేరళ మైదానం ఈ మైదానం కన్ననూర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. దీన్ని మలబార్ తీరం అని కూడా పిలుస్తారు. మలబార్ తీరం ఉప్పునీటి సరస్సులకు ప్రసిద్ధి. వీటినే లాగూన్లు (వృష్ట జలాలు) అంటారు. ఇక్కడ ఉన్న లాగూన్లు– అష్టముడి, వెంబనాడ్. ఇక్కడి లాగూన్లను స్థానికంగా కాయల్ అని పిలుస్తారు. ఈ కాయల్ను వెనుక జలాలు అంటారు. దేశంలో పొడవైన లాగూన్, సరస్సు – చిల్కా సరస్సు (ఒడిశా) దేశంలో అత్యధికంగా లాగూన్లు విస్తరించి ఉన్న మైదానం – మలబార్ తీరం ఈ మైదానంలో ప్రవహించే నదులు –పెరియార్, పంబ, భద్రావతి మొదలైనవి. దేశంలో పశ్చిమ, తూర్పు తీరాల పొడవు – 6,100 కి.మీ దేశంలో అత్యధిక తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం – గుజరాత్ (1,054 కి.మీ.) రెండోది ఆంధ్రప్రదేశ్ (974 కి.మీ.) తూర్పు తీర మైదానం ఈ మైదానం దక్కన్ పీఠభూమికి తూర్పున, బంగాళాఖాతానికి మధ్య విస్తరించి ఉంది. ఈ మైదానం పశ్చిమ తీర మైదానంలా కాకుండా బల్లపరుపుగా ఉండి ఎక్కువ వెడల్పుతో (సుమారు 120 కి.మీ) ఉంది. ఈ మైదానం దక్షిణాన కన్యాకుమారి నుంచి ఈశాన్యంగా సువర్ణ రేఖ నది మీదుగా గంగానది ముఖ ద్వారం వరకు (సుమారు 1,800 కి.మీ పొడవున) విస్తరించి ఉంది. తూర్పు తీరంలో మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదులతో ఏర్పడిన డెల్టాలున్నాయి. గమనిక: నదులు తమతోపాటు తెచ్చిన ఒండ్రు మట్టిని నది ముఖద్వారం వద్ద నిక్షేపంæచేసి, సముద్రంలో కలిసే ప్రాంతాన్ని డెల్టా అంటారు. ఈ తీరంలోని డెల్టాలు దక్షిణ భారతదేశ ధాన్యాగారాలుగా ప్రసిద్ధి చెందాయి. తూర్పు తీరంలో పొడవైన తీరం ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. తూర్పు తీర మైదానం విశాలమైన బీచ్‌లతో ఉంది. విరూపకారక బలాల వల్ల బంగాళాఖాతం.. ఖండ భూభాగం నుంచి క్రమంగా తిరోగమిస్తోంది. తూర్పు తీరంలోని హుగ్లీ నది ముఖద్వారం వద్ద, సముద్రంలోని ఖండ భాగాలు తిరోగమనం చెందడం వల్ల న్యూమూరో దీవులు ఆవిర్భవించాయి. ఒకప్పుడు కొల్లేరు సరస్సు తూర్పు మైదానంలో కృష్ణ–గోదావరి నదీ డెల్టాల మధ్య ఉప్పు నీటి సరస్సుగా ఉండేది. అనంతరం బంగాళాఖాతం క్రమంగా ఖండ భూభాగం నుంచి తిరోగమించడంతో కొల్లేరు సరస్సు ప్రస్తుతం తీరానికి దూరంగా ఖండ భూభాగంపై మంచినీటి సరస్సుగా ఆవిర్భవించింది.తూర్పు తీర మైదానాన్ని వివిధ మైదానాలుగా విభజించవచ్చు. అవి.. 1. తమిళనాడు మైదానం దీన్ని కోరమాండల్ తీరం అని కూడా అంటారు. ఇది కన్యాకుమారి నుంచి పులికాట్ సరస్సు వరకు వ్యాపించి ఉంది. ఈ మైదానంలో ప్రవహించే నది – కావేరి. దీన్ని ప్రాచీన కాలంలో చోళ మండలం అని పిలిచేవారు. పులికాట్ సరస్సుకు సమీపంలోనే శ్రీహరి కోట ద్వీపం ఉంది. ఇక్కడే సతీష్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం (షార్) ఉంది. పులికాట్ సరస్సును ఆనుకొని నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. గమనిక: మనదేశంలో మూడు సముద్రాల తీర రేఖ కలిగిన రాష్ట్రం – తమిళనాడు. మూడు సముద్రాల తీర రేఖ కలిగిన ప్రదేశం–కన్యాకుమారి (తమిళనాడు) 2. ఆంధ్రా మైదానం దీన్ని కోస్తా తీరం లేదా సర్కార్ తీరం అని పిలుస్తారు. ఇది పులికాట్ సరస్సు నుంచి బరంపురం (ఒడిశా) వరకు విస్తరించి ఉంది. ఈ మైదానంలో గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాలు విస్తరించి ఉన్నాయి. కృష్ణా–గోదావరి నదుల మధ్య కొల్లేరు సరస్సు ఉంది. ఇందులో కలిసే నదులు – బుడమేరు, తమ్మిలేరు, ఉప్పుటేరు. కొల్లేరు సరస్సులోని నీటిని సముద్రంలోకి తీసుకెళ్లే నది – ఉప్పుటేరు. 3. ఉత్కళ మైదానం దీన్ని ఒడిశా తీరం/కళింగ తీరం/ఒడియాతీరం అని కూడా పిలుస్తారు. ఈ మైదానం బరంపురం నుంచి సుందర్బన్స్ వరకు వ్యాపించి ఉంది. ఈ మైదానంలో ఉన్న డెల్టా– మహానది. ఇక్కడ చిల్కా సరస్సు ఉంది. ఇందులో రిడ్లే తాబేళ్లను సంరక్షిస్తున్నారు. ఈ తీరంలో సిమ్లిపాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. 4. వంగ తీరం దీన్ని కాంతి తీర మైదానం అని పిలుస్తారు. ఇది సుందర్బన్స్ నుంచి గంగానది ముఖద్వారం వరకు విస్తరించి ఉంది. ఇక్కడ గంగానది డెల్టా ఉంది. దీన్ని బెంగాలీ తీరం అని కూడా పిలుస్తారు. ఈ తీరంలో మడ అడవులున్నాయి. ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన సుందర్బన్స్ డెల్టా ఈ తీర మైదానంలోనే ఉంది. పశ్చిమ తీరాలు – రాష్ట్రాలు కాండ్లా తీరం – గుజరాత్ కొంకణ్ తీరం – మహారాష్ట్ర, గోవా కెనరా తీరం – కర్ణాటక మలబార్ తీరం – కేరళ తూర్పు తీరాలు – రాష్ట్రాలు కోరమాండల్ తీరం – తమిళనాడు సర్కార్ తీరం – ఆంధ్రప్రదేశ్ ఉత్కళ/కళింగ తీరం – ఒడిశా వంగ తీరం – పశ్చిమ బెంగాల్ ఎడారులు భారత ఉప ఖండంలో అతి పెద్ద ఎడారి థార్. దీన్ని భారతదేశ గొప్ప ఎడారి అంటారు. ఇది ఆరావళి పర్వతాలకు వాయవ్యంగా, సుమారు 2 లక్షల చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ఈ ఎడారి భారతదేశంలో అత్యధికంగా, పాకిస్థాన్‌లో కొద్ది భాగం విస్తరించి ఉంది. ఈ ఎడారి రాజస్థాన్‌లో అధిక భాగం, పంజాబ్, హరియాణాల్లో కొంత భాగం విస్తరించి ఉంది. ఈ ఎడారిలో వార్షిక వర్షపాతం అతి తక్కువగా (10 సెం.మీ–50 సెం.మీ) ఉండటం వల్ల ముళ్ల పొదల వంటి ఉద్భిజ్జాలు (జెరోఫైటిక్ వృక్షాలు) అక్కడక్కడా ఉన్నాయి. ఈ ఎడారి ప్రాంతంలో జోధ్‌పూర్, బికనీర్, జైసల్మీర్ మొదలైన పట్టణాలున్నాయి. పోఖ్రాన్ అణుపరిశోధన ఇక్కడే జరిపారు. నీటి లభ్యత ఉన్న ప్రదేశాల్లో జన్మించి ఎడారుల మీదుగా ప్రవహించే నదులను ఎడారి జీవనదులు లేదా ఎక్సోటిక్ రివర్స్ అని పిలుస్తారు. ఈ ఎడారిలో సింధూ నది ప్రవహిస్తుంది. -
పాక్ నుంచి చైనా వ్యాపారం షురూ
గ్వాదర్ పోర్టు నుంచి సరుకుల ఎగుమతి ప్రారంభం ఇస్లామాబాద్: చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా పాక్‌లో పునరుద్ధరించిన గ్వాదర్ పోర్టు నుంచి ఆదివారం చైనా సరుకుల ఎగుమతి ప్రారంభమైంది. 250 కంటైనర్లతో పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు సరుకులు చేరవేయడానికి చైనాకు వాణిజ్య నౌక గ్వాదర్ నుంచి బయలుదేరింది. బలూచిస్తాన్‌లోని ఈ పోర్టు నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రారంభించారు. దీంతో పశ్చిమ చైనాను అరేబియా సముద్రంతో కలపాలన్న చైనా కల నెరవేరింది. చైనా ప్రారంభించిన వన్ బెల్ట్- వన్ రోడ్ కార్యక్రమంలో భాగంగా ఈ పోర్టును ప్రారంభించి తమ నిబద్ధతను చాటుకున్నామని, సీపీఈసీలో గ్వాదర్ పోర్టు కీలకమైనదని నవాజ్ పేర్కొన్నారు. సీపీఈసీలో భాగం గా చేయాల్సిన పనుల్ని గడువులోగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. -
తెలుగు రాష్ట్రాలకు తప్పిన తుపాను ముప్పు
♦ తరలిపోయిన అల్పపీడనం ♦ అరేబియా సముద్రంలో తుపాను సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరిం త బలపడనుంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం నాటికి తుపానుగా మారనుంది. శనివారం రాత్రికి గోవాకు పశ్చిమ నైరుతి దిశలో 490 కిలోమీటర్ల దూరంలోనూ, ముంబైకి దక్షిణ నైరుతి దిశలో 560 కిలోమీటర్ల దూరంలోనూ ఇది కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఈ నెల 12 నుంచి బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన ‘చపల’ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండబోదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. గతేడాది ఉత్తర కోస్తాను అతలాకుతలం చేసిన హుద్‌హుద్ తుపాను అక్టోబర్ పదో తేదీనే తీవ్ర రూపం దాల్చింది. కాకతాళీయంగా ఇప్పుడు అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడుతోంది. తుపాను వార్త నేపథ్యంలో మునుపటి హుద్‌హుద్ విలయం నేపథ్యంలో కొందరిలో ఆందోళన రేకెత్తింది. కానీ గుజరాత్, ముంబై, గోవాలపై మాత్రమే తుపాను మోస్తరు ప్రభావం చూపుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ఆయా రాష్ట్రాల్లోనే విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
బంగ్లాదేశ్ వైపు తరలిన అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడనం బంగ్లాదేశ్ వైపు తరలిపోయింది. ఇంకోవైపు, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడనుంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం నాటికి తుపానుగా మారనుంది. ఈ నెల 12 నుంచి బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన ‘చపల’ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండబోదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా బిహార్ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉపరితల ద్రోణి, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడనం
విశాఖపట్నం: అరేబియా సముద్రంలో అల్పపీడనం బలంగా కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాయలసీమలో చెదురుమదురు వర్షాలు కురస్తాయని పేర్కొంది. తెలంగాణ, కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే ఉత్తర బంగాళాఖాతంలోనూ బలమైన అల్పపీడనం ఏర్పడిందని... ఇది బంగ్లాదేశ్ తీరానికి చేరువలో కేంద్రీకృతమైందని తెలిపింది. అయితే ఇది బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. -
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనంకూడా కొనసాగుతోంది. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో మరొక బలమైన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని భారత వాతావరణ విభాగం గురువారంరాత్రి విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మరోవైపు రాయలసీమపై రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటన్నింటి ప్రభావంవల్ల రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని ఉరుములతో కూడినజల్లులు గాని కురిసే అవకాశముందని తెలిపింది. -
అరేబియా తీరంలో భారీ తిమింగలం ఖననం
ముంబై: అరేబియా సముద్రం నుంచి 42 అడుగుల పొడవు, 20 టన్నుల బరువు ఉన్న భారీ తిమింగలం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా రేవ్డండా తీరంలో ఈ భారీ తిమింగలాన్ని జాలర్లు గుర్తించారు. ఇది ప్రాణంతో ఉన్నట్టు తెలుసుకుని ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు చేరవేశారు. 50 మంది జాలర్ల సాయంతో దీన్ని మళ్లీ సముద్రంలోకి విడిచేందుకు ప్రయత్నించారు. అయితే భారీ బరువు కారణంగా సాధ్యంకాలేదు. భారీ తిమింగలం చనిపోయింది. బుల్డోజర్లు, క్రేన్లను రప్పించి అదే బీచ్‌లో తిమింగలాన్ని ఖననం చేశారు. దీని మరణానికి గల కారణాలు తెలియరాలేదు. -
అరేబియా సముద్రంలో 'అశోభ' తుపాను
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ఈ తుపానుకు 'అశోభ' అని పేరుపెట్టారు. తుపాను ప్రభావంతో ఒమన్ నుంచి పాకిస్థాన్ వరకు గల తీరప్రాంతాన్ని అప్రమత్తం చేశారు. ఈ వారాంతంలో ఇది తీరాన్ని తాకుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రంలో ఉన్న వేడి జలాలు ఈ తుపాను మరింత బలం పుంజుకుంటుందని చెబుతున్నారు. తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, సుడిగాలులు రావచ్చని హెచ్చరిస్తున్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు. సూరత్, ముంబై, కొచ్చి ప్రాంతాల్లో కూడా తుపాను ప్రభావం వల్ల వాతావరణంలో తేమ పెరుగుతుందని, దీనివల్ల ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఆక్యువెదర్కు చెందిన వాతావారణ శాస్త్రవేత్త ఆడమ్ డౌటీ తెలిపారు. -
శివాజీ స్మారకం చుట్టూ ముదురుతున్న వివాదం
-
శివాజీ స్మారకం చుట్టూ ముదురుతున్న వివాదం
సాక్షి, ముంబై: అరేబియా సముద్రంలో నిర్మించ తలపెట్టిన ఛత్రపతి శివాజీ స్మారకాన్ని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ స్మారకం నిర్మాణం వల్ల మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిళ్లడమే గాకుండా తమ ఉపాధికి గండిపడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని నగరానికి వచ్చిన పార్లమెంటరీ కమిటీ సభ్యులకు మత్స్యకారుల సంఘటన ప్రతినిధులు విన్నవించారు. దీంతో స్మారకంపై వివాదం రాజుకునే పరిస్థితి ఏర్పడింది. స్మారకం నిర్మాణం విషయంలో ప్రభుత్వం తమ ఆవేదనను పట్టించుకోకపోతే, ఆందోళనను తీవ్రతరం చేస్తామని సంఘటన ప్రతినిధులు హెచ్చరించారు. విజ్ఞాన, సాంకేతిక, అటవీ, పర్యావరణ తదితర అంశాలపై చర్చించేందుకు పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ అశ్వినికుమార్ శుక్రవారం సాయంత్రం వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో మత్స్యకారుల సంఘం ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఇప్పటికే నగరం, శివారు ప్రాంతాల నుంచి సముద్రంలో కలుస్తున్న కలుషిత నీరు, రసాయనాలవల్ల మత్స్య సంపద రోజురోజుకు తగ్గిపోతోందని తెలిపారు. ‘‘స్టీమర్లలో చాలా దూరం వెళితే తప్ప చేపలు లభించడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో శివాజీ స్మారకాన్ని నిర్మిస్తున్నందున పర్యాటకుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో లాంచీలు, పడవల రాకపోకలు పెరిగిపోతాయి. వీటి నుంచి విడుదలయ్యే చమురు, ఇతర రసాయన వ్యర్థాల వల్ల చేపల సంతతి ప్రమాదంలో పడిపోతుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని స్మారకాన్ని ఇక్కడ నిర్మించవద్దు’’ అని వారు అశ్వినికుమార్‌కు విజ్ఞప్తి చేశారు. అరేబియా సముద్రంలో అంతర్జాతీయ స్థాయిలో శివాజీ స్మారకాన్ని నిర్మించాలని పదేళ్ల కిందటే అప్పటి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా అందుకు అవసరమైన వివిధ శాఖల అనుమతుల కోసం ప్రయత్నిస్తోంది. టెండర్ల ప్రక్రియ కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. ఇక పనులు ప్రారంభించడమే తరువాయి. కాని ఇలాంటి సందర్భంలో మత్స్యకారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
శివాజీ స్మారకానికి రూట్ క్లియర్
సాక్షి, ముంబై: గిర్గావ్ (చర్నిరోడ్) చౌపాటి వద్ద అరేబియా సముద్రంలో ప్రతిపాదిత అంతర్జాతీయ ఛత్రపతి శివాజీ స్మారకం నిర్మాణానికి మార్గం సుగమమైంది. అందుకు సంబంధించిన సర్క్యులర్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి జారీ చేసింది. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ స్మారకానికి భూమిపూజ చేయించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో సామాన్య పరిపాలన విభాగం నిమగ్నమైంది. అరేబియా సముద్రంలో శివాజీ స్మారకాన్ని నిర్మించాలని 2001లో ప్రతిపాదించారు. 2004లో అప్పటి కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఈ స్మారకాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. కాని అందుకు వివిధ శాఖల నుంచి అవసరమైన అనుమతులు లభించలేకపోయాయి. 2004, 2009, 2014లో జరిగిన లోక్‌సభ, శాసన సభ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్మారకం విషయాన్ని పొందుపర్చాయి. కాని గత పదేళ్ల నుంచి కేంద్ర పర్యావరణ శాఖ, సీఆర్‌జెడ్ అనుమతుల వలయంలో చిక్కుకుంది. కాని గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో బీజేపీ, శివసేన కూటమి అధికారంలోకి రావడంతో స్మారకం నిర్మాణానికి అవసరమైన అనుమతులన్నీ లభిస్తున్నాయని సాధారణ పరిపాలన విభాగం స్పష్టం చేసింది. రాజ్ భవన్‌కు 1.2 కి.మీ. దూరంలో చర్నిరోడ్ చౌపాటివద్ద తీరం నుంచి మూడు కి.మీ. దూరంలో సముద్రంలో అంతర్జాతీయ స్థాయిలో శివాజీ స్మారకాన్ని నిర్మించనున్నారు. 190 మీటర్ల ఎత్తులో అశ్వాన్ని అధిరోహించిన శివాజీ భారీ విగ్రహం, అక్కడ శివాజీ జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలు, మ్యూజియం, ప్రపంచంలోనే అత్యంత పెద్ద మత్స్యాలయం (ఫిష్ ఆక్వేరియం) ఇలా అనేక ప్రత్యేకతలు ఉంటాయి. -
సాగరజలాల్లో కలకలం
భారత-పాక్ సరిహద్దుల్లో ఒకపక్క తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండగా నూతన సంవత్సర ఆగమనవేళ అరేబియా సముద్రంలో అర్థరాత్రి చోటుచేసుకున్న మరో ఘటన దేశ ప్రజల్ని ఉలిక్కిపడేలా చేసింది. గుజరాత్‌లోని పోర్బందర్కు 365 కిలోమీటర్ల దూరంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక మర పడవను తీర రక్షక దళం ఆధ్వర్యంలోని నౌక ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆ పడవలోని వారు ముందు తప్పించుకుపోవడానికి ప్రయత్నించి, అది విఫలం కావడంతో తమ ను తాము పేల్చుకుని చనిపోయారన్నది ఆ వార్త సారాంశం. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. లొంగిపొమ్మని హెచ్చరిస్తూ మన తీర రక్షక దళం దాదాపు గంటన్నరసేపు పడవను వెంబడించినట్టు ఆ ప్రకటన చెబుతున్నది. పడవలో భారీగా పేలుడు పదార్థాలున్న కారణంగానే పేలుడు సంభవించి, వెనువెంటనే మంటలు వ్యాపించి ఉండొచ్చని తీర రక్షక దళం అధికారులంటున్నారు. ఇలాంటి పడవే మరొకటి ఈ వ్యవహారాన్ని గమనించి తిరిగి పాక్‌వైపు వెళ్లిపోయిందని కూడా చెబుతున్నారు. ఈ ప్రకటనతో పాటే కొన్ని జాతీయ దినపత్రికలు ఆ ఉదంతానికి సంబంధించి స్వీయ కథనాలను ప్రచురించాయి. ఆ పడవ మద్యం లేదా డీజిల్ దొంగరవాణా చేసే స్మగ్లర్లది కావచ్చు నన్నది ఆ కథనాల సారాంశం. మన తీరరక్షక దళం అవసరానికి మించిన బలాన్ని ఉపయోగించిందనీ... లేనట్టయితే ఆ పడవను పట్టుకోవడం సాధ్యమయ్యేదేనని ఆ కథనాలు అంటున్నాయి. సముద్ర జలాల్లో నిరంతరం నిఘా పనిలో ఉండే తీర రక్షక దళం మాత్రమే కాదు...పడవల్లో చేపలు పట్టడానికి వెళ్లే మత్స్యకారులుంటారు. మాదకద్రవ్యా లను, మారణాయుధాలను అక్రమ రవాణాచేసే స్మగ్లర్లుంటారు. వచ్చే పోయే నౌకల్లో సరుకుని దోచుకుపోయే సముద్ర దొంగలుంటారు. వీటన్నిటితోపాటు ఉగ్ర వాదుల బెడద కూడా తక్కువేమీ కాదు. ఏడేళ్లక్రితం ముంబై నగరాన్ని గడగడలా డించి ఎందరినో పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు పాకిస్థాన్నుంచి పడవల్లోనే వచ్చారు. సముద్ర జలాల్లో అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించి విస్పష్టమైన విభజ న రేఖ గీయడం సాధ్యంకాదు గనుక మన మత్స్యకారులు పొరబాటున సరిహ ద్దును అతిక్రమించి పాక్ పరిధిలోని జలాల్లోకి వెళ్లడం, అటువారు కూడా ఈ తరహా లోనే ఇటుగా రావడం తరచు జరుగుతుంటుంది. అలాంటి సందర్భాల్లో మత్స్యకా రులను అదుపులోకి తీసుకుంటారు. అరెస్టయినవారు మత్స్యకారులేనని, వారు పొరపాటున సరిహద్దు దాటి వచ్చారని నిర్ధారణ అయ్యాక విడుదల చేయడం సాధారణమే. అయితే ఇలాంటివన్నీ ఇరు దేశాలమధ్యా చర్చలున్నప్పుడు ‘సుహృద్భావపూర్వకంగా’ చేసే పనులు. ఈలోగా ఎన్ని నెలలు, సంవత్సరాలు గడిచినా గడవొచ్చు. అంతవరకూ ఆ మత్స్యకారులు పరాయిదేశం జైల్లో బందీలు గా ఉండకతప్పదు. ఈ సమస్య భారత-పాక్‌ల మధ్యే కాదు...శ్రీలంక, బంగ్లాదేశ్‌ల వైపున్న సరిహద్దు జలాల్లో కూడా ఉంది. గుజరాత్ తీరంనుంచి చేపల వేటకు రెండు పడవల్లో వెళ్లిన భారత మత్స్యకారులు పన్నెండుమందిని పాకిస్థాన్ తీర రక్షక దళం నిర్బంధించిందని తాజా వార్తలు చెబుతున్నాయి. అయితే, పోర్బందర్ తీరం సమీపంలో చోటుచేసుకున్న ఘటన కూడా మత్స్యకారులకు లేదా స్మగ్లర్లకు సంబంధించిందేనని కొట్టిపారేయగలమా? అందు లోనూ ముంబై నరమేథం జరిగాక కూడా అలా అనుకోవడం సాధ్యమేనా? పాకిస్థాన్‌లోని కేతిబందర్నుంచి కొందరు వ్యక్తులు రెండు పడవల్లో గుజరాత్‌వైపు బయల్దేరారని కొన్ని ఫోన్ సంభాషణలద్వారా జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థ(ఎన్టీఆర్ఓ) విన్నదని, దాని ఆధారంగానే అన్ని విభాగాలూ తీర రక్షక దళంతో సమన్వయం చేసుకుని ఈ దాడి జరిపాయని అధికారులంటున్నారు. మన దేశానికి మూడు వైపులా దాదాపు 7,600 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉన్నది. ముంబై ఘటన ఉదంతం తర్వాత తీర ప్రాంత రక్షక దళాన్ని పటిష్టం చేయడంతోపాటు మెరైన్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం, ఆ విభాగానికి చెందిన సిబ్బంది గస్తీ కూడా పెరిగింది. నిఘా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, సంబంధిత విభాగాలకు చేరేయడం వంటివి జరుగుతున్నాయి. పోర్బందర్ ఘటన అలాంటి చర్యల పర్యవసానంగానే జరిగిం దని అధికారులు చెబుతున్నారు. భూభాగంపై ఉండే సరిహద్దుల్లో ఏమవుతున్నదో తెలుసుకోవడమే సాధారణ పౌరులకు కష్టం. ఇక సముద్ర జలాల్లో అంతర్జాతీయ హద్దుల వద్ద ఏం జరిగి ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఫలానావిధంగానే జరిగిందని చెప్పడానికి ఆస్కారం ఉండదు. ఇలాంటి స్థితిలో పోర్బందర్ ఉదంతంపై కాంగ్రెస్, బీజేపీలు రెండూ పరస్పర విమర్శలకు దిగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎలాంటి సాక్ష్యాధారాలూ మిగల్చకుండా చేసి ఒక పెద్ద ఉగ్రవాద దాడి నుంచి దేశాన్ని కాపాడామని చెబితే ఎలా అని కాంగ్రెస్ అంటున్నది. ఇందులో అసలు జరిగిందేమిటో, ఏ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నదో చెప్పాలని ఆ పార్టీ కోరుతున్నది. కాంగ్రెస్ వ్యవ హార శైలి పాకిస్థాన్‌కు ఉపయోగపడేలా ఉన్నదని బీజేపీ ప్రత్యుత్తరమిచ్చింది. సరిగ్గా ముంబై దాడి సమయంలోనూ ఆ రెండు పార్టీలమధ్యా ఇలాంటి మాటల యుద్ధమే జరిగింది. అయితే పోర్బందర్ ఉదంతంలో అసలు జరిగిందేమిటో, ఎవరెవరి ప్రమేయమున్నదో వెల్లడించడానికి ఇంకా సమయం ఉంది. ఆ పడవకు సంబంధించిన శకలాలపై ఫోరెన్సిక్ పరీక్షలు పూర్తికావాలి. ఎన్టీఆర్ఓ నుంచి ఈ ఉదంతానికి సంబంధించిన ఆడియో టేపులు, ఇతర సమాచారం మొత్తాన్ని తాము తెప్పించుకుంటున్నామని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాటిని ఇంకా విశ్లేషించాలి. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చాక కేంద్ర ప్రభుత్వం మరిన్ని వివరాలతో సమగ్ర సమాచారాన్ని అందించగలదని, అందులో అందరి సందేహాలకూ జవాబులు లభిస్తాయని ఆశించాలి. -
నిలోఫర్ తుపానుగా మారనున్న వాయుగుండం
ముంబై/విశాఖపట్నం: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం నిలోఫర్ తుపానుగా మారనుంది. ఇది ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతోంది. ముంబైకి నైరుతి దిశగా 1270 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ దిశగా పయనించి ఒమన్, మెయెన్ దేశాల తీరంవైపు వెళ్లవచ్చని తెలుస్తోంది. అయితే, గుజరాత్, దక్షిణ పాకిస్తాన్ల వైపు కూడా వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ కారణంగా కర్ణాటక, తెలంగాణ మీదగా అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో సౌరాష్ట్ర, కచ్, కోస్తా తీర ప్రాంతాలలో ఈ నెల 30న భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గుజరాత్ తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున గుజరాత్ తీరప్రాంత మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ వాయుగుండ ప్రభావం వల్ల తెలంగాణలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 31నాటికి ఈ వాయుగుండం గుజరాత్, పాకిస్తాన్ లకు ఆనుకుని ఉన్న ప్రాంతాలలో తీరం దాటే అవకాశం ఉంది. ఇది తీరం దాటే సమయంలో తెలంగాణపై కొంత ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ** -
వర్షార్పణం
అల్పపీడన ద్రోణి ప్రభావంతో శనివారంనుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 43.3మి.మీ నమోదైంది. రికార్డుస్థాయిలో దామరచర్ల మండలంలో 158.2 మి.మీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి పొలాలు నేలవాలాయి. పత్తి తడిసిపోయింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. నీలగిరి : అరేబియా సముద్రంలో సంభంవించిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక చోట్ల చేతికొచ్చిన పంట పొలాలు నేలకొరిగాయి. పలు చోట్ల పత్తి తడిసిపోవడంతో అపార నష్టం వాటిల్లింది. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైన దామరచర్ల మండలంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక వ్యవసాయ మార్కెట్లలో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిముద్దయ్యింది. మార్కె ట్లలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహించారు. మార్కెట్లలో సకాలంలో ధాన్యం కొనుగోళ్లు జరపకపోవడంతో వర్షం ధాటికి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. తడిసిన ధాన్యాన్ని తరుగు పేరుతో కోత పెట్టి కొనుగోలు చేస్తున్నారు. హాలియా వాగు, పేరూరు సోమసముద్రం చెరువు, రాజవరం, తిరుమలగిరి చెరువు వెంట 50 ఎకరాల్లో వరిచేలు నీటమునిగాయి. నిడమనూరు మండలం తుమ్మడం, కుంటిగోర్ల గూడెం, వల్లభాపురం, బాలాపురం, రాజన్నగూడెం, నిడమనూరు గ్రామాల్లో చిలుకలవాగు వెంట 100 ఎకరాలు నీటిముగింది. పెద్దవూర మండలంలో పెద్దవాగు ఉప్పొంగి ప్రవ హిస్తోంది. పేరూరు సోమసముద్రం చెరువునీరు రోడ్డుపై ప్రవహించడంతో హాలియా- పేరూరు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హుజూర్నగర్ మండలంలో లింగగిరి- సర్వారం మధ్య బండలరేవు వాగు, శ్రీనివాసపురం- అమరవరం మధ్య పిల్లవాగు, బూరుగడ్డ- గోపాలపురం మధ్య నల్లచెరువు అలుగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లింగగిరి చిన్న చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుమారు 70 ఎకరాలలో వరి నీట మునిగింది. గరిడేపల్లి , నేరేడుచర్ల మండలాల్లో సుమారు 14 వందల ఎకరాల్లో వరిచేలు నేలకొరిగాయి. మఠంపల్లి మండలంలోని చౌటపల్లి సమీపంలో గల ఈదులవాగు పొంగిప్రవహించడంతో 50 హెక్టార్లలో వరిచేలు నీటి మునిగాయి. మేళ్లచెర్వు మండలంలో పత్తి పంటకు అపార నష్టం వాటిల్లింది. మిర్యాలగూడ మండలంలో ఐలాపురం, కిష్టాపురం గ్రామాలలో వంద ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. దామరచర్ల మండలంలోని వీరభద్రాపురంలో ఇళ్లలోకి నీరు చేరింది. దాంతో పాటు దామరచర్ల - అడవిదేవుపల్లి గ్రామాల మధ్య అన్నమేరు వాగుపొంగడం, దామరచర్ల - జాన్‌పహాడ్ మధ్య బుగ్గవాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అదే విధం గా సుమారు 100 ఎకరాల్లో పత్తి, 30 ఎకరాల వరి నీట మునిగింది. మరో 30 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. రామన్నపేట మండలంలో 10వేల ఎకరాల్లో పత్తికి నష్టం వాటిల్లింది. కట్టంగూరు మండలంలో కురుమర్తిలోని ఐకేిపీ కేంద్రంలో 50 బస్తాల ధాన్యం తడిసిముద్దయింది.నల్లగొండ మార్కెట్‌యార్డులో వర్షపు నీరు నిలిచి 6 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసి ంది. తడిసిన ధాన్యాన్ని ఆదివారం కొనుగోలు చేశారు.తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. క్వింటాకు బస్తాతో కలిపి 9 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు రూ. 1250 మాత్రమే చెల్లిస్తున్నారు. మునుగోడు, చండూరు మండలాల్లో కూడా పంటలకు నష్టంవాటిల్లింది. చౌటుప్పుల్ మార్కెట్ యార్డులో 45 కుప్పలు, నల్లగొండ మార్కెట్ యార్డులో 35 కుప్పలు, భువనగిరి మార్కె ట్‌యార్డులో 20 కుప్పలు, రామన్నపేటలో 60 కుప్పలు నిల్వ ఉన్నాయి. ఐకేపీ కేంద్రాల్లో కూడా ధాన్యం నిల్వలు ఉన్నాయి. వర్షం కారణంగా ధాన్యం రంగు మారే అవ కాశం ఉంది. దీంతో ధాన్యం రంగు మారిందన్న సాకుతో కొనుగోలు చేసేందుకు మిల్లర్లు నిరాకరించడమేగాక, కొ నుగోలు కేంద్రాలలో కూడా రైతుల నుంచి ధాన్యం కొనేందుకు ఒప్పుకునే పరిస్థితులు కనిపించడం లేదు. -
అరేబియా సముద్రంలో కొనసాగుతున్న వాయుగుండం
విశాఖపట్నం: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముంబైకి పశ్చిమనైరుతి దిశగా 1135 కిలోమీటర్ల దూరంలో ఆ వాయుగుండం కేంద్రీకృతమైందని తెలిపింది. కర్ణాటక నుంచి దక్షిణ కోస్తా వరకు అల్పపీడన ద్రోణి వ్యాపించి ఉందని పేర్కొంది. దీంతో కోస్తా, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. అలాగే దక్షిణ కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం రాత్రి నుంచి కనిష్ట ఉష్టోగ్రతలు తగ్గి చలి పెరిగే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
అరేబియా సముద్రంలో తుపాను
సాక్షి, విశాఖపట్నం/పుణే: తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం కాస్తా బలపడి పెను తుపానుగా మారింది. నానౌక్ అని పేరుపెట్టిన ఈ తుపాను ప్రస్తుతం ముంబైకి 720 కి.మీ. దూరంలో పశ్చిమ నైరుతి దిశగా ఒమన్ తీరం వైపు పయనిస్తోన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దేశ పశ్చిమ తీరంలో భారీ గాలులు వీయడంతోపాటు, వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వెల్లడించింది. అలాగే ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కోస్తాం ధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలి పింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వడగాల్పుల ప్రభావం కొనసాగుతోంది. కోస్తాం ధ్రల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. కాగా.. కేరళకు పూర్తిగా వ్యాపించి ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్న నైరుతి రుతుపవనాలు బుధవారం నాటికి కర్ణాటక, గోవాలోని పలు ప్రాంతాలకు మహారాష్ట్రలోని కొంకణ్‌కూ విస్తరించాయని వెల్లడించింది. -
ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కిం పు ప్రశాంతంగా ముగిసింది. అధికారుల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి అవాంతరాలు లేకుండా కౌంటింగ్ పూర్తయింది. అయితే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ రసవత్తరంగా సాగింది. చివరి వరకు ఏ పార్టీకి విజయం వరిస్తుందో తెలియక అందరిలోను ఉత్కంఠ రేపింది. సాయంత్రం ఆరు గంటల వరకూ చోడవరం, పాయకరావుపేట ఫలితాలు తేలలేదు. జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ, 3 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. అనకాపల్లి లోక్‌సభకు వచ్చిన పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ సాయంత్రం 7 గంటల వరకు సాగింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఒకవైపు చేపడుతుండగానే ఉదయం 8.30కు ఈవీఎంలను స్ట్రాంగ్‌ల రూమ్‌లను తీసుకువచ్చారు. ఉదయం 9 నుంచి కౌంటింగ్ ప్రారంభించారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు వేరువేరుగా 14 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించారు. భీమిలి నియోజకవర్గానికి అధికంగా 22 రౌండ్లు లెక్కింపు జరగగా, మాడుగులకు తక్కువగా 14 రౌండ్లుగా చేపట్టారు. ముందుగా ఈ నియోజకవర్గం ఫలితమే వెల్లడైంది. అనకాపల్లి లోక్‌సభ ఫలితం అన్నింటికంటే ఆలస్యంగా సాయంత్రం 7.30కు వచ్చింది. గెలిచిన అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాలకు వచ్చి సందడి చేశారు. రిటర్నింగ్ అధికారులు వారికి డిక్లరేషన్లు ఇచ్చారు. అన్ని కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చు కున్నారు. -
కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
విశాఖ: అరేబియా సముద్రంలో కేరళ ఉత్తర తీరం వద్ద ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. అల్పపీడన ద్రోణి వల్ల తెలంగాణ, కోస్తాంధ్రల్లో మరో 48గంటల వరకు అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రభావం రాయలసీమ జిల్లాలపై ఉంటుందని తెలిపారు. తెలంగాణలో క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో భారీ వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2 నుంచి 4 సెంటీగ్రేడ్ల మేరకు పగటి ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. ఇక రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. *కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ వర్షం, తడిచిన ధాన్యం, ఆందోళనలో రైతన్నలు *తూర్పు గోదావరి జిల్లాలో ముమ్మిడివరం, ఉప్పలగుప్పంలో వర్షం *పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, తణకు, ఉండ్రాజవరం... భీమవరం, ఉండి, పాలకోడేరు, పాలకొల్లు, తాళ్లపూడిలో వర్షం *నల్లగొండ జిల్లా శాలిగౌరారం, నకిరేకల్‌లో వర్షం * మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం, మహబూబ్‌నగర్, జడ్చర్ల,వనపర్తి, నాగర్‌కర్నూలు మార్కెట్లలో తడిసిన ధాన్యం -
అకాల వర్షాలతో నలుగురి మృతి
తిరువనంతపురం/న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్రంలో కేరళ ఉత్తర తీరం వద్ద ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా గురువారం దక్షిణాదిన పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాల రాకకు ముందే ఈదురు గాలులతో విరుచుకుపడ్డ అకాల వర్షాల తాకిడికి కేరళలో ఇద్దరు, తమిళనాడులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మళప్పురంలో ఒకరు, తిరువనంతపురంలో ఒక మహిళ మరణించినట్లు కేరళ అధికారులు తెలిపారు. తమిళనాడు నీలగిరి జిల్లాలో చెట్లు విరిగి పడటంతో తేయాకు తోటల్లో పనిచేసే ఇద్దరు మహిళలు మరణించారు. కేరళలోని ఎర్నాకుళం జంక్షన్లో రైలు పట్టాలు నీటమునగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా రూ.110 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు కేరళ రెవెన్యూ మంత్రి ఆదూర్ ప్రకాశ్ తెలిపారు. కోచి విమానాశ్రయంలో అత్యధికంగా 191.6 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అకాల వర్షాలకు భూతాపోన్నతే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అకాల వర్షాల కారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేరళ ఉత్తర తీరం వద్ద నుంచి మహారాష్ట్ర వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో కొన్నిచోట్ల రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
శివాజీ స్మారకం పనులపై సర్కార్ దృష్టి
సాక్షి, ముంబై: నగరానికి ఆనుకుని ఉన్న అరేబియా సముద్రంలో అశ్వం అధిరోహించిన భారీ శివాజీ విగ్రహం (స్మారకం) ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అనుమతి కోసం కేంద్ర పర్యావరణ శాఖకు పంపిన ప్రతిపాదనకు వారం రోజుల్లో ఆమోదం లభించే అవకాశాలుండడంతో పనులు ప్రారంభించడంపై దృష్టి సారించింది. ‘సముద్రం ఒడ్డు నుంచి కిలోమీటరున్నర లోపల నీటిపై భారీ ప్లాట్ఫారం నిర్మించనున్నాం. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో స్మారకాన్ని ఏర్పాటుచేస్తాం. దీనికోసం రూ.1,400 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింద’ని ముంబై జిల్లా ఇన్చార్జి మంత్రి, స్మారక నిర్మాణ కమిటీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ బుధవారం మీడియాకు తెలిపారు. పనులు ప్రత్యక్షంగా ప్రారంభించిన తర్వాత పూర్తికావడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుందన్నారు. స్మారక నమూన (ఊహా చిత్రాన్ని) జేజే స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యార్ధులు రూపొందించారని వివరించారు. స్మారకాన్ని సందర్శించేవారు వెళ్లాల్సిన స్టీమర్ సేవలను కూడా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.