న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం దక్షిణ గుజరాత్ తీరప్రాతానికి 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా అల్పపీడనం బలపడి ఈ నెల 16 నాటికి తుపాన్‌గానూ, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర, అతి తీవ్ర తుపాన్‌గా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న నాలుగు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడున్నాయని పేర్కొంది.
ఈ తుపానుకు 'తౌక్టే' అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది. 'తౌక్టే' తీవ్ర తుపానుగా మారి ఈనెల 18న గుజరాత్ వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా తౌక్టే' తుపాన్ ప్రభావంతో కేరళలో భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ, యానాం, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రపై తుపాను ప్రభావం ఉండనుందని, అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో ‘తౌక్టే’ ప్రభావం
అరేబియా సముద్రంలో లక్షద్వీప్ వద్ద అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ గుజరాత్ తీర ప్రాంతానికి 920 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుఫాన్.. మరో 12 గంటల్లో తీవ్రమైన తుఫానుగా రూపాంతరం చెందనుందని వాతావరణ కేంద్ర తెలిపింది. ఆ తర్వాత అతి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉందని. గుజరాత్ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను ప్రభావంతో ఏపీ, తెలంగాణ, రాయలసీమ పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయని, ఋతుపవనాల రాకకు ఇది శుభ సంకేతమని వాతావరణ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment