low pressure
-
స్థిరంగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం
మహారాణిపేట: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో ఇది వాయవ్యంగా ఉత్తర తమిళనాడు, దక్షణ ఆంధ్రా దిశగా ఏపీ తీరానికి ఆనుకుని ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల బుధవారం కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో శీతల వాతావరణం నెలకొంది. గురువారం కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, విశాఖ, అల్లూరి జిల్లా, విజయనగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
AP: స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అనంతరం దిశ మార్చుకుని పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.18వ తేదీన ఉదయం తమిళనాడు రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపారు. తీరం వెంబడి 30 నుంచి 35 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులు ఈ నెల 18 వరకూ వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
నేడు అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, చెన్నై: అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. అనంతరం తమిళనాడు ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. అల్పపీడన ప్రభావంతో కోసాంధ్ర జిల్లాల్లో ఈ నెల 17 తరువాత అక్కడక్కడా మోస్తరు వానలు పడే సూచనలున్నాయని తెలిపారు. తమిళనాడులో భారీ వర్షాలు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాశి జిల్లాలను వర్షం ముంచెత్తడంలో జనజీవనం స్తంభించింది. ఈశాన్య రుతుపవనాల సీజన్లో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల క్రితం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం తీరాన్ని తాకినప్పటి నుంచి తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాశి జిల్లాలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు తామర భరణి నదిలో ప్రవహిస్తుండటంతో తీరగ్రామాల ప్రజల్లో ఆందోళన ఉధృతమైంది. విరుదునగర్ జిల్లా శివకాశీ సమీపంలోని ప్రమాదవశాత్తూ నీటి గుంటలో పడి రాజేశ్వరి (32), ఆమె కుమారుడు దర్శన్ (5) మరణించారు. -
తీరం దాటిన తీవ్ర అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ తమిళనాడు దగ్గర అర్థరాత్రి తీరం దాటింది. తీరం దాటిన తర్వాత శుక్రవారం ఉదయం నాటికి బలహీనపడనుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తమిళనాడులో వర్షాలు జోరందుకోనున్నాయి.తీవ్ర అల్పపీడన ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం కూడా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో పొడి వాతావరణం ఉండనుంది. -
వాయు‘గండం’ లేనట్లే.!
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల ఫెంగల్ తుపాన్‌తో వణికిన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు.. మరోసారి అదే వైపుగా అల్పపీడనం వస్తుండటంతో ఆందోళనకు గురవుతుండగా.. ఆ భయం వద్దని వాతావరణశాఖ ధైర్యం చెప్పింది. దీని ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండదని స్పష్టం చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది వాయుగుండంగా బలపడిన తర్వాత.. శ్రీలంక, తమిళనాడు తీరాలవైపుగా పయనించి అక్కడే తీరం దాటే సూచనలున్నాయని వెల్లడించారు. ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. గురువారం కోస్తా జిల్లాల్లో వాతావరణం మేఘావృతంగా ఉంటుందని పేర్కొన్నారు. -
కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది సోమవారం సాయంత్రానికి బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఆ తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 11 నాటికి నైరుతి బంగాళాఖాతానికి చేరుతుందని వెల్లడించారు. అనంతరం తమిళనాడు–శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావం తమిళనాడు రాష్ట్రంపై అధికంగా ఉన్నప్పటికీ.. దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కూడా కాస్త ప్రభావం చూపుతుందని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం నుంచి అక్కడక్కడా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వివరించారు. అదేవిధంగా ఈ నెల 17వ తేదీన అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఇది 20వ తేదీ తర్వాత బలపడే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఉన్న ఆవర్తనం ప్రభావంతో శనివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కొనసాగుతూ 11వ తేదీ నాటికి శ్రీలంక–తమిళనాడు తీరాల సమీపానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణాజిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
AP: వాయుగుండం ముప్పు!
సాక్షి, అమరావతి/వాకాడు: దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాలపై కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సాయంత్రం ఇది 30 కిలో మీటర్ల వేగంతో కదులుతూ ట్రింకోమలీకి 530 కి.మీ, నాగపటా్ననికి 810 కి.మీ, పుదుచ్చేరికి 920 కి.మీ, చెన్నైకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడనుంది.ఆ తర్వాత రెండు రోజుల్లో వాయవ్య దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 29వ తేదీ వరకు దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి మంగళవారం గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురిసే జిల్లాలు ఇవీ... ఈ నెల 26, 27, 28 తేదీల్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 29వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎగసిపడుతున్న కెరటాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో సముద్ర తీరంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. తిరుపతి జిల్లాలోని చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల పరిధిలోని సముద్ర తీర ప్రాంతంలో సోమవారం అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వాకాడు మండలం తూపిలిపాళెం వద్ద సముద్ర కెరటాలు దాదాపు ఏడు అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. సముద్రం మూడు మీటర్లు ముందుకు వచ్చింది. పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. ముందు జాగ్రత్తగా స్థానిక మత్స్యకారులు తమ బోట్లను ఒడ్డుకు చేర్చుకుని భద్రపరుచుకున్నారు. -
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రం–ఆగ్నేయ బంగాళాఖాతంపై విస్తరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో 25న వాయుగుండంగా బలపడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ తదుపరి రెండు రోజుల్లో తమిళనాడు–శ్రీలంక తీరాల వైపు వెళ్లి.. తీరం దాటనుందని వెల్లడించారు. దీని ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 27 నుంచి మూడురోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 35 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయనీ.. వాయుగుండంగా బలపడిన తర్వాత గాలుల ఉద్ధృతి పెరగనుందన్నారు. 26వ తేదీ నుంచి దక్షిణ కోస్తా తీరం వెంబడి గరిష్టంగా 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని 29వ తేదీ వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. -
ఎడతెరిపిలేని వాన
సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామునుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో విద్యాసంస్థలకు అత్యవసరంగా సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా సగటున 54.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి జిల్లాలో సగటున 25.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.ఒంగోలు బస్టాండ్ సెంటర్ సహా నగరంలోని కాలనీలన్నీ జలమయం అయ్యాయి. జల వనరుల శాఖ ఎస్ఈ కార్యాలయ భవనంలోకి వర్షం నీరు చేరింది. వైఎస్సార్ జిల్లాలో చిరుజల్లులు కురిశాయి. సిద్ధవటంలో అత్యధికంగా 29.6 మి.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా చిల్లకూరు, వాకాడు, తడ మండలాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం నుంచి భీకర శబ్దాలు వెలువడుతున్నాయి. సముద్రాన్ని చూసేందుకు వెళ్లే వారిని స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపేస్తున్నారు.తిరుమలలో హై అలర్ట్ తిరుమల: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 48 గంటల్లో తిరుమలలో విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులంతా సంసిద్ధంగా ఉండాలని కోరారు.కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్య శాఖ అంబులెన్సులను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం సిద్ధంగా ఉండాలన్నారు. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఈనెల 16న బుధవారం శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ దృష్ట్యా 15న మంగళవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.రైళ్ల రాకపోకలకు అంతరాయం తెనాలి రూరల్: భారీ వర్షాల కారణంగా చెన్నై–విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు పొన్నూరు–బాపట్ల స్టేషన్ల మధ్య డౌన్ లైన్ వద్ద భూమి కుంగుతోంది. దీని కారణంగా పట్టాలు దెబ్బతిని రైళ్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండడంతో ఈ డౌన్ లైన్లో మాచవరం స్టేషన్ వద్ద నుంచి రైళ్ల రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపడుతున్నారు. ఈ కారణంగా పలు రైళ్లను బాపట్ల, చీరాల, ఒంగోలులో నిలిపివేశారు. చెన్నైలో ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురై, కోయంబత్తూరు తదితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం, శివారులలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు అతి భారీ వర్ష సూచనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం ఈ నాలుగు జిల్లాలలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఈ నెల 18 వరకు వర్క్›ఫ్రం హోం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. -
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలే
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఈశాన్య రుతుపవనాలు ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలోనే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలపడి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. రాబోయే రెండు రోజుల్లో ఇది వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.ఇది దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలకు చేరుతుందని.. ఆ తర్వాత రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలవైపు చేరే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 40నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.నేడు వర్షం కురిసే జిల్లాలుఅల్పపీడనం ప్రభావంతో మంగళవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.16న భారీ వర్షాలుదీని ప్రభావం వల్ల బుధవారం బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.17న వర్షాలు కురిసే జిల్లాలు17వ తేదీన గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.కలెక్టర్లకు సీఎస్ సూచనలుభారీ వర్షాల హెచ్చరికలతో నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ సోమవారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాతో కలిసి ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెన్నా పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. ఒరిగిన విద్యుత్ స్తంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ కింద ఉండరాదన్నారు. పాత భవనాలను వదిలి ముందుగానే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా బలపడిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కొనసాగనున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.ఎన్టీఆర్ జిల్లా: మున్నేరులో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైక్ ద్వారా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ఇదీ చదవండి: వరదను మించిన విపత్తు బాబే!వరద ప్రభావిత గ్రామాలైన కంచల, ఐతవరం, దామూలూరుతో పాటు పలు గ్రామాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. ప్రస్తుతం నందిగామ వద్ద మున్నేరుకు 65,000 క్యూసెక్కుల వరద చేరుకుంది. 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపైకి వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్‌కు తప్పిన అల్పపీడనం ముప్పు... భారీ వర్షాలకు విరామం.. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు అల్పపీడనం పయనం
-
మరికొద్దిగంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: మరికొద్ది గంటల్లో బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనం ఏర్పడనుంది. క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేటి నుంచి మరో నాలుగు రోజులు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటే అవకాశ ఉంది. ఆదివారం వరకు మత్స్యకారుల హెచ్చరికలు కొనసాగనున్నాయి. ఉత్తరాంధ్ర సమీపంలో రుతుపవన ద్రోణి కొనసాగుతోంది.తూర్పుగోదావరి: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరికి వరద పెరుగుతోంది. నీటిమట్టం 10.7 అడుగులకు చేరుకుంది. 8 లక్షల 37 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భారీగా నీరు బ్యారేజీ నుంచి విడుదల కావడంతో కోనసీమలో కాజ్‌వేలు నీటమునుగుతున్నాయి. గంటి పెదపూడి లంక, కనకాయ లంక కాజ్‌వేలు మీదుగా వరదనీరు ప్రవహిస్తోంది. పలు లంక గ్రామాలకు పడవలపై రాకపోకలు కొనసాగుతున్నాయి.చింతూరు ఏజెన్సీలో వరద భయం మరోసారి మొదలైంది. మూడు రోజులుగా ఏజెన్సీతో పాటు, ఎగువన కురుస్తున్న వర్షాలకు శబరి, గోదావరి నదులకు భారీగా వరదనీరు చేరుతోంది. విఆర్ పురం మండలం పరిధిలో 28 గిరిజన గ్రామాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. కొండవాగులు పొంగి ప్రవహించడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
ఏపీకి మరో గండం.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: వాయుగండం ముప్పు తొలగిపోయిందని ఏపీ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలో మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఈనెల 5న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్ప పీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.అల్పపీడనం బలపడటానికి అనుకూలంగా రుతుపవన ద్రోణులు ఉన్నాయి. వచ్చే 24 గంటల్లో కృష్ణ, గుంటూరు జిల్లాలకు మరోసారి వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 24 గంటల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.. దీంతో వరద ముంపు పెరిగే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూ.గో, ఏలూరు,బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. -
తీరం దాటిన వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని గడగడలాడించిన వాయుగుండం కళింగపట్నం సమీపంలో అదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో తీరం దాటింది. భూమిపైకి చేరి దక్షిణ ఒడిశా మీదుగా ఛత్తీస్‌గఢ్ వైపు ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది గంటకు 17 కి.మీ. వేగంతో కదులుతోంది. ఇది పశి్చమ వాయువ్య దిశగా కదులుతూ తెలంగాణకు తూర్పున రామగుండం ప్రాంతానికి 310 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా కదులుతూ సోమవారం మధ్యాహా్ననికి బలహీనపడి అల్పపీడనంగా మారనుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి స్టెల్లా తెలిపారు.దీనికి అనుగుణంగా దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మీదుగా రుతుపవన ద్రోణి పశి్చమ మధ్య బంగాళాఖాతం వరకూ కొనసాగుతోందని వెల్లడించారు. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘అస్నా’ తుపాను ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందన్నారు.వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం నుంచి పరిగణనలోకి తీసుకుంటే కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలులో 24.25 మి.మీ., గోకవరంలో 14, మాకవరపాలెం, సాలూరులో 13, మద్దిపాడు, బాడంగిలో 12.5 మి.మీ.వర్షపాతం నమోదైంది.ముంచుకొస్తున్న మరో తుపాను! ఈ నెల 6, 7 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా మీదుగా పయనించి రెండు ప్రాంతాల మధ్యలో తీరం దాటనుందని భావిస్తున్నారు. ఈ అల్పపీడనంపై రెండు రోజుల్లో కచ్చితమైన సమాచారం అందుతుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో 6వ తేదీ సాయంత్రం నుంచి మళ్లీ రాష్ట్రంలో మోస్తరు వానలు విస్తారంగా కురుస్తాయని అధికారులు వెల్లడించారు. -
ఉత్తరాంధ్ర వైపు అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా ఉత్తరాంధ్ర వైపు దూసుకురానుంది. ఈ నెల 31న విశాఖపట్నం సమీపంలో తీరాన్ని దాటే సూచనలు కనిపిస్తున్నాయి. తీవ్ర అల్పపీడనం తీరం దాటిన తర్వాత.. మరింత బలపడి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వైపు ప్రయాణిస్తూ సెప్టెంబర్ 2 నాటికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. శుక్ర, శనివారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. కోస్తా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. -
Telangana: రెండు రోజులు వర్షాలే.. వర్షాలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం వాయుగుండం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి గురువారం రాత్రి తీవ్ర అల్పపీడనంగా మారి శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వివరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ రెడ్అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ... మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచి్చంది. శుక్రవారం రాష్ట్రంలో సగటున 2.77 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో శుక్రవారం నాటికి రాష్ట్రంలో సగటున 25.76 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 31.32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలో ఒకరి గల్లంతు ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం తానిçపర్తికి చెందిన బానారి రాజు (45) గోదావరిలో గల్లంతయ్యాడు. చేపల వేటకని గురువారం వెళ్లిన రాజు శుక్రవారం ఉదయం వరకు రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మహదేవపూర్ మండలం అన్నారం వైపు నుంచి దామెరకుంట వైపుగా ట్రాలీ ఆటో గుండ్రాత్‌పల్లి సమీపంలో గల అలుగువాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్ అప్రమత్తమై ఆటో ఎక్కి అరవడంతో గమనించిన స్థానికులు రక్షించారు. -
వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. రాగల 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతారణ కేంద్రం తెలిపింది. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, తెలంగాణపై దీని ప్రభావం నేడు, రేపు ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. హైదరాబాదులో సాయంత్రం మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఈ తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం రోజు అయిదు జిల్లాలు(కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం) జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలతోపాటు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.రెడ్ అలెర్ట్ ప్రకటించిన జిల్లాల్లో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్న కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అదే విధంగా ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ (భారీ వర్షాలు)జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్ నగరంలో నేటి సాయంత్రం(శుక్రవారం)మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కురిసే అకవాశం ఉందని పేర్కొంది.మరోవైపు వాయుగుండగా బలపడిన అల్పపీడనం రేపు ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది. ఈ మేరకు కొస్తా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీరం వెంబడి అత్యధికంగా గంటకు 65 కిమీ వేగంతో గాలులు స్తుండటంతో వేటకు వెళ్ళారాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది.ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రమాదస్థాయిలో ఏలూరు జిల్లా వేలేరుపాడు జలాశయం ప్రవహిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. -
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్, యానాంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగాళాఖాతంలో ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం నెమ్మదిగా బలపడుతూ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.అదే రోజున అల్పపీడనం ఏపీ తీరాన్ని తాకనుంది. దీని ప్రభావంతో 26వ తేదీ సాయంత్రం నుంచి రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ముసురు వాతావరణం ఏర్పడనుంది. బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాలోలతో పాటు కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 27, 28 తేదీల్లో అనేక చోట్ల విస్తారంగా వానలు కురుస్తాయని వెల్లడించారు. -
బంగాళాఖాతంలో నేడు తుపాను
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయం మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. ఇది ఈశాన్య దిశగా పయనిస్తూ తూర్పు మధ్య బంగాళాఖాతంలో బంగ్లాదేశ్‌లోని ఖేపుపరాకు దక్షిణ నైరుతి దిశలో 700 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలండ్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో 660 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో శనివారం ఉదయానికి తుపానుగా మారనుంది. అనంతరం ఉత్తర దిశగా పయనిస్తూ శనివారం రాత్రికి తీవ్ర తుపానుగా బలపడనుంది. తరువాత అదే దిశలో కదులుతూ ఆదివారం అర్థరాత్రి పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలండ్, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరాల మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.దీని ప్రభావంతో శనివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లోను, ఆదివారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎనీ్టఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. కర్నూలు జిల్లాలో 14.7 సెంటీమీటర్ల వర్షపాతం శుక్రవారం కర్నూలు, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లా తళ్లగోకులపాడులో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాకినాడలో 10.3, యలమంచిలి (అనకాపల్లి జిల్లా) 4.5, నెల్లిమర్ల (విజయనగరం) 4.3, చింతపల్లి (అల్లూరి సీతారామరాజు)లో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మళ్లీ వడగాడ్పుల ఉధృతి తుపాను ప్రభావం రాష్ట్రంపై లేకపోవడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో వడగాడ్పులు క్రమంగా ఉధృతమవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో తొమ్మిది మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శనివారం 35 (విజయనగరం జిల్లాలో 15, శ్రీకాకుళంలో 10, పార్వతీపురం మన్యంలో 5, అనకాపల్లిలో 5) మండలాల్లో వడగాడ్పులు, ఆదివారం 14 (పార్వతీపురం మన్యం జిల్లాలో 6 శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 4) మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 64 (విజయనగరం జిల్లాలో 20, శ్రీకాకుళంలో 17, పార్వతీపురం మన్యంలో 8, కృష్ణాలో 7, అనకాపల్లిలో 6, విశాఖపట్నంలో 2, ఏలూరులో 2, తూర్పు గోదావరిలో 1, బాపట్లలో 1) మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా 25వ తేదీ ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుపానుగా, ఆ తర్వాత తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 26 నాటికి బంగ్లాదేశ్, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నట్లు వివరించింది. గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్టంగా ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీ సెల్సీయస్, కనిష్టంగా హనుమకొండ 21.0 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. ప్రణాళికా విభాగం వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా అర్లి ప్రాంతంలో గరిష్టంగా 44.4 డిగ్రీ సెల్సీయస్, కామారెడ్డి జిల్లా డొంగ్లిలో 43.1 డిగ్రీ సెల్సీయస్, నిజామాబాద్ జిల్లా కల్దుర్కిలో 42.9 డిగ్రీ సెల్సీయస్, మంచిర్యాల జిల్లా వెల్గటూరులో 42.8 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు శుక్రవారం నుంచి మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. అయితే గురువారం సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ మేర తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నేడు బంగాళాఖాతంలో వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం గురువారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత ఉత్తరం వైపు వెళ్లి 26వ తేదీ ఆదివారం సాయంత్రానికి బంగ్లాదేశ్, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుని తీవ్ర తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది.దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో శుక్ర, శనివారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉంది.శనివారం అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఆదివారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవిస్తాయని తెలిపింది.నేడు, రేపు కొన్నిచోట్ల వడగాడ్పులుమరోవైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో సాధారణంకంటే 3నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండురోజులు వడగాడ్పులు వీయనున్నాయి. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం 11, పార్వతీపురం మన్యం 11, కాకినాడ 1, తూర్పు గోదావరి 1 మండలం చొప్పున 33 మండలాల్లోను, శనివారం శ్రీకాకుళం జిల్లాలో 5, విజయనగరం 7, పార్వతీపురం మన్యం 5, పశ్చిమ గోదావరి 1, ఏలూరు 2, కృష్ణా 2, బాపట్ల జిల్లాలో రెండు చొప్పున 24 మండలాల్లోనూ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో రేపు(బుధవారం) అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 గంటల్లో (మే24) మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల చివర వరకు తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని వెల్లడించింది.ఈశాన్య దిశగా కదులుతూ బలపడనున్న అల్పపీడనం.. నైరుతి బంగాళాఖాతానికి అనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగనుంది. దీంతో అయిదు రోజుల పాటు ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. కొన్నిచోట్ల క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తు వరకూ ఆవరించింది. ఈ కారణంగా తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీతెలిపింది. -
బలపడుతున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి : ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది మరింత బలపడి 3వ తేదీ మధ్యాహ్నం కి నైరుతి బంగాళాఖాతానికి చేరుకొని తుపానుగా మారనుంది. మరోవైపు.. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని దక్షిణ శ్రీలంకపై సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటరలఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. తుపాను ప్రభావం కోస్తా తీరం వెంబడి ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వెల్లడించారు. రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలి తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, రైతులకు అందుబాటులో ఉండాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ ఆదేశించారు. ఖరీఫ్ వరి పంట కోతలు ముమ్మరంగా జరుగుతున్నందున.. కోతలు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. కోతల్లో, కొనుగోళ్ల సమయంలో ఒక్క రైతు కూడా నష్టపోకూడదని చెప్పారు. ఆయన గురువారం వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఖరీఫ్‌లో తక్కువ వర్షపాతం నమోదైనందున క్షేత్రస్థాయి సిబ్బంది లక్ష్యం మేరకు పంట కోత ప్రయోగాలపై దృష్టి పెట్టాలన్నారు. జియో కోఆర్డినేట్లతో కూడిన యాప్‌లో ప్రైమరీ వర్కర్, పర్యవేక్షక అధికారి, ఇన్సూ్యరెన్స్ కంపెనీ కోఅబ్జర్వర్ల సంతకాలతో పూర్తి స్థాయి సమాచారాన్ని రియల్ టైమ్‌లో నమోదు చేస్తేనే పంటల బీమాకు అర్హత వస్తుందని తెలిపారు. ఈ క్రాప్ నమోదుకు ఖరీఫ్‌లో ఇచ్చిన మార్గదర్శకాలే రబీలోనూ వర్తిస్తాయన్నారు. త్వరగా కోతకు వచ్చే శనగ, మినుము, మొక్క జొన్న పంటలను త్వరగా ఈ క్రాప్ ద్వారా నమోదు చేయాలని సూచించారు. వచ్చే 3, 4 రోజుల్లో కురిసే వర్షాలను సద్వినియోగం చేసుకునేందుకు రైతులకు అవసరమైన విత్తనాలను అందించాలని సూచించారు. శనగ విత్తనాల కోసం డిసెంబర్ 15 లోగా ఇండెంట్ పెట్టాలన్నారు. దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలోనే గ్యాప్ సర్టిఫికేషన్‌ను అమలు చేస్తున్నందున, ఎక్కువ మంది లబ్ధి పొందేలా కృషి చేయాలని తెలిపారు. ఉత్తమ ప్రమాణాలను పొందిన ఉత్పత్తులకు గిరాకీ పెరిగేలా వివిధ మాధ్యమాల ద్వారా వినియోగదారులకు సమాచారం అందించాలన్నారు. -
బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
-
నేడు వాయుగుండం.. రేపటికి తీవ్రం
సాక్షి, విశాఖపట్నం/వాకాడు: ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్, నికోబార్ దీవులకు ఆనుకుని మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఆపై వాయవ్య దిశగా పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి కాస్త దూరంలో గురువారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. అనంతరం ఉత్తర, ఈశాన్య దిశగా మలుపు తిరిగి 17వ తేదీకి ఒడిశా తీరానికి చేరుకుంటుందని తెలిపింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం నుంచి అల్పపీడనం ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉంది. వీటి ఫలితంగా బుధ, గురువారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు సంభవించి.. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రానున్న రెండు రోజులు గంటకు 40–50 కి.మీ.లు, గరిష్టంగా 60 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. -
నేడు అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈనెల 16వ తేదీ నాటికిపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే రాష్ట్రంపైకి ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటన్నిటి ఫలితంగా మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకురవనున్నాయి. కాగా.. మంగళవారం తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడ క్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడింంది. అలాగే బుధవారం తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు, కూలీలు, పశువుల కాపరులు, రైతులు ఆరు బయట ఉండరాదని హెచ్చరింంది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. -
ఈశాన్య వర్షాలకు వాయుగుండం బ్రేక్!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల చురుకుదనానికి వాయుగుండం బ్రేకులు వేసింది. మళ్లీ ఇవి చురుకుదనం సంతరించుకోవడానికి మరికొన్ని రోజుల సమయం పట్టనుంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం బలపడి మరో మూడు, నాలుగు రోజులు ఉత్తర ఈశాన్య దిశగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు ప్రయాణించనుంది. ఈ వాయుగుండం గాలిలోని తేమను అటువైపు లాక్కుని పోతుండటంతో ఈశాన్య రుతుపవనాలు మన రాష్ట్రంపై ప్రభావం చూపలేకపోతున్నాయి. ఈ వాయుగుండం తీరాన్ని దాటే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. వాయుగుండం బెంగాల్ తీరాన్ని దాటడానికి ఇంకా నాలుగైదు రోజులు పడుతుంది. ఆ తర్వాత మరో రెండు మూడు రోజులకు గాని ఈశాన్య గాలుల్లో తేమ ఏర్పడే పరి స్థితి ఉండదు. అందువల్ల ఈశాన్య రుతుపవనాలు బలం పుంజుకోవడానికి కనీసం వారం రోజులైనా ప డుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నా రు. ఏపీలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవాలంటే అప్పటివరకు వేచి ఉండాల్సిందేనని చెబుతున్నారు. తీరానికి దూరంగా వాయుగుండం సాధారణంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం గాని, వాయుగుండం గాని ఏర్పడితే ఏపీలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. కానీ ప్రస్తుత వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే ఏర్పడినప్పటికీ అది తీరానికి దూరంగా ఉంది. పైగా ఈ వాయుగుండం ఆంధ్ర తీరం వైపు కాకుండా బెంగాల్ వైపు పయనిస్తూ పునరావృతం) చెందుతుంది. ఫలితంగా ఏపీలో వర్షాలు కురవడం లేదని వాతా వరణ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలకు వారమైనా పట్టవచ్చని చెబుతున్నారు. బలపడిన వాయుగుండం.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఆదివారం సాయంత్రానికి తీవ్రవా యుగుండంగా బలపడింది. ఇది ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణంగా 550, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణంగా 710 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్రవాయుగుండం సోమవారం వరకు ఉత్తర దిశగా కదులుతుంది. ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుంటూ రీకర్వ్ తీసుకుని బంగ్లాదేశ్ తీరం వైపు పయనిస్తుందని ఐఎండీ తెలిపింది -
నేడు బంగాళాఖాతంలో వాయుగుండం!
సాక్షి, విశాఖపట్నం: మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం ఈ వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనించనుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం నివేదికలో వెల్లడించింది. ఈ వాయుగుండం తుపానుగా బలపడవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి సూచికగా తమిళనాడులో శనివారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయని ఐఎండీ తెలిపింది. నేడో, రేపో మన రాష్ట్రంలోనూ ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరాల వద్ద మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉంది. ఈ అల్పపీడనం బుధవారం దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ దిశలో పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం తెలిపింది. మరోవైపు ఉపరితల ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వరకు కొనసాగుతోంది. వీటన్నిటి ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ తెలిపింది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, అనకాపల్లి, పల్నాడు, కాకినాడ, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాగా.. అల్పపీడనం, ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో గంటకు 40–45 కి.మీ, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులెవరూ రానున్న మూడు రోజులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. -
ఎట్టకేలకు వానలు!
సాక్షి, విశాఖపట్నం: చాలా రోజుల తర్వాత రాష్ట్రంలో మళ్లీ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నెల రోజులుగా హిమాలయాల్లోనే తిష్ట వేసిన రుతుపవన ద్రోణి అక్కడి నుంచి దక్షిణాదికి మారడం, విదర్భ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి, దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటక వరకు ఒక ఉపరితల ఆవర్తనం, ఉత్తర అంతర్గత తమిళనాడులో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా శనివారం నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని తెలిపింది. సాధారణంగా ఆగస్టు నెలలో రుతుపవనాలు చురుగ్గా ఉండి, వర్షాలు విస్తారంగా కురుస్తాయి. అయితే, ఈ ఆగస్టు నెల ఆరంభం నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. ఒకట్రెండు చోట్ల అదీ స్వల్పంగానే వర్షాలు కురిశాయి. వర్షాలు కురవాలంటే అల్పపీడన ద్రోణులు గానీ, ఉపరితల ఆవర్తనాలు గానీ, బంగాళాఖాతంలో అల్పపీడనాలు గానీ ఏర్పడాలి. వాటివల్ల నైరుతి రుతుపవనాలు చురుకుదనం సంతరించుకుంటాయి. కానీ దాదాపు నెల రోజులుగా ద్రోణులు, ఆవర్తనాల జాడ లేదు. వర్షాలకు దోహదపడే నైరుతి రుతుపవనాల ద్రోణి కూడా మూడు వారాలకు పైగా దక్షిణాది వైపునకు రాకుండా హిమాలయాల ప్రాంతంలోనే ఉండిపోయింది. వీటన్నిటి కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురవలేదు. ఆగస్టు నెల వర్షపాతం సాధారణంకంటే 54 శాతం, నైరుతి రుతుపవనాల సీజను ప్రారంభం నుంచి ఆగస్టు ఆఖరు వరకు చూస్తే 25 శాతం తక్కువగా నమోదైంది. ఈ తరుణంలో రుతుపవన ద్రోణిలో కదలిక రావడం, ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు కురిసేందుకు తగిన వాతావరణం ఏర్పడింది. దాదాపు నెలరోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు, ప్రజలకు ఈ వానలు ఎంతగానో ఊరట కలిగించనున్నాయి. -
18న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 18న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతం, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టంనుంచి సగటున 4.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 18న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఈనెల 20 నుంచి వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెలలో ఇప్పటివరకు అంతంతే.. ఆగస్టు నెలలో రాష్ట్రంలో వర్షాలు ఆశించిన మేర కురవలేదు. గత నెలలో సాధారణం కంటే అత్యధిక వర్షాలు నమోదు అయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 47.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 58.37 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణం కంటే 23 శాతం అధిక వర్షపాతం నమోదైనప్పటికీ.. గత నెలలో కురిసిన వర్షాల వల్ల 63%అధికం నుంచి ప్రస్తుతం 23% అధికం వద్ద గణాంకాలు స్థిరపడ్డాయి. ఈ నెల మూడో వారం నుంచి వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని, ఆగస్టు చివరి వారంలో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనాలను విడుదల చేసింది. 18న ఏర్పడే అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు జోరందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
మళ్లీ ఉక్కపోత..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వాతావరణం మళ్లీ సెగలు కక్కుతోంది. కొద్దిరోజుల నుంచి ఉష్ణ తీవ్రత అధికమై పగటి పూట ఎండ చుర్రుమంటోంది. వర్షాకాలంలో ఇలాంటి వాతావరణం అరుదుగా కనిపిస్తుంది. మరోవైపు ఉష్ణతాపానికి ఉక్కపోత కూడా తోడవుతోంది. ఇది ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తోంది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిన తర్వాత రాష్ట్రంలో ఈ వాతావరణం నెలకొంది. వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉంటోంది. ఉదయం 9 గంటలు దాటితే చాలు.. ఎండ ఊపందుకుని సాయంత్రం వరకు కొనసాగుతోంది. కొన్నాళ్లుగా రాష్ట్రంలో తేలికపాటి జల్లులే తప్ప ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. పైగా మేఘాలు కూడా అంతగా ఏర్పడటం లేదు. ఫలితంగా సూర్యుడి నుంచి నేరుగా కిరణాలు పడటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి ఎండల ప్రభావం కనిపిస్తోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మరో వారం రోజులపాటు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఆగస్టు మొదటి వారంలో అల్పపీడనాలు ఏర్పడి వర్షాలు విస్తారంగా కురుస్తాయి. కానీ.. అందుకు భిన్నంగా ఇప్పుడు వానలకు బదులు ఎండలు కాస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంపైకి నైరుతి గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల్లో వర్షాలు కురిపించేటంత తేమ ఉండటం లేదు. దీంతో వానలకు ఆస్కారం ఉండకపోగా ఉక్కపోత కూడా ఇబ్బంది పెడుతోంది. 40 డిగ్రీలకు చేరువలో.. రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో రికార్డవుతున్నాయి. సోమవారం బాపట్లలో అత్యధికంగా 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 5.2 డిగ్రీలు అధికం. ఇంకా పలుచోట్ల 35నుంచి 38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణతీవ్రత కొనసాగుతుందని, అసౌకర్యంతో కూడిన వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. సాధారణం కంటే 3–5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు గాని కురిసే అవకాశం ఉందని వివరించింది. -
వామ్మో వాన!
నేడు పది జిల్లాలకు రెడ్ అలర్ట్ రాష్ట్రంలో మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం.. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను.. మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. పలు ప్రాంతాల్లో గంటకు 40– 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. అయితే పశ్చిమ, మధ్య బంగాళా ఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని, ఇకపై వానలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. ఇదే అతిపెద్ద వాన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో నమోదైన 64.98 సెంటీమీటర్ల వర్షపాతమే రాష్ట్ర చరిత్రలో అత్యధి కమని వాతావరణశాఖ తెలిపింది. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో నమోదైన 61.65 సెంటీమీటర్ల వర్షపాతం రెండో అతిపెద్ద రికార్డును నమో దు చేసినట్టు వెల్లడించింది. 2013 జూలై 19న ములుగు జిల్లా వాజేడులో కురిసిన 51.75 సెం.మీ. వాన ఇప్పటివరకు టాప్ అని.. ఇప్పుడది 3వ స్థానానికి పడిపోయిందని వివరించింది. ఇక కేవలం 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోని 35కుపైగా ప్రాంతాల్లో 20సెంటీమీటర్లకుపైన వర్షపాతం నమోదవడం కూడా రికార్డేనని తెలిపింది. సాక్షి, హైదరాబాద్: కుండపోత, కుంభవృష్టి కాదు.. ఆకాశానికి చిల్లులు పడ్డాయేమో అనిపించేట్టుగా అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో వానలు పోటెత్తాయి. ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 24 గంటల వ్యవధిలో (బుధవారం ఉదయం 8.30 నుంచి గురువారం ఉదయం 8.30 వరకు) ఏకంగా 64.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లపైన, మరో 200 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లపైన భారీ వర్షాలు నమోదుకావడం గమనార్హం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు కుండపోత వానలతో అతలాకుతలం అయ్యాయి. ఉప నదులు, వాగులు ఉప్పొంగుతుండటం, చెరువులు, చిన్న ప్రాజెక్టులు అలుగు పారుతుండటంతో.. చాలా ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. కొన్ని చోట్ల రోడ్లు, వంతెనలు తెగిపోయాయి. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. భూపాలపల్లిలోని మోరంచ వాగు ఉధృతికి గ్రామం పూర్తిగా నీట మునగడంతో.. అక్కడి వారిని రక్షించడానికి హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ వానలతో గోదావరి ఉగ్రరూపం దాల్చగా.. కృష్ణా నదిలోనూ ప్రవాహం పెరుగుతోంది. రాష్ట్రంలో 9.77 సెంటీమీటర్ల సగటు బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.77 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. హన్మకొండ జిల్లాలో అయితే ఏకంగా 27.59 సెంటీమీటర్లు, భూపాలపల్లి జిల్లాలో 26.46, వరంగల్ జిల్లాలో 21.46, కరీంనగర్ జిల్లాలో 20.10 సెంటీమీటర్ల సగటు వర్షం పడటం గమనార్హం. -
Andhra Pradesh: రాష్ట్రమంతా కుండపోత
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో ఆకాశానికి చిల్లు పడినట్లు ఎడతెగని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ విస్తారంగా వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని మొదట భావించినా తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. అయినా దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సగటున 2.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉత్తరాంధ్ర, గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజలు బయటకు వెళ్లే అవకాశం లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం అత్యధికంగా 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లాలో 6.9, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 6.8, అనకాపల్లి జిల్లాల్లో 6.4 సెంటీమీటర్ల సగటు వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లోనూ సగటున 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. 10 జిల్లాలకు రెడ్.. 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అల్పపీడనం ప్రభావం గురువారం వరకు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలు ఈ జాబితాలో ఉన్నందున, అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. వర్షాలతోపాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. శనివారం వరకు అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా ఉన్నందున రానున్న మూడు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. జిల్లా కలెక్టర్ల అప్రమత్తం భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. కలెక్టరేట్లలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌లు తెరవాలని సూచించింది. గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్ల ద్వారా స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని తెలిపింది. 2వ తేదీ నాటికి మరో అల్పపీడనం అల్పపీడనం కేంద్రీకృతమైన బంగాళాఖాతం నుంచి కోస్తా జిల్లాల వైపు నిరంతరాయంగా మేఘాలు వస్తూనే ఉండడం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో తీవ్ర అల్పపీడనం ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాల మీదుగా వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి. కాగా, బంగాళాఖాతంలో వచ్చే నెల 2వ తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం మధ్య కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలహీనపడిన తర్వాత ఈ అల్పపీడనంపై స్పష్టత వస్తుందని ఏపీఎస్డీపీఎస్ అధికారులు చెబుతున్నారు. రాయలసీమలో జడివాన రాయలసీమ జిల్లాల్లో బుధవారం జడివాన కురిసింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఐదు సెంటీమీటర్ల వర్షం పడింది. కర్నూలు జిల్లాలో సగటున 18.8, నంద్యాల జిల్లాలో 22.9 మి.మీ వర్షం కురిసింది. ఉమ్మడి చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురిసింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లాం వద్ద కొండవీటి వాగు, పెదపరిమి వద్ద గల కోటెళ్ల వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. కొల్లిపర మండలంలో 80.2 మి.మీ వర్షం పడింది. కట్టలేరు, వైరాయేరు, మున్నేరు ఉగ్రరూపం ఉమ్మడి కృష్ణా జిల్లాను వాన ముంచెత్తుతోంది. కట్టలేరు, వైరాయేరు, మున్నేరు ఉగ్రరూపం దాల్చాయి. బుడమేరుకు వరద పోటెత్తింది. కంకిపాడు మండలం నెప్పల్లిలో అధిక వర్షాలకు గోడలు నానిపోయి రేకుల షెడ్డు కూలిపోవడంతో మేరి అనే మహిళ గాయపడింది. వత్సవాయి మండలం లింగాల వద్ద మున్నేరు వంతెన పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. పెనుగంచిప్రోలు, ముచ్చింతాల గ్రామాల మధ్య వంతెనపైకి నీరు చేరింది. వీరులపాడు మండలం పల్లంపల్లి, నందిగామ మండలం దాములూరు మధ్య కూడలి వద్ద కట్టలేరుపై కాజ్వే పూర్తిగా మునిగిపోయింది. వీరులపాడు మండలం దొడ్డదేవర పాడు వద్ద కట్టలేరుపై ఉన్న వంతెనను తాకుతూ వరద వెళుతోంది. జి కొండూరు మండలం జి కొండూరు, కందులపాడు గ్రామాల మధ్య ముత్యాలంపాడు వద్ద బుడమేరుపై తాత్కాలికంగా నిరి్మంచిన కాజ్‌వేపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వెనుదిరిగిన బోట్లు ఉభయ గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల జన జీవనానికి అంతరాయం కలుగుతోంది. తాళ్లపూడిలో 84.6 మిల్లీ మీటర్లు, సీతానగరంలో 55, రాజమండ్రి రూరల్‌లో 40.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. కోటనందూరు మండలంలో 94.4 మి.మీటర్లు నమోదైంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. బోట్లు నిలిచిపోయాయి. ట్యూనా చేపల కోసం వెళ్లిన బోట్లు వెనుదిరిగాయి. ఏలూరు జిల్లా పెదవేగి సమీపంలోని బలివే మార్గంలో తమ్మిలేరు ఉధృతికి రహదారి కొట్టుకుపోయి రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. లింగపాలెం మండలం రంగాపురం మీదుగా కళ్లచెరువు గ్రామాన్ని కలిపే తాత్కాలిక మట్టి రోడ్డు గుండేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయింది. జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్న పాలెం వద్ద జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతంలోని డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల నుంచి రాకపోకలు స్తంభించిపోయాయి. శ్రీనివాసపురం సమీపంలో రేల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో బుధవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల కుండపోత వర్షం కురిసింది. భోగాపురం, పూసపాటిరేగ తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. విశాఖ నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఆర్కే బీచ్‌లోని సముద్రతీరం భారీగా కోతకు గురైంది. ప్రత్యేక బృందాలు రంగ ప్రవేశం రాష్ట్రంలో భారీ వర్షాలతో ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర విపత్తుల స్పందన బలగాలు(ఎస్డీఆర్ఎఫ్) సర్వసన్నద్ధంగా ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదులకు వరద ముప్పు పొంచి ఉండటంతో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్ ముందుగానే సన్నద్ధమైంది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో నాలుగేసి సహాయక బృందాల చొప్పున మొత్తం 8 బృందాలను నియోగించారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మామిడికుదురు, ఐనవల్లి, ఏలూరు జిల్లాలోని వేలూరుపాడు, కుక్కునూరులలో రెండేసి బృందాల చొప్పున సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో బృందంలో ఒక అసిస్టెంట్ కమాండెంట్, ఒక రిజర్వ్ ఇన్స్పెక్టర్తోపాటు 40 మంది సభ్యులు ఉన్నారు. స్పీడ్ బోట్లు, జాకెట్లతోపాటు రహదారుల్లో రాకపోకలను పునరుద్ధరించేందుకు అవసరమైన యంత్ర పరికరాలతో ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులతో కలసి లోతట్టు ప్రాంతాల ప్రజలతో మాట్లాడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా సహాయక శిబిరాలకు తరలి వెళ్లేలా సూచిస్తున్నాయి. అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే తమను సంప్రదించాలని ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కృష్ణా నది తీరంలో పదేసి మంది సభ్యులతో కూడిన మూడు బృందాలను నియోగించారు. ఎస్డీఆర్ఎఫ్ సన్నద్ధమైంది. కర్నూలు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరంలలో 40 మంది సభ్యులతో కూడిన మూడేసి ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచింది. ఎస్డీఆర్ఎఫ్ బృందాల్లోని గజ ఈతగాళ్లతోపాటు మత్స్యకార ప్రాంతాల్లోని ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు. -
ఉత్తర ఒడిశాపై అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, గంగా పశ్చిమ బెంగాల్ తీరాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫిరిక్ స్థాయిల వరకు విస్తరించి నైరుతి వైపు వంగి ఉంది. ఇది రెండురోజుల్లో జార్ఖండ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా పయనించనుంది. మరోవైపు సగటు సముద్రమట్టం వద్ద రుతుపవన ద్రోణి అల్పపీడన ప్రాంతం కేంద్రం.. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌కు ఆనుకుని ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో పలుచోట్ల, దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సోమవారం ఉత్తర కోస్తాంధ్రలో ఒకటిరెండు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చని తెలిపింది. మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఈనెల 18న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది ఆ మరుసటి రోజుకి అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారనుంది. తరువాత ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అనంతరం రెండురోజుల్లో ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా మధ్య భారతదేశం వైపు వెళ్లనుంది. ఫలితంగా రుతుపవన ద్రోణి చురుకుదనం సంతరించుకోనుంది. దీంతో ఈనెల 18 నుంచి నాలుగు రోజుల పాటు రాయలసీమ మినహా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ప్రధానంగా ఉత్తర కోస్తాంధ్రలో పలుచోట్ల, దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీవర్షాలకు ఆస్కారం ఉంది. -
నేడు అల్పపీడనం.. మూడు రోజులు వర్షాలే
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 7.8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉంది. దీని ప్రభావంతో ఆదివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం నివేదికలో వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చని, ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 45–55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. అల్పపీడనం నేపథ్యంలో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. -
మోచా తుపాను మనకు లేనట్టే!
సాక్షి, విశాఖపట్నం/అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్): దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం మంగళవారం వాయుగుండంగా మారనుంది. అనంతరం తూర్పు మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 10 నాటికి తుపానుగా బలపడనుంది. ఆపై ఈ తుపాను మొదట్లో 11వ తేదీ వరకు ఉత్తర, వాయవ్య దిశగా కదులుతుంది. ఆ తర్వాత మలుపు తిరిగి మరింత బలపడి ఉత్తర, ఈశాన్య దిశగా బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల వైపు పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం రాత్రి బులెటిన్‌లో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌పై తుపాను ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. అయితే బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనున్న నేపథ్యంలో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. మళ్లీ సెగలు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. తుపానుగా బలపడనుందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్రంలో వానలు కురిసి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని అంతా భావించారు. అందుకు భిన్నంగా తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉండకపోవడంతో వర్షాలకు బదులు ఎండలు విజృంభించనున్నాయి. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఉపరితల ద్రోణి, అల్పపీడనంతో అనుసంధానమై ఉంది. ఫలితంగా రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2–4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. ఫలితంగా రాష్ట్రంలో మళ్లీ సెగలు మొదలు కానున్నాయి. పిడుగులు పడి ముగ్గురి దుర్మరణం కర్నూలు జిల్లాలో సోమవారం పిడుగులు పడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఆలూరు మండలం మొలగవెల్లి గ్రామంలో నౌనేపాటి(38) అనే వ్యక్తి పత్తికొండ నుంచి ఆటో టాప్‌పై కూర్చుని ప్రయాణిస్తుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నంద్యాల జిల్లా డోన్ మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన లక్ష్మీదేవి(36) చిన్న మల్కాపురం గ్రామానికి పనికి వెళ్లగా.. పిడుగు పడటంతో మరణించింది. మరో నలుగురు గాయపడ్డారు. తెలంగాణలోని వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం తూముకుంట బొల్లవరం గ్రామానికి చెందిన ఆవుల విష్ణు(18) గొర్రెలు మేపేందుకు వచ్చి పగిడ్యాల–కొణిదేల రహదారి మధ్య పొలాల్లో పిడుగుపాటుకు గురై మరణించాడు. -
తీరంలో అలజడి
సాక్షి, విశాఖపట్నం/వాకాడు (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా వాకాడు తీరంలో భీకర శబ్దాలతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు భూమధ్యరేఖ ప్రాంతం మీదుగా ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫిరిక్ స్థాయి వరకు విస్తరించి ఉంది. తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం నైరుతి బంగాళాఖాతం మీదుగా నెమ్మదిగా పయనిస్తూ ఫిబ్రవరి 1 నాటికి శ్రీలంక తీరానికి చేరుకుంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించింది. ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం నెలకొంటుందని, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. అదే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో పొగ మంచు ఏర్పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. కాగా, ఆదివారం వేకువజామున రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఆర్.అనంతపురం (శ్రీసత్యసాయి)లో 9.6, ముత్తుకూరు (చిత్తూరు)లో 10, నిమ్మనపల్లె (అన్నమయ్య)లో 10.9, వల్లెవీడు (తిరుపతి)లో 11.8 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముందుకొచ్చిన సముద్రం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఆదివారం వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో ఈదురు గాలులు వీస్తుండగా.. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. దీంతో సముద్రం దాదాపు 5 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకొచ్చి తీరాన్ని తాకుతోంది. సముద్రంలో అలలు 5 అడుగుల మేర ఎగసిపడటం, బోట్లు నిలబడే పరిస్థితి లేకపోవడంతో తిరుపతి జిల్లాలోని చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండలాల్లో సముద్రంలో వేటకు వెళ్లడంపై నిషేధం విధించారు. -
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖను ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉంది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అనంతరం అదే దిశలో కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి నివేదికలో వెల్లడించింది. వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఫిబ్రవరి 1న శ్రీలంక తీరానికి చేరుకుంటుందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 30వ తేదీ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. మరోవైపు రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. పలు ప్రాంతాల్లో పొగమంచు కూడా ఏర్పడుతుందని తెలిపింది. కాగా.. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతల క్షీణత కొనసాగుతోంది. అరకు లోయలో 7.1, పెద ఉప్పరాపల్లి (చిత్తూరు) 8.8, ఆర్.అనంతపురం (శ్రీసత్యసాయి) 9, బెలుగుప్ప (అనంతపురం) 9.5, పెద్ద తిప్పసముద్రం (అన్నమయ్య) 10.3, హలహర్వి (కర్నూలు) 10.5, వల్లివేడు (తిరుపతి)ల్లో 10.8 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
బలపడిన తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం.. ప్రభావం ఎంతంటే?
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: తూర్పు భూమధ్య రేఖా ప్రాంతం, హిందూ మహాసముద్రానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఆ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమరిన్ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం తెలిపింది. దీని ప్రభావం ఏపీపై నామమాత్రంగానే ఉండనుంది. మరోవైపు రాష్ట్రంపైకి ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో పొగమంచు కొనసాగనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్షీణిస్తుండడంతో చలి ప్రభావం అధికంగా ఉంటోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణ నెలకొంటుందని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. -
స్థిరంగా.. అల్పపీడనం! రాష్ట్రంపై ప్రభావం ఏ మేరకు ఉంటుందంటే..
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: మధ్య దక్షిణ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్యరేఖ ప్రాంతానికి ఆనుకుని హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో నెమ్మదిగా కదులుతూ శ్రీలంక తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. దీని ప్రభావం రాష్ట్రంపై స్వల్పంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. -
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా పయనిస్తూ గురువారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అదే తీవ్రతతో, అదే దిశగా 17వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆపై మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. కాగా బుధవారం తూర్పు గోదావరి జిల్లా పోతవరంలో 4.1, అల్లూరి సీతారామరాజు జిల్లా కుంతలంలో 2.5 సెం.మీల వర్షపాతం నమోదైంది. చదవండి: (రాష్ట్రానికి విశాఖే భవిష్యత్.. త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన) -
వాయుగుండం కాదు.. వచ్చేది తుపానే
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: కొద్దిరోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడుతుందనుకుంటున్న వాయుగుండం అంచనా తప్పి బలపడనుంది. తుపానుగా మారి తమిళనాడు–దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనించనుంది. దీని ప్రభావం మన రాష్ట్రంపై కూడా పడనుంది. కాగా.. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అదే దిశలో పయనిస్తూ తుపానుగా బలపడి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఈ నెల 8న ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి–దక్షిణ కోస్తాంధ్ర సమీపంలో తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సోమవారం తెలిపింది. దక్షిణ కోస్తా.. రాయలసీమపై అధిక ప్రభావం ఈ తుపాను ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఎక్కువగాను.. ఉత్తర కోస్తాలో స్వల్పంగాను ఉంటుందని తెలిపింది. బుధవారం దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం దక్షిణ కోస్తాలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదే రోజున ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం దక్షిణ కోస్తాలో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ వివరించింది. వాయుగుండం, తుపాను ప్రభావంతో ఈ నెల 8, 9 తేదీల్లో కోస్తాలో తీరం వెంబడి గంటకు 40నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని పేరు ‘మాండూస్’ ఈ తుపానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సూచించిన ‘మాండూస్’ అనే పేరు పెట్టనున్నారు. ఈ పేరును వాయుగుండం తుపానుగా మారిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. 15న మరో అల్పపీడనం ఈ నెల 15వ తేదీన అండమాన్ సముద్రం లేదా దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావం 20వ తేదీ వరకు ఉండే అవకాశం ఉంది. ఏపీ తీరంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో అల్పపీడనాలు ఏపీ తీరంవైపు కదలడం లేదని అంచనా వేస్తున్నారు. -
Rain Alet: దక్షిణ కోస్తా వైపునకు వాయుగుండం!.. భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 5వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఏడో తేదీ ఉదయానికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ నైరుతి బంగాళాఖాతంలోకి చేరుతుంది. క్రమంగా కదులుతూ ఎనిమిదో తేదీ ఉదయానికి ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. తొలుత ఈ వాయుగుండం దక్షిణ తమిళనాడు–పుదుచ్చేరి తీరాలకు చేరుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది. తాజా అంచనాల ప్రకారం దిశ మార్చుకుని దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరువయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం ఈ నెల ఆరో తేదీ తర్వాత దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమపై ఉంటుందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న రెండు రోజులు ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణ కొనసాగనుంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో శనివారం ఒకటి, రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. చదవండి: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్ -
శీతల గాలులు.. వర్షాలపై ఐఎండీ అంచనాలు.. ఈసారి మరింత వణుకుడే!
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది శీతాకాలం ఎక్కువ ప్రభావం చూపనుంది. చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు దేశంలో శీతాకాలం ప్రభావంపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం అంచనాలను విడుదల చేసింది. ఈ శీతాకాలంలో ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువగా రికార్డవుతాయని అంచనా వేసింది. ఫలితంగా రాష్ట్రంలో ఈ మూడు నెలలు చలి ఒకింత ఎక్కువ ఉంటుందని పేర్కొంది. రానున్న రెండు నెలల్లో (డిసెంబర్, జనవరిల్లో) అప్పుడప్పుడు అతి శీతల గాలులకు ఆస్కారం ఉంది. గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువగా నమోదవుతాయని, అందువల్ల పగటి వేళ కూడా శీతల అనుభూతి ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. సాధారణంగా నైరుతి రుతు పవనాల సీజనులో వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడు ఆ తర్వాత వచ్చే శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉండటానికి కూడా ఇదే కారణమని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ చెప్పారు. ఈ సీజనులో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలతో పోల్చుకుంటే ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మరోవైపు అక్టోబర్ నెలతో మొదలైన ఈశాన్య రుతు పవనాల సీజను డిసెంబర్‌తో ముగియనుంది. ఈ నెలలో రాష్ట్రంలో సాధారణ వర్షాలకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. 5న అల్పపీడనం! దక్షిణ అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఈ నెల ఐదో తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం అది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి 48 గంటల్లో వాయుగుండంగా బలపడనుంది. 8వ తేదీకి తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు చేరుతుందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరిలపై అధికంగా, దక్షిణ కోస్తాంధ్రపై మోస్తరుగా ఉండే అవకాశముంది. వాయుగుండం ప్రభావంతో ఈనెల 6 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంపైకి తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. చదవండి: వద్దన్నా.. వినకుండా ఈవెంట్ బృందంతో వెళ్లి.. -
Rain Alert: వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/వాకాడు: ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం రాత్రికి శ్రీలంకలోని జాఫ్నాకు తూర్పుగా 560 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం అదే తీవ్రతతో నెమ్మదిగా కొనసాగుతూ రానున్న 24 గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అనంతరం క్రమంగా అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలో మీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపింది. మత్స్యకారులు మంగళవారం వరకు దక్షిణ కోస్తా–తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ తెలిపారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గి చలి బాగా పెరిగే అవకాశం ఉంది. అల్లకల్లోలంగా సముద్రం వాయుగుండం ప్రభావంతో ఆదివారం తిరుపతి జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. -
వాయుగుండం: కోస్తా, సీమల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం రానున్న రెండు రోజులు అదే దిశలో తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంల వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఆదివారం సాయంత్రం నుంచి తేలికపాటి వర్షాలు మొదలవుతాయని తెలిపింది. 21, 22 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల చెదురుమదురు వానలకు అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 23వ తేదీ వరకు తీరం వెంబడి గంటకు 45–55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, దీంతో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. -
ఏపీ: బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధవారం అండమాన్‌కు ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం అది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 18 నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం ఈ వాయుగుండం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అల్పపీడనం వాయుగుండంగా బలపడిన తర్వాత ఈ నెల 19 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 18 నుంచి తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది. -
16న మరో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం/నెల్లూరు (అర్బన్): కొద్దిరోజులుగా నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి ఆనుకుని కొనసాగుతున్న అల్పపీడనం ఆదివారం ఆగ్నేయ అరేబియా సముద్రంలో విలీనమైంది. మరోవైపు ఈ నెల 16న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో 18వ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, నాలుగు రోజుల నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. నెల్లూరు జిల్లాలో కుంభవృష్టి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షం ఆదివారం నాటికి కుంభవృష్టిగా మారింది. నెల్లూరు నగరం జలమయమైంది. ఆత్మకూరు బస్టాండ్, రామలింగాపురం, మాగుంట లేఅవుట్లోని అండర్ బ్రిడ్జిల్లోకి నీరు చేరడంతో బారికేడ్లు పెట్టి మూసేశారు. ఉమ్మారెడ్డిగుంటలోని పలు పల్లపు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరింది. ప్రధానంగా కావలి, కొండాపురం, గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు మండలాల్లో కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కావలి మండలం రుద్రకోట పంచాయతీ గుమ్మడిబొందల గ్రామం వద్ద చప్టాపై నీరు పొంగి ప్రవహిస్తోంది. కావలి పట్టణం బాలకృష్ణారెడ్డినగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. బ్రాహ్మణక్రాక– కృష్ణాపాడు రోడ్డుపై వర్షపు నీరు చేరింది. కొండాపురం మార్గంలో మిడతలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుడ్లూరు–బసిరెడ్డిపాలెం గ్రామాల మధ్య ఉప్పుటేరు బ్రిడ్జిపై 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండడంతో శనివారం రాత్రి నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. గుడ్లూరు–తెట్టు ప్రధాన రహదారిలో చెమిడిదిపాడు వద్ద ఉన్న రాళ్లవాగు కూడా ఉధృతంగా పారుతుండడంతో మధ్యాహ్నం వరకు కావలి–కందుకూరు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉలవపాడు మండలంలో బద్దిపూడి–మాచవరం మధ్య ఉన్న ఉప్పుటేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మన్నేటికోట–ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రవాగు ఉధృతంగా పారుతోంది. దీంతో చుట్టుగుంటకు రాకపోకలు నిలిచిపోయాయి. -
బలహీనపడిన అల్పపీడనం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతం, ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం శనివారం అల్పపీడనంగా బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అయితే, అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, కేరళ మీదుగా ప్రయాణించి ఆదివారం తూర్పు మధ్య అరేబియా సముద్రంలో విలీనమవుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్రలో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈ నెల 16న ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది. కాగా, అల్పపీడనం ప్రభావంతో శనివారం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కారేడులో 5.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పొదిలి, కావలి, చీమకుర్తి, లింగసముద్రం, ఉలవపాడు, నగరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. -
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం!.. పలుచోట్ల వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/వాకాడు: నైరుతి బంగాళాఖాతంలో ఈశాన్య శ్రీలంక వద్ద కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో శని, ఆదివారాల్లో రాయలసీమ, దక్షిణ æకోస్తాంధ్రల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వానలు కురుస్తాయని, ఆదివారం పొడి వాతావరణం నెలకొంటుందని వివరించింది. కోస్తా తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, శనివారం మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించింది. అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఎగసి పడుతున్నాయి. సముద్రం దాదాపు 10 మీటర్లు వరకు ముందుకు చొచ్చుకొచ్చింది. మరోవైపు ఈనెల 16న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. చదవండి: ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన సీఎం జగన్ -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు అల్పపీడన ద్రోణి మధ్య బంగాళాఖాతం నుంచి ఉపరితల ఆవర్తన ప్రాంతం వరకు కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ 12వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలకు విస్తరిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. ఈ ప్రభావంతో గురువారం ఉత్తర కోస్తాలో అక్కడక్కడ, దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని వివరించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపింది. తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. -
ఏపీకి మరో అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న భూమధ్య రేఖా ప్రాంతంలోని హిందూ మహాసముద్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో గురువారం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. అనంతరం ఈ అల్పపీడనం 11వ తేదీ వరకు వాయవ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు కదులుతుందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో ఈనెల 11, 12 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అల్పపీడనం కారణంగా కోస్తా తీరం వెంబడి గంటకు 45–55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఫలితంగా సముద్రం అలజడిగా మారుతుందని తెలిపింది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. -
ఏపీకి తుపాన్ ముప్పు తప్పినట్టేనా..?
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపు(ఆదివారం) ఉదయానికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద తెలిపారు. ఎల్లుండి తీవ్ర అల్పపీడనం.. తుపాన్‌గా మారనుంది. 25న బంగ్లాదేశ్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. చదవండి: విషాద జీవితాల అనాథ బిడ్డలకు ‘అమ్మఒడి’ ఆలంబన తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్రం లోపలికి వేటకు వెళ్ళరాదని, శనివారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న రెండు రోజులపాటు వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావారణ కేంద్రం వెల్లడించింది. -
అండమాన్ సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం
-
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ శనివారానికి వాయుగుండంగా, 23వ తేదీకి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఆపై ఉత్తరం వైపుగా దిశ మార్చుకుని తూర్పు మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 24న తుపానుగా బలపడనుంది. అనంతరం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఒడిశా తీరాన్ని దాటి 25వ తేదీ నాటికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి ఒక బులెటిన్‌లో వెల్లడించింది. ఈ తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉండదని, రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, అక్కడక్కడ పిడుగులు సంభవించవచ్చని వివరించింది. రాబోయే రెండు రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తర బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఏపీ, యానాం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నర్సీపట్నం (అనకాపల్లి)లో 4.9 సెంటీమీటర్లు, జి.మాడుగుల (అల్లూరి సీతారామరాజు)లో 2.8, ముండ్లమూరు (ప్రకాశం)లో 2.8, ఆళ్లగడ్డ (నంద్యాల)లో 2.6, తొండూరు (వైఎస్సార్)లో 2.6, ఆస్పరి (కర్నూలు)లో 2.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
AP: రాష్ట్రానికి తుపాను ముప్పు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ సముద్రం, దాని పరిసరాల్లో ఈ నెల 18న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. 20వ తేదీ నాటికి ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. క్రమంగా ఇది ఏపీ–ఒడిశా తీరం వైపు కదులుతూ 24, 25 తేదీల్లో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత పెను తుపాను (సూపర్ సైక్లోన్)గా మారుతుందని పలు అంతర్జాతీయ ప్రైవేటు వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. కాగా రాష్ట్రవ్యాప్తంగా శనివారం భారీ వర్షాలు కురిశాయి. ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడ్డాయి. కుంభవృష్టితో కోనసీమ తడిసి ముద్దైంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చంపావతి, నాగావళి నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు 4.33 లక్షల క్యూసెక్కులు విడుదల చేయడంతో బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండ లం ఓలేరు, పల్లెపాలెం, పెదలంక, కాకుల డొంక వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోం ది. కాగా వర్షాల నేపథ్యంలో కృష్ణా, పెన్నా నదులు వరద ఉధృతితో ప్రవహించే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో వాగుల్లో కొట్టుకుపోతున్న ముగ్గురిని స్థానికులు కాపాడారు. అష్టదిగ్బంధంలో అమరావతి ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు అమరావతి అష్టదిగ్బంధంలో చిక్కుకుంది. గత టీడీపీ ప్రభుత్వం ముందుచూపు లేకుండా నిర్మించిన అమరావతిని వాన నీరు చుట్టుముట్టింది. భూసమీకరణ పేరుతో వేలాది ఎకరాలు సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాంతంలో అందుకు తగినట్లుగా సౌకర్యాలు కల్పించకపోవడంతో సచివాలయ ఉద్యోగులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు ఇబ్బందిపడ్డారు. -
ఏపీ వాసులకు అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించాయి. ఏపీలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని అధికారులు సూచించారు.తెలంగాణలోని అక్కడక్కడ తేలిక పాటి వర్షాలు పడతామని వాతావరణ శాఖ పేర్కొంది. చదవండి: టీడీపీ నేత లైంగిక వేధింపులు: బాలిక సెల్ఫీ వీడియో.. బయటపడ్డ షాకింగ్ నిజాలు -
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: ఏపీలో పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం మంగళవారం కోస్తా తీరంలో స్థిరంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం నైరుతి దిశ వైపు వంపు తిరిగి ఉంది. ఉపరితల ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశాల మీదుగా చత్తీస్ఘడ్ వరకు సగటు సముద్రమట్టం వరకు విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. (చదవండి: గుడ్‌న్యూస్: ఉద్యోగులకు ‘ఈ–స్కూటర్లు’) -
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బుధవారానికి ఏపీ తీరం వైపునకు పయనించే అవకాశం ఉంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి ప్రకటించింది. చదవండి: రామోజీ అర్ధసత్యాల ‘పంచాయితీ’ అదే సమయంలో కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడవచ్చని వివరించింది. మరోవైపు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలో మీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అందువల్ల సముద్రం అలజడిగా ఉంటుందని, రానున్న మూడు రోజులు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు హుకుంపేట (వైఎస్సార్ జిల్లా)లో 3.5 సెం.మీ., కపిలేశ్వరపురం (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా)లో 3.2, చాట్రాయి (ఏలూరు)లో 3.1, రాజానగరం (తూర్పుగోదావరి)లో 3, ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా)లో 2.9, జగ్గంపేట (కాకినాడ జిల్లా) 2.6, గొలుగొండ (అనకాపల్లి జిల్లా)లో 2.3 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. -
బెంగాల్ వైపు మళ్లిన అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం వైపు మళ్లింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా పయనించనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి తెలిపింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అల్పపీడనం పశ్చిమ బెంగాల్ వైపు మళ్లడంతో మంగళవారం రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. -
తప్పిన వాయు‘గండం’
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు కదులుతోంది. దీంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ వాయుగుండం ఆదివారం సాయంత్రానికి ఒడిశాలోని భవానీపటా్ననికి 80 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 110 కిలోమీటర్లు, ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్కు 210 కిలోమీటర్లు, కంకేర్కి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రయాణిస్తూ సోమవారానికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అక్కడక్కడా భారీవర్షాలు కురవగా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. సోమ, మంగళవారాల్లో మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 50కిలోమీటర్లు.. గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. గడచిన 24 గంటల్లో పాలకోడేరులో 14 సెంటీమీటర్లు, నూజివీడులో 11, సెట్టిగుంటలో 10.3, పూసపాటిరేగ, బలిజపేటల్లో 9, భీమడోలు, భీమవరం, కళింగపటా్నల్లో 8, ఆళ్లగడ్డలో 7.8, ఇబ్రహీంపట్నంలో 7.4, చింతలపూడి, తెర్లాం, జియ్యమ్మవలసల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
Rain Alert: తీవ్ర అల్పపీడన ప్రభావం.. మరో రెండ్రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలుచోట్ల శనివారం భారీ వర్షాలు కురిశాయి. చాలాచోట్ల ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్ జిల్లా టేక్మాల్‌లో 16.3 సెంటీమీటర్ల కుండపోత వాన కురిసింది. దీంతో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం జలదిగ్బంధమైంది. కాగా వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని.. దాని ప్రభావంతో ఆది, సోమవారాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. గంటకు 40 కిలోమీటర్ల వరకు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఇక నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. ఈ రెండు రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సూచించింది. కాగా.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపా కకు చెందిన చందా రమ (47) పొలంలో పని చేస్తుండగా పిడుగుపడి మృతి చెందింది. ఇదీ చదవండి: కదలని నేతలు అవుట్.. టీపీసీసీ ప్రక్షాళనపై హైకమాండ్ దృష్టి! -
Rain Alert: 9న అల్పపీడనం! రాష్ట్రంలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 7న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. 48 గంటల అనంతరం అంటే ఈ నెల 9న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. దీని ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈనెల 8 నుంచి కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే వీలుందని వివరించింది. అదే సమయంలో గంటకు 45 – 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని, అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. ప్రస్తుతం ఉత్తర–దక్షిణ ద్రోణి ఉత్తర కర్ణాటక నుంచి కొమరిన్ ప్రాంతం వరకు తమిళనాడు అంతర్భాగంలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సీమలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడతాయని ఐఎండీ తెలిపింది. -
19న బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తదుపరి 24 గంటల్లో ఈ తుపాను బలపడనున్నట్లు అంచనా వేసింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి బుధవారం బలహీనపడింది. రాష్ట్రానికి నైరుతి దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 49.92 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావలసిఉండగా, బుధవారం ఉదయం 8.30 గంటల వరకు 83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 66 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 6 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. -
బలపడిన అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. 48 గంటల్లో బలపడి ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. మరోవైపు రుతుపవన ద్రోణి రాజస్తాన్ నుంచి అల్పపీడనం ప్రాంతం మధ్యగా పయనిస్తూ అండమాన్ వరకు విస్తరించింది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. గంటకు 45 నుండి 55 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. కాగా, శనివారం అర్ధరాత్రి, ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 8.9 సెంటీమీటర్ల వర్షం పడింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, సంతబొమ్మాళి ప్రాంతాల్లో, రాజమహేంద్రవరంలో, ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. -
Cyclone Jawad: బలపడిన వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి శుక్రవారం మధ్య బంగాఖాళాతంలో జవాద్ తుపానుగా మారుతుందని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది తరువాత వాయవ్య దిశలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించి శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో 2రోజుల పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45–65 కిలోమీటర్లు, శనివారం 70–90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. తుపాను కారణంగా 95 రైళ్లు రద్దు గురు, శుక్ర, శనివారాల్లో 95 రైళ్లను నిలిపివేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖుర్ధా డివిజన్ కార్యాలయం స్పష్టం చేసింది. ఇందులో విజయవాడ మీదుగా ప్రయాణించే 41 ఎక్స్‌ప్రెస్ రైళ్లున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి తుపాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర మూడు జిల్లాల కలెక్టర్లను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గురువారం ఉదయం ఆయన వైఎస్సార్ జిల్లా పర్యటనకు వెళ్లే ముందు ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, సీఎంవో కార్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాన్ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పారు. ఉత్తరాంధ్రలో తుపాను సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్ అధికారులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్.అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్‌దండే, విశాఖ జిల్లాకు శ్యామలరావును నియమించారు. వెంటనే ఆయా జిల్లాలకు చేరుకుని తుపాను సహాయ కార్యక్రమాల సమన్వయ, పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. -
అండమాన్‌లో అల్పపీడనం.. తుపానుగా మారేందుకు ఎక్కువ అవకాశం
సాక్షి, అమరావతి: దక్షిణ అండమాన్ సముద్రంలో మంగళవారం (నేడు) అల్పపీడనం ఏర్పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది ఉపరితల ఆవర్తనంగా బ్యాంకాక్ పరిసరాల్లో కొనసాగుతూ నేడు అండమాన్‌కు చేరుకునే అవకాశం ఉందని అంచనా. అల్పపీడనం ఏర్పడ్డాక ఇది 48 గంటల్లో వాయుగుండంగా బలపడుతుంది. ఆ తర్వాత తుపానుగా మారేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని గమనాన్ని బట్టి మంగళవారం పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదవండి: (తక్షణ వరద సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వండి: విజయసాయిరెడ్డి) తుపానుగా మారితే కాకినాడ తీరం నుంచి ఒడిశా వరకు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తరాంధ్రపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. తుపానుగా మారితే వచ్చే నెల 2 నుంచి దీని ప్రభావం రాష్ట్రంపై ఉండనుంది. మరోవైపు కోమరిన్, శ్రీలంక తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల సోమవారం కూడా నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
AP Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు–శ్రీలంక తీరంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని, దీని ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి శ్రీలంక–ఉత్తర తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం మరింత బలపడి 26వ తేదీన తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 26, 27 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో, 27వ తేదీ వైఎస్సార్ జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం మధ్య ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. రైతులు, సాధారణ పౌరులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు కోరారు. డిసెంబర్ 15వ తేదీ వరకు నైరుతి బంగాళాఖాతంలో వరుసగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నట్లు తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాజమండ్రిలో 97.75 మిల్లీమీటర్లు, జంబుపట్నంలో 92.5, గాజువాకలో 64.5, కంటిపూడిలో 58.25, నిడదవోలులో 56.5, తాడేపల్లిగూడెంలో 55.25, భీమడోలులో 49.75, ప్రత్తిపాడులో 41, రెడ్డిగూడెంలో 39.25, నర్సీపట్నంలో 34.75, మాడుగులలో 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
AP: ముంచెత్తిన వరద..వందలాది గ్రామాల్లోకి నీరు
సాక్షి ప్రతినిధి, కడప/నెల్లూరు(అర్బన్)/సాక్షి నెట్వర్క్: రెండు రోజులుగా బెంబేలెత్తించిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టగా.. వరద బీభత్సం నుంచి మాత్రం ఇంకా ఉపశమనం లభించలేదు. వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కుంభ వృష్టి కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధానంగా వైఎస్సార్ జిల్లాను వరద ముంచెత్తింది. రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, కడప ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల మేర వర్షం కురవగా, మిగిలిన నియోజకవర్గాల్లో సగటున 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 58 వేల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం ఉన్న పింఛాకు లక్షా 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడం, 2 లక్షల 20 వేల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం ఉన్న అన్నమయ్య ప్రాజెక్టుకు 3 లక్షల 20 వేల క్యూసెక్కులకుపైగా వరద రావడంతో రెండు ప్రాజెక్టులు శుక్రవారం తెల్లవారుజామున తెగిపోయిన విషయం తెలిసిందే. పర్యావసానంగా చెయ్యేరు గట్లు దాటి ప్రవహించింది. దీంతో రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల పరిధిలో 17 గ్రామాల్లోకి నీరు చేరింది. పదుల సంఖ్యలో ప్రజలు మునిగిపోగా, కొందరు వరదల్లో కొట్టుకుపోయారు. ప్రభుత్వ యంత్రాంగం, రెస్క్యూ టీములు హెలికాఫ్టర్ల ద్వారా శుక్రవారం నుంచే గాలింపు చర్యలు చేపట్టాయి. శనివారం సాయంత్రం నాటికి 15 మృతదేహాలు బయటపడ్డాయి. మిగిలిన వారి ఆచూకీ తెలియాల్సి ఉంది. వరి, మినుము, సజ్జ, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు నీటమునిగాయి. పెన్నా నది వరద ఉధృతికి నీట మునిగిన నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్ కాలనీ నిండుకుండలా 1,451 చెరువులు ► భారీ వర్షాలతో వైఎస్సార్ జిల్లాలో 1,451 చెరువులు పూర్తిగా నిండగా, 250 చెరువులు 50 శాతం నిండాయి. అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు, కాలువలకు భారీ నష్టం వాటిల్లింది. ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ రోడ్లు, ఆర్టీసీకి నష్టం వాటిల్లింది. ► కడప–తిరుపతి, కడప–అనంతపురం, కడప–నెల్లూరు, రాయచోటి–వేంపల్లెతో పాటు పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ► ఒక్క వైఎస్సార్ జిల్లాలోనే వివిధ రకాల పశువులు 3,370 మృతి చెందాయి. వేలాది ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. తెగిపోయిన అన్నమయ్య డ్యాం కట్ట ప్రాంతాన్ని శనివారం ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్‌కుమార్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పరిశీలించారు. తిరుపతి ఎంఆర్‌పల్లిలో వరద ఉధృతికి నీట మునిగిన కాలనీ కుంగిపోయిన పాపాఘ్ని వంతెన వల్లూరు (కమలాపురం): కడప– అనంతపురం రోడ్డు మార్గంలో కమలాపురం–వల్లూరు మధ్య పాపాఘ్ని వంతెన కుంగిపోయింది. రాకపోకలను నిలిపివేశారు. 50 మీటర్ల పొడవు మేరకు 2 మీటర్ల లోతుకు వంతెన కుంగింది. ప్రత్యేక నిపుణులతో పరిశీలించిన తర్వాత కొత్త వంతెనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలా.. లేక మరమ్మతులు చేయాలో నిర్ణయం తీసుకుంటామని నేషనల్ హైవే ఈఈ ఓబుల్ రెబ్డి తెలిపారు. వంతెన తాత్కాలిక మరమ్మతులకు రూ.3 కోట్ల వరకు అవసరం అవుతుందన్నారు. పెన్నా తీరం.. భయం భయం ► పెన్నా నదికి వస్తున్న వరద కారణంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జల దిగ్బంధంలోనే ఉంది. సోమశిల ప్రాజెక్ట్ నుంచి శనివారం 3.30 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. దీంతో దామరమడుగు, వీర్లగుడిపాడు, కోలగట్ల దళితకాలనీ, పడుగుపాడు, గుమ్మళ్లదిబ్బ, పల్లిపాళెం, కుడితిపాళెం, పెనుబల్లి తదితర గ్రామాలు నీట మునిగాయి. ► నెల్లూరు నగరంలోని తూకుమానుమిట్ట, జయలలితనగర్, అలీనగర్, అహ్మద్‌నగర్, ఉప్పరపాళెం, భగత్‌సింగ్ కాలనీని, జనార్దన్‌రెడ్డికాలనీ, వెంకటేశ్వరపురంలోని కొంతభాగం, స్టౌబీడీ కాలని తదితర ప్రాంతాల్లో ఉన్న నివాసాలను వరద చుట్టు ముట్టింది. ► దామరమడుగు వద్ద హైవే పైకి వరద చేరుకోవడంతో ముంబయి జాతీయ రహదారిపై రాకపోకలు బంద్ చేశారు. మలిదేవి పొంగడంతో మన్మధరావుపేటకు పక్కనే ఉన్న విడవలూరుకు రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ► బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగుకు చెందిన షేక్ కరిముల్లా, అతని కొడుకు వరద నీటిలో చిక్కుకుని విద్యుత్ స్తంభాన్ని పట్టుకుని తమను కాపాడాలని ఆర్తనాదాలు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని వారిని రక్షించాయి. తిరిగి బయటకు వచ్చే క్రమంలో శ్రీనివాసులు అనే కానిస్టేబుల్ (విజయనగరం 5వ బెటాలియన్) లైఫ్ జాకెట్ తెగిపోవడంతో వరద నీటిలో చిక్కుకుపోయి ఊపిరాడక మృతి చెందాడు. శ్రీనివాసులది శ్రీకాకుళం జిల్లా కండిస గ్రామం. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ► బుచ్చిరెడ్డిపాళెం మండలం శ్రీరంగరాజపురానికి చెందిన డీ బుజ్జయ్య (63) అనే రైతు పొలంలో ఉన్న మోటార్‌ను వరద నీటి నుంచి రక్షించుకుందామని వెళ్లి వరదలో చిక్కుకుని మృతి చెందాడు. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ► శనివారం మధ్యాహ్నం నుంచి చెన్నై నుంచి విశాఖ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్, నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లను నెల్లూరు రైల్వేస్టేషన్లో నిలిపేశారు. వరద ఉధృతి తగ్గేదాకా పూర్తిగా రైళ్ల రాకపోకలను నిలిపేస్తున్నట్టు రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ► చిత్తూరు జిల్లాలో శుక్రవారం రాత్రి నిమ్మనపల్లె మండలంలో మూతకనవారిగుంట చెరువు, ఎర్రగుంట చెరువులకు గండ్లుపడ్డాయి. ముష్ఠూరు గ్రామం వద్ద వరద నీటి ప్రవాహానికి కాజ్వే కొట్టుకుపోయింది. దెబ్బతిన్న వంతెనలు, చెరువు కట్టలు, రోడ్లను అధికారులు పరిశీలించి సత్వర చర్యలు చేపట్టారు. తిరుచానూరు స్వర్ణముఖి నదిపై దెబ్బతిన్న బ్రిడ్జిని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కలెక్టర్ హరినారాయణన్ పరిశీలించారు. ► అనంతపురం జిల్లాలో పెన్నా, చిత్రావతి, జయమంగళి, కుముద్వతి నదుల ప్రవాహం కొనసాగుతోంది. చెరువులన్నీ మరువలు పారుతున్నాయి. ధర్మవరం, పుట్టపర్తి ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న 16 మందిని బోటు ద్వారా పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు కురిశాయి. పంట నష్టం అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ధ్వంసమైన సోమేశ్వరాలయం సోమశిల: నెల్లూరు జిల్లా సోమశిలలోని శతాబ్దాల చరిత్ర కలిగిన కామాక్షి సమేత సోమేశ్వరాలయం పెన్నానది ప్రళయానికి ధ్వంసమైంది. ఆలయ గాలిగోపురం కూలిపోవడంతో పాటు అన్నపూర్ణాదేవి గర్భగుడి, నవగ్రçహాల ఆలయం, కల్యాణ మండపం నేలమట్టమైంది. ఆలయ ప్రహరీ కూలిపోయింది. కాగా, వరద ఉధృతికి ధ్వంసమైన శివాలయ ప్రాంతంలో కొత్తగా మరో శివలింగం ప్రత్యక్షమైంది. భారీ వర్షాల నుంచి ఉపశమనం సాక్షి, విశాఖపట్నం: తీవ్రమైన వర్షాలతో అతలాకుతలమైన రాష్ట్రానికి శనివారం కొంత ఉపశమనం లభించింది. మరో ఐదు రోజులపాటు ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలే తప్ప భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బలహీనపడిన వాయుగుండం ప్రస్తుతం అల్పపీడనంగా మారి కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుంచి తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నాయి. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. 26న మరో అల్పపీడనానికి చాన్స్ ఈ నెల 26న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపుగా వెళ్లనుందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో 27వ తేదీ తర్వాత భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గడచిన 24 గంటల్లో మచిలీపట్నంలో 99 మి.మీ., కనెకల్లులో 67, బొమ్మనహల్‌లో 65.5, పెదగంట్యాడలో 53.5, బుక్కరాయ సముద్రంలో 47, పలమనేరులో 44, బొల్లపల్లెలో 42.5, బెస్తవారిపేటలో 42, గాజువాకలో 38 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
వాయుగుండంగా మారిన అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం గురువారం ఉదయం వాయుగుండంగా బలపడింది. ఇది చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 140 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 110, కరైకల్‌కు తూర్పు ఈశాన్యంగా 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా కదులుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వద్ద చెన్నైకి సమీపంలో శుక్రవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీవర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొన్నారు. శనివారం ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాలో ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. భారీవర్షాలు పడే జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు, విశాఖపట్నం పోర్టులో రెండో నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు.. గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. రెండురోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో వడమాలపేటలో 132.75 మిల్లీమీటర్లు, పాకాలలో 110.75, తవణంపల్లెలో 108.25, చిత్తూరులో 106.50, రామచంద్రాపురంలో 104.25, చంద్రగిరిలో 96, శ్రీకాళహస్తిలో 94, కలకడ, రొంపిచర్లల్లో 93, యాదమర్రిలో 91.75, రేణిగుంటలో 90, చిట్వేల్‌లో 85, శ్రీరంగరాజపురంలో 82.75, కొత్తపల్లిలో 82, పలమనేరులో 79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
18 తర్వాత తుపాను!
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం అండమాన్ సముద్రంలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. సోమవారం (ఈ నెల 15న) ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అనంతరం ఇది ఈ నెల 17న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడి.. 18వ తేదీన దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపించి జవాద్ తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఈశాన్య గాలులు రాష్ట్రంపై కొనసాగుతుండటం వల్ల.. సోమ, మంగళవారాల్లో కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో కందుకూరులో 87.25 మి.మీ., దివ్వారిపాలెంలో 82.5, కదిరిలో 67.25, గండ్లపేటలో 58.75, పెనుకొండలో 58, నిమ్మనపల్లెలో 57.25, నల్లమడలో 54.25, బెస్తవారిపేటలో 49, రాచర్లలో 45.25, పులివెందులలో 45, నగరిలో 42 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
పొంచి ఉన్న ‘జవాద్’ ముప్పు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉంది. థాయ్‌లాండ్, అండమాన్ నికోబార్ తీరం వద్ద శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఆగ్నేయ బంగాళాఖాతానికి చేరుకుని 15వ తేదీ నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత మరింత బలపడి ఏపీ తీరంలో 17, 18 తేదీల నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపానుగా మారాక దీనికి ‘జవాద్’గా నామకరణం చేయనున్నారు. విశాఖ, కాకినాడ మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఏపీ తీరానికి 1,200 కి.మీ. దూరంలో ఉంది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. 15వ తేదీ నుంచి దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 16న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 17 నుంచి తీరం దాటే వరకూ ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 45 నుంచి 65 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఎవరూ వేటకు వెళ్లొద్దని, వేటకు వెళ్లిన వారు 15వ తేదీలోపు తిరిగి వెనక్కి వచ్చేయాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తమిళనాడు తీరంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ వైపు వచ్చి మరింత బలహీనపడింది. మయన్మార్‌కు సమీపంలో ఏర్పడిన అధిక పీడన ప్రాంతం కారణంగా ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంపై బలంగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాగల రెండ్రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలూ కురవొచ్చు. వెనక్కి వెళ్లిన సముద్రం పూసపాటిరేగ: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరంలో సముద్రం శనివారం 100 అడుగుల లోపలకు వెళ్లింది. అలల తాకిడి సైతం తగ్గింది. వాయుగుండం, ఆటు పోట్ల ప్రభావంతో నీరు వెనక్కి వెళ్లినట్టు మత్స్యకారులు చెప్పారు. -
Andhra Pradesh: ముంచెత్తిన కుండపోత
సాక్షి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు/సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరపిలేని వర్షం వల్ల జనజీవనం స్తంభించిపోయింది. జోరువానకు తోడు గాలి బీభత్సం సృష్టించడంతో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిత్తూరు జిల్లాలోని తూర్పు మండలాలపై వర్ష ప్రభావం అధికంగా కనిపించింది. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏర్పేడు మండలంలోని గుడిమల్లం–పాపానాయుడుపేట మధ్య ఉన్న సీతకాలువలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణవనం మండలంలోని అరుణానది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కేవీబీపురం మండలంలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాళంగి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పోలీస్, రెవెన్యూ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేశారు. పుత్తూరు మండలంలోని నేసనూరు, గోపాలకృష్ణాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అరణియార్ రిజర్వాయర్ వద్ద ఎమర్జెన్సీ గేట్లు ఎత్తివేయడంతో ఆ ప్రాంతాన్ని హై అలర్ట్‌గా ప్రకటించారు. దిగువ ప్రాంతాల్లోని గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. చంద్రగిరి మండలంలోని చంద్రగిరి – నాగయ్యగారిపల్లె మార్గంలో రోడ్డు పూర్తిగా దెబ్బతింది. వరదయ్యపాళెం మండంలోని పాముల కాలువపై ఉధృతంగా నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,700 ఎకరాల్లో వరి, టమాట, కూరగాయలు, పూలతోటలు నీట మునిగాయి. అధికారులు ప్రతి సచివాలయ పరిధిలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కలెక్టరేట్లో ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. తిరుమలలో పొంగిపొర్లుతున్న ఐదు డ్యామ్‌లు తిరుమలలో గురువారం తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షంతో ఘాట్ రోడ్డులో, శ్రీవారి పాదాలు, పాపవినాశనం, ఎంబీసీ ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. మొదటి ఘాట్ రోడ్డులోని రెండో మలుపు వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఎంబీసీ వద్ద ఓ చెట్టు విరిగి పడటంతో జలప్రసాదం ప్లాంట్ ధ్వంసమైంది. గాలిగోపురం వద్ద చెట్టు కూలి మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఈ పరిస్థితిలో రెండు ఘాట్ రోడ్లు, పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మూసి వేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. విరిగి పడిన కొండచరియలు, చెట్లను తొలగించేందుకు టీటీడీ ఆటవీ శాఖ ఆధ్వర్యంలో మూడు బృందాలను ఏర్పాటు చేసినట్టు డీఎఫ్ఓ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. తిరుమాడవీధులు, శ్రీవారి ఆలయం ఎదుట నీరు భారీగా ప్రవహిస్తోంది. పది సెంటీమీటర్లకు పైగా వర్షం వల్ల తిరుమలోని ఐదు డ్యామ్‌లు పూర్తిగా నిండాయి. నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. 400 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, తడ, నాయుడుపేట, చిట్టమూరు, దొరవారిసత్రం, కోట, వాకాడు, పెళ్లకూరు, ముత్తుకూరు మండలాల్లో అతి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేటలో 18.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 9 మండలాల్లో 10 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. దీంతో ఆయా మండలాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గూడూరు వద్ద పంబలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. స్వర్ణముఖి నదికి నిండుగా నీరు చేరడంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు నగరంలోని శివారు ప్రాంతాలు, ఖాళీ స్థలాలు జలమయమయ్యాయి. నగరంలోని కరెంటాఫీసు సెంటర్, అయ్యప్పగుడి, మన్సూర్‌నగర్, పొగతోట తదితర ప్రాంతాల్లోని ప్రధాన రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. ఆత్మకూరు బస్టాండ్, మాగుంట లేఅవుట్, రామలింగాపురం అండర్ బ్రిడ్జిలు నీటితో నిండిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. అ«ధికారులు యుద్ధ ప్రాతిపదికన నీటిని యంత్రాలతో తోడేస్తున్నారు. కలెక్టర్ చక్రధర్‌బాబు ముందస్తు జాగ్రత్తగా గురు, శుక్రవారాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. 8 చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లాలో 2 వేల హెక్టార్లలో వరినాట్లు, 50 హెక్టార్లలో వరినార్లు నీట మునిగాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఆ నీరు కాలువల్లోకి వెళ్లి పోతుందని తెలిపారు. అల్లూరు, కావలి, నెల్లూరు, సూళ్లూరుపేట తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గంటల వ్యవధిలోనే పునరుద్ధరిస్తున్నారు. నడి సంద్రంలో 12 మంది మత్స్యకారులు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం తాటిచెట్లపాళెంకు చెందిన 12 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి పడవ మరమ్మతుల కారణంగా వెనక్కి రాలేకపోవడంతో చిక్కుకుపోయారు. ఈ నెల 9న వారు కృష్ణపట్నంకు చెందిన మెకనైజ్డ్ బోటులో వేటకు వెళ్లారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వెనక్కి తిరిగి వస్తుండగా బోటు గేర్ బాక్స్‌లో సమస్యలు తలెత్తడంతో మైపాడు తీరానికి సమీపంలో పడవ సముద్రంలోనే నిలిచి పోయింది. ఈ విషయాన్ని మత్స్యకారులు ఫోన్ ద్వారా అధికారులకు, రాష్ట్ర ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్‌బాబుకు సమాచారం అందించారు. కృష్ణపట్నంకు చెందిన కోస్ట్‌గార్డ్స్ ద్వారా మత్స్యకారులను తీరానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైఎస్సార్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం వైఎస్సార్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. చిట్వేల్ మండంలంలోని గొట్టిమానుకోన రిజర్వాయర్ నిండి అలుగు పారుతోంది. రాయచోటి నియోజకవర్గంలోని సుండుపల్లె – రాజంపేట దారిలో సుద్దకోళ్లవంక ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు ఆగిపోయాయి. మాండవ్యనది ఉధృతంగా ప్రవహిస్తోంది. రైల్వేకోడూరు ప్రాంతంలో గుంజనేరు, ముస్టేర్లు పొంగిపొర్లుతున్నాయి. వెలిగిళ్ల, గంగనేరు, పించా, ఝరికోన ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి.రాయచోటి ప్రాంతంలోని సంచాలమ్మ గండిచెరువు, నూలివీడు వద్ద పెద్ద చెరువులు ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. రాజంపేట ప్రాంతంలోని హేమాద్రివారిపల్లెను నీరు చుట్టుముట్టడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఊటుకూరు పుల్లంగినేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అన్నమయ్య ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వరి, పత్తి, మిరప, ఉల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడప, రాజంపేట, జమ్మలమడుగు రెవిన్యూ డివిజన్లలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. వైవీయూ డిగ్రీ సెమిస్టర్ çపరీక్షలను వాయిదా వేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంతోపాటు కందుకూరు, చీరాల, సింగరాయకొండ, ఉలవపాడు, తీర ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. 27 మండలాల అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. తీవ్ర ప్రభావిత గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. అనంతపురం జిల్లా హిందూపురం, ముదిగుబ్బ, గాండ్లపెంట, కదిరి, ఎన్పీకుంటలో ఓ మోస్తరు వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం పడుతోంది. తీరం దాటిన వాయుగుండం.. నేడు, రేపు భారీ వర్షాలు సాక్షి, విశాఖపట్నం/అమరావతి : నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన వాయుగుండం గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల మధ్య ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా మధ్య తీరం దాటింది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి శుక్రవారం ఉదయం 6 గంటలకు తీవ్ర అల్పపీడనంగా బలహీన పడనుంది. అనంతరం మరింత బలహీనపడి అనంతపురం జిల్లా మీదుగా కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వైపు ప్రయాణించనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో అనంతపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని సూచించారు. రాగల 48 గంటల పాటు మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యల ప్రత్యేక బృందాలను పంపినట్టు రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలియజేశారు. -
తుపాను ముప్పు.. 4 జిల్లాల్లో కుంభవృష్టికి అవకాశం!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం గురువారం ఉదయం మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నాటికి ఇది బలహీనపడి వాయుగుండంగా మారి అనంతపురం జిల్లా, కర్ణాటక రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. 13 ఏళ్ల తర్వాత నెల్లూరుకు సమీపంలో తుపాను తీరం దాటనుంది. అంతకు ముందు 2008 నవంబర్ 13న నెల్లూరు వద్ద తుపాను తీరాన్ని దాటింది. వాతావరణశాఖ తెలిపిన మేరకు.. గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు, ఒకటిరెండు చోట్ల భారీవర్షాలు కురిసే సూచనలున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతిభారీ వర్షాలు, వైఎస్సార్ కడప, చిత్తూరు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శుక్రవారం నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల అతితీవ్రమైన భారీవర్షాలు, గుంటూరు, అనంతపురం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక, కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవుల్లో అప్రమత్తత హెచ్చరికలు జారీచేశారు. వాయుగుండం ప్రభావంతో రెండురోజులు తీరం అల్లకల్లోలంగా ఉండనుంది. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు.. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ కన్నబాబు కోరారు. 13న మరో అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఏర్పడిన 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. -
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాలో మూడు రోజులపాటు వర్షాలు పడనున్నాయని తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. నెల్లూరు: అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. -
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఆగ్నేయ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి మంగళవారం అల్పపీడనంగా మారనుంది. చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఏర్పడే ఈ అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ గురువారం తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీనిప్రభావం వచ్చే నాలుగు రోజులు దక్షిణకోస్తా, ఉత్తర తమిళనాడులపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 11, 12 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విశాఖ ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు పాడేరు: విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మూడురోజుల నుంచి చలిగాలులు అధికమవడంతోపాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలుల తీవ్రత నెలకొంటోంది. అర్ధరాత్రి నుంచే దట్టంగా పొగమంచు కురుస్తోంది. సోమవారం జి.మాడుగులలో 10.5 డిగ్రీలు, డుంబ్రిగుడలో 10.7, పెదబయలులో 11.1, అరకులోయలో 11.4, ముంచంగిపుట్టులో 11.5, హుకుంపేటలో 12.1, పాడేరులో 12.5, చింతపల్లిలో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
Rain Alert: ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: తమిళనాడు, శ్రీలంక పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తోంది. ఇది క్రమంగా ఉత్తర దిశగా ప్రయాణిస్తూ రాగల 36 గంటల్లో మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు కొమరిన్, శ్రీలంక పరిసర ప్రాంతాల మీదుగా మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది. (చదవండి: Kodi Rammurthy Naidu: తెరపైకి కలియుగ భీముడు) అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వానలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈ జిల్లాల పరిధిలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. 4, 5 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. (చదవండి: బద్వేలు బ్లాక్ బస్టర్) -
స్థిరంగా అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): తమిళనాడు, శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఉంది. దీనికి అనుబంధంగా విస్తరించిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రాగల 48 గంటల్లో ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతానికి ప్రవేశించి పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఆ తరువాత 48 గంటల్లో ఉత్తర వాయువ్యంగా ప్రయాణించి మరింత బలపడుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకు మన్నార్ గల్ఫ్, తమిళనాడు తీర ప్రాంతం మీదుగా సముద్ర మట్టం వద్ద ఉపరితల ద్రోణి వ్యాపించి ఉంది. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా, తిరుమలలో సోమవారం వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు కుండపోత వర్షం కురిసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని జలాశయాలలో నీటిమట్టం పెరుగుతోంది. -
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండ్రోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక తీరాల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు వరకూ విస్తరించి ఉంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించారు. గడచిన 24 గంటల్లో ప్రకాశం జిల్లా బి.నిడమానూరులో అత్యధికంగా 275 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. చింతవరంలో 57, వై.రామవరంలో 54.5, నూజివీడులో 32.5, పెదబయలులో 31.5 మి.మీ. నమోదైంది. (చదవండి: అప్పుడలా.. ఇప్పుడిలా.. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం) -
6న మరో అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు, శ్రీలంక తీరప్రాంతం సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. నవంబర్ 6వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి తుపానుగా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం మూడు, నాలుగు రోజుల్లో పశ్చిమదిశగా ప్రయాణించి బలహీనపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో 5.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. -
AP: మూడు రోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. రానున్న మూడు రోజుల్లో అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించనుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ద్రోణి వాయవ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తా, రాయలసీమల్లో రానున్న మూడురోజులు విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు. గురువారం నుంచి 30వ తేదీ వరకు మూడురోజులు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వివరించారు. 29, 30 తేదీల్లో విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురిశాయి. -
Rain Alert: ఏపీలో రెండు రోజులు వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): దక్షిణ బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఇది పశ్చిమదిశగా ప్రయాణించే అవకాశం ఉందని, దీనివల్ల అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని కారణంగా రాగల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. చదవండి: Extramarital Affair: ‘సంబంధం’ పెట్టుకుని.. సస్పెండయ్యారు! -
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. అల్పపీడనంగా మారే అవకాశం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరణ స్ధిరంగా కొనసాగుతోంది. ఈ కారణంగా రాగల 48 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, సోమవారం భారత ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలోకి ఈశాన్య రుతు పవనాల రాక ప్రారంభమైంది. మరోవైపు అధిక పీడనం కారణంగా సముద్రం నుంచి రాష్ట్రం వైపు తేమ వస్తోంది. -
అక్కడక్కడా తేలికపాటి వర్షాలకు చాన్స్
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరిస్తోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఈ కారణంగా రాగల రెండు రోజుల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ ప్రాంతంలోనూ కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం భూమిపైకి చేరి ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతోంది. ఇది విదర్భ మీదుగా ఉత్తరప్రదేశ్ వైపు పయనిస్తూ క్రమేపి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మన రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్కువ చోట్ల వర్షాలు పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా మందసలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాబోయే రెండురోజులు కోస్తాంధ్రలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. -
నేడు, రేపు మోస్తరు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మీదుగా ఛత్తీస్‌గఢ్ వైపు కదులుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. అదేవిధంగా అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తూర్పు, పశ్చిమ ద్రోణి సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. గడచిన 24 గంటల్లో గొల్లప్రోలులో 114.25, కొత్తపల్లిలో 102.25, వాకతిప్పలో 90, హరిపురంలో 87, రాజాంలో 76.75, టెక్కలిలో 67.7, గోపాలపురంలో 62, వేపాడలో 55.7, తునిలో 55.5, కొయ్యూరులో 51, తిరుపతిలో 49.2, మెరకముడిద్దాంలో 48.25 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. 27న మరో అల్పపీడనం ఈ నెల 27న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇది కాకినాడ, విశాఖపట్నం లేదా పూరీ ప్రాంతంలో తీరం దాటే సూచనలున్నాయని భావిస్తున్నారు. ఒకవేళ దిశను మార్చుకుంటే తమిళనాడు వైపుగా పయనించే అవకాశాలున్నాయని వెల్లడించారు. తిరుపతిలో భారీ వర్షం తిరుపతితుడా(చిత్తూరు జిల్లా): తిరుపతిలో శనివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఎడతెరపిలేని వర్షం పడటంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలువలు పొంగి ప్రవహించాయి. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. -
బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 24 గంటల్లో ఇది పశ్చిమ–వాయవ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. -
నేడు, రేపు తేలికపాటి వానలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర అండమాన్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ కారణంగా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు మరింత ఆలస్యమవుతున్నాయి. దీని ప్రభావంతో ఈ నెల 13న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం ఐఎండీ తెలిపింది. ఇది క్రమంగా ఒడిశా వైపుగా పయనించి.. 15వ తేదీన మరింత బలపడే సూచనలున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగానూ.. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు రుతుపవన ద్రోణి రాయలసీమ మీదుగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వానలు కురుస్తాయని, ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడేందుకు ఆస్కారం ఉందని అధికారులు తెలిపారు. -
నేడు అల్పపీడనం.. అనంతరం తుపాను
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర నుంచి రాయలసీమ మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఉండటం వల్ల ఇది తదుపరి నాలుగైదు రోజుల్లో మరింత బలపడి తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇది దిశ మార్చుకుని బర్మా మీదుగా ప్రయాణించనుంది. బర్మా సమీపానికి వెళ్లిన తర్వాత మళ్లీ దిశ మార్చుకుని దక్షిణ ఒడిశా వైపు రానుంది. ఫలితంగా ఈ తుపాను ప్రభావమంతా ఒడిశాపైనే ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండురోజుల్లో రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 17న రాష్ట్రాన్ని తాకాల్సిన ఈశాన్య రుతుపవనాలు 23 లేదా 24వ తేదీన వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో ఒకటిరెండు చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నట్లు పేర్కొంది. పిడుగులకు ఇద్దరి దుర్మరణం పొదలకూరు/దొరివారిసత్రం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం పిడుగులు పడి ఇద్దరు దుర్మరణం చెందారు. ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. నేదురుమల్లి గ్రామంలో పశువుల్ని మేతకు తోలుకెళ్లిన కోవూరు పెంచలనాయుడు (42), దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డిపాళెం ఎస్సీ కాలనీలో గొర్రెల్ని మేతకు తోలుకెళ్లిన తిరునామల్లి నవీన్ (21) పిడుగులు పడి ప్రాణాలు కోల్పోయారు. నేదురుమల్లికి చెందిన కోవూరు రత్నమ్మ తీవ్రంగా గాయపడింది. -
రేపు అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపు(ఆదివారం) అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రేపు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణ దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. చదవండి: Heavy Rain: హైదరాబాద్‌లో ఉరుములు.. మెరుపులు.. -
నేడు, రేపు తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కేరళ వరకూ సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. ఇదిలావుండగా.. నైరుతి రుతుపవనాల తిరోగమనం వాయువ్య భారత దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి బుధవారం ప్రారంభమైంది. మరోవైపు.. ఉత్తర అండమాన్ సముద్ర తీరంలో ఈ నెల 10వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్టు ఐఎండీ అంచనా వేస్తోంది. ఇది క్రమంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈ నెల 14 లేదా 15వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరానికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. కాగా, గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పరిగిలో 64.5 మి.మీ., బాడంగిలో 58.5, హిందూపూర్‌లో 49, లేపాక్షిలో 46.5, కర్నూలులో 40, గొల్లపాడులో 38.5, గజపతినగరంలో 37.5, మార్కాపురం, ఓర్వకల్లులో 37, బొబ్బిలిలో 34.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
స్థిరంగా అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని చాంద్‌బలికి దక్షిణంగా సోమవారం తీరం దాటింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ రానున్న 48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా మధ్యప్రదేశ్ వైపు కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని అధికారులు తెలిపారు. -
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం?
-
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం?
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో శనివారం ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిశా–పశ్చిమబెంగాల్ తీరం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వెల్లడించింది. అయితే కోస్తా తీరానికి సమీపం నుంచి కదులుతుండటంతో ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ రెండో వారం వరకూ వర్షాలు పడే సూచనలున్నాయనీ.. తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టి.. పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. కాగా, శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి, వజ్రపుకొత్తూరు మండలాల్లో శుక్రవారం వేర్వేరు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు. -
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది మరింత బలపడి ఉత్తర బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో శనివారం (11వ తేదీన) అల్పపీడనం ఏర్పడనుంది. ఇది 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారనుంది. క్రమంగా దక్షిణ ఒడిశా, ఒడిశా ప్రాంతాల మీదుగా మధ్యప్రదేశ్, విదర్భ వైపు వెళ్లనుంది. దీని ప్రభావం రాష్ట్రంపై అంతంత మాత్రంగానే ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు గుజరాత్ సమీపంలో అరేబియా తీరంలో అల్పపీడనం కొనసాగుతుండటం వల్ల తేమ గాలులు రాష్ట్రం వైపుగా వస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రెండురోజులు అక్కడక్కడా ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆది, సోమవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు పడే అవకాశాలున్నట్లు చెప్పారు. గడిచిన 24 గంటల్లో పలాసలో 67 మిల్లీమీటర్లు, సోంపేటలో 63, వజ్రపుకొత్తూరులో 56, మందసలో 40.75, నరసన్నపేటలో 33.4, గారలో 22, ఎల్‌ఎన్‌పేటలో 19, సంతబొమ్మాళిలో 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
11న అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/కొమ్మాది (భీమిలి)/విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి మన రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఈనెల 11న ఉత్తర బంగాళాఖాతాన్ని అనుకుని మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. షీర్ జోన్ (ద్రోణి) సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు అల్పపీడన ద్రోణి ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విశాఖ జిల్లా తిమ్మాపురం గ్రామం బుధవారం నీట మునిగింది. కాపులుప్పాడ ప్రాంతంలో వరిపొలాల్లోకి నీరు చేరింది. మంగమారిపేట, ఉప్పాడ, తిమ్మాపురం ప్రాంతాల్లో సముద్ర కెరటాలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో మంగమారిపేట వద్ద సముద్ర తీరం కోతకు గురైంది. జిల్లాలోని ప్రధాన నదులైన తాండవ, శారద, వరాహ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాండవ, కల్యాణపులోవ జలాశయాలు నిండుగా ఉన్నాయి. ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే ప్రధాన డుడుమ జలాశయంలో నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. గెడ్డలో కొట్టుకుపోయి.. బయటపడిన పాల వ్యాపారి ఆనందపురం మండలం వెల్లంకికి చెందిన పోలయ్య పాల వ్యాపారం కోసం కాపులుప్పాడ వెళ్తుండగా పరదేశిపాలెం గెడ్డ వద్ద నీటి ఉధృతికి ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయిన పోలయ్య.. అక్కడున్న కర్రల సహాయంతో ఒడ్డుకు చేరుకున్నాడు. మధ్యాహ్నం నీటి ఉధృతి తగ్గిన తర్వాత స్థానికుల సాయంతో ద్విచక్ర వాహనాన్ని ఒడ్డుకు చేర్చారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం!
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో రేపు (సోమవారం) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తా జిల్లాలకు భారీ వర్ష పడనున్నట్లు సూచించింది. వైస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణకు మరో ఐదురోజుల పాటు భారీ వర్షం కురువనున్నట్లు తెలిపింది. చదవండి: ‘నవనీత సేవ’లో భక్తులకు అవకాశం -
రేపు అల్పపీడనం.. భారీ వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తు వరకూ విస్తరించింది. దీని ప్రభావంతో సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లోను.. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో రాజమండ్రిలో 7.2 సెం.మీ., అంబాజీపేటలో 7, ఎల్.ఎన్. పేటలో 6.7, తణుకులో 6.3, మచిలీపట్నంలో 6.1, మండపేటలో 5.9, అనపర్తి, పెడనలో 5.9, మచిలీపట్నంలో 5.6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 6వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. అది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంవైపు కదిలే సూచనలున్నా దాని ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని పేర్కొంది. దీనివల్ల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తీరప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 11న శ్రీకాకుళం జిల్లాలో భారీవర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రధానంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవీ చదవండి: గూఢచారి ‘ధ్రువ్’ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలివే.. మాయ‘లేడి’: చాటింగ్‌తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్ -
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
సాక్షి, అమరావతి /సాక్షి, విశాఖపట్నం: రుతుపవన ద్రోణి మచిలీపట్నం మీదుగా ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా గుజరాత్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కి.మీ వరకూ కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాగల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది. శుక్రవారం కోస్తాంధ్రలోని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రావులపాలెంలో 12 సెం.మీ, అడ్డతీగలలో 9.5, రంగాపురంలో 7.2, ఆత్రేయపురంలో 6.6, నాగాయలంకలో 6.0, చిలకలూరిపేటలో 5.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌లో విస్తారంగా వానలు ఆగస్టులో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. 139.9 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 138.5 మి.మీ వర్షం కురిసింది. కోస్తా జిల్లాల్లో 162.1 మి.మీ వర్షానికి 169 మి.మీ వర్షం పడింది. రాయలసీమలో 108.5 మి.మీటర్లకు 96.4 మి.మీ వర్షం కురిసింది. 3 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ, 4 జిల్లాల్లో కురవాల్సిన దాని కంటే కొంచెం తక్కువ వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈ వర్షాకాలంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ అంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవనాలు బలపడటంతో ఈ సీజన్లోనే ఎక్కువ వర్షపాతం ఈ నెలలో నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న అల్పపీడన ద్రోణి కూడా సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఎత్తులో స్థిరంగా ఉంది. వీటి ప్రభావంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. 13 జిల్లాల్లో సగటున 2.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 9.9, శ్రీకాకుళంలో 9 మి.మీ సగటు వర్షపాతం రికార్డయ్యింది. విశాఖపట్నంలో 5.6 మి.మీ, కృష్ణా జిల్లాలో 5, తూర్పుగోదావరిలో 4.9, పశ్చిమగోదావరిలో 4.2, ప్రకాశం జిల్లాలో 2.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. (చదవండి: లోకేశ్.. పిచ్చి ప్రేలాపనలు వద్దు) శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో అత్యధికంగా 116.5 మి.మీ (11.6 సెంటీమీటర్లు) వర్షం కురిసింది. విజయనగరం జిల్లా మెరకముడిదంలో 71.3, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో 64.8, ప్రకాశం జిల్లా టంగుటూరులో 62.8, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 53.8, తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో 52.3, ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 51.3, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో 49.8, శ్రీకాకుళం జిల్లా బుర్జలో 47.8, కర్నూలు నగరంలో 47 మి.మీ వర్షపాతం నమోదైంది. రాబోయే రెండు రోజులు కోస్తాంధ్రలోని పలుచోట్ల భారీ వర్షాలు, అనేక చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం ఉత్తరాంధ్రలో, గురువారం ఉత్తరాంధ్రతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
ఏపీ: ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనం మీదుగా ఏర్పడిన రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకూ కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఈ నెల 30,31 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయి. సోమవారం విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. గడిచిన 24 గంటల్లో సత్తెనపల్లిలో 8.3 సెం.మీ, కాకుమానులో 8.0, గుంటూరులో 7.9, రాజాంలో 7.5, నిజాంపట్నంలో 7.1, పొన్నూరులో 6.3, నాగాయలంకలో 5.8, మార్తూరులో 5.5, తెనాలిలో 5.4, తెర్లాంలో 5.3, నిడుబ్రోలులో 5.1, ఎస్.కోటలో 5.0 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇవీ చదవండి: గత టీడీపీ సర్కారు నిర్వాకం: వైద్య రంగంలో భారీ కుంభకోణం.. బడికి వెళ్లకుంటే.. వలంటీర్ వస్తారు! -
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శనివారం (నేడు) వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. చదవండి: ఏపీలో తక్కువ వ్యయంతో సరుకు రవాణా శనివారం విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో, ఆదివారం విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో గారలో 11.8 సెంటీమీటర్లు, గుమ్మలక్ష్మీపురంలో 8.3, కళింగపట్నంలో 8.0, పాలకొండలో 7.9, ఇంకొల్లులో 7.5, శ్రీకాకుళంలో 7.0, నూజెండ్లలో 6.4, కురుపాంలో 5.8, సీతంపేట, అద్దంకి, వేటపాలెంలో 5.1, మద్దిపాడులో 5.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చదవండి: కేసులు వేసే అధికారం ఈఓ, ఏసీలకు.. -
రేపు మూడు జిల్లాల్లో భారీ వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. అదేవిధంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఉత్తర బంగాళా ఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది దిశ మార్చుకొని ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణ వైపు ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లా ల్లో తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో వెంకటగిరిలో 6.1 సెంటీమీటర్లు, తవనంపల్లెలో 5.1, గోరంట్లలో 4.9, కృత్తివెన్నులో 4.6,నూజివీడులో 4.5, తాడేపల్లిగూడెంలో 4.2, జగ్గయ్యపేటలో 3.7, పలమనేరులో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
రెండురోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్యభారత దేశం వైపు ప్రయాణించింది. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ, నైరుతి గాలులు రాష్ట్రం వైపుగా వీస్తున్నాయి. ఈ గాలుల ప్రభావం ఉత్తర కోస్తా వైపు ఎక్కువగా ఉంటోంది. ఈ కారణంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఇది ఈ నెల 21 నాటికి మరింత బలపడనుంది. దీని ఫలితంగా 21, 22 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా రాగల రెండు రోజుల పాటు తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయి. -
కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ప్రస్తుతం ఒడిశా తీరానికి సమీపంలో ఛత్తీస్‌గఢ్ తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాలను ఆనుకుని ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. రాగల 24 గంటల్లో దిశను మార్చుకుని ఉత్తర దిశగా విదర్భ వైపు ప్రయాణించే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా వాయువ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర తమిళనాడు వరకూ ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించి ఉంది. మరోవైపు.. అల్పపీడన ప్రభావంతో బుధవారం కోస్తా జిల్లాల్లో ఒకట్రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు పడతాయని వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ.. తీరం వెంబడి గంటకు 40–50 కి.మీ వరకు గరిష్టంగా 60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలున్నాయన్నారు. మత్స్యకారులెవ్వరూ రాగల 48 గంటల వరకూ సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని ముసునూరులో 58.5 మి.మీ, సూళ్లూరుపేటలో 55.2, చింతూరులో 52, లావేరులో 45.2, నర్సాపురంలో 40, పెడనలో 39, పాలకొండలో 34.5, రాయవరంలో 30.5, అనపర్తిలో 28.5, సీతంపేట 27.5 మి.మీ వర్షపాతం నమోదైంది. -
కొనసాగుతున్న అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్రమట్టనికి 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవీ చదవండి: ఇడ్లీ, పూరీ అంటే ఇష్టం.. దోశ, వడ కూడా.. భార్య కోసం భర్త సాహసం.. వరదను సైతం లెక్క చేయకుండా -
AP: 24 గంటల్లో అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం వెంబడి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగాను, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం తెలిపారు. ఉత్తరాంధ్రలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అలాగే, రాబోయే మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40–50 కీలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. రాయలసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక సోమవారం పలుచోట్ల వర్షాలు కురవగా, విజయనగరం జిల్లా వేపాడులో అత్యధికంగా 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. -
అల్పపీడనం: ఏపీలో రేపు భారీ వర్షాలు..
సాక్షి, అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తులశాఖ పేర్కొంది. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉంటుందని.. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారుల సూచించారు. -
48 గంటల్లో అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ) : పశ్చిమ బంగాళాఖాతం, దానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతం కేంద్రంగా ఈ నెల 15లోగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. దీనివల్ల రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల ఈనెల 17 వరకు ఉత్తరకోస్తా, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని అధికారులు తెలిపారు. ఇక ఉత్తరాంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తులో దక్షిణం వైపు ఉంది. దీని ప్రభావంవల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని ఆ కేంద్రం వివరించింది. అప్రమత్తం.. తూర్పుగోదావరి: రానున్న 48 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉండటంతో సహాయక యంత్రాంగాన్ని అధికారులు అప్రమత్తం చేశారు. అల్పపీడన ప్రభావంతో 17వ తేదీ వరకు తూర్పు తీరంలో 40 కి.మీ -50 కి.మీ వేగంతో ఈదురుగాలులు, వర్షం పడే అవకాశముందని అధికారులు తెలిపారు. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. డివిజన్, మండల కేంద్రాల్లో రక్షణ, సహాయక శాఖల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబరు: 1800 425 3077 -
12న అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల మధ్యలో బంగాళాఖాతంలోఈ నెల 12న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఈ నెల 13 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం తేలికపాటి వానలు పడతాయన్నారు. మరోవైపు ఉత్తర ఈశాన్య తెలంగాణ, ఉభయగోదావరి జిల్లాల మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు వానలు పడే సూచనలున్నాయి. మధ్య భారతదేశంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం కారణంగా రాష్ట్రంపై పొడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ కారణంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ అల్పపీడనం బలహీనపడేవరకు పరిస్థితులు ఇదే మాదిరిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. సోమవారం నుంచి వాయవ్య దిశగా గాలులు నెమ్మదిగా రాష్ట్రంపైకి వీయనుండటంతో వాతావరణంలో మార్పులు కనిపించనున్నాయి. గడిచిన 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నూజివీడులో 80 మిల్లీమీటర్లు, వంగరలో 70, కిర్లంపూడిలో 47.25, దుగ్గిరాలలో 41, దేవరాపల్లిలో 39.25, చందర్లపాడులో 39, సత్తెనపల్లిలో 38, కురుపాం, నూజెండ్లల్లో 35, అమరావతిలో 33.5, శంఖవరంలో 33, కంచికచర్లలో 30.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
నేటి నుంచి ఏపీలో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ దిశ నుంచి కోస్తాంధ్ర మీదుగా గాలులు వీస్తుండటంతో కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు ఈ నెల 12న బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా మచిలీపట్నం, గుంటూరు మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫలితంగా ఆదివారం నుంచి కోస్తా, రాయలసీమల్లో అడపాదడపా వానలు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నారు. 13వ తేదీ తరువాత వర్షాలు ఊపందుకుంటాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాయలసీమలో ఒకట్రెండు చోట్ల, దక్షిణ కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. -
ఏపీ: రాగల 48 గంటల్లో తేలికపాటి వర్షాలు..
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. గ్యాంగ్‌టక్ పశ్చిమ బెంగాల్‌కు సమీపంలో తీవ్ర అల్పపీడనం కదులుతోందన్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టనికి 7.6కి.మీ ఎత్తున విస్తరించిందని, దీంతో రాబోయే 48 గంటల్లో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రాగల 48 గంటలు పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే ఒకటి రెండు చోట్లా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. -
రెండు రోజులపాటు వానలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తుల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉంది. దీని ప్రభావం వల్ల ఈ నెల 28న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. -
28న అల్పపీడనం: నేడు, రేపు తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి పశ్చిమ దిశ నుం చి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నప్పటికీ బలమైన గాలుల కారణంగా వానలు తగ్గుముఖం పట్టినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో కొన్ని చోట్ల తేలిక పాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాది జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నెల 28న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుత నైరుతి సీజన్లో ఆదివారం నాటికి 32.45 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 54.39 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 68 శాతం అధికంగా వర్షాలు కురిసినట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ తెలిపింది. 23 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 10 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. -
బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఈ నెల 28న ఉత్తర బంగాళాఖాతం, పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. -
28న మరో అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఒడిశా తీరంలోని ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఈ నెల 28న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బిహార్ వైపు వెళ్లి బలహీనపడింది. దీంతో దాని ప్రభావం రాష్ట్రంలో తగ్గినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. -
నేడు, రేపు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/అనంతపురం: దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అందువల్ల ఈ నెల 20, 21 తేదీల్లో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ నెల 21న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఇది బలపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. ఒకవేళ బలపడి వాయుగుండంగా మారితే ఒడిశా వైపు కదులుతుందని వివరించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కదిరిలో రికార్డు స్థాయి వర్షపాతం రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా కదిరిలో అత్యధికంగా 23 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పెనుకొండ, హిందూపురం పట్టణాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. లేపాక్షిలో 10.04 సెం.మీ., ఎన్పీ కుంటలో 9, అమడగూరులో 8.52 చిలమత్తూరులో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కదిరిలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి పెద్దఎత్తున వర్షం నీరు చేరింది. ఓడీ చెరువు సమీపంలో ప్రధాన రహదారి తెగిపోవడంతో కదిరి, హిందూపురం, బెంగళూరు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పుట్టపర్తి వద్ద చిత్రావతి, కుషావతి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 3 నుంచి 6 సె.మీ. వర్షం కురిసింది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోనూ చాలాచోట్ల వర్షాలు కురిశాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
తెలంగాణలో మరో రెండ్రోజులు వానలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నట్లు సూచించింది. దీనికి అనుబంధంగా ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి వ్యాపించి ఉన్నట్లు వివరించింది. వాటి ప్రభావంతో రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు సైతం నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 30 సెం.మీ. వర్షపాతం.. రాష్ట్రంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8:30 గంటల వరకు 1.93 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో ఇప్పటివరకు 30.17 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవగా 16 జిల్లాల్లో అధికం, 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటలో 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంటలో 11.8 సెం.మీ., వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేటలో 11.3 సెం.మీ., వరంగల్‌లో 10.1 సెం.మీ., ఖానాపూర్‌లో 10 సెం.మీ. వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు మండలాల్లో అతిభారీ, 20కిపైగా మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. -
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీనిప్రభావంతో 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు పడతాయని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. కోస్తా, రాయలసీమల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరువర్షాలు కురుస్తాయని, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు. ఈ నెల 17న ఏపీ తీరానికి సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. -
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర బిహార్‌పై ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం ఒడిశా, ఉత్తర కోస్తా వరకూ విస్తరించింది. ఇది సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు ఈ నెల 11న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. కోస్తా జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ. వరకూ.. గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని వివరించారు. మత్స్యకారులెవరూ రానున్న మూడు రోజులపాటు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. జంగారెడ్డిగూడెంలో 13.5 సెం.మీ., పెదపూడిలో 12.5, కాకినాడలో 10.3, ముండ్లమూరులో 10 సెం.మీ. భారీ వర్షపాతం నమోదవగా.. ఉలవపాడులో 9.6, సింగరాయకొండ, అద్దంకిలో 8.6, గోపాలపురం, కందుకూరులో 8.5, జగ్గంపేటలో 8.1, దేవరపల్లి 7.7, రాజాంలో 7.3, పిఠాపురంలో 7.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
2 రోజుల్లో మరో అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక అల్పపీడనం ఉండగా.. రెండు, మూడు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే వాయవ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. వాయవ్య జార్ఖండ్ పరిసరాలపై ఉన్న ఈ అల్పపీడనం ఇప్పుడు తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్లపై ఉంది. కొత్తగా ఏర్పడనున్న అల్పపీడనం ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపుగా కదులుతుందని, దీని ప్రభావం మన రాష్ట్రంపై ఉండదని అధికారులు స్పష్టం చేశారు. వచ్చే 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలకు , దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. మరోవైపు నైరుతి రుతుపవనాల జోరు తగ్గింది. పశ్చిమ గాలుల వల్ల వాయవ్య భారతదేశంలో మిగిలిన భాగాల్లో రుతుపవనాల పురోగతి నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. -
రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అల్పపీడనం, నైరుతి రుతుపవనాల వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయవ్య బంగాళాఖాతం, దాని పక్కనే ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ తీరాలపై అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఎత్తులో నైరుతి దిశగా వంగి ఉంది. ఇది పడమర దిశగా ప్రయాణించొచ్చు. వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వానలు పడతాయని అధికారులు చెప్పారు. -
ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అల్పపీడనం, నైరుతి రుతుపవనాలతో రానున్న 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా విస్తరించిన ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా వంగి ఉంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కదలే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వీటికితోడు నైరుతి రుతుపవనాల విస్తరణతో రానున్న 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని వివరించారు. -
నేడు, రేపు భారీ వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/అమరావతి: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. ఇది వచ్చే రెండు, మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. దీనికి తోడు నైరుతి రుతు పవనాలు విస్తరిస్తుండటంతో రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా హీరలో 30 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. -
మరింత బలపడుతున్న అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాల మధ్య కేంద్రీకృతమై ఉన్న ఈ అల్పపీడనం శనివారం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ఒడిశా మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదలవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం తుపానుగా మారే అవకాశం లేదని చెప్పారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో 2 రోజులు పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు వర్షాలు పడతాయని తెలిపారు. ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుందని, పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడంతో వాటి ప్రభావంతో కూడా వర్షాలు ఎక్కువగా కురిసే పరిస్థితి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 15వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని సూచించింది. -
బలపడిన అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం/అమరావతి బ్యూరో: తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శనివారం సాయంత్రానికి మరింత బలపడింది. ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగా.. 24వ తేదీన యాస్ తుపానుగా రూపాంతరం చెందనుంది. ఆ తర్వాత 24 గంటల్లో మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలకు ఈ నెల 26న చేరే సూచనలున్నాయని అధికారులు పేర్కొన్నారు. అదేరోజు సాయంత్రం ఒడిశా, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని తాకే వీలుందన్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఆదివారం గంటకు 40 నుంచి 50 కి.మీ., గరిష్టంగా 60 కి.మీ. వేగంతోనూ, 24న 50 నుంచి 60 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో గంటకు 60 నుంచి 70 కి.మీ., గరిష్టంగా 80 కి.మీ. వేగంతో గాలులు వీస్తామని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించారు. 5 రోజులపాటు మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపారు. తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్న ప్రాంతం అప్రమత్తమైన నౌకాదళం, కోస్ట్‌గార్డ్ తుపాను నేపథ్యంలో భారత నౌకాదళం, తీరగస్తీ దళం(కోస్ట్‌గార్డ్) సహాయక చర్యలకు సిద్ధమయ్యాయి. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 8 ఫ్లడ్ రిలీఫ్ బృందాలతోపాటు నాలుగు డైవింగ్ బృందాలను ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు తూర్పు నౌకాదళం పంపించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు 4 నేవీ షిప్‌లు విశాఖ నుంచి బయలుదేరాయి. విశాఖలోని ఐఎన్ఎస్ డేగా, చెన్నైలోని ఐఎన్ఎస్ రజాలి నేవల్ ఎయిర్ స్టేషన్లలో నేవల్ హెలికాప్టర్లు, మెడికల్ టీమ్‌లు బయలుదేరాయి. ఇండియన్ కోస్ట్ గార్డు కూడా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధమైంది. తమిళనాడు, ఒడిశా, ఏపీ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో సముద్ర జలాల్లో వేటకు వెళ్లిన మత్స్యకారుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు కోస్ట్ గార్డ్íÙప్స్, సేఫ్టీ బోట్స్‌ను పంపించేందుకు సిద్ధంగా ఉంచినట్టు విశాఖ కోస్ట్‌గార్డ్ ప్రధాన కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు.. నలుగుర్ని బలిగొన్న పిడుగులు సాక్షి నెట్వర్క్: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాలో సగటున 22.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. జిల్లాలోని చేబ్రోలులో అత్యధికంగా 81.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతం నుంచి కంభం చెరువుకు వరద నీరు వచ్చి చేరుతోంది. గుండ్లకమ్మ, లోతువాగు, జంపలేరు, పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గిద్దలూరు నియోజకవర్గంలో గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కర్నూలు జిల్లా వెలుగోడులో 60.2 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. జిల్లా అంతటా సగటున 14.2 మిలీమీటర్ల వర్షం కురిసింది. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. శనివారం వెలిగండ్ల, విజయవాడలో 9 సెం.మీ.,గజపతినగరం, ప్రొద్దుటూరు, ముద్దనూరు, దువ్వూరులో 7, వల్లూరు, రాయదుర్గం, కమలాపురం, కంబదూరులో 6 సెం.మీ., పోలవరం, చింతలపూడి, భీమవరం, బద్వేల్, హిందూపురం, పెనుకొండ, ఆత్మకూరు, చిత్తూరు, కడప, బ్రహ్మసముద్రంలో 5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా, విజయనగరం జిల్లాలో శనివారం వేర్వేరుచోట్ల పిడుగులు పడి నలుగురు మృత్యువాత పడ్డారు. బొబ్బిలి మండలం చింతాడలో సంకిలి తౌడు(45), గుంట చిన్నారావు (35), ఆజారి చిన్నారావు(35) పిడుగుపడి మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. నెల్లిమర్ల మండలం సతివాడలో గొర్రెల కాపరి గొంప సూరిబాబు(28) మృతిచెందాడు. -
Cyclone Yaas: 24న ‘యాస్’ తుపాను!
సాక్షి, అమరావతి బ్యూరో/విశాఖపట్నం: పశ్చిమ తీరాన్ని వణికించిన టౌటే అత్యంత తీవ్ర తుపాను బలహీనపడిన కొద్దిరోజులకే బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడబోతోంది. ఉత్తర అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుంది. అది వాయవ్యదిశగా కదులుతూ వాయుగుండంగాను, ఆపై తీవ్ర వాయుగుండంగాను బలపడి ఈనెల 24న తుపానుగా మారనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ మరింతగా తీవ్రరూపం దాల్చి ఈ నెల 26 ఉదయానికి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ల మధ్య తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. దీని ప్రభావం రాష్ట్రంపై స్వల్పంగా, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై అధికంగాను ఉంటుందని అంచనా వేసింది. రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. తుపాను ఏర్పడనున్న నేపథ్యంలో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. యాస్ తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాస్ అంటే.. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపానుకు ఒమన్ దేశం సూచించిన ‘యాస్’ అని నామకరణం చేయనున్నారు. తుపాను ఏర్పడ్డాక ఈ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. యాస్ అనే పదం పర్షియన్ భాష నుంచి వచ్చింది. ఆంగ్లంలో జాస్మిన్ (మల్లెపూవు) అని అర్థం. తుపాన్లు ఏర్పడినప్పుడు వాటికి పేర్లు పెట్టడం రివాజుగా వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు రానున్న తుపాను ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలను కురిపించనుంది. అయితే మన రాష్ట్రంలో ఎండలు ఉధృతం కావడానికి దోహదపడనుంది. మధ్య బంగాళాఖాతంలో ఈ తుపాను ఏర్పడనున్న నేపథ్యంలో గాలివాటం మారనుంది. కొన్నాళ్లుగా నైరుతి, దక్షిణ గాలులు వీస్తుండడంతో రాష్ట్రంలో ఉష్ణ తీవ్రత అంతగా కనిపించడం లేదు. ఈ తుపాను ఏర్పడటానికి ముందు నుంచి రాష్ట్రంపైకి ఉత్తర గాలులు వీయనున్నాయి. ఫలితంగా అటునుంచి వచ్చే గాలులు వేడిగా ఉండడం వల్ల రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్రంలో రాబోయే 4 రోజులు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఊటుకూరులో 13 సెంటీమీటర్లు, అమడగూరులో 10, ఉంగుటూరులో 9.6, కడపలో 9, ఆగిరిపల్లిలో 8.5, కంభంలో 8, అద్దంకిలో 7.5, మొవ్వలో 7.3, బెస్తవానిపేట, పెనగలూరుల్లో 7, పొదిలి, ఉరవకొండల్లో 6, సత్తెనపల్లి, కోయిలకుంట్ల, వల్లూరుల్లో 5, జమ్మలమడుగు, వెంకటగిరికోట, దొర్నిపాడు, ప్రొద్దుటూరు, పామిడి, కమలాపురం, జూపాడుబంగ్లాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అండమాన్‌లోకి ‘నైరుతి’ మరోవైపు నైరుతి రుతుపవనాల తొలి అడుగు అండమాన్ సముద్రంలోకి ప్రవేశంతోనే పడుతుంది. శుక్రవారం ఈ రుతుపవనాలు దక్షిణ, ఉత్తర అండమాన్ సముద్రం, నికోబార్ దీవులతో పాటు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. రెండు రోజుల్లో నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించనున్న ఈ రుతుపవనాలు మన రాష్ట్రంలోకి జూన్ 5వ తేదీనాటికి ప్రవేశించే అవకాశం ఉంది. -
Arabian Sea: వాయుగుండంగా మారిన అల్పపీడనం
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం దక్షిణ గుజరాత్ తీరప్రాతానికి 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా అల్పపీడనం బలపడి ఈ నెల 16 నాటికి తుపాన్‌గానూ, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర, అతి తీవ్ర తుపాన్‌గా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న నాలుగు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడున్నాయని పేర్కొంది. ఈ తుపానుకు 'తౌక్టే' అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది. 'తౌక్టే' తీవ్ర తుపానుగా మారి ఈనెల 18న గుజరాత్ వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా తౌక్టే' తుపాన్ ప్రభావంతో కేరళలో భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ, యానాం, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రపై తుపాను ప్రభావం ఉండనుందని, అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో ‘తౌక్టే’ ప్రభావం అరేబియా సముద్రంలో లక్షద్వీప్ వద్ద అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ గుజరాత్ తీర ప్రాంతానికి 920 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుఫాన్.. మరో 12 గంటల్లో తీవ్రమైన తుఫానుగా రూపాంతరం చెందనుందని వాతావరణ కేంద్ర తెలిపింది. ఆ తర్వాత అతి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉందని. గుజరాత్ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను ప్రభావంతో ఏపీ, తెలంగాణ, రాయలసీమ పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయని, ఋతుపవనాల రాకకు ఇది శుభ సంకేతమని వాతావరణ శాఖ పేర్కొంది. చదవండి: తుఫాన్ అలర్ట్: దూసుకొస్తున్న ‘తౌక్టే’ -
తుఫాన్ అలర్ట్: దూసుకొస్తున్న ‘తౌక్టే’
సాక్షి, విశాఖపట్నం: ఆఫ్రికా ఖండం నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఆగ్నేయæ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది కేరళ, కర్ణాటక వైపుగా పయనించే సూచనలున్నాయి. క్రమంగా అల్పపీడనం బలపడి ఈ నెల 16 నాటికి తుపాన్‌గానూ, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర, అతి తీవ్ర తుపాన్‌గా రూపాంతరం చెందుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుపాన్‌కు మయన్మార్ సూచించిన ‘తౌక్టే’ పేరుని పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇది 18వ తేదీ నాటికి గుజరాత్‌కు చేరుకుంటుందని, అయితే ఎక్కడ తీరం దాటుతుందనే అంచనా చిక్కడం లేదని చెబుతున్నారు. తౌక్టే ప్రభావం రాష్ట్రంపై ఏమాత్రం ఉండబోదని తెలిపారు. అయితే బంగాళాఖాతం నుంచి తేమ గాలుల్ని అల్పపీడనం తీసుకునేందుకు ప్రయత్నిస్తుండటం వల్ల రెండు మూడు రోజుల పాటు రాయలసీమలో జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని తెలిపారు. ఈ తుఫాన్ నైరుతి రుతుపవనాల రాకపై ఏమాత్రం ప్రభావం చూపించబోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రుతు పవనాలు సాధారణంగా జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. కానీ ఈ తుఫాను వల్ల సకాలంలో గానీ, అంతకంటే రెండు మూడు రోజుల ముందే నైరుతి రాష్ట్రాన్ని తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకూ ఉత్తర దక్షిణ ద్రోణి వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో తేమ గాలులు ఉత్తరాంధ్ర జిల్లాలవైపు విస్తరిస్తున్నాయి. ఫలితంగా కోస్తా, రాయలసీమల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లా కుందుర్పిలో 4 సెం.మీ, కల్యాణదుర్గం, రాయదుర్గం, సెత్తూరులో 3, సింహాద్రిపురం, కంబదూరు, లేపాక్షిలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
ఏపీ: రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో నిన్న(ఆదివారం) ఏర్పడిన అల్పపీడనం బలపడి, వాయుగుండంగా మారింది. గడిచిన 6 గంటల్లో వాయువ్య దిశగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి పాండిచేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 550 కి.మీ. చైన్నైకి ఆగ్నేయ దిశగా 590 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయ్యిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది బలపడి రాగల 24 గంటల్లో తుఫానుగా మారి, వాయువ్య దిశగా ప్రయాణించి, కారైకాల్, మహా బలిపురం, ప్రాంతాల మధ్య తీరాన్ని 25 నవంబర్‌న సాయంత్రం తీవ్ర తుఫానుగా గంటకు 100-110 కి.మీ. గాలి వేగంతో దాటవచ్చని పేర్కొంది. చదవండి: తుఫానుగా బలపడనున్న వాయుగుండం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనను భారత వాతావరణ శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచిఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాయలసీమ : ఈరోజు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. -
కొనసాగుతున్న అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరగా నైరుతి బంగాళాఖాతంలో 1.5 కిలో మీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో ఈ అల్పపీడనం బంగ్లాదేశ్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రాగల 48 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. దక్షిణ కోస్తా ఆంధ్రాలో అక్కడ అక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా ఆదివారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. తునిలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. -
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని ఉత్తర అండమాన్ దగ్గర ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది తదుపరి 36 గంటల్లో బంగ్లాదేశ్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉండడంతో రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం ఉండబోదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య పవనాలు ప్రవేశించడంతో ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం కనిపిస్తోంది. విశాఖ మన్యంలోని మినుములూరులో 16.5 డిగ్రీలు, అరకులోయలో 18.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వగా ఆరోగ్యవరంలో 19.5 డిగ్రీలు నమోదైంది. రానున్న రెండు రోజులూ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. -
కోస్తాకు తప్పిన వాయుగుండం ముప్పు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలోని అల్పపీడనం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్రల సమీపాన వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ప్రాంతానికి ఆనుకుని కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో తుఫాను ఆవర్తనం నెలకొంది. ఈ అల్పపీడనం ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా బలపడవచ్చు. ఇది ఉత్తర వాయవ్య దిశగా ఒడిసా తీరం వెంబడి, వాయవ్య బంగాళాఖాతంలో పయనిస్తూ 48 గంటల్లో బెంగాల్ బంగ్లాదేశ్‌ల మీదకు వెళుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు సాయంత్రానికి ఇది తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. చదవండి: వదలని వరద తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరం వరకూ ద్రోణి కొనసాగుతోంది. ఇది మరో మూడురోజులు ప్రభావశీలంగా ఉంటుంది వీటి ప్రభావం తెలంగాణ కోస్తాంధ్రలమీద తక్కువగా కోస్తా రాయలసీమలో మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర సుముద్రతీరం అల్లకల్లోలంగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు పోరాదనీ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. -
దిశ మార్చుకున్న తీవ్ర అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అల్పపీడనం దిశ మార్చుకుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌కు ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బుధవారం తీవ్ర అల్ప పీడనంగా మారి దిశ మార్చుకుంది. ఇది రాగల 24 గంటల్లో వాయవ్య దిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరానికి సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ బెంగాల్–బంగ్లాదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా తూర్పు–పశ్చిమ ద్రోణి వెంబడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది 1.5 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తుకి వెళ్లేకొద్దీ దక్షిణ దిశ వైపు వంపు తిరిగి ఉంది. దీని ప్రభావం వల్ల గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
తీవ్ర అల్పపీడనం: తెలంగాణలో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇది వాయవ్య దిశగా ప్రయాణించి తదుపరి 48 గంటల్లో ఒడిశా తీరానికి దగ్గరలో ఉన్న వాయవ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనానికి అనుబంధం గా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతెలంగాణపై కూడా ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజుల పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రం గారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం సగటున రాష్ట్రంలో 8.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూన్ నుంచి బుధవారం నాటికి నమోదైన వర్షపాతం గణాంకాల ను పరిశీలిస్తే రాష్ట్రంలో సగటున కురవాల్సిన 80.2 సెం.మీ. సాధారణ వర్షపాతానికి గాను ఈ నెల 21 నాటికే 124.63 సెం.మీ. సగటు వర్షం కురిసింది -
మధ్య బంగాళాఖాతంలో "అల్పపీడనం"
సాక్షి, హైదరాబాద్: మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాని ప్రభావం వలన ఈ ప్రాంతంలో ఈరోజు (మంగళవారం) ఉదయం 08.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. ప్రారంభములో ఇది రాగల 48 గంటలలో వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 3 రోజులలో ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలోనూ అక్కడక్కడ భారీ వర్షాలు, పలు చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. -
కొనసాగుతున్న అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతున్నందున కోస్తాంధ్ర, దక్షిణాంధ్రల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ సోమవారం ప్రకటించింది. ఈ అల్పపీడనం రేపటికి (మంగళవారం) మరింతగా బలపడనున్నట్లు వాతావరణం శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రంలో పెరగనున్న అలలు ఉధృతి, సముద్ర తీరం వెంట 45 కి.మీ నుంచి 55 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. -
హైదరాబాద్‌ను భయపెడుతున్న వర్షం
సాక్షి, హైదరాబాద్ : నగరవాసుల్ని వర్షం భయం వెంటాడుతోంది. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. చార్మినార్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఈసీఐఎల్, తార్నాక, నేరేడ్మెట్, మూసాపేట, కూకట్పల్లి, జేఎన్టీయూ, ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో వర్షం పడుతోంది. మరోవైపు జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ వరద సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ( చెప్తే విన్నారు కాదు, గండం తప్పింది! ) వచ్చే 24 గంటల్లో అల్పపీడనం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అది ఆ తర్వాతి 24 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని పేర్కొంది. దీని ప్రభావంతో రెండు రోజులపాటు (సోమ, మంగళవారాల్లో) కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హెల్ప్ లైన్ నెంబర్లు : ఎమర్జన్సీ :100 ఇతర సహాయం కోసం : 040-21111111 డీఆర్ఎఫ్ టీం సహాయం కోసం : 040-29555500. Most parts of city are likely to witness rainfall, citizens are advised to stay Indoors unless unavoidable. Dial-100 for emergencies for any other assistance from DRF Team dial 040-29555500 @KTRTRS @bonthurammohan @arvindkumar_ias pic.twitter.com/q8Qpln9zwB — GHMC (@GHMCOnline) October 19, 2020 -
నేడు, రేపు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కి.మీ. ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఆ తరువాత 24 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని పేర్కొంది. దీని ప్రభావంతో రెండు రోజులపాటు (సోమ, మంగళవారాల్లో) కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ నెల 20న కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. సముద్రం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ, వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు 19 నుంచి 22 వరకూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. గడచిన 24 గంటల్లో కారంచేడు, చీమకుర్తిలో 4 సెం.మీ., శ్రీశైలం, భీమడోలు, నర్సాపురం, యానాంలో 3, అమలాపురం, చింతలపూడి, వింజమూరు, తణుకులో 2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
నేడు, రేపు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనున్నట్లు హెచ్చరించింది. మరోవైపు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు, తెలంగాణ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. -
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అదేవిధంగా దక్షిణ కోస్తాకు దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకూ అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి బలహీనపడ్డాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. ఇది బలపడి తదుపరి 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో ఈ నెల 19, 20, 21 తేదీల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఈ కారణంగా ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ కోస్తా, యానాం పరిసర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. వదలని వాన గడచిన 24 గంటల్లో బొండపల్లి, కారంచేడులో 8 సెం.మీ., డెంకాడలో 7, గుడివాడ, కుక్కునూరులో 6, పాలకోడేరులో 5, చిత్తూరు, అనకాపల్లి, పోలవరం, రేపల్లె, నర్సీపట్నం, గజపతినగరంలో 5, పాలసముద్రం, పుంగనూరు, నగరి, నూజివీడు, నెల్లిమర్ల, విజయనగరం, వరరామచంద్రాపురం, కూనవరం, తుని, రాజమండ్రి, పొదిలి, గుంటూరు, చింతపల్లిలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
మళ్లీ వాయుగుండం
సాక్షి, హైదరాబాద్: తూర్పు మధ్య అరేబియా సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సౌరాష్ట్రకు దక్షిణ దిశగా, ముంబై నగరానికి పశ్చిమ వాయవ్య దిశగా ఈ వాయుగుండం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. దీని ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వివరించింది. ఈ వాయుగుండం ప్రభావం రానున్న 48గంటల పాటు కొనసాగి క్రమంగా బలహీనపడే అవకాశముందని పేర్కొంది. కాగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈనెల 19న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఇది తదుపరి 24 గంటల్లో బలపడనుందని హెచ్చరించింది. -
19న బంగాళాఖాతంలో అల్పపీడనం..
సాక్షి, హైదరాబాద్: మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఏర్పడిన 24 గంటల తర్వాత తీవ్ర అల్పపీడ నంగా మారే అవకాశముందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో నేడు, రేపు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం ఉత్తర మహారాష్ట్ర తీరానికి దగ్గరలోని తూర్పు మధ్య అరేబియా సముద్రం, సమీప ప్రాం తాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఉత్తర మహారాష్ట్ర– దక్షిణ గుజరాత్ తీరాలకు దగ్గరలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. కాగా, కోస్తాంధ్ర, తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర తీరానికి దగ్గరలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపింది. -
మరో 3 రోజులపాటు తెలంగాణలో వర్షాలు
సాక్షి, హైదరాబాద్: మధ్య బంగాళాఖాతంలో సుమారు అక్టోబర్ 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. దక్షిణ మధ్య మహారాష్ట్రతో పాటు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కొంకన్ ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తదుపరి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మహారాష్ట్ర తీరంకు దగ్గరలో తూర్పు మధ్య అరేబియా సముద్రంలోనికి ప్రవేశించింది. దీంతో రాగల 48 గంటలలో మహారాష్ట్ర- దక్షిణ గుజరాత్ తీరాలను ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంతో పాటు దానిని ఆనుకుని ఉన్న ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతాలలో ఇది వాయుగుండముగా బలపడి క్రమేపి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మరింత బలపడే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు 18 డిగ్రీ అక్షాంశం వెంబడి ఉత్తర కోస్తా ఆంధ్ర, తెలంగాణ, దక్షిణ మధ్య మహారాష్ట్ర, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కొంకన్ ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనంకు అనుబంధముగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వరకు 1.5కిమీ నుంచి 3.1 కిమీ ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. -
ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కొనసాగుతున్న వాయుగుండం దక్షిణ మధ్య మహారాష్ట్ర ఆనుకుని ఉన్న దక్షిణ కోంకణ్ వద్ద తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో స్పియర్ స్థాయిల వరకు కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మహారాష్ట్రకు దగ్గరలోని తూర్పు మధ్య అరేబియా సముద్రములోనికి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ అల్ఫపీడనం తదుపరి 48 గంటలలో మహారాష్ట్ర-దక్షిణ గుజరాత్ తీరాలను ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా దానిని ఆనుకుని ఉన్న ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతాలలో వాయుగుండముగా బలపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం క్రమేపి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు అరేబియా సముద్రం వరకు 18°N ఆక్షాంశాల వెంబడి ఉత్తరాంధ్ర, తెలంగాణ దక్షిణ మధ్య మహారాష్ట్ర దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోంకణ్ వద్ద కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా 1.5కిమీ నుంచి 3.1కిమీ ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో అక్టోబర్ 19వ తేదీన మధ్య అరేబియా సముద్రంలో మరోక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన : ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణా కోస్తాంధ్ర, రాయలసీమలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే శనివారం ఉత్తర, దక్షిణా కోస్తాంధ్రలతో పాటు రాయలసీమ, యానాంలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. -
కోస్తాను ముంచెత్తిన వాన
సాక్షి, అమరావతి: రెండు రోజులుగా కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు వాగులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ నగరాల్లో లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. నగరాల్లోని అనేక అపార్టుమెంట్లలోకి నీరు చేరింది. వివిధ ప్రాంతాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ ఉధృత రూపం దాల్చింది. కృష్ణా కరకట్టపై ఉన్న ఇళ్లలోకి నీరు వస్తోందని, ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పలువురికి హెచ్చరికలు జారీ చేశారు. వాగుల్లా మారిన రహదారులు – భారీ వర్షాలతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు సైతం వాగులను తలపిస్తున్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో అనేక కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. – విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట తీరంలోని ఉప్పులేరు పొంగడంతో పడవలు కొట్టుకుపోయాయి. జిల్లాలోని గోస్తని, శారదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. – భారీ వర్షాలు, గాలులతో పలుచోట్ల పంటలు నీట మునిగాయి. కోత, పొట్టదశలో ఉన్న వరి నీట మునిగింది. భారీ గాలుల వల్ల కొబ్బరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రహదారులు, చెరువు గట్లకు గండ్లు పడ్డాయి. వందలాది పూరిళ్లు కూలిపోయాయి. సురక్షిత ప్రాంతాలకు తరలింపు – వరద ప్రభావిత జిల్లాల కలెక్టరేట్లలో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మందులు, నిత్యావసర వస్తువులను అవసరమైన మేరకు నిల్వ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కన్నబాబు తెలిపారు. – రహదారులు, కాలువలు, వంతెనలకు గండ్లు పడి రవాణాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించాలని ఆదేశించారు. – ఎక్కడకు కావాలంటే అక్కడికి సహాయ కార్యక్రమాల కోసం తరలించడానికి వీలుగా విశాఖపట్నం జిల్లాలో మూడు జాతీయ విపత్తు సహాయక దళాలను (ఎన్డీఆర్ఎఫ్) సిద్ధంగా ఉంచారు. కాకినాడలో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. – సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 129 మండలాల్లో 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. కలెక్టరేట్లలో 24 గంటలూ కంట్రోల్ రూమ్‌లు – వరద ప్రభావిత జిల్లాల్లోని కలెక్టరేట్లలో రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్‌లు పని చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాలకు తరలించారు. – నిత్యం అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాలను శరవేగంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పంట నష్టం వివరాలను వీలైనంత త్వరగా పంపాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లాలో జలవనరులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 327 బృందాలతో సహాయక కార్యక్రమాలు చేపట్టింది. ఆ శాఖ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది. తీరం దాటిన తీవ్ర వాయుగుండం సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం – నర్సాపూర్ మధ్య కాకినాడకు 30 కి.మీ దూరంలోని నేమం ప్రాంతంలో తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం 6.30 – 7.30 గంటల మధ్య తీరం దాటింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటిన సందర్భంగా గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలివేగం ఒక దశలో 75 కిలోమీటర్ల గరిష్ట స్థాయికి చేరిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. మంగళవారం రాత్రి పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 18 కి.మీ వేగంతో ప్రయాణించి తెలంగాణ దిశగా పయనిస్తోంది. ఇది క్రమంగా వాయుగుండంగా తదుపరి అల్పపీడనంగా బలహీన పడిందని తెలిపింది. అయితే.. వాయుగుండం ప్రభావం సముద్రంపై ఇంకా కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం కోస్తా తీరంలో సముద్రం అలలు 4.5 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే ప్రమాదం ఉండటంతో పర్యాటకులు, మత్స్యకారులు తీరం వైపు వెళ్లొద్దని హెచ్చరించారు.