
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని ఉత్తర అండమాన్ దగ్గర ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది తదుపరి 36 గంటల్లో బంగ్లాదేశ్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉండడంతో రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం ఉండబోదని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈశాన్య పవనాలు ప్రవేశించడంతో ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం కనిపిస్తోంది. విశాఖ మన్యంలోని మినుములూరులో 16.5 డిగ్రీలు, అరకులోయలో 18.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వగా ఆరోగ్యవరంలో 19.5 డిగ్రీలు నమోదైంది. రానున్న రెండు రోజులూ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment