
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం భూమిపైకి చేరి ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతోంది. ఇది విదర్భ మీదుగా ఉత్తరప్రదేశ్ వైపు పయనిస్తూ క్రమేపి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మన రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్కువ చోట్ల వర్షాలు పడ్డాయి.
శ్రీకాకుళం జిల్లా మందసలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాబోయే రెండురోజులు కోస్తాంధ్రలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment