సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనం మీదుగా ఏర్పడిన రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకూ కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఈ నెల 30,31 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయి.
సోమవారం విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. గడిచిన 24 గంటల్లో సత్తెనపల్లిలో 8.3 సెం.మీ, కాకుమానులో 8.0, గుంటూరులో 7.9, రాజాంలో 7.5, నిజాంపట్నంలో 7.1, పొన్నూరులో 6.3, నాగాయలంకలో 5.8, మార్తూరులో 5.5, తెనాలిలో 5.4, తెర్లాంలో 5.3, నిడుబ్రోలులో 5.1, ఎస్.కోటలో 5.0 సెం.మీ వర్షపాతం నమోదైంది.
ఇవీ చదవండి:
గత టీడీపీ సర్కారు నిర్వాకం: వైద్య రంగంలో భారీ కుంభకోణం..
బడికి వెళ్లకుంటే.. వలంటీర్ వస్తారు!
Comments
Please login to add a commentAdd a comment