forecast
-
నాలుగేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి
న్యూఢిల్లీ: బలహీనమైన డిమాండ్ వంటి పలు కారణాల నేపథ్యంలో మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా నివేదిక పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (6.6 శాతం), జాతీయ గణాంకాల కార్యాలయం మొదటి ముందస్తు అంచనాలు(6.4 శాతం), ఆర్థిక శాఖ తొలి అంచనా (7 శాతం) కన్నా ఎస్బీఐ రీసెర్చ్ అంచనా తక్కువగా ఉండడం గమనార్హం.వ్యవస్థలో డిమాండ్ ధోరణులు బలహీనంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2020–21లో కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8 శాతం క్షీణతను నమోదుచేసిన సంగతి తెలిసిందే. అటు తర్వాత 6.3 శాతం వృద్ధి రేటు నమోదయితే అది నాలుగేళ్ల కనిష్ట స్థాయి అవుతుంది. బేస్ ఎఫెక్ట్‌తో 2021–22లో ఎకానమీ వృద్ధి రేటు 9.7 శాతంగా నమోదయ్యింది. 2022–23లో 7 శాతం, 2023–24లో 8.2 శాతంగా ఈ రేట్లు ఉన్నాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 6.7 శాతం వృద్ధి నమోదవగా, రెండవ క్వార్టర్లో 7 క్వార్టర్ల కనిష్ట స్థాయిలో 5.4 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ రూపొందించిన ఈ నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు...జీడీపీ వృద్ధిలో మందగమనం ఉన్నప్పటికీ తలసరి ఆదాయం 2023–24తో పోల్చితే, 2024–25లో రూ. 35,000 పెరిగే అవకాశం ఉంది. భారీ పెట్టుబడులుకు సంబంధించిన విభాగ ం– క్యాపిటల్ ఫార్మేషన్లో వృద్ధి రేటు 270 బేసిస్ పాయింట్లు (2.7%) 7.2 శాతానికి దిగిరానుంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2024–25 జీడీపీలో 4.9 శాతంగా (బడ్జెట్ లక్ష్యం ప్రకారం) ఉంటుంది. -
రాయలసీమలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది.దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో నేడు అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అక్కడక్కడా భారీ వర్షాలు పడేందుకు ఆస్కారముందని వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు.ఇదీ చదవండి: 9న పుంగనూరుకు వైఎస్ జగన్ -
10 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీహార్‌లో భారీ వర్షాలకు అక్కడి జనం అతలాకుతలమవుతున్నారు. తూర్పు యూపీలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.రాబోయే ఐదారు రోజుల్లో ఈశాన్య ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర తదితర 10 రాష్ట్రాల్లో కుండపోత వర్షాలకు అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, బీహార్, సిక్కిం, అండమాన్- నికోబార్ దీవులలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, కోస్టల్ కర్నాటక, లక్షద్వీప్ తదితర దక్షిణాది ప్రాంతాలలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అందించిన డేటా ప్రకారం ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 106గా నమోదైంది. ఈ ఏడాది రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా వచ్చాయి. రాజస్థాన్, గుజరాత్‌లలో రుతుపవనాల ఉపసంహరణ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమైంది. ఢిల్లీలో రుతుపవనాల ఉపసంహరణ సాధారణంగా సెప్టెంబర్ 25న జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం గణనీయంగా ఆలస్యమవుతోంది.ఇది కూడా చదవండి: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే? -
దేశంలోని పలు రాష్ట్రాలకు భారీవర్ష సూచన
న్యూఢిల్లీ: దేశంలో రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుండి పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు(గురువారం) కూడా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పూర్వాంచల్, పశ్చిమ యూపీలో భారీ వర్షాలకు కురవనున్నాయనే హెచ్చరికలు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లో భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, సెప్టెంబర్ 17 వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణశాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. కిన్నౌర్, సిర్మౌర్, సోలన్, సిమ్లా, బిలాస్పూర్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని రోజులు వర్షం కొనసాగుతుందిరాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో మరికొన్ని రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. జైపూర్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్ మీదుగా ఉంది. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్ వైపు వాయువ్య దిశలో కదులుతుందనే అంచనాలున్నాయి.ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అడపాదడపా చినుకులు పడుతున్నాయి. అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు బీహార్‌లో రుతుపవనాలు మరోసారి చురుగ్గా ఉంటాయని అంచనా. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడి, అది వాయువ్య దిశగా పయనిస్తోంది. ఇది బెంగాల్ తీర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి బీహార్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: నల్లమలలో పక్షుల కిలకిల -
AP Rains: ఉత్తరాంధ్రలో పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన
-
రెండు రోజులపాటు కోస్తాంధ్రకు వర్ష సూచన
-
వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాలు అతలాకుతలం
-
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్ట్ జారీ
సాక్షి,హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం కారణంగా వచ్చే నాలుగు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం బలపడి శనివారం(ఆగస్టు31) వాయుగుండంగా మారే అవకాశం ఉంది. శనివారం రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. రాజధాని హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. -
తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు
సాక్షి,హైదరాబాద్: రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్ర,శనివారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.రాజధాని హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుంది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. -
ఏపీకి మరో రెండు రోజులు వర్షాలు
-
తప్పుతున్న వాతావరణశాఖ అంచనాలు
ఒకవైపు వనరుల కొరత.. మరోవైపు అంచనాలలో లోపం.. ఇంకోవైపు ప్రకృతిలో మారుతున్న తీరుతెన్నులు.. ఇవన్నీ వాతావరణ శాఖ అధికారులను ఇబ్బందులకు గురిచేసి, రుతుపవనాలను సరిగ్గా అంచనావేయలేకపోయేలా చేస్తున్నాయా? ఈ సీజన్‌కు సంబంధించిన అంచనాల్లో అప్పుడప్పుడూ పొరపాట్లు తొణికిసలాడటం దీనికి ఉదాహరణగా నిలిచించిందా?వాతావరణశాఖ ఇటీవలి కాలంలో జారీచేసిన అలర్ట్‌లు అంచనాలకు విరుద్ధంగా ఉంటున్నాయి. దీంతో జనం వాతావరణశాఖపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ శాఖపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడుతున్నదనే వాదన వినిపిస్తోంది. జూన్ 28న దేశరాజధాని ఢిల్లీలో రుతుపవనాలు ప్రవేశించిన రోజున రికార్డుస్థాయి వర్షపాతం కురుస్తుందని వాతావరణశాఖ ముందుగా ప్రకటించింది. అయితే ఆ తరువాత ఆశాఖ అధికారులు వర్షపాతం అంచనాలు మార్చారు. ఇదేవిధంగా కొన్నిసార్లు గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసి, వాటిని తిరిగి మారుస్తున్న సందర్భాలున్నాయి.వాతావరణ శాఖ విడుదల చేసిన రుతుపవనాల అంచనాలు మునుపటి కంటే తక్కువ ఖచ్చితత్వంతో ఉన్నాయని గత గణాంకాలను చూస్తే స్పష్టమవుతుంది. 2011 నుండి 2024 వరకు అంటే గత 14 ఏళ్లలో రుతుపవనాల అంచనాలు 96 శాతం ఖచ్చితమైనవనిగా రుజువు చేసిన ఏకైక సంవత్సరం 2022. మిగిలిన ఏళ్లలో ఇది 77 శాతం వరకూ నిజమయ్యింది. రుతుపవనాల ట్రెండ్‌లో మార్పు కారణంగా ఒకే నగరంలో రెండు విభిన్న పోకడలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, కొన్ని చోట్ల తేలికపాటి వర్షం పడుతోంది.వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా భారతదేశంలాంటి ఉష్ణమండల ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. హిమాలయ పర్వతాలు ఆసియాలోని చల్లని గాలిని ఉత్తర భారతదేశ మైదానాలకు చేరుకోకుండా నిరోధిస్తాయి. రుతుపవనాలను కూడా ఆపుతాయి. ఇవి దేశానికి వర్షాలను తీసుకువస్తాయి. అయితే కొత్త మోడల్స్, రాడార్, రెయిన్ గేజ్‌ల సహాయంతో భవిష్యత్తులో వర్షాలు, రుతుపవనాల అంచనాలను మరింత ఖచ్చితంగా తెలుసుకునేందుకు వాతావరణశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. -
అలర్ట్: యూపీలో భారీవర్షాలు.. ఉత్తరాఖండ్‌కు కొండచరియల ముప్పు
దేశంలోని పలుప్రాంతాల్లో రుతుపవనాలు జోరందుకున్నాయి. అయితే ఢిల్లీలోకి రుతుపవనాలు ప్రవేశించి, 20 రోజులకు పైగా సమయం గడిచినా గత కొద్ది రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు లేవు. ఊహించని విధంగా ఎండలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఇక్కడికి పక్కనే ఉన్న తూర్పు యూపీలో ప్రతిరోజూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండబోతున్నదనేది ఇప్పుడు తెలుసుకుందాం.ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు (శనివారం) చినుకులు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా ఉండవచ్చు. శుక్రవారం నాటి ఉష్ణోగ్రత కంటే ఈరోజు రాజధానిలో ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదుకానున్నదని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్‌లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. తూర్పు, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఈరోజు కూడా వర్షం పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఉత్తరాఖండ్‌లో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ వారాంతంలోగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే నాలుగైదు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లోని పోర్బందర్ ప్రాంతమంతా జలమయమైంది. జూలై 22 వరకు గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. -
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీకీ సీఎం ప్రత్యేక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరానికి మంగళవారం(జులై 16) సాయంత్రం వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్‌గా ఉండాలని ప్రత్యేకంగా ఆదేశించారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.భారీ వర్షం కురిసేటపుడు 141 లాగిన్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ఉండి వెంటనే నీళ్లు క్లియర్ చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలన్నారు. వర్షం కురిసినప్పుడు విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. -
అలర్ట్: తెలంగాణకు భారీ వర్ష సూచన
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వచ్చే వారం నుంచి పది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.ఆవర్తనం బలపడిన కారణంగా సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. -
కుమ్మేస్తున్న వర్షాలు.. మహారాష్ట్ర, గోవాలకు రెడ్ అలర్ట్
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెంట్రల్ మహారాష్ట్ర, కొంకణ్, గోవాలోని పలు ప్రాంతాల్లో సోమ(నేడు), మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. కర్ణాటక, కేరళలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు దేశంలో చురుకుగా మారే అవకాశం ఉంది.మహారాష్ట్రలోని మరఠ్వాడా, విదర్భ ప్రాంతాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ, దక్షిణ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర కర్ణాటక, కోస్తాంధ్రలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. లక్షద్వీప్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది.గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, అండమాన్, నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడులలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని పలు గ్రామాలు వరదల బారిన పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. -
మరికొద్ది గంటల్లో చార్ధామ్ యాత్ర.. ఇంతలోనే భారీ వర్షాలు!
ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరికొద్ది గంటల్లో చార్ధామ్ యాత్ర ప్రారంభం కానున్న నేపధ్యంలో ఈ వర్షాలు స్థానికులను, భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నారు. చార్ధామ్ యాత్ర మే 10 నుండి ప్రారంభంకానుంది. ఈ యాత్ర చేసేందుకు లక్షలాది మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కొందరు భక్తులు ఇప్పటికే ఉత్తరాఖండ్ చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షాలకు తోడు వడగళ్ల వానలు కురుస్తున్నాయి. అల్మోరా-సోమేశ్వర్ ప్రాంతంలో పిడుగులు పడుతున్నాయి. అల్మోరా-కౌసాని హైవేపై కొండచరియలు విరిగిపడటంతో గత 12 గంటలుగా ఈ రహదారిని మూసివేశారు. మారుతున్న వాతావరణం కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.ఉత్తరాఖండ్‌లోని అల్మోరాతో పాటు, బాగేశ్వర్‌లో ఆకాశం మేఘావృతమైంది. ఉత్తరకాశీలోని పురోలాలో భారీ వడగళ్ల వాన కురిసింది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల వరద ముప్పు ఏర్పడింది. మే 13 వరకు ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఇటువంటి వర్షాల సమయంలో ట్రెక్కింగ్ చేయవద్దని టూరిస్టులకు వాతావరణశాఖ తెలిపింది. తాజాగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రుతుపవన విపత్తుల నివారణ, చార్ధామ్ యాత్ర నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. -
మండే ఎండల్లో కూల్ న్యూస్..‘ఐఎండీ’ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఎండలు మండుతున్న వేళ దేశ వాసులకు భారత వాతావరణ శాఖ( ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. దేశంలో దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 87 సెంటీమీటర్లుగా ఉండగా ఈ ఏడాది ఇందులో 106 శాతం వర్షపాతం రికార్డయ్యే చాన్స్ ఉందని వెల్లడించింది. ప్రస్తుతం మధ్య పసిఫిక్ సముద్రం మీదుగా ఎల్‌నినో(వర్షాభావ) పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఇది మెల్లగా తొలగిపోతూ రుతుపవనాలు ప్రారంభమయ్యే సరికి తటస్థ స్థితి(ఈఎన్ఎస్ఓ) ఏర్పడుతుందని వెల్లడించింది. కాగా, భారత్‌లోని ఏకైక ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్ కూడా ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. స్కైమెట్ అంచనాలు ఐఎండీ అంచనాలకు దగ్గరగా ఉండటం విశేషం. ఇదీ చదవండి.. నేటితో హిమాచల్‌కు 76 ఏళ్లు -
మండు వేసవిలో చల్లని కబురు.. గుడ్ న్యూస్ చెప్పిన ‘స్కైమెట్’
న్యూఢిల్లీ: వేసవిలో ఎండలు దంచి కొడుతున్న వేళ చల్లని కబురు అందింది. ‘స్కైమెట్’ సంస్థ ఈ చల్లని కబురు మోసుకువచ్చింది. ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవనాలు సమయానికి వస్తాయని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం వర్షపాతం(102శాతం) నమోదవుతుందని వెల్లడించింది. అయితే ఈ అంచనాకు 5శాతం అటూ ఇటు అయ్యే అవకాశాలు లేకపోలేదని తెలిపింది. సాధారణంగా రుతపవనాల సీజన్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు లాంగర్ పీరియడ్ సగటు(ఎల్పీఏ) వర్షపాతం 868.6మిల్లీమీటర్లు. దీనిలో 96 శాతం నుంచి 104శాతం వరకు వర్షం పడే అవకాశాలుంటే దీనిని సాధారణ వర్షపాతంగా పిలుస్తారు. జనవరిలో విడుదల చేసిన ముందస్తు అంచనాల్లోనూ ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్ తెలిపింది. తాజా అంచనాలపై స్కైమెట్ ఎండీ జతిన్‌సింగ్ మాట్లాడుతూ‘ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడానికి కారణమైన ఎల్‌నినో పరిస్థితులు వేగంగా లానినాగా మారుతున్నాయి. సాధారణంగా ఎల్‌నినో, లానినాగా మారుతున్నపుడు రుతుపవనాలు సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాయి. గతంలో లానినా వల్ల కురిసిన వర్షపాతమే ఇందుకు నిదర్శనం. అయితే ఎల్‌నినో ముగింపు దశలో ఉన్నందున రుతుపవనాల ప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. అయితే రుతుపవనాల రెండో దశలో మాత్రం వర్షాలు బాగా కురుస్తాయి. లానినాతో పాటు ఇండియన్ ఓషియన్ డైపోల్(ఐఓడీ) పరిస్థితులు కూడా ఈసారి సమయానికి రుతుపవనాలు రావడానికి, దేశమంతా వాటి విస్తరణకు దోహదం చేయనుంది. రుతుపవనాల వల్ల దక్షిణ భారతంతో పాటు దేశంలోని పశ్చిమ, నైరుతి ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో సరిపడా వర్షాలు పడతాయి. బిహార్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ వంటి తూర్పు రాష్ట్రాల్లో మాత్రం జులై, ఆగస్టు నెలల్లో కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే చాన్సుంది. ఇక ఈశాన్య భారతంలోనూ జూన్, జులై, ఆగస్టుల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి’అని తెలిపారు. ‘స్కైమెట్’ ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షపాతం అంచనాలు.. సాధారణం వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు 10 శాతం అవకాశాలున్నాయి(లాంగర్ పీరియడ్ సగటు(ఎల్పీఏ) దాటి 110 శాతం వర్షపాతం ) సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షాలు పడేందుకు 20 శాతం అవకాశాలున్నాయి(ఎల్పీఏ దాటి 105 శాతం నుంచి 110శాతం మధ్య వర్షపాతం) సాధారణ వర్షపాతం కురిసేందుకు 45 శాతం చాన్స్( సరిగ్గా ఎల్పీ సగటు 96 శాతం నుంచి 104 శాతం వర్షాలు) సాధారణ కంటే తక్కువ వర్షపాతానికి 15 శాతం చాన్స్(ఎల్పీ సగటు 104 శాతానికి దిగువ 90 నుంచి 95 శాతం వర్షాలు) కరువుకు 10 శాతం చాన్స్(ఎల్పీ సగటులో 90 శాతం వర్షాలు మాత్రమే) ఈ సీజన్లో ‘స్కైమెట్’ నెల వారి వర్షపాత అంచనాలు.. జూన్-ఎల్పీఏలో 95 శాతం వర్షపాతం (165.3 మిల్లీమీటర్లు) జులై-ఎల్పీఏలో 105 శాతం వర్షపాతం(280.5మిల్లీమీటర్లు) ఆగస్టు-ఎల్పీఏలో 98 శాతం వర్షపాతం(254.9మిల్లీమీటర్లు) సెప్టెంబర్-ఎల్పీఏలో 110 శాతం వర్షపాతం(167.9మిల్లీమీటర్లు) ‘స్కైమెట్’ ఏం చేస్తుంది..? భారత్‌లో వాతావరణ ముందస్తు అంచనాలు వెల్లడించే ఒకే ఒక ప్రైవేట్ సంస్థ స్కైమెట్. వ్యవసాయ రంగానికి స్కైమెట్ వెల్లడించే వాతావరణ అంచనాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటున్నాయి. సమీప భవిష్యత్తులో వాతావరణాన్ని బట్టి పంటలు నిర్ణయించుకునే వెసులుబాటు స్కైమెట్ ద్వారా రైతులకు లభిస్తోంది. సాటిలైట్లు, మానవ రహిత విమానాలు, డ్రోన్లు వాడి రుతుపవనాల రాకకు సంబంధించి ముందస్తు అంచనాలు వెల్లడించడంలో స్కైమెట్ పేరుగాంచింది. -
దేశంలోని 20 రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు
దేశంలోని 20కిపైగా రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. అలాగే చలి తీవ్రత కూడా మరింతగా పెరిగింది. జమ్మూకశ్మీర్, లడఖ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, మేఘాలయ మణిపూర్ సహా 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో దట్టమైన పొగమంచు వ్యాపించింది. ఈ సీజన్లో ఢిల్లీలో సోమవారం అత్యంత చలి వాతావరణం ఏర్పడింది. కనిష్ట ఉష్ణోగ్రత 5.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. దట్టమైన పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా రైలు, విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. ఒక్క ఢిల్లీలోనే పొగమంచు కారణంగా 80 రైళ్ల రాకపోకల వేళలు దెబ్బతిన్నాయి. బెంగళూరు-నిజాముద్దీన్, భువనేశ్వర్-న్యూఢిల్లీ రాజధాని, కాన్పూర్-న్యూఢిల్లీ శ్రమశక్తి, ప్రయాగ్‌రాజ్-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్, అమృత్సర్-ముంబై ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లు గంట నుంచి ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు విమానాల రాకపోకలపై కూడా పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. టేకాఫ్ లాండింగ్‌లలో 15 నుంచి 30 నిమిషాలు ఆలస్యం జరుగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూ పర్యటన కూడా ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయ్యింది. ఇదిలా ఉంటే ఢిల్లీ-ఎన్సీఆర్లలో మంగళవారం వర్షం కురిసే అవకాశం ఉందని న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. జనవరి 14 ఉదయం వరకు ఢిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు పొగమంచు ఉండే అవకాశం ఉంది. అయితే జనవరి 11 నాటికి గరిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలకు, కనిష్ట ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీలకు పెరగవచ్చు. ఆ తర్వాత కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. జనవరి 14 నాటికి రెండు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. -
మరింతగా పెరిగిన చలి.. ఆ రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే!
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలి మరింతగా పెరిగింది. దట్టమైన పొగమంచు కూడా కమ్ముకుంటోంది. జమ్మూ కాశ్మీర్ నుండి బీహార్, పంజాబ్ వరకు, హర్యానా నుండి తూర్పు ఉత్తరప్రదేశ్ వరకు చలి తీవ్రత మరింతగా పెరిగింది. హిమాచల్‌లోని కుకుమ్సేరిలో ఉష్ణోగ్రతలు మైనస్ 7.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. పహల్గామ్లో మైనస్ 6.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పర్వతప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం కారణంగా, దేశ రాజధాని, దాని పరిసర ప్రాంతాలలో మంగళవారం రోజంతా చలిగాలులు కొనసాగాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువ. ఉత్తర భారతదేశంలో పొగమంచు ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా మారింది. జనవరి 5 నుంచి 11వ తేదీ వరకూ రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ (ఐఎండీ) డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. దీని ప్రభావంతో మధ్య భారతదేశంలో చలిగాలుల పరిస్థితి తీవ్రంగా మారవచ్చు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని ఉత్తర భాగం, ఉత్తరప్రదేశ్‌లోని దక్షిణ భాగంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా దిగజారే అవకాశాలున్నాయి. ఎత్తయిన పర్వత శిఖరాలపై మంచు కురుస్తుండటంతో కాశ్మీర్ లోయ తీవ్రమైన చలిలో చిక్కుకుంది. జమ్మూ కాశ్మీర్లో పొగమంచు కారణంగా రైలు, విమాన సర్వీసులు దెబ్బతింటున్నాయి. శ్రీనగర్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం జనవరి 4, 5 తేదీలలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు మంచు కురిసే అవకాశం ఉంది. జనవరి 8న కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉండనున్నాయి. -
రాబోయే రోజుల్లో... దేశంలోని వాతావరణం ఇలా..
దేశంలో వాతావరణ పరిస్థితులు నిరంతరం మారుతూ ఉంటాయి. ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు నెలకొనివుంది. దక్షిణ భారతదేశంలో వర్షాకాలం కొనసాగుతోంది. హిమాచల్‌లోని కొండ ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. జమ్మూకశ్మీర్‌లో ఎముకలు కొరికే చలి వ్యాపించింది. శుక్రవారం రాత్రి శ్రీనగర్‌లో ఈ సీజన్లో అత్యంత చలి వాతావరణం ఏర్పడింది. నగరంలో ఉష్ణోగ్రత -4.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల ప్రకారం రానున్న రెండు రోజుల్లో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల్లో వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గే అవకాశం ఉంది. #WATCH | Tamil Nadu: Heavy rain lashes parts of Coimbatore city early morning pic.twitter.com/2b9NmFCStR — ANI (@ANI) December 9, 2023 తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం దేశంలోని జార్ఖండ్, బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ , అండమాన్, నికోబార్ దీవులలో వర్షాలు కురుస్తాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 12న పశ్చిమ బెంగాల్, సిక్కింలో వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 10న దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజస్థాన్‌లోనూ చలి ప్రభావం పెరుగుతున్నదని వాతావరణ శాఖ తెలిపింది. ⛈️ Weather Alert! Possibility of scattered rain in parts of #Karnataka and #Kerala! 🌧️ #RainyDay #KarnatakaWeather #KeralaRain pic.twitter.com/2zg3lu1P3U — Weather & Radar India (@WeatherRadar_IN) December 9, 2023 ఇక ఢిల్లీ-ఎన్సీఆర్ విషయానికి వస్తే శనివారం ఉదయం చల్లగాలులు వీచాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ-ఎన్సీఆర్లో డిసెంబర్ 15 తర్వాత చలి గణనీయంగా పెరగనుంది. కనిష్ట ఉష్ణోగ్రత ఆరు డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకోవచ్చు. ఇది కూడా చదవండి: కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి! -
సూపర్ కంప్యూటర్ కంటే వేగంగా గూగుల్ ఏఐ వాతావరణ సూచనలు!
ఇంతవరకు వాతావరణ సూచనలివ్వడంలో ఒక్కోసారి సైన్స్‌కి కూడా అంత్యంత క్లిష్టంగా ఉంటుంది. అలాంటిది ఈ గూగుల్ ఏఐ వాతావరణ సూచనలకు సంబంధించిన సమాచారాన్ని చాలా కచ్చితమైన విశ్లేషణతో ఇస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గూగుల్ ఏఐ వెదర్‌మ్యాన్‌గా వ్యవహరించనుంది. ఏకంగా పది రోజులు ముందుగానే వాతావరణ సమాచారాన్ని ఇస్తుందట. ఎలా అంచనా వేస్తుందంటే?.. సీతాకోక చిలుకలు వచ్చాయంటే వర్షం వచ్చే సూచనలున్నాయని అర్థం. ఇది అందరికీ తెలిసిందే. ఒక వారం ముందుగానే వాతావరణ సమాచారాన్ని తెలియజేయడాన్ని సాధారణ న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్(ఎన్‌డబ్ల్యూపీ) అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిశీలనలను ఇన్పుట్ డేటాగా తీసుకుని సూపర్ కంప్యూటర్ సంక్లిష్ట భౌతిక సమీకరణాలను ఉపయోగించి చెప్పేది. కానీ ఇప్పుడు గూగుల్ శక్తిమంతమైన హార్డ్వేర్ల సాయంతో సంఖ్యలను తొందరగా కాలిక్యులేట్ చేయగల గ్రాఫ్ కాస్ట్‌ని ఆవిష్కరించింది. ఈ ఏఐ ఉపగ్రహ చిత్రాలు, రాడార్లు అందించిన 40 ఏళ్ల విలువైన వాతావరణ పునర్విశ్లేషణ డేటాపై శిక్షణ పొందింది. ఈ గ్రాఫ్‌కాస్ట్ ఆరుగంటల క్రితం వాతావరణ స్థితి, ప్రస్తుత స్థితిని పరిగణలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత ఆరుగంటల నుంచి వాతావరణ స్థితిని అంచనావేయడానికి తన వద్ద ఉన్న డేటాను ఉపయోగిస్తుంది. దీని ఆధారంగా పది రోజుల వరకు సూచనను అందిస్తుంది. ఈ గ్రాఫ్కాస్గ్ భూమి ఉపరితలం చుట్టూ మిలియన్ల కంటే ఎక్కువ గ్రిడ్ పాయింట్లలో దీన్ని చేస్తుంది. ఇది రేఖాంశం, అక్షాంశం తోసహ ప్రతి పాయింట్ వద్ద ఉష్ణోగ్రత, తేమ, పీడనం, గాలి దిశ, వేగం అన్నింటిని పరిగణలోకి తీసుకుని విశ్లేషిస్తుంది. అంతేగాదు ఈ గ్రాఫ్‌కాస్ట్ ప్రస్తుత సూపర్ కంప్యూటర్లో ఉన్న హై రిజల్యూషన్ ఫోర్కాస్ట్(హెచ్‌ఆర్‌ఈఎస్) అనే అనుకరణ వ్యవస్థలా పనిచేస్తుంది కానీ పదిరోజుల నాటి వాతావరణ సూచనను ఇవ్వగలదు. అలాగే 90% హెచ్‌ఆర్‌ఈఎస్ కంటే కచ్చితమైన సూచనను అందిస్తుంది. ఇక భూమిపై ఉండే పోరల్లో ట్రోపోస్పియర్ పోర వద్ద కచ్చితమైన అంచనాలు మన రోజూ వారి జీవితానికి ఉపయుక్తంగా ఉన్నాయి. పైగా హెచ్‌ఆర్‌ఈఎస్ కంటే ముందే వాతావరణ సూచనలను అందించే సామర్థ్యాన్ని గూగుల్ ఏఐ ప్రదర్శించింది. అంతేగాదు తుపాను ఎక్కవ వస్తుందో తొమ్మిది రోజులు ముందుగానే ఏఐ కచ్చితమైన అంచనా వేసింది. ఐతే సంప్రదాయ వాతావరణ అంచనాలు కనీసం ఆరు రోజులు ముందుగానీ నిర్థారించవు. ఈ గ్రాఫ్‌కాస్ట్ కోడ్ ఓపెన్‌సోర్స్ అని గూగుల్ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు దానితో ప్రయోగాలు చేయడానికి, రోజూవారి వాతావరణ సూచనలు ఇవ్వడానికి అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. (చదవండి: సినిమాలు చూస్తే..కేలరీలు బర్న్ అవుతాయట! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
చైనా కన్నా స్పీడ్‌గా.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్
న్యూఢిల్లీ: భారత్ ఏప్రిల్ 2023తో ప్రారంభమయిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24)లో 6.3% స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిని నమోదుచేసుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) తాజా ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్’ అంచనా వేసింది. తొలి జూలై నెల అంచనా 6.1 శాతాన్ని ఈ మేరకు 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచింది. తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) అంచనాలకు మించి వినియోగ గణాంకాలు నమోదవడం తాజా అప్‌గ్రేడ్‌కు కారణమని అవుట్‌లుక్ వివరించింది. 2024–25లో కూడా భారత్ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ 6.3%గా పేర్కొంది. వృద్ధి స్పీడ్‌లో టాప్.. ప్రపంచంలోని రెండవ ఆర్థిక వ్యవస్థ చైనాకన్నా భారత్ వృద్ధి స్పీడ్ వేగంగా ఉండడం మరో అంశం. 2023లో చైనా వృద్ధి రేటు అంచనాలను ఐఎంఎఫ్ 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఈ రేటు 5%కి తగ్గింది. 2024లో అంచనాలను 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా ఈ రేటు 4.2%కి దిగింది. చైనాలో ప్రోపర్టీ మార్కెట్ సంక్షోభంలో ఉండటం కూడా వృద్ధి రేటు కోతకు కారణమని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రపంచ వృద్ధి అంచనా డౌన్ కాగా, 2023 ప్రపంచ వృద్ధి అంచనాలను మాత్రం ఐఎంఎఫ్ తగ్గించడం గమనార్హం. ఇంతక్రితం 3.2 శాతంగా ఉన్న గ్లోబల్ వృద్ధి అంచనాలను తాజాగా 3%కి కుదించింది. కొన్ని సంస్థల అంచనా ఇలా.. సంస్థ 2023–24 (వృద్ధి శాతాల్లో) ఆర్బీఐ 6.5 ప్రపంచబ్యాంక్ 6.3 ఎస్అండ్పీ 6.0 ఫిచ్ 6.3 మూడీస్ 6.1 ఏడీబీ 6.3 ఇండియా రేటింగ్స్ 6.2 ఓఈసీడీ 6.3 -
తెలంగాణకు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీ హై అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు భారీ వర్షం పడే అవకాశముందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. ఐటీ కారిడార్‌లో లాగౌట్ పొడిగింపు నగరంలో భారీ వర్ష సూచన నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో ఆగస్టు 1 వరకు లాగౌట్ను పొడిగిస్తూ సైబరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పరకుండా.. 3 దశలుగా విధుల ముగింపు వేళలు ఉండాలని పేర్కొంది. యాదాద్రి, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, భద్రాద్రి, జగిత్యాల, కరీంనగర్, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. ఎడతెరిపిలేని వానలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. ఆకాశం చిల్లులు పడిందా అన్నట్టుగా వానలు పడుతున్నాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఇప్పుడీ వానలు మరింత ముదురుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు కుండపోత వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చదవండి: ఆర్టీసీ కొత్త టికెట్! రూ.50 చెల్లించు.. 12 గంటలపాటు బస్సుల్లో ప్రయాణించు ఈ మేరకు రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లాలో అయితే రికార్డు స్థాయిలో వానలు పడ్డాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌నూ వాన వణికిస్తోంది. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనాల ట్రాఫిక్ ఇబ్బందిగా మారింది. -
ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి.. వర్షాలకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు, ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఆదివారం రాష్ట్రంలోని పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్ నుంచి 43 డిగ్రీ సెల్సియస్ మధ్యన నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే, గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 39.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20.0 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి.