అభిమానులకు రామ్ సూచన | Hero Ram Forecast to Fans | Sakshi
Sakshi News home page

అభిమానులకు రామ్ సూచన

Published Fri, Sep 23 2016 10:20 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

అభిమానులకు రామ్ సూచన

అభిమానులకు రామ్ సూచన

ఈ జనరేషన్ హీరోలు అభిమానుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. సినిమా వేడుకలను ఎంత గొప్పగా నిర్వహించాం అన్నదానికన్నా, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా యంగ్ హీరో రామ్ కూడా తన అభిమానులకు ఈ మేరకు పిలుపునిచ్చాడు.

రామ్ హీరోగా తెరకెక్కుతున్న హైపర్ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకను శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అయితే భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి ఇబ్బంది కరంగా తయారవ్వటంతో.. 'హైదరాబాద్ రోడ్ల పరిస్థితి అంత సురక్షితం అనిపించటం లేదు. ఏ మాత్రం రిస్క్ అనిపించినా ఫంక్షన్ కు రాకండి. టివిలో లైప్ ద్వారా చూడొచ్చు' అంటూ ట్వీట్ చేశాడు.

నేను శైలజ సక్సెస్ తరువాత రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా హైపర్. గతంలో రామ్ కు కందిరీగ లాంటి సూపర్ హిట్ ను అందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement