‘అమృత’లో హైపర్ సందడి
‘అమృత’లో హైపర్ సందడి
Published Tue, Oct 4 2016 12:56 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
హన్మకొండ చౌరస్తా : హన్మకొండలోని అమృత థియేటర్‌లో సోమవారం సాయంత్రం ‘హైపర్’ చిత్రం యూనిట్ సందడి చేసింది. ఫస్ట్ షో ఇంటర్వెల్ సందర్భంగా థియేటర్‌లో చిత్రం హీరో రామ్, హీరోయిన్ రాశీఖన్నా ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ ‘మీరు హైపర్ సినిమా చూసేందుకు వస్తే మేము మీ హైపర్ చూద్దామని వచ్చాం.’ అంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించారు. కొంతమంది అభిమానుల కోరిక మేరకు సినిమాలోని కొన్ని డైలాగ్‌లు చెప్పారు. హీరోయిన్ రాశీఖన్నా మాట్లాడుతూ ‘అభిమానులు లేనిదే మేము లేము. మాపై అభిమానంతో సినిమాను హిట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అన్నారు. ఈ సందర్భంగా అభిమానులు తమ సెల్‌ఫోన్లలో హీరో, హీరోయిన్ల ఫొటోలను బంధించేందుకు పోటీపడ్డారు. వారితో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్, నిర్మాతలు రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట, సుంకర అనిల్, సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతినిధి ప్రకాష్, థియేటర్ యాజమాన్యం ఎ.రవీందర్‌రావు, పాల్గుణ్, మేనేజర్ మోహన్‌రావు, కార్పొరేటర్ బోడ డిన్న పాల్గొన్నారు.
Advertisement
Advertisement