
రామ్ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు శ్రీలీలను ఎంపిక చేశారు. దసరా సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభమైంది. తొలి షెడ్యూల్‌లోనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment