Hero Ram
-
నిజామాబాద్‌లో సందడి చేసిన పాయల్, రామ్ (ఫొటోలు)
-
రామ్ సినిమాలో ఊర్వశీ రౌతేలా.. ఫోటోతో క్లారిటీ
యంగ్ హీరో రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా సాగనుంది. పెళ్లిసందడి బ్యూటీ శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్గా నటించనుంది.. శ్రీనివాస సిల్వర్ స్కీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రూమర్స్‌ని నిజం చేస్తూ హీరో రామ్‌తో సెట్స్‌లో దిగిన ఓ ఫోటోను ఊర్వశీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ సినిమాలో ఆమె ఐటెం సాంగ్‌లో నటించనుందనే న్యూస్ కన్ఫర్మ్ చేసినట్లయ్యింది. ఇక అఖండ తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. @ramsayz 🌹♥️ #RP pic.twitter.com/t9eCNweftY — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 27, 2022 -
బోయపాటి స్కెచ్.. హీరో రామ్‌కు తండ్రిగా ఆ బాలీవుడ్ హీరో?
యంగ్ హీరో రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోను సంప్రదించారట. పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌కి తండ్రిగా ప్రముఖ బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఇక హీరో రామ్ కూడా ఈ చిత్రంలో చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఇందుకోసం సుమారు 11కిలోల బరువు పెరగనున్నట్లు టాక్ వినిపిస్తుంది.రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రెండు పాత్రల్లో వేరియేషన్స్ కోసం రామ్ కొత్తగా మేకోవర్ అవనున్నారట.కాగా అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, అందులోనూ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. -
అమ్మడి అదృష్టం.. బోయపాటి డైరక్షన్లో శ్రీలీల..
రామ్ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు శ్రీలీలను ఎంపిక చేశారు. దసరా సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభమైంది. తొలి షెడ్యూల్లోనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. -
నాకు వాళ్లతోనే అసలైన పోటీ: రామ్
సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): గత 15 ఏళ్లగా తాను ఎవరికి పోటీ కాదని.. ఇప్పటినుంచి అభిమానులతోనే తనకు పోటీ అని సినీ హీరో రామ్ అన్నారు. శనివారం శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో రెడ్ చిత్రం విజయోత్సవాన్ని గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ అభిమానులు తనను అందరించడంలో తనతో పోటీ పడుతున్నారన్నారు. తాను మంచి సినిమాలు చేసి వారికి పోటీ ఇస్తానన్నారు. లాక్డౌన్ తర్వాత వచ్చిన రెడ్ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులను మరువలేమన్నారు. (చదవండి: కత్తితో కేక్ కట్ చేసిన హీరో.. క్షమాపణలు) సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో? రిజల్ట్‌లో కూడా అన్ని ట్విస్ట్‌లు వచ్చాయన్నారు. ఉదయం షోలో డివైడ్ టాక్ వచ్చిన తమ చిత్రం సాయంత్రానికి హిట్ టాక్ సొంతం చేసుకుందన్నారు. ఈ చిత్రం కోసం అందరూ ఎంతో కష్టపడి పనిచేశారని.. ప్రేక్షకుల ఆదరణతో కష్టం మొత్తం మరచిపోయామన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మాళవిక శర్మ, నిర్మాత కృష్ణపోతినేని, దర్శకుడు తిరుమల కిశోర్, శ్రేయాస్ మీడియా శ్రీనివాస్, శ్రీముఖి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: రెడ్ మూవీ రివ్యూ: నిరాశపరిచే రీమేకు ఇది!) -
హీరో రామ్‌కి ఎమ్మెల్యే వంశీ సూటి ప్రశ్న
సాక్షి, కృష్ణా జిల్లా: కులం పేరుతో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించారు. 13 జిల్లాల్లో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారి సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఆపిందా? అని ప్రశ్నించారు. శుక్రవారం ఎమ్మెల్యే వంశీ మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఒక్కడే మా సామాజిక వర్గానికి నాయకుడు కాదు. గతంలో చాలా మంది నాయకులు మా కోసం పని చేశారు. చంద్రబాబుతోనే మా సామాజిక వర్గానికి ముప్పు. బాబుకు ఉన్న సమస్యలు అన్నీ కులానికి రుద్దుతాడు. (డా.రమేష్ ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతి) ఓటుకు నోటు కేసులో తెలంగాణలో 10 సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నా అక్కడ ఉండలేక ఎమ్మెల్యేలు అందరినీ కట్టుబట్టలతో విజయవాడకు తీసుకొచ్చాడు. ప్రతిసారి అమరావతి అంటున్న చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో రూ.300 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు. సినీ హీరో రామ్ విజయవాడ రమేష్ ఆస్పత్రి గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాడు. రామ్ సినిమాలు ఒక్క అతని సామాజిక వర్గం వాళ్లు మాత్రమే చూస్తారా? వేరే వాళ్లు చూడరా? వేరే కులం వారిని సినిమాలు చూడొద్దని రామ్‌ని చెప్పమనండి’అని వంశీ తనదైన శైలిలో ప్రశ్నలు సంధించారు. (కులాన్ని భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు) -
ఎక్కువ చిత్రాలు చేయాలనే ఉంది
‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. ఇప్పటివరకూ చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వచ్చాయి. కానీ, ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో మా సినిమా ఉంటుంది. ఆ పాయింట్‌ని ఈ యాంగిల్లో కూడా చూడొచ్చా! అనేలా స్టోరీని తీర్చిదిద్దారు. కథ విన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో.. ఫైనల్ ఔట్పుట్ చూసినప్పుడూ అంతే ఎంజాయ్ చేశా’’ అని రామ్ అన్నారు. ఆయన హీరోగా అనుపమా పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా రేపు (గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా రామ్ పంచుకున్న విశేషాలు... ∙ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషనల్ పాయింట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో నాది సాఫ్ట్వేర్ ఇంజినీర్ పాత్ర. పల్లెటూరి నుంచి పట్నం వచ్చిన యువకుడిగా నటించాను. ∙త్రినాథరావు, రైటర్ ప్రసన్న మధ్య మంచి ర్యాపో ఉంది. త్రినాథరావు ఒక ప్రేక్షకుడిలా సీన్‌ని పరిశీలిస్తుంటారు. ప్రసన్న పాత్రల గురించి సెట్స్‌లో వివరిస్తూ ఉంటారు. ఒక సన్నివేశం చేసేటప్పుడు నేను, డైరెక్టర్, రైటర్ డిస్కస్ చేసుకున్న తర్వాతే షూట్‌కి వెళతాం. ∙త్రినాథరావు ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ మాస్ ఓరియంటెడ్. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ని మిక్స్ చేసి తెరకెక్కించారు. ఆయన గత చిత్రాల్లో హీరోయిన్ తండ్రితో హీరో చాలెంజ్ చేసే స్టైల్లో ఉంటుంది. ఈ సినిమాలో అలా కాకుండా ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. ∙సక్సెస్ కావాలని నేను సినిమాలు చేయను. ప్రతి సీన్ సక్సెస్ కావాలని అనుకుంటాను. అలాంటి సమ యాల్లో కథ వర్కవుట్ అయితే సక్సెస్ అవుతాయి. రిలీజ్ తర్వాత ఫలితాన్ని అనలైజ్ చేసుకుంటా. నా దగ్గరి వాళ్లతో డిస్కస్ చేస్తా. ∙ఈ సినిమా ప్రధానంగా ప్రకాష్‌రాజ్, అనుపమ పరమేశ్వరన్, నా మధ్యనే రన్ అవుతుంది. సన్నివేశాల పరంగానే కామెడీ ఉంటుంది. ఇందులోని మెయిన్ పాయింట్, డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉంటాయి. ∙ఓ హీరోగా ఎక్కువ సినిమాలు చేయాలని నాకూ ఉంది. అయితే నన్ను ఎగై్జట్ చేసే కథలు చాలా తక్కువగా దొరుకుతున్నాయి. మా పెదనాన్నగారు(‘స్రవంతి’ రవికిషోర్) కూడా కథలు వింటారు. నాకు ఏమాత్రం నచ్చుద్ది అని ఆయనకు అనిపించినా నన్ను కథ వినమంటారు. ∙దర్శకుడు ప్రవీణ్ సత్తారుగారితో కొన్ని కారణాల వల్ల సినిమా ముందుకెళ్ల లేదు. భవిష్యత్‌లో ఓ సినిమా చేస్తా. నా తర్వాతి ప్రాజెక్టు కోసం ప్రస్తుతం కథలు వింటున్నాను. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. ∙‘రామ రామ కృష్ణ కృష్ణ’ చిత్రం తర్వాత ‘దిల్’ రాజుగారితో మరో సినిమా చేయాలనుకున్నా సరైన కథ కుదరలేదు. రాజుగారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సినిమా బాగా రావాలనే తపన ఉన్న వ్యక్తి. అందుకే సినిమా మేకింగ్‌లో బాగా ఇన్ వాల్వ్ అవుతారు. -
మారొచ్చు ట్రెండు!
నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు ప్రకాశ్‌రాజ్. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన ‘సాక్ష్యం’ సినిమాకు ఆయన వాయిర్ ఓవర్ ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడాయన ‘హలో గురు ప్రేమకోసమే...’ సినిమా కోసం హీరో రామ్‌తో కలిసి పాట పాడారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ‘ఫ్రెండ్ కోసం మారొచ్చు ట్రెండు’ అనే పాటను కలిసి పాడారట రామ్ అండ్ ప్రకాశ్‌రాజ్. ఈ పాటను త్వరలోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్. ఈ చిత్రాన్ని దసరా పండగ సందర్భంగా ఈ నెల 18న విడుదల చేయాలనుకుంటున్నారు. -
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యంగ్ హీరో
సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన పీయస్వీ గరుడవేగ సినిమాతో ఘనవిజయం సాధించిన యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇటీవల నితిన్ హీరో ప్రవీణ్ సత్తారు సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా విషయంలో క్లారిటీ రాకముందే ఇప్పుడు మరో యంగ్ హీరో పేరు తెర మీదకు వచ్చింది. ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో ఆకట్టుకున్న రామ్ హీరోగా ప్రవీణ్ సినిమా తెరకెక్కించనున్నాడట. రామ్ ప్రస్తుతం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా మొదలెట్టేలా ప్లాన్ చేస్తున్నాడట రామ్. భవ్యక్రియేషన్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రటన వెలుడనుంది. -
కన్విన్స్ అవుతా... లేకపోతే కన్విన్స్ చేస్తా!
‘‘స్క్రిప్ట్ వినాలనుకున్నప్పుడు ఓపెన్ మైండ్‌తో వెళతాను. సినిమా చూస్తున్నట్లు ఇంట్రెస్ట్‌గా స్క్రిప్ట్ నెరేషన్‌ను ఎగ్జామిన్ చేస్తాను. ఎగై్జటింగ్‌గా ఉందనిపిస్తే వెంటనే ఓకే చెప్పేస్తా. క«థ డిమాండ్ చేస్తే మల్టీస్టారర్ సినిమాలు ఓకే’’ అన్నారు హీరో రామ్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘ఉన్నది ఒక్కటే జిందగీ’. ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రామ్ చెప్పిన విశేషాలు... ‘ఒకటే జిందగీ’ కహానీ ఏంటి? చైల్డ్‌హుడ్, కాలేజ్ అండ్ మెచ్యురిటీ మెంటాలిటీ వచ్చిన తర్వాత... ఇలా అభిరామ్ (రామ్ పాత్ర పేరు) క్యారెక్టర్లో త్రీ ఫేజెస్ ఉంటాయి. బేసికల్లీ ఫ్రెండ్షిప్ ఫిల్మ్. ఇందులో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీలు ఉంటాయి. చైల్డ్‌హుడ్ నుంచి అభిరామ్‌కి, వాసుకి ఫ్రెండ్షిప్ ఎలా కొనసాగుతుంది? వారితో ఎవరు జాయిన్ అవుతారు? ఎవరు విడిపోతారు? వాళ్ల వల్ల అభిరామ్‌కి, వాసుకి ఏమైనా అభిప్రాయభేదాలు వచ్చాయా? అనేది సినిమాలో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకు అభిరామ్‌లా ఓ ఫ్రెండ్ ఉంటే చాలురా ఈ లైఫ్‌కి అన్నట్లు ఉంటుంది. మాస్ కమర్షియల్ టైప్ సినిమా కాదిది. ఐటమ్‌సాంగ్ కూడా లేదు. హ్యూమన్ ఎమోషన్స్‌కు రెస్పాండ్ అయ్యే అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. ఫ్రెండ్షిప్కి ఇంపార్టెన్స్ ఉన్న ఈ సినిమా చేసేటప్పుడు మీ రియల్ లైఫ్ ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తొచ్చారా? సినిమా ప్రీ–ప్రొడక్షన్ నా రియల్ లైఫ్ బెస్ట్ ఫ్రెండ్ శరత్ గుర్తొచ్చాడు. అతను చెన్నైలో ఉంటాడు. నేను, డైరెక్టర్ కిశోర్ మా అనుభవాలను చర్చించుకునేవాళ్లం. అందులో ఏవైనా మంచి ఫీల్‌గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే ‘ఈ సీన్‌ను సినిమాలో ట్రై చేద్దామా’? అని కిశోర్ అనేవాడు. న్యూ లుక్ ట్రై చేశారు కదా... దాని గురించి? నేను స్క్రిప్ట్ వినకముందు నుంచే జుట్టు, గడ్డం పెంచుకున్నాను. ఏదైనా కొత్త లుక్‌లో స్క్రీన్‌పై కనిపించాలనుకున్నాను. నేను, కిశోర్ స్టోరీ గురించి డిస్కస్ చేశాం. అప్పుడు గిటార్ బ్యాండ్ కాన్సెప్ట్ అనుకున్నాం. గిటార్ ప్లేయర్స్ లుక్ కోసం ఇలా మేకోవర్ అయ్యాను. వాళ్లు జుట్టు, గడ్డం పెంచుకుని ఉంటారు. టాటూస్ కూడా వేసుకుంటారు. అవి మనవాళ్లకి వర్కౌట్ అవ్వవు కదా అని టాటూస్ వేయించుకోలేదు. ‘నేను.. శైలజ’లో చేసిన హరి క్యారెక్టరైజేషన్‌కి, ఈ సినిమాలో అభిరామ్ క్యారెక్టరైజేషన్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అభిరామ్ క్యారెక్టర్ రోల్ మోడల్లా ఉంటుంది. లైఫ్‌ని కాంప్లికేట్ చేసుకోకుండా హ్యాపీగా ఉండాలనుకుంటాడు. సినిమా చూస్తే అర్థం అవుతుంది. లైఫ్ అంటే సింపుల్ కాదని హీరోయిన్ అంటుంది. కానీ, అభిరామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే తన కన్విన్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది. నేను అభిరామ్‌లా ఉండాలని ట్రై చేస్తుంటాను. దేవీశ్రీ ఇచ్చిన ఎనర్జిటిక్ ట్యూన్స్‌కి మీ ఎనర్జీ బాగా కనెక్ట్ అయినట్లుంది? తను నాతో ఐదు సినిమాలు చేశాడు. మంచి ఆల్బమ్స్ ఇచ్చాడు. మేం ఎప్పుడు కలిసినా సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. రీ–రికార్డింగ్ చేస్తున్నప్పుడు ‘సీన్ అదిరిపోయిందబ్బా..’ అని ఫోన్ చేస్తాడు. సాంగ్ సిచ్యువేషన్∙చెప్తే చాలు.. దేవి ట్యూన్ కట్టేస్తాడు. ఇన్పుట్స్ వెంటనే రెడీ చేసుకుంటాడు. తన బీట్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘హైపర్’ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని, ఈ సినిమా చేశారు? గ్యాప్ తీసుకోవాలని కాదు. నిజానికి ‘హైపర్’కి ముందు కూడా గ్యాప్ తీసుకున్నాను. స్క్రిప్ట్ నచ్చితే వెంటనే స్టార్ట్ చేసేస్తాను. ‘నేను.. శైలజ’, ‘శివమ్’, ‘పండగ చేస్కో’ ఒకేసారి విన్నా... ఒకే సారి ఒకే చేశా. స్క్రిప్ట్ ఎగై్జట్ చేస్తే.. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తా. n అనిల్ రావిపూడి చెప్పిన కథ (బ్లైండ్ క్యారెక్టర్‌తో) ఒప్పుకోలేదట! ఎందుకు? కొన్ని కుదర్లేదంతే! అంతకు మించి ఏం లేదు. వద్దనుకున్న స్క్రిప్ట్ గురించి మళ్లీ మళ్లీ ఆలోచిస్తారా? వన్స్ స్క్రిప్ట్‌ను రిజెక్ట్ చేసిన తర్వాత మళ్లీ ఆలోచించే ప్రసక్తే లేదు. మీ లైఫ్‌లో మీ పెదనాన్నగారి రోల్ గురించి ఏం చెప్తారు? దానికి పర్టిక్యూలర్ ఆన్సర్ అంటూ ఏం లేదు. ఆయన త్రూ అవుట్ ఉన్నారు. కథ గురించి, క్యారెక్టరైజేషన్ గురించి బాగా డిస్కస్ చేసుకుంటాం. నాతో సినిమా తీయడం అనేది ఆయనకు పెద్ద డీల్ కాదు. ఒకవేళ కాదనుకుంటే... వేరే నిర్మాత వచ్చి తీస్తారు. నా కెరీర్ మొత్తం ఆయన ఉన్నారు. దేవుడి దయ వల్ల మంచి పొజిషన్లో ఉన్నాం. కథ ఎంపిక విషయంలో నాదే ఫైనల్ డెసిషన్. ఒకటి నేను కన్విన్స్ అవుతా. లేదా అవతలి వారిని కన్విన్స్ చేస్తాను. ప్రతి సినిమాను నమ్మే చేస్తాం. మీరు హిట్ అవుతుంది అనుకున్న సినిమా ఫెయిల్ అయితే మీ రియాక్షన్... ఆ ఫెయిల్యూర్‌ను ఎలా ఓవర్‌కమ్ చేస్తారు? ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. మంచి రిజల్ట్ రాలేదు. ఎందుకు ఇలా జరిగింది అని ఎనలైజ్ చేసుకుంటాను. బట్.. ఫైనల్‌గా బయటపడతాను. ‘జగడం’ సినిమా గుడ్ రిజల్ట్ ఇవ్వలేదని బాధ పడ్డాను. ‘ఎందుకు నచ్చలేదు. బాగుంది కదా’ అనుకున్నా. ‘ఎందుకంటే ప్రేమంట..’ సినిమాకు కూడా అలానే ఫీలయ్యాను. అన్ని సినిమాలను కాన్ఫిడెంట్‌గానే చేస్తాం. లేకపోతే అంత ఖర్చు పెట్టి సినిమాలు తీయలేం. వేరే భాషల్లో మార్కెట్ పెంచుకోవాలన్న ప్లాన్ ఏమైనా? మైండ్‌లో ఉంది. బట్ బైలింగువల్ అంత ఈజీ కాదు. మీడియా ముందుకు రాని చాలా ప్రాజెక్ట్స్‌ను రిజెక్ట్ చేశాను కూడా. తమిళ్‌కి, తెలుగుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడి ఎమోషన్ వేరు. ఇక్కడి ఎమోషన్ వేరని నాకు తెలుసు. నేను చిన్నప్పుడు చెన్నైలోనే పెరిగాను. నెక్ట్స్ ఏ సినిమాలు చేస్తున్నారు. ‘రెడీ’కి సీక్వెల్ చేస్తున్నారట.. ‘రెడీ’ సిన్మాకి సీక్వెల్ లేదు. వేరే స్క్రిప్ట్స్ రెడీ అవుతున్నాయి. -
ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడు..!
-
ట్రెండ్ మారినా.. ఫ్రెండు మారడు..!
నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్ లు సాధించిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఉన్నది ఒక్కటే జిందగీ. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫ్రెండ్ షిప్ డేకు ఒక్కరోజు ముందు రిలీజ్ చేశారు. రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న ఈ మూవీని స్రవంతి సినిమాటిక్స్, పీఆర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా రిలీజ్ చేశారు . ట్రెండ్ మారినా ఫ్రెండు మారడు అంటూ సాగే ఈ పాటను ఆగస్టు 6 ఉదయం 10 గంటలకు రిలీజ్ అయ్యింది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించారు. రామ్ సరసన అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. -
'ఉన్నది ఒక్కటే జిందగీ' ఫస్ట్ లుక్
నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్ లు సాధించిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఉన్నది ఒక్కటే జిందగీ. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న ఈ మూవీని స్రవంతి సినిమాటిక్స్, పీఆర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు . ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు అంటూ సాగే ఈ పాటను ఆగస్టు 6 ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతోంది. ఫస్ట్ లుక్ తో పాటు సాంగ్ రిలీజ్ ను కూడా తన ట్విట్టర్ ద్వారా ఎనౌన్స్ చేశాడు రామ్. This one is going to be Super Fresh!!! #VOZ First Look! NEXT- #TrendMarinaFriendMaradu single Out Tomorrow at 10AM!!! #VunnadhiOkateZindagi pic.twitter.com/WJxCvz2Bz7 — Ram Pothineni (@ramsayz) 5 August 2017 -
కుట్టి.. పొన్ను.. అబ్బాయి!
హీరో రామ్, దర్శకుడు కిశోర్ తిరుమల కలయికలో వచ్చిన మొదటి సినిమా ‘నేను శైలజ’. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో మరో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. స్రవంతి మూవీస్, పీఆర్ సినిమా సంస్థలపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించ నున్న ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రారంభం కానుంది. ‘నేను శైలజ’లో మలయాళీ బ్యూటీ కీర్తీ సురేశ్ కథానాయికగా నటించారు. తాజా సినిమాలో మరో మలయాళ కుట్టి (అమ్మాయి) అనుపమా పరమేశ్వరన్‌ను ఓ నాయిక గా, తమిళ పొన్ను (అమ్మాయి) మేఘా ఆకాశ్‌ను నాయికగా ఎంపిక చేశారు. ఆమెకు తెలుగులో తొలి అవకాశమిది. తమిళంలో ధనుష్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా’లో మేఘా ఆకాశ్ నటిస్తున్నారు. ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ – ‘‘నేను శైలజ’లో రామ్‌ను సరికొత్తగా చూపించిన దర్శకుడు కిశోర్ తిరుమల తాజా సినిమాలోనూ సరికొత్త లుక్, బాడీ లాంగ్వేజ్‌తో చూపించబోతున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కళ: ఏఎస్ ప్రకాశ్, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, కెమేరా: సమీర్‌రెడ్డి. -
టెన్షన్ పెట్టకు తమ్ముడు : హీరో రామ్
నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్ లు సాధించిన యంగ్ హీరో రామ్, తన నెక్ట్స్ సినిమాను ఇంత వరకు ఎనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాతో పాటు ప్రైవేట్ పార్టీస్ లో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న రామ్ కు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఓ అభిమాని రామ్.., నెక్ట్స్ సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు ఉపవాసం చేస్తున్నానంటూ రామ్ కు ట్విట్టర్ లో మెసేజ్ చేశాడు. ' రామ్ అన్నయ్య, ఈ రోజు నుంచి మీ నెక్ట్స్ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఉపవాసం చేస్తున్నాను. ఇది మొదటి రోజు లవ్ యు' అంటూ తరుణ్ సాయి ప్రకాష్ అనే అభిమాని ట్వీట్ చేశాడు. ఈ ట్విట్ పై స్పందించిన రామ్, ' ఇలాంటి కొత్త టెన్షన్స్ పెట్టకు తమ్ముడు, నేను అదే పనిలో ఉన్నా' అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాతో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు రామ్. @ramsayz annaya iam going to start fasting from 2day onwards till we get an announcement of ur nxt project iam saying it for sure DAY1 loveU — tarun_sai_prakash (@starun01) 21 February 2017 Illanti kotha tensions pettaku thammudu..im on it #love https://t.co/G1xbMUXXIB — Ram Pothineni (@ramsayz) 21 February 2017 -
‘అమృత’లో హైపర్ సందడి
హన్మకొండ చౌరస్తా : హన్మకొండలోని అమృత థియేటర్లో సోమవారం సాయంత్రం ‘హైపర్’ చిత్రం యూనిట్ సందడి చేసింది. ఫస్ట్ షో ఇంటర్వెల్ సందర్భంగా థియేటర్లో చిత్రం హీరో రామ్, హీరోయిన్ రాశీఖన్నా ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ ‘మీరు హైపర్ సినిమా చూసేందుకు వస్తే మేము మీ హైపర్ చూద్దామని వచ్చాం.’ అంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించారు. కొంతమంది అభిమానుల కోరిక మేరకు సినిమాలోని కొన్ని డైలాగ్‌లు చెప్పారు. హీరోయిన్ రాశీఖన్నా మాట్లాడుతూ ‘అభిమానులు లేనిదే మేము లేము. మాపై అభిమానంతో సినిమాను హిట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అన్నారు. ఈ సందర్భంగా అభిమానులు తమ సెల్ఫోన్లలో హీరో, హీరోయిన్ల ఫొటోలను బంధించేందుకు పోటీపడ్డారు. వారితో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్, నిర్మాతలు రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట, సుంకర అనిల్, సురక్ష ఎంటర్టైన్మెంట్ ప్రతినిధి ప్రకాష్, థియేటర్ యాజమాన్యం ఎ.రవీందర్రావు, పాల్గుణ్, మేనేజర్ మోహన్‌రావు, కార్పొరేటర్ బోడ డిన్న పాల్గొన్నారు. -
అభిమానులకు రామ్ సూచన
ఈ జనరేషన్ హీరోలు అభిమానుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. సినిమా వేడుకలను ఎంత గొప్పగా నిర్వహించాం అన్నదానికన్నా, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా యంగ్ హీరో రామ్ కూడా తన అభిమానులకు ఈ మేరకు పిలుపునిచ్చాడు. రామ్ హీరోగా తెరకెక్కుతున్న హైపర్ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకను శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అయితే భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి ఇబ్బంది కరంగా తయారవ్వటంతో.. 'హైదరాబాద్ రోడ్ల పరిస్థితి అంత సురక్షితం అనిపించటం లేదు. ఏ మాత్రం రిస్క్ అనిపించినా ఫంక్షన్ కు రాకండి. టివిలో లైప్ ద్వారా చూడొచ్చు' అంటూ ట్వీట్ చేశాడు. నేను శైలజ సక్సెస్ తరువాత రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా హైపర్. గతంలో రామ్ కు కందిరీగ లాంటి సూపర్ హిట్ ను అందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.My dearest fans,the roads dont seem safe.Yemaatram risk anipinchina pls Refrain from coming to the event. You can watch it Live on TV.#love pic.twitter.com/7IxgBQwcd7— Ram Pothineni (@ramsayz) 23 September 2016 -
సూపర్ ఫాస్ట్ గా 'హైపర్'
'నేను శైలజ' సినిమాతో సంవత్సరం ప్రారంభంలో సూపర్ హిట్ కొట్టిన రామ్ కొంత గ్యాప్ తరువాత.. తాజాగా 'హైపర్' అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. హైపర్ షూటింగ్ సూపర్ ఫాస్ట్‌గా జరుగుతుంది. కొన్ని రోజులుగా వైజాగ్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ షురూ చేసింది. సెప్టెంబరు 30 వ తేదీన 'హైపర్'ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా అలరించనుంది. రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. సత్యరాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. దసరా సీజన్లో 'హైపర్' సందడి చేయనుంది. -
అల్లి బిల్లి చెక్కిలి గిల్లి... చాలా బాగుంది!
- హీరో రామ్ ‘‘‘తొలి చిత్రం నుంచి సుమంత్ అశ్విన్ నటనలో వైవిధ్యం చూపిస్తున్నాడు. ఈ సినిమా తన కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు విడుదల చేసిన ఈ పాట బాగుంటుంది. ముఖ్యంగా ఈ పాటలో అశ్విన్‌తో పాటు ప్రభాకర్ స్టెప్స్ వేయడం సరదాగా ఉంది’’ అని రామ్ అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా ఝవేరీ జంటగా ‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘రైట్... రైట్’. మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ ఈ చిత్రం నిర్మించారు. జె.బి. స్వరపరచిన ఈ చిత్రంలోని ‘అల్లి బిల్లి చెక్కిలి గిల్లి.. రెక్కలే విప్పెను లిల్లి’ అనే తొలి పాట వీడియోను సోమవారం హీరో రామ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘అప్పుడప్పుడూ లుంగీతో నాన్నగారు ఇంట్లో సరదాగా స్టెప్స్ వేస్తుంటారు. లుంగీలో అంత క్యాజువల్‌గా ఎలా డ్యాన్స్ చేయగలుగుతారా? అనిపించేది. ఇప్పుడీ సినిమాలో నేను కూడా లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేశా. లుంగీలో డ్యాన్స్ ఇదే ఫస్ట్ టైమ్. ఈ సినిమా అధిక భాగం చిత్రీకరణ అరకులో జరిపాం. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తర్వాత అరకు అంత అందంగా కనిపించేది ఈ సినిమాలోనే’’ అని చెప్పారు. తొలి సగం వినోదాత్మంగా, మలి సగం మిస్టరీతో ఈ చిత్రం ఉత్కంఠగా సాగుతుందని దర్శకుడు అన్నారు. మే 7న పాటలను విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు ‘బాహుబలి’ ప్రభాకర్, సంగీత దర్శకుడు జేబీ, చిత్ర సమర్పకుడు వత్సవాయి వెంకటేశ్వర్లు, సహ నిర్మాత జె.శ్రీనివాసరాజు, ఆదిత్యా మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ పాటను భయపడుతూ చిత్రీకరించా : నందినీ రెడ్డి
‘‘దామోదర్‌రెడ్డిగారు మంచి అభిరుచి గల నిర్మాత. స్క్రిప్ట్‌ను నమ్మి సినిమా తీసే నిర్మాతల్లో ఆయనొకరు. ‘అలా మొదలైంది’ హిట్ మళ్లీ ఈ సినిమాతో రిపీట్ కావాలని కోరుకుంటున్నా’’ అని హీరో రామ్ అన్నారు. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో కేఎల్ రామోదర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. కల్యాణి కోడూరి స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా పాటల సీడీని హీరో రామ్ ఆవిష్కరించారు. నాగశౌర్య మాట్లాడుతూ- ‘‘దామోదర్‌రెడ్డిగారు కథను నమ్ముకుని ధైర్యంగా సినిమా తీసే నిర్మాత. నా నెక్ట్స్ సినిమా కూడా నందినీ రెడ్డిగారితోనే చేస్తాను. కల్యాణి కోడూరిగారితో నాకిది రెండో సినిమా. మంచి పాటలిచ్చారు’’ అని చెప్పారు. ‘‘కల్యాణి ఈ సినిమాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా ‘కల్యాణం...’ సాంగ్ అయితే అద్భుతం. దానికి సరిపడే విజువల్ ఇస్తానా? లేదా అనే డౌట్ వచ్చింది. ఆ పాట మాత్రం భయపడుతూ చేశాను. నాగశౌర్య, మాళవిక వయసులో చిన్నవాళ్లయినా యాక్టింగ్‌లోనూ, బిహేవియర్‌లోనూ చాలా మెచ్యూరిటీ, డెడికేషన్ చూపించారు. అందరం ప్రేమించి చేసిన సినిమా ఇది’’ అని నందినీ రెడ్డి తెలిపారు. కేఎల్ దామోదర్‌ప్రసాద్ మాట్లాడుతూ- ‘‘అందరం కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి పనిచేశాం. ఈ చిత్రం ద్వారా రాజు అనే సినిమాటోగ్రఫర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నాగశౌర్య, మాళవిక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు’’ అని చెప్పారు. ఈ వేడుకలో హీరోలు రాజ్‌తరుణ్, సుమంత్ అశ్విన్, సంగీత దర్శకుడు కల్యాణి కోడూరి, రచయిత లక్ష్మీ భూపాల్, దర్శకులు దశరథ్, ఇంద్రగంటి మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నేను శైలజ
-
సాగర తీరంలో ప్రేమ పాఠాలు!
గోవా అంటే బ్యాచిలర్స్‌కు ప్యారడైజ్. ఇక ప్రేమికులైతే అక్కడికెళ్తే ప్రపంచాన్నే మర్చిపోతారు. ఇప్పుడు హీరో రామ్ కూడా హీరోయిన్ కీర్తీ సురేశ్‌తో కలిసి ప్రేమపాఠాలు వల్లిస్తున్నారు. అయితే నిజంగా కాదండోయ్... సినిమా కోసమే. రామ్, కీర్తీ సురేశ్ జంటగా శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికి శోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. శనివారం నుంచి గోవాలో చివరి పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 26తో పాట చిత్రీకరణ పూర్తవుతుంది. ‘‘రామ్ స్టయిల్లో సాగే ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తుంది. టైటిల్ ఈ వారంలోనే వెల్లడిస్తాం. జనవరి 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయగ్రహణం: సమీర్‌రెడ్డి, సమర్పణ: కృష్ణచైతన్య. -
వెళ్లండి.. ఆ సినిమా చూడండి!
రామ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా రూపొందిన శివం సినిమాకు వెళ్లాలని అభిమానులను మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కోరుతోంది. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా హీరోయిన్ రాశిఖన్నాకు రకుల్ తన ఆల్ ద బెస్ట్ చెప్పింది. పొద్దున్నే ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన రకుల్.. హీరో రామ్‌కు కూడా అభినందనలు తెలిపింది. ఇక అభిమానులనైతే, గయ్స్.. వెళ్లండి, సినిమా చూడండి అంటూ పొలికేకలు పెట్టి మరీ చెబుతోంది. తమ అందాల తార చెప్పిన తర్వాత మరి కుర్రాళ్లు ఊరుకుంటారా.. వెళ్లి చూస్తారు కదూ. All d besttttttt to @ramsayz and my darling @RaashiKhanna for #Shivam releasing today... Guys go watch it!! — Rakul Preet (@Rakulpreet) October 2, 2015 -
ఆ రెండు నెలలు లవ్ ఫెయిల్యూర్లో ఉన్నట్లనిపించింది!
స్మయిల్... స్టయిల్... ఎనర్జీ... ఈ మూడింటినీ మిక్స్ చేస్తే రామ్. ఆన్స్క్రీన్లోనైనా, ఆఫ్ స్క్రీన్‌లోనైనా రామ్ చురుకుదనం చూస్తే... చిన్నప్పుడు బూస్ట్, హార్లిక్స్, బోర్నవిటా, కాంప్లాన్ అన్నీ కలగలిపి తాగేశాడేమో అనిపిస్తుంది. యూత్, మాస్ హార్ట్స్‌లో తనదైన సిగ్నేచర్ చేసిన రామ్ రేపు ‘శివమ్’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా గురించి, కెరీర్ గురించి బోలెడన్ని క్వశ్చన్స్ అడిగితే టకటకా ఆన్సర్లు చెప్పేశారు రామ్. సరిగ్గా నాలుగు నెలల క్రితం పండగ చేసుకున్నారు. ఇప్పుడు శివమెత్తడానికి రెడీ అయ్యారు..? (నవ్వుతూ...) అవునండి. నాలుగు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలతో తెరపై కనిపించడం హ్యాపీగా ఉంది. ‘పండగ చేస్కో’ హిట్టవడం ఎంకరేజింగ్‌గా అనిపించింది. శ్రీనివాస రెడ్డి డెరైక్ట్ చేసిన ‘శివమ్’ కూడా బాగుంటుంది. ‘శివమ్’లో ఏం చేస్తారేంటి? లైఫ్‌లో పుట్టుకా, చావనేది మన చేతుల్లో ఉండదు. కానీ, పెళ్లి మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకని నచ్చిన అమ్మాయి దొరికితే, ఆ అమ్మాయిని దక్కించుకోవడం కోసం ఫైట్ చెయ్ అని ఈ చిత్రంలో చెబుతాం. కొంతమంది అగ్రెసివ్‌గా ఉంటారు. ఆ క్షణంలో ఏదనిపిస్తే, అది చేసేస్తారు. ఇందులో నేను అలాంటి అబ్బాయిని. అందులోనే ఫన్ ఉంటుంది. రాశీఖన్నాతో మీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి? ‘పండగ చేస్కో’ కోసం తొమ్మిది కిలోలు తగ్గా. ఈ సినిమాకి పెరిగా. ఈ చిత్రానికి రాశీ ఖన్నాను అనుకున్నప్పుడు, బబ్లీగా ఉంటుంది కాబట్టి, మా జంట బాగుంటుందా అనుకున్నాం. కానీ, నేను కూడా బరువు పెరగడంతో పెయిర్ బాగుంది. ఆ మధ్య మీరు నటించిన చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఆ సమయంలో ఎలా ఫీలవుతుంటారు? ఫ్యాన్స్‌నీ, బయ్యర్స్నీ డిజప్పాయింట్ చేశాం అని రెండు, మూడు రోజులు గిల్టీగా ఉంటుంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఈ ఫీలింగ్ ఎక్కువగా ఉండేది. ‘జగడం’ అప్పుడు చాలా బాధపడ్డాను. ఎవరితోనూ మాట్లాడే వాణ్ణి కాదు. రెండు నెలలు ఎవర్నీ కలవలేదు. ఆ రెండు నెలలు లవ్ ఫెయిల్యూర్లో ఉన్నట్లనిపించింది. నాకూ, సుక్కూ (దర్శకుడు సుకుమార్)కీ ఆ సినిమా మీద చాలా నమ్మకం. కానీ, మా నమ్మకం వమ్ము అయింది. మీ రీసెంట్ హిట్ ‘పండగ చేస్కో’ పూర్తి సంతృప్తి మిగిల్చిందా? కమర్షియల్‌గా హ్యాపీ. కానీ, చిన్న వెలితి ఉంది. అది ఏంటనేది తెలియదు. ఇంకొంచెం డిఫరెంట్‌గా ఉంటే బాగుండేది. సెకండాఫ్‌లో విలనింట్లో హీరో సెటిలవడం రొటీన్ అనిపించిందేమో! నిజమే. అదే వెలితి అనిపించిందేమో. యాక్చువల్‌గా ముందు కథలో అది లేదు. ఆ తర్వాత అలా అయిపోయింది. ‘శివమ్’లో మాత్రం ఎవరింట్లోనూ దూరను (నవ్వుతూ). రాబోయే చిత్రాల్లో అలాంటి ఎపిసోడ్స్ లేకుండా జాగ్రత్త పడతా. జనరల్‌గా మీరు కథలు సెలక్ట్ చేసుకునే తీరు ఎలా ఉంటుంది? కథ వినే ముందే సినిమా చూడ్డానికి వెళుతున్నట్లుగా అనుకుంటా. కథను విజువలైజ్ చేసుకుంటా. సో... కథ వింటు న్నప్పుడే సినిమా చూసేస్తా. బాగుందనిపిస్తే, ఒప్పుకుంటా. మీరెక్కువ కమర్షియల్ ఫిల్మ్స్‌కే పరిమితమవుతున్నట్లున్నారు. చాలా ప్రయోగాలు కూడా చేశా. అవి ఆదరణ పొందక పోవడంతో హిట్ అయిన నా కమర్షియల్ సినిమాలే గుర్తుంటు న్నాయి. ‘దేవదాసు’ కమర్షియల్ హిట్. ‘జగడం’ ఓ ప్రయోగం. ‘రెడీ’ ఓ ట్రెండ్ సెట్టర్. ‘మస్కా’ రెగ్యులర్ కమర్షియల్ మూవీ. ‘గణేశ్’ పిల్లల కోసం చేశా. ’ఎందుకంటే ప్రేమంట’ ఓ ప్రయోగం. ‘కందిరీగ’ కమర్షియల్ మూవీ. ‘ఒంగోలు గిత్త’ మిర్చి యార్డ్ బ్యాక్ డ్రాప్‌తో చేశాం. ‘మసాలా’లో చేసిన ‘గే’ పాత్ర కూడా ప్రయోగమే. ‘పండగ చేస్కో’ కమర్షియల్ హిట్ మూవీ. నేను చేసిన ప్రయోగాలు హిట్ కాకపోవడంతో వెలుగులోకి రావడంలేదు. ఇక ప్రయోగాలకు దూరమా? దూరంగా ఉండను. కానీ, కమర్షియల్ ఎలి మెంట్స్ ఉండేలా చూసుకుంటా. ‘ఎందుకంటే ప్రేమంట’ ఈ తరహా మూవీనే. టీవీల్లో వచ్చినప్పుడు చూసి, చాలా బాగుంది అంటుంటారు. థియేటర్లో ఎందుకు చూడలేదో తెలియడం లేదు. టీవీలో చూసి, బాగుందన్నప్పుడు కోపం వస్తుంది (నవ్వుతూ). ఓకే. ‘పండగ చేస్కో’, ‘శివమ్’, ‘హరికథ’... ఒకేసారి మూడు సినిమాలు చేయడం కష్టం అనిపించలేదా? ఏప్రిల్ 10న పొల్లాచ్చిలో ‘హరికథ’, 11న హైదరాబాద్‌లో ‘శివమ్’, 12న ఆర్ఎఫ్సీలో ‘పండగ చేస్కో’ షూటింగ్స్ చేశా. అంటే మూడు రోజుల్లో మూడు రకాల పాత్రల్లో ఒదిగిపోవా లన్నమాట. కొంచెం టైర్డ్గానే ఉంటుంది. కానీ, దర్శకులు ఇచ్చే జోష్‌తో అలసటపోతుంది. ఈ చిత్రాల దర్శకులు అలాంటివాళ్ళే. మీరెక్కువగా మీ సొంత సంస్థలోనే చేస్తుంటారు. కారణం? డెరైక్టర్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు నిర్మాతను కూడా సెలక్ట్ చేసుకుంటే వాళ్లకే ఓకే చెప్పేస్తాను. కేవలం కథతో మా దగ్గరకు వస్తే, అప్పుడు మా బేనర్లోనే చేస్తాం. కథలు కూడా ముందు పెదనాన్నగారు (స్రవంతి రవికిశోర్) వింటారు. ఆయన ముప్ఫయ్యేళ్ల అనుభవం నాకు హెల్ప్ అవుతుంది. హీరోగా మీ స్థానం ఏంటి? ప్రతి శుక్రవారం మారిపోయే స్థానం గురించి పెద్దగా పట్టించుకోను. ఇక్కడ హిట్ ముఖ్యం. స్థానం గురించి ఆలోచించే బదులు మంచి స్క్రిప్ట్స్ వెతుక్కునే పని మీద ఉంటే మంచిది. అలా కాకుండా స్థానాన్ని ఎనలైజ్ చేసుకుంటూ ఉంటే స్క్రిప్ట్స్ చేజారిపోతాయ్. రజనీ కాంత్ రేంజ్‌కి వెళ్లినా ఇంకా పెరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. రేంజ్ అనేది ‘నెవర్ ఎండింగ్ ప్రాసెస్’. చేసే పాత్రలను నేనెక్కువగా ఎనలైజ్ చేసుకుంటూ ఉంటా. ఇంకా కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది? అనే విషయం మీద దృష్టి పెడతాను. ‘హరికథ’ ఎందాకా వచ్చింది? కిశోర్ తిరుమల దర్శకత్వంలో తయారవుతున్న ‘హరికథ’ 70 శాతం పైగా పూర్తయ్యింది. డిసెంబర్లో విడుదల చేస్తాం. తమిళంలో మంచి ఇంట్రడక్షన్ కోసం చూస్తున్నా! చెన్నైలో పుట్టి, పెరగడం వల్ల నాకు తమిళం బాగా వచ్చు. ఎంత బాగా అంటే, ‘ఎందుకంటే ప్రేమంట’ డబ్బింగ్‌కి తెలుగులో వారం రోజులు తీసుకుంటే, తమిళంలో రెండు రోజుల్లో చెప్పేశాను. తెలుగులో ‘దేవదాస్’ నాకు మంచి ఇంట్రడక్షన్ అయ్యింది. తమిళంలో కూడా అలాంటి చిత్రం ద్వారా ఇంట్రడ్యూస్ అయితే బాగుంటుంది. ఆరేడేళ్లుగా తమిళంలో మంచి సినిమా చేయాలనే ప్రయత్నం మీద ఉన్నా. ‘ర్యామ్’డమ్ థాట్స్ ఎందులో ఆనందం ఉందో మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుని పని చేస్తే జీవితం ఆనందంగా ఉంటుంది. ఒక సీన్ ఎలివేట్ అయ్యేలా డైలాగ్స్ రాసేవాడు రైటర్. ఒక డైలాగ్ ఎలివేట్ అయ్యేలా సీన్ తీసేవాడు డెరైక్టర్. ఎవరైనా ఏదైనా అన్నా... అనుకున్నా... అనకుండా ఉన్నా... నువ్వు అనుకున్నదేదో చేసెయ్. ప్రాణం చాలా విలువైనది. దాన్ని బలి చేయకు. నీ కోసం బ్రతకడం ఇష్టం లేనప్పుడు, అవతలివాళ్ల కోసం బ్రతకడం మొదలుపెట్టు. ఐయామ్ గుడ్ అనుకుంటే పైకి వస్తావ్. ఐయామ్ గాడ్ అనుకుంటే పైకి పోతావ్. ఒక్క అక్షరమే తేడా. -
మూడేళ్ల తరువాత నిర్మాతలుండరేమో!
అరవై ఏళ్ళ జీవితం... నిర్మాతగా ముప్ఫై ఏళ్ళ కెరీర్... రిలీజ్‌కు రెడీగా 34వ సినిమా (‘శివమ్’)... షూటింగ్లో మరో సినిమా (‘హరికథ’)... వెరసి ‘స్రవంతి’ రవికిశోర్‌కు పాత జ్ఞాపకాలు, కొత్త అనుభవాలూ బోలెడు. వ్యాపారంగానే సినిమాల్లోకి వచ్చినా, తీస్తున్న సినిమాల్లో మనసు లెక్కలు మర్చిపోరీ ఆలిండియా సి.ఏ. ర్యాంకర్. ముప్ఫై ఏళ్ళ క్రితం ‘లేడీస్ టైలర్’తో మొదలుపెట్టిన ఆయన - ఈ అక్టోబర్ 2న ‘శివమ్’తో పలకరించ నున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ‘సాక్షి’ ప్రత్యేక భేటీ... ఈ ముప్ఫై ఏళ్ళ జర్నీని తలుచుకొంటే ఏమనిపిస్తుంటుంది? వ్యాపారంగానే సినిమాల్లోకొచ్చా. వచ్చాక వంశీ, తనికెళ్ళ, సీతారామ శాస్త్రి, ఇళయరాజా మొదలు ఇవాళ్టి దేవిశ్రీ ప్రసాద్ దాకా ఎందరో క్రియేటివ్ పీపుల్‌తో కలసి జర్నీ చేశా. ఈ అదృష్టం ఎందరికొస్తుంది! సినిమాల్లోకి రాక పోతే, ఎవరి లెక్కల్లోనో తప్పులు దిద్దుతూ, పి.వి. రవికిశోర్గా మిగిలేవాణ్ణి. అసలు సినిమా రంగంలోకి తొలి అడుగు ఎలా వేశారు? సినిమాల్లోకి రావడం నా డ్రీమ్ ఏమీ కాదు. అప్పట్లో దర్శకుడు వంశీతో పరిచయంతో ‘ఆలాపన’ లాంటి షూటింగ్లకెళ్ళేవాణ్ణి. జర్నలిస్టు వేమూరి సత్యనారాయణ లాంటి వాళ్ళు తోడయ్యారు. ఒకసారి అరకులో ఉండగా తొలిచిత్రం ‘లేడీస్టైలర్’ (1986)కి బీజం పడింది. అది గట్టి పునాది. అప్పటి నుంచి ‘నువ్వేకావాలి’ మీదుగా ఇప్పటి దాకా జర్నీ కంటిన్యూస్. నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్లోనూ ఉన్నట్లున్నారు? అవును. 1987 నుంచే డిస్ట్రిబ్యూషన్లోనూ ఉన్నా. కాకపోతే, నిర్మాతగా చేతిలో 13 పేకముక్కలుంటాయి. ఉన్న ముక్కలేమిటో మనకు తెలుసు. కానీ, డిస్ట్రిబ్యూషన్ మూడు ముక్కలాట లాంటిది. ఏ ముక్కలో ఏముందో తెలియకుండా పందెం కాస్తాం. అలా చాలా డబ్బులు పొగొట్టుకున్నా. చేదు అనుభవాలెదురైనా, పెట్టాబేడా సర్దుకొని వెళ్ళిపోదామని అనుకోలేదు. లేడీస్ టైలర్’ నాటికీ, ఇప్పటికీ చిత్ర నిర్మాణంలోని మార్పులపై మీ వ్యాఖ్య? అప్పట్లో నూటికి 90 మంది గుడికెళ్ళినంత పవిత్రంగా ఈ రంగాని కొచ్చేవారు. ఇవాళ నూటికి 70 మంది సినిమాపై మోజుతో వస్తు న్నారు. నౌ ఉయ్ ఆర్ మేకింగ్ ఫిల్మ్స్ విత్ అవర్ హెడ్స. నాట్ విత్ అవర్ హార్ట్స. ఇవాళ ఆడియన్సలో కూడా చాలా మార్పు వచ్చింది కదా? ఒకప్పుడు అర్థవంతమైన పాటలు, సినిమా చూశాక మంచి విషయం ఇంటికి తీసుకెళ్ళాలనే ఆలోచన ఉండేవి. ఇప్పుడు వినోదమే ఆశిస్తున్నారు. అప్పట్లో కథెక్కువ, కామెడీ తక్కువ. ఇప్పుడు కామెడీ ఎక్కువ, కథ తక్కువ. కానీ, మారిన కాలానికి తగ్గట్లు దర్శక, నిర్మాతలం మారాల్సిందే. లేకపోతే, మనం హిస్టరీగా మారతాం. ఐ డోంట్ వాంట్ టు బికమ్ పాస్ట్ ఆర్ హిస్టరీ. మీ సమకాలీన నిర్మాతల మధ్య పోటీ ఉండేదట... శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, అరవింద్, పోకూరి బాబూరావు, గోపాలరెడ్డి - ఇలా చాలామంది ఉండేవాళ్ళం. హెల్దీ కాంపిటీషనుండేది. ‘భలే భలే మగాడి వోయ్’ హిట్ తర్వాత అరవింద్ పార్టీ ఇచ్చి, నెక్స్ట్ పార్టీ మీదే అన్నారు. మరి మీ రాబోయే ‘శివమ్ ’, ‘హరికథ’ ఎలా ఉంటాయ్? ఫ్యామిలీ అంతా చూసే ఎంటర్టైనర్ ‘శివమ్ ’. తండ్రీ కూతుళ్ళ మధ్య అనుబంధంతో హార్టటచింగ్గా డిసెంబర్లో ‘హరికథ’ వస్తుంది. ఒక డబ్బింగ్‌తో కలిపి ఈ ఏడాది ఏకంగా 3 సినిమాలు ప్రొడ్యూస్ చేశారే? (నవ్వేస్తూ...) ‘రఘువరన్ బిటెక్’ (తమిళ ‘వి.ఐ.పి’) కూడా రీమేక్ చేద్దామనుకున్నా. కానీ, ధనుష్ బాగా చేశాడని డబ్బింగ్ చేశాం. మిగిలిన రెండు సినిమాలంటారా, వాటి స్క్రిప్ట్ ముందే చేసేశాం. ఇప్పుడు చేస్తున్నది కేవలం ఎగ్జిక్యూషనే. అందుకే, ఈసారి మూడు సినిమాలు తీయగలిగా. మీ తమ్ముడి కొడుకు రామ్‌తోనే కొన్నేళ్ళుగా సినిమాలు చేస్తున్నారేం? ఇప్పుడు డబ్బులు పెట్టేవాళ్ళనే తప్ప, అవసరమైతే హీరోనూ, దర్శ కుణ్ణీ ప్రశ్నించే నిర్మాతల్ని ఎవరూ ఇష్టపడడం లేదు. కోరుకోవడం లేదు. కోట్లమంది ప్రేక్షకులకు నచ్చేది కాకుండా, హీరో ఒక్కడికి నచ్చితే చాలు... కోట్ల మందికి నచ్చుతుందనే భ్రమలో సినిమా తీయడం వేస్ట్. అందుకే, 2008 నుంచి రామ్‌తోనే చేస్తున్నా. మా వాడితో అయితే, ఆ సమస్య ఉండదుగా! రామ్ అనే హీరో చేయూత లేకపోతే, నేనూ ఇబ్బంది పడేవాణ్ణి. ఇంటి హీరో కావడంతో ఆర్థికంగానూ మీకు వెసులుబాటు ఉంటుందేమో! (నవ్వుతూ) భారీ అడ్వాన్సులివ్వక్కర్లేదు. దానికి అప్పులు తేనక్కర్లేదు. రామ్ కెరీర్లో, నిర్ణయాల్లో మీ ప్రభావం? సిన్మా చేసేముందు మంచీచెడు చర్చించుకుంటాం. తీసుకెళ్ళిన ప్రాజె క్ట్‌లు తనకు సరిపోవని, ఎనాలిసిస్‌తో నన్ను కన్విన్స చేసిన ఘట్టాలున్నాయి. మరి, మీరు అతణ్ణి కన్విన్స చేసిన సందర్భాలు ? రామ్ పూర్తిగా ఇష్టపడకుండా చేసింది ‘మసాలా’. మల్టీస్టారర్ చేయడం ఇష్టమైనా, క్యారెక్టరైజేషన్ తనకు నచ్చలేదు. నా వల్ల చేయాల్సి వచ్చింది. పెదనాన్నగా కాకుండా, హీరోగా రామ్ లో మీకు నచ్చే విషయం? ఇంటెలిజెంట్ బాయ్. ఆల్వేస్ ఫోకస్డ్. విశ్లేషణా సామర్థ్యం ఎక్కువ. పైగా అంత హార్డవర్క చేసే హీరోను ఈ మధ్య చూడలేదు. అదే శ్రీరామరక్ష. ‘నువ్వేకావాలి’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మసాలా’ లాంటివి ఇతర నిర్మాత లతో పార్టనర్‌షిప్‌లో తీశారు. ఇప్పుడలాంటి ప్రయత్నాలు మానేశారేం? అలా చేస్తే, ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కానీ, ఇండిపెండెంట్‌గా పనిచేసినవాళ్ళం, మనకి మనం బాస్‌గా కాకుండా, మరొక బాస్ కింద పని చేయడం కొంత కష్టమే. నిర్ణయానికి మరొకరి కోసం నిరీక్షించడం ఇబ్బందే. ఇన్నేళ్ళ కెరీర్లో నిర్మాతగా మోస్ట్ డిజప్పాయింటింగ్ ఫిల్మ్? (క్షణం ఆలోచించి) ‘ఎందుకంటే ప్రేమంట’. నేను, రామ్ ప్రాణం పెట్టి పనిచేశాం. ఆడలేదు. అలాంటి తరహాదే ఆమిర్‌ఖాన్ ‘తలాష్’ చేస్తే అది ఆడింది. ఎక్కడో మేం తప్పు చేశామన్న మాట. ఇక, కెరీర్లో బెస్ట్ఫిల్మ్ ‘నువ్వు నాకు నచ్చావ్’. ప్రతి క్షణం ఆస్వాదిస్తూ, చేశా. కెరీర్లో తీవ్రంగా పశ్చాత్తాపపడిన సందర్భం, సంఘటన? అలా ఏమీ లేదు. ప్రతి వ్యక్తినీ, సందర్భాన్నీ ఒకలా అంచనా వేస్తాం. అది తప్పని తేలితే రెండోసారి జాగ్రత్తపడతాం. అంతకు మించి పగ, ప్రతీకారం లాంటివుండకూడదు. నేర్చుకొంటే, ఇక్కడ ప్రతీదీ అనుభవమే. రాబోయే రోజుల్లో సినీ నిర్మాణం ఎలా ఉండనుంది? తెలుగు పరిశ్రమ గట్టి దెబ్బలు కొట్టడంతో కార్పొరేట్ సంస్థలు గుమ్మం దగ్గరే నిలబడిపోయాయి కానీ, అవి వస్తాయి. మూడేళ్ళ తర్వాత స్వతంత్ర నిర్మాతలంటూ ఎవరూ మిగలకపోవచ్చు. అసోసియేట్, లైన్ ప్రొడ్యూసర్, వర్కింగ్ పార్‌టనర్‌సగా కార్పొరేట్స్‌తో చేతులు కలపాల్సి వస్తుంది. ‘నువ్వే కావాలి’ టైమ్ కే నేను ఊహించిన పరిణామం 15 ఏళ్ళు ఆలస్యమైంది. ఈ 30 ఏళ్ళ సినీ కెరీర్లో ఏం తెలుసుకున్నారు? అందరిలా తప్పులు చేశాం. సక్సెస్ ప్రమాదకరం. తలకెక్కి తప్పుదోవ పట్టిస్తుంది. సక్సెస్ ఒక్కరిది కాదు, టీమ్వర్కని మర్చిపోతుంటాం. అందుకే, ఫెయిల్యూర్ కన్నా సక్సెస్ వచ్చినప్పుడే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా రానున్న చిత్ర నిర్మాతలకు మీరిచ్చే సలహాలు, సూచనలు? ఇక్కడ ప్రతివాడూ పక్కవాడి కంటే తాను గొప్పనుకుంటాడు. కాబట్టి, సలహాలు చెప్పి, నవ్వులపాలు కాకూడదు. ఇక్కడ ఎవరూ వినరు, మారరు. మీ ‘స్రవంతి’ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి వారసులు సిద్ధమేనా? నా రెండో తమ్ముడి కొడుకు రామ్ హీరో. ఇక, న్యూజిలాండ్‌లో కమర్షి యల్ పైలట్ కోర్స చేసిన రామ్ వాళ్ళ అన్నయ్య కృష్ణచైతన్య నా వెంటే ఉంటూ ప్రొడక్షన్ చూస్తున్నాడు. నా మొదటి తమ్ముడు డాక్టర్ రమేశ్ కొడుకు రాజా నిశాంత్ అమెరికాలో డెరైక్షన్ కోర్స చేశాడు. భవిష్యత్తు వీళ్ళదే. - రెంటాల జయదేవ -
‘శివం’ మూవీ స్టిల్స్
-
హీరో రామ్‌కు ఆరు వారాల విశ్రాంతి!
హీరో రామ్.. తప్పనిసరిగా ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా అతడి ఎడమచెయ్యి కొద్దిగా దెబ్బతింది. యాక్షన్ సీన్ షూటింగ్ చేసేటప్పుడు లిగ్మెంట్ దెబ్బ తినడంతో వైద్యులు ఓ వారం రోజులు దానికి పూర్తి విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. అయితే, రామ్ మాత్రం దాన్ని పెద్దగా పట్టించుకోకుండా.. మరో నాలుగు యాక్షన్ సీన్ల షూటింగులో పాల్గొన్నాడు. దాంతో గాయం మరింత పెద్దదైంది. చివరకు తప్పనిసరిగా ఆరు వారాల పాటు విశ్రాంతి ఇవ్వాల్సిందేనని వైద్యులు స్పష్టం చేశారు. త్వరలోనే విదేశాల్లో షూటింగ్ ఉందని, ఈలోపు చేతికి పూర్తి విశ్రాంతి ఇస్తున్నానని రామ్ చెప్పాడు. వైద్యులు చెప్పినప్పుడు వినిపించుకోకుండా చేస్తే ఇలాగే అవుతుందంటూ తన చేతి గాయం ఫొటోలను ట్వీట్ చేశాడు. ఆ చేతికి ప్రస్తుతం ఫిజియోథెరపీ, వాక్స్ థెరపీ చేస్తున్నారు. శివం సినిమాలో రామ్ సరసన రాశి ఖన్నా నటిస్తోంది. That's what happens when the doctors ask u 2 take rest n u just carry on with ur work schedule.. :/ pic.twitter.com/taErKuHFT7 — Ram Pothineni (@ramsayz) August 7, 2015 -
రామ్డు శివమెత్తాడు
యువ హీరో రామ్ ఇప్పుడు మంచి జోరు మీద ఉన్నారు. ఇవాళ పుట్టినరోజు జరుపుకొంటున్న ఈ కథానాయకుడు ఈ నెలాఖరులో ‘పండగ చేస్కో’తో ప్రేక్షకులను పలకరించనున్నారు. మరోపక్క ఇంకో రెండు సినిమాల షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నారు. ఆ రెండు సినిమాలూ ఆయన పెదనాన్న ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నవే! రెండూ కొత్త దర్శకుల సారథ్యంలో రూపొందుతున్నవే కావడం విశేషం. రచయిత కిశోర్ తిరుమల ఒక చిత్రంతో, శ్రీనివాసరెడ్డి (దర్శకుడు సురేందర్ రెడ్డి సహాయకుడు) మరో చిత్రంతో దర్శకులుగా పరిచయమవుతున్నారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో పి. కృష్ణ చైతన్య సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రూపొందిస్తున్న సినిమాకు తాజాగా ‘శివం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రామ్ పుట్టిన రోజు సందర్భంగా ‘శివం’లో హీరో ఫస్ట్ లుక్ స్టిల్‌ను విడుదల చేశారు. రాశీ ఖన్నా హీరో యిన్ అయిన ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో రామ్ పాత్ర చిత్రణ ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. క్లాస్‌నీ, మాస్‌ని ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఏప్రిల్ 27 నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ చేస్తున్నాం. వచ్చే నెల 10 వరకు ఇక్కడే షెడ్యూలు జరుపుతాం’’ అని నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ తెలిపారు. బ్రహ్మానందం, అభిమన్యు సింగ్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు ఈ ‘శివం’లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ (సంగీతం), రసూల్ (కెమేరా), పీటర్ హేన్ (ఫైట్స్) లాంటి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తుండడం విశేషం. ఈ సమ్మర్‌కు ‘పండగ చేస్కో’ అంటున్న రామ్ ఈ ఏడాదే ‘శివమ్’తోనూ, మూడో సినిమాతోనూ జనం ముందుకు రావాలని కృషి చేస్తున్నారు. ఒక హీరోకు ఒకే ఏడాది మూడు రిలీజ్లంటే... ఈ రోజుల్లో గ్రేటే! కీపిటప్ రామ్! -
ఆడపిల్లలంటే తగని సిగ్గు!
తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకొని, క్రేజు సంపాదించుకున్న యువ హీరో రామ్. అయితే, ఆయన ఇటీవల నటించిన ‘ఒంగోలు గిత్త’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘మసాలా’ చిత్రాలు ఆశించినంతగా ఆడలేదు. దాంతో, మళ్ళీ మంచి విజయం సాధించాలనే పట్టుదలతో తాజాగా సెట్స్‌పై ఉన్న ‘పండగ చేస్కో’ చిత్రంపై ఆయన ఏకాగ్ర దృష్టి పెట్టారు. సినిమాల సంగతి కాసేపు పక్కనపెడితే, ఇప్పటి వరకు తన కెరీర్‌లోని మొత్తం 11 చిత్రాల్లో ఏకంగా 16 మంది హీరోయిన్లతో నటించి, పలు చిత్రాల్లో ఒకరికి ఇద్దరు హీరోయిన్లతో తెరపై నర్తించిన ఘనత ఈ యువ హీరోకు దక్కింది. అయితే, గమ్మత్తేమిటంటే ఈ యువ హీరోకు చిన్నప్పుడు మాత్రం ఆడవాళ్ళంటే తగని సిగ్గట! ఇటీవల ఆయన ఆ సంగతులు ముచ్చటిస్తూ, ఒక ఆసక్తికరమైన సంగతి బయటపెట్టారు. తను చిన్నతనంలో ఆడవాళ్ళతో అసలు మాట్లాడేవాడు కాదట! అయితే, కొందరిని చూసి మనసు పారేసుకొని, మోహంలో పడిన అనుభవాలు మాత్రం ఉన్నాయట! ‘‘నా మీద మనసు పడ్డ ఒక అమ్మాయి గతంలో ఒకసారి నాతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. అంతే! నేను అక్కడ నుంచి పరారయ్యాను. అలాగే, కొన్నిసార్లు కొంతమంది అమ్మాయిలు నాకు ప్రేమ ప్రతిపాదన చేశారు. కానీ, అలాంటప్పుడు ఎలా స్పందించాలో నాకు తెలిసేది కాదు’’ అని రామ్ అప్పటి సంగతులు చెప్పుకొచ్చారు. స్కూల్లో చదువుకొనే రోజుల్లో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో రామ్ చురుగ్గా పాల్గొనేవారట! ‘‘స్కూల్లో నేనొక్కణ్ణే మంచి జావెలిన్ త్రోయర్ని. చిన్నప్పటి నుంచీ నాకు సినిమా హీరోను కావాలని కోరిక. అందుకే, జాజ్, డ్యాన్స్, గుర్రపుస్వారీ, కుంగ్‌ఫూ లాంటి వాటిలో క్రాష్ కోర్సులు చేస్తూ వచ్చా. హీరోనయ్యాక అవన్నీ నాకు ఉపయోగపడతాయనుకున్నా. అచ్చంగా, అలాగే పదహారేళ్ళ వయసులో ‘దేవదాసు’తో తెరపైకి వచ్చా’’ అని రామ్ ఆనందంగా ఆ సంగతులు చెప్పారు. ఎంతైనా, జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా చిన్నప్పటి సంగతులు తీపి జ్ఞాపకాలే కదా! -
మేర్లపాక గాంధీ డైరెక్షన్లో రామ్
-
వెంకటేష్, రామ్ 'మసాలా' ఫస్ట్ లుక్
వెంకటేష్, రామ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ఫస్ట్ లుక్ విడుదలయింది. ఫేస్ బుక్‌లోని గరమ్ మసాలా పేజీలో ఈ ఫోటో పోస్ట్ చేశారు. ఈ సినిమా హిందీలో ఘనవిజయం సాధించిన ‘బోల్ బచ్చన్’కు ఇది రీమేక్. విజయభాస్కర్ దర్శకుడు. డి.సురేష్‌బాబు సమర్పణలో ‘స్రవంతి’రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి, షాజన్ పదమ్సి కథానాయికలు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇంతవరకూ అధికారికంగా టైటిల్ ప్రకటించలేదు. అయితే ఇప్పటికే ‘గోల్మాల్’, ‘గరం మసాలా’, ‘రామ్-బలరామ్’, ‘సర్వేజనా సుఖినోభవంతు’, ‘బ్లాక్‌బస్టర్’ తదితర టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే దర్శక నిర్మాతలు ఇంకా ఏదీ ధ్రువీకరించలేదు. అయితే... ఫైనల్‌గా ‘మసాలా’ టైటిల్ ఓకే అయ్యే అవకాశం ఉందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రం కోసం ఇటీవలే థాయ్‌లాండ్‌లో ఓ పాట చిత్రీకరించారు. బ్యాలెన్స్ ఒక్క పాటను ఈ నెల మూడోవారంలో హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. ఈ నెల 17న పాటలను విడుదల చేసే యోచనలో ఉన్నారు.