నాకు వాళ్లతోనే అసలైన పోటీ: రామ్‌ | Red Movie Success Meet In Visakhapatnam | Sakshi
Sakshi News home page

అభిమానులతోనే పోటీ

Published Sun, Jan 17 2021 11:10 AM | Last Updated on Sun, Jan 17 2021 6:03 PM

Red Movie Success Meet In Visakhapatnam - Sakshi

సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): గత 15 ఏళ్లగా తాను ఎవరికి పోటీ కాదని.. ఇప్పటినుంచి అభిమానులతోనే తనకు పోటీ అని సినీ హీరో రామ్‌ అన్నారు. శనివారం శ్రేయాస్‌ మీడియా ఆధ్వర్యంలో రెడ్‌ చిత్రం విజయోత్సవాన్ని గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌ మాట్లాడుతూ అభిమానులు తనను అందరించడంలో తనతో పోటీ పడుతున్నారన్నారు. తాను మంచి సినిమాలు చేసి వారికి పోటీ ఇస్తానన్నారు. లాక్‌డౌన్‌ తర్వాత వచ్చిన రెడ్‌ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులను మరువలేమన్నారు. (చదవండి: కత్తితో కేక్‌ కట్‌ చేసిన హీరో.. క్షమాపణలు)

సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో? రిజల్ట్‌లో కూడా అన్ని ట్విస్ట్‌లు వచ్చాయన్నారు. ఉదయం షోలో డివైడ్‌ టాక్‌ వచ్చిన తమ చిత్రం సాయంత్రానికి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుందన్నారు. ఈ చిత్రం కోసం అందరూ ఎంతో కష్టపడి పనిచేశారని.. ప్రేక్షకుల ఆదరణతో కష్టం మొత్తం మరచిపోయామన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ మాళవిక శర్మ, నిర్మాత కృష్ణపోతినేని, దర్శకుడు తిరుమల కిశోర్, శ్రేయాస్‌ మీడియా శ్రీనివాస్, శ్రీముఖి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: రెడ్‌ మూవీ రివ్యూ: నిరాశపరిచే రీమేకు ఇది!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement