Success Meet
-
తెలుగు సినిమా స్థాయి పెరిగింది: బాలకృష్ణ
‘‘ఇతర దేశస్తులు కూడా మన సినిమాలను చూసి, ప్రశంసించే స్థాయికి తెలుగు చలన చిత్రసీమ ఎదిగింది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని ఆదరిస్తారు. ‘డాకు మహారాజ్’ విజయంతో ఇది మరోసారి రుజువైంది’’ అని బాలకృష్ణ అన్నారు. ఆయన టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’.ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అయింది. రిలీజైన ఐదు రోజుల్లోనే రూ. 114 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌తో ‘డాకు మహారాజ్’ సూపర్ హిట్‌గా ప్రదర్శితమవుతోందని చిత్రబృందం పేర్కొంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ప్రతి సినిమాని ఓ చాలెంజ్‌గా తీసుకుని చేస్తాను.వరుసగా ఇది నాకు నాలుగో (‘అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్’) విజయం. ప్రతి నటుడి నుంచి అందమైన హావభావాలను రాబట్టుకోగలిగాడు బాబీ. తమన్ ఇంటి పేరును అభిమానులు మార్చేశారు. నేనైతే ఎన్బీకే తమన్ అని నామకరణం చేస్తున్నాను. అన్ని క్రాఫ్ట్స్‌పై అవగాహన ఉన్న నాగవంశీ నా అభిమాని కావడం నాకు గర్వంగా ఉంది’’ అని మాట్లాడారు. ‘‘బాలకృష్ణగారి ఫిల్మోగ్రఫీలో గుర్తుండిపోయే సినిమాలా ‘డాకు మహారాజ్’ ఉండాలని మొదలుపెట్టాం.డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మూడు రోజుల్లోనే డబ్బులు రావడం చాలా ఆనందంగా ఉంది. ఓ దర్శకుడికి ఇంతకన్నా ఆనందం మరొకటి ఉండదు’’ అన్నారు దర్శకుడు బాబీ. ‘‘జనవరి 12న ‘డాకు మహారాజ్’ విడుదలైతే, సంక్రాంతి పండగ రోజుకే మా డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్‌కి వెళ్లిపోయారు. డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వచ్చినప్పుడే నిర్మాతలకు నిజమైన ఆనందం’’ అని పేర్కొన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. -
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ పార్టీలో మహేశ్‌బాబు (ఫొటోలు)
-
‘డాకు మహారాజ్’ మూవీ సక్సెస్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఇది తెలుగు ప్రేక్షకుల విజయం: వెంకటేశ్
‘‘కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని ‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయం మరోసారి రుజువు చేసింది. ఇది మా విజయమే కాదు.. ఇంత గొప్పగా సపోర్ట్, లవ్ చేసిన తెలుగు ఆడియన్స్, ఫ్యాన్స్ సక్సెస్. ఇది తెలుగు ప్రేక్షకుల విజయం’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది.ఈ సందర్భంగా నిర్వహించిన ‘΄పొంగల్ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్’లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ అనిల్, నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్గార్లకు, సినిమా యూనిట్‌కి థ్యాంక్స్. ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరూ మనస్ఫూర్తిగా ఫోన్ చేసి సినిమా బాగుందని అభినందిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని చెప్పారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘మేము ఊహించినదానికంటే సినిమాని ఎక్కువ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు ప్రేక్షకులకు నా పాదాభివందనాలు. ఈ సినిమాతో నా కెరీర్లో ఎనిమిది సక్సెస్‌లు అంటున్నారు... ఆడియన్స్ సపోర్ట్ లేకపోతే నాకు ఈ విజయం వచ్చేది కాదు’’ అన్నారు.‘‘వెంకటేశ్‌గారు నిర్మాతల బాగు కోరుకుంటారు. కాబట్టే ఇప్పటికీ కాలర్ ఎగరేస్తూ ముందుకు వెళ్తున్నారు’’ అని శిరీష్ పేర్కొన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘అనిల్, వెంకటేశ్‌గారి కాంబినేషన్లో సినిమా అంటే పాజిటివ్ వైబ్రేషన్. ఇది మాకు బ్లాక్ బస్టర్ ΄పొంగల్’’ అని చెప్పారు. ‘‘నేను చేసిన భాగ్యం పాత్ర క్రెడిట్ అంతా అనిల్గారికే దక్కుతుంది’’ అన్నారు ఐశ్వర్యా రాజేశ్. ఈ వేడుకలో నటులు అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ వడ్లమాని, మురళీధర్ గౌడ్, కెమెరామేన్ సమీర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్ తమ్మిరాజు, రచయితలు అజ్జు మహాకాళి, నాగ్, సాయి కృష్ణ తదితరులు మాట్లాడారు. -
మహిళలకు టికెట్లు ఉచితం: ధర్మ
‘‘మా ‘డ్రింకర్ సాయి’ చిత్రం మహిళలకు, ఫ్యామిలీస్‌కు నచ్చడం సంతోషంగా ఉంది. సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నాకు ఈ మూవీలో హీరోగా చేసే అవకాశం ఇచ్చిన మా ముగ్గురు నిర్మాతలకు థ్యాంక్స్... వాళ్లను జీవితంలో మరచిపోను. ఈ సినిమాతో యువతని చెడగొట్టలేదు అనే పేరొచ్చింది... అది చాలు. మా మూవీని ఆదరిస్తున్న మహిళా ప్రేక్షకుల కోసం టికెట్లను ఉచితంగా ఇవ్వబోతున్నా’’ అని హీరో ధర్మ అన్నారు. కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో ధర్మ, ఐశ్వర్యా శర్మ జంటగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’.బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల అయింది. శనివారం నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్లో కిరణ్ తిరుమల శెట్టి మాట్లాడుతూ– ‘‘మా చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ప్రేక్షకుల నుంచే రివ్యూస్ తీసుకోబోతున్నాం. ఈ కాంటెస్ట్‌లో ఎంపికైన వారికి డ్రింకర్ సాయి ఈ నెల 31న మంచి పార్టీ ఇస్తాడు’’ అని చెప్పారు.‘‘తొలి ప్రయత్నంగా ఒక మంచి సందేశాత్మక సినిమా చేశామనే సంతృప్తి ఉంది’’ అన్నారు బసవరాజు శ్రీనివాస్. ‘‘యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మా సినిమా బాగుందని చెప్పడం సంతోషంగా ఉంది’’ అని బసవరాజు లహరీధర్, ఇస్మాయిల్ షేక్ చెప్పారు. ‘‘ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్నీ మా మూవీలో ఉన్నాయి. ఇంకా మూవీ చూడని వారు వెంటనే వెళ్లి చూడాలి’’ అని ఐశ్వర్యా శర్మ తెలిపారు. ఈ సక్సెస్‌మీట్‌లో కెమేరామేన్ ప్రశాంత్ అంకిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్, డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ, నటుడు రాజేశ్ వుల్లి మాట్లాడారు. -
థ్రిల్ ఇస్తోంది: అనన్య నాగళ్ల
‘‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమాకి, నా పాత్రకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటం హ్యాపీగా ఉంది. మా మూవీ ఆడియన్స్‌కి మంచి థ్రిల్ ఇస్తోంది’’ అని హీరోయిన్ అనన్య నాగళ్ల అన్నారు. ‘వెన్నెల’ కిశోర్ టైటిల్ రోల్లో, రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా, శియా గౌతమ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. లాస్యా రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేశారు.ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో వంశీ నందిపాటి మాట్లాడుతూ– ‘‘సినిమా స్క్రీన్‌ప్లే చాలా అద్భుతంగా ఉంది, చివరి 40 నిమిషాలు కట్టిపడేస్తోంది, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనే ప్రశంసలు వస్తుండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘తొలి ప్రయత్నంగా నిర్మించిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’తో సక్సెస్ సాధించాననుకుంటున్నాను’’ అని వెన్నపూస రమణారెడ్డి చెప్పారు. -
అవార్డ్స్ వచ్చినా ఎవరూ ఫోకస్ చేయలేదు: దర్శకురాలు హరిత
వేదిక లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఫియర్’. హరిత గోగినేని దర్శకత్వంలో డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజైంది. ఆదివారం జరిగిన సక్సెస్‌మీట్‌లో హరిత గోగినేని మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి 30 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 70కి పైగా అవార్డులు దక్కాయి. ఎవరైనా ఒక సెలబ్రిటీ ఒక అవార్డు గెలుచుకుంటే ఎంతో ప్రచారం దక్కుతుంది.కానీ మేం కొత్తవాళ్లం కాబట్టి ఇన్ని అవార్డ్స్ వచ్చినా ఎవరూ ఫోకస్ చేయలేదు. తెలుగు సినిమాలో ఎవరూ వాడని, యునిక్ కలర్ ΄్యాట్రన్ను మేం వాడాం. మంచి సౌండింగ్ ఉన్న థియేటర్లో ఈ సినిమా చూడండి’’ అన్నారు. ‘‘మా సినిమాను 150 థియేటర్స్‌లో రిలీజ్ చేశాం. అన్ని సెంటర్స్ నుంచిపాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది’’ అన్నారు ఏఆర్ అభి. -
నా క్యారెక్టర్‌కు కనెక్ట్ అవుతున్నారు
సదన్, ప్రియాంకా ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రణయ గోదారి’. పీఎల్ విఘ్నేష్ దర్శకత్వంలోపారమళ్ళ లింగయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో పీఎల్ విఘ్నేష్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.‘‘ఈ సినిమాలో నాపాత్రకు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ప్రియాంకా ప్రసాద్. ‘‘ఈ సినిమాపాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు సంగీత దర్శకుడు మార్కండేయ. -
సుకుమార్‌కి రుణపడి ఉంటాను: అల్లు అర్జున్
‘‘దేశం నలుమూలల నుంచి మా ‘పుష్ప 2’ యూనిట్‌కి స΄ోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రపంచంలో ఉన్న తెలుగువారికి, భారతీయులకు థ్యాంక్స్. ఒక సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం డైరెక్టర్ కాబట్టి సుకుమార్‌గారికి «థ్యాంక్స్. నన్ను ఎక్కడో ఒక స్థాయిలో నిలబెట్టినందుకు ఆయనకు రుణపడి ఉంటాను’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో ఈ నెల 5న విడుదలైంది.శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘పుష్ప 2’ వైల్డ్ ఫైర్ సక్సెస్‌మీట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘పుష్ప 2’ వసూళ్లు చూస్తుంటే సినిమాను ఎంత మంది ప్రేక్షకులు చూశారో అర్థం అవుతోంది. చిత్రబృందం తరఫున, తెలుగువారందరి తరఫున ప్రపంచ సినీ ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. మా సినిమాకి ఎంతో సహకారం అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగారికి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌గారికి థ్యాంక్స్. దేశంలో మా సినిమాకు స΄ోర్ట్ ఇచ్చిన అన్ని సినిమా ఇండస్ట్రీలకు ధన్యవాదాలు’’ అన్నారు. ఆ సంఘటన చాలా బాధ కలిగించింది ‘‘నేను ‘పుష్ప 2’ చేయడానికి ముఖ్య కారణం ఈ సినిమా తెలుగువారందరూ గర్వంగా చెప్పుకునేలా చేస్తుందనే నమ్మకంతోనే. అనుకోకుండా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనలో రేవతిగారి మృతి మమ్మల్ని ఎంతగానో కదిలించింది. గత ఇరవయ్యేళ్లుగా అభిమానులతో కలిసి సినిమా చూస్తున్నాను. అయితే ఎప్పుడూ ఇలా జరగలేదు. డిసెంబరు 4న వేసిన ప్రీమియర్ షోకి ఎక్కువ జనం ఉండటంతో ఇబ్బంది అవుతుందని థియేటర్ యాజమాన్యం చెప్పగానే నేను వెళ్లి΄ోయాను. ఇంటికి వచ్చిన తర్వాత రేవతిగారి సంఘటన తెలిసి చాలా బాధ కలిగింది. ఆ కుటుంబం కోసం 25 లక్షలు కేవలం ఒక సాయంగా ఇస్తున్నాను. అయినా ఒక మనిషి లేని లోటు ఎవరూ తీర్చలేం. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా. అంతా కుదుటపడిన తర్వాత వ్యక్తిగతంగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలుస్తాను’’ అని పేర్కొన్నారు అల్లు అర్జున్. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ముందుగా రాజమౌళిగారికి థ్యాంక్స్ చె΄్పాలి. ఈ సినిమాను ఇంతగా ్ర΄ోత్సహించింది, పాన్ ఇండియా రిలీజ్ చేయాలని చెప్పింది ఆయనే. 3 గంటల పాటు ప్రేక్షకులు మా సినిమాను చూడాలని నేను, నా చిత్ర బృందం చాలా కష్టపడి చేశాం. 10 నిమిషాల్లో ఓ సన్నివేశం రాసే వాళ్లు నా దర్శకత్వ టీమ్‌లో ఉన్నారు. నా టీమ్‌లోని వారంతా సుకుమార్‌లే.. అందరూ నాలాంటి దర్శకులే. ఈ విజయానికి కారణం చిత్రబృందం అందరిదీ. మూడు రోజులుగా నేను ఆనందంగా లేను. ఎందుకంటే జరిగిన ఘటన (రేవతి మృతి) అలాంటిది. వారి కుటుంబానికి మేము ఎప్పుడూ అండగా ఉంటాం’’ అని తెలిపారు. ‘‘మా సినిమాని ఇంతగా ఆదరించిన తెలుగు ప్రజలందరికీ థ్యాంక్స్. వేగంగా రూ. 500 కోట్లు వసూలు చేసిన సినిమాగా ‘పుష్ప 2’ రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇంతటి విజయం సాధించడం భారతీయులందరికీ గర్వకారణం’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘పుష్ప 2’ రెండు రోజులకు రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసినందుకు ఆనందంగా ఉంది. టికెట్ ధర 800 ప్రీమియర్ షోకి మాత్రమే.. ఆ తర్వాత సాధారణ ధరలతోనే అందుబాటులో ఉన్నాయి. అందరూ కచ్చితంగా సినిమాని చూడాలి’’ అని యలమంచిలి రవిశంకర్ కోరారు. -
‘రోటీ కపడ రొమాన్స్’ మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
'ధూం ధాం' సక్సెస్ మీట్.. చీరలో హెబ్బా సూపర్! (ఫొటోలు)
-
కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
'దయచేసి ఎవరినీ అలా జడ్జ్ చేయకండి..' కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది. లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో క టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశారు.హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ' మా మూవీకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా. ఈ సినిమా చూడటానికి ఎవరొస్తారు. ఇప్పుడు అవసరమా..? పెద్ద సినిమాల మధ్య మీ సినిమా ఎందుకన్నారు. విడుదలకు ముందు చాలా ఇబ్బంది పడ్డా. మంచి మూవీ అని చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ మేము చెప్పిన విషయాన్ని ప్రేక్షకులే నిజం చేశారు. ఈ క్రెడిట్ అంతా మా టీమ్‌కు ఇస్తాను. సక్సెస్, ఫెయిల్యూర్స్ నా ఒంటికి ఎక్కవు. నాకు సక్సెస్ కంటే నా జర్నీ ముఖ్యం. ఈ జర్నీనే సంతృప్తినిస్తోంది. నేను మరెంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేయాలని' అన్నారు.ఆ తర్వాత కిరణ్ మాట్లాడుతూ..'ఈ మాట చెప్పడం కాస్త తొందరపాటు అవుతుందేమో నాకు తెలియదు. దయచేసి ఎవరినీ కూడా మార్కెట్ పరంగా జడ్జ్ చేయకండి. వీడి మార్కెట్ ఇంత.. వాడి మార్కెట్ ఇంత.. ఇంకోడి మార్కెట్ ఇంత. ఇదంతా మార్చేయడానికి ఒక్క శుక్రవారం చాలు. ఈరోజు కింద ఉన్న వ్యక్తి వచ్చే శుక్రవారానికి టాప్‌కి వెళ్లొచ్చేమో. టాప్‌లో ఉన్న హీరో రెండు శుక్రవారాల్లో కిందకు పడొచ్చేమో. నా సినిమాను అందరూ ఆదరించారు. అందరం కలిసి మంచి సినిమా చేద్దాం' అని అన్నారు. -
శివ కార్తికేయన్ 'అమరన్' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
'ఇక నుంచి నువ్వు మా తెలుగు హీరో'.. నితిన్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. అమరన్ రిలీజైన ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. మొదటి రోజే రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.102 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ హీరో నితిన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరన్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రానికి హీరోయిన్ సాయిపల్లవి బ్యాక్‌బోన్ అంటూ కొనియాడారు. మీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని.. ఏదో ఒకరోజు మీతో డ్యాన్స్ చేయాలని ఉందని అన్నారు. త్వరలోనే ఆ రోజు రావాలని కోరుకుంటున్నానని నితిన్ తెలిపారు.శివ కార్తికేయన్‌తో నాకు ప్రత్యేక అనుబంధముందని హీరో నితిన్ అన్నారు. హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ గత నాలుగేళ్లుగా మేము కలవడానికి కుదర్లేదన్నారు. చాలా రోజుల తర్వాత మేమిద్దరం కలిశామని సంతోషం వ్యక్తం చేశారు. అమరన్ సినిమాకు శివ కార్తికేయన్ చాలా కష్టపడ్డారని.. ఇక నుంచి మా తెలుగు హీరో, మా తెలుగబ్బాయి అయిపోయాడని నితిన్ అన్నారు. కాగా.. నితిన్ ప్రస్తుతం రాబిన్‌హుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రష్మిక మందన్నా హీరోయిన్లుగా కనిపించనున్నారు. -
శ్రీకాంత్ అయ్యంగర్.. ఏంటీ నోటి దురుసు?
ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఉన్నారు. ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు చాలావరకు ఆచితూచి మాట్లాడుతుంటారు. కొందరు మాత్రం కనీసం ఏం మాట్లాడుతున్నామో అనే సోయి లేకుండా నోటికొచ్చినట్లు వాగుతుంటారు. ఇంకా చెప్పాలంటే వీళ్లకి కామన్ సెన్స్ ఉండదు. వయసులో పెద్దోళ్లే కానీ ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేశాడు. రివ్యూ రైటర్లని దారుణంగా తిట్టాడు.ఈ శుక్రవారం 'పొట్టేల్' సినిమా రిలీజైంది. 1980ల్లో తెలంగాణలోని పల్లెల్లో పటేళ్ల ఆగడాలు, మూఢ నమ్మకాలు, చదువు ప్రాముఖ్యం లాంటి అంశాలతో తెరకెక్కించారు. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కొన్ని సీన్లు సాగతీతగా అనిపించాయి. ఇదే విషయాన్ని పలువురు రివ్యూయర్లు వ్యక్తపరిచారు. శనివారం సక్సెస్ మీట్ జరగ్గా.. దర్శకుడు సాహిత్ని అదే మీడియా పలు ప్రశ్నలు అడిగితే వాటికి ఈయన ఓపిగ్గా సమాధానమిచ్చారు. ఇక్కడివరకు బాగానే ఉంది.(ఇదీ చదవండి: స్టార్ హీరోతో నిశ్చితార్థం రూమర్స్.. హీరోయిన్ ప్రియాంక మోహన్ ఏమందంటే?)సక్సెస్ మీట్ చివరలో అక్కడికి వచ్చిన నటుడు శ్రీకాంత్ అయ్యంగర్.. రివ్యూయర్లని దారుణమైన పదజాలంతో తిట్టాడు. 'డ్రాగ్డ్గా ఉందన్నారు. షార్ట్ ఫిల్మ్ తీయడం కూడా రాని నా కొడుకులు వచ్చి రివ్యూ రాస్తారు. సినిమా తీయడం ఎంత కష్టమో రఫ్ ఐడియా కూడా లేని నా కొడుకులు. ప్రజలున్నారు. ప్రేక్షక దేవుళ్లు ఉంటారు. సినిమాని ముందుకు తీసుకెళ్తారు. శ్రమించి, కష్టపడి, చెమటోడ్చి సినిమాలు తీస్తూనే ఉంటాం' అని అన్నాడు.రివ్యూ వ్యక్తిగత అభిప్రాయం. డబ్బులు పెట్టి టికెట్ కొని చూసే ప్రతి ప్రేక్షకుడు రివ్యూయరే. సినిమా బాగుంటే బాగుందని చెబుతాడు. లేదంటే లేదని అంటాడు. సాగతీతగా అనిపిస్తే అదే బయటపెడతాడు. అలా కాదు మేం తీసింది కళాఖండం, మీకు బుర్రలేదు అని ఏకంగా రివ్యూయర్లనే తిడితే.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. శ్రీకాంత్ అయ్యంగర్ తీరు చూస్తే అలానే ఫీల్ అవుతున్నట్లు ఉన్నాడు. సినిమా తీసిన దర్శకుడే నీట్‌గా ఒక్కో ప్రశ్నకు సమాధానమిచ్చాడు. చివరలో పుడింగిలా వచ్చిన శ్రీకాంత్ అయ్యంగర్ మాత్రం నోటిదురుసుతో మాట్లాడాడు. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే యాక్టింగ్ వస్తే సరిపోదు. మాట్లాడటం కూడా ఇతడికి రావాలేమో?(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్) -
రజినీకాంత్ వేట్టయాన్.. వారికి బిర్యానీ వడ్డించిన డైరెక్టర్!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. సినిమా రిలీజైన పది రోజుల్లోనే రూ.129 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది.బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడంతో చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంది. తాజాగా వేట్టయాన్ చిత్రబృందం థ్యాంక్స్ గివింగ్ మీట్ పేరుతో చెన్నైలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకల్లో చిత్రబృందంతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ భోజనాలు వడ్డించారు.(ఇది చదవండి: వేట్టయాన్ కలెక్షన్స్.. మ్యాజిక్ నంబర్‌కు దగ్గర్లో రజనీకాంత్)ఈ సక్సెస్ మీట్లో వేట్టయాన్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ స్వయంగా చిత్రబృందంతో పాటు మీడియా ప్రతినిధులకు బిర్యానీ వడ్డించారు. దీనికి సంబంధించిన ఫోటోలను లైకా ప్రొడక్షన్స్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. A gathering of gratitude and celebration! 🤩 The VETTAIYAN 🕶️ family comes together, thankful for the overwhelming support and love from the press and media. ✨ #VettaiyanRunningSuccessfully 🕶️ in Tamil, Telugu, Hindi & Kannada!@rajinikanth @SrBachchan @tjgnan… pic.twitter.com/W0yA6yqgYH— Lyca Productions (@LycaProductions) October 20, 2024 -
గోపీచంద్ 'విశ్వం'మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
శ్రీ విష్ణు ‘స్వాగ్’ మూవీ సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'రామ్ నగర్ బన్నీ' సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
శ్రీ విష్ణు 'స్వాగ్' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఇకపై తెరపై దావూదీ...
దేవర... వర... ‘దేవర’ చిత్రంలో ఈ రెండుపాత్రల్లో అభిమానులకు రెండింతల ఆనందాన్నిచ్చారు ఎన్టీఆర్. అభిమానులు విజిల్స్ వేయకుండా ఉండలేని విధంగా డైలాగ్స్ పలికారు. ఫైట్స్‌లో విజృంభించారు... సాంగ్స్‌లో స్టెప్స్ అదరగొట్టారు... ఎమోషనల్ సీన్స్‌లో మనసును తాకారు. ఇలా మొత్తం మీద ఎన్టీఆర్ మరోసారి నటుడిగా విజృంభించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృçష్ణ .కె నిర్మించిన ‘దేవర’ మంచి వసూళ్లు సాధిస్తూ, దూసుకెళుతోంది. దాంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆ విశేషాల్లోకి...‘దేవర’ చిత్రం విడుదలకు రెండు రోజుల ముందు ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే గురువారం ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ జరగాల్సి ఉండగా దేవీ నవరాత్రుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్మీట్కు అనుమతి లభించలేకపోవడంతో కుదరలేదు. ఇక హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ సెలబ్రేషన్స్‌లో రాజమౌళి, ప్రశాంత్ నీల్, ‘దిల్’ రాజు, డీవీవీ దానయ్య, నాగవంశీ వంటివారితోపాటు పలువురు పంపిణీదారులుపాల్గొన్నారు. ఆరేళ్లకు సోలోగా... ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోని సిల్వర్ స్క్రీన్‌పై సోలో హీరోగా చూసింది ‘అరవింద సమేత వీర రాఘవ’ (2018) తర్వాత ‘దేవర’లోనే. ఈ గ్యాప్‌లో ‘ఆర్ఆర్ఆర్’తో తెరపై కనిపించారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ మరో హీరో అని తెలిసిందే. ఇక ఆరేళ్లకు ఎన్టీఆర్ సోలోగా నటించిన చిత్రం కావడం, దేవర–వరగా రెండుపాత్రల్లో ఎన్టీఆర్ కనిపించడం ఫ్యాన్స్‌కి ఐ ఫీస్ట్ అయింది. 7 రోజులకు రూ. 400 కోట్లు ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ తర్వాత హీరో ఎన్టీఆర్–దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన చిత్రం కావడంతో ‘దేవర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ‘మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు.. కాదు కూడదు అని మీరు మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా...’, ‘దేవర అడిగినాడంటే... సెప్పినాడని అదే సెప్పినాడంటే...’ అంటూ విడుదలైన డైలాగ్స్, ‘చుట్టమల్లె...’పాట, దివంగత ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీకి తెలుగులో తొలి చిత్రం వంటివన్నీ ‘దేవర’ సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలను ‘దేవర’ చేరుకున్నాడని చెప్పడానికి వసూళ్లు నిదర్శనం. విడుదలైన ఏడు రోజులకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ. 400 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక పండగ సెలవులు మొదలయ్యాయి కాబట్టి వసూళ్ల దూకుడు ఆగదని ఊహించవచ్చు. దసరా సెలవులు... ‘దేవర’ దూకుడు దసరా పండగ సెలవులు మొదలయ్యాయి. సెలవులు,పోటీలో మరో భారీ చిత్రం లేకపోవడం ‘దేవర’కి కలిసొచ్చే విషయం. ఇంకో వారం దాకా వసూళ్ల దూకుడు ఆగదనే అంచనాలు ఉన్నాయి. పైగా అభిమానులను ఖుషీ చేసేలా శుక్రవారం నుంచి ‘దావూదీ...’పాటను కూడా జోడించారు. ‘దేవర’ విడుదలకు కొన్ని రోజులు ముందు విడుదలైన ఈపాటకు మంచి స్పందన లభించింది. కానీ సినిమాలో లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. అయితే శుక్రవారం నుంచి అన్ని థియేటర్లలో ఈపాట కనిపిస్తోంది. ‘దేవర 2’ ఎప్పుడంటే... ‘దేవర 2’ షూట్‌ను వచ్చే ఏడాది చివర్లో ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. 2026లో ‘దేవర 2’ విడుదలయ్యే చాన్స్ ఉందట. ఈ గ్యాప్‌లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేస్తారు ఎన్టీఆర్. అలాగే హిందీలో ‘వార్ 2’ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలవుతుంది. ప్రశాంత్ నీల్‌తో చేసే చిత్రం 2026 జనవరిలో విడుదల కానుంది. ఒకవేళ ‘దేవర 2’ కూడా 2026లోనే విడుదలైతే అప్పుడు ఒకే ఏడాదిలో ఎన్టీఆర్ రెండు సినిమాల్లో కనిపించినట్లు అవుతుంది. అదే జరిగితే 2016 (నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్) తర్వాత... పదేళ్లకు ఒకే ఏడాది ఎన్టీఆర్ రెండు సినిమాల్లో కనిపించేది 2026లోనే అవుతుంది. -
దేవర మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
కార్తి ‘సత్యం సుందరం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)