‘‘మా ‘డ్రింకర్ సాయి’ చిత్రం మహిళలకు, ఫ్యామిలీస్‌కు నచ్చడం సంతోషంగా ఉంది. సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నాకు ఈ మూవీలో హీరోగా చేసే అవకాశం ఇచ్చిన మా ముగ్గురు నిర్మాతలకు థ్యాంక్స్... వాళ్లను జీవితంలో మరచిపోను. ఈ సినిమాతో యువతని చెడగొట్టలేదు అనే పేరొచ్చింది... అది చాలు. మా మూవీని ఆదరిస్తున్న మహిళా ప్రేక్షకుల కోసం టికెట్లను ఉచితంగా ఇవ్వబోతున్నా’’ అని హీరో ధర్మ అన్నారు. కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో ధర్మ, ఐశ్వర్యా శర్మ జంటగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’.
బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల అయింది. శనివారం నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్‌లో కిరణ్ తిరుమల శెట్టి మాట్లాడుతూ– ‘‘మా చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ప్రేక్షకుల నుంచే రివ్యూస్ తీసుకోబోతున్నాం. ఈ కాంటెస్ట్‌లో ఎంపికైన వారికి డ్రింకర్ సాయి ఈ నెల 31న మంచి పార్టీ ఇస్తాడు’’ అని చెప్పారు.
‘‘తొలి ప్రయత్నంగా ఒక మంచి సందేశాత్మక సినిమా చేశామనే సంతృప్తి ఉంది’’ అన్నారు బసవరాజు శ్రీనివాస్. ‘‘యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మా సినిమా బాగుందని చెప్పడం సంతోషంగా ఉంది’’ అని బసవరాజు లహరీధర్, ఇస్మాయిల్ షేక్ చెప్పారు. ‘‘ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్నీ మా మూవీలో ఉన్నాయి. ఇంకా మూవీ చూడని వారు వెంటనే వెళ్లి చూడాలి’’ అని ఐశ్వర్యా శర్మ తెలిపారు. ఈ సక్సెస్‌మీట్‌లో కెమేరామేన్ ప్రశాంత్ అంకిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్, డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ, నటుడు రాజేశ్ వుల్లి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment