లహరీధర్, ధర్మ, కిరణ్ తిరుమలశెట్టి
‘‘డ్రింకర్ సాయి’ సినిమాను ఆదరించి, చిత్ర పరిశ్రమలో యువ హీరోగా నాకంటూ ఓ స్థానం కల్పించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. కొత్తవాళ్లకు ఇండస్ట్రీలోప్రోత్సాహం ఉండదనే మాట తప్పని నిరూపించి, హీరోగా నన్ను ఆదరించారు. ఇలాంటి మంచి సినిమా నాతో తీసిన డైరెక్టర్ కిరణ్‌గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని ధర్మ చెప్పారు. కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ధర్మ, ఐశ్వర్యా శర్మ జంటగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’.
బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మించిన ఈ సినిమా గత డిసెంబర్ 27న విడుదలైంది. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కిరణ్ తిరుమలశెట్టి మాట్లాడుతూ– ‘‘డ్రింకర్ సాయి’లో నేను అనుకున్నపాయింట్ ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది’’ అన్నారు. ‘‘మా ‘డ్రింకర్ సాయి’ మంచి విజయం సాధించింది. ఇప్పటిదాకా రూ. 5.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి’’ అన్నారు బసవరాజు లహరీధర్.
Comments
Please login to add a commentAdd a comment