‘‘కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని ‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయం మరోసారి రుజువు చేసింది. ఇది మా విజయమే కాదు.. ఇంత గొప్పగా సపోర్ట్, లవ్ చేసిన తెలుగు ఆడియన్స్, ఫ్యాన్స్ సక్సెస్. ఇది తెలుగు ప్రేక్షకుల విజయం’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ‘΄పొంగల్ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్’లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ అనిల్, నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్‌గార్లకు, సినిమా యూనిట్‌కి థ్యాంక్స్. ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరూ మనస్ఫూర్తిగా ఫోన్ చేసి సినిమా బాగుందని అభినందిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని చెప్పారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘మేము ఊహించినదానికంటే సినిమాని ఎక్కువ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు ప్రేక్షకులకు నా పాదాభివందనాలు. ఈ సినిమాతో నా కెరీర్‌లో ఎనిమిది సక్సెస్‌లు అంటున్నారు... ఆడియన్స్ సపోర్ట్ లేకపోతే నాకు ఈ విజయం వచ్చేది కాదు’’ అన్నారు.
‘‘వెంకటేశ్‌గారు నిర్మాతల బాగు కోరుకుంటారు. కాబట్టే ఇప్పటికీ కాలర్ ఎగరేస్తూ ముందుకు వెళ్తున్నారు’’ అని శిరీష్ పేర్కొన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘అనిల్, వెంకటేశ్‌గారి కాంబినేషన్‌లో సినిమా అంటే పాజిటివ్ వైబ్రేషన్. ఇది మాకు బ్లాక్ బస్టర్ ΄పొంగల్’’ అని చెప్పారు. ‘‘నేను చేసిన భాగ్యం పాత్ర క్రెడిట్ అంతా అనిల్‌గారికే దక్కుతుంది’’ అన్నారు ఐశ్వర్యా రాజేశ్. ఈ వేడుకలో నటులు అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ వడ్లమాని, మురళీధర్ గౌడ్, కెమెరామేన్ సమీర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్ తమ్మిరాజు, రచయితలు అజ్జు మహాకాళి, నాగ్, సాయి కృష్ణ తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment