వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది పొంగల్ కానుకగా ఈనెల 14న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే వందకోట్లకు వసూళ్లతో సంక్రాంతి రేసులో అదరగొడుతోంది.
అయితే ఈ మూవీ ఎంత హిట్టయిందో.. అదే రేంజ్‌లో ఫేమస్ అయ్యాడు చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమాల. ఈ మూవీ వెంకటేశ్ కుమారుడిగా నటించిన రేవంత్ (బుల్లిరాజు) ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నాడు. బుల్లిరాజుగా సినీ ప్రియులను మెప్పించారు. తన మాటలు, డైలాగ్‌లతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఇటీవల సక్సెస్ మీట్‌లోనూ రేవంత్ మరోసారి సందడి చేశారు.
అయితే తాజాగా బుల్లిరాజుతో కొందరు అభిమానులు వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. అతనితో సెల్ఫీలు దిగేందుకు కొందరు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. అయితే ఇదే క్రమంలో బుల్లిరాజు ఇబ్బందిగా ఫీలవుతున్నా కూడా వారు వదల్లేదు. దయచేసి నన్ను వదిలేయండి అని బుల్లిరాజు చెప్పినా వారస్సలు పట్టించుకోలేదు. చిన్న పిల్లాడితో ఇలా వ్యవహరించడం ఏంటని పలువురు నిలదీస్తున్నారు. జరగండి.. నేను వెళ్లాలి అని బుల్లిరాజు చెబుతున్నా వినకుండా అతనితో ఫోటోలు తీసుకున్నారు. చిన్న పిల్లాడు అని చూడకుండా ఈ పైత్యం ఏంటని పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్ నిర్మించారు.
#BulliRaju with items 😍 who are harassing #SankranthikiVasthunam pic.twitter.com/CTqfFrv79L
— Aristotle (@goLoko77) January 19, 2025
Comments
Please login to add a commentAdd a comment