వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam Movie). ఈ మూవీతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు వెంకీమామ. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.200 కోట్లక దిశగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని తెగ చూసేస్తున్నారు. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో ఇటీవల హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.
(ఇది చదవండి: సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా!)
అయితే ఈ మూవీకి వస్తున్న ఆదరణ చూసి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. యాంకర్ సుమతో ఇంటర్వ్యూకు హాజరైన అనిల్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం -2 కథ అక్కడి నుంచే మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. మళ్లీ సంక్రాంతికే వస్తామని అనిల్ రావిపూడి అన్నారు. ఈ సినిమా చేసేందుకు స్పేస్ ఉందని.. రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి.. అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుందని అన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మరో మిరాకిల్‌తో మీ ముందుకు వస్తామని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. దీంతో వెంకీ మామ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అద్భుతంగా ఉందంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఐదు రోజుల్లోనే రూ.161 కోట్లు వసూలు చేసింది. కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా వెంకటేశ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
ఓవర్‌సీస్‌లో రికార్డ్ వసూళ్లు..
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓవర్‌సీస్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఓవర్‌సీస్ ఆడియన్స్ కోసం అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ కాగా.. ఈ సినిమా ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సైతం పొంగల్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ మూవీ కథేంటంటే..
డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్‌కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.
కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రక్షించాాలకుంటాడు.
ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్‌ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ.
సంక్రాంతికి వస్తున్నాం 2 కథ అక్కడ మొదలవుతుంది - #AnilRavipudi#SankranthikiVasthunam#Venkatesh #AishwaryaRajesh #MeenakshiChaudhary #TeluguFilmNagar pic.twitter.com/ekTYLB9cpQ
— Telugu FilmNagar (@telugufilmnagar) January 19, 2025
Comments
Please login to add a commentAdd a comment