నా కళ్లు అందుకే ఎర్రగా ఉన్నాయ్.. రష్మిక వీడియో | Rashmika Mandanna Latest Video | Sakshi

Rashmika: కళ్లు ఎర్రగా.. కారణం చెప్పిన రష్మిక

Apr 15 2025 12:57 PM | Updated on Apr 15 2025 1:15 PM

Rashmika Mandanna Latest Video

రష్మిక(Rashmika Mandanna) ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. తెలుగుతో పాటు హిందీలోనూ వరస సినిమాలు చేస్తోంది. గతేడాది చివర్లో 'పుష్ప 2'తో(Pushpa 2 Movie) బ్లాక్ బస్టర్ కొట్టింది. కానీ రీసెంట్ గా 'సికిందర్'తో డిజాస్టర్ అందుకుంది. ప్రస్తుతం 'థామా' అనే హిందీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ఈ బ్యూటీ క్యూట్ వీడియో పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)

గత కొన్నిరోజులుగా నైట్ షూట్స్ లో పాల్గొంటున్న రష్మిక.. ఇప్పుడు దాని గురించి చెప్పింది. రోజూ ఇలా రాత్రుళ్లు చిత్రీకరణ వల్ల కళ్లన్నీ ఎ‍ర్రగా మారాయని చూపించింది. ఈ వీడియో ఊరికే చేశానని, అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్పుకొచ్చింది. పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసేందుకు ఇలా చేశానని క్లారిటీ ఇచ్చింది.

కొన్నిరోజుల క్రితం ఒమన్ దేశంలో రష్మిక తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. ‍అయితే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కూడా రష్మికతో పాటు అక్కడికి వెళ్లాడని, వీరిద్దరూ వేర్వేరుగా పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తుంటే అర్థమవుతుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ కూడా చేశారు. మరి వీళ్లిద్దరూ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో ఏంటో?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement