
సెలబ్రిటీల లైఫ్ అందరూ అనుకున్నంత జాలీగా ఏం ఉండదు. వారికి నచ్చిన ఫుడ్ తినలేరు, బయట ఎక్కువగా తిరగలేరు, ప్రైవసీ ఉండదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అందంగా కనిపించినప్పుడు తారలపై పొగడ్తలు కురిపించేవాళ్లే వారి వేషధారణ నచ్చకపోతే నిర్మొహమాటంగా విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితి నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు ఎదురైంది. ఓ అవార్డుల ఫంక్షన్‌కు రష్మిక బ్లాక్ డ్రెస్‌లో హాజరైంది.
కొందరు ఆమె అవుట్‌ఫిట్ చూసి ఆహా అంటున్నా మరికొందరు మాత్రం ఏడ్చినట్లుంది అని కామెంట్లు చేస్తున్నారు. 'ఏంటి? రష్మిక ఉర్ఫీని ఫాలో అవుతోంది.. తను ఇలా చేస్తుందని అసలు ఊహించలేదు', 'అసలు ఈ సెలబ్రిటీలకు ఏమవుతోంది? వీళ్లందరినీ బాయ్‌కాట్ చేసేయాలి. ఆల్‌రెడీ ఫేమస్ అయినవాళ్లు కూడా ఎక్స్‌పోజ్ చేయాల్సిన అవసరం ఏముంది?' అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి రష్మిక వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment