
టాలీవుడ్‌లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆదర్శ్ బాలకృష్ణ. తెలుగులో బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్ కూడా పాల్గొన్నారు. టాలీవుడ్‌లో పలు సినిమాల్లో తనదైన నటనతో ఆదర్శ్ బాలకృష్ణ అభిమానులను మెప్పించారు. గతంలో ఝాన్సీ వెబ్ సిరీస్‌తో అభిమానులను మెప్పించిన ఆదర్శ్.. ప్రస్తుతం గౌతమ్ వాసుదేవ్ మీనన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఆయనతో దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అయితే తాజాగా ఆదర్శ్ బాలకృష్ణ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సర్జరీ తొలి రోజు చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేసిన వీడియోను పంచుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ మొదటి రోజు చిన్నచిన్న కసరత్తులు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే కోలుకుని తిరిగి వస్తానని పోస్ట్ చేశారు. అయితే ఇంతకీ ఆదర్శ్ బాలకృష్ణకు అసలేం జరిగిందో తెలియాల్సి ఉంది. మోకాలికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నారా? లేదంటే మరేదైనా కారణాలున్నాయా? అనే వివరాలపై క్లారిటీ లేదు.
సినీ కెరీర్ విషయానికొస్తే హ్యాపీ డేస్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత టాలీవుడ్ పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించారు. గత రెండేళ్లలో రంగమార్తాండ, శాకుంతలం, మిక్సప్ సినిమాలలో అభిమానులను అలరించారు.