Knee
-
మోకాలి నొప్పికి.. మెయిడ్ పేరు!
ఆ వైద్యసమస్య పేరే ‘హౌజ్ మెయిడ్ నీ పెయిన్’! వైద్య పరిభాషలో ‘‘ప్రెపటెల్లార్ బర్సయిటిస్’’ అనే ఓ జబ్బుకు పనిమనిషి పేరు పెట్టడం విశేషం. వాడుక పేరుగా పనిమనిషి (మెయిడ్) పేరు పెట్టిన ఆ జబ్బును ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అంటారు. ఇంటిని తుడిచే వారు రెండు మోకాళ్లనూ గచ్చు మీద ఆనించి, మరో చేతిని నేలకు ఆనించి ఇంకో చేత్తో గుడ్డతో తుడుస్తూ ఉండటంతో మోకాళ్లు ఒరుసుకుపోయి నొప్పి వస్తుంది. అందుకే ఆ జబ్బుకు ఆ పేరు.అలాగని అది కేవలం పనిమనుషులకు వచ్చే సమస్య అనుకుంటే పొరబాటే. మోకాళ్లను నేలకు ఆనించి పనిచేసే వృత్తుల్లోని వారందరిలో (ఉదాహరణకు ప్లంబర్లు, గార్డెనర్లూ)నూ ఆ జబ్బు కనిపిస్తుంది. ఇంకా చె΄్పాలంటే ఆటల్లో నేల మీదికి దూకే సమయంలో మోకాళ్లు నేల మీద దోక్కుపోయే క్రీడాకారులకు కూడా ఈ నొప్పి వస్తుంటుంది. ఇలా ఎంతోమందిలో ఆ జబ్బు కనిపిస్తున్నప్పటికీ దానికి ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అనే పేరు స్థిరపడింది.చికిత్స...నొప్పి తొలిదశల్లో మోకాలికి ఐస్ పెట్టడం, పడుకునే/నిద్రపోయే సమయంలో ఆ భాగం కాస్త ఎత్తుగా ఉండేలా మోకాలి కింద దిండు పెట్టడం, విశ్రాంతి ఇవ్వడం వంటివి చేయాలి. ఆటగాళ్లకు లేదా ఇతరత్రా వృత్తుల్లోని వారికి నొప్పి మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పి నివారణ మందులను ఇస్తారు. సూచిస్తారు. ఇక క్రీడాకారుల్లో ఈ సమస్య రాకుండా నివారించేందుకు ‘నీ–΄్యాడ్స్’ స్ట్రెచ్చింగ్ వ్యాయామాలతో పాటు... మోకాళ్లకు దెబ్బతగిలినప్పుడు క్రీడలకూ, ప్రాక్టీస్‌కూ విశ్రాంతి ఇవ్వడం వంటి పెయిన్ మేనేజ్మెంట్ ప్రక్రియలను డాక్టర్లు సూచిస్తుంటారు. -
మార్క్ జుకర్‌బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స..అసలేంటి చికిత్స? ఎందుకు?
మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ సమయంలో మోకాలికి గాయం అవ్వడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. అసలు మోకాలి గాయం అంటే ఏంటీ? ఎందువల్ల అవుతుంది తదితరాల గురించే కథనం. మోకాలి గాయం అంటే.. క్రీడాకారులు ఎక్కువగా ఈ మోకాలి గాయం బారిన పడతారు. మోకాలి గాయాన్ని పూర్వ క్రూసియేట్ లిగ్మెంట్ (Anterior Cruciate Ligament(ACL)) గాయం అని కూడా అంటారు. అంటే మోకాలి ఏసీఎల్ నిర్మాణంపై ఏర్పడిన గాయంగా కూడా చెబుతారు. ఈ ఏసీఎల్ అనేది మోకాలిలో ఉండే మృదువైన కణజాల నిర్మాణం. ఈ క్రూసియేట్ లిగ్మెంట్ తొడను ముందు ఎముక(టిబియా)తో కలిపే జాయింట్. దీనివల్లే మనం నిలబడటానికి నుంచొవడానికి వదులుగా మోకాలు కదులుతుంది. మనం ముందుకు వంగడానికి, నిలుచున్నప్పుడు కదిలే ఈభాగంలో గాయం అయితే పాపింగ్ లాంటి ఒక విధమైన సౌండ్ వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆ ప్రాంతంలో అంతర్లీనంగా లిగ్మెంట్ చీరుకుపోవడం లేదా ఎముకలు తప్పి ఒక విధమైన శబ్దం వస్తుంది. దీంతో మోకాలు ఉబ్బి, అస్థిరంగా ఉంటుంది. భరించలేని నొప్పిని అనుభవిస్తాడు పేషెంట్. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) ఏసీఎల్ లిగ్మెంట్కి చికిత్స ఎలా అందిస్తారంటే.. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ప్రకారం..దెబ్బతిన్న ఏసీఎల్ లిగ్మెంట్ స్థానంలో కొత్త ACL గ్రాఫ్ట్ కణజాలంతో భర్తీ చేసి శస్త్ర చికిత్స చేస్తారు. అయితే ఈ కొత్త ఏసీఎల్ కణజాలం రోగి నుంచే తీసుకోవచ్చు లేదా మరొకరి నుంచైనా స్వీకరించొచ్చు. ఈ చికిత్స రోగికి తగిలిన గాయం తాలుకా తీవ్రత ఆధారంగా వివిధ రకాలుగా చికిత్స అందిస్తారు వైద్యులు. సాధ్యమైనంత వరకు ఇలాంటి గాయాల్లో తీవ్రత తక్కువగా ఉంటే ఫిజియోథెరపీ చేయించడం, రోగిని రెస్ట్ తీసుకోమనడం వంటివి సూచిస్తారు వైద్యులు. అదే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటే ఏసీఎల్ పునర్నిర్మాణ శస్త్ర చికిత్స చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ సాధారణ ఆర్థోస్కోపిక్ పద్ధతులను ఉపయోగించే నిర్వహించడం జరుగుతుంది. మోకాలిపై కోతలు పెట్టి పాటెల్లార్ స్నాయువుని(మోకాలి చిప్ప), తొడ ఎముకను కొత్త లిగ్మెంట్తో జాయింట్ చేసేలా మోకాలి అంతటా ఆపరేషన్ నిర్వహిస్తారు. ఫలితంగా పటేల్లార్ స్నాయువు ముందుకు వెనక్కు కదిలేందుకు ఉపకరిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఆ మోచిప్పలనే తొలగించడం లేదా ఇతర స్నాయువులతో పునర్నిర్మించవడం వంటివి చేస్తారు వైద్యులు. (చదవండి: దంతాలకు ఏ పేస్టు బెటర్?.. దంత సమస్యలకు కారణం!) -
లక్షమందిలో ఒకరికి సంభవించే వ్యాధి..ఉన్నపళంగా ఎముకలు..
కొన్ని వ్యాధులు చాలా అరుదుగా సంభవిస్తుంటాయి. ఇలాంటి వ్యాధి కూడా ఉంటుందా అనేలా ఉంటాయా ఆ వ్యాధులు. అలాంటి అరుదైన వ్యాధి బారినేపడింది సదరు మహిళ. అసలేం జరిగిందంటే..న్యూయార్క్‌కి చెందిన 24 ఏళ్ల బెథాని ఈసన్ అనే మహిళ జస్ట్ అలా బాత్రూంకి వెళ్లింది అంతే మోకాలి ఎముకలు పెళ పెళ మంటూ విరిగిపోయాయి. దీంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి వెళ్లగా..ఎక్స్‌రే తీయించుకోవాల్సిందిగా సూచించారు వైద్యులు. ఆ తదనంతరం నిర్వహించి వైద్య పరీక్షల్లో ఆమెకు ఎముకల్లో కణితి ఉన్నట్లు తేల్చారు. దీని వల్ల చుట్టుపక్క ఉన్న మృదుకణజాలం బలహీనమై మెకాలి నుంచి తొడ ఎముకలు పెళపెళమని విరగిపోతాయని అన్నారు. వెంటనే సర్జరీ చేయాలని చెప్పారు. ఆ సర్జరీ కూడా అత్యంత క్లిష్టమైనది, విజయవంతమయ్యే అవకాశాలు కూడా తక్కువ. దీంతో బెథానికి ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కంపించినట్లయ్యింది. ఈ వ్యాధి గురించి పలువురిని సంప్రదించింది కూడా అందరూ అదేమాట చెప్పారు. పైగా దీని భారినపడిన వారుకూడా ఇప్పటికీ తాము నడవలేకపోతున్నట్లు ఆమెకు చెప్పారు. అంతేగాదు పలువురు బతికే ఉన్నా కూడా.. నడుం కింద నుంచి శరీరం అంతా చచ్చుపడిపోయే అవకాశం కూడా లేకపోలేదని ఆమెను హెచ్చరించారు కూడా. అయినప్పటికి ధైర్యం తెచ్చుకుని మరీ విజయవంతంగా ఆపరేషన్ చేయించుకుంది. ఆమె మోకాలి నుంచి తొడ ఎముకల వరకు సర్జరీ చేశారు వైద్యులు. ఇంకెప్పుడూ హీల్స్ ధరించకూడదని సూచించారు. అంతేగాదు ఆమె కొత్తగా నడవడం నేర్చుకోవాల్సి ఉంటుందని బెథానికి తెలిపారు వైద్యులు. ఇది చాలా నొప్పితో కూడిని సర్జరీ అని బెథాని చెబుతోంది. ప్రాణాంతకం కాకుడాదంటే.. నొప్పిని భరిస్తూ సర్జరీ చేయించుకోక తప్పదని వాపోయింది. (చదవండి: ఢిల్లీ వెళ్లి చూడండి..భారత్‌లో ప్రజాస్వామ్యం చాలా శక్తిమంతంగా ఉంది: అమెరికా) -
కీళ్లు, మోకాళ్ల నొప్పులకు ఉపశమనం కావాలంటే, Nveda Joint Support తెలుసుకోండి!
హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2తో సహజసిద్ద పద్దతిలోనే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలనుకుంటున్నారా? అయితే మీరు “Nveda Joint Support” గురించి తప్పకుండా తెలుసుకుని విముక్తి పొందండి! హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది ఒక రకమైన కొలాజెన్, ఇది కీళ్లు మరియు మోకాళ్ల ఆరోగ్యం కోసమే ప్రత్యేకంగా రూపొందించబడింది, ఎందుకంటే ఇది కీళ్ల మృదులాస్థి యొక్క ప్రధాన నిర్మాణ భాగం కాబట్టి. ఇది కోడి మృదులాస్థి నుండి తీసుకోబడింది. కీళ్లు మరియు మోకాళ్ల ఆరోగ్యానికి హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 ద్వారా పొందే కొన్ని ప్రయోజనాలను ఇక్కడ చూద్దాము : కీళ్ల చలనాన్ని మెరుగుపరుస్తుంది: హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది కీళ్ల చలనాన్ని మరియు వంగే గుణాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, కీళ్ల నొప్పులు మరియు అన్ని రకాల కీళ్ళవాపు వ్యాధులు(ఆర్థరైటిస్), కీళ్ల కదలికలో కష్టం (రుమాటిక్ ) మరియు ముసలితనపు కీళ్ళ వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్)తో బాధపడుతున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కీళ్లు & మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది : హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది మంటను తగ్గించే లక్షణాలను కలిగి ఉన్నట్లు గుర్తించబడింది, దీని వలన ముసలితనపు కీళ్ళ వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్) మరియు కీళ్ల కదలికలో కష్టంగా (రుమటాయిడ్ ఆర్థరైటిస్) ఉన్నటువంటి వారిలో కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. మృదులాస్థి ఆరోగ్యానికి దోహదపడుతుంది: కొలాజెన్ టైప్-2 అనేది మృదులాస్థిలో ప్రధాన భాగం, అది కీళ్లలో ఉన్న ఎముకల మధ్య ఒక మెత్తని పదార్థంలాగా పనిచేస్తుంది. హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది మృదులాస్థి ఆరోగ్యానికి సహాయపడుతుంది ఇంకా దాని అరుగుదలను నెమ్మదిపరుస్తుంది. క్రీడల్లో గాయపడిన వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కీళ్లు & మోకాళ్ల కణజాలను బాగుచేయడంలో దోహదపడుతుంది : కొలాజెన్ టైప్-2 అనేది కీళ్లు & మోకాళ్ల కణజాలను బాగుపరచడంలో ఎంతో ముఖ్యమైనది. హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 కలిగిన పదార్థాలను తీసుకోవడం వల్ల కొత్తగా కీళ్ల కణజాల పెరుగుదలకు దోహదపడుతుంది మరియు కీళ్ల & మోకాళ్ల పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సురక్షితమైనది మరియు సహజసిద్ధమైనది : హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది చాలా మంది ఒంటికి తగినటువంటి సురక్షితమైన, సహజసిద్ధమైన పదార్థం. ఇది చాలా తేలికగా జీర్ణమవుతుంది ఇంకా దీనిని శరీరం బాగా గ్రహించుకుంటుంది, అందువలన కీళ్ల నొప్పులు మరియు బిగుసుకుపోయిన కీళ్లు ఉన్న వారికి ఇదొక ప్రభావవంతమైన ఎంపిక అని చెప్పవచ్చు. Nveda (https://nveda.in/ ) అనేది బాగా పరిశోధించబడిన పదార్థాలతో కూడిన Nveda Joint Support అనే ఒక ఉత్పత్తిని తయారు చేసింది, ఇవన్నీ కూడా మోకాళ్లు, కీళ్లను బలపరచడంలో సహాయపడతాయి. Nveda Joint Support లో హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2తో పాటు గ్లూకోసమైన్, ఎంఎస్ఎం, కాల్షియం సిట్రేట్ & కాల్షియం ఆస్కార్బేట్ లు కూడా ఉన్నాయి. ఈ సహజసిద్ద పదార్ధాలన్నీ మంటను తగ్గించడానికి, కీళ్ల రాపిడిని తగ్గించడానికి మరియు కీళ్లు & మృదులాస్థిని బలపరచడంలో సహాయపడతాయి. ఈ ఉత్పత్తి గురించి మరిన్ని వివరాల కోసం, మీరు ఈ వెబ్సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు (https://nveda.in/products/joint-support-60) గ్లూకోసమైన్ అనేది సహజసిద్దంగా మన శరీరంలో ఉండే పదార్థం, ఇది మృదులాస్థి తయారీలో ఇంకా దానిని బాగుచేయడంలో దోహదపడుతుంది. ఇది సాధారణంగా మోకాళ్లు & కీళ్ల ఆరోగ్యానికి ఉపయోగించబడుతుంది. కీళ్ల ఆరోగ్యానికి గ్లూకోసమైన్ కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఇక్కడ చూడండి: 👉కీళ్లు & మోకాళ్ల నొప్పులు తగ్గించి అవి బిగుసుకుపోవడాన్ని కూడా తగ్గిస్తుంది: గ్లూకోసమైన్ అనేది ముసలితనపు కీళ్ళ వ్యాధి(ఆస్టియో ఆర్థరైటిస్), కీళ్ళ కదలికలో కష్టము (రుమాటిక్ ఆర్థరైటిస్), ఇతర రకాల కీళ్లు & మోకాళ్ల నొప్పి ఉన్నవారిలో కీళ్లు&మోకాళ్ల నొప్పిని తగ్గించి, అవి బిగుసుకుపోవడాన్ని కూడా తగ్గించడంలో సహాయ పడుతుంది. 👉కీళ్ల పనితీరునుమెరుగుపరుస్తుంది: గ్లూకోసమైన్ అనేది కీళ్ల & మోకాళ్ల నొప్పి ఉన్నవారు సులభంగా కదలడానికి ఇంకా తక్కువ కష్టంతో రోజువారీ పనులను చేసుకోవడానికి కీళ్ల పనితీరును, వాటి చలనాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 👉మృదులాస్థి ఆరోగ్యానికి దోహదపడుతుంది: గ్లూకోసమైన్ అనేది కీళ్లలో ఎముకల మధ్య మెత్తని పదార్థంలాగా పనిచేస్తుంది, ఇది మృదులాస్థి యొక్క కీలక భాగం. గ్లూకోసమైన్ కలిగిన పదార్థాలను తీసుకోవడం వల్ల మృదులాస్థి ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇంకా దాని అరుగుదలను నెమ్మదిపరుస్తుంది. 👉కణజాలాన్ని బాగుచేయడంలో తోడ్పడుతుంది: గ్లూకోసమైన్ అనేది కొత్త కీళ్ల కణజాల పెరుగుదలకు తోడ్పడడంలో సహాయపడుతుంది ఇంకా కీళ్లు & మోకాళ్ల యొక్క పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో మంటను తగ్గించే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) లక్షణాలు ఉన్నాయి: గ్లూకోసమైన్ అనేది మంటను తగ్గించే లక్షణాలున్నాయి, కాబట్టి ఇది ముసలితనపు కీళ్ల వ్యాధికి, కీళ్ల కదలికలో కష్టంగా ఉన్నవారిలో కీళ్లలో మంటను తగ్గిస్తుంది. అదే విధంగా మిథైల్ సల్ఫోనిల్ మీథేన్ (ఎంఎస్ఎం) అనేది కొన్ని ఆహారాలలో ఉండే సహజసిద్దమైన పదార్థం, ఇది అన్ని రకాల కీళ్ల, మోకాళ్ల నొప్పులనుంచి ఉపశమనం కలిగేలా మంచి ప్రయోజనాల్ని కలిగి ఉన్నట్లు గుర్తించబడింది. ఎంఎస్ఎం అనేది కీళ్ల వాపును తగ్గించడంలో సహాయపడే మంటను తగ్గించగలిగే లక్షణాలను కలిగివుంది, ఇది ముసలితనపు కీళ్ళ వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్) మరియు కీళ్ల కదలికలో కష్టంగా (రుమటాయిడ్ ఆర్థరైటిస్) ఉన్నవారిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంపెనీ డాక్టర్ ప్రకారం, చాలా మంది వ్యక్తులు దీనిని తీసుకోవడం (కోర్సు) ప్రారంభించిన 3-4 వారాలలోనే ఉపశమనం పొందారంట. దీని వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు, కానీ కోడిమాంసం, చేపలంటే పడనివారు దీనిని తినకూడదని సూచించారు, ఎందుకంటే ఈ ఉత్పత్తిలో వాటి నుండి సేకరించిన కొన్ని పదార్థాలు ఉన్నాయి కాబట్టి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఈ ఉత్పత్తికి 3,000 కంటే ఎక్కువ పాసిటివ్ రేటింగులున్నాయి, అంతేకాకుండా ఇది ఆరోగ్యం కోసం వాడే పదార్థాల విభాగంలో ఎక్కువగా అమ్ముడుపోయే ఉత్పత్తుల్లో ఒకటిగా ఉంది. ఈ ఉత్పత్తి గురించి మరిన్ని వివరాల కోసం దయచేసి లింక్‌ని క్లిక్ చేసి తెలుసుకోండి. -అడ్వర్టోరియల్ -
వైఎస్ జగన్ సీఎం కావాలంటూ మోకాళ్లపై తిరుమల కొండకు
-
సూపర్ స్టార్‌కి మేజర్ సర్జరీ తప్పదట!
ముంబై: బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ న్ని సీరియస్ మెకాలి బాధలు వెన్నాడుతూనే ఉన్నాయి. ఇటీవల రాయిస్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా మోకాలికి నీ బ్యాండ్‌తో దర్శనమిచ్చిన షారుఖ్‌కి మరోసారి సర్జరీ తో పాటు విశ్రాంతి కూడా తప్పనిసరి అని సమాచారం. కొన్ని నెలలుగా మోకాలి నొప్పులతో బాధపడుతున్న ఈ సూపర్ స్టార్ కి ఈ మే నెలలో ఒక ఆపరేషన్ పూర్తయింది. ఇపుడు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారడంతో మరోసారి మరో సర్జరీ జరగనుందని షారూక్ కి చికిత్స అందిస్తున్న సీనియర్ వైద్యులు చెబుతున్నారు. ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డా. సంజయ్ దేశాయ్ ఈ విషయాలను వెల్లడించారు. క్రితంసారి పెయిన్ కిల్లర్స్, ఇంజెక్షన్ల ద్వారా చికిత్స నిర్వహించాం. కానీ వరుస షూటింగులు, వరుస గాయాలతో అతడి పరిస్థితి ఇప్పుడు మరీ అధ్వాన్నంగా తయారైందని చెప్పారు. విశ్రాంతి లేకుండా పని చేస్తున్న షారుఖ్‌కి మరోసారి ఆర్థోస్కోపిక్ సర్జరీ చేసి మోకాలిలో వున్న డ్యామేజీ భాగానికి చికిత్స చేయాల్సిన అవసరం వుందని చెప్పారు. అంతేకాదు ఆయనకు ఈసారి కచ్చితంగా విశ్రాంతి అవసరం అని డా.దేశాయ్ తేల్చి చెప్పారు. మరోవైపు రాయిస్ ప్రమోషనలో పాల్గొన్న షారూక్ మోకాలి గాయం బాగా వేధిస్తోందని, కొంచెం సేపు నిలబడినా బాగా పెయిన్ వస్తోందంటూ చెప్పుకొచ్చారు. ఈ నొప్పిని తట్టుకోవడానికి మెటాలిక్ నీ(మెకాలిచిప్ప) క్యాప్ ధరిస్తున్నానని చెప్పారు. సాధ్యమైనంత త్వరలోనే మరో మేజర్ సర్జరీ కి వెళ్లనున్నట్టు అభిమానులతో పంచుకున్నారు. కాగా ప్రస్తుతం జనవరి 2017 లోవిడుదల కానున్న రాయిస్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. నిత్యం గాయాలతో సతమతమయ్యే షారూఖ్ 2013లో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. 2015లో ఎడమ కిమోకాలి చిప్పకు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. -
గోల్డ్ నీతో కీళ్ల మార్పిడి
కర్నూలు(హాస్పిటల్): రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా గోల్డ్నీతో కీళ్ల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు డాక్టర్ ఎస్.కిరణ్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయన నగరంలోని గౌరి గోపాల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్ వివరాలను వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులకు చెందిన డాక్యుమెంట్ రైటర్ ఎన్.జ్వాలా నరసింహులు(68) కొంత కాలంగా కీళ్లనొప్పులతో బాధపడుతున్నాడన్నారు. ఇటీవల ఆయన తమ ఆసుపత్రికి వచ్చి కలువగా పరీక్షల అనంతరం బుధవారం గోల్డ్ నీ(సెవెన్ లేయర్స్ ఆఫ్ జిర్కోనియం నైట్రేట్ కోటింగ్)తో కీలు మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించామన్నారు. సాధారణంగా చేసే కీళ్ల మార్పిడి ఆపరేషన్‌లో ఉపయోగించే కోబాల్ట్ నికెల్ వల్ల కొంత మందికి అలర్జీ వస్తుందన్నారు. ప్రస్తుతం వినియోగించిన గోల్డ్ నీతో మెటల్ అలర్జీ ఉండదన్నారు. దీని మన్నిక 30 ఏళ్ల పాటు ఉంటుందన్నారు. హైదరాబాద్ కంటే 50 శాతం తక్కువ ఫీజుతో ఈ ఆపరేషన్ చేశామన్నారు. ఆసుపత్రి వ్యవస్థాపకులు, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తమ ఆసుపత్రి రోగులకు ఫ్యామిలీ డాక్టర్‌గా అన్ని రకాల సేవలను అందిస్తోందన్నారు. భవిష్యత్‌లో మరింత అత్యాధునిక వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఆసుపత్రి చైర్మన్ టి.జి.భరత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఆంథోనిరెడ్డి, వైద్యులు లక్ష్మణమూర్తి, ఎండి గౌస్, ప్రవీణ్ పాల్గొన్నారు. -
‘మోకీళ్ల’కు మోక్షం
జీజీహెచ్‌లో బుధవారం పది మందికి మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు బీఎంఆర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సాయంతో.. దేశ చరిత్రలోనే తొలిసారి గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల మరో కీర్తి కిరీటాన్ని ధరించబోతోంది. ఇప్పటి వరకు డాక్టర్ గోఖలే సాయంతో ఉచిత గుండె ఆపరేషన్ చేసి తన విశాల హదయాన్ని చాటిన ఆస్పత్రి.. నేడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి సంకల్పంతో ఒకేసారి పది మంది మోకీళ్లకు మోక్షం కల్పించబోతోంది. ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో లేక..కనీస సౌకర్యాలు కానరాక అడుగడుగునా అడ్డంకులు ఎదుర్కొన్న రోగుల కళ్లలో ఆనంద కాంతులు వెలిగించబోతోంది. దేశచర్రితలోనే ఒకేసారి పది మందికి మోకీళ్ల ఆపరేషన్లు ఉచితంగా అందించిన వైద్యశాలగా మరో మైలురాయి దాటబోతోంది. గుంటూరు మెడికల్: స్థానిక జీజీహెచ్‌లో బుధవారం పది మందికి ఉచితంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆపరేషన్లు జరగనున్నాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే రోజు పది మందికి మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు జరుగుతుండడంతో ఆర్థోపెడిక్ వైద్యుల సంఘం జాతీయ అధ్యక్షుడు గుంటూరుకు వస్తున్నారని సమాచారం. గుంటూరు సాయిభాస్కర్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, బీఎంఆర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ఈ ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. ఆపరేషన్ల కోసం రూ.10 లక్షల ఖరీదు చేసే ఇంప్లాంట్లను ట్రస్ట్ ద్వారా పేద రోగులకు అందిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ తొమ్మిది మందికి మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసి రూ.10 లక్షల ఖరీదు చేసే ఇంప్లాంట్లను ఉచితంగా ఇచ్చారు. రాష్ట్ర వైద్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌కు జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్‌లోనూ ఈయన పాల్గొన్నారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనే... డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి మైసూర్లో 1994లో ఎంబీబీఎస్, దావనగిరిలో 2003లో ఆర్థోపెడిక్ సర్జరీలో పీజీ పూర్తి చేశారు. హైదరాబాద్ సన్‌షైన్ హాస్పిటల్లో 2003–05 వరకు డాక్టర్ గురవారెడ్డి వద్ద, అనంతరం ఇంగ్లాండ్‌లో 2005లో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. పుట్టిన గడ్డకు సేవ చేయాలనే ఉద్దేశంతో గుంటూరులో సాయిభాస్కర్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. 2007 నుంచి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు.. బీఎంఆర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను 2007లో ప్రారంభించారు. ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా వైద్య సేవలందిస్తున్నారు. గుంటూరును జాయింట్ రీప్లేస్మెంట్ సర్జీలకు రాజధానిగా చేయటమే లక్ష్యమని ఆయన చెబుతున్నారు. ఆర్ధోపెడిక్ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్న ఈయన జాయింట్రీప్లేస్మెంట్ సర్జరీల్లో వస్తున్న పలు నూతన వైద్య పద్ధతులను అవలంబిస్తున్నారు. డాక్టర్ నరేంద్రరెడ్డి సేవలు ఆదర్శం.. డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు, జీజీహెచ్ సూపరింటెండెంట్ పేద ప్రజలకు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ఉచితంగా ఆపరేషన్లు చేయటం అభినందనీయం. సుమారు రూ.20 లక్షల ఖరీదు చేసే ఇంప్లాంట్లను సైతం ఆయనే తన ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచితంగా అందించారు. ప్రభుత్వం కూడా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు నిరంతరం కొనసాగించేందుకు గుంటూరుతోపాటుగా విశాఖపట్నం, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రులకు నిధులను విడుదల చేసేందకు సిద్ధంగా ఉంది. డాక్టర్ బూసిరెడ్డిని ఆదర్శంగా తీసుకుని వైద్యులు ముందుకొస్తే పేద ప్రజలకు మరిన్ని సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందుతాయి. -
మోకాలు వొంగిపోయింది... సరిచేసే అవకాశముందా?
రెండేళ్ల క్రితం నా మోకాలి కింది ఎముక విరిగింది. నేను మా ఊళ్లో కట్టు కట్టించుకున్నాను. ఇప్పుడు నా మోకాలు ఒంగిపోయి ఉంది. అలాగే రెండో కాలితో పోలిస్తే రెండు అంగుళాలు పొట్టిగా కూడ ఉంది. నా మోకాలు సరిగా అయ్యే అవకాశం ఉందా? - సుధీర్, హైదరాబాద్ మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు మోకాలి వద్ద డిఫార్మిటీ ఉన్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు మీకు జరిగిన ప్రమాదం వల్ల జరిగిన నాటు తరహా చికిత్స తర్వాత ఆ కాలు పొట్టిగా ఉందని అర్థమవుతోంది. ఇలాంటి కండిషన్ ఉన్నవారికి ‘స్టాండింగ్ లాంగ్ లెగ్’ అనే ప్రత్యేకమైన ‘ఎక్స్-రే’ తీసి పరీక్షిస్తాం. ఆ కాలి వెయిట్ బేరింగ్ యాక్సిస్ ఎలా ఉంది, మీ కాలు దాని సహజ ఆకృతితో పోలిస్తే ఏ మేరకు ఒంగిపోయి ఉంది (అంటే ఎంత అలైన్మెంట్ తప్పింది) అనే అంశాలను నిర్ణయిస్తాం. కాలు ఒంగినట్లు చెప్పారు కదా... ఆ ఒంపు ఎన్ని డిగ్రీలు ఒంగిపోయింది, దాన్ని ఎలా సరిచేయాలని, ఇలా సరిచేసే ప్రక్రియలో దాన్ని ఎంతవరకు కట్ చేయాలి, మొత్తం సరికావడానికి ఎంత సమయం పడుతుంది అనే అంశాలన్నింటినీ తెలుసుకొని, వాటిని పేషెంట్‌కు వివరిస్తాం. ఇలా ఒంగి ఉన్న కాలిని సరిచేయడానికి వివిధ రకాల ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి... 1. ఇలిజరోవ్ పద్ధతి : ఈ ప్రక్రియలో ఎముకను పూర్వపు అలైన్‌మెంట్‌కు తీసుకువచ్చాక, కాలిని మునుపటి పొడవునకు తీసుకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. 2. ఆస్టియాటమీ అండ్ ఫిక్సేషన్ : ఈ ప్రక్రియలో ఎముక ఒంపును సరిచేయడానికి వీలుంటుంది. కానీ తగ్గిన పొడవును పెంచడానికి వీలుకాదు. 3. టీఎస్ఎఫ్ : ఇది అత్యాధునికమైన పద్ధతి ఈ ప్రక్రియ ద్వారా ఎముకను సరిచేయడంతో పాటు, తగ్గిన మేరకు పొడవు పెంచడం కూడా సాధ్యమవుతుంది. ఈ రెండు ప్రక్రియలనూ ఒకేసారి చేయడానికి వీలవుతుంది. ఈ ప్రక్రియ తర్వాత చాలా త్వరగా నడవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకసారి మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి.