మోకాలి నొప్పికి.. మెయిడ్‌ పేరు! | Precautions For Prepatellar Bursitis Knee Pain | Sakshi
Sakshi News home page

మోకాలి నొప్పికి.. మెయిడ్‌ పేరు!

Published Tue, Sep 10 2024 12:53 PM | Last Updated on Tue, Sep 10 2024 12:53 PM

Precautions For Prepatellar Bursitis Knee Pain

ఆ వైద్యసమస్య పేరే ‘హౌజ్‌ మెయిడ్‌ నీ పెయిన్‌’! వైద్య పరిభాషలో  ‘‘ప్రెపటెల్లార్‌ బర్సయిటిస్‌’’ అనే ఓ జబ్బుకు పనిమనిషి పేరు పెట్టడం విశేషం. వాడుక పేరుగా పనిమనిషి (మెయిడ్‌) పేరు పెట్టిన ఆ జబ్బును ‘‘హౌజ్‌ మెయిడ్స్‌ నీ’’ అంటారు.  ఇంటిని తుడిచే వారు రెండు మోకాళ్లనూ గచ్చు మీద ఆనించి, మరో చేతిని నేలకు ఆనించి ఇంకో చేత్తో గుడ్డతో తుడుస్తూ ఉండటంతో మోకాళ్లు ఒరుసుకుపోయి నొప్పి వస్తుంది. అందుకే ఆ జబ్బుకు ఆ పేరు.

అలాగని అది కేవలం  పనిమనుషులకు వచ్చే సమస్య అనుకుంటే పొరబాటే. మోకాళ్లను నేలకు ఆనించి పనిచేసే వృత్తుల్లోని వారందరిలో (ఉదాహరణకు ప్లంబర్లు, గార్డెనర్లూ)నూ ఆ జబ్బు కనిపిస్తుంది. ఇంకా చె΄్పాలంటే ఆటల్లో నేల మీదికి దూకే సమయంలో మోకాళ్లు నేల మీద దోక్కుపోయే క్రీడాకారులకు కూడా ఈ నొప్పి వస్తుంటుంది. ఇలా ఎంతోమందిలో ఆ జబ్బు కనిపిస్తున్నప్పటికీ దానికి ‘‘హౌజ్‌ మెయిడ్స్‌ నీ’’ అనే పేరు స్థిరపడింది.

చికిత్స...
నొప్పి తొలిదశల్లో మోకాలికి ఐస్‌ పెట్టడం, పడుకునే/నిద్రపోయే సమయంలో ఆ భాగం కాస్త ఎత్తుగా ఉండేలా మోకాలి కింద దిండు పెట్టడం, విశ్రాంతి ఇవ్వడం వంటివి చేయాలి. ఆటగాళ్లకు లేదా ఇతరత్రా వృత్తుల్లోని వారికి నొప్పి మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్లు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ నొప్పి నివారణ మందులను ఇస్తారు. సూచిస్తారు. ఇక క్రీడాకారుల్లో ఈ సమస్య రాకుండా నివారించేందుకు ‘నీ–΄్యాడ్స్‌’ స్ట్రెచ్చింగ్‌ వ్యాయామాలతో పాటు... మోకాళ్లకు దెబ్బతగిలినప్పుడు క్రీడలకూ, ప్రాక్టీస్‌కూ విశ్రాంతి ఇవ్వడం వంటి పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రక్రియలను డాక్టర్లు సూచిస్తుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement