మన(సు)లో మాట
నా వయసు 25 సం‘‘లు. కొన్ని నెలలుగా నేను విపరీతంగా తింటున్నాను. ఈ మధ్య 15 కేజీలు బరువు పెరిగాను. ‘స్ట్రెస్’కు లోనైనప్పుడూ, ఒంటరిగా ఉన్నప్పుడు తినడం మరీ ఎక్కువ. ఎలాగైనా ఈ అతి తిండి అలవాటు నుండి బయటపడాలని ఉంది. మీరే ఏదైనా సలహా చెబుతారనే ఆశతో ఉన్నాను. – రజని, విశాఖపట్నం
పండుగల్లాంటి ప్రత్యేక సందర్భాలలో కొంచెం ఎక్కువగా తినడం మనందరికీ మామూలే! మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే, బహుశా మీరు ‘బింజ్ ఈటింగ్ డిజార్డర్’ అనే ఒక మానసిక రుగ్మతకు లోనైనట్లు తెలుస్తుంది. 25–30 సం‘‘ల మహిళల్లోను, 40–45 సం‘‘ల పురుషుల్లోనూ ఈ సమస్యను ఎక్కువగా చూస్తున్నా. మెదడులోని రసాయనాలలో వచ్చే మార్పులు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాల వల్ల ఇలాంటి సమస్య రావచ్చు.
అతి తక్కువ సమయంలో, ఫాస్ట్‌గా తినడం, కడుపు నిండినా ఆపుకోలేకపోవడం, బరువు పెరిగి గిల్టీగా ఫీలవడం, ఇన్‌ఫీరియారిటీకి, డిప్రెషన్‌కు లోనవడం జరుగుతుంది. ఒక విధంగా దీనిని ‘ఫుడ్ అడిక్షన్’ అనవచ్చు. మీలాంటి వారిలో మిగతా అడిక్షన్స్ లాగానే ఈ సమస్యను కూడా కొన్ని మందులతోను, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపి, జీవనశైలిలో మార్పులు, డైట్ కౌన్సెలింగ్‌తో మంచి మార్పులు తీసుకురావచ్చు. ‘ఫుడ్ డెలివరీ యాప్స్’ వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలను ఎక్కువగా చూస్తున్నా. సైకియాట్రిస్ట్‌ను సంప్రదిస్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. – డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
ఇవి చదవండి: Health: రిలీఫ్.. మెనోపాజ్ ఎక్సర్‌సైజ్!
Comments
Please login to add a commentAdd a comment