Eating
-
అనారోగ్యానికి ‘ఆహారం’ కావద్దు!
‘రుచికరంగా హాయిగా తినేసి పెందళాడే కన్నుమూస్తే మటుకు దేశానికి వచ్చిన నష్టమేంటి? భూమికి భారం తగ్గుతుంది కదా’ అంటూ కొందరు వితండవాదం చేస్తుంటారు. ఇక్కడ సమస్య త్వరగా కన్నుమూయడమా లేక చాలాకాలం పాటు జీవించడమా అని కాదు. ఉన్నన్నాళ్లూ ఎవరికీ భారం కాకుండా హాయిగా ఉండటం. ఆరోగ్యం బాగాలేక సుదీర్ఘకాలం మంచం పట్టి ఉండటమూ కోరుకునే అంశం కాదు, అలాగే పూర్తి ఫిట్నెస్తో ఉన్నవాళ్లు త్వరగా పోవడమూ అభిలాషణీయం కాదు. అందుకే ఉన్నన్నాళ్లూ ఆరోగ్యంగా, ఎవరికీ భారం కాకుండా, చురుగ్గా హాయిగా ఉండటం అన్నదే ఎవరికైనా కావాల్సింది. అందుకు మంచి ఆహారపు అలవాట్లు బాగా ఉపయోగపడతాయి. అదే చెడు ఆహారపు అలవాట్లతో ఆరోగ్యం దెబ్బతిని మరణం రాకపోయినా మంచాన పడి నిరర్థకంగా ఉండాల్సి రావచ్చు. అందుకే మంచి ఆహారపు అలవాట్లు ఎల్లవేళలా మంచివే. చెడు ఈటింగ్ హ్యాబిట్స్ ఎప్పుడూ దూరంగా ఉండాల్సినవే. ఈ నేపథ్యంలో మంచి, చెడు ఆహారపు అలవాట్లపై కాస్తంత అవగాహన కోసం ఈ కథనం...మంచి ఆరోగ్యానికి మంచి ఆహారపు అలవాట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటివల్ల మంచి వ్యాధి నిరోధక వ్యవస్థ మరింత పటిష్టం అవుతుంది. దాంతో అద్భుతమైన వ్యాధి నిరోధకత సమకూరుతుంది. దీని వల్ల కలిగే ఉపయోగాలు తక్షణం బయటకు కనిపించక΄ోవచ్చుగానీ... మంచి ఇమ్యూనిటీ వల్ల తప్పక మంచి జరుగుతుంది. గతంలో కోవిడ్ సమయంలో వైరస్ తీవ్రంగా ప్రభావం చూపినప్పటికీ వ్యాధి నిరోధక శక్తి పటిష్టంగా ఉన్నవారే బతికి బయటపడ్డారు. బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేసుకోకపోవడంఒకవేళ ఆహారపు అలవాట్లు బాగా లేకపోతే ఆ ప్రతికూల ప్రభావాలు వెంటనే కనిపిస్తాయి. ఇటీవల చాలామందిలో పొట్ట ఉబ్బరంగా ఉందనో, రాయిలా మారిందనో, తినగానే కడుపు ఉబ్బి΄ోయి, తేన్పులు వస్తూ, ఛాతీ మీద చాలా బరువుందనో అంటూ ఉండటం తరచూ చాలామందిలో కనిపించేదే. ఇవి ఆహారపు అలవాట్లలో తేడా వల్ల కనిపించే తొలి లక్షణాలు. మంచి ఆహారపు అలవాట్లతో కలిగే మేళ్లతో పాటు చెడు ఆహారపు అలవాట్లతో కలిగే దుష్ప్రభావాలను తెలుసుకుంటే చాలాకాలం పాటు పూర్తి ఆరోగ్యంతో, మంచి ఫిట్నెస్తో జీవించవచ్చు. ఈ సందర్భంగా ఆరోగ్యకరంగా జీవించడానికి మంచి ఆలవాట్లు ఏమిటో, అనారోగ్యం తెచ్చుకోవడానికి చెడు అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం...చిన్న మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడంతినే ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో ఏ రెండు పూటలకో పరిమితం చేయకుండా... తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం మంచిది. అంటే ఉదయపు టిఫిన్ (బ్రేక్ ఫాస్ట్), మధ్యాహ్న భోజనం (లంచ్),సాయంత్రపు పలహారం (ఈవినింగ్ శ్నాక్స్), రాత్రి భోజనం (సప్పర్/డిన్నర్) అంటూ ఇలా విభజించుకొని కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువసార.్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై అంతగా భారం పడదు. పైగా ఇలా తినడం వల్ల దేహానికి అవసరమైన శక్తి (ఎనర్జీ) ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. కొందరు చాలా తక్కువసార్లు... ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటుంటారు. చాలా బిజీగా ఉండేవారు సమయం లేదనో లేదా తినే సమయంలో మరో పని పూర్తవుతుందనే భావన వల్లనో రెండు పూటలే తింటుంటారు. ఇలా తక్కువసార్లు ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల పొట్ట ఉబ్బరంగా మారడం, పొట్ట రాయిలా గట్టిగా అనిపించడం, తినగానే పొట్ట ఉబ్బి΄ోయి ఎంతగానో అసౌకర్యంగా అనిపించడం (దీన్నే భుక్తాయాసం అని కూడా చెబుతుంటారు), తిన్నవెంటనే భోజనం ఛాతీకి అంటుకునే ఉన్నట్లు అనిపించడం లాంటి ఫీలింగ్, ఛాతీలో మంట, కడుపులో ఒకలాంటి నొప్పి, పుల్లటి తేన్పులు వంటి లక్షణాలు కనిపించడం మామూలే. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు ఇంటికి ఒక్కరైన ఉండటం ఈ రోజుల్లో చాలా సాధారణం. ఇక ఏయే వేళకు తినాల్సిన భోజనాన్ని ఆయా వేళల్లో తినడం, అలాగే రాత్రి భోజనాన్ని చాలా త్వరగా తినేయడంతోపాటు ఒకసారి రాత్రి భోజనం అయ్యాక మెలకువగా ఉన్న సమయంలో మళ్లీ మరేమీ తినకుండా జాగ్రత్త పడటం అవసరం. అలా కాకుండా రాత్రి భోజనం తర్వాత మెలకువగా ఉన్నప్పుడు తినడం వల్ల పొట్ట పెరిగి, అది రోగాల పుట్టగా పరిణమించడంతోపాటు కాస్మెటిక్గానూ బాగా కనిపించక΄ోవచ్చు. అన్ని పోషకాలూ లభ్యమయ్యే సమతుల ఆహారంతీసుకునే ఆహారంలో అన్ని రకాల ΄ోషకాలు ఉండాలన్నది ప్రధానం. అవేమీ లేని భోజనం చాలా పరిమాణంలో తిన్నా అది వృథాయే. అందుకే తక్షణ శక్తినిచ్చే పిండిపదార్థాలూ (కార్బోహైడ్రేట్లు), కణాలూ, కణజాలాలలను రిపేర్ చేసి, వాటిని పునర్నిర్మించే ్ర΄ోటీన్లు, దేహానికి అవసరమైన కొవ్వులతో΄ాటు, ఖనిజలవణాలూ, విటమిన్లు, మళ్లీ ఈ ΄ోషకాల్లోనూ ఎక్కువ మోతాదుల్లో అవసరమయ్యే మ్యాక్రో న్యూట్రియెంట్లు, తక్కువ మోతాదుల్లోనైనా తప్పనిసరిగా కావాల్సిన మైక్రో న్యూట్రియెంట్లు... ఇవన్నీ సమృద్ధిగా ఉండేలా మన భోజనం ఉండాలి. ఇలా అన్నీ సమ΄ాళ్లలో కలిగి ఉండే భోజనాన్ని ‘సమతులాహారం’ (బాలెన్స్డ్) అంటారు. ఇవన్నీ ఉండాలంటే భోజనంలో పిండిపదార్థాలనిచ్చే బియ్యం, గోధుమలు, ్ర΄ోటీన్లకోసం పప్పులు, మాంసాహారం, కొవ్వుల కోసం నూనెలతోపాటు ఆకుకూర.లు, కూర.గాయలు; విటమిన్లను సమకూరుస్తాయి తాజాపండ్లు తీసుకోవాలి. అయితే ఇక్కడ కొవ్వుల కోసం నూనెలు తీసుకునేప్పుడు వాటిని రుచి కోసం కాక దేహ అవసరాల కోసం మాత్రమే... అంటే చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అలాగే ప్రోటీన్ల కోసం మాంసాహారం మీద ఆధారపడేవారు అంతగా ఆరోగ్యకరం కాని రెడ్ మీట్ (వేట మాసం) కంటే ఆరోగ్యకరమైన వైట్ మీట్ (చికెన్, చేపల వంటివి) తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగడంమానవ శరీరరంలో 75 శాతం నీళ్లే ఉంటాయి. శరీరం ద్రవాలను కోల్పోవడాన్ని ‘డీ–హైడ్రేషన్’గా చెబుతారు. వేసవికాలంలో వడదెబ్బ వల్ల ఇలా దేహం ద్రవాలను కోల్పవడం జరిగి ప్రాణాపాయం కూడా కలగవచ్చు. ఇలాంటి అనర్థం జరగకుండా ఉండాలంటే ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ కనీసం మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగడం అవసరం. ఇక మెదడు నుంచి నరాల ద్వారా ఆయా దేహభాగాలకు అందాల్సిన ఆదేశాలన్నీ లవణాల వల్లనే జరుగుతుంది. ఆ లవణాలు అలా చేరవేయడానికి వీలుగా మారడానికి నీళ్లలో కరగడం వల్లనే జరుగుతుంది. అందుకే నీళ్లూ, లవణాలను కోల్పోకుండా ఉంటేనే మెదడునుంచి ఆయా అవయవాలకు అందాల్సిన ఆదేశాలు అందుతూ దేహం సక్రమంగా పనిచేస్తుంటుంది. అందుకే దేహం తాలూకు జీవక్రియలన్నింటికీ అవసరమైనన్ని నీళ్లు తాగుతుండటం అవసరం. మానవులు ఎన్ని నీళ్లు తాగాలనేదానికి ఓ కొండగుర్తు ఏమిటంటే... మూత్రవిసర్జనకు వెళ్లినప్పుడు మూత్రం పచ్చగా, బాగా గాఢంగా లేకుండా వీలైనంతగా నీళ్లలా ఉండాలి. మూత్రం అలా పచ్చగా, గాఢంగా ఉందంటే దేహంలో నీళ్లు తగ్గాయనడానికి నిదర్శనం. మూత్రం అలా ఉందంటే అలాంటప్పుడు తక్షణం శరీరానికి అవసరమైన నీళ్లు తాగాలని, అలా తాగడం ద్వారా దేహానికి అవసరమైనన్ని నీళ్లు (హైడ్రేషన్) సమకూర్చాలని అర్థం. బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోవడంచాలామందిలో ఒక దురలవాటు ఉంటుంది. ఆహారం తీసుకునే సమయాన్ని ఆదా చేయడం కోసం ఉదయం తీసుకోవాల్సిన బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేసి నేరుగా మధ్యాహ్న భోజనం తీసుకుంటుంటారు. రోజువారీ వ్యవహారాలకు అవసర.మైన శక్తి అందడానికి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మంచి అలవాటు అన్నది తెలిసిందే. అందుకే బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేయకూడదు. ఎక్కువ పరిమాణాన్ని తక్కువ సార్లు తినడంఎక్కువ పరిమాణంలో తక్కువసార్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అలా ఎక్కువ మోతాదుల్లో తక్కువ సార్లు తినడం వల్ల... కడుపులో ఆహారం లేని సమయంలోనూ ఆహారాన్ని అరిగించే ఆమ్లాలు జీర్ణవ్యవస్థ గోడలపైనా, పేగులపైన పనిచేయడంతో ఒక్కోసారి అది అల్సర్స్‌కు కారణం కావచ్చు. అటు తర్వాత ఆ అల్సర్స్ కారణంగా పేగులకు రంధ్రం పడటం వల్ల జీర్ణవ్యవస్థ / కడుపు / పేగుల్లోనే ఉండాల్సిన ఆహారం, జీర్ణ స్రావాలూ దేహ కుహరంలోకి ప్రవేశించడం వల్ల ప్రమాదకరమైన పరిస్థితులకూ దారితీయవచ్చు. తగినన్ని మంచినీళ్లు తాగకపోవడంచాలామంది పనుల్లో పడిపోయి తాగాల్సినన్ని మంచినీళ్లు తాగరు. మరికొందరు ఆఫీసుల్లోని ఏసీ కారణంగా ఆ చల్లటి వాతావరణంలో ఉండటం వల్ల దాహం వేయక తగినన్ని నీళ్లు తాగరు. ఈ రెండు పరిణామాల్లోనూ ఆరోగ్యానికి చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు దేహానికి అవసరమైన నీళ్లు, లవణాలు అందక పిక్కలు పట్టేయడం (మజిల్ క్రాంప్స్)తో పాటు కిడ్నీలో రాళ్లు రావడం వంటి అనర్థాలు చోటు చేసుకునే అవకాశముంది. అందుకే ప్రతిరోజూ ప్రతిఒక్కరూ దేహానికి అవసరమైనన్ని నీళ్లు తాగాలి. ఫాస్ట్ ఫుడ్ / జంక్‌ఫుడ్ తినడంఆధునిక జీవనశైలిలో పనివేళలూ, పనిగంటలూ పెరగడం, కొత్త తరహా పనులు, వృత్తుల వల్ల జీవితం ఉరుకులు పరుగులతో సాగడం వల్ల సమయం దొరకడం కష్టంగా మారింది. దాంతో మార్కెట్లో తేలికగా దొరకడంతో ΄ాటు అప్పటికప్పుడు తినగలిగే జంక్‌ఫుడ్, బేకరీ ఫుడ్ తీసుకోవడం ఓ ట్రెండ్‌గా మారింది. నిజానికి చెడు అలవాట్లలో ఈ ఫాస్ట్‌ఫుడ్ / జంక్‌ఫుడ్ ముఖ్యమైనది. ఈ తరహా ఆహారంలో ఉండే రిఫైన్డ్∙పిండిపదార్థాల వల్ల డయాబెటిస్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు... వీటికి తోడు చాలాకాలం నిల్వ ఉండటానికి వీలుగా (షెల్ఫ్‌లైఫ్‌ను పెంచడానికి) వీటిలో వాడే ప్రిజర్వేటివ్స్, అనారోగ్యకరమైన నూనెలు, అలాగే ఆహారపదార్థాల్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేయడం కోసం వాడే రంగుల వల్ల ఇలాంటి జంక్ఫుడ్స్ అనేక రకాల క్యాన్సర్లకు కారణంగా మారుతున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. అందుకే వీలైనంతవరకు జంక్‌ఫుడ్‌ను తీసుకోక΄ోవడమే మంచిది. మరీ తప్పనప్పుడు ఎప్పుడో ఒకసారి అదికూడా చాలా పరిమితంగా వాటిని తీసుకోవాలి. మితిమీరి తీపిపదార్థాలు తినడంచాలామంది తీపిపదార్థాలనూ, మిఠాయిలను ఇష్టపడతారు. అయితే వీటిని మరీ మితిమీరి తినడం వల్ల అనేక అనర్థాలు సంభవిస్తాయి. తీపితో వచ్చే నష్టాలు తొలుత నోటిలో నుంచే మొదలవుతాయి. నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే సూక్ష్మజీవులు పెర.గడం, వాటితో పళ్లు దెబ్బతినేలా లేదా పుచ్చి΄ోలాయే దంతక్షయం వంటి నష్టాలు సంభవిస్తాయి. మితిమీరి తీపిపదార్థాలు తినడం క్యాన్సర్‌కు ఒక కారణమంటూ చాలా అధ్యయనాల్లో నిరూపితమైంది. ఇక కొంతమంది తమ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో భాగంగా టీ, కాఫీలు చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. రెండు లేదా మూడు కప్పుల పరిమితికి మించి కాఫీ, టీలు తాగడం తాగడం ఒకరకమైన నష్టాన్ని తెస్తే... అందులోని తీపి తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చేటుగా పరిణమిస్తుంది. తినడానికి కనీసం అరగంట ముందు గానీ లేదా తిన్న అరగంట తర్వాత గానీ టీ తాగకూడదు. అలా టీ / కాఫీలు తాగితే తిన్న ఆహారంలోని ఐరన్ ఒంటికి పట్టదు. కూల్ బీవరేజెస్చాలామందికి కూల్డ్రింకులు, కోలా డ్రింకులు, శీతల ΄ానియాల వంటివి తాగుతుండటం అలవాటు. వీటిని తీసుకోవాల్సి వచ్చినా చాలా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయక΄ోగా, కొన్ని అనర్థాలు కూడా తెచ్చిపెట్టే అవకాశముంది. పైగా వీటిలోని కెఫిన్ రాత్రి నిద్రపట్టకుండా చేసే అవకాశమున్నందున వీటిని రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు అస్సలు తీసుకోకూడదు. వీటివల్ల అసిడిటీ వంటి సమస్యలూ వచ్చే అవకాశముంది. వీటిలోని మితిమీరిన చక్కెరల వల్ల... డయాబెటిస్ మొదలుకొని అనేక సమస్యలు రావచ్చు. ఆల్కహాల్ అలవాటుతో అనర్థంఆల్కహాల్ ఆరోగ్యానికి చేటు తెచ్చే ప్రమాదకరమైన అలవాటు. దీనికి తోడు కొంతమంది ఆల్కహాల్‌తో పాటు కోలా డ్రింకులు కలుపుకుంటారు. దీంతో రెట్టింపు దుష్ఫలితాలు కలుగుతాయి. ఆల్కహాల్ వల్ల కడుపులోని లైనింగ్స్ దెబ్బతినడంతో పాటు అసిడిటీ, అల్సర్లు వస్తాయి. మద్యం అలవాటు లివర్‌ను దెబ్బతీసి, మొత్తం జీర్ణవ్యవస్థ పనితీరునే దెబ్బతీస్తుంది. ఇక ఆల్కహాల్ తాగే సమయంలో చాలామంది వేపుడు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. వాస్తవానికి వేపుళ్లు అంత మంచి ఆహారపు అలవాటు కానే కాదు. ఇలా ఎన్నో ఆరోగ్య అనర్థాలకు దారితీసే ఆల్కహాల్ అలవాటును పూర్తిగా వదిలేయాలి. చెడు ఆహారపు అలవాట్లివి... అంటే మంచి ఆహారపు అలవాట్లను అనుసరించక΄ోవడాన్ని చెడు ఆహారపు అలవాట్లుగా చెప్పవచ్చు. అంటే సమతులాహారం తీసుకోకపోవడం, వేళకు తినక΄ోవడం, తక్కువసార్లు ఎక్కువ పరిమాణంలో తినడం, తాజాపండ్లు తీసుకోక΄ోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం ఇవన్నీ ఆహారపరమైన చెడు అలవాట్లు. అయితే ఇవ్వాళ్టి మానవ జీవనశైలిలో ఇలాంటి చెడు ఆహారపు అలవాట్లు కాస్తంత ఎక్కువే. పైగా అవన్నీ ఇవ్వాళ్టి ఆహారపు ఫ్యాషన్లుగా కూడా కొనసాగుతుండటం ఆందోళన కలిగించే అంశం. కొన్ని చెడు ఆహారపు అలవాట్లేమిటో చూద్దాం. -
అన్నం సయించనప్పుడు ఇలా తీసుకుంటే మేలు..!
చాలా మంది సరిగా భోజనం చేయరు. ఏమీ తినాలనిపించడం లేదనీ, తమకు అన్నం సయించడం లేదనీ చెబుతుంటారు. సాధారణంగా కాస్త పెద్దవయసు వచ్చాక ఇలాంటి మార్పు చాలామందిలో కనిపిస్తుంది. ఇలాంటివారు ఎలా తినాలో, ఎలా తినడం వల్ల తమకు అందాల్సిన పోషకాలు అందుతాయో తెలుసుకుందాం.అన్న సయించనివారు ఏదో తినడం కోసమంటూ చాలా తక్కువగానే తింటున్నప్పటికీ ఆ భోజనం అన్ని పోకాలూ అందేలాంటి బ్యాలెన్స్డ్ డైట్‌తో కూడిన మీల్ గా ఉండాలి. అంటే అందులో దేహానికి అవసరమైన పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు వంటివి పుష్కలంగా అందేలా కాయధాన్యాలూ, పప్పుధాన్యాలు, తినేవారైతే మాంసాహారంలోని వేటమాంసం, కోడిమాంసం, చేపలు, ఇక మిగతా అందరూ ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పాల ఉత్పాదనలు, తాజా పండ్లు ఇవన్నీ.ఎంత ఆహారం అవసరమంటే... ఓ వ్యక్తికి ఇంత ఆహారం అవసరమని నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే... ఓ వ్యక్తికి ఎన్ని క్యాలరీల ఆహారం అవసరం అన్నది... వారి వయస్సు, వారు పురుషుడా/వుహిళా, వాళ్ల బరువు, వాళ్లు రోజువారీ చేపే పనులు, అవి శ్రమతో కూడినవా, లేక ఒకేచోట కూర్చుని చేసేవా... ఇలాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.అన్నం సయించని వారు తినే వాటిల్లోనే రుచిగా... అన్నం సయించడం లేదంటూ పెద్దగా ఆహారం తీసుకోనివారు... తాము తినే ఆ కొద్దిపాటి ఆహారంలోనే వీలైనన్ని రకరకాల పదార్థాలు రకరకాల పద్ధతుల్లో కాస్తంత నాలుకకు రుచిగా వండినవి, తినేందుకు ప్రయత్నించాలి. ఆహారంలోనూ అనేక రకాలు (వెరైటీస్) వండి తీసుకోవడం వల్ల ... అవి కొన్నీ, ఇవి కొన్నీ తీసుకుంటూ చాలా రకాలు ఉండటం వల్ల తీసుకోవాల్సిన పరిమాణం అంతో ఇంతో భర్తీ అయ్యే అవకాశం ఉంది. దాంతో వారు తీసుకోవాల్సిన రోజువారీ ఆహారపు పరిమాణం చాలావరకు అందే అవకాశముంది.ఇదీ సాధారణ డైట్ ప్లాన్... అన్నం సయించనివారు ఈ కింది సాధారణ డైట్ ప్లాన్ అవలంబిస్తే మంచిది. ఇలాంటివాళ్లంతా రోజూ తమ రోజువారీ ఆహారంలో చపాతీ లేదా అన్నంతోపాటు పప్పులు (దాల్) లేదా శెనగలు, రాజ్మా వంటివి తీసుకోవడం మంచిది. వీటి కారణంగా వారికి అవసరమైన కార్బోహైడ్రేల్లు,ప్రోటీన్లు సమకూరుతాయి. భోజనం చివర్లో ఓ కప్పు పెరుగుతో పెరుగన్నం తినాలి. భోజనానికి ముందు క్యారట్, కీర, దోస వంటి కూరగాయలను సలాడ్స్‌గా తీసుకోవాలి. ప్రతిరోజూ పడుకోబోయే వుుందు ఓ కప్పు పాలు తాగితే కొద్దిమేర ఆరోగ్యకరమైన కొవ్వులు, క్యాల్షియమ్ సమకూరుతాయి. తినే పరివూణం తక్కువైనా, అందులోనే ఆ సీజన్లో దొరికేవైన తాజా పండ్లను సాధ్యమైనన్ని తీసుకోవాలి. చాలా తరచుగా అప్పుడప్పుడూ తృణధాన్యాలతో ఏవైనా వంటకాలను చిరుతిండ్లలా చేయించుకుని తినాలి. చిరుతిండి కాబట్టి ఈ శ్నాక్స్ రుచిగా ఉండి, బాగా తినాలని అనిపిస్తాయి.ఇలా ఇన్ని వెరైటీలుగా రకరకాల ఆహారాల్ని తీసుకోవడం వల్ల ఒంటికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజలవణాలూ, మైక్రో, మ్యాక్రో న్యూట్రియెంట్లు... అన్నీ అందేందుకు అవకాశం ఉంది. ఇవన్నీ తీసుకుంటే తక్కువగానే తింటున్నప్పటికీ అవసరమైన పోషకాలన్నీ చాలావరకు దొరుకుతాయి. (చదవండి: గుండెకు మేలు చేసే పండ్లు..!) -
Health: మీకు తెలుసా.. అతి తిండీ అడిక్షనే!
నా వయసు 25 సం‘‘లు. కొన్ని నెలలుగా నేను విపరీతంగా తింటున్నాను. ఈ మధ్య 15 కేజీలు బరువు పెరిగాను. ‘స్ట్రెస్’కు లోనైనప్పుడూ, ఒంటరిగా ఉన్నప్పుడు తినడం మరీ ఎక్కువ. ఎలాగైనా ఈ అతి తిండి అలవాటు నుండి బయటపడాలని ఉంది. మీరే ఏదైనా సలహా చెబుతారనే ఆశతో ఉన్నాను. – రజని, విశాఖపట్నంపండుగల్లాంటి ప్రత్యేక సందర్భాలలో కొంచెం ఎక్కువగా తినడం మనందరికీ మామూలే! మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే, బహుశా మీరు ‘బింజ్ ఈటింగ్ డిజార్డర్’ అనే ఒక మానసిక రుగ్మతకు లోనైనట్లు తెలుస్తుంది. 25–30 సం‘‘ల మహిళల్లోను, 40–45 సం‘‘ల పురుషుల్లోనూ ఈ సమస్యను ఎక్కువగా చూస్తున్నా. మెదడులోని రసాయనాలలో వచ్చే మార్పులు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాల వల్ల ఇలాంటి సమస్య రావచ్చు.అతి తక్కువ సమయంలో, ఫాస్ట్‌గా తినడం, కడుపు నిండినా ఆపుకోలేకపోవడం, బరువు పెరిగి గిల్టీగా ఫీలవడం, ఇన్ఫీరియారిటీకి, డిప్రెషన్‌కు లోనవడం జరుగుతుంది. ఒక విధంగా దీనిని ‘ఫుడ్ అడిక్షన్’ అనవచ్చు. మీలాంటి వారిలో మిగతా అడిక్షన్స్ లాగానే ఈ సమస్యను కూడా కొన్ని మందులతోను, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపి, జీవనశైలిలో మార్పులు, డైట్ కౌన్సెలింగ్‌తో మంచి మార్పులు తీసుకురావచ్చు. ‘ఫుడ్ డెలివరీ యాప్స్’ వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలను ఎక్కువగా చూస్తున్నా. సైకియాట్రిస్ట్‌ను సంప్రదిస్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. – డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.comఇవి చదవండి: Health: రిలీఫ్.. మెనోపాజ్ ఎక్సర్సైజ్! -
హాట్‌టాపిక్‌గా సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ హెల్తీ డైట్..!
బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్రేజ్ ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆయనకు ఫ్యాన్సే. ప్రస్తుతం ఆయన 'సికందర్'మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆయన వ్యక్తిగత అంగ రక్షకుడు షేరా డైట్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. సల్మాన్ ప్రతి షోకి వెంట ఉంటే షేరా గురించి పాటించే ఆహార నియమాలపై సల్మాన్ అభిమాను కుతుహలం ఎక్కువ. ఎందుకంటే భాయిజాన్‌ను రక్షించే అతడు కూడా మంచి ఫిట్‌గా కనిపించడమే అందుకు కారణం. అనునిత్యం సల్మాన్‌ని రక్షిస్తుండే అతడు ఏం తింటాడు దాని గురించి అభిమానులు ఆసక్తిగా ఉంటారు. అయితే షేరా ఒక ఇంటర్వ్యూలో తన డైట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ప్రతిదీ హ్యాపీగా తింటానని, కానీ బ్రెడ్, రోటీ లేదా శుద్దీ చేసిన ఆహారాల జోలికి మాత్రం పోనని అన్నారు. అంతేగా రోజంతా యాక్టివిగ్ ఉండేందుకు కచ్చితంగా భోజనానికి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అలాగే తప్పనిసరిగా వ్యాయామం చేస్తానని చెప్పారు. ఆరోగ్యంగా ఉండేలా సరైన వంటకాలను ఎంచుకోవాలని చెబుతున్నాడు. అలాగే సల్మాన్‌తో తనకు గల విడదీయరాని బంధం గురించి చెప్పారు. అలాగే తన కొడుకు హీరోగా లాంచ్ చేసే విషయంలో సల్మాన్ తనకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. అలాగే తమ మధ్య ఎలాంటి సాంస్కృతిక విభేదాలు తలెత్త లేదని చెప్పారు. కాగా, సల్మాన్‌కి అంగరక్షకుడిగా 1990ల నుంచి పనిచేశాడు. ఆ తర్వాత 2019లో రాజకీయల్లోకి ప్రవేశించారు. అయితే ఆయన సల్మాన్‌ని రక్షించడంలో చాలా అంకితభావంతో పనిచేస్తాడని పేరు ఉండటం విశేషం.(చదవండి: ఈ నాలుగు కీలక పోషకాలను తక్కువగా తీసుకుంటున్నాం! పరిశోధకుల స్ట్రాంగ్ వార్నింగ్) -
నటుడు ఆశిష్ విద్యార్థి ఇష్టపడే బెస్ట్ ఫుడ్ ప్లేస్‌లు ఇవే..!
నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలన్‌గా, సహానటుడిగా నటనలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆయన ఇటీవల యూట్యూబర్‌గా, పబ్లిక్ స్పీకర్‌గా ప్రజలకు మరింత చేరువయ్యాడు. అంతేగాదు ఫుడ్ వ్లాగింగ్ పేరుతో దేశంలోని ప్రసిద్ద రుచికరమైన వంటకాల గురించి అన్వేషించడం, వాటిని తన అభిమానులకు తెలియజేయడం వంటివి చేస్తాడు. చెప్పాలంటే చాలామందికి తెలియని కొంగొత్త తినుబండారాల గురించి పరిచయం చేస్తాడు. అంతేగాదు ఒక ఇంటర్యూలో వివిధ ప్రాంతాల్లో తనకు ఇష్టమైన ఫుడ్ ప్లేస్‌లు గురించి షేర్ చేసుకున్నారు కూడా. అవేంటంటే..ఫుడ్ వ్లాగింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో భారతదేశంలో ట్రై చేయగల బెస్ట్ ఫుడ్ ప్లేస్‌లు గురించి చెప్పుకొచ్చారు. కోల్‌కతా ఆహారం అద్భుతమైనదని, అక్కడ కచోరిలతో రోజుని ప్రారంభించమని చెప్పాడు. అందుకోసం మహారాజా(చంగని పప్పి మహారాజ్, బారా బజార్, నింబుతల్లాలో ఉంది), శర్మ టీ స్టాల్ (భవానీపూర్‌లో).రెండు కూడా ప్రసిద్ధ తినుబండారాలే. అలాగే ఆల్ టైం ఫేవరెట్ తినుబండారం అయిన బిర్యానీ కోసం అర్సలాన్ రెస్టారెంట్, హంగ్లాథెరియం (లేక్ గార్డెన్స్‌లో) రెండింటిని ప్రయ్నత్నించొచ్చని చెప్పాడు. బెంగళూరులో 1943లో స్థాపించిన శాఖాహర రెస్టారెంట్లో తినొచ్చని అన్నారు. అక్కడ ప్రసిద్ద కన్నడ ఫుడ్ మంచి రుచిగా అందిస్తారని అన్నారు. నిజానికి దీన్ని సమీపంలోని పాఠశాలల్లోని విద్యార్థుల కోసం శ్రీ వెంకటరమణ ఉరల్చే చిన్న క్యాంటీన్‌గా ప్రారంభించారు. ఆ తర్వత బెంగళూరుని సందర్శించే వాళ్లకు బెస్ట్ ఫుడ్ ప్లేస్‌గా పేరుగాంచింది. అలాగే కేరళలోని పాలక్కాడలో తనకు నచ్చిన బిర్యానీ స్పాట్ గురించి చెప్పారు. హసిన్ కిచెన్‌లో చేసే తలస్సేరి దమ్ బిరియానీ, రుచికరమైన చేపల కూర, నోరూరించే మాంసాహార వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఇక హిమచల్ప్రదేశానికి వస్తే.. బరోగ్లోని చాచు డా ధాబాలో పరాథే ప్రయత్నించమని, అలాగే చండీగఢ్‌లోని పష్తున్ రెస్టారెంట్ రాన్ ప్లేట్‌ను ఆస్వాదించమని సూచించారు.(చదవండి: ప్రపంచ కొబ్బరి దినోత్సవం: కొబ్బరితో చేసే ప్రసిద్ధ వంటకాలివే..!) -
‘అతిగా తిని’ ప్రాణం పోగొట్టుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తినే ఛాలెంజ్‌ను స్వీకరించి ప్రాణాలు కోల్పోయింది. చైనాలో 24 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాన్ జియోటింగ్ లైవ్ టెలికాస్ట్‌లో ఈటింగ్ ఛాలెంజ్ చేస్తూ చనిపోయారు. ఈ సంఘటన జూలై 14న జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇన్ఫ్లుయెన్సర్ పాన్ జియోటింగ్ ఈటింగ్ ఛాలెంజ్‌లు చేయడంలో ప్రసిద్ధి. ఆమె నిర్విరామంగా 10 గంటల కంటే ఎక్కువసేపు తినడం వల్ల మరణించినట్లు సమాచారం. స్థానిక చైనా మీడియా వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో ప్రతి ఈటింగ్ ఛాలెంజ్‌లో 10కిలోల కంటే ఎక్కువ ఆహారాన్ని తినేదని తెలుస్తోంది. ఇలా అతిగా తినడం మంచిది కాదని.. ఆమె కుటుంబసభ్యులు వారించినా పట్టించుకోలేదు.ఇలా చివరికి అదే ఈటింగ్ ఛాలెంజ్‌లో పాల్గొని ప్రాణాలో పోవడంతో విషాదం నెలకొంది. జియోటింగ్ మరణం అనంతరం పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో జీర్ణించుకోలేని విధంగా ఆహారం తినడం వల్లే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. -
భారత్‌లో బ్రెయిన్-ఈటింగ్ డిసీజ్ కలకలం
భారత్‌లో బ్రెయిన్ ఈటింగ్ డిసీజ్ కలకలం రేగింది. మెదడును తినే అమీబా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా ఈ వ్యాధి సోకిన కేరళలోని కోజికోడ్‌కు చెందిన 14 ఏళ్ల మృదుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఒక చిన్నపాటి చెరువులో స్నానానికి దిగిన అనంతరం అతనికి ఈ వ్యాధి సోకింది. ఈ వ్యాధిని అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పీఏఎం)అని పిలుస్తారు.ఈ వ్యాధి నేగ్లేరియా ఫౌలెరి అనే అమీబా వల్ల వస్తుంది. ఈ అమీబా నీటి ద్వారా శరీరంలోకి చేరినప్పుడు, నాలుగు రోజుల్లోనే అది మానవ నాడీ వ్యవస్థపై అంటే మెదడుపై దాడి చేస్తుంది. 14 రోజుల వ్యవధిలో ఇది మెదడులో వాపుకు కారణమవుతుంది. ఫలితంగా బాధితుడు మరణిస్తాడు. ఈ ఏడాది కేరళలో ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకూ నలుగురు మరణించారు. అయితే.. దీనికి ముందు కూడా మన దేశంలోని వివిధ ఆసుపత్రులలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్పీ) తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యాధి బారినపడి కేరళ, హర్యానా, చండీగఢ్‌లలో ఇప్పటివరకు 22 మంది మృతి చెందారు. వీటిలో ఆరు మరణాలు 2021 తర్వాత నమోదయ్యాయి. కేరళలో మొదటి కేసు 2016లో వెలుగులోకి వచ్చింది.అప్రమత్తమైన కేరళ ప్రభుత్వంఅమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ నివారణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎవరూ కూడా మురికి నీటి ప్రదేశాల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరినేషన్ తప్పని సరి చేయాలని, చిన్నారులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున వారు నీటి వనరులలోకి ప్రవేశించినప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్విమ్మింగ్ చేసే సమయంలో నోస్ క్లిప్‌లను ఉపయోగించడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ను నివారించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్, ముఖ్య కార్యదర్శి డాక్టర్ వేణు, ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజన్ ఖోబ్రగాడే తదితరులు పాల్గొన్నారు. -
బయట తినేటప్పుడు జర భద్రం..!
వీధి వీధికి ఒక రెస్టారెంట్, చిన్న చిన్న ఫుడ్ సెంటర్లు తెగ ఆకర్షణీయంగా దర్శనమిస్తుంటాయి. అందులోకి ఇప్పుడూ స్విగ్గీ, జోమాటో వంటి ఆన్లెన్ ఫుడ్ డెలివరీల పుణ్యమా అని బయట భోజనంపై ఆధారపడిపోతున్నారు చాలామంది ప్రజలు. కానీ ఇటీవల కాలంలో ప్రముఖ రెస్టారెంట్లలోనే నాసిరకం భోజనం, ఎక్స్పైరీ తేదీ దాటిని వాడుతున్నట్లు ఆహార భ్రద్రత అధికారులు జరిపిన దాడుల్లో తేలింది. ఇవి మరువక మునుపమే రీసెంట్గా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే..అందులో ఏకంగా చికెన్ పీస్‌లో పురుగులు బయటపడ్డాయి. వాటికి మించి..అన్నట్లుగా బయట ఆహారానికి సంబంధించి వెలుగులోకి రాని భయానక ఘటనలు కొన్ని ఇక్కడ జరిగాయి. ఇవి చూస్తే బయట భోజనం సురక్షితమేనా..? అనే సందేహం వచ్చేస్తుంది. అవేంటో చూద్దామా..మనం ఎప్పుడూ ఒకరు తిని వదిలేసిన ఆహారాన్ని లేదా కుళ్ళిన ఆహారాన్ని తినము. కానీ భారతదేశంలో ఇప్పుడు ఈ పరిస్థితే దాపురించింది!. ఎలా అనే కదా..? ఇటీవల రియల్‌గా జరిగిన ఘటన ఇది. కాస్త పేర్లు మార్చాం. కొద్ది రోజుల క్రితం రవి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన స్నేహితుడుతో కలిసి ఒక ప్రసిద్ధ రెస్టారెంట్‌కు వెళ్లారు. సాధారణంగా రవికి బయటన భోజనం తినే అలవాటు లేదు. వాళ్లు తమ దర్పానికి తగ్గట్టు పనీర్ వంటకాలు ఆర్డర్ చేశారు. అయితే సర్వర్ తెచ్చిన పనీర్ ముక్కలు విభిన్న పరిమాణాలు, వేర్వేరు రంగుల్లో ఉన్నాయి. వాటిని చూడగానే రవికి ఏదో తేడా కొడుతుందని అనిపించింది రవికి. అవి చూస్తుంటే.. ఉద్దేశపూర్వకంగా కట్ చేసి వండినట్లు తెలుస్తోంది. దీంతో రవి వెయిటర్ని పిలిచి వంట చేసే వ్యక్తి తీసుకు రావాల్సిందిగా కోరాడు. అతడు వచ్చిన వెంటనే రవి నేరుగా పనీర్ ముక్కలు ఎందుకు విభిన్న పరిమాణాలు, రంగుల్లో ఉన్నాయని ప్రశ్నించాడు. రవికి ఇది మా ప్రత్యేకం వంటకం అని గర్వంగా చెప్పాడు ఆ వంటవాడు. అయితే తాను మరో ప్లేట్ ప్యాక్ చేసి తీసుకువెళ్తాను..దాన్ని మా ముందే తయారు చేయండని కాస్త పెద్ద స్వరంతో అడిగాడు రవి. దెబ్బకు రెస్టారెంట్ మొత్తం వణికిపోయింది. అక్కడున్న చాలామంది భోజనం ఆపేసి మరీ ప్రేక్షకుల్లా చూస్తున్నారు. దీంతో హోటల్ సిబ్బంది వివిధ కారణాలు చెప్పడం ప్రారంభించారు. చివరకు పోలీసుల భయంతో, వెయిటర్ అసలు కారణాన్ని తెలియజేసి తప్పును అంగీకరించాడు. ఇది అందరూ చేసే తప్పు..కస్టమర్లు చాలా సార్లు తమ ప్లేట్లలో అన్నం, కూరగాయలు, సలాడ్లు, చపాతీలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. హోటల్ సిబ్బంది వాటిని అన్నీ పడేయడం లేదు. పెద్ద పనీర్ ముక్కలను, కూరగాయలను తిరిగి మరొక వంటకంలో కలిపి వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుంది. ప్లేట్లలో మిగిలిన సలాడ్ కొత్త ఆర్డర్ కోసం ఉపయోగిస్తున్నారు నిర్వాహకులు. ఇలా పెద్ద పెద్ద హోటల్స్‌లోనే జరగడం బాధకరం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి..ఇక మీదట, ఎప్పుడు హోటల్లో భోజనం చేయడానికి వెళ్తే, మిగిలిన భోజనం ఒక ప్లాస్టిక్ సంచిలో వేసుకుని, బయటకు వెళ్లి జంతువులకు ఆహారంగా ఇవ్వండి లేదా ఆ సంచి చెత్తబుట్టలో మీరే స్వయంగా వేయండి. లేదంటే, మీ ప్లేట్లోని భోజనం మరొకరి ప్లేట్లోకి వచ్చిన ఎంగిలి ఆహారమై ఉండొచ్చు లేదా మీరు తినగా మిగిలిన భోజనం మరొకరికి ఆహారం కావచ్చు. జాగ్రత్త!! మరో సంఘటన.. శ్రీకృష్ణుని జన్మస్థానం అయిన బృందావనంలో జరిగింది. బృందావనాన్ని ఎంతో పవిత్రమైన భూమిగా చూస్తారు. కౌశల్ అతడి బృందం బృందావనానికి పయనమయ్యారు. ఢిల్లీ నుంచి సుదూర ప్రయాణం చేసిన తర్వాత వారంతా ఎంతో ఆకలితో ఉన్నారు. అందుకే ఒక శుభ్రంగా కనిపించే భోజనశాలలో ప్రవేశించాము. ఆర్డర్‌కు ఆలస్యం కాకుండా ఉండటానికి డిష్‌ల కంటే రెడీమేడ్ భోజన థాళిలను ఆర్డర్ చేసాము. ఒక శుభ్రమైన ట్రే ద్వారా దాల్, కూరగాయలఅన్నం, రైతా మరియు ఒక బుట్టలో చపాతీలు తీసుకువచ్చారు. మొదటి కొద్దిముక్కల తిన్నప్పుడు గుర్తించలేదు, కానీ తర్వాత ఏదో తేడాగా అనిపించింది. చపాతీ పుల్లగా ఉండగా, కూరగాయల రంగు విభిన్నంగా ఉంది. అన్నం రుచి కూడా అసహజంగా ఉంది. అందరం భోజనం అలాగే వదిలేసి, కౌంటర్ వద్దకి బిల్లు ఎంత అని అడిగాము, 650 రూపాయల బిల్లు ఇచ్చారు. ఆ తర్వాత బాబు.. తాము చెల్లిస్తాం కానీ ఒక్కసారి కిచెన్ చూపించండి అని అడిగారు వారంతా. అతడు ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ..ఏమయ్యింది అని అడిగాడు. ఒక కస్టమర్‌గా..! భోజనం ఎలా తయారయ్యిందో చెక్ చేయడం తన బాధ్యత అని చెబుతూ..వాళ్లంతా కిచెన్‌లోకి వెళ్లి చూసి కంగుతింటారు. కొన్ని చపాతీలు బుట్టలో ఉండగా, ఫ్రిజ్‌లో వేరే వేరే రకాలుగా వండిన కూరగాయలు, మూతలు లేని వంట పాత్రలు దర్శనమిచ్చాయి. కొన్ని మరీ దుర్వాసన కొడుతున్నాయి. అదంతా చూసి కోపంతో వంటవాడికి నాలుగు చివాట్లు పెట్టగా..అసలు విషయం బయటపెట్టాడు. ఈ కూరగాయలు వారం రోజులుగా ఉన్నాయి. అతను మరొక విషయం కూడా చెప్పాడు, వండేటప్పుడు పాత కూరగాయలను, కుళ్ళిన కూరగాయలను మళ్లీ నూనెతో వేడి చేసి కొత్తిమీర టమాటాలతో అలంకరించి కొత్త వంటకం లాగ వేరే కస్టమర్లకు వడ్డిస్తాం. చపాతి పిండిని కూడా రెండు రోజులకు ఒకసారి తయారు చేస్తాము. కరెంటు కోత కారణంగా ఫ్రిజ్‌లోని ఆహార పదార్థాలు చెడిపోతాయి. ఆ చెడిన వాసనను తెలియనివ్వకుండా మరిన్ని మసాలాలు, కారము కలిపి వంట చేసి సర్వ్ చేస్తాము. పులిసిపోయిన చపాతి పిండిని నాన్ తయారీకి ఉపయోగిస్తామంటూ వరుసగా తాము చేసే పాపాలను వరుసగా బయటప్టెటాడు. ఎప్పుడైనా మీరు కూడా యాత్రలు చేసినప్పుడూ..మీకు కూడా ఓ హోటల్ సర్వర్ ఇలాంటి భోజనమే పెట్టాలి అప్పుడు అర్థమవుతుంది తమ బాధ అంటూ ఉద్వేగంగా చెప్పారు. ఈ రోజు మనకు జరిగే ఇటువంటి ప్రమాదాలు, మోసాల నుంచి కేవలం మన అప్రమత్తత మాత్రమే రక్షిస్తుంది. భారతదేశంలో సత్యం అసత్యం మధ్య తేడా దారుణంగా క్షీణిస్తోంది. ప్రతి దుకాణం లేదా సంస్థల వద్ద ఒక మూలలో దేవాలయం ఉంటుంది. వ్యాపారి ఉదయం వచ్చినప్పుడు దేవుని విగ్రహం ముందు ధూపం, దీపం వెలిగించి, కౌంటర్‌కి నమస్కరించి, ఆ తర్వాత యథావిధిగా మంచి మనిషి ముసుగు తీసి రాక్షసుడి మాదిరి మోసాలకు పాల్పడతాడు. పైగా దేవుడిని ఈ కోరిక తీర్చమంటూ సాగిలపడుతుంటాడు. అస్సలు ఇన్ని మోసాలు చేస్తూ ఎలా కోరికలు లిస్ట్ దేవుడికి చెప్పగలడనేది అర్థం కానీ మిస్టరీ..!. కనీసం ఇసుమంత మేలు చేసి అడిగినా ఓ అందం..కానీ ఇక్కడ ఎవరి స్వార్థం వారిదే. కేవలం స్వలాభమే ముఖ్యం అందుకు ఏమైనా చేస్తారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైనంత వరకు బయట భోజనం తినకుండా ఉండేందుకు ప్రయత్నించండి. (చదవండి: మల్టీవిటమిన్లు మరణ ప్రమాదాన్ని తగ్గించగలవా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
వామ్మో..! పెరుగుతో.. వీటిని కూడా కలిపి తింటున్నారా..??
నవపాకాలతో అన్నం వడ్డించినా, చివరలో పెరుగన్నం తినకుండా ఆ భోజనం పరిపూర్ణం అనిపించుకోదు. ఎందుకంటే పెరుగు తినడం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. ముఖ్యంగా పెరుగు ΄÷ట్టకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ప్రోటీన్, కాల్షియం,ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండటం వల్ల పెరుగు వినియోగం ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరు చాలా పదార్థాలను పెరుగుతో కలిపి తింటూ ఉంటారు. అయితే, పెరుగుతో కలిపి తినకూడని కొన్ని పదార్థాలు ఉన్నాయి. అవి తినడం ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పెరుగుతో ఎలాంటి ఆహారపదార్థాలు తినకూడదో... ఎందుకు తినకూడదో తెలుసుకుందాం.పెరుగు, చేపల మిశ్రమం ఆరోగ్యానికి హానికరం. ఆయుర్వేదం ప్రకారం, చేప, పెరుగు వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వీటి కలయికతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం శరీరంలో అసమతుల్యతను కలిగిస్తుంది. ఇది అలెర్జీలు, దద్దుర్లు, ఇతర సమస్యల వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది.సిట్రస్ పండ్లు... పెరుగు: ఇప్పటికే కాస్త పుల్లగా ఉండి, నారింజ, నిమ్మ, ద్రాక్ష తదితర పుల్లని పండ్లతో కలిపి పెరుగు తింటే కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలు, అసిడిటీ, కడుపు నొప్పిని కలిగిస్తుంది. పెరుగు, ఉడికించిన గుడ్డు కలిపి తీసుకోవడం మంచిది కాదు. ఈ రెండూ ప్రోటీన్ కు మంచి మూలాధారాలు. అయితే వీటిని కలిపి తింటే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి, ΄÷త్తికడుపులో భారాన్ని, గ్యాస్‌ను కలిగిస్తుంది.ఉల్లిపాయ, పెరుగు: వీటి కలయిక జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. కడుపులో చికాకు, గ్యాస్, ఇతర సమస్యలను కలిగిస్తుంది. రాత్రిపూట పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం, రాత్రిపూట పెరుగు తినడం వల్ల కఫ దోషం పెరుగుతుంది. ఇది జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలకు దారితీస్తుంది.పెరుగు, మామిడికాయల కలయిక రుచికరంగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. మామిడి, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో విషపదార్థాలు ఏర్పడతాయి. ఇది జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలకు దారితీస్తుంది.ఇవి చదవండి: ఆరోగ్యమే ఆనందం.. -
కూర్చొని వర్సెస్ నిలబడి: ఎలా తింటే బెటర్?
చక్కగా కూర్చొని ఆహారం తింటుంటే హాయిగా ఉంటుంది. ఇప్పుడూ ఈ ఉరుకులు పరుగులు జీవన విధానంలో చాలామంది నిలబడి గబగబ తినేసి భోజనం కానిచ్చాం అన్నట్లుగా తింటున్నారు. అంతెందుకు పెళ్లిళ్లలో కూడా బఫే పేరుతో నిలబడి తినడమే. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లలోనూ ఇదే తీరు. ఇంతకీ ఇలా తినడం మంచిదేనా? అంటే..ముమ్మాటికి కాదనే చెబుతున్నారు పరిశోధకులు. తాజా అధ్యయనంలో ఈ విషయమై పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.నిలబడి తింటే..నిలబడి తినడం వల్ల వేగంగా జీర్ణమయ్యి, కొవ్వు తగ్గడం జరుగుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఇది ఒక్కోసారి పొట్ట ఉబ్బరాన్ని కలిగించి ఆకలిని పెంచుతుందని చెబుతున్నారు. అంతేగాదు ఇటీవల చాలామంది టైం ఆదా అవుతుందనే ఉద్దేశ్యంతో నిలబడి ఏదో కానిచ్చాం అన్నట్లు భోజనం చేస్తుంటారు. ఇది జీర్ణక్రియకు హానికరం అని, అతిగా తినేందుకు దారితీస్తుందని నొక్కి చెబుతున్నారు పరిశోధకులు. గురత్వాకర్షణ కారణం కడుపులోని ఆహరం వేగంగా ప్రేగుల్లో కదులి, త్వరగా జీర్ణమయ్యిపోతుంది. ఫలితంగా అతి ఆకలికి దారితీస్తుందని తెలిపారు.చాలామంది నిలబడి తినడం వల్ల బరువు తగొచ్చని భావిస్తుంటారు. కానీ దీని వల్ల బరువు తగ్గడం అటుంచి శరీరానికి అవసరమయ్యే కొవ్వుల, నష్టం, పోషకాల నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు ఇలా నిలబడి తింటే ఆహారం టేస్టీగా అనిపించదట. అదీగాక వాళ్లు కూడా ఆటోమేటిగ్గా రచి తక్కువ ఉన్న ఆహారపదార్థాలను ఇష్టపడతారని చెబుతున్నారు. ఎందుకంటే నిలబడి తింటున్నప్పుడూ నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ ముడుచుకుపోతాయని తెలిపారు. ఇందుకోసం సుమారు 30 మంది వ్యక్తులను తీసుకుని అధ్యయనం చేయగా నిలబడి తిన్న వాళ్లలో బరువు కోల్పోడమే గాక టేస్టీగా ఉన్న ఆహారాన్ని తినకపోవడాన్ని గుర్తించామని చెప్పారు. కూర్చొని తినడం..మీరు తినేటప్పుడు అనుసరించే భంగిమ మీ ఆహారాన్ని జీర్ణం చేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఒక వ్యక్తి కూర్చొన్నప్పుడు కడుపులోని ఆహారం నెమ్మదిగా ఖాళీ అవుతుందని అన్నారు. నిలబడి భోజనం చేసిన దానికంటే నెమ్మదిగా జీర్ణం అవుతుందని అన్నారు. అలాగే శరీరం ప్రోటీన్లు గ్రహించేలా మంచిగా జీర్ణం అవుతుంది. అంతేగాక రక్తానికి అవసరమయ్యే అమైనో ఆమ్లాల లభ్యత కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ఇక కూర్చొని తినడం వల్ల టేస్టీగా ఉన్న ఆహారాన్నే తీసుకుంటారు. పైగా నిలబడి తిన్నప్పటి కంటే కూర్చొని భోజనం చేసినప్పుడూ ఆహారం టేస్టీగా అనిపిస్తుందట కూడా. తక్కువ ఆకలి ఉంటుంది. నిండుగా ఉన్న ఫీల్ కలుగుతుందని చెబుతున్నారు పరిశోధుకులు. అధ్యయనంలో పాల్గొన్న సగం మందిలో.. కూర్చొన తిన్న వారిలో జీర్ణ సంబధ సమస్యలు లేకపోవడమే గాక బరువు అదుపులో ఉన్నట్లు తెలిపారు. పైగా నిలబడిన వారితో పోలిస్తే టేస్టీగా ఉండే భోజనాన్నే ఇష్టపడినట్లు గుర్తించామని అన్నారు. ఏదీ బెటర్ అంటే..కూర్చొని తినే భంగిమే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. కూర్చొవడం అంటే..డైనింగ్ టేబుల్స్ మీద కాదు. నేల మీద నిటారుగా కూర్చొని భోజనం చేస్తేనే సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే గూని లేకుండా నిటారుగా కూర్చొని తినడం వల్ల కడుపులోంచి ఆహరం ప్రేగుల్లోకి నెట్టడానికి అనుమతిస్తుంది. అలాగే ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం తగ్గుతుందని చెప్పారు. నిజానికి ఇది భారతీయ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న భోజన సాంప్రదాయం కూడా ఇదే.ఇక నిలబడినప్పుడు త్వరితగతిన ఆహారం విచ్ఛిన్న అయ్యి కాలక్రమేణ కొవ్వులు నష్టానికి దారితీస్తుందని పరిశోధనలో తేలిందన్నారు పరిశోధకులు. అలాగే టేస్టీగా తినాలనుకుంటే కూర్చొని హాయిగా భోజనాన్ని ఆస్వాదిస్తూ తినడం మంచిదని వెల్లడించారు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా శాస్త్రవేత్తల బృందం. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ కంజ్యూమర్ రీసెర్చ్‌లో ప్రచురితమయ్యింది.(చదవండి: నటి విద్యాబాలన్ ఫాలో అయ్యే "నో రా డైట్" అంటే..!) -
అతిగా తినడం.. వాంతి చేసుకోవడమా? అయితే ఇలా చేయండి!
రాధ డిగ్రీ చదువుతోంది. చూడ్డానికి చక్కగా ఉంటుంది. బాగా చదువుతుంది. అందరితో కలివిడిగా మాట్లాడుతుంది. కానీ కొన్ని నెలలుగా ఆమె అతిగా తింటోంది. అక్కడితో ఆగడంలేదు. అతిగా తినడంవల్ల లావయిపోతాననే భయంతో భోజనం కాగానే వాష్ రూమ్‌లోకి వెళ్లి బలవంతంగా వాంతి చేసుకుంటోంది. అలా చేయడం నేరంగా, అవమానకరంగా భావిస్తోంది. క్లాసులో కూర్చున్నా ఆలోచన మాత్రం బరువుపైనే ఉంటోంది. తన శరీరాకృతి సరిగా ఉందో లేదోనని తరచూ అద్దంలో చూసుకుంటోంది. బరువు తగ్గించుకునేందుకు విపరీతంగా వ్యాయామం చేస్తోంది.రాధ ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి గీతాదేవి ఏం జరుగుతోందని ఆరా తీసింది. అలా తిని, బలవంతంగా వాంతి చేసుకోవడం లేదా అతిగా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి చూసింది. రాధ వయసుకు తగ్గ బరువే ఉందని వెయింగ్ మెషిన్లో చూపించింది. కానీ రాధ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. దాంతో ఏం చేయాలో అర్థంకాక తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ఆయన సలహా మేరకు రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ చేయించారు. న్యూట్రిషనిస్ట్‌ను కలసి ఆహారపు అలవాట్లు, బరువు తగ్గే మార్గాలపై కౌన్సెలింగ్ తీసుకున్నారు.ఫ్యామిలీ డాక్డర్ సలహా మేరకు సైకోడయాగ్నసిస్కి తీసుకొచ్చారు. రాధతో మాట్లాడాక ఆమె బులీమియా నెర్వోసా అనే మానసిక రుగ్మతతో బాఢపడుతోందని అర్థమైంది. అతిగా తినడం, వెంటనే బలవంతంగా వాంతి చేసుకోవడం దీని ప్రధాన లక్షణం. వారానికి ఒకసారి అతిగా తిని, వాంతి చేసుకుంటే బులీమియా ఉందని నిర్ధారణ చేసుకోవచ్చు.పలురకాల చికిత్సలు అవసరం..బులీమియాకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల చికిత్సలు అవసరం కావచ్చు. అంటే సైకాలజిస్ట్, ఫ్యామిలీ డాక్టర్, డైటీషియన్లతో కూడిన బృందం అవసరం ఉండవచ్చు. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడంతోపాటు లైఫ్ స్టయిల్లోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.– బులీమియా గురించి తెలుసుకోవాలి. థెరపీ సెషన్లను దాటవేయవద్దు.– ఆహారం, వ్యాయామం ప్రొఫెషనల్స్ సలహాతోనే తీసుకోవాలి.. చేయాలి.– అదే పనిగా బరువు చెక్ చేసుకోవద్దు, అద్దంలో చూసుకోవద్దు. ఈ తరహా ధోరణి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రేరేపించే ప్రమాదం ఉంది.– ఆకలిని తగ్గించే లేదా బరువును తగ్గించే సప్లిమెంట్లు లేదా మూలికల వల్ల దుష్ప్రభావాలు ఉండవచ్చు. అందువల్ల వాటికి దూరంగా ఉండాలి.– Enhanced cognitive behavior therapy ద్వారా తిండి గురించిన అనారోగ్యకరమైన నమ్మకాలు, ప్రవర్తన స్థానంలో ఆరోగ్యకరమైన నమ్మకాలు, ప్రవర్తనను పెంపొందించవచ్చు.– బులీమియాతో బాధపడుతున్న పిల్లలు, టీనేజర్ల పేరెంట్స్ ఏం చేయాలో తెలుసుకోవడానికి, పిల్లలు తినే వాటిపై నియంత్రణ తీసుకురావడానికి Family based therapy సహాయపడుతుంది.– ఒత్తిడిని తట్టుకోవడానికి, ఎమోషనల్ బ్యాలెన్స్సకి, ఇతరులతో సర్దుకుపోవడానికి డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ ఉపయోగపడుతుంది.– యాంటీడిప్రెసెంట్స్తో బులీమియా లక్షణాలను తగ్గించవచ్చు. టాక్ థెరపీతో పాటు దీన్ని ఉపయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు ఉంటాయి.– బులీమియాకు చికిత్స చేయడంలో ప్రత్యేక శిక్షణ పొందిన డైటీషియన్లు సహాయపడతారు.– బులీమియా తీవ్రంగా ఉండి.. ఇతరత్రా తీవ్రమైన ఆరోగ్య సమస్యలూ ఉంటే ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు.బులీమియా లక్షణాలు...– ఒకే సిట్టింగ్‌లో అసాధారణ రీతిలో ఆహారాన్ని అతిగా తినడం– అతిగా తినడాన్ని నియంత్రించలేకపోతున్నామని అనిపించడం– బరువు పెరగకుండా ఉండటానికి ఉద్దేశపూర్వకంగా వాంతులు చేసుకోవడం లేదా అతిగా తిన్న తర్వాత విపరీతంగా వ్యాయామం చేయడం– బరువు పెరుగుతుందనే భయంతో, అనారోగ్యకరమైన మార్గాల్లో బరువు తగ్గడానికి ప్రయత్నించడం– విరేచనాల కోసం మందులు ఉపయోగించడం– శరీర ఆకృతి, బరువు విషయంలో చాలా అసంతృప్తిగా ఉండటం– విపరీతమైన మూడ్ స్వింగ్స్‌ని కలిగి ఉండటం.బులీమియా నెర్వోసాకు బింజ్ ఈటింగ్ డిజార్డర్‌కు మధ్య తేడా.. బులీమియా నెర్వోసా ఉన్న వ్యక్తులు అతిగా తిని, ఆ తర్వాత బలవంతంగా వాంతి చేసుకుని ఆహారాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తారు. బింజ్ ఈటింగ్ రుగ్మత ఉన్న వ్యక్తులు కూడా అతిగా తింటారు, కానీ వాంతి చేసుకోరు. అలాగే, బులీమియాతో బాధపడుతున్న వ్యక్తులు సాధారణంగా ఆరోగ్యకరమైన బరువుతో ఉంటారు. బింజ్ ఈటింగ్ రుగ్మత ఉన్న వ్యక్తులు సాధారణంగా అధిక బరువు/ఊబకాయం కలిగి ఉంటారు.– సైకాలజిస్ట్ విశేష్ -
భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగేస్తున్నారా?
నీళ్లు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎంత ఎక్కువగా నీళ్లు తాగితే అంతమంచిదని అంటారు. అలా అని ఎప్పుడుపడితే అలా తాగడం మంచిది కాదని కూడా చెబతున్నారు నిపుణులు. ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగాలని..ఇలా చేస్తే మలబద్దక సమస్య ఉండదని అంటారు. ఆ తర్వాత వీలు కుదిరినప్పుడైన నీళ్లు తాగే యత్నం చేయండని అంటారు. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే బోజనం అయ్యిన వెంటనే లేదా భోజనం మధ్యమధ్యలో అదేపనిగా తాగుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదంట. ఇలా చేయడం వల్ల తలెత్తే సమస్యలు గురించి సవివరంగా చెప్పుకొచ్చారు నిపుణులు. అవేంటంటే..నీళ్లు ఆరోగ్యానికి చాలా అవసరం. దాహార్తిని తీర్చడమే కాకుండా ఆహారాన్ని చక్కగా విచ్ఛిన్నం చేసి సులభంగా జీర్ణమవ్వడంలో సహాయపడుతాయి. తద్వారా శరీరం త్వరిగతగతిన పోషకాలను సులభంగా గ్రహించగలుగుతుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం..భోజనం అయ్యిన వెంటనే నీళ్లు తాగకూడదు. దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అవేంటంటే..జీర్ణ సమస్యలు..తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఎందుకంటే ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగించి గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. గ్యాస్టిక్ రసాలు, జీర్ణ ఎంజైమ్‌లను పలుచన చేసి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుందని చెబతున్నారు. దీని వల్ల పోషకాల సహజ శోషణపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. కడుపులో ఉన్న ఆహారం నీళ్లు తాగిన వెంటనే శీతలీకరణం అయిపోతుంది. దీంతో సాధారణంగా జీర్ణం అయ్యే వ్యవధిలో మార్పులు వచ్చి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. బరువు పెరగడం..తిన్న వెంటనే నీళ్లు తాగడంతో తొందరగా ఆహారం విచ్చిన్నమయ్యి వేగంగా జీర్ణ మయ్యిపోతుంది. దీంతో వెంటనే ఆకలిగా అనిపించి..అతిగా తినడానికి దారితీస్తుంది. ఫలితంగా బరువు పెరగడం, ఓబెసిటీ వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. గుండెల్లో మంట..భోజనం చేసిన వెంటనే తాగిన నీరు జీర్ణ ఎంజైమ్‌లను పలుచన చేసి ఆమ్లత్వానికి దారితీసి గుండెల్లో మంటకు కారణమవుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ రసాయనాలు, డైజిస్టివ్ ఎంజైమ్‌లు అదనపు నీటితో కరిగించబడి ఆమ్లత్వానికి దారితీస్తుంది. దీంతో గుండెల్లో మంట వంటివి కలుగుతాయి. ఇన్సులిన్ పెరుగుదలకు..ఇలా నీళ్లు తాగడం వల్ల కొంత ఆహారం జీర్ణం కాకుండా ఉండిపోయే అవకాశం ఉంది. ఇది కాస్త కొవ్వుగా మారి శరీరంలో నిల్వ చేయడబడి ఇన్సులిన్ పెరుగుదలకు దారితీస్తుంది. దీంతో మధుమేహానికి దారితీసి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడానికి కారణమవుతుంది. ఎలా తాగడం మంచిదంటే..భోజనానికి అరగంట ముందు లేదా తర్వాత నీరు తాగడానికి సరైన సమయం అని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ భోజనం చేస్తున్నప్పుడూ ఎక్కిళ్లు వచ్చి నీళ్లు తాగక తప్పడం లేదు అనుకుంటే..తింటున్నప్పుడూ మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నీటిని సిప్ చేయండి. ఇలా చేస్తే కాస్త గొంతులో ఆహారం సాఫీగా దిగడమే కాకుండా ఆహారం మృదువుగా అయ్యి సులభంగా జీర్ణమవుతుంది. అలాగే బాగా చల్లగా ఉన్న నీటిని అస్సలు తాగొద్దు. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేసి జీర్ణమయ్యే వ్యవధిని మందగించేలా చేస్తుంది. పైగా యాసిడ్ రిఫ్లక్స్‌కి దారితీసి, టాక్సిన్ సేకరణకు దారితీస్తుంది. అలాగే ఎట్టిపరిస్థితుల్లోనూ తినేటప్పుడూ ఎరేటెడ్ డ్రింక్స్, కెఫిన్ వంటి పానీయాలను తీసుకోకండి అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: పుణే ఘటన! ఎవరిది ఈ పాపం? ఇది పేరెంటింగ్ వైఫల్యమేనా..?) -
సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌తో కలిసి బిర్యానీ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే?(ఫొటోలు)
-
మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా?
మామిడి పండ్లు తినడం వల్ల ముఖంపై మొటిమలు, గడ్డలు వస్తాయని చాలామంది చెబుతుంటారు. పాపం ఆ ఉద్దేశ్యంతోనే మామిపండు తినేందుకు భయపడుతుంటారు. నిజానికి మామిడి పండ్లకు మొటిమలకు సంబంధం ఉందా? వాటిని తినడం వల్ల వస్తాయా ? అంటే..వేసవిలో అందరూ మామిడి పండ్లంటే ఇష్టంగా తింటారు. పోషకాల రీత్యా మామిడిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. నిజానికి ఈ మామిడి ఆగ్నేయాసియాలో ఉద్భవించింది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా సాగు చేసే సాధారణ పండుగా మారింది. ఈ మామిడి తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు అందుతాయి. దీనిలో బీటా కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుందని డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నారు.ఈ బీటా కెరోటిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతుంది. అంతేగాక దీనిలో ఉండే పోషకాలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మంటను తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాంటి మామిడి పండ్లను తింటే కొందరిలో మొటిములు ఎందుక వస్తాయంటే..? అధిక చక్కెర స్థాయి, గ్లైసెమిక్ సూచిక అని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను సూచించే స్కేల్. ఇక్కడ పండ్లు, బియ్యం, ఇతర కార్బ్ రిచ్ ఉత్పత్తులు, ముఖ్యంగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అత్యధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసీయేషన్ ప్రకారం..తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం బరువు తగ్గడానికి మెటిమలు తగ్గించడానికి 91% సహాయపడుతుందని వైద్యులు తెలిపారు. ఇక్కడ మొటిమలు రక్తంలోని చక్కెర స్థాయిలతో ముడిపడి ఉందని తెలిపారు. అందులోనూ ఈ మామిడిపండ్లను చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు తెగ ఇష్టంగా తింటారు. ఇది వారు యుక్త వయసుకు చేరుకునే సమయం..సరిగ్గా ఈ టైంలోనే వారిలో సెబమ్ ఉత్పత్తి అవుతుంటుంది. దీంతో వారిలో జిడ్డు చర్మం, మొటిమలు మొదలయ్యే దశ స్లోగా మొదలవుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఈ మామిడి పండ్లు కూడా వాళ్లుగా ఇష్టంగా తినడంతో పెద్దవాళ్లు మొటిమలకి, మామిడి పండ్లకి లింక్ చేసి..అవి తినడం వల్లనే వస్తున్నాయని అనేస్తారు. వాస్తవానికి అది అపోహ అని తేల్చి చెబుతున్నారు నిపుణులు. సముతల్యమైన ఆహారం తీసుకున్నవాళ్లు హాయిగా మామిడి పండ్లను తినవచ్చని చెబుతున్నారు. ఇక్కడ మొటిమలు చర్మ పరిస్థితికి ఒక లక్షణం అనేది గ్రహించాలి. ఇక్కడ చర్మాన్ని శుభ్రంగా ఉంచుకుని, మంచి పరిశుభ్రతను పాటిస్తూ.. మొటిమలను నిరోధించే క్రీమ్‌లను ఉపయోగిస్తే..ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు. పైగా చర్మం కూడా ప్రకాశవంతంగా అందంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: గురుద్వారా సేవా కార్యక్రమంలో మోదీ! ఏంటీ లంగర్ ..?) -
ఆరేళ్లుగా పిజ్జా లాగించేస్తున్నాడు..కానీ అతను..!
పిజ్జా, బర్గర్లు వంటి ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు పదేపదే యువతను హెచ్చరిస్తుంటారు. అదీగాక పిజ్జా, బర్గర్లాంటివి ఎక్కువగా తింటే ఒబెసిటీ వచ్చే సమస్య ఎక్కువ కూడా. కానీ ఈ వ్యక్తికి పిజ్జాలంటే విపరీతమైన పిచ్చి. అతనికి అవంటే అలాంటి ఇలాంటి ఇష్టం కాదు. రోజంతా పిజ్జా ఉంటే చాలు వాటితోనే లంచ్, డిన్నర్లు కానిచ్చేస్తాడు మనోడు. ఇలా ఆరేళ్లుగా లాగించేస్తున్నాడట పిజ్జాలని. మరీ ఇంతలా తింటున్నాడు కదా అతడి ఫిట్నెస్ ఎలా ఉంటుందా..? అనే కదా సందేహం. అతడెలా ఉంటాడంటే..?అమెరికాకు చెందిన కెన్నీ వైల్డ్స్కి పిజ్జా అంటే మహా ఇష్టం. ఈ ఇటాలియన్ వంటకం అంటే కెన్నీకి ఎంతగా ఇష్టమంటే కనీసం రోజులో ఒక్కస్లేసు పిజ్జా లేకుండా గడవదు. అంతేగాదు అతడు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్లో పిజ్జా ఉంటే చాలు హాయిగా దానితోనే గడిపేస్తాడు. అతనికి అది అస్సలు బోరుగా అనిపించందట. ఈ విషయంలో అతడి భార్య కూడా సపోర్ట్ చేయడం విషయం. ఆమె కూడా అతడికి ఇష్టమైన పిజ్జాలు అతడి భోజనంలో ఉండేలా చూస్తుందట. ఆఖరికి ఆఫీస్‌లో కూడా పిజ్జాలు ఉండాల్సిందేట. చాలామంది తనలా పిజ్జాలు ఇంతలా తినలేరని ఛాలెంజ్ విసురుతున్నాడు కూడా. అంతేగాదు ఇన్‌కేస్ ఏదైనా కారణం చేత కేఫ్‌లు క్లోజ్ అయితే తన ఇంటికి చాలా దూరంలో ఉండే కేఫ్‌లు వద్దకు వెళ్లి మరీ పిజ్జాలు తింటాడట. ఇంతలా పిజ్జాలు లాగించేస్తున్న కెన్నీ చూడటానికి మాత్రం అ స్సలు లావుగా ఉంటాడు. మంచి స్మార్ట్‌గా ఫిట్నెస్గా కనిపిస్తాడు. ఇలా అతడు ఆరేళ్ల నుంచి పిజ్జాలను పిచ్చి పిచ్చిగా తినేస్తున్నా.. తాను ఫిట్‌గా హెల్తీగా ఉన్నానని ధీమాగా చెబుతున్నాడు. అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవట. వినడానికి చాలా ఆశ్చర్యం ఉంది కదూ!. "అతి సర్వత్ర వర్జయేత్" అన్న నానుడి ఇతడి విషయంలో పనికిరానిదిగా ఉంది కదా..!. నచ్చిందని అతిగా తింటే శరీరం అంగీకరించక పలు సమస్యలు రావడం జరగుతుంది. ఇతడి విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం అనేది నమ్మలేని నిజంలా ఉంది. కొన్ని సర్వేల్లో కూడా మనిషి ఇష్టమైన ఆహారం ఆరోగ్య రీత్యా సరిపడనిది అయినా ఏం చేయదని విన్నాం. బహుశా ఇదే కెన్నీ విషయంలో జరుగుతుందేమో..!.(చదవండి: వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!) -
గుడ్లు ఎక్కువగా తింటున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు!
గుడ్లు ఎక్కువుగా తింటే అస్సలు భయపడాల్సిన పనిలేదు. పైగా మీ ఆరోగ్యం పదిలం అని ధీమాగా చెబుతున్నారు వైద్యులు. అస్సలు ఆ సమస్యలు బారినపడరని అన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రకాల సమస్యలు సైతం రావని శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఆ అధ్యయనంలో బయటపడ్డ ఆసక్తికర విషయాలేంటంటే.. గుడ్డు ఎముకలు బలంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుందట. రోజుకి ఒక గుడ్డు తినడం అనేది ఎంతో మంచిదని, దీని వల్ల ఫోలేట్, బీ విటమిన్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయని అన్నారు. అలాగే ఎముకల వ్యాధి రాకుండా నివారిస్తుందని చెప్పారు. ముఖ్యంగా గుండెతో ఎముకల ఆరోగ్యం ముడిపడి ఉందనే ఆసక్తికర విషయం తమ పరిశోధనలో బయట పడిందని హువాజోంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్త తెలిపారు. అందుకోసం నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ దాదాపు 1900 మందిపై అధ్యయనం నిర్వహించింది. పరిశోధకులు గుడ్డు వినియోగం తోపాటు, వారి ఎముకల బలాన్ని కూడా అంచనా వేశారు. ఈ పరిశోధనలో పాల్గొనేవారికి గుడ్డులోని 3.53 ఔన్సుల పోషకాలు వారి తొడలు, వెన్నుముకలోని ఎముకలను దృఢంగా ఉంచాయిని తెలిపారు. వారిలో అధిక బీఎండీ స్థాయిలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో అయితే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గిందని చెప్పారు. వయసు పెరిగే కొద్ది ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. ఆ సమస్య రాకూడదంటే గుడ్డుకి మించిన తగిన పోషకాహారం లేదని ఈ పరిశోధనలో తేలిందని చెప్పారు. అలాగే ఇదే సమయంలో తగినంత పోషకాహారం లేకపోవడం, తక్కువ శారీరక శ్రమ, ధూమపానం, అధిక మొత్తంలో మద్యం సేవించడం, కొన్ని రకాల మందులు దీర్థకాలికంగా వాడడం వంటి ఇతక కారణాల వల్ల కూడా ఈ బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఎముకలను ఎలా ఆరోగ్యంగా ఉంచుతాయంటే.. గుడ్లు ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. ఇవి ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ అని పిలువబడే శారీరక ఎంజైమ్‌ల సమూహాన్ని సక్రియం చేసి, ఎముకలను బలోపేతం చేస్తుంది. ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ అనేది ప్రధానంగా కాలేయం, ఎముకలు, మూత్రపిండాలు మొదలైన వాటిలో ఉండే ఎంజైమ్‌ల సమూహం. ఇది ఎముక జీవక్రియ బయోమార్కర్ గుడ్లు తీసుకోవడం వల్ల ఏఎల్పీ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీంతో తొడ, కటి వెన్నెముక వంటి భాగాల్లోని ఎముకలను బలంగా ఉంచుతుంది. అంటే ఇక్కడ గుడ్లలో డి విటమిన్ పుష్కలంగా ఉంటుందని తేలింది. అందువల్ల దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం అంది ఎముకలు దృఢంగా ఉండేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: చెఫ్‌గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!) -
అమెరికాలో నరమాంస భక్షకుడు!
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి తెగిపోయిన మనిషి కాలు చేతబట్టుకుని రోడ్డుపై తిరుగుతూ కలకలం రేపాడు. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరలైంది. అందులో కాలిని అటూ ఇటూ ఊపుతూ, వీడియో తీస్తున్న వ్యక్తివైపు చూస్తూ ఉన్మాదిలా విరగబడి నవ్వుతూ కని్పంచాడతను. అప్పుడప్పుడు దాన్ని వాసన చూస్తూ, నోట్లో పెట్టుకుంటూ అందరినీ భయభ్రాంతులను చేశాడు. ‘దేవుడా! అతడా కాలిని తినేస్తున్నాడు’ అంటూ నేపథ్యంలో కొందరు హాహాకారాలు చేయడం కూడా వీడియోలో విన్పించింది. పట్టాలు దాటబోతూ రైలు ఢీకొని మరణించిన మహిళ తాలూకు తెగిపడిన కాలిని అలా చేతపట్టుకుని తిరిగినట్టు స్థానిక మీడియా వివరించింది. విషయం తెలిసి పోలీసులొచి్చనా అతను ఏమాత్రమూ బెదరకుండా కులాసాగా కని్పంచాడు. అతన్ని 27 ఏళ్ల రెసెండో టెలెజ్గా గుర్తించారు. మృతదేహపు కాలిని ఎత్తుకెళ్లి రైలు ప్రమాదం తాలూకు సాక్ష్యాధారాలను మాయం చేశాడన్న అభియోగాలపై అరెస్టు చేశారు. పోలీసులు తరలిస్తుండగా కూడా కెమెరాల వైపు చూస్తూ ఉత్సాహంగా చేతులూపుతూ కన్పించాడు! -
కొండచిలువలు తినడం మంచిదంటున్న శాస్త్రవేత్తలు!
ఇంతవరకు మాంసాన్ని ల్యాబ్‌లో తయారు చేయడం వంటి వాటి గురించి కథనాలు విన్నాం. దీని వల్ల శాకాహారులకు కూడా మేలు జరుగుతుంది. వారికి కావాల్సిన పోట్రీన్లు ఇలా కృత్రిమంగా తయారు చేసిన మాంసం ద్వారా అందుతుందని భావించారు కూడా. అవన్నీ పరిశోధన దశల్లో ఉన్నాయి. ఇప్పుడు అది ఇది కాదంటూ ఏకంగా కొండచిలువలనే ఆహారంగా తినమని చెబుతున్నారు. పైగా ఆరోగ్యానికి మంచిదంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఎందుకిలా అన్నారంటే.. ఇంతవరకు మనుషులు మేకలు, గొర్రెలు, కోళ్లు వంటి ఇతరత్ర మాంసాలను తినేవారు. అయితే వీటి వల్ల కేవలం వంద గ్రాములు ప్రోటీన్ మాత్రమే ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే వీటి కారణంగా గాలిలో 49.89 కిలోగ్రాముల కార్బన్డయాక్స్డ్ విడుదలవుతుందని పరిశోధనల్లో తేలిందన్నారు. అందువల్ల మాంసాహారం ఎక్కువుగా తినడమనేది పర్యావరణాని హానికరమని నొక్కి చెబుతున్నారు పరిశోధకులు. వీటికి బదులు కొండచిలువలు తినడం చాలా మంచిదని, ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. ఈ మేరకు తాము ఒక పొలంలో దాదాపు 12 నెలలపాటు పెంచిన రెండు కొండచిలువలపై జరిపిన అధ్యయనంలో తేలిందని సరీసృపాల నిపుణుడు డాక్టర్ డేనియల్ నాటుష్ చెబుతున్నారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ పలు షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఇవి నీరు లేకుండా దాదాపు నెలరోజులు జీవిస్తాయట. వీటి పొలుసుల మీద ఉండే నీటితోనే అన్ని రోజుల పాటు నీరు తీసుకోకుండా బతకగలవని అన్నారు. అలాగే దాదాపు ఒక సంవత్సరం పాటు ఏం తినకుండానే బతికేస్తాయట. అలాగే పంట బాగా పండటంలో వీటి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అన్నారు. అలాగే ఇవి తక్కువ గ్రీన్హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తాయని అన్నారు. ఇవి తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండగలవు, పైగా బ్లర్డ్ ఫ్లూ లేదా కోవిడ్ -19 వంటి వ్యాధులను వ్యాప్తి చేయవని అధ్యయనంలో వెల్లడయ్యిందని తెలిపారు. ఈ ఆసక్తికర పరిశోధన సైంటిఫిక్ రిసెర్చ్ ప్రచురితమయ్యింది. అలాగే వీటిని ఆహారంగా తీసుకుంటే మంచి ప్రోటీన్ పుష్కలంగా అందుతుందని అన్నారు. ఒక ఏడాదిపాటు సాగిన ఈ పరిశోధనలో తాము ఈ కొండచిలువలకు ఎలుకలు, చేపలు వంటి వాటిని ఆహరంగా అందించి ఎప్పటికప్పుడూ వాటి బరువుని కొలిచే వాళ్లమని చెప్పారు. అయితే ఈ రెండు పైథాన్‌లలో ఆడ కొండచిలువ వేగంగా బరువు పెరిగినట్లు పేర్కొన్నారు. వివి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కరువు ఏర్పడి పశువులు పెద్ద సంఖ్యలో చనిపోవడం జరుగుతుంది. అలాంటి సమయాల్లో మాంసాహారంగా ఈ కొండచిలువలు ప్రత్యామ్నాయంగా ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తుల. వామ్మో కొండ చిలువ తినడమమా ఏందీ వింత పరిశోధన అని భావిస్తున్నారా?. టెన్షన్ పడొద్దు ఎందుకంటే..దీనిపై ఇంకా కూలంకషంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు పూర్తి అయ్యేతే గానీ కార్య రూపం దాల్చదు. అదీగాక కొండచిలువల పెంపకం అనే విషయంలో సాధ్యా సాధ్యాలు కూడ అంచాన వేయాల్సి ఉంటుంది. (చదవండి: 'కుమారీ ఆంటీ' లాంటీ ఇన్సిడెంట్..మరీ ఇదేమవుతుందో..!) -
తాబేలు మాసం తిని తొమ్మిదిమంది మృతి.. 78 మందికి అనారోగ్యం!
ఆఫ్రికన్ దేశం టాంజానియాకు సమీపంలోని జాంజిబార్ దీవులలో తాబేలు మాంసం తిన్న తొమ్మదిమంది మృతి చెందారు. వీరిలో ఎనిమిదిమంది పిల్లలతో పాటు ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ ఘటనలో 78 మంది అనారోగ్యం పాలయ్యారు. వీరందరినీ స్థానిక అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. హానికరమని తెలిసినా సముద్ర తాబేలు మాంసాన్ని జాంజిబార్‌వాసులు ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కోసారి ఈ మాంసం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా జరిగిన ఘటన గురించి మకోని జిల్లా వైద్యాధికారి డాక్టర్ హాజీ బక్రీ మాట్లాడుతూ విషపూరితమైన ఆహారం తిన్నకారణంగా ఒక మహిళతో పాటు ఎనిమిదిమంది చిన్నారులు మృతి చెందారని తెలిపారు. మరో 78 మంది అనారోగ్యంపాలై చికిత్స పొందుతున్నారన్నారు. వీరంతా సముద్ర తాబేలు మాసం తిన్నారని లేబొరేటరీ పరీక్షల్లో నిర్ధారితమయ్యిందని తెలిపారు. ఈ ఘటన దదిమిలా ఉన్నతాధికారులు విపత్తు నిర్వహణ బృందాన్ని ఘటన జరిగిన ప్రాంతానికి పంపారు. ప్రభుత్వం సముద్ర తాబేలు మాంసాన్ని తినవద్దని అక్కడి ప్రజలను కోరింది. కాగా 2021 నవంబర్‌లో పెంబాలో తాబేలు మాంసం తిని మూడేళ్ల చిన్నారితో సహా ఏడుగురు మృతి చెందారు. ఆ సమయంలో మరో ముగ్గురు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు. -
ఇవి తింటే! బీపీ, కొలెస్ట్రాల్, షుగర్‌కు చెక్! అందానికి అందం!
మనలో చాలా మందికి కూరలు ఎక్కువగా తినే అలవాటు ఉండదు. అలాగే కూరగాయలు తినడం ఆరోగ్యకరమైన అలవాటు అని తెలిసినా, పెద్దగా పట్టించుకోరు. కార్బోహైడ్రేట్లు లేకుండా, పోషకాలు ఎక్కువగా ఉండే కూరగాయలు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. కూరగాయలు-ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కూరగాయల్లో జీర్ణశక్తికి ఉపయోగపడే పీచులు అధికంగా ఉంటాయి. కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. కాబట్టి చాలా జబ్బుల నుంచి మనల్ని కాపాడతాయి. విటమిన్-ఎ, ఇ, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఫోలిక్ యాసిడ్ కూరల్లో ఎక్కువగా దొరుకు తాయి. ఇది బరువు తగ్గేందుకు, కొలెస్ట్రాల్ నియంత్రకు దోహదపడుతుంది. బీపీ, డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఆకుకూరలు, కూరగాయలు, దుంపకూరల్లాంటివన్నంటిని మన ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరల్ని వారానికి మూడు సార్లయినా తినడం ఉత్తమం. ఈమధ్య కాలంలో మైక్రో గ్రీన్స్ వాడకం బాగా పెరిగింది. బీర,సొర, దొండ, బెండ, లేత చిక్కుళ్లు, గుమ్మడి కాయ కూరను కూడా తినాలి. క్యాలీఫ్లవర్, బ్రకోలీ లాంటివి మైక్రోవేవ్ ఓవెన్లో బేక్ చేసి ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని, కాస్త ఎక్కువ పరిమాణంలోనైనా తినొచ్చు. ఇష్టమైన వాళ్లు కూరల్లో ఉల్లి, వెల్లుల్లి కలిపితే గుండెకు మంచిది. కడుపు నిండిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇన్ఫ్లమేషన్ : ఇన్ఫ్లమేషన్ను తగ్గించుకోవాలంటే కూరగాయలు ఉత్తమమైన ఆహారం. వీటిల్లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటు అధిక బీపీతో బాధపడేవారు పోషకాలులభించే కూరగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువ పొటాషియం-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల అధిక సోడియం బాడీలోకి చేరుతుంది. ఈ నష్టాన్ని తగ్గించుకోవాలంటే బచ్చలికూర వంటి కూరగాయలు పొటాషియం, ఇతర పోషకాలు లభించే కూరగాలు తీసుకోవాలి. వీటిల్లోని ఫైబర్ కూడా గుండెకుచాలామంది. ఫైబర్: 2020-2025 ఆహార మార్గదర్శకాల ప్రకారం, 2,000 క్యాలరీల ఆహారంలో రోజుకు 28 గ్రాముల ఫైబర్ కూడ అందదు. అందుకే తృణధాన్యాలు, పండ్లు, చిక్కుళ్ళు, గింజలు ఎక్కువగా తీసుకోవాలి. చిలగడదుంపలు , బఠానీల్లో ఆపిల్ కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. కళ్ళు: రోజంతా కంప్యూటర్స్ ఫోన్ వైపు చూస్తూ ఉంటే కంటి ఆరోగ్యంమీదప్రభావం పడు తుంది. కళ్ళను రక్షించు కోవాలనుకుంటే, ఎక్కువ కూరగాయలు తినడంతోపాటు మధ్య మధ్యలో స్క్రీన్ బ్రేక్‌లు తీసుకోవడం మంచింది. తులసి, క్యారెట్లు, మొక్కజొన్న, ఎర్ర మిరియాలు, బచ్చలికూర ,బ్రోకలీలో కంటినిరక్షించే కెరోటినాయిడ్లు దొరుకుతాయి. అలాగే లుటీన్ , జియాక్సంతిన్ అనేవి రెండు కెరోటినాయిడ్లు, వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత (AMD) ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. చర్మం: చర్మ తేమగా ఉండాలంటే కూరగాయలు ఎక్కువగా తినాలి. టొమాటోల్లోని లైకోపీన్ చర్మాన్ని వడదెబ్బ నుండి రక్షించడంలో సహాయపడుతుంది అవకాడోలు ,నీటి కంటెంట్ ఎక్కువగా ఉండే దోసకాయలు ఆకుకూరలు లాంటివి చర్మంలోని తేమను, మృదుత్వాన్ని కాపాడతాయి. బ్లడ్ షుగర్ కూరగాయలలో కేలరీలు తక్కువ, ఫైబర్ , పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థం ఎక్కువ గా ఉండే దుంప కూరలుమినహా మిగిలినవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అందుకే సహజసిద్ధంగా పండించిన కూరగాలు కేన్సర్ నివారణలో పనికొస్తాయి. బ్రస్సెల్స్ మొలకలు , కాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయల్లోని యాంటీఆక్సిడెంట్టు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పొటాషియం, ఫోలేట్, విటమిన్ సి , ఫైటోకెమికల్స్, అలాగే సల్ఫోరాఫేన్ (బ్రోకలీలో అత్యధికం)లో ఎక్కువగా ఉంటాయి. మెదడు మెదడును పదునుగా ఉంచుకోవాలనుకుంటే, ఆహారంలో కూరగాయలను చేర్చుకోవడం సరైన మార్గం. కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు, మైండ్ డైట్లో కీలకం, అల్జీమర్స్ వ్యాధి, మతిభ్రమణం ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి సాయపడతాయని పరిశోధకులు తేల్చారు. యాంటీఆక్సిడెంట్లు,ఫోలేట్ మీ మెదడుకు కీలకమైన పోషకాలు. -
తిండి లేక అలమటిస్తున్న పాలస్తీనియన్లు!
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాలు గాజా సరిహద్దులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గాజాలో తలదాచుకుంటున్న పాలస్తీనియన్లు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తిండి గింజలు కరువై, ప్రాణాలు నిలుపుకునేందుకు కలుపుమొక్కలు, ఆకులు, చివరికి గడ్డి కూడా తింటూ కాలం గడుపుతున్నారని మీడియా సంస్థ అల్ జజీరా పేర్కొంది గాజాలో లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే తెలియజేసింది. దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లు తమ ఇళ్లను, జీవనోపాధిని కోల్పోయి చివరికి కడుపును కూడా నింపుకోలేని పరిస్థితికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ దాడి ఇంకా కొనసాగుతున్నందున గాజాలోని పాలస్తీనియన్లు ఆకలితో అలమటిస్తున్నారని అల్ జజీరా కరస్పాండెంట్ తారెక్ అబూ అజౌమ్ తెలిపారు. దక్షిణ గాజాలోని తలదాచుకున్న ప్రజలు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా అందుతున్న నిత్యావసర సామాగ్రిపై ఆధారపడి కాలం గడుపుతున్నారని పేర్కొన్నారు. గాజాలో 1949 నుండి సేవలు అందిస్తున్న నోబెల్ శాంతి బహుమతి పొందిన క్వేకర్ సంస్థకు చెందిన అమెరికన్ ఫ్రెండ్స్ సర్వీస్ కమిటీ జనరల్ సెక్రటరీ జాయిస్ అజ్లౌనీ మాట్లాడుతూ గాజాలో ఆకలి చావులు తీవ్ర స్థాయిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. గాజాలోని ప్రజలంతా ఆకలితో అలమటిస్తున్నారని, ఇలాంటి విపత్తు ఎన్నడూ చూడలేదని తమ సిబ్బంది చెబుతున్నారని జాయిస్ అజ్లౌనీ పేర్కొన్నారు. -
మీకు తెలుసా..? 'మిస్టర్ ఈట్ ఆల్' తను ఒక అద్భుతం!
ఈ సృష్టి ఓ అద్భుతం అనుకుంటే మనిషి అంతకుమించి అద్భుతాలు చేసి ఔరా! అనిపించుకుంటున్నాడు. ఇంతవరకు ఎన్నో వింతలు విశేషాలు చేసి ఉంటాం. అంతకు మించిన వింతలు, విడ్డూరాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇంతకీ అవేంటంటే..? ► మిస్టర్ ఈట్ ఆల్.. ఫ్రాన్స్‌కు చెంది మైఖేల్ లోటిటోకు ‘మిస్టర్ ఈట్ ఆల్’ అని పేరు. ఇతడు ఐరన్, రబ్బరు, గాజులాంటివి కూడా తినేవాడు. ఈ వింత అలవాటుతో గిన్నిస్ వరల్డ్ బుక్‌లో చోటు సంపాదించాడు. ఇనుమును ఎలక్ట్రిక్ పసర్ సా తో చిన్న చిన్న ముక్కలు చేసి తినేవాడు. పదహారు సంవత్సరాల వయసులో తొలిసారిగా గాజు గ్లాస్‌ను పగలగొట్టి తిన్నాడు. తన యూనిక్ టాలెంట్‌తో ప్రపవచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. 2007లో చనిపోయాడు. ► బ్రెజిల్ కారాగారాలలో ఖైదీలకు ఎక్సర్ సైజ్ బైక్‌లను తొక్కే అవకాశం ఇస్తారు. ఈ బైక్‌లు కరెంట్‌ను ఉత్పత్తి చేస్తాయి. ► ‘ఫేస్ బుక్’ వచ్చాక ‘అన్‌ఫ్రెండ్’ అనే మాట ప్రాచుర్యం పొందింది. అయితే 1659లో వచ్చిన ‘ది అపీల్ ఆఫ్ ఇన్జ్యుర్డ్ ఇనోసెన్స్’ పుస్తకంలో ఈ పదాfన్ని కాయిన్ చేశారు. -
పాక్‌పై ప్రాణాంతక అమీబా దాడి.. ఏడాదిలో 11 మంది మృతి!
పాకిస్తాన్ కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. పలు రాష్ట్రాల్లో ‘మెదడును తినే అమీబా’ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ‘నేగ్లేరియా ఫౌలెరి’ అని పిలిచే ఈ ఏక కణ జీవి ఇప్పటి వరకు 11 మందిని బలిగొంది. కరాచీలోని సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లో గత రెండు వారాల్లో ఈ అమీబా కారణంగా ముగ్గురు మరణించారు. తాజాగా అద్నాన్ అనే 45 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు సమాచారం. మెదడును తినే అమీబా ‘నేగ్లేరియా ఫౌలెరి’ కరాచీలో మరొకరిని బలిగొందని సింధ్ ఆరోగ్య శాఖ తెలియజేసింది. హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం మెట్రోపాలిస్‌లోని కరాచీ బఫర్ జోన్లో నివసిస్తున్న ఒక వ్యక్తి నైగ్లేరియా కారణంగా మృతి చెందాడు. దీనిగురించి సింధ్ ఆరోగ్య శాఖ ప్రతినిధి మాట్లాడుతూ బాధితుడు గత మూడు రోజులుగా జ్వరం, తలనొప్పితో బాధపడ్డాడు. పాకిస్తాన్లో ఇప్పటివరకు 11 మంది ‘నేగ్లేరియా ఫౌలెరి’ ఇన్ఫెక్షన్ (ఎన్ఎఫ్ఐ) కారణంగా ప్రాణాలు కోల్పోయారు. సింధ్ తాత్కాలిక ఆరోగ్య మంత్రి డాక్టర్ సాద్ ఖలీద్ మాట్లాడుతూ ఈ వ్యాధి విషయంలో ప్రజలు అప్రమత్తం కావాలని సూచించారు. ఇది అరుదైన ప్రాణాంతక అమీబా అని, ఇది మంచినీటి వనరులలో వృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. క్లోరినేషన్ చేయని కొలనులలో ఈతకు దూరంగా ఉండాలని ఖలీద్ నియాజ్ కోరారు. ముక్కులోకి నీరు ప్రవేశించేందుకు అవకాశమిచ్చే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఎలా సోకుతుంది? బ్రెయిన్ ఈటింగ్ అమీబా 1937లో అమెరికాలో తొలిసారిగా వెలుగుచూసింది. ఈ అమీబా కొలనులు, నదులు, కాలువలు, చెరువల్లో ఉంటుంది. ముక్కు, నోరు లేదు చెవి ద్వారా లోపలికి ప్రవేశించి మనిషి మెదడును తినేస్తుంది. ఫలితంగా మరణానికి కారణం అవుతుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు చాలా తక్కువని నిపుణుల చెప్పారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు అత్యంత అరుదుగా నమోదవుతాయి. 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా 381 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. అమెరికా, భారత్, చైనాలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: ‘యూదుల దీపావళి’ ఏమిటి? దేనిపై విజయానికి గుర్తు? -
అత్యంత క్రూరమైన ‘ఉగాండా కసాయి’ ఎవరు? మృతదేహాలతో ఏం చేసేవాడు?
కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా క్రూరమైన పాలకులు చాలామంది ఉండేవారు. ఆ క్రూరమైన నియంతలలో అతనిపేరు తప్పుక వినిపిస్తుంది. హిట్లర్ నియంతృత్వ పోకడల గురించి మనం చాలానే విన్నాం. అయితే ఇప్పుడు మనం ‘ఉగాండా కసాయి’గా పేరొందిన ఒక నియంత గురించి తెలుసుకోబోతున్నాం. ఆ నియంతకు మృతదేహాలతో జీవించడమన్నా, మనిషి మాంసం తినడమన్నా ఎంతో ఇష్టమట. ఈ ‘ఉంగాండా కసాయి’ పాలనలో లక్షలాది మంది హత్యకు గురయ్యారని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు మనం ఉగాండా నియంత ఈదీ అమీన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈదీ అమీన్ 1972లో ఉగాండాలో నివసిస్తున్న వేలాది మంది ఆసియావాసులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించించాడు. ఇదీ అమీన్ 130 కిలోలకు మించిన బరువు కలిగివుండేవాడు. ఎత్తు 6 అడుగుల నాలుగు అంగుళాలు. ఈ ‘ఉగాండా కసాయి’కి ఎవరైనా ఎదురైతే ఇక వారి పని అయిపోయినట్టే. ఈదీ అమీన్ అత్యంత క్రూరమైనవాడు. అతని పేరు చెప్పగానే జనం వణికిపోయేవారు. ఈదీ అమీన్ సహచరులు రాసిన కొన్ని పుస్తకాల్లో వెల్లడైన వివరాలు తెలిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఈ పుస్తకాల ద్వారానే ఈ నియంత ఎంత క్రూరుడో ప్రపంచానికి తెలిసింది. ఈ ఉగాండా కసాయి తన శత్రువులను హత్య చేసిన తరువాత, వారి మృతదేహాలను మరింత క్రూరంగా హింసించేవాడు. అంతే కాదు మృతదేహాలతో ఒంటరిగా గడపడమంటే ఆయనకు ఇష్టమని కొందరు తమ రచనలలో తెలిపారు. ఇది అతనికి ఎంతో ప్రశాంతతను ఇస్తుందట. ఇంతేకాదు ఆ నియంత మానవ మృతదేహాలను తినేవాడట. అలాగే వారి రక్తాన్ని తాగడాన్ని ఇష్టపడేవాడట. చిరుతపులి మాంసం కంటే మానవ మాంసమే బాగుంటుదని అమీన్ ఓ వైద్యునితో చెప్పాడట. ఇది కూడా చదవండి: ‘లాయర్ల సీనియర్ హోదా’ అంటే ఏమిటి? నిబంధనలు, అర్హతలు ఏవి? -
అంత్యక్రియలు ఆ కాలంలో అలా ఉండేవా..ప్రజలే తినేసేవారా..!
మధ్యయుగం, ప్రాచీన శిలాయుగలలో మానవుడు ఎలా ఉండేవాడు, ఏం చేసేవాడు అనేదాని గురించి నేటికి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. ఆ కాలంలో వారిలో ఎవరైన చనిపోతే ఎలా వీడ్కోలు చెప్పేవారు, ఆ మృతదేహాలను ఏం చేశారనే విషయాన్ని చేధించారు శాస్త్రవేత్తలు. నాటి మానవులు చనిపోయిన వాళ్లకి జరిపే అంత్యక్రియ విధానం గురించి చాలా షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఐరోపా అంతటా ప్రాచీన శిలాయుగంలో మానవ అవశేషాలపై శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో నరమాంస భక్షణ గురించి వెల్లడైంది. దాదాపు 15 వేల ఏళ్ల క్రితం ఐరోపాలో ఉన్న ప్రజలను మాగ్డలీనియన్‌లుగా పిలిచేవారు. వారు నరమాంస భక్షణ చేసేవారని తేలింది. అయితే ఎవ్వరైన చనిపోతే ప్రజలు వారికి వీడ్కోలు లేదా అంత్యక్రియలు నిర్వహించడానికి ఇలా చేసేవారని తెలిపారు. ఖననం చేయడానికి బదులుగా ప్రజలే ఆ మృతదేహాన్ని తినేసేవారని చెప్పుకొచ్చారు. అది అక్కడ సర్వసాధారణంగా జరిగే ప్రక్రియగా ఉండేదని అన్నారు. అందుకు సంబంధించన ఎముకలు, పుర్రెలు వంటి ఆధారాలతో సహా వెల్లడించారు. మాగ్డలీనియన్ ప్రజల సంస్కృతి, కళ, వారి సాంకేతికత నిలువెత్తు నిదర్శనం అని, వారు ఉపయోగించిన రాయి, ఎముకలపై చెక్కిన కళఖండాలే అందుకు సాక్ష్యం అని అన్నారు. ఐరోపాలో పురాతన శిలయుగంలో రెండు విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్నట్లు గుర్తించారు. కేవలం మాగ్డలేనియన్లు మాత్రమే కాక వేరే జాతి కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక మాగ్డలేనియన్లు ఐరోపాకి వాయువ్యంలో సంచరించగా, ఆగ్నేయంలో ఎపిగ్రావెటియన్ల అనే మరో జాతి ప్రజలు ఉండేవారని. వీరు కూడా తమలో ఎవరైన చనిపోతే నరమాంస భక్షణ చేసేవారని శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా వెల్లడించారు. ఈ ఇరు జాతులు అంత్యక్రియల నిర్వహించడానికి బదులు మృతదేహాలను భక్షించేవారని, అదొక ఆచారంగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఐరోపాలోని గోఫ్స్ గుహలో ఉన్న కపాల పాత్రలు, ఎముకలతో చేసిన గిన్నేలు, గ్లాసులు సాక్ష్యం అని చెప్పారు. తొలుత ఎపిగ్రావెటియన్లు చనిపోయిన వారిని పాతిపెట్టేవారని, ఆ తర్వాత మాగ్డలేనియన్లు ఉన్న ప్రాంతానికి వలస వచ్చిన తర్వాత వారి ఆచార పరంపరను ఈ జాతి వారు కొనసాగించనట్లు గుర్తించారు. నాటి మానవులు ఇంత భయానక రీతిలో అంత్యక్రియలను నిర్వహించడానికి గల కారణాలపై పరిశోధన సాగిస్తున్నట్లు పేర్కొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. (చదవండి: వాట్! సబ్బు తినడం ఇష్టమా? చివర్లో ట్విస్ట్ అదిరిపోలా..!)