సోషల్ మీడియాలో షేర్ అవుతున్న కొన్ని వీడియోలు అందరినీ తెగ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఈ వీడియోలలో కొందరి విచిత్ర విన్యాసాలే కాదు.. వినూత్న ఆవిష్కరణలు కూడా కనిపిస్తుంటాయి. వీటికితోడు ఇక జంతువులకు సంబంధించిన వీడియోలకు కొదవేలేదు. వాటికి వచ్చే వ్యూస్‌కు అంతేలేదు.
తాజాగా ఒక వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చీతా, తాబేలు ఎంతో స్నేహపూర్వకంగా ఆహారం తింటుండటాన్ని చూడవచ్చు. ఎక్స్(ట్విట్టర్)లో షేర్ అయిన ఈ వీడియోలో రెండు విభిన్నజాతులకు చెందిన జంతువులు కలివిడిగా ఉండటాన్ని చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.
చిరుతలు వేగానికి, చురుకుదనానికి పెట్టిందిపేరు. అలాగే అది మాంసాహారి అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక తాబేళ్ల విషయానికొస్తే ఇవి సాధారణంగా శాకాహార జంతువులు. నిదానంగా సాగే కార్యకలాపాలకు ప్రతీక. అయితే ఈ వీడియోలో విభిన్న స్వభావాలు కలిగిన ఈ రెండు జంతువులు ఒకే పాత్రలోని ఆహారాన్ని ప్రశాంతంగా తింటుడటాన్ని గమనించవచ్చు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 60 వేల వీక్షణలు దక్కాయి. లెక్కలేనన్ని కామెంట్లు వస్తున్నాయి. ఈ విచిత్ర స్నేహం చూసి కొందరు నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతుండగా, మరికొందరు దీనివెనుకగల కారణం తెలుసుకోవాలనుకుంటున్నామంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి?
Cheetah & tortoise share food. Those who give their food give their heart.
— Hakan Kapucu (@1hakankapucu) August 31, 2023
📽️Carson Springs Wildlife pic.twitter.com/kf4agZCXOZ
Comments
Please login to add a commentAdd a comment