same
-
రెబల్ పన్నీర్ సెల్వానికి నలుగురు పన్నీర్ సెల్వంలతో పోటీ
1973లో వచ్చిన చైనీస్ చిత్రం ‘ఎంటర్ ది డ్రాగన్’లో, బ్రూస్ లీ తన ప్రత్యర్థి హాన్‌తో అద్దాల గదిలో పోరాడుతారు. అప్పుడు పలు ప్రతిబింబాలు బ్రూస్ లీని కలవరపరుస్తాయి. తమిళనాట ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురై రెబల్‌గా మారిన ఓ పన్నీర్‌సెల్వం పరిస్థితి కూడా రామనాథపురంలో బ్రూస్లీ మాదిరిగానే పరిణమించింది. ఓ పన్నీర్‌సెల్వం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, అదే పేరుతో మరో నలుగురు తమ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఓటర్లకు ‘ఓ పన్నీర్‌సెల్వం’ విషయంలో గందరగోళం ఏర్పడనుంది. నిజానికి ఓ పన్నీర్‌సెల్వం స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ డమ్మీ అభ్యర్థులను అతని ప్రత్యర్థులు రంగంలోకి దింపినట్లు సమాచారం. ఓ పన్నీర్ సెల్వంను ఎన్నికల్లో దెబ్బతీయాలన్నదే వారి లక్ష్యమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే పేరుతో ఉన్న ఒక స్వతంత్ర అభ్యర్థికి బీజేపీ మద్దతు ఉండటం విశేషం. ఓ పన్నీర్‌సెల్వం పూర్తి పేరు ఒట్టకరతేవర్ పన్నీర్ సెల్వం. పోటీలో దిగిన ఇతర అభ్యర్థులకు పన్నీర్‌సెల్వం ఒచ్చప్పన్, ఒయ్యారం, ఒయ్యతేవర్, ఒచ్తేవర్ వంటి పేర్లు చేరి ఉన్నాయి. మెక్కిలార్పట్టి నుంచి ఓచప్పన్ పన్నీర్‌సెల్వం, రామనాథపురం నుంచి ఊయారం పన్నీర్‌సెల్వం తదితరులు కూడా బరిలోకి దిగడం గమనార్హం. -
19 అగ్నిపర్వతాలు ఏకకాలంలో పేలాయా? గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ చెబుతున్న వాస్తవం ఏమిటి?
అగ్ని పర్వతం... ఈ మాట వినిగానే భగభగ మండే అగ్నికీలల మధ్య నుంచి ఉబికివచ్చే లావా గుర్తుకువస్తుంది. అగ్ని పర్వత విస్ఫోటనం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మరి ప్రపంచవ్యాప్తంగా డజనుకుపైగా అగ్ని పర్వతాలు ఒకే సమయంలో బద్దలయ్యాయని తెలిస్తే.. అది ఊహకు కూడా అందదు. అవును.. ఇది నిజం.. ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో 19 అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందాయి. తాజాగా మరో మూడు కొత్త విస్ఫోటనాలు ఈ జాబితాలో చేరాయి. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు తెలియజేశారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్కు చెందిన గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ నూతన విస్ఫోటనాలను ట్రాక్ చేస్తుంది. గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ తాజాగా విస్ఫోటనం చెందుతున్న అగ్నిపర్వతాల జాబితాను అప్డేట్ చేసింది. ఈ జాబితా విడుదల అనంతరం పలువురు సోషల్ మీడియాలో తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. ఇటలీ, ఐస్లాండ్, జపాన్, మెక్సికో, రష్యా, ఫిలిప్పీన్స్ దేశాలలో ఒకేసారి అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అగ్నిపర్వతాలు నిరంతరం విస్ఫోటనం చెందుతుంటాయి. ఇది సాధారణమేనని అగ్నిపర్వత శాస్త్రవేత్త, సైన్స్ జర్నలిస్ట్ రాబిన్ జార్జ్ ఆండ్రూస్ ఎక్స్(ట్విట్టర్) మాధ్యమంలో తెలిపారు. ప్రస్తుతం పేలుతున్న అగ్నిపర్వతాల సంఖ్య సాధారణమేనని గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ డైరెక్టర్ బెన్ ఆండ్రూస్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం 46 విస్ఫోటనాలు కొనసాగుతున్నాయని, గత 30 సంవత్సరాలలో ఇదేవిధంగా నిరంతరం 40 నుంచి 50 విస్ఫోటనాలు జరిగాయన్నారు. 1991 నుండి ప్రతి సంవత్సరం 56 నుంచి 88 వరకూ అగ్నిపర్వత విస్ఫోటనలు జరిగాయి. 2022లో ఈ సంఖ్య 85గా ఉందని బెన్ ఆండ్రూస్ పేర్కొన్నారు. ఈ పేలుళ్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయని ఆయన అన్నారు. గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ అందించిన తాజా అప్డేట్లో జపనీస్ ద్వీపం ఐవో జిమాలోని నీటి అడుగున ఉన్న అగ్నిపర్వతం, ఐస్లాండ్లోని ఫాగ్రాడల్స్‌ఫ్జల్, రష్యాలోని క్లూచెవ్స్కోయ్లు చేరాయి. జపనీస్ అగ్నిపర్వత దీవులలోని నీటి అడుగునవున్న అగ్నిపర్వతం అక్టోబరు 30న విస్ఫోటనం చెందింది. దీని శిలాద్రవం నీటి ఉపరితలాన్ని ఛేదించి, కొత్త ద్వీపాన్ని సృష్టించింది. జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ)తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్‌లో ప్రతి రెండు నిమిషాలకు ఇవో జిమా వద్ద అగ్నిపర్వత ప్రకంపనలు నమోదయ్యాయి. రష్యాలోని క్లూచెవ్స్కాయా సోప్కా అగ్నిపర్వతం ఇటీవలే విస్ఫోటనం చెందింది. సమయంలో సముద్ర మట్టానికి 8 మైళ్ల ఎత్తుకు బూడిద ఎగజిమ్మింది. ఈ నేపధ్యంలో భద్రత దృష్ట్యా పలు పాఠశాలలను మూసివేశారు. కాగా ఫాగ్రాడల్స్‌ఫ్జల్ అగ్నిపర్వతం ఇంకా పూర్తిగా విస్ఫోటనం చెందలేదు. అయితే విస్పోటనానికి సంబంధించిన సంకేతాలు వెలువడుతున్నందున స్థానిక అధికారులు గ్రిండవిక్ పట్టణాన్ని ఖాళీ చేయించారు. అగ్ని పర్వతం ఎలా ఏర్పడుతుంది? అగ్ని పర్వతం అంటే భూమి ఉపరితలంపై ఏర్పడిన ఒక చిల్లు లేదా ఒత్తిడి కారణంగా ఏర్పడిన ఒక పగులు. దీని నుంచి వేడి మేగ్మా, బూడిద, వివిధ వాయువులు బయటకు వెలువడుతాయి. సాధారణంగా భూమిలోని టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్న చోట అగ్ని పర్వతాలు ఏర్పడతాయి. అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డులో ఇటువంటి ప్రదేశం ఉంది. దానిని మిడ్ అట్లాంటిక్ రిడ్జి అని అంటారు. ఇది రెండు టెక్టోనిక్ ప్లేట్లు దూరంగా జరగడం వల్ల ఏర్పడింది. అగ్ని పర్వతాలు ఏర్పడడానికి టెక్టోనిక్ ప్లేట్లు కదలిక ఒక్కటే కారణం కాదు. భూమి కింది భాగంలోని టెక్టోనిక్ ప్లేట్లు సాగిపోయి, పల్చబడటం కారణంగానూ అగ్ని పర్వతాలు ఏర్పడతాయి. తూర్పు ఆఫ్రికాలో ఉన్న తూర్పు ఆఫ్రికా రిప్ట్, ఉత్తర అమెరికాలో ఉన్న రియో గ్రేండి రిఫ్ట్ ఈ విధమైన అగ్ని పర్వతాలకు ఉదాహరణలు. అగ్ని పర్వతంలో ఏముంటాయి? మాగ్మా చాంబర్: ఇది భూమిలోని అట్టడుగున లావాతో, గ్యాస్ , బూడిదలతో నిండిపోయి ఉంటుంది. సిల్: పర్వతంలోని లోపలి పొరల్లోకి లావాని తీసుకెళుతుంది. డైక్: పైప్ లోని ఒక బ్రాంచ్. ఇది సిల్ వరకు లావాను చేరుస్తుంది. లావా లేయర్స్: ఇవి పర్వతంలో బూడిదతో నిండి ఉంటాయి. వీటి నుంచే బూడిద వెలువడుతుంది. అగ్ని పర్వతం పేలినప్పుడు ఈ లేయర్లలోని లావా బయటకు ఎగజిమ్ముతుంది. పారసైటిక్ కోన్: పర్వతం రగులుతున్నదశలో దీనిద్వారా లావా వెలువడి బయటకు వస్తుంది. లావా ఫ్లో: కోన్ నుంచి బయటకు లావా వెలువడుతుంది. వెంట్: ఇది పర్వతపు ముఖద్వారం. ఇది బయటకు లావాను, బూడిదను విడుదల చేసే భాగం. క్రేటర్: పర్వతం కొనలో ఏర్పడిన గొయ్యి భాగం. యాష్ క్లౌడ్: పర్వతం పేలడానికి ముందుగా వెలువడే బూడిద మేఘం. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు -
చీతాతో ఫుడ్ షేర్ చేసుకున్న తాబేలు.. తెగ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!
సోషల్ మీడియాలో షేర్ అవుతున్న కొన్ని వీడియోలు అందరినీ తెగ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఈ వీడియోలలో కొందరి విచిత్ర విన్యాసాలే కాదు.. వినూత్న ఆవిష్కరణలు కూడా కనిపిస్తుంటాయి. వీటికితోడు ఇక జంతువులకు సంబంధించిన వీడియోలకు కొదవేలేదు. వాటికి వచ్చే వ్యూస్‌కు అంతేలేదు. తాజాగా ఒక వీడియో ట్విట్టర్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చీతా, తాబేలు ఎంతో స్నేహపూర్వకంగా ఆహారం తింటుండటాన్ని చూడవచ్చు. ఎక్స్(ట్విట్టర్)లో షేర్ అయిన ఈ వీడియోలో రెండు విభిన్నజాతులకు చెందిన జంతువులు కలివిడిగా ఉండటాన్ని చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. చిరుతలు వేగానికి, చురుకుదనానికి పెట్టిందిపేరు. అలాగే అది మాంసాహారి అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక తాబేళ్ల విషయానికొస్తే ఇవి సాధారణంగా శాకాహార జంతువులు. నిదానంగా సాగే కార్యకలాపాలకు ప్రతీక. అయితే ఈ వీడియోలో విభిన్న స్వభావాలు కలిగిన ఈ రెండు జంతువులు ఒకే పాత్రలోని ఆహారాన్ని ప్రశాంతంగా తింటుడటాన్ని గమనించవచ్చు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 60 వేల వీక్షణలు దక్కాయి. లెక్కలేనన్ని కామెంట్లు వస్తున్నాయి. ఈ విచిత్ర స్నేహం చూసి కొందరు నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతుండగా, మరికొందరు దీనివెనుకగల కారణం తెలుసుకోవాలనుకుంటున్నామంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి? Cheetah & tortoise share food. Those who give their food give their heart. 📽️Carson Springs Wildlife pic.twitter.com/kf4agZCXOZ — Hakan Kapucu (@1hakankapucu) August 31, 2023 -
'ప్రధాని మోదీకి కూడా వారిలాగే..' అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు..
ముంబయి: ప్రధాని నరేంద్ర మోదీని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కొనియాడారు. దేశ రాజకీయాల్లో ఇందిరా గాంధీకి ఉన్న క్లీన్ ఇమేజ్.. మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీకి ఉందని అన్నారు. లోకమాన్య తిలక్ అవార్డ్ అందుకోవడానికి ప్రధాని మోదీ మహారాష్ట్రకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన పవార్.. ప్రధాని మోదీని కొనియాడారు. దేశంలోనే గాక అంతర్జాతీయంగా ప్రధాని మోదీకి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని అన్నారు. ప్రధాని మోదీ దేశ ప్రజల కోసం ప్రతి రోజూ 18 గంటలపాటు పనిచేస్తున్నారు. దివాళీ సందర్భంగా దేశమంతా ఇంట్లో పండగ చేసుకుంటే ఆయన మాత్రం సరిహద్దుల్లో సైన్యంతో దివాళీ జరుపుకుంటారని అజిత్ పవార్ అన్నారు. గత తొమ్మిదేళ్లుగా చూస్తున్నాం.. ప్రధాని మోదీకి ఉన్న పేరు ప్రతిష్టలు ఇంకెవరికీ లేవు అంటూ అజిత్ పవార్ మోదీని కొనియాడారు. ఇందిరా గాంధీకి అప్పట్లో ఇదే విధమైన గౌరవం దక్కింది. మళ్లీ రాజీవ్ గాంధీకి మిస్టర్ క్లీన్ అనే పేరుంది. అదే విధమైన గౌరవాన్ని ప్రధాని మోదీ పొందుతున్నారని అజిత్ అన్నారు. ఇటీవలే ఎన్సీపీని చీల్చి అధికార బీజేపీ పార్టీలో చేరిన అజిత్ పవార్.. తాజాగా ఆ విషయాన్ని ప్రస్తావించారు. నిజాన్ని మాట్లాడటంలో ఇబ్బంది ఏం లేదని చెప్పారు. అభివృద్ధే ప్రధానమని తెలిపిన అయన.. ప్రతిపక్షంలో ఉంటే సాధించలేమని అన్నారు. అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉంటే ధర్నాలు, ఆందోళనలు మాత్రమే చేయగలం.. అభివృద్ధి కాదంటూ అజిత్ పవార్ మాట్లాడారు. 'మహారాష్ట్రకు వచ్చిన ప్రధాని మోదీకి ప్రజలందరూ స్వాగతం పలికారు. నేను, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆ కాన్వాయ్‌లోనే ఉన్నాం. ఎవరు కూడా నల్ల జెండాలను చూపించలేదు. రోడ్డుకు ఇరువైపులా నిలపడి మోదీకి స్వాగతం పలికారు. దేశంలో రక్షణ పరంగా మంచి వాతావరణం ఉండాలని ఏ ప్రధానియైనా కోరుకుంటారు. మణిపూర్ అంశాన్ని ఎవరు కూడా మద్దతివ్వరు. ప్రధాని ఆ సమస్యను తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా పరిశీలిస్తోంది. మణిపూర్ అంశాన్ని అందరం ఖండిస్తున్నాం.' అని అజిత్ పవార్ అన్నారు. ఇదీ చదవండి: గణేషుడి గుడిలో అలా ప్రధాని మోదీ.. బీఆర్ఎస్ నేతపై బీజేపీ శ్రేణుల మండిపాటు -
కనివిని ఎరుగని గిన్నిస్ రికార్డు ఇది!.. బీట్ చేయలేరు..ట్రై చేయలేరు
ఎన్నో రకాల ఫీట్లు లేదా విభిన్నంగా చేసి రికార్డులు సాధించిన ప్రముఖులను చూశాం. ఓ కుటుంబం మొత్తం కలిసి గిన్నిస్ రికార్డు సృష్టించడం విన్నామా!. అసలు అలా కుదురుతుందా? పైగా ఈ రికార్డుని ఎవ్వరూ బ్రేక్ చేయలేరు. ట్రై చేయడం కూడా కుదరదు. అలాంటి ఇలాంటి రికార్డు కాదు గ్రేటెస్ట్ గిన్నిస్ రికార్డు అంటే ఇదేనేమో. ఎవ్వరూ ట్రై చేయలేనిది, సాధ్యం చేసి చూపలేని రికార్డు. ఇంతకీ ఆ కుటుంబం ప్రపంచ గిన్నిస్ రికార్డుల్లోకి ఎందుకు ఎక్కిందంటే.. పాకిస్తాన్‌కి చెందిన ఓ కుటుంబం ప్రపంచ గిన్నిస్ రికార్డులో స్థానం దక్కించుకుంది. అత్యంత అసాధారణమైన రికార్డుని సృష్టించి ఈ వరల్డ్ రికార్డుని కైవసం చేసుకుంది. పాక్‌కు చెందిన అమీర్ ఖుదేజా దంపతులు ఇద్దరు పుట్టిన తేదిలు ఒక్కటే.. సంవత్సరాలే వేరు. ఇంత వరకు ఓకే ఎందుకంటే చాలా జంటల్లో ఇలాంటివి చూశాం. అయితే వారికి పుట్టిన ఏడుగురు పిల్లలు కూడా సంవత్సరాలు మాత్రమే వేరు.. పుట్టిన తేదీలు ఒక్కటే. ఇక దంపతులు కూడా 1991లో వారి పుట్టిన తేదీ రోజునే పెళ్లి చేసుకున్నారు. ఒక కుటుంబంలోని సభ్యులందరూ పుట్టిన తేదీలు ఒకటే అయ్యి వేర్వేరు సంవత్సరాలు అంటే అత్యంత అరుదు. జరగడం అసాధ్యం. ఇక ఖుదేజాకి జన్మించిన ఆ ఏడుగురు పిల్లలు కూడా నార్మల్ డెలివిరిలో జన్మించిన వారే. పైగా అందులో ఇద్దరూ మగ కవలలు, ఇద్దరు ఆడ కవలలు, మిగతా ముగ్గురు పిల్లలు. వారి పేర్లు వరసగా.. సింధూ, అమీర్, అంబర్, ఆడ కవలలు ససూయ్, సప్నా, మగ కవలలు అమ్మర్, అహ్మర్. అందులో ఒక్కరూ కూడా ప్రీమెచ్చుర్‌గా జన్మించిన వారు కాదు. ఆమె ఏమి సీజేరియన్ ద్వారా ప్లాన్ చేసి కనింది కూడా కాదు. ఇలాంటి అత్యంత అరుదైన కుటుంబ ఉండటం అసాధ్యం అంటూ గిన్నిస్ సంస్థ నిర్వాహకులు ఈ ప్రపంచ గిన్నిస్ వరల్డ్ రికార్డు టైటిల్‌ని ఆ కుటుంబానికి ప్రధానం చేసింది. ఈ మేరకు అమీర్ మాట్లాడుతూ..తామేమి ప్లాన్ చేసుకుని కనింది కూడా కాదు. ఇదంతా అల్లా మాకు ఇచ్చిన వరం. ఇదివరకు మా పుట్టినరోజును సాధారణంగా జరుపుకునే వాళ్లం. కానీ ఇప్పుడూ చాలా వేడుకగా జరుపుకుంటున్నాం అని ఆనందంగా చెబుతున్నాడు అమీర్. (చదవండి: బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారా? ఆరోగ్యానికి మంచిది కాదా!) -
కేబుల్ ఆపరేటర్లను అనుమానిస్తున్నారు
సెటాప్ బాక్సుల ధరలు ఒకేలా ఉండాలి కేబుల్ టీవీ ఆపరేటర్ల జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు పి.గన్నవరం : ఒకొక్క కంపెనీ సెటాప్ బాక్సు ఒక్కో రకంగా ఉండడం వల్ల, కేబుల్ ఆపరేటర్లను వినియోగదారులు అనుమానిస్తున్నారని కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు అడపా వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ టీవీ ఆపరేటర్ల సమస్యలపై ఈ నెలాఖరులో విజయవాడలో రాష్ట్ర స్థాయి సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో పి.గన్నవరం నియోజకవర్గ కేబుల్ టీవీ ఆపరేటర్ల సమావేశం జరిగింది. సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు ఉలిశెట్టి బాబీ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి వెంకట్రావు మాట్లాడుతూ కేబుల్ టీవీ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్పొరేట్ కంపెనీలు విక్రయిస్తున్న సెటాప్ బాక్సుల ధరలన్నీ ఒకేలా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి, భద్రత కల్పించాలని, రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని కోరారు. కేబుల్ ఆపరేటర్లతో పే చానల్స్ నిర్వాహకులు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని విడనాడాలని సమావేశం డిమాండ్ చేసింది. వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని తీర్మానించింది. సమావేశంలో సంఘ నాయకులు ఎస్.సూర్యనారాయణ, ఇడుపుగంటి రామ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.