Pakistan Family Members Share Same Birthday Holds Guinness Record - Sakshi
Sakshi News home page

Guinness Record: ఎవర్‌ గ్రీన్‌ గిన్నీస్‌ రికార్డు ఇది! బీట్‌ చేయలేరు..ట్రై చేయలేరు

Published Wed, Jul 12 2023 7:26 PM | Last Updated on Fri, Jul 14 2023 4:43 PM

Pakistan Family Members Share Same Birthday Holds Guinness Record - Sakshi

ఎన్నో రకాల ఫీట్లు లేదా విభిన్నంగా చేసి రికార్డులు సాధించిన ప్రముఖులను చూశాం. ఓ కుటుంబం మొత్తం కలిసి గిన్నిస్‌ రికార్డు సృష్టించడం విన్నామా!. అసలు అలా కుదురుతుందా? పైగా ఈ రికార్డుని ఎవ్వరూ బ్రేక్‌ చేయలేరు. ట్రై చేయడం కూడా కుదరదు. అలాంటి ఇలాంటి రికార్డు కాదు గ్రేటెస్ట్‌ గిన్నిస్‌ రికార్డు అంటే ఇదేనేమో. ఎవ్వరూ ట్రై చేయలేనిది, సాధ్యం చేసి చూపలేని రికార్డు. ఇంతకీ ఆ కుటుంబం ప్రపంచ గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎందుకు ఎక్కిందంటే..

పాకిస్తాన్‌కి చెందిన ఓ కుటుంబం ప్రపంచ గిన్నిస్‌ రికార్డులో స్థానం దక్కించుకుంది. అత్యంత అసాధారణమైన రికార్డుని సృష్టించి ఈ వరల్డ్‌ రికార్డుని కైవసం చేసుకుంది. పాక్‌కు చెందిన అమీర్‌ ఖుదేజా దంపతులు ఇద్దరు పుట్టిన తేదిలు ఒక్కటే.. సంవత్సరాలే వేరు. ఇంత వరకు ఓకే ఎందుకంటే చాలా జంటల్లో ఇలాంటివి చూశాం. అయితే వారికి పుట్టిన ఏడుగురు పిల్లలు కూడా సంవత్సరాలు మాత్రమే వేరు.. పుట్టిన తేదీలు ఒక్కటే.

ఇక దంపతులు కూడా 1991లో వారి పుట్టిన తేదీ రోజునే పెళ్లి చేసుకున్నారు. ఒక కుటుంబంలోని సభ్యులందరూ పుట్టిన తేదీలు ఒకటే అయ్యి వేర్వేరు సంవత్సరాలు అంటే అత్యంత అరుదు. జరగడం అసాధ్యం. ఇక ఖుదేజాకి జన్మించిన ఆ ఏడుగురు పిల్లలు కూడా నార్మల్‌ డెలివిరిలో జన్మించిన వారే. పైగా అందులో ఇద్దరూ మగ కవలలు, ఇద్దరు ఆడ కవలలు, మిగతా ముగ్గురు పిల్లలు. వారి పేర్లు వరసగా.. సింధూ, అమీర్‌, అంబర్‌, ఆడ కవలలు ససూయ్‌, సప్నా, మగ కవలలు అమ్మర్‌, అహ్మర్‌.

అందులో ఒక్కరూ కూడా ప్రీమెచ్చుర్‌గా జన్మించిన వారు కాదు. ఆమె ఏమి సీజేరియన్‌ ద్వారా ప్లాన్‌ చేసి కనింది కూడా కాదు. ఇలాంటి అత్యంత అరుదైన కుటుంబ ఉండటం అసాధ్యం అంటూ గిన్నిస్‌ సంస్థ నిర్వాహకులు ఈ ప్రపంచ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు టైటిల్‌ని ఆ కుటుంబానికి ప్రధానం చేసింది. ఈ మేరకు అమీర్‌ మాట్లాడుతూ..తామేమి ప్లాన్‌ చేసుకుని కనింది కూడా కాదు. ఇదంతా అల్లా మాకు ఇచ్చిన వరం. ఇదివరకు మా పుట్టినరోజును సాధారణంగా జరుపుకునే వాళ్లం. కానీ ఇప్పుడూ చాలా వేడుకగా జరుపుకుంటున్నాం అని ఆనందంగా చెబుతున్నాడు అమీర్‌. 

(చదవండి: బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారా? ఆరోగ్యానికి మంచిది కాదా!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement