విజయం గురించి కలలు కనేవారికి...విజేతల నోటి నుంచి వచ్చిన మాటలు ఆణిముత్యాలు అవుతాయి. ఆచరణకు కొత్త మెరుగులు దిద్దుకునే పాఠాలు అవుతాయి. వరల్డ్స్ యంగెస్ట్ ఫిమేల్ చార్టర్డ్ ఎకౌంటెంట్‌గా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన నందిని అగర్వాల్ జోష్ టాక్ (ఇన్‌స్పిరేషనల్ టాక్స్)తో వ్యక్తిత్వ వికాస కోణంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన మాటలు చెబుతోంది...
నందిని అగర్వాల్‌కు ఎప్పుడూ తొందరే. పరీక్షలు ఇంకో వారంరోజుల్లో ఉంటే ‘రేపే అయితే బాగుండేది’ అనుకునేది. ఈ తొందర ఆమెను రెండు క్లాసులు జంప్ చేసేలా చేసింది. అలా అన్నకు క్లాస్‌మేట్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాకు చెందిన నందిని అగర్వాల్ పందొమ్మిది సంవత్సరాల వయసులో సీఏ ఫైనల్ పరీక్ష ఫలితాలలో (2021)లో ఆలిండియా టాపర్‌గా నిలిచింది. అన్న సచిన్ అగర్వాల్‌కు 18 ర్యాంకు వచ్చింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్‌లో ఈ అన్నాచెల్లెళ్లను ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఒకరోజు నందిని చదువుతున్న స్కూల్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ వచ్చారు. ఆ వ్యక్తి అపురూపంగా కనిపించారు. తాను కూడా గిన్నిస్‌బుక్‌లో పేరు సం΄ాదించాలని ఆ సమయంలోనే కల కన్నది నందిని. అప్పుడే ఆమె దృష్టి సీఏపై పడింది. అయితే సీఏ ఎంట్రెన్స్ కోచింగ్ సమయంలో తనను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. వారి నిర్లక్ష్యం, చిన్నచూపు తనలో మరింత పట్టుదల పెంచింది. అనుకున్న లక్ష్యాన్ని అవలీలగా సాధించి ‘ఔరా’ అనిపించింది. ‘నా విజయంలో మా అన్నయ్యది ప్రధాన పాత్ర.
మాక్ టెస్ట్‌లో నాకు అత్తరసు మార్కులు వచ్చాయి. చాలా నిరాశగా అనిపించింది. మాక్ టెస్ట్‌లోనే ఇలా ఉంటే రియల్ టెస్ట్‌లో ఎలా ఉంటుంది అని భయపడ్డాను. ఆ సమయంలో అన్నయ్య ఎంతో ధీమా ఇచ్చాడు. నువ్వు కచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోగలవు అన్నాడు. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించాయి’ అంటుంది నందిని.‘నందినిలోని నాకు బాగా నచ్చిన విషయం... బాగా కష్టపడి చదువుతుంది. ఒకవిధంగా చెప్పాలంటే చెల్లి నాకు స్ఫూర్తి. నందినిని చూసిన తరువాత నేను కూడా చదువుపై బాగా దృష్టి పెట్టాను’ అంటాడు సచిన్ అగర్వాల్.
ఇక నందిని అగర్వాల్ ‘జోష్ టాక్’లో ఆకట్టుకునే కొన్ని మాటలు...
►కొత్త వ్యక్తులు, కొత్తప్రదేశాలతో నిరంతర పరిచయం మన ప్రపంచాన్ని విస్తృతం చేస్తుంది.
► జీవితం సులభంగా సాగిపోవాలంటే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు వ్యక్తిగత స్వార్థంతో చేసే సహాయానికి విలువ ఉండదు.
► ‘నువ్వు ఇలాగే ఉంటావు. ఇది మాత్రమే సాధించగలవు’ అనే మాటలు అవతలి వ్యక్తుల నుంచి రాకుండా చూసుకోవాలి. మనం ఎలా ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి, మనం ఏది సాధించగలమో మనకు తెలిసి ఉండాలి.
► ‘నీవల్ల ఏమవుతుంది!’ అనేది ఎంతోమంది విజేతలకు సుపరిచితమైన మాట. ఆ మాటను తేలిగ్గా తీసుకొని ‘కచ్చితంగా నా వల్లే అవుతుంది’ అని వారు అనుకోవడం వల్లే విజేతలయ్యారు.
►జీవిత సత్యాలను ఎక్కడినుంచైనా నేర్చుకోవచ్చు. చివరికి ఐస్‌క్రీమ్ నుంచి కూడా! ‘ఎంజాయ్ ది లైఫ్ బిఫోర్ ఇట్ మెల్ట్స్’
► సక్సెస్‌ఫుల్ లీడర్‌లు వర్క్‌ను ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకున్న దానిపై బాగా వర్క్ చేస్తారు.
► నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే ఇతరులను ఎప్పుడూ కంట్రోల్ చేయలేవు. కలల సాధనకు కష్టాన్ని జోడించకపోతే కల కనే అర్హత కోల్పోతాం
► మన జీవితానికి హ్యాపీ వెర్షన్ ఏమిటంటే బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్లడం ∙పనిలో తప్పులో చేసినా ఫరవాలేదుగానీ ఏమీ చేయకపోవడమంత తప్పు మరొకటి లేదు.
► మనం ఎక్కువగా భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటాం. గతంలో జరిగిన పొరపాట్ల గురించి అదేపనిగా పశ్చాత్తాపపడుతుంటాం. నిజానికి మనం చేయాల్సింది... వర్తమాన జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడం.
► మీ టైమ్‌ను సేవ్ చేసుకోకపోవడం తెలియకపోతే, టైమ్ మిమ్మల్ని సేవ్ చేయదు.
కలలు అనేవి మనకు ఉన్న అతి పెద్ద ఆస్తులు. ఇతరుల అసూయ, ద్వేషాలతో అవి కరిగిపోకుండా చూసుకోవాలి.
From watching inspirational talks to giving one on Josh Talks! pic.twitter.com/ywULGdq3On
— Nandini Agrawal (@canandini19) March 4, 2023
Comments
Please login to add a commentAdd a comment