CA exam
-
బిడ్డ ఘనత : అంతులేని ఆనందంలో అమ్మ, వైరల్ వీడియో
ప్రాణానికిప్రాణంగా పెంచుకుంటున్న బిడ్డలు, తమ కలలకు ప్రతిరూపాలుగా ఎదిగితే అంతకంటే సంతోషం తల్లిదండ్రులకు ఇంకేముంటుంది. అందులోనూ కాయకష్టం చేసి మరీ చదివించుకునే బిడ్డలు తాము అనుకున్నదానికంటే మిన్నగా రాణిస్తే గుండెల్లోని ఆనందంతా తల్లి మనసు కన్నీటి ధారగా వర్షిస్తుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే మహారాష్ట్ర లోథానేలోని డోంబివిలి (తూర్పు)లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే..థానేలోని డోంబివిలి (తూర్పు)లో కూరగాయల వ్యాపారంతో జీవించే థోంబ్రే మావ్షి కుమారుడు యోగేష్ ఇటీవల చార్టర్డ్ అకౌంటెంట్ (సిఎ) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఈ శుభవార్తను తన తల్లితో పంచుకోగానే ఆమె కుమారుడిని కౌగలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. బ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి రవీంద్ర చవాన్ ఎక్స్‌లో వీడియోను పంచుకున్నారు.योगेश, तुझा अभिमान आहे. डोंबिवली पूर्व येथील गांधीनगर मधील गिरनार मिठाई दुकानाजवळ भाजी विकणाऱ्या ठोंबरे मावशींचा मुलगा योगेश चार्टर्ड अकाऊंटंट (C.A.) झाला. निश्चय, मेहनत आणि परिश्रमांच्या बळावर योगेशने खडतर परिस्थितीशी तोंड देत हे दैदीप्यमान यश मिळवलं आहे. त्याच्या या… pic.twitter.com/Mf8nLV4E61— Ravindra Chavan (@RaviDadaChavan) July 14, 2024యోగేష్, మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. బలం, దృఢ సంకల్పం, కష్టపడి ఈ అద్భుతమైన విజయాన్ని సాధించాడు అంటూ యోగేష్‌ను అభినందించారు. 45 సెకన్ల వీడియో నెటిజనుల మనసు దోచుకుంది. -
సీఏ పరీక్షలు ఇకపై ఏటా మూడుసార్లు
న్యూఢిల్లీ: ఏటా రెండుసార్లు జరిగే చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ) పరీక్షలను ఇకపై ఏటా మూడు సార్లు జరపాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఏటా మూడు సార్లు పరీక్షలు జరుగబోతున్నాయి. జనవరి, మే/జూన్, సెపె్టంబర్ నెలల్లో ఇవి జరుగుతాయి. -
19 ఏళ్లకే సీఏ..గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది
విజయం గురించి కలలు కనేవారికి...విజేతల నోటి నుంచి వచ్చిన మాటలు ఆణిముత్యాలు అవుతాయి. ఆచరణకు కొత్త మెరుగులు దిద్దుకునే పాఠాలు అవుతాయి. వరల్డ్స్ యంగెస్ట్ ఫిమేల్ చార్టర్డ్ ఎకౌంటెంట్‌గా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన నందిని అగర్వాల్ జోష్ టాక్ (ఇన్స్పిరేషనల్ టాక్స్)తో వ్యక్తిత్వ వికాస కోణంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన మాటలు చెబుతోంది... నందిని అగర్వాల్‌కు ఎప్పుడూ తొందరే. పరీక్షలు ఇంకో వారంరోజుల్లో ఉంటే ‘రేపే అయితే బాగుండేది’ అనుకునేది. ఈ తొందర ఆమెను రెండు క్లాసులు జంప్ చేసేలా చేసింది. అలా అన్నకు క్లాస్మేట్గా మారింది. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాకు చెందిన నందిని అగర్వాల్ పందొమ్మిది సంవత్సరాల వయసులో సీఏ ఫైనల్ పరీక్ష ఫలితాలలో (2021)లో ఆలిండియా టాపర్‌గా నిలిచింది. అన్న సచిన్ అగర్వాల్‌కు 18 ర్యాంకు వచ్చింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్లో ఈ అన్నాచెల్లెళ్లను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఒకరోజు నందిని చదువుతున్న స్కూల్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ వచ్చారు. ఆ వ్యక్తి అపురూపంగా కనిపించారు. తాను కూడా గిన్నిస్‌బుక్‌లో పేరు సం΄ాదించాలని ఆ సమయంలోనే కల కన్నది నందిని. అప్పుడే ఆమె దృష్టి సీఏపై పడింది. అయితే సీఏ ఎంట్రెన్స్ కోచింగ్ సమయంలో తనను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. వారి నిర్లక్ష్యం, చిన్నచూపు తనలో మరింత పట్టుదల పెంచింది. అనుకున్న లక్ష్యాన్ని అవలీలగా సాధించి ‘ఔరా’ అనిపించింది. ‘నా విజయంలో మా అన్నయ్యది ప్రధాన పాత్ర. మాక్ టెస్ట్‌లో నాకు అత్తరసు మార్కులు వచ్చాయి. చాలా నిరాశగా అనిపించింది. మాక్ టెస్ట్‌లోనే ఇలా ఉంటే రియల్ టెస్ట్‌లో ఎలా ఉంటుంది అని భయపడ్డాను. ఆ సమయంలో అన్నయ్య ఎంతో ధీమా ఇచ్చాడు. నువ్వు కచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోగలవు అన్నాడు. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించాయి’ అంటుంది నందిని.‘నందినిలోని నాకు బాగా నచ్చిన విషయం... బాగా కష్టపడి చదువుతుంది. ఒకవిధంగా చెప్పాలంటే చెల్లి నాకు స్ఫూర్తి. నందినిని చూసిన తరువాత నేను కూడా చదువుపై బాగా దృష్టి పెట్టాను’ అంటాడు సచిన్ అగర్వాల్. ఇక నందిని అగర్వాల్ ‘జోష్ టాక్’లో ఆకట్టుకునే కొన్ని మాటలు... ►కొత్త వ్యక్తులు, కొత్తప్రదేశాలతో నిరంతర పరిచయం మన ప్రపంచాన్ని విస్తృతం చేస్తుంది. ► జీవితం సులభంగా సాగిపోవాలంటే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు వ్యక్తిగత స్వార్థంతో చేసే సహాయానికి విలువ ఉండదు. ► ‘నువ్వు ఇలాగే ఉంటావు. ఇది మాత్రమే సాధించగలవు’ అనే మాటలు అవతలి వ్యక్తుల నుంచి రాకుండా చూసుకోవాలి. మనం ఎలా ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి, మనం ఏది సాధించగలమో మనకు తెలిసి ఉండాలి. ► ‘నీవల్ల ఏమవుతుంది!’ అనేది ఎంతోమంది విజేతలకు సుపరిచితమైన మాట. ఆ మాటను తేలిగ్గా తీసుకొని ‘కచ్చితంగా నా వల్లే అవుతుంది’ అని వారు అనుకోవడం వల్లే విజేతలయ్యారు. ►జీవిత సత్యాలను ఎక్కడినుంచైనా నేర్చుకోవచ్చు. చివరికి ఐస్‌క్రీమ్ నుంచి కూడా! ‘ఎంజాయ్ ది లైఫ్ బిఫోర్ ఇట్ మెల్ట్స్’ ► సక్సెస్ఫుల్ లీడర్లు వర్క్‌ను ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకున్న దానిపై బాగా వర్క్ చేస్తారు. ► నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే ఇతరులను ఎప్పుడూ కంట్రోల్ చేయలేవు. కలల సాధనకు కష్టాన్ని జోడించకపోతే కల కనే అర్హత కోల్పోతాం ► మన జీవితానికి హ్యాపీ వెర్షన్ ఏమిటంటే బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్లడం ∙పనిలో తప్పులో చేసినా ఫరవాలేదుగానీ ఏమీ చేయకపోవడమంత తప్పు మరొకటి లేదు. ► మనం ఎక్కువగా భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటాం. గతంలో జరిగిన పొరపాట్ల గురించి అదేపనిగా పశ్చాత్తాపపడుతుంటాం. నిజానికి మనం చేయాల్సింది... వర్తమాన జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడం. ► మీ టైమ్‌ను సేవ్ చేసుకోకపోవడం తెలియకపోతే, టైమ్ మిమ్మల్ని సేవ్ చేయదు. కలలు అనేవి మనకు ఉన్న అతి పెద్ద ఆస్తులు. ఇతరుల అసూయ, ద్వేషాలతో అవి కరిగిపోకుండా చూసుకోవాలి. From watching inspirational talks to giving one on Josh Talks! pic.twitter.com/ywULGdq3On — Nandini Agrawal (@canandini19) March 4, 2023 -
సీఏ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలను జూలై 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ‘ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ (ఐసీఏఐ) ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయి. షెడ్యూల్ ఇలా.. ►ఇంటర్మీడియెట్ (ఐపీసీ) కోర్సు పరీక్షలు (ఓల్డ్ స్కీమ్) గ్రూప్1– జూలై 6, 8, 10, 12. గ్రూప్2– జూలై 14, 16, 18. ►ఇంటర్మీడియెట్ (ఐపీసీ) కోర్సు పరీక్షలు (న్యూ స్కీమ్) గ్రూప్1– జూలై 6, 8, 10, 12. గ్రూప్2– జూలై 14, 16, 18, 20. ►ఫైనల్ కోర్సు పరీక్షలు (ఓల్డ్ స్కీమ్) గ్రూప్1– జూలై 5, 7, 9, 11. గ్రూప్2– జూలై 13, 15, 17, 19. ►ఫైనల్ కోర్సు పరీక్షలు (న్యూ స్కీమ్) గ్రూప్1– జూలై 5, 7, 9, 11. గ్రూప్2– 13, 15, 17, 19. ►ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ టెక్నికల్ పరీక్ష మాడ్యూల్స్ 1–4– జూలై 5, 7, 9, 11. ►ఇంటర్నేషనల్ టాక్సేషన్–అసెస్మెంట్ టెస్ట్ జూలై 5, 7 చదవండి: టీడీపీలో కలకలం: కుప్పంలో ‘జూనియర్’ జెండా! మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియెట్ ప్రవేశాలు -
ఫెయిలవుతానని సీఏ విద్యార్థి ఆత్మహత్మ
దుండిగల్: సీఏ పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయం ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ మండలం చర్చిగాగిల్లాపూర్‌కు చెందిన శోభారాణి కుమారుడు అల్లం బాల అఖిల్‌రెడ్డి (21) గుంటూరులోని మాస్టర్‌మైండ్స్ కళాశాలలో సీఏ చదువుతున్నాడు.సీఏ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయి న అఖిల్ ఇటీవల మరోసారి పరీక్ష రాశాడు. వాటి ఫలితాలు సోమవా రం వెలువడనున్నడంతో మళ్లీ పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయం తో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అఖిల్‌రెడ్డి చిన్నతనంలోనే తండ్రి భాస్కర్‌రెడ్డి మృతి చెందాడు. తల్లి శోభారాణి స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ కుమారుడిని చది విస్తోంది. ఘటనా స్థలంలో అఖిల్ రాసి సూసైడ్ నోట్ దొరికింది. అం దులో ‘‘చదువు కోల్పోయా...తండ్రిని కోల్పోయా... ప్రేమను కోల్పోయా...జీవితాన్ని కోల్పోయా... సీఏ పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో చనిపోతున్నా’’ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది