ప్రాణానికిప్రాణంగా పెంచుకుంటున్న బిడ్డలు, తమ కలలకు ప్రతిరూపాలుగా ఎదిగితే అంతకంటే సంతోషం తల్లిదండ్రులకు ఇంకేముంటుంది. అందులోనూ కాయకష్టం చేసి మరీ చదివించుకునే బిడ్డలు తాము అనుకున్నదానికంటే మిన్నగా రాణిస్తే గుండెల్లోని ఆనందంతా తల్లి మనసు కన్నీటి ధారగా వర్షిస్తుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే మహారాష్ట్ర లోథానేలోని డోంబివిలి (తూర్పు)లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే..థానేలోని డోంబివిలి (తూర్పు)లో కూరగాయల వ్యాపారంతో జీవించే థోంబ్రే మావ్షి కుమారుడు యోగేష్ ఇటీవల చార్టర్డ్ అకౌంటెంట్ (సిఎ) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఈ శుభవార్తను తన తల్లితో పంచుకోగానే ఆమె కుమారుడిని కౌగలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. బ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి రవీంద్ర చవాన్ ఎక్స్‌లో వీడియోను పంచుకున్నారు.
योगेश, तुझा अभिमान आहे.
डोंबिवली पूर्व येथील गांधीनगर मधील गिरनार मिठाई दुकानाजवळ भाजी विकणाऱ्या ठोंबरे मावशींचा मुलगा योगेश चार्टर्ड अकाऊंटंट (C.A.) झाला.
निश्चय, मेहनत आणि परिश्रमांच्या बळावर योगेशने खडतर परिस्थितीशी तोंड देत हे दैदीप्यमान यश मिळवलं आहे. त्याच्या या… pic.twitter.com/Mf8nLV4E61— Ravindra Chavan (@RaviDadaChavan) July 14, 2024
యోగేష్, మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. బలం, దృఢ సంకల్పం, కష్టపడి ఈ అద్భుతమైన విజయాన్ని సాధించాడు అంటూ యోగేష్‌ను అభినందించారు. 45 సెకన్ల వీడియో నెటిజనుల మనసు దోచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment