sucess
-
బిడ్డ ఘనత : అంతులేని ఆనందంలో అమ్మ, వైరల్ వీడియో
ప్రాణానికిప్రాణంగా పెంచుకుంటున్న బిడ్డలు, తమ కలలకు ప్రతిరూపాలుగా ఎదిగితే అంతకంటే సంతోషం తల్లిదండ్రులకు ఇంకేముంటుంది. అందులోనూ కాయకష్టం చేసి మరీ చదివించుకునే బిడ్డలు తాము అనుకున్నదానికంటే మిన్నగా రాణిస్తే గుండెల్లోని ఆనందంతా తల్లి మనసు కన్నీటి ధారగా వర్షిస్తుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే మహారాష్ట్ర లోథానేలోని డోంబివిలి (తూర్పు)లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే..థానేలోని డోంబివిలి (తూర్పు)లో కూరగాయల వ్యాపారంతో జీవించే థోంబ్రే మావ్షి కుమారుడు యోగేష్ ఇటీవల చార్టర్డ్ అకౌంటెంట్ (సిఎ) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఈ శుభవార్తను తన తల్లితో పంచుకోగానే ఆమె కుమారుడిని కౌగలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. బ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి రవీంద్ర చవాన్ ఎక్స్‌లో వీడియోను పంచుకున్నారు.योगेश, तुझा अभिमान आहे. डोंबिवली पूर्व येथील गांधीनगर मधील गिरनार मिठाई दुकानाजवळ भाजी विकणाऱ्या ठोंबरे मावशींचा मुलगा योगेश चार्टर्ड अकाऊंटंट (C.A.) झाला. निश्चय, मेहनत आणि परिश्रमांच्या बळावर योगेशने खडतर परिस्थितीशी तोंड देत हे दैदीप्यमान यश मिळवलं आहे. त्याच्या या… pic.twitter.com/Mf8nLV4E61— Ravindra Chavan (@RaviDadaChavan) July 14, 2024యోగేష్, మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. బలం, దృఢ సంకల్పం, కష్టపడి ఈ అద్భుతమైన విజయాన్ని సాధించాడు అంటూ యోగేష్‌ను అభినందించారు. 45 సెకన్ల వీడియో నెటిజనుల మనసు దోచుకుంది. -
షార్లెట్‌లో వైఎస్సార్సీపీ సిద్ధం!
నార్త్ కరోలినా షార్లెట్‌లో నిర్వహించిన సిద్ధం సభ విజయవంతమైంది. కారుమూరు శివారెడ్డి నాయకత్వములో దుష్యంత్ ఎల్లపల్లి, సతీష్ కర్నాటి, సంజీవ రెడ్డి, సబ్బసాని, సతీష్ వద్దిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏపీ సీఎం జగన్ కోసం తాము కూడా సిద్ధం అని అమెరికాలోని ప్రవాసులు ప్రకటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పడ్డ తండ్రికి తగ్గ తనయుడుగా నేను విన్నాను నేను ఉన్నాను అని, కరోనా కష్టాలను కూడా అధికమించి ప్రజలకు ఎంతో మేలు చేసిన మన ప్రియతమా ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌ని మళ్లీ గెలిపించు కోవడానికి మేము సిద్ధం అని అందరు నినదించారు. మహిళలు సైతం మేం సిద్ధం అంటూ మద్దతుగా కేరింతలు కొడుతూ.. సందడి చేశారు. జై జగన్ జై జగన్ అంటూ నినదించటంతో ఆడిటోరింలో సందడివాతావరణం నెలకొంది. వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. (చదవండి: చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వరన్‌పై మొత్తం 35 కేసులు) -
మురికివాడల్లో ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తి..నేడు సీఈవోగా రూ. 8 కోట్లు..!
మురికి వాడలో కటిక దారిద్యం మధ్య పెరిగాడు. తండ్రి మరణం, తల్లి కుటుంబాన్ని పోషించాల్సిన స్థితి. ఏకంగా ఐదుగురు సంతానం. ఒక్కరోజు కూడా కడుపు నిండా తినలేని ధీన స్థితి అయినా చదువుని నిర్లక్ష్యం చేయలేదు. తల్లి చేసే ఇడ్లీ అమ్మే వ్యాపారంలో చేదోడుగా ఉంటునే ఐఐఏం వంటి ఉన్నత చదువులు చదివాడు. చివరికీ స్వంతంగా ఓ ఫుడ్ కేటరింగ్ సర్వీస్ పెట్టి.. తనలాంటి మురికి వాడ పిల్లల్నే స్టాఫ్‌గా పెట్టుకుని కోట్లు ఆర్జిస్తున్నాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అతడెవరంటే.. చెన్నైలోని మడిపాక్కంకి చెందిన ఏలుమలై శరత్‌బాబు తల్లి, నలుగురు తోబుట్టువులతో కలసి మురికి వాడలో జీవించేవాడు. తండ్రి మరణించడంతో తల్లే కుటుంబ జీవనాధారం. తనపై ఆధారపడిని ఐదుగురు పిల్లల కడుపు నింపేందుకు ఆమె రోజుకు మూడు ఉద్యోగాలు చేయాల్సి వచ్చేది. ఇక శరత్ తన తల్లికి మురికివాడలో ఇడ్లీలు అమ్మే విషయంలో సాయం చేస్తుండేవాడు. తనతల్లి పడుతున్న కష్టాన్ని దగ్గరగా చూసిన శరత్ బాగా చదువుని ఎట్టి పరిస్టితుల్లో నిర్లక్ష్యం చేయకూడదనే నిశ్చయానికి వచ్చేవాడు. ఎందుకంటే..? తల్లి గ్రాడ్యుయేట్ అయ్యుంటే ఏదో ఉద్యోగం చేసి పోషించగలిగేది ఇన్ని పాట్లు పడేది కాదు కదా అని బాధపడేవాడు. అందుకే అతడు తినడానికి తిండి లేని ఎన్నో రాత్రుళ్లు గడుపుతూ కూడా చదవడం మాత్రం మానలేదు. అలా పదోతరగతిలో క్లాస్ టాపర్‌గా నిలిచి మంచి మార్కులతో పాసయ్యాడు. ఆ తర్వాత ప్రభుత్వ కాలేజ్‌లో ఇంటర్ పూర్తి చేసి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీలో సీటు సంపాదించుకున్నాడు. కానీ అతనికి ఆంగ్లంలో మంచి ప్రావిణ్యం లేకపోవడంతో స్నేహితుల ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా తన చదువును సాగించాడు. అలా బిట్స్ పిలానీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. వెంటనే క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే పోలారీస్ అనే కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు సరిగ్గా 30 నెలలు పనిచేసి ఇంటి అప్పులన్నీ తీర్చేశాడు. ఆ తర్వాత ఎంబీయే చేయాలనే ఆశ కలిగింది. దీంతో పోలారీస్లో ఉద్యోగం చేస్తూనే క్యాట్‌కి ప్రీపేరయ్యాడు. అలా మొదటి ప్రయత్నంలో విఫలమైన చివరికీ క్యాట్ ఉత్తీర్ణుడై అహ్మదాబాద్ ఐఐఏంలో ఎంబీఏలో చేరాడు. అక్కడ హాస్టల్ మెస్ కార్యదర్శి పదవికి ఎంపికయ్యాడు. ఇదే అతడికి ఆహారాన్ని తయారు చేసే సంస్థను నిర్వహించడం ఎలా అనేదానిపై అవగాహన ఏర్పడేలా చేసింది. ఇక విజయవంతంగా ఎంబీఏ పూర్తి చేసిన వెంటనే లక్షల ప్యాకేజీలతో ఎన్నో కార్పోరేట్ ఉద్యోగాలు వచ్చినా అటువైపుకి అసలు వెళ్లలేదు. తనలాంటి నిరుపేద యువకులకు ఉపయోగపడాలనుకున్నాడు. అందుకోసం కేవలం రూ. 2000 రూపాయలు పెట్టుబడితో ఫుడ్ కింగ్ అనే క్యాటరింగ్ సర్వీస్ మొదలుపెట్టాడు. తాను పెరిగిన మురికివాడలోనే ఓ చిన్న హోటల్ పెట్టాడు. తనలాంటి పేద యువకులని ఉద్యోగస్తులుగా పెట్టుకున్నాడు. మొదట్లో కార్పొరేట్ సంస్థలకు, బ్యాంకులకు వండి సరఫరా చేసేవాడు. ఆ తర్వాత ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వడం కూడా మొదలుపెట్టాడు. చెన్నైతో మొదలైన ఫుడ్ కింగ్ ప్రయాణం హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్ కూడా విస్తరించింది. ఇప్పుడు ఎనిమిది కోట్ల టర్నోవర్‌తో వ్యాపారాన్ని చేస్తున్నాడు. దాదాపు 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాడు. ఆ 200 మంది కూడా తనలా మురికివాడలో పెరిగిన వారే. బాల్యమంతా కటిక దారిద్య్రం మధ్యే గడిచింది. ఆ క్రమంలో లెక్కలేనన్ని అవమానాలు, చీత్కారాలు అనుభవించాడు. ఓ పక్క ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో భయాన కష్టాలు, సమస్యలు చవి చూశాడు. అయినప్పటికీ ఎన్నడూ బాబోయ్! నావల కాదని పారిపోలేదు, ఆత్మహత్య చేసుకోలేదు. తన కుటుంబాన్ని ఎలాగైన ఈ కష్టం నుంచి గట్టేక్కిస్తే చాలని తప్పన పడ్డాడు. అందుకు చదువొక్కటే మార్గం అని భావించాడు. కటిక దారిద్య్రాన్ని భరిస్తూనే ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. పైగా తన మూలలను మర్చిపోకుండా తనలాంటి వారికే జీవనోపాధి కల్పించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు శరత్ బాబు. ఇతడి కథ సమస్యలతో ఎలా పోరాటం చేయాలో నేర్పిస్తుంది. పైగా అచంచలంగా కష్టపడితే ఎప్పటికైన ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని చాటి చెబుతోంది కదూ.! (చదవండి: నటుడు అర్జున్ బిజ్లానీకి అపెండిసైటిస్ సర్జరీ! ఇది ఎందుకొస్తుందంటే..!) -
ముంబైలో యానిమల్ సక్సెస్ మీట్.. మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
రింకూ సిక్సర్ సింగ్
అహ్మదాబాద్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్.. గుజరాత్ 204 పరుగులు చేయగా.. భారీ లక్ష్యంతో కేకేఆర్ బరిలోకి దిగింది. మ్యాచ్ ముగింపు దశకు వచ్చే సరికి కోల్‌కతా ఓటమి దాదాపు ఖాయమైంది. విజయంపై ఎవరికీ ఎలాంటి అంచనాల్లేవు. ఆట ఆఖరి ఓవర్‌కు చేరింది. చివరి 5 బంతుల్లో 28 పరుగులు కావాలి. అంటే కచ్చితంగా ప్రతి బంతికీ సిక్సర్ రావాల్సిందే. ఐపీఎల్ చరిత్రలో గానీ అంతర్జాతీయ టి20ల్లో గానీ ఇది ఎప్పుడూ సాధ్యం కాలేదు. దాంతో గుజరాత్ ఆటగాళ్లు తమ గెలుపు ఖాయమైందని భావించి నిశ్చింతగా ఉన్నారు. అయితే బ్యాటింగ్ చేస్తున్న ఆ యువకుడు అందరికంటే భిన్నంగా ఆలోచించాడు. తన ఆటపై అచంచల విశ్వాసం ఉన్న అతను ఆ పరుగులు ఎందుకు సాధ్యం కావు అనుకున్నాడు. మానసికంగా కూడా ఎంతో దృఢమైన అతను బయటకు ఎలాంటి భావోద్వేగాలు చూపించలేదు. సిక్సర్ల కోసం సిద్ధమైపోయాడు. గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ ఒక్కో బంతిని వేస్తూ వచ్చాడు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు.. ఇలా బంతి స్టాండ్స్‌లోకి వెళుతూనే ఉంది. అనూహ్యం, అద్భుతం, అసాధారణం..లాంటి ఏ విశ్లేషణలకూ సరిపోని రీతిలో ఆ వీరంగం సాగింది. 6, 6, 6, 6, 6 .. ఐదు సిక్సర్లతో 30 పరుగులు రాబట్టి ఆ బ్యాటర్ జట్టును గెలిపించాడు. తన సత్తాతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆ యువకుడే 26 ఏళ్ల రింకూ సింగ్. అతను ఒక్క రోజులో స్టార్‌గా మారేందుకు ఆ ఐపీఎల్ మ్యాచ్ ఒక వేదిక అయింది. అయితే ఈ ఐదు సిక్సర్లతో మాత్రమే రింకూ గొప్ప ఆటగాడిగా మారిపోలేదు. ఈ మ్యాచ్‌కంటే ముందు కూడా అతను ఈ స్థాయికి ఎదిగేందుకు కష్టపడిన తీరు, పోరాటం, పట్టుదల అతనిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇక్కడి వరకు సాగిన అతని ప్రయాణం ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం. -మొహమ్మద్ అబ్దుల్ హాది కొంతకాలం కిందటి వరకూ క్రికెట్ అందరి ఆట. సామాన్యుడు కూడా తన ఆటతో ఉన్నత స్థాయికి చేరేందుకు మంచి అవకాశాలు మెండుగా ఉండేవి. అయితే ఐపీఎల్ కారణంగా క్రికెట్లో బాగా డబ్బు చేరడంతో అందులో అడుగుపెట్టి పైస్థాయికి చేరడం కష్టంగా మారిపోయిన పరిస్థితి. మంచి నేపథ్యం లేదా డబ్బు ఉండటం లేదా పెద్ద పరిచయాలు.. ఇలాంటివేవీ లేకుండా క్రికెట్ ప్రపంచంలో మనుగడ కష్టం. ఇది స్కూల్ క్రికెట్, అండర్ –13 స్థాయి నుంచే కనిపిస్తుంది. ఆటలో సత్తా ఉన్నా జట్టులో చోటు దక్కించుకోవడం, ప్రాథమిక దశలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశాలు రావడం అంత సులువు కాదు. ఉత్తరప్రదేశ్‌లాంటి రాష్ట్ర సంఘాల్లో ఇది చాలా చాలా ఎక్కువ. అలాంటి చోట నెగ్గాలంటే అసాధారణ ప్రతిభ ఉండాలి. ఆ ప్లేయర్ ఆటను చూసి ఇక అతనిని ఆపలేమని, అవకాశం కల్పించక తప్పదనే పరిస్థితి కల్పించాలి. ఇక్కడే రింకూ సింగ్‌లాంటి కుర్రాడు అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. తనలోని ఆట, ఆత్మవిశ్వాసమే అతడిని పైస్థాయి వరకు చేర్చింది. ఏ రకంగా చూసినా రింకూది కనీసం మధ్య తరగతి కూడా కాదు. అతని తండ్రి గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్లు సరఫరా చేసే ఉద్యోగి. అది తప్ప మరో ఆదాయవనరు లేదు. అలాంటి నేపథ్యంలో అతను క్రికెట్‌ను ఎంచుకోవడం పెద్ద సాహసమే. తండ్రి కూడా ఫలానాది చేయమని, వద్దని వారించే స్థితిలో లేడు. దాంతో చిన్న వయసులోనే అన్నీ తానై రింకూ సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. కొందరు మిత్రుల కారణంగా క్రికెట్ వైపు ఆకర్షితుడైన రింకూ కొద్ది రోజుల్లోనే అద్భుత ఆటగాడు అనే దశకు చేరాడు. తన నేపథ్యం కారణంగా స్కూల్ క్రికెట్ ఆడే అవకాశం అతనికి రాలేదు. కానీ క్లబ్ క్రికెట్లో రింకూ అనే ఒక కుర్రాడు ఉన్నాడని, భారీ షాట్లతో విరుచుకుపడతాడనే గుర్తింపు వచ్చింది. మరోవైపు సహజంగానే రోజూవారీ ఖర్చులకు సంబంధించి సమస్యలు వద్దనుకున్నా తోడొచ్చాయి. తనూ ఏదైనా పని చేస్తే తప్ప తనకూ, ఇంటికీ ఉపయోగపడలేడని అర్థమైంది. క్రికెట్ ఆడే టైమ్ మినహా తతిమా సమయాల్లో ఎలాంటి పని దొరికినా చేయడానికి సిద్ధపడ్డాడు. ఒక కోచింగ్ సెంటర్లో చిన్న చిన్న పనులతో పాటు స్వీపర్‌గా ఆఫీస్‌ను శుభ్రం చేసే పని కూడా చేశాడు. అయితే ఏనాడూ అతను ఈ విషయంలో చింతించలేదు. ఎట్టి పరిస్థితుల్లో తన క్రికెట్ ఆట మాత్రం ఆగకూడదని ఆశించాడు. తన భవిష్యత్తుపై గట్టి నమ్మకం ఉంచాడు. అలా మొదలైన ఆట.. రింకూ దూకుడైన ఆట గురించి యూపీ క్రికెట్ వర్గాల్లో బాగా చర్చకు వచ్చింది. దాంతో 2013లో తొలిసారి యూపీ అండర్–16 జట్టులో చోటు లభించింది. ఆ ఎంపికతో అధికారికంగా అతని ఆటకు ఆమోద ముద్ర పడింది. ఆ తొలి అవకాశాన్ని అతను వృథా చేసుకోలేదు. బంతిని చూడటం, బలంగా బాదడం.. తనకు తెలిసిన విద్యనే అంతటా ప్రదర్శించి యూపీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా యూపీ అండర్–19 టీమ్‌లోకి రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. దేశవ్యాప్తంగా అందరి దృష్టీ ఉండే అండర్–19 స్థాయికి వచ్చాక రింకూ ప్రదర్శనలే అతని విలువేంటో చూపించాయి. ఆపై వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేని రీతిలో రింకూ ఆట సాగింది. మరోవైపు అండర్–16 స్థాయి నుంచే తనకు డైలీ అలవెన్స్‌ల రూపంలో వచ్చే చిన్న చిన్న మొత్తాలను కూడా పొదుపు చేసుకుంటూ.. ఇంటి ఖర్చుల కోసం దాచుకునే విషయంలో సగటు దిగువ మధ్య తరగతి మనస్తత్వాన్నే అనుసరించాడు. భారీ షాట్లు కొట్టడం, ఏ బౌలర్‌నైనా లెక్క చేయకుండా ఆధిపత్యాన్ని ప్రదర్శించడం, కీలక సమయాల్లో కూడా ఒత్తిడి లేకుండా ఆడటం వంటి అర్హతలు రింకూ స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఈ క్రమంలో 17 ఏళ్ల వయసులోనే యూపీ సీనియర్ వన్డే జట్టులో, టి20 టీమ్‌లో చోటు సంపాదించుకున్నాడు. త్రిపురతో జరిగిన వన్డేలో 44 బంతుల్లోనే 91 పరుగులు బాదడంతో అతను నిలబడగలడనే నమ్మకం కలిగింది. రెండేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం రావడంతో దేశవాళీ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో రింకూ ప్రధాన ఆటగాడిగా మారిపోయాడు. ఐపీఎల్ ప్రస్థానం.. తమ టీమ్‌లోకి తీసుకునేందుకు ఐపీఎల్ జట్లు టాలెంట్ సెర్చ్ క్యాంప్‌లు నిర్వహిస్తుంటాయి. అందులో భాగంగా ముంబై ఇండియన్స్ కూడా సెలక్షన్స్ ఏర్పాటు చేసింది. ఒక మ్యాచ్‌లో 18 ఏళ్ల రింకూ 31 బంతుల్లోనే 95 పరుగులు బాది సంచలనం సృష్టించాడు. చివరకు వేర్వేరు కారణాలతో ముంబై అవకాశం ఇవ్వకపోయినా కొద్దిరోజులకే అతని ప్రతిభ గురించి తెలిసిన పంజాబ్ జట్టు రూ. 10 లక్షలకు రింకూను సొంతం చేసుకుంది. తర్వాతి సీజన్లోనే 2018లో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 20 లక్షల కనీస విలువతో అతను బరిలో నిలవగా, నాలుగు రెట్లు ఎక్కువగా రూ. 80 లక్షలకు కోల్‌కతా ఎంచుకుంది. ఇదే అతని కెరీర్లో మేలి మలుపు. తొలి మూడు సీజన్లలో తగినన్ని అవకాశాలు రాకపోయినా 2022లో ఫినిషర్‌గా ఇచ్చిన పాత్రలో అతను చెలరేగిపోయాడు. ముఖ్యంగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో 40 పరుగులు చేయడంతో అతని విలువ తెలిసింది. ఈ సీజన్లోనైతే తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యేక ముద్ర వేసిన రింకూ కేకేఆర్ తరఫున టాప్‌స్కోరర్‌గా నిలవడం విశేషం. ఇదే ఆట రింకూకు భారత టి20 జట్టులో చోటు కల్పించగా అక్కడ చెలరేగిపోయిన ఈ యూపీ బ్యాటర్ 2024 టి20 వరల్డ్ కప్ కోసం తన అవకాశాలు మెరుగుపరచుకున్నాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 6 ఇన్నింగ్సే ఆడిన రింకూ 96 బంతుల్లోనే 180 పరుగులు సాధించాడు. ఇందులో 134 పరుగులు ఫోర్లు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి. హాస్టల్ సౌకర్యం కల్పించి.. భారత జట్టు క్రికెటర్‌గా ఎదిగినా రింకూ తన మూలాలను మర్చిపోలేదు. డబ్బు విలువ బాగా తెలిసినవాడిగా దానిని సమర్థంగా వాడుకోవడం కూడా ముఖ్యమని భావించాడు. ముందుగా తన ఇంటి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిన అనంతరం అతను చేసిన పని రింకూపై మరింత గౌరవాన్ని పెంచింది. తన స్వస్థలమైన అలీగఢ్‌లో.. తాను ఓనమాలు నేర్చుకున్న కోచింగ్ సెంటర్లో క్రికెట్ నేర్చుకునేందుకు వచ్చే పేద ఆటగాళ్ల కోసం రూ. 50 లక్షలు వెచ్చించి.. హాస్టల్ బిల్డింగ్ కట్టించాడు. ఆట కోసం వచ్చి.. భారీ అద్దెలు కడుతున్నవారి కోసమే ఈ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు అతను చెప్పాడు. -
కిన్‌సుగీ.. ఫెయిల్యూర్స్‌ని అంగీకరించే ఒక సక్సెస్ స్టోరీ!
శోభనా సమర్థ్.. ఒకప్పటి బాలీవుడ్ నటి, దర్శకురాలు, నిర్మాత. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ యాక్ట్రెస్ కాజోల్‌కి అమ్మమ్మ. ఒకసారి కాజోల్.. వాళ్లమ్మమ్మ బుగ్గలు పట్టుకుని ‘అమ్మమ్మా.. ఎంతందంగా ఉంటావే!’ అంటూ ముద్దు చేసిందట. ‘కారణమేంటో తెలుసా?’ అని అడిగిందట అమ్మమ్మ. ‘తెలీదు.. చెప్పూ’ అందట కాజోల్. ‘వికారంగా ఉన్న ఈ ముక్కే’ అందట అమ్మమ్మ తన ముక్కును చూపిస్తూ. అవాక్కయిందట మనవరాలు. ‘ఈ చిన్న ఇంపర్ఫెక్షనే లేకపోతే నేనసలు అందంగా కనిపించేదాన్నే కాను’ అందట చిన్నగా తలెగరేస్తూ! ఆ ఆత్మవిశ్వాసానికి అబ్బురపడుతూ కాజోల్.. వాళ్లమ్మమ్మ మొహంలోకి పరిశీలనగా చూసిందట మొదటిసారి. నిజమే ఆవిడ చెప్పినట్టుగా ఆమె మొహానికి ముక్కే మైనస్ అని గ్రహించిదట కాజోల్. ‘అలా ఎలా మేనేజ్ చేశావ్ అమ్మమ్మా’ అని అడిగిందట ఆశ్చర్యపోతూ! ‘మేనేజ్ చేయలేదు. యాక్సెప్ట్ చేశా. నా ముక్కును. ఇంపర్ఫెక్షన్ మేక్ యూ మోస్ట్ బ్యూటిఫుల్ అని నమ్మాను.అంతే నా అందంలో ముక్కూ అమరింది. నా అభినయంలో పార్ట్ అయింది’ అని చెప్పిందట. అక్కడితో ఆ సీన్ ఎండ్ అవలేదు. మనవరాలి తెరంగేట్రానికి బోలెడు స్ఫూర్తినిచ్చింది. అమ్మమ్మ మాటనే ఆచరణలో పెట్టి.. ఇంపర్ఫెక్షన్ని పర్ఫెక్ట్గా యాక్సెప్ట్ చేసే వారసత్వాన్ని పంచింది. ఎలాగంటే.. కాజోల్ రెండు కనుబొమలు కలుసుకుంటాయి. జీవితంలో దీన్ని దురదృష్టానికి ముడిపెడితే.. స్క్రీన్ మీద లుక్స్‌కి లంకె పెట్టారు. యూనీబ్రోతో స్క్రీన్ అపియరెన్స్ బాలేదు.. థ్రెడింగ్ చేయించుకో అని కాజోల్ ఆప్తుల నుంచి దర్శకనిర్మాతల దాకా అందరి దగ్గర్నుంచీ ఒత్తిడి వచ్చింది ఆమెకు. కానీ అమ్మమ్మ చెప్పిన మాటను మరచిపోలేదు కాజోల్. ఆచరణలో పెట్టింది. వేషాలు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు కానీ థ్రెడింగ్ ముచ్చటే లేదు అని తెగేసి చెప్పింది. సణుగుతునే వేషాలు ఇచ్చారు. హిట్ అయింది. ఆ యూనిబ్రో ఆమె యూనిక్ స్టయిల్ అయింది. తర్వాత ఎందరో అమ్మాయిలు ఆ స్టయిల్‌ను ఫాలో అయ్యేలా చేసింది. శారీరక లోపాన్ని అందంగా మలచుకోవడం అంటే ఇదే! ∙∙ ఒక అజేయుడి గురించీ చెప్పాలి. బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకోసారి గుర్తు చేసుకుందాం. అతను ఈతగాడు. పేరు మైఖేల్ ఫెల్ప్స్. అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెడ్డీ) బాధితుడు. ఈతలో ఎవరూ పోటీపడలేనంత ముందుకు వెళ్లాడు. విషయం ఏంటంటే చిన్నప్పుడు అంటే మైఖేల్‌కి ఏడేళ్లున్నప్పుడు మొహానికి తడి తిగిలితే చాలు చిరాకుపడిపోయేవాడట. వాళ్లమ్మ డెబ్బీ ఫెల్ప్స్ అబ్బాయిని స్విమ్మింగ్ పూల్‌లోకి తోస్తే మొహానికి తడి అంటకుండా ఈదడం నేర్చుకున్నాడట. కానీ దేనిమీదా ఏకాగ్రత ఉండేది కాదు. ఇల్లు పీకి పందిరేయడంలో దిట్ట. స్కూల్ నుంచీ మైఖేల్ మీద బోలెడు కంప్లయిట్స్ వచ్చేవి.. బాబు దేని మీద ఫోకస్ చేయట్లేదు అంటూ! అసలు వీడి ప్రాబ్లం ఏంటీ అని వాళ్లమ్మ.. కొడుకును డాక్టర్ దగ్గరకు తీసుకెళితే.. అప్పుడు తేలింది మైఖేల్‌కి ఏడీహెచ్‌డీ ప్రాబ్లం ఉందని! ఆనాటికి అతని వయసు 9 ఏళ్లు. చదువంటే ఇష్టపడేవాడు కాదు. కొడుకు సమస్య ఏంటో అమ్మకు తెలిసింది. ఏది చేయలేడో దాన్ని వదిలేసింది. చేయగల దాని మీద దృష్టి పెట్టింది. అప్పుడు గ్రహించింది.. స్విమ్మింగ్ పూల్‌లో గంటలు గంటలు ఈతకొట్టగలడని. ఫోకస్ లేని ఆ మైండ్‌ని దార్లో పెట్టేది నీళ్లే అని అర్థమైంది ఆమెకు. పిల్లాడికున్న ఏడీహెచ్‌డీని జయించడానికి ఈతను మించిన ఆయుధం లేదని ఫిక్స్ అయిపోయింది. ఫలితం..ఒలింపిక్స్‌లో 28 పతకాలు (అందులో 23 బంగారు పతకాలే), 7 వరల్డ్ రికార్డులు. మానసిక లోపాన్ని జయించడం అంటే ఇదే! ∙∙ వీటిని గెలుపు గాథలుగా వివరించ లేదు. లోపాలను గ్రహించి.. వాస్తవాన్ని అంగీకరించి.. వాటిని తమకు అనుకూలంగా మలచుకుని వాటితోనే జీవితాన్ని ఆస్వాదించి ఆనందంగా సాగిన వ్యక్తులను పరిచయం చేశాం. అనుభవంలోకి వచ్చిన పరిస్థితులను ఒప్పుకోవడానికి చాలా శక్తి కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనలో ఉన్న ఇతర పాజిటివ్ కోణాల నుంచి! ఎప్పుడైతే మనలోని మైనస్‌నే ప్రపంచం చూస్తూ పాయింట్ అవుట్ చేస్తుందో అప్పుడు మనకు ఈ స్ట్రెంత్ అవసరం అవుతుంది. ఆ మైనస్‌ను మెదడు అట్టడుగుపొరల్లోకి నెట్టేసి.. అట్టడుగున ఉన్న ప్లస్‌ని బయటకు తెచ్చి ప్రపంచం ఫోకస్‌ను ఆ పాజిటివ్ పాయింట్ మీదకు మరల్చాలంటే ముందు మైనస్‌ను అంగీకరించగలగాలి గౌరవంగా! ఇదే ఇంపర్ఫెక్షన్ని శక్తిగా మలచుకోవడమంటే! దీన్నే జపాన్‌లో కిన్‌సుగీ అంటారు. వైఫల్యంతో సఫలమవడమెలాగో నేర్పించడమే దాని తత్వం. ఫ్యాట్ లుక్‌తోనే హిట్స్ ఇచ్చి ట్రెండ్‌సెట్ చేసింది! జీరో సైజ్ ట్రెండ్‌గా ఉన్న బాలీవుడ్లో తన ఫ్యాట్ లుక్‌తోనే హిట్స్ ఇచ్చి ఆ ట్రెండ్‌ని మార్చేసింది విద్యాబాలన్. ‘లావు కదా.. మోడరన్ డ్రెసెస్ అంతగా సెట్ కావు ఆమెకు’ అంటూ పెదవి విరుస్తున్న ఇండస్ట్రీలో చీరల్లోనే కనిపిస్తూ నటననే కాదు గ్లామర్‌నూ పండించింది. వాస్తవానికి బ్యూటీ ఎక్స్‌పర్ట్‌ల అభిప్రాయం ప్రకారం విద్యాబాలన్.. ఇంపర్ఫెక్షన్ల పుట్ట. హార్మోన్ అసమతుల్యత వల్ల ఆమెకు సమస్యలు వచ్చాయి. వాటిని బహిరంగంగానే చెప్పింది. తను ఎలా ఉందో అలాగే స్క్రీన్ మీద కనిపిస్తోంది.. మేకప్తోగానీ.. సర్జరీలతోగానీ కరెక్షన్స్‌కు వెళ్లకుండా! ఫర్ఫెక్షన్కి కొలమానం లేదు పర్ఫెక్షన్ అనేదానికి ప్రామాణికం లేదు. ఒకరికి పర్ఫెక్ట్గా అనిపించింది మరొకరికి అనిపించకపోవచ్చు. అందుకే ఎవరి ప్రమాణాలనో ప్రామాణికంగా తీసుకుని పర్ఫెక్షన్ అనే మాయలో పడను. నా శరీరాకృతి విషయంలో చాలా విమర్శలనే ఎదుర్కొన్నాను. నా మీద నాకు ప్రేమ ఎక్కువే. ఆత్మవిశ్వాసమూ అంతకంటే ఎక్కువే. అందుకే నన్ను నేను కాన్ఫిడెంట్‌గా క్యారీ చేసి విమర్శించిన వాళ్లచేతే గ్లామర్ క్వీన్‌గా మెప్పు పొందాను అని అంటోంది ఇలియానా. వాల్ట్ డిస్నీ.. అతని కెరీర్ మొదట్లో ‘క్రియేటివిటీ లేదు.. పాడు లేదు.. నువ్వు పనికిరావు పో’ అన్నారట. ఆరోజు అతను ఆ మాటను పట్టించుకుని కుంగిపోయుంటే ఈ రోజు ప్రతి తరంలోని పిల్లలు సంతోషంతో పరవళ్లు తొక్కే మిక్కీ మౌస్, డొనాల్డ్ డక్ క్యారెక్టర్స్ పుట్టేవే కావు. కేట్ బాస్వర్త్ ఈ అమెరికన్ నటికి జన్యపరమైన కారణాల వల్ల ఒక కనుపాప తేనె రంగులో, ఇంకో కనుపాప నీలం రంగులో ఉంటాయి. ఆ లోపాన్నే గ్లామర్ ప్రపంచంలో తన ప్రత్యేకతగా చాటుకుంది. ‘ద గోల్డెన్ గర్ల్ ఆఫ్ వెల్నెస్’ కాన్‌డీస్ కూమై గురించి నాలుగు మాటలు.. ‘కిన్‌సుగీ వెల్నెస్ ద జపనీస్ ఆర్ట్ ఆఫ్ నరిషింగ్ మైండ్, బాడీ అండ్ స్పిరిట్’ రచయిత కాన్‌డీస్ కూమై స్వస్థలం అమెరికాలోని కాలిఫోర్నియా. తల్లి జపాన్ దేశస్థురాలు. తండ్రి అమెరికాలో స్థిరపడిన పోలండ్ దేశస్థుడు. ఈ నేపథ్యం వల్ల అమెరికాలో కూమై చాలా వివక్షనే ఎదుర్కొంది. కిన్‌సుగీని ప్రాక్టీస్ చేయడం వల్లే తట్టుకుని నిలబడగలిగాను అని చెబుతుంది. కూమై.. షెఫ్‌గా చాలా ప్రసిద్ధి. మాజీ మోడల్, రచయిత, జర్నలిస్ట్, ఆర్ట్ డైరెక్టర్, పాడ్‌కాస్ట్ హోస్ట్, ఫొటోగ్రాఫర్ కూడా! ప్రముఖ ఎల్ మ్యాగజైన్ ఆమెకు ‘ద గోల్డెన్ గర్ల్ ఆఫ్ వెల్నెస్’ అనే బిరుదునిచ్చింది పూర్వాపరాల్లోకి వెళితే.. నిజానికి కిన్‌సుగీ అనేది ఒక కళ. ఆర్ట్ ఆఫ్ రిపేర్. కిన్‌సుగీ అంటే గోల్డెన్ రిపేర్ లేదా గోల్డెన్ జాయినరీ. పగిలిపోయిన పింగాణీ పాత్రలను బంగారు లేదా వెండి వర్ణంతో అతికించే కళ. పగిలిపోయినవాటిని అతికిస్తే అవి మునుపటి రూపానికి రావు. ఆ పగుళ్లు సన్నగా.. ఎగుడు దిగుడుగా కనిపిస్తాయి. కాబట్టి ఆ అతుకును బంగారం, వెండి లేదా ప్లాటినం ద్రావకాలతో అద్దుతారు. దాంతో ఆ పాటరీ ఆ అతుకులతోనే అందంగా.. ఆకర్షణీయంగా.. ప్రత్యేకంగా కనిపిస్తుంది. కిన్‌సుగీని జలపాతాలు.. నదులు.. మైదానాలతో పోలుస్తారు. ఎందుకంటే అవి రకరకాల రూపాల్లోకి ఒదుగుతూ అందంగా కనిపిస్తుంటాయి కదా! ఈ కళ.. ‘మొత్తైనై’ అంటే ‘అయ్యో వృథా అయిపోయిందే’.. ‘ముషిన్’ అంటే ‘మార్పును అంగీకరించడం’ అనే భావనల్లోంచి పుట్టింది అని చెబుతారు. అందుకే మూలం కన్నా కొత్తగా.. అరుదైన అందమైన దాన్నిగా మలచే కళగా కిన్‌సుగీ విరాజిల్లుతోంది. ఈ కళ ఎప్పుడు మొదలైంది? 15వ శతాబ్దంలో మొదలైంది. అషికాగా యోషిమాసా అనే సైనికాధికారి చైనా నుంచి పింగాణీ టీ పాత్రను తెప్పించుకున్నాడు. అందంగా ఉండే ఆ పాత్ర అంటే అతనికి ఎంతో ఇష్టం. ఒకసారి అది అతని చేతిలోంచి జారి కిందపడి పగిలిపోయింది. దాన్ని అతికించివ్వమని చైనాకు పంపాడు. అతికించి చైనీయులు తిరిగి పంపారు. అష్టవంకరలు కనిపించేలా అతికించిన ఆ పాత్రను చూసి ఏడ్చినంత పనిచేశాడట అషికాగా యోషిమాసా. తమ దగ్గరున్న కళాకారులను పిలిచి.. ఆ టీ పాత్రను చూపిస్తూ.. ‘మీరేం చేస్తారో తెలియదు.. ఈ అతుకులకు కొత్తందం తీసుకురావాలి’ అని ఆజ్ఞాపించాడట. చిత్తమంటూ వాళ్లు చిత్తగించి.. రకరకాల ప్రయోగాలు చేసి.. చివరకు బంగారు ద్రావకంతో ఆ పగుళ్లను అద్దారు. అంతే ఆ పాత్ర ప్రత్యేక అందాన్ని సంతరించుకుంది. దాన్ని చూసిన అషికాగా యోషిమాసా మొహంలో ఆనందం పరచుకుంది. అప్పటి నుంచి ఆ అద్దకం ఆర్ట్‌గా మారింది. తర్వాత కాలంలో ఆ కళను జీవితానికీ అన్వయించుకోవడం మొదలుపెట్టారు జపనీయులు. అనుభవంలోకి వచ్చిన పరిస్థితులు.. బాధలను విశ్లేషించుకోసాగారు. ఆ విశ్లేషణ వాళ్లను వాస్తవాన్నించి పారిపోకుండా.. అంగీకరించి ముందుకు కదిలే స్థైర్యాన్నిచ్చింది. అలా భయంలోంచి ధైర్యానికి సాగుతున్న ఆ ప్రయాణంలో దాగున్న ఆనందాన్ని పట్టుకున్నారు వాళ్లు. ఆస్వాదించడం ప్రారంభించారు. దాంతో సమస్యలను చూసే వాళ్ల దృష్టికోణమే మారిపోయింది. ఇది కదా బతకడం అంటే అనే గ్రహింపుకి వచ్చేశారు. అదిగో అప్పుడే కిన్‌సుగీ ఓ తత్వంగానూ మారి స్థిరపడింది. లోపాలను స్వీకరించి.. వాటిని అందంగా మలచుకుని ఆత్మవిశ్వాసంతో సాగిపోవడమే ఈ జీవన కళ ఉద్దేశం. లోపాలు వరాలు ఎవరమైనా పర్ఫెక్షన్ కోసమే పాకులాడుతాం. అహాన్ని సంతృప్తిపరచుకోవడానికో.. కీర్తి కోసమో.. ఆరోగ్యం విషయంలోనో ఆ పర్ఫెక్షన్ని సాధించాలనుకుంటాం. జీవితంలో ఉత్కృష్టమైన వాటి గురించే కథలుగా చెప్పుకుంటాం. కానీ వైఫల్యాలను చెప్పుకోం. బలహీనతలను బయటపెట్టుకోం. తప్పులను దాచేస్తాం. బంధాలు.. అనుబంధాల్లోని అరమరికలను ఒప్పుకోం. ఎవరూ ఎందులోనూ పర్ఫెక్ట్ కాదు అనే నిజం తెలిసినా నిర్లక్ష్యం చేస్తాం. అసలు తప్పులు చేయడంలో.. తప్పుగా ప్రవర్తించడంలోనే అందరం ఎక్స్పర్ట్స్మి. ప్రశంసించాల్సింది ప్రతిభను కాదు. బలహీనతలను.. గాయాల తాలూకు మచ్చలను.. పొరపాట్లను చూపించుకునేందుకు చేస్తున్న ధైర్యాన్ని మెచ్చుకోవాలి. కానీ ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తాం. ఎదుటి వాళ్లను చూసి ప్రమాణాలను ఏర్పరచుకుంటాం. ప్రతికూల ఫలితాలకు భయపడతాం. మంచి, చెడు ఏ అనుభవమైనా అక్కరకొచ్చేదే. ఏదీ వృథా కాదు. కాస్త మనసుపెడితే లోపాలు.. వైఫల్యాలు వరాలుగా తోస్తాయి. ఫెయిల్యూర్స్ మన ఆత్మస్థైర్యాన్ని వెలికితీస్తాయి.. మరింత శక్తిమంతంగా నిలబెడతాయి. పింగాణీ పాత్ర పగులుకు ఎలాగైతే బంగారు ద్రావకంతో మెరుగులు పెడతారో అలాగన్నమాట. అందుకే లోపాలు వరాలు అంటున్నది. ఫెయిల్యూర్‌తో వక్తిత్వవికాసం జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ విజయాన్ని మించిన కిక్‌నిస్తుంది. దాన్ని ఆస్వాదించాలి.. అనుభవించాలి అని చెబుతుంది ఆర్ట్ ఆఫ్ హీలింగ్.. కిన్‌సుగీ. పర్ఫెక్షన్ వెంట పరుగులు పెట్టిన చాలామంది కిన్‌సుగీని లోతుగా అధ్యయనం చేశారు. ఆ అధ్యయనం.. తమ పరుగుకు అర్థంలేదని తేల్చింది. దాంతో ఆ పరుగును ఆపి కిన్‌సుగీని ప్రాక్టీస్ చేయసాగారు. వాళ్లలో కాన్‌డీస్ కూమై ఒకరు. న్యూయార్క్వాసి అయిన ఆమె కిన్‌సుగీ మీద ఆసక్తితో జపాన్ వెళ్లి అక్కడ కొన్నాళ్లుండి కిన్‌సుగీని ఔపోసన పట్టింది. ‘కిన్‌సుగీ వెల్నెస్ ద జపనీస్ ఆర్ట్ ఆఫ్ నరిషింగ్ మైండ్, బాడీ అండ్ స్పిరిట్’ అనే పుస్తకం రాసింది. అందులో.. ఒత్తిడిలేకుండా జీవితాన్ని హాయిగా ఆస్వాదించే టెక్నిక్స్ కొన్నింటిని విశదపరచింది. అవేంటో చూద్దాం.. వాబి సాబి జపాన్ భాషలో వాబి అంటే ఏకాంతం.. లేదా ఒంటరితనం. సాబి అంటే వెళ్లే సమయం. ఈ రెండూ కలసి.. మనలోని మంచి, చెడులను మనమెట్లా అంగీకరించాలి.. వాటితో మన జీవితాన్ని ఎలా పరిపుష్టం చేసుకోవాలో చెబుతాయి. ఒక్కమాటలో.. వాబి సాబి అంటే మన లోపాల్లోని అందాన్ని ఆస్వాంచమని అర్థం. జీవితమంతా పర్ఫెక్ట్ ఫ్రేమ్‌లో సాగడం అసాధ్యం. మన బలహీనతలను తెలుసుకోవడం అంటే మన శక్తిసామర్థ్యాలను సెలబ్రేట్ చేసుకోవడమే. ఈ సానుకూల దృక్ఫథమే జీవితాన్ని సరళం చేస్తుంది. జీవితాన్ని ప్రేమించేలా చేస్తుంది. మన మీద మనకు నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఇదే వాబి సాబి సారాంశం. గామన్ .. అంటే స్థితప్రజ్ఞత. తుఫాను వచ్చినా.. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నా సంయమనం కోల్పోకుండా.. ప్రశాంత చిత్తంతో ఉండడం. ఆవేశం ఆవహించకుండా చూసుకోవడం. దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడికి మనం స్పందించే తీరుతోనే దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. పొద్దస్తమానం ప్రతికూల పరిస్థితుల గురించి ఆలోచించకుండా సానుకూల పరిస్థితుల మీద దృష్టి పెట్టడం మంచిదని వివరిస్తుంది గామన్. యూయిమారు వ్యక్తిగత సంబంధాలు, పరస్పర సహాయసహకారాలు ఎంత అవసరమో చెబుతుంది. మన అనుబంధాల్లోని గాఢత మీదే మనకు దొరికే సహానుభూతి ఆధారపడి ఉంటుంది. మన ఆప్తులు, సన్నిహితుల పట్ల మనం శ్రద్ధ కనబరిస్తే వాళ్లూ మన పట్ల శ్రద్ధ కనబరుస్తారు అంటుంది కిన్సుగీలో భాగమైన యూయిమారు. సింపుల్‌గా ఇచ్చిపుచ్చుకోవడమే! యొషోకు.. అంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ, సౌండ్ బాడీ త్రూ సౌండ్ మైండ్ .. అన్నమాట. మెదడు నిరంతరం ఆరోగ్యకరమైన ఆలోచనలు చేస్తుంటేనే దాన్ని కలిగిన శరీరం ఆరోగ్యంగా.. దృఢంగా ఉంటుందనేది యొషోకు మంత్రం. ఏరకమైన ఆహారం తీసుకుంటున్నామనే దాని మీదే మైండ్, బాడీ కనెక్షన్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి సాత్వికమైన పౌష్టికాహారాన్ని తీసుకుంటే అదే స్థాయిలో మెదడు ఆలోచనలు అద్భుతంగా సాగుతాయి. శరీరమూ అంతే పాజిటివ్‌నెస్‌తో స్పందిస్తుంది. కన్షా.. అంటే మన అహాన్ని వీడడం.. అనుభవాలను మళ్లీ పేర్చుకోవడం! జీవితంలోని మంచి, చెడులు.. రెండింటినీ సమంగా స్వీకరించి, రెండింటికీ సమంగా కృతజ్ఞత తెలపాలంటుంది కన్షా. కిన్సుగీలో అత్యంత ప్రధానమైన అంశం ఇదే! కృతజ్ఞత ప్రాక్టీస్ చేయడం అంటే వర్తమానంలో బతకడం. లేని వాటి గురించి ఆలోచించకపోవడం.. కోరుకోకపోవడం! వీటితో మన మెదడుకు కేవలం సానుకూలతలనే చూడమనే సంకేతాలను ఇవ్వడం. ప్రతి చర్యకు ఓ కారణం ఉంటుంది. ఎలాంటి సమస్యకైనా ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ కారణం.. ఆ ఉద్దేశం మనల్ని మరింత శక్తిమంతంగా.. ఉన్నతంగా తీర్చిదిద్దాలి! ఇలా పుస్తకంలోనే కాదు జీవితంలోనూ అనుసరిస్తున్న ఈ కిన్‌సుగీ వెల్నెస్ టెక్నిక్స్ గురించి కూమై పాడ్కాస్ట్నూ నిర్వహిస్తోంది. ఆ శ్రవణమాధ్యమానికి ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకమైన శ్రోతలున్నారు. చివరగా.. అదృష్టాదృష్టాలనే మాట లేకుండా.. బలాలు బలహీనతలతో సహా ఉన్నదున్నట్లుగా జీవితాన్ని అంగీకరించడం.. సుఖదుఃఖాలను సమంగా తీసుకోవడం.. అడ్డంకులను శక్తికి కొలమానంగా భావించడం, ఓటమిలోంచి గెలుపుకి దారి వేసుకోవడమనే తత్వాన్ని ఒంటబట్టించుకోవడమంటే సాధుపుంగవులుగా మరడమని కాదు. చేతుల్లో లేని వాటిని .. సరిచేయలేని వాటిని మెదడులో మోసే పనిపెట్టుకోవద్దని. చేయగలిగే వాటి మీదే మెదడు పెట్టమని. పోటీలు, పోల్చుకోవడాలు, ఒత్తిళ్లు, అంచనాలు, విఫలయత్నాలు, అసంతృప్తులు, కలలు, కల్లలు వంటివన్నీ ఆ ప్రాక్టీస్‌ని మన దరి చేరనీయకపోవచ్చు. భయం మన లోపాలను భూతద్దంలో చూపిస్తుండొచ్చు. ఆ భూతద్దాన్ని బ్రేక్ చేస్తే భయం అర్థం కోల్పోతుంది. అప్పుడు గెలుపు.. ఒటమి రెండూ సమంగా కనపడతాయి. బతుకు విలువ తెలుస్తుంది. మనకు కావల్సింది ఆ భూతద్దాన్ని పగలగొట్టే పరికరం. అదే ఈ కిన్‌సుగీ. బ్రేక్ చేసి ప్రాక్టీస్ చేయడమే ఆలస్యం! (చదవండి: నిండు గర్భిణి మళయాళ టీవీ నటి మృతి..ఆ టైంలో కూడా గుండె సమస్యలు వస్తాయా?) -
భవిష్యత్‌నే మార్చేసిన స్టార్టప్ బిజినెస్.. విదేశాల్లోనూ పాపులర్
‘భవిష్యత్ అనేది రకరకాల వస్తువులతో కూడిన బాక్స్లాంటిది. మనం తీసినప్పుడు ఏ వస్తువు చేతికందుతుందో తెలియదు. కొన్నిసార్లు నిరాశపరిచే వస్తువు, కొన్నిసార్లు అత్యంత విలువైన వస్తువు చేతికి అందవచ్చు’... ఈ సినిమా డైలాగ్‌ను ప్రమోద్ గాడ్గే, షాహీద్ మెమన్లు విన్నారో లేదో తెలియదుగానీ ‘అన్‌బాక్స్’ రూపంలో వారికి బాక్స్ నుంచి విలువైన కానుక లభించింది. తమ భవిష్యత్‌నే మార్చేసిన స్టార్టప్ కానుక అది. లాజిస్టిక్ ఆటోమేషన్ స్టార్టప్ ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రమోద్, షాహీద్‌లు... ‘మన దేశంలో ఇ–కామర్స్ వేగం పెరిగింది’ అనే వార్త చదివి ‘ఓహో అలాగా!’ అనుకోవచ్చు. అద్భుతమైన ‘ఐడియా’ కూడా రావచ్చు. ఆ ఐడియా జీవితాన్నే మార్చేయవచ్చు. ప్రమోద్ గాడ్గే, షాహీద్ మెమన్‌ల విషయంలో జరిగింది ఇదే. మన దేశంలో ఇ–కామర్స్ స్పీడ్‌ను గమనించిన వీరు సప్లై చైన్ రోబోటిక్స్ స్టార్టప్ ‘అన్‌బాక్స్ రొబోటిక్స్’తో విజయపథంలో దూసుకుపోతున్నారు. ఇండియా దాటి యూఎస్, యూరప్ మార్కెట్లోకి కూడా అడుగు పెట్టనున్నారు.పుణే కేంద్రంగా మొదలైన ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’ సప్లై చైన్ ఆటోమేషన్ సోల్యూషన్స్లో మార్పు తీసుకువచ్చింది. వినూత్న ఏఐ–ఆధారిత కంట్రోల్ సిస్టమ్ ద్వారా రోబోట్ల ఉత్పాదకతను పెంచింది. పనితీరును మార్చింది. ‘మావన శక్తి నుంచి రోబోట్స్ వరకు ప్యాకేజీలను క్రమబద్ధీకరించడం, రవాణా చేయడం... మొదలైన విధానాలు మన దేశంలో ఇ–కామర్స్ వేగాన్ని అందుకోలేకపోతున్నాయేమో అనిపించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొబైల్ రోబోటిక్స్ సిస్టమ్‌ను నిర్మించాలనుకున్నాం. లాజిస్టిక్స్, రిటైల్ ప్లేయర్ల కోసం ప్యాకేజీ సార్టింగ్, ఆర్డర్ కన్సాలిడేషన్ ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి శక్తిమంతమైన రోబోటిక్స్ వ్యవస్థను నిర్మించాలనుకున్నాం’ గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’ సీయివో ప్రమోద్ గాడ్గే. ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’కు ముందు ఫ్లిప్‌కార్ట్‌లో సార్టింగ్కు సంబంధించి ఆటోమేషన్ విభాగంలో, మన దేశంలోని తొలి రోబోట్–బేస్డ్ సార్టింగ్ ప్రాజెక్ట్‌లో పనిచేశాడు ప్రమోద్. ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’ కో–ఫౌండర్, సీటీవో షాహీద్ రోబోటిక్స్. ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, స్వోర్మ్ ఇంటెలిజెన్స్‌లో మంచి అనుభవం ఉంది. రోబోటిక్స్, ఆటోమేషన్ ఫీల్డ్స్‌లో సీటీవోగా పనిచేశాడు. ‘అన్‌బాక్స్’కు ముందు ‘వనోర రోబోట్స్’ అనే స్టార్టప్ ప్రారంభించాడు. చిత్తశుద్ధి, కష్టపడే తత్వం, అంకితభావం లేకపోతే పేపర్ మీద రాసుకున్న కాన్సెప్ట్ అక్కడే నిలిచిపోతుంది. అయితే ఈ ఇద్దరు మిత్రులు వారి బృందం బాగా కష్టపడి ‘అన్‌బాక్స్’ను సూపర్ హిట్ చేశారు. స్టార్టప్ కాన్సెప్ట్‌లో సత్తా ఉంటే ఇన్వెస్టర్లు వెనకడుగు వేయరు. ‘అన్‌బాక్స్’ విషయంలోనూ అదే జరిగింది. టీమ్‌ను విస్తరించడానికి, అంతర్జాతీయ స్థాయిలో కస్టమర్ల డిమాండ్‌ను నెరవేర్చడానికి, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై సమీకరించిన నిధులను వాడారు. 2021లో థర్డ్–పార్టీ లాజిస్టిక్స్, ఇ–కామర్స్ ప్లేయర్స్‌తో కంపెనీ బీటా పైలట్స్ లాంచ్ చేసినప్పుడే లీడింగ్ ఇ- కామర్స్ లాజిస్టిక్స్ కంపెనీల నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది. ఇది భవిష్యత్ విజయానికి సూచికలా పనిచేసింది. ఇన్వెస్టర్ట్లలో మరింత నమ్మకాన్ని నింపింది. ‘అన్‌బాక్స్’ స్టార్టప్ ఇ–కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్‌లాంటి సెక్టార్లలో ఏడు పెద్ద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. క్లయింట్ సబ్స్క్రిప్షన్ మోడల్ ‘రోబోట్ యాజ్ ఏ సర్వీస్’ను కూడా కంపెనీ ప్రారంభించింది. ఇ–కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్ రంగాలకు సంబంధించి రోబోటిక్–బేస్డ్ పుల్‌ఫిల్‌మెంట్, డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీలో ప్రత్యేకత సాధించిన ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’ అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుతుంది. స్టార్టప్ కాన్సెప్ట్‌లో సత్తా ఉంటే ఇన్వెస్టర్లు వెనకడుగు వేయరు. ‘అన్‌బాక్స్’ విషయంలోనూ అదే జరిగింది. -
టైం మెచ్చిన ధృవ్తార!
యూట్యూబ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు... ధృవ్ రాఠీ. ఈ హరియాణా కుర్రాడు యూట్యూబర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. గాలివాటంగా విజయం సాధించలేదు. తనదైన సక్సెస్ ఫార్ములాను రూపొందించుకున్నాడు. ఆడియో స్పేస్‌లోకి అడుగు పెట్టి పాడ్‌కాస్టర్‌గా కూడా సత్తా చాటాడు. ‘డబ్బు కోసం కాదు ప్యాషన్‌తో పనిలోకి దిగండి. సామాజిక బాధ్యతను మరవకండి’ అంటున్న ధృవ్ రాఠీ తాజాగా టైమ్ మ్యాగజైన్ ‘నెక్స్ట్ జెనరేషన్ లీడర్స్ 2023’ జాబితాలో చోటు సంపాదించాడు... ధృవ్ రాఠీ సొంత రాష్ట్రం హరియాణా. జర్మనీలోని కాజ్రువ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్, అదే ఇన్స్టిట్యూట్లో రెన్యూవబుల్ ఎనర్జీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ట్రావెల్ వీడియోలతో ప్రయాణం ప్రారంభించిన ధృవ్ ఆ తరువాత రాజకీయా, సామాజిక అంశాలపై దృష్టి సారించాడు. ‘ఇన్సైడ్ ది వరల్డ్స్ స్మాలెస్ట్ కంట్రీ’ ‘గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ దిల్లీ స్కూల్స్’ ‘క్లీనింగ్ నైన్ మిలియన్ కేజీ వర్త్ ఆఫ్ ట్రాష్’.... మొదలైన వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ఏదో ఒక వీడియో చేయాలి, వదలాలి అని తొందర పడకుండా ఆచితూచి ఆలోచించి వీడియోలు చేసేవాడు ధృవ్. ‘చేయకపోయిన ఫరవాలేదు. చేసింది మాత్రం బాగుండాలి’ అని గట్టిగా నమ్ముతాడు. ఒక అంశంపై వీడియో చేయాలనుకున్నప్పుడు ‘కెమెరా ఉంది కదా. ఇది చాలు’ అనుకోకుండా ఆ అంశంపై లోతుగా రిసెర్చ్ చేస్తాడు. జర్నల్స్, రిపోర్ట్స్ చదవడంతో పాటు ఎంతోమంది నిపుణులతో మాట్లాడతాడు. ఆ తరువాతే పనిలోకి దిగుతాడు. ‘డబ్బులు బాగా గడించాలనే లక్ష్యంతో యూట్యూబర్‌గా మారవద్దు. యూట్యూబ్ అనేది జస్ట్ ఫర్ మనీ అనే భావనను మనసులో నుంచి తీసివేయాలి. ప్యాషన్ ఉన్నప్పుడే క్రియేటర్ కావాలి. ఒక క్రియేటర్ సక్సెస్ కావడానికి ఓపిక అనేది అతి ముఖ్యం. ఇక నేను తెలుసుకునేది ఏమీ లేదు అనుకోకుండా అనుభవాలు, పరిస్థితుల నుంచి ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నది ఏమిటో నా గత వీడియోలు, ఇప్పటి వీడియోలకు మధ్య ఉన్న తేడాను గమనిస్తే తెలుస్తుంది. ఖరీదైన టెక్నికల్ టూల్స్ వాడినంత మాత్రాన పేరు రాదు అనేది గ్రహిం చాలి. వృథాగా డబ్బులు ఖర్చు చేయవద్దు. సింపుల్ కెమెరా ఫోన్, ఫ్రీ వీడియో ఎడిటర్‌తో మన ప్రయాణం మొదలు పెట్టవచ్చు. సామాజిక బాధ్యతను ఎప్పుడూ మరవద్దు’ అంటాడు ధృవ్. ‘పాపులర్ యూట్యూబర్’గా పేరు వచ్చినప్పటికీ అక్కడే ఆగిపోకుండా ఆడియో స్పేస్‌లోకి అడుగు పెట్టాడు ధృవ్ రాఠీ. పాలిటిక్స్, ఎంటర్టైన్మెంట్, సోషల్, ఎకనామిక్స్ టాపిక్‌లను కవర్ చేస్తూ పాడ్‌కాస్టర్‌గా కూడా తానేమిటో నిరూపించుకున్నాడు. ‘పాడ్‌కాస్ట్‌లో అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. విజువల్‌గా ఆట్టుకునే అవకాశం లేదు. యానిమేషన్‌కు వీలులేదు. కేవలం మాట మాత్రమే ముఖ్యం అవుతుంది. శ్రోతలు తమ పనులు చేసుకుంటూ కూడా మన మాటలు ఆసక్తిగా వినేలా చేయాలి. పాడ్‌కాస్టింగ్‌లో నేను వీడియోలో ఎలా కనిపించాలి? అనేదాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆకట్టుకునేలా ఎలా మాట్లాడాలి? అనేదానిపైనే దృష్టి ఉంటుంది. నా ముఖాన్ని మాత్రమే కాదు గొంతు కూడా చాలామంది గుర్తుపట్టడం అనేది పాడ్‌కాస్టింగ్‌లో నాకు ప్లస్‌పాయింట్ అయింది. పాడ్‌కాస్టర్‌గా నాకు మంచి మార్కులు వేస్తూ శ్రోతలు నుంచి మెయిల్స్, మెసేజ్‌లు వస్తుంటాయి’ అంటున్న ధృవ్ అభిరుచుల విషయానికి వస్తే...ప్రయాణాలు, ఫొటోగ్రఫీ, స్కూబా–డైవింగ్, పుస్తక పఠనం అంటే ఇష్టం. ‘తక్కువలో ఎక్కువ’ అనేది నమ్మే సూత్రం. (చదవండి: సాధారణ ఉద్యోగిగా అడుగుపెట్టి..నేడు సంపన్న మహిళగా..!) -
కాలుష్యానికి పరిష్కారంగా త్రీ-వీలర్స్ కార్లు..సౌరవ్ సక్సెస్‌స్టోరీ
వివిధ రకాల పరికరాలు, రోబోట్లు తయారుచేసే సరదా దిల్లీకి చెందిన సౌరవ్ కుమార్‌ను ఈవీ స్టార్టప్ ‘యూలర్’ వరకు తీసుకెళ్లింది. కాలుష్య సమస్యకు పరిష్కారంగా తయారు చేసిన ఈ కంపెనీ త్రీ–వీలర్స్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్, బిగ్బాస్కెట్లాంటి పెద్ద కంపెనీలు ‘యూలర్’ క్లయింట్స్‌గా ఉన్నాయి.... ‘బెటర్ ఫ్యూచర్’ అంటూ కుటుంబంతో బిహార్ నుంచి దిల్లీకి వెళ్లి స్థిరపడ్డాడు సౌరవ్ కుమార్ తండ్రి. సౌరవ్ కుమార్‌కు గణితం అంటే ఇష్టం. రోబోట్ల తయారీపై ఆసక్తి. ఇక తండ్రికి గణితంతో పాటు సైన్స్ కూడా ఇష్టం. ఇద్దరూ సైన్స్‌కు సంబంధించిన విషయాలను ముచ్చటించుకునేవాళ్లు. దిల్లీలోని డీపీఎస్ ఆర్కే పురం స్కూల్లో చదివే రోజుల్లో రోబోట్ల తయారీలో ఎక్కువ సమయం గడిపేవాడు సౌరవ్. దిల్లీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆ తరువాత కార్నెల్ యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లో కూడా ఏరియల్ వెహికిల్స్ నుంచి అండర్‌వాటర్ వెహికిల్స్ వరకు ఏదో ఒకటి తయారుచేస్తూనే ఉండేవాడు. హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్‌ను ఎంజాయ్ చేసేవాడు. ఆ ఆనందం తనను మరో స్థాయికి తీసుకువెళ్లింది. ఒక విజయం సాధించిన తరువాత ‘వాట్ నెక్ట్స్?’ అనే ప్రశ్న వేసుకుంటాడు సౌరవ్. 2017లో ‘క్యూబ్26’ కంపెనీని వేరే కంపెనీకి అమ్మాడు. ఆ తరువాత స్విస్ గణితశాస్త్రవేత్త లియోన్హర్డ్ యూలర్ పేరు మీద ‘యూలర్ మోటర్స్’ కంపెనీ ప్రారంభించాడు. యూలర్ మోటర్ కంపెనీ కాలుష్య సమస్య తలెత్తని త్రీ–వీలర్లను తయారు చేస్తుంది. ‘మన దేశంలో ఎన్నో పట్టణాలు తీవ్రమైన కాలుష్య సమస్యని ఎదుర్కొంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాలుష్య సమస్యకు పరిష్కారంగా త్రీ–వీలర్స్‌ను తయారు చేశాం’ అంటాడు సౌరవ్. ఈ త్రీ వీలర్స్‌కు సంబంధించి లిథియం ఎనర్జీ బ్యాటరీ ప్యాక్‌లను సౌరవ్ కుమార్ అతని బృందం సొంతంగా తయారుచేసింది. ‘యూలర్’కు తనదైన చార్జింగ్ నెట్వర్క్, యాప్ ఉన్నాయి. దీని ద్వారా యూజర్లు తమ వాహనాలను మానిటర్ చేయవచ్చు. ‘వాహనం తయారు చేయడం సవాలు కాదు. తయారీ ప్రక్రియ సంతోషాన్ని ఇస్తుంది. అయితే అసలు సిసలు సమస్య ఫండింగ్. మీ కస్టమర్ ఎవరు? అనే ప్రశ్నకు సరిౖయెన సమాధానం చెప్పినప్పుడు ఫండింగ్ కష్టం కాదు’ అంటాడు సౌరవ్. సౌరవ్ రంగంలోకి వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ వెహికిల్ ఇండస్ట్రీ శైశవ దశలోనే ఉండడం, ఇకామర్స్ కంపెనీలు ఈవీల వైపు పెద్ద ఎత్తున రాకపోవడం సౌరవ్‌కు కలిసి వచ్చింది. ‘ఎలక్ట్రిక్ వెహికిల్ కంపెనీ నిర్మాణంలో రైట్ ప్రొడక్ట్, చార్జింగ్ సిస్టమ్, ఫైనాన్సింగ్ ముఖ్య పాత్ర పోషిస్తాయి’ అంటాడు సౌరవ్. దేశవ్యాప్తంగా ‘యూలర్’ రెండు వందల చార్జింగ్ స్టేషన్లను నిర్మించింది. ‘అంతర్గత దహన ఇంజిన్ (ఐసీయి) పనితీరు, బ్యాటరీ ప్యాక్‌కు సంబంధించి ఇన్‌బిల్ట్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ మార్కెట్లో మాకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి. పోటీలో ముందుండేలా చేశాయి’ అంటాడు సౌరవ్. చిన్నగా ప్రస్థానం మొదలు పెట్టిన ‘యూలర్’ ఇప్పుడు పన్నెండు ఎకరాల పరిధిలో నెలకు మూడు వేల వాహనాలను తయారుచేసే ఫ్యాక్టరీ నిర్మించడం వరకు ఎదిగింది. ‘సామాజిక బాధ్యత’ అనేది సౌరవ్‌కు ఇష్టమైన మాట. డబ్బు కోసం కష్టపడడం తప్పేమీ కాదు. అయితే అది మాత్రమే ప్రాధాన్యత కాదు. సమాజానికి తిరిగి ఏం ఇస్తున్నామనేది ముఖ్యం. – సౌరవ్ కుమార్ -
పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం విజయవంతం
సాక్షి, సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): పీఎస్ఎల్వీ సీ-56 వాహకనౌక ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు పీఎస్ఎల్వీ-సి56 ప్రయోగం నిర్వహించారు. నాలుగు దశల్లో రాకెట్ ప్రయోగం జరిగింది. కాగా, 25.30 గంటలపాటు కౌంట్‌డౌన్‌తో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-56 విజయవంతంగా కక్షలోకి దూసుకెళ్లింది. ఇక, సింగపూర్‌కు చెందిన 420 కిలోల బరువు గల ఏడు ఉపగ్రహాలను దీని ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. 7 ఉపగ్రహాలను నియో ఆర్బిట్‌లోకి ప్రవేశ పెట్టనున్నారు. #PSLVC56 | The mission is successfully accomplished. PSLV-C56 vehicle launched all seven satellites precisely into their intended orbits: ISRO — ANI (@ANI) July 30, 2023 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. ఇక, ఈనెలలో ఇస్రోకు ఇది రెండో ప్రయోగం కావడం విశేషం. ఒకే నెలలో 2 ప్రయోగాలను సక్సెస్ చేసిన ఇస్రో. కాగా, పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 58వ ప్రయోగం. అనంతరం శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా సోమనాథ్ మాట్లాడుతూ.. నిర్దేశించిన కక్ష్యలో రాకెట్‌ను విజయవంతంగా ప్రవేశపెట్టాం. సెప్టెంబర్‌లో మరో పీఎస్ఎల్వీ ప్రయోగం చేపడతాం. అది కూడా పూర్తిగా కమిర్షియల్ ప్రయోగమని స్పష్టం చేశారు. #WATCH | Indian Space Research Organisation (ISRO) launches its PSLV-C56 with six co-passenger satellites from Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota. (Source: ISRO) pic.twitter.com/2I1pNvKvBH — ANI (@ANI) July 30, 2023 -
ఫిజిక్స్‌వాలా: గెలవాలంటే అజ్ఞానం కూడా అవసరమే!
సక్సెస్ కావాలంటే అజ్ఞానం కూడా ఉండాలి అంటారు ఫిజిక్స్‌వాలా ఫేమ్ అలక్ పాండే. అతడి మాటల తాత్పర్యం.. నాకు అన్ని తెలుసు అనుకున్నప్పుడూ ఏమి తెలుసుకోలేము ఏమి తెలియదు అనుకున్నప్పుడే అన్ని తెలసుకోవాలనే ఆసక్తి మొదలవుతుంది. అదే విజయానికి దారి చూపుతుంది. ప్రయాగ్‌రాజ్‌లో ట్యూషన్లు చెప్పి కుటుంబానికి వేడినీళ్లకు చన్నీళలా సహకరించిన స్టార్ ఎంటర్ప్రెన్యూసర్ అతడి ఎడ్టెక్ స్టార్టప్ ఫిజిక్స్ వాలా శాఖోపశాఖలుగా విస్తరించి యూనికార్స్ క్లబ్లో చేరింది. సక్సెస్వాలా స్ట్రాంగ్ స్టోరీ. పాఠాలను పాఠాలుగా మాత్రమే బోధించాలని లేదు. వాటిని నిజజీవితంలోకి తీసుకువచ్చి, హాస్యం జోడించి చెబితే పాఠం అద్భుతంగా అర్థమవుతుంది. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. ‘ఫిక్షనుకు ఫ్రిక్షన్కు తేడా ఏమిటి?’ నుంచి జటిలమైన భౌతికసూత్రాలను సులభంగా చెప్పడం వరకు అలక్ పాండే అద్భుతమైన నేర్పును సాధించాడు. ఈ ఫస్ట్–జెనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ కొన్ని సంవత్సరాల క్రితం ‘ఫిజిక్స్‌వాలా’ పేరుతో ఫ్రీ యూట్యూబ్ చానల్‌కు శ్రీకారం చుట్టాడు. ‘పెద్ద సక్సెస్ సాధించబోతున్నాను’ అని ఆ సమయంలో అతను అనుకొని ఉండడు. అతడు అనుకున్నా, అనుకోకపోయినా ‘ఇస్రో’వారి రాకెట్లా ఫిజిక్స్‌వాలా దూసుకుపోయింది. 31 మిలియన్ల సబ్స్రైబర్లు, 61 యూట్యూబ్ చానల్స్, 5.3 బిలియన్ వ్యూస్! ‘పోటీలో చాలామంది ఉన్నప్పుడు పోటీ నుంచి తప్పుకోవడమే మేలు’ అనుకునే రకం కాదు అలక్. ‘పోటీలో చాలామంది ఉన్నప్పుడు మనదైన స్టైల్‌ను బయటికి తీయాలి’ అని బలంగా నమ్ముతాడు. నిరంతరం ఆర్థిక ఇబ్బందులు పడే కుటుంబం నుంచి వచ్చిన అలక్ ‘మాకు ప్రతి రపాయి వందరపాయలతో సవనంగా ఉండేది’ అని గతాన్ని గుర్తు చేసుకుంటాడు. అలక్ ఎడ్టెక్ ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు తనకు తాను వేసుకున్న ప్రశ్న ‘స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు?’ ఈ ప్రశ్నకు ఊహల్లో నుంచి సమాధానం తీసుకోకుండా విద్యార్థులతో ప్రత్యక్షంగా మాడ్లాడాడు. వారు చెప్పిన ప్రతీదాన్ని నోట్ చేసుకొని లైవ్ ఆన్లైన్ కాసులలో అప్లై చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కోంగ్ సెంటర్ల ద్వారా బాగా డబ్బు గడింన అలక్ పాండేకు ‘ఫిజిక్స్‌వాలా’ చానల్ ద్వారా వచ్చిన యాడ్ మనీ ఎనిమిది వేలు చాలా తక్కువ. అయితే ఇది ‘శుభారంభం’ అని వత్రమే అనుకున్నాడు అలక్. అతడి నమ్మకం వృథా పోలేదు యాడ్ మనీ ఊహించని స్థాయిలో పెరుగుతూ పోయింది. కొన్నిసార్లు విద్యార్థులే ఉపాధ్యాయులై చక్కని సలహాలు ఇస్తారు. కొత్తలో అలక్ ప్రచారంపై ఎక్కువ దృష్టి పెట్డాడు. ఎంత ఎక్కువగా పబ్లిసిటీ చేస్తే అంతగా సక్సెస్ అవుతాం అనుకునేవాడు. ఆ సమయంలో కొందరు విద్యార్థులు... ‘యాడ్స్ మీద కాదు టీచింగ్ మీద దృష్టి పెట్టండి’ అని చెప్పారు. ఇక అప్పటి నుం యాడ్స్‌పై కాకుండా టీచింగ్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. ‘ఫిజిక్స్‌వాలా క్లాస్‌లలో చక్కగా అర్థమవుతుంది’ అనే మౌత్‌టాక్ వచ్చేలా కృషి చేశాడు. చాలామంది విజేతలలాగే అలక్ పాండేకు ఎదురయ్యే ప్రశ్న.... ‘మీ విజయ రహస్యం ఏమిటి?’ అది చెప్పడానికి అలక్ నోరు విప్పనక్కర్లేదు. నోయిడాలోని బహుళ అంతస్తుల భవనంలోని అతని ఆఫీసు గోడపై అతికించిన పోస్టర్లు చూస్తే చాలు. మచ్చుకు రెండు... ‘సక్సెస్ సాధించాలని బలంగా అనుకుంటే ప్లాన్ బీ గురించిన ఆలోచనే రాదు’ ‘వేగంగా పరాజయం పాలైనా సరే, నిదానంగా గట్టి విజయం సాధించాలి’. (చదవండి: మిస్ యూ భయ్యా! అతను కార్గిల్ శిఖరాలను రక్షిస్తున్నాడేమో!) -
జర్నలిస్ట్ టూ ఎంటర్ప్రెన్యూర్.. రూబీసిన్హా సక్సెస్ స్టోరీ
రూబీ సిన్హా ప్రారంభించిన ‘షీ ఎట్ వర్క్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎంతోమంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు జ్ఞానకేంద్రంగా మారింది.‘అదిగో దారి’ అని దారి చూపే దిక్సూచి అయింది. ‘ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలు పెట్టారా? అయితే మీ దగ్గర ఉన్న శక్తిని బయటికి తీసుకురావల్సిన సమయం వచ్చింది. ఒక్కరిగా ప్రయాణం మొదలు పెట్టి వందలాదిమందికి స్ఫూర్తి ఇస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారిలో మీరు ఒకరు ఎందుకు కాకూడదు!’ అంటూ ఔత్సాహిక వ్యాపారవేత్తలను ఉత్సాహపరిచే రూబీ సిన్హా తాజాగా బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఉమెన్ వర్టికల్ అధ్యక్షురాలిగా నియామకం అయింది... దిల్లీకి చెందిన రూబీ సిన్హా జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ చేసిన తరువాత జర్నలిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టింది. మరోవైపు వారాంతాలలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసేది. ఏమాత్రం తీరిక దొరికినా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేది. షార్ట్ ఫిల్మ్స్ తీసేది.అడ్వర్టైజింగ్ దిగ్గజాలతో కలిసి పనిచేయడం ఆమెకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది.ఒక బిడ్డకు తల్లి అయిన రూబీ ఇంటికే పరిమితం కావల్సి వచ్చింది. కొంత కాలం తరువాత స్నేహితులలో ఒకరు ఇండిపెండెంట్ పీఆర్ కన్సల్టెంట్‌గా ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ఈ సలహా రూబీకి బాగా నచ్చింది. అలా మొదలైన ప్రయాణమే తనను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది. ‘అనుభవమైతేగానీ తత్వం బోధపడదు’ అన్నట్లు రూబీ సిన్హా ఎంటర్ప్రెన్యూర్ అయిన తరువాతగానీ మహిళ వ్యాపారవేత్తలు ఎదుర్కొనే సమస్యలు అర్థం కాలేదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ‘కమ్యూన్ బ్రాండ్ సొల్యూషన్స్’ ద్వారా కమ్యూనికేషన్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గెలుపు జెండా ఎగరేసింది. అయితే తన విజయానికే పరిమితమై సంతృప్తి పడకుండా ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘షీ ఎట్ వర్క్’ ద్వారా ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చి ముందుకు నడిపించింది. ‘ప్రతి స్టార్టప్ ఐడియా సక్సెస్ కావాలని ఏమీ లేదు. కానీ ఎందుకు సక్సెస్ కాలేము అనే పట్టుదల ఉండే మాత్రం కచ్చితంగా సక్సెస్ అవుతాం. మన దేశంలో ఎంతో ప్రతిభ, సృజనాత్మకత ఉంది. వోలా క్యాబ్స్ నుంచి ఫ్లిప్‌కార్ట్ వరకు ఎన్నెన్నో విజయాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి చాలు’... ఇలాంటి మాటలు ఎన్నో ‘షీ ఎట్ వర్క్’లో కనిపిస్తాయి. ‘ఒంటరి ప్రయాణం కష్టాలతో కూడుకున్నది. అయితే ఆ ప్రయాణం నీకు కొత్త శక్తి ఇస్తుంది’ అనే మాట రూబీకి చాలా ఇష్టం.తాను ఒంటరిగానే ప్రయాణం పెట్టింది.‘బడ్జెట్, క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ నుంచి ప్రతిభావంతులైన ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం వరకు ఎంటర్ప్రెన్యూర్ ముందు ఎన్నో సవాళ్లు ఉంటాయి. అయితే అవేమీ జటిలమైన సవాళ్లు కాదు. ప్రతి సవాలు ఒక పాఠం నేర్పుతుంది. అలా నేను ఎన్నో నేర్చుకున్నాను. ఎంటర్ప్రెన్యూర్ టీమ్ కెప్టెన్‌గానే కాదు టీమ్ మెంబర్‌గా కూడా వ్యవహరించాలి. టీమ్‌తో కలిసిపోయి వారికి ఉత్సాహాన్ని ఇవ్వాలి’ అంటుంది రూబీ. నేర్చుకోవడానికి చిన్నా,పెద్దా తేడా అనేది ఉండదు.‘నేను ఒకరి దగ్గర నేర్చుకోవడం ఏమిటి’ అనే అహం అడ్డొస్తే అదే అడ్డుగోడగా మారుతుంది. అయితే రూబీకి అలాంటి అహాలు లేవు.‘ఈ తరానికి అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం, తెలివితేటలు, చురుకుదనం ఉన్నాయి. వారి నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటాను’ అంటుంది రూబీ.‘భవిషత్ దార్శనికత, వ్యూహ చతురత, అంకితభావం రూబీ సిన్హా బలాలు’ అంటున్నారు బ్రిక్స్ సీసీఐ డైరెక్టర్ జనరల్ మధుకర్.భౌగోళిక సరిహద్దులకు అతీతంగా స్త్రీ సాధికారతకు సంబంధించిన లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడానికి బ్రిక్స్ సీసీఐ, ఉమెన్ వర్టికల్ ఏర్పాటయింది. ఇప్పుడు ఈ విభాగానికి రూబీ సిన్హా రూపంలో అంతులేని బలం చేకూరింది. -
Balagam Success Meet Photos: జనాల మనసులు గెలిచిన ‘బలగం’ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
యూఎస్ ఫ్యాన్స్ ప్రేమ చూసి ఎమోషనల్ అయిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా బరిలోకి దిగిన చిరు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు. వాల్తేరు వీరయ్యగా అటు క్లాస్, ఇటు మాస్ ఆడియెన్స్‌ను ఫుల్లుగా ఎంటర్టైన్ చేశారు. మూవీ రిలీజ్ అయిన తొలిరోజు నుంచే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 200కోట్లకు పైగా కలెక్షన్లకు రాబట్టింది. చిరంజీవి కెరీర్లో మైలురాయిగా నిలిచిన వాల్తేరు వీరయ్య ఇంకా బాక్సాఫీస్ వద్ద ఊచకోత సృష్టిస్తోంది. చిరు స్టామినా ఏమాత్ర తగ్గలేదంటూ మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ హోరెత్తిస్తున్నారు. ఇక అమెరికాలో సైతం మెగా ఫ్యాన్స్ ఈ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆన్లైన్లో చిరు లైవ్‌లో ఉన్నప్పుడే కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. లాస్ ఏంజెల్స్, ఫీనిక్స్, డెన్వర్, షికాగో, డాలస్, హ్యూస్టన్ సహా 27 అమెరికన్ సిటీస్ ప్రాంతాలకు చెందిన అభిమానులతో చిరు లైవ్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానుల కేకలు, సంతోషం చూసి కాస్త ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసిన అనుపమ పరమేశ్వరన్
తమిళసినిమా: డిమాండ్ అండ్ సప్లై అనేది ఎక్కడైనా అప్లై అవుతుంది. ఇక చిత్ర పరిశ్రమ గురించి చెప్పాలా.. మొదట్లో ఒక్కచాన్స్ ప్లీజ్ అంటూ ప్రాధేయపడడం, ఆ ఒక్క అవకాశం వచ్చినా తరువాత విజయం కోసం ఆరాటపడడం, అదృష్టం కలిసొచ్చి ఆమెకు ఒక హిట్ వచ్చేస్తే, ఆ తరువాత పారితోషికం పెంచేయడం ఇలా చైన్‌లా జరిగిపోతాయి. ఇది ఇక్కడ ఏ ఒక్కరి గురించి కాదు. అంతా ఇంతే. ఇందుకు అనుపమ పరమేశ్వరన్ అతీతం కాదు. ఆమె కూడా అంతే. ఇప్పటివరకు ఈమె కెరియర్లో ఓ మోస్తరు విజయాలనే చూసింది. మధ్యలో అవకాశాలు కూడా వెన్ను చూపాయి. అలాంటిది తెలుగులో నిఖిల్ సరసన నటించిన కార్తికేయ–2 చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ఇక రీసెంట్గా అదే హీరోతో జతకట్టిన 18 పేజెస్ చిత్రం కూడా హిట్ టాక్‌ను కొట్టేసింది. ఇంతకంటే ఏం కావాలి మంచి తరుణం మించి పోకూడదనుకుందేమో. తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందని సినీ వర్గాల టాక్. ఎంత అంటే ఇప్పటివరకు రూ.60 లక్షలు పుచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు దానికి రెట్టింపు అంటే రూ.1.20 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయినా అనుపమ కావాలంటున్నారు నిర్మాతలు. ఇది వారికి కిక్కు అనుపమకు లక్కు అని చెప్పక తప్పదు. అయితే ఈ అమ్మడికి తమిళంలో మాత్రం ఇంకా అలాంటి లక్కు రాలేదనే చెప్పాలి. మొదట్లో ఎక్కువగా ధనుష్ సరసన నటింన కోడి చిత్రం పరవాలేదు అనిపించిన ఆ క్రెడిట్‌ను నటుడు ధనుష్, నటి త్రిష కొట్టుకు పోయారు. ఈమధ్య నటుడు అధర్వతో రొవన్స్ చేసిన తల్లి పోగాదే చిత్రం తెరపైకి వచ్చి పోయింది. అంతే దీంతో ప్రస్తుతం జయంరవి సరసన రెండవ హీరోయిన్గా నటిస్తున్న సైరన్ చిత్రంపైనే అనుపమ పరమేశ్వరన్ ఆశలు పెట్టుకుంది. మరి తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమెకు లక్కు వర్కౌట్ అవుతుందా లేదా వేచి చూడాల్సిందే. -
Sreeja: ఈ బిడ్డ గెలుపు ఆ తండ్రికి కనువిప్పు!
ఏ తల్లిదండ్రులకైనా కన్నబిడ్డల విజయం అనేది ఒక కల.. అది అందుకున్న వేళ మధుర క్షణంగా మిగిలిపోతుంది కూడా. కానీ, ఆ తండ్రికి మాత్రం అదొక కనువిప్పు.. అలాంటి తండ్రులకు ఓ మంచి గుణపాఠం. కారణం.. పసికందుగా ఉన్నప్పుడే ఆమెను నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లిపోయాడు కాబట్టి. తాజాగా సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో 99.4 శాతం మార్కులు సంపాదించుకుంది బీహార్ పాట్నాకు చెందిన శ్రీజ. పసితనంలోనే ఆమె తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. అయితే ఆమె అలనా పాలనా చూడాల్సిన కన్నతండ్రి.. కర్కశంగా వ్యవహరించాడు. ఆ చిన్నారి ఖర్చులు భరించడం తన వల్ల కాదంటూ.. పైగా ఆడబిడ్డ అనుకుంటూ నిర్లక్ష్యంగా ఇంట్లో ఒక్కదానినే వదిలేసి వెళ్లిపోయాడు. చిన్నారి శ్రీజ ఏడ్పు విని స్థానికులు.. ఆమె అమ్మ తరపు బంధువులకు సమాచారం అందించారు. విషయం తెలిసి అమ్మమ్మ శ్రీజను అక్కున చేర్చుకుంది. తాతా అమ్మమ్మలే పెంచి.. చదివించారు. ఏళ్లు గడిచాయి.. ఇప్పుడు తన మనవరాలు సాధించిన విజయంతో ఆ అమ్మమ్మ మురిసిపోతోంది. ‘‘నా కూతురు చనిపోయాక మా అల్లుడు శ్రీజను వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతన్ని మేం చూడనే లేదు. మరో వివాహం చేసుకున్నాడని మాత్రమే తెలుసు. ఈ ఫలితం చూస్తే.. అతను కచ్చితంగా తన నిర్ణయానికి పశ్చాత్తాపం చెందుతాడని అనుకుంటున్నా’ అని ఆ అమ్మమ్మ అంటోంది. त्याग और समर्पण की अद्भुत दास्ताँ! माँ का साया हटने पर पिता ने जिस बेटी का साथ छोड़ दिया उसने नाना-नानी के घर परिश्रम की पराकाष्ठा कर इतिहास रच दिया। बिटिया का 10वी में 99.4% अंक लाना बताता है कि प्रतिभा अवसरों की मोहताज नहीं है। मैं आपके किसी भी काम आ सकूँ, मेरा सौभाग्य होगा। pic.twitter.com/ufc3Gp4At9 — Varun Gandhi (@varungandhi80) July 24, 2022 మరోవైపు ఈ సక్సెస్‌పై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ స్పందించారు. శ్రీజకు ఏ విధంగా అయినా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు ఆయన. మరోవైపు ఇంటర్నెట్ సైతం ఆ చిన్నారి విజయంపై హర్షం వ్యక్తం చేస్తోంది. మానసికంగా ధైర్యంగా ఉండి.. మంచి చదువుతో విజయం సాధించిన శ్రీజకు.. ఆమెకు అండగా నిలిచిన అమ్మ తరపు కుటుంబానికి అభినందనలు తెలియజేస్తోంది. పుస్తకాల పురుగు అయిన Sreeja శ్రీజ.. అలాగని గంటల తరబడి పుస్తకాలకే అంకితమై పోయేది కాదట. చదువుతో పాటు ఆటపాటలు, ఇతర వ్యవహారాలను చాలా సమానంగా చూసుకునేదట. పరీక్షకు ముందు.. పాత ప్రశ్నాపత్రాలను తిరగేయడం, వాటిని సాల్వ్ చేయడం చేస్తూ వెళ్లాను అని అంటోంది ఆమె. ప్రస్తుతం పదకొండవ తరగతి కోసం శ్రీజ DAV-BSEBలో అడ్మిషన్ తీసుకుంది కూడా. -
ఎన్టీఆర్‌ను డామినేట్ చేశారా? చరణ్ ఆన్సర్ అదిరిందిగా
ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్లుగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా విడుదలైన దగ్గర్నుంచి ఓ అంశంపై మాత్రం సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ కంటే రామ్‌చరణ్ పాత్రను ఎలివేట్ చేశారని, దీంతో తారక్ కంటే చరణ్ పాత్ర డామినేటింగ్‌గా ఉందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ముంబైలో జరిగిన ఆర్ఆర్ఆర్ సక్సెస్ మీట్లో ఇదే అంశంపై ఓ జర్నలిస్ట్ ప్రశ్నించింది. ఎన్టీఆర్ కంటే చరణ్ ఎక్కువ మార్కులు కొట్టేశాడని అంటున్నారు అని అడగ్గా.. రామ్‌చరణ్ స్పందిస్తూ.. 'ఒక్క క్షణం కూడా నేను అలా అనుకోను. డామినేషన్ అన్న పదాన్ని నేను నమ్మను కూడా. అందులో నిజం లేదు. మేం ఇద్దరం బాగా చేశాం. తారక్ ఫెంటాస్టిక్. అతడితో కలిసి పనిచేయడం ఎంజాయ్ చేశా. ఆర్ఆర్ఆర్ కోసం అతడితో చేసిన ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. ఈ అవకాశం కల్పించిన రాజమౌళికి ధన్యవాదాలు. తారక్‌పై నా ప్రేమ అభిమానం ఎప్పటికీ అలాగే ఉంటుంది' అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. -
విజయ సోపానాలు
మానసాన్ని, శరీరాన్ని సరైన గమ్యం వైపు నడిపించడమే ఏకాగ్రత. నిశ్చయమైన, నిశ్చలమైన బుద్ధి దీనికి తోడ్పాటును అందిస్తుంది. ఏ విషయం మీదనైనా ఏకాగ్రత కుదిరినప్పుడే అద్వితీయమైన విజయాలను సొంతం చేసుకోవచ్చునని చరిత్ర సాక్షిగా మనకు తెలుస్తుంది. ధనార్జనలోనైనా, కార్యసాధనలోనైనా, చేయదలచిన ఏ కార్యంలోనైనా, ఏకాగ్రతాశక్తి ఎంత అధికంగా ఉంటుందో ఆ కార్యం అంత చక్కగా జరిగి, విజయం సిద్ధిస్తుంది. ఒకే రకమైన అర్హతలూ, తెలివి తేటలూ ఉన్నా, విజయలక్ష్మిని సొంతం చేసుకునే వారు మాత్రం కొందరే ఉంటారు. దానికి కారణం వారి వ్యక్తిత్వంలోని విశిష్టశైలి, ప్రవర్తనలోని ప్రత్యేకమైన సుగుణాలు. విజేతలు తమ విజయానికి సోపానాలుగా మలచుకునే కొన్ని అరుదైన లక్షణాలను తమ వ్యక్తిత్వానికి అలకరణలుగా నిలుపుకుని ఉద్యమిస్తూ ఉంటారు. తాను విజేతను కావాలని కలలుగనేవారు ముందుగా సాధించబూనిన కార్యానికి సంబంధించిన అంశాన్ని జీవనధ్యేయం గా మలచుకోవాలి. ఆ భావాన్నే శ్వాసగా, ధ్యాసగా నిలుపుకుని ముందుకు సాగాలి. తన శరీరంలోని మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతి అంగమూ మహత్తరమైన ఆ భావంతో తాదాత్మ్యం చెందాలి. తామర తంపరగా మనల్ని చుట్టుముట్టే మిగిలిన భావాలకు సంబంధించిన ఆలోచనలను పక్కకు నెట్టేయాలి. కార్యాన్ని ఏ విధంగా సాధించ దలచుకున్నారో దానికి సంబంధించిన నిర్దిష్టమైన ఆలోచనతో పురోగమించాలి. ఆలోచనే ఏ మనిషినైనా కార్యాన్ముఖుని చేయగల గొప్ప శక్తి. ఇది విజయానికి ప్రథమ సోపానం. విజేతగా నిలవాలని భావించే వ్యక్తి పట్టించుకోకూడనివి, పయనించే మార్గంలో వారికి ఎదురయ్యే అపజయాలు. విజయసాధనలో అత్యంత ముఖ్యమైనది అపజయాలను లెక్కచేయకుండా, ముందుకు సాగడమే. అపజయాలు మనకు అపకారాలు చేయవు. మనకున్న అవకరాలూ కావు. అవి విజయానికి సాధకుని మరింతగా సన్నద్ధం చేసే గొప్ప అలంకారాలు. స్వల్పమైన అపజయం కలుగ గానే రకరకాల ఆలోచనలు, ముఖ్యంగా ప్రతికూల వాతావరణాన్ని సృష్టించే తలపులు మదిలో ముసురుకుని దాడి చేస్తాయి. అప్పుడే, దృఢమైన చిత్తంతో, సంకల్పబలంతో ముందడుగు వేయాలి. స్వామి వివేకానంద చెప్పినట్లుగా ‘‘సాగరంలోని కెరటం కింద పడేది, మరింత ఉధృతమైన శక్తితో పైకి లేవడానికే’’ అన్న వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని అచంచలమైన విశ్వాసంతో పురోగమించాలి. విజయసాధనలో మనిషికి బలవత్తరంగా ఉపకరించే మరొక అపురూపమైన సోపానం ఏకాగ్రత. ఏ రంగంలోనైనా నైపుణ్యాన్ని సాధించాలన్నా, ఎంతటి ఉన్నతమైన విజయాన్ని అందుకోవాలన్నా మనిషికి ఆధారంగా నిలిచేది ఏకాగ్రతే. ఒకరకంగా చెప్పాలంటే విజయసాధన అనే తాళాన్ని తెరిచే తాళపుచెవి ఏకాగ్రత అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. సాధకులు తమలోని సంకల్పబలాన్ని, ఆలోచనను, తమలో ఉన్న చైతన్యాన్ని అంతటినీ జాగృతం చేసి, ఒకేచోట కేంద్రీకృతం చేయడమే ఏకాగ్రత అయితే, మనసు ను ఏకైక విషయం మీద దృష్టిని నిలిపేలా చేయడం ఏకాగ్రతా సిద్ధి. ఏ కార్యంలోనైనా ఏకాగ్రత సాధిస్తే, విజయ శిఖరాన్ని చేరడం ఖాయం. విజయసాధకులకు పెట్టని ఆభరణంలా ఉండే శుభలక్షణం ఆత్మవిశ్వాసం. ఈ విషయాన్ని మణిపూసల వంటి సమాజ సేవకులను, క్రీడాకారులను చూసినప్పుడు మనం స్పష్టంగా గమనించవచ్చు. సమాజ సేవకులను ఉదాహరణగా తీసుకుంటే, వారికి దారిలో కలిగే ప్రతిబంధకాలు అనేకం. ముఖ్యంగా వారు తీసుకు రాదలచినమార్పును అంగీకరించని వ్యక్తుల నుంచి వచ్చే సహాయ నిరాకరణ వంటి అంశాలు ఎప్పుడూ ఈ సేవా దృక్పథం కలిగినవారి మదిలోనే ఉండవు. సమాజహితం కోరి తాము చేయదలచిన కార్యం మాత్రమే వారి మనోయవనిక మీద మనోరమ్యంగా రెపరెపలాడుతూ ఉంటుంది. మనిషికున్న ఆత్మవిశ్వాసమే భౌతికబలాన్ని మించిన నిజమైన బలం. భౌతిక శక్తిని, మానసిక యుక్తిని సమన్వితం చేయడమే మనిషిలో విశ్వాసాన్ని పాదుకొల్పుతుంది. క్రీడాకారులు ఆత్మవిశ్వాసం ప్రకటించడంలో ఎప్పుడూ ఉన్నతస్థానంలోనే ఉంటారు. వారు ఆడే ఆటలోఅంతకుముందు ఉన్న ప్రమాణాలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ, కొత్తప్రమాణాలను నెలకొల్పుతూ ముందుకు సాగడం మనకు ఎన్నో సందర్భాల్లో దీప్తివంతంగా కనబడుతూనే ఉంటుంది. టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణపతకమే దీనికి చక్కని ఉదాహరణ. వందేళ్లకు పైబడి ఏ భారతీయ అథ్లెట్ సాధించని అద్వితీయ విజయం ఈ ఒలింపిక్స్ క్రీడల్లో నీరజ్ సొంతమయ్యింది. అదే విధంగా అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మీరాబాయి చాను ఈ ఒలింపిక్స్ క్రీడల్లోనే వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని సాధించింది. ఈశాన్యభారత రాష్ట్రమైన మణిపూర్ కు చెందిన మీరాబాయి పేదరికాన్ని జయించి, అప్రతిహతమైన పట్టుదలతో విజేతగా నిలిచింది. విజేతలు గుర్తుంచుకోవలసిన లక్షణాలను నిండుగా కలిగిన తెలుగమ్మాయి సింధు మరొక చక్కని ఉదాహరణ. వీరి విజయాలకు మిగిలిన కారణాలు ఎన్నైనా ఉండవచ్చు, ప్రధాన కారణం మాత్రం మొక్కవోని పట్టుదలను ప్రదర్శిస్తూ ‘‘నేను సాధించగలను’’ అని త్రికరణశుద్ధిగా నమ్మిన వారి ఆత్మవిశ్వాసమే అని చెప్పకతస్పదు. విజయ సాధనలో వినయశీలతకూ ప్రధాన భూమికే ఉంది. అహంకరించినవాడు ఎంత శక్తివంతుడైనా, అతి స్వల్ప కాలంలోనే మట్టికరచిన దాఖలాలు మనకు చరిత్రలో ఎక్కువగానే కనబడతాయి. ఉత్తమంగా భాసించే పైన పేర్కొన్న లక్షణాలను సదా దృష్టిలో నిలుపుకుంటే, అవి సాధకునికి మార్గమధ్యంలో ఎదురయ్యే అవరోధపు కవాటాలను దాటించి, విజయ బావుటాను ఖచ్చితంగా ఎగురవేయిస్తాయి. – ‘వ్యాఖ్యాన విశారద’ వెంకట్ గరికపాటి -
విజయం అంటే భయం!
జీవితంలో ఎవరైనా అపజయానికి భయపడతారు. సినిమా తమ సినిమాలు విడుదలైన ప్రతిసారీ రిజల్ట్ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడతారు. ఒక్క ఫెయిల్యూర్ వాళ్ల కెరీర్‌ని నిర్దేశిస్తుంది. అందుకే అపజయం అంటే భయం. కానీ ధనుష్ మాత్రం ఫెయిల్యూర్ కంటే సక్సెస్ తనను మరింత భయపెడుతుందని చెబుతున్నారు. ఒక యాక్టర్‌గా సక్సెస్ ఫెయిల్యూర్స్‌ను మీరెలా డీల్ చేస్తారు? అన్న ప్రశ్నను ధనుష్ ముందు ఉంచితే...‘‘జయాపజయాలను నేను ఒకేలా తీసుకుంటాను. నా సినిమా ఆడనప్పుడు ప్రేక్షకులకు ఎందుకు కనెక్ట్ కాలేదా? అని ఆలోచిస్తా. ఫెయిల్యూర్ని ఎవరూ కోరుకోం కానీ నిజానికి నా సినిమా హిట్ సాధిస్తేనే నాకు ఎక్కువగా భయం ఉంటుంది. ఎందుకంటే సక్సెస్‌ను డీల్ చేయడం కష్టం. ఆ సక్సెస్ మనల్ని, మన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వెట్రిమారన్, ఆర్ఎస్.థురై సెంథిల్‌కుమార్ దర్శకత్వాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నారు ధనుష్. -
హాలిడే జాలిడే
తీరిక లేకుండా పని చేయడం. తీరికగా ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేయడం మహేశ్‌బాబు స్టైల్. తాజాగా ‘మహర్షి’ సినిమాతో పెద్ద సక్సెస్ అందుకున్నారాయన. సినిమా ప్రమోషన్స్‌లో కూడా చాలా చురుకుగా పాల్గొన్నారు. ఇప్పుడు వర్క్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకొని హాలిడేకు వెళ్లారని తెలిసింది. ఈ హాలిడేలో పోర్చుగల్, ఇంగ్లాండ్ దేశాలు చుట్టి వస్తారట. ముందు పోర్చుగల్‌లో హాలిడే ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటిస్తారట. జూన్ 15 మళ్లీ ఇండియా తిరిగి రానున్నారని తెలిసింది. వచ్చే నెల మొదట్లో ఇంగ్లాండ్‌లో ప్రపంచకప్ స్టార్ట్ కానుంది. అక్కడ ఇండియా మ్యాచ్‌లను మహేశ్ చీర్ చేస్తారేమో చూడాలి. తిరిగి రాగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారు మహేశ్. -
అది బోనస్ మాత్రమే!
చేతి నిండా అవకాశాలతో తాప్సీ డైరీ ఫుల్‌గా ఉంది. నార్త్‌లో మంచి జోరు మీదున్న తాప్సీ సౌత్‌లోనూ అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, తాప్సీ కలిసి నటించిన ‘పింక్’ సినిమా సూపర్‌హిట్ కావడం వల్లే బీ టౌన్లో తాప్సీ క్రేజ్ పెరిగిందని కొందరి మాట. ఈ విషయం గురించి ఆమెను అడిగితే..‘‘ప్రస్తుతం హిందీలో నాకు అవకాశాలు పెరిగాయి. కానీ ‘పింక్’ సినిమా సక్సెస్ నా లైఫ్‌లో పెద్దగా మార్పు తీసుకురాలేదు. నా కెరీర్ తొలినాళ్లో నేను నటించిన ‘ఆడుకాలమ్’ సినిమా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. అంతకన్నా ఇంకేం కావాలి. బాలీవుడ్‌కి రావడానికి ముందు నా కెరీర్లో బాక్సాఫీస్ సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను చూశాను. ‘పింక్’ సినిమా సక్సెస్ ఒక బోనస్ మాత్రమే. గెలుపోటములను నేను అంత సీరియస్‌గా తీసుకోను. అలా జరిగిపోతుంటాయంతే. కానీ, నన్ను నేను సీరియస్‌గా తీసుకుంటాను’’ అని పేర్కొన్నారామె. ప్రస్తుతం ‘మిషన్ మంగళ్’ అనే హిందీ చిత్రంతోపాటు, సౌత్‌లో ‘గేమ్ ఓవర్’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు తాప్సీ. ‘పింక్’ సినిమా తర్వాత అమితాబ్, తాప్సీ కలిసి నటించిన ‘బద్లా’ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. -
‘మీ టూ’తో పురుషుల్లో మార్పు!
లైంగిక వేధింపులపై ఉద్యమంలా ప్రారంభమైన ‘మీటూ’.. స్త్రీల పట్ల పురుష వైఖరిలో మార్పుకి కారణమైందా? పురుషులు జాగ్రత్త పడేలా చేసిందా? అంటే దేశంలోని పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రతి ఇద్దరిలో ఒకరు అవునని చెప్పగా.. తాము తోటి మహిళా ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని ప్రతి ముగ్గురిలో ఒకరు అంగీకరించారు. విధులు నిర్వహించిన ప్రాంతాల్లో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను సినీ, మీడియా రంగ ప్రముఖులు పలువురు ఇటీవల ‘మీటూ’ ఆన్లైన్ ఉద్యమం ద్వారా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే పురుషుల ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చిందా? అని ‘యు గవ్ ఇండియా’ అనే సంస్థ ఈ నెల 16 నుంచి 22 వరకు ఓ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలకు చెందిన వెయ్యి మంది స్త్రీ, పురుషుల నుంచి 21 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టింది. వీరిలో పురుషులు 51 శాతం కాగా, మహిళలు 49 శాతం మంది. సర్వేలో తేలిన ప్రధానాంశాలు.. ► ‘మీటూ’ ఉద్యమం ప్రభావంతో ప్రతి ఇద్దరు పురుషుల్లో ఒకరు తాము స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నామన్నారు. మీటూ భయంతో సహోద్యోగులైన స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కేవలం పనికి సంబంధించిన విషయాలకు మాత్రమే పరిమితమవుతున్నామంటూ ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు అంగీకరించారు. అదేవిధంగా పురుషుల్లో మూడోవంతు మంది కార్యాలయాల్లో తమ టీంలోకి మహిళలను తీసుకునే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నామని చెప్పారు. అయితే ‘మీటూ’ ఉద్యమానికి కొంత మంది సానుకూలంగా ఉన్నప్పటికీ స్త్రీల ఉద్యోగ జీవితాల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా తలెత్తుతున్నట్టు సర్వే తేల్చింది. ► పట్టణాల్లో నివసించేవారిలో 76 శాతం మంది లైంగిక వేధింపులను తీవ్రమైన సమస్యగా భావిస్తున్నారు. మహిళల్లో అత్యధికంగా 87 శాతం మంది లైంగిక వేధింపులు తీవ్రంగా ఉన్నాయని తెలపగా, పురుషుల్లో 66 శాతం మంది మాత్రమే ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు. యువతరం (18–39 ఏళ్ల వారు) లైంగిక వేధింపులను తీవ్రమైందిగా భావిస్తుండగా 40 ఏళ్ల వయస్సు వారు మాత్రం అంత తీవ్రమైన సమస్యగా అనుకోవడం లేదు. యువతరంలో 83 శాతం మంది ‘మీటూ’ని సీరియస్‌గా భావిస్తుండగా, 40 ఏళ్ల వారిలో 63 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. ► సర్వేలో ఎక్కువ మంది తమ అంగీకారం లేకుండా తాకడం, అసభ్య చిత్రాలూ, మెసేజ్‌లూ పంపించడం లైంగిక వేధింపుగానే భావిస్తామన్నారు. ► బాలీవుడ్లో లైంగిక వేధింపులు ఎక్కువ. ఆ తరువాతి స్థానం రాజకీయాలదే. ► దాదాపు 43 శాతం మంది తమకు లైంగిక వేధింపుల బాధితులెవరో తెలుసునని పేర్కొనగా, 36 శాతం మంది నిందితులెవరో తెలుసుని చెప్పారు. -
ఆ తప్పు చేయను
‘‘ఫెయిల్ అవ్వడం తప్పు కాదు. కానీ ఆ ఫెయిల్యూర్ నుంచి ఓ పాఠం నేర్చుకోకపోవడం తప్పు. నేను ఆ తప్పు చేయను’’ అంటున్నారు కథానాయిక శ్రద్ధా కపూర్. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘ప్రతి ఒక్కరి లైఫ్‌లో గెలుపు ఓటములు సహజం. అందుకు నేనేమీ మినహాయింపు కాదు. వాస్తవానికి నా తొలి రెండు సినిమాలు ఆడలేదు. అయినా నేను నిరుత్సాహపడలేదు. సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను ఎలా డీల్ చేయాలో నేర్చుకున్నా. సినిమా రిజల్ట్‌ని ఆడియన్స్ ఎలాగూ డిసైడ్ చేస్తారు. సో.. ఆ సినిమాకు నేనెంత కష్టపడ్డానని మాత్రమే ఆలోచించుకుంటా. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సవాళ్లకు ఎప్పుడూ సిద్ధమే’’ అని పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే... ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సాహో’ సినిమాతో కథానాయికగా శ్రద్ధాకపూర్ సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు శ్రద్ధా కపూర్. ఇక బీటౌన్‌లో ఆమె నటించిన ‘స్త్ర్రీ’ ఈ నెల 31న, ‘బట్టీగుల్ మీటర్ చాలు’ సెప్టెంబర్ 21న విడుదల కానున్నాయి. అటు హిందీ ఇటు తెలుగు సినిమాలతో ఈ బ్యూటీ బిజీ. -
ఎంసెట్–3 ప్రశాంతం
69 శాతం హాజరు నమోదు పడిపోయిన హాజరు శాతం కమాన్‌చౌరస్తా : ఎంసెట్–3 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరిగింది. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో2, ఎస్సారార్ కళాశాలలో 2, శాతవాహనలో 2, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ జూనియర్ కళాశాలలో ఒకటి చొప్పున మెుత్తం 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3,361 మంది విద్యార్థులకు 2,320 మంది పరీక్షకు హాజరయ్యారుకాగా 69 శాతం హాజరు నమోదైంది. ఎంసెట్–2 పరీక్షకు 91.5 శాతం హాజరు నమోదు కాగా ప్రస్తుతం సుమారు 30 శాతం వరకు తగ్గింది. బయోమెట్రిక్ విధానంతో విద్యార్థులు హాజరు నమోదు చేశారు. కొన్ని కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలు మెురాయించినా సిబ్బంది సరిచేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమనే అధికారులు ఆదేశాలతో ఎక్కువ మంది అభ్యర్థులు 10 గంటల్లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ‘నిమిషం’ నిబంధనతో కొందరు పరీక్ష రాసే అవకాశం కోల్పోయినట్లు తెలిసింది. -
గనులన్నీ మూతబడి..
బొగ్గు బావుల్లో సార్వత్రిక సమ్మె సక్సెస్ స్వచ్ఛందంగా పాల్గొన్న కార్మికులు నిలిచిన బొగ్గు లారీలు, డంపర్లు సింగరేణిలో సమ్మె విజయవంతమైంది. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. గురువారం రాత్రి షిఫ్టు విధులకు హాజరైన కార్మికులతోనే పనులు కొనసాగించారు. భూగర్భ, ఓపెన్ కాస్టు గనులు, డిపార్ట్మెంట్లు, స్టోర్స్, వర్కషాపులు కార్మికుల లేక వెలవెలబోయాయి. రుద్రంపూర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె జిల్లాలోని సింగరేణి ప్రాంతాల్లో విజయవంతమైంది. కొత్తగూడెం ఏరియాలో అత్యవసర సిబ్బంది మినహా ఇతర కార్మికులు విధులకు హాజరుకాలేదు. గురువారం నైట్‌షిఫ్ట్‌కు వచ్చిన కార్మికులను ఇళ్లకు పంపించకుండా వారితోనే ఏరియా అధికారులు ఉత్పత్తిని కొనసాగించారు. జీకే ఓసీ, జేవీఆర్ ఓసీ, పీవీకే–5బీ, వీకే–7, ఎస్అండ్ పీసీ, ఏరియా స్టోర్స్, ఏరియా వర్క్‌షాప్, సివిల్ డిపార్ట్మెంట్, ఎంవీటీసీ, డిస్సెన్సరీ, గెస్ట్ హౌస్, ఏజెంట్, జీఎం ఆఫీసుల్లో 3,586 మంది కార్మికులు హాజరు కావాల్సి ఉండగా, 1034 మంది కార్మికులు మాత్రమే విధులకు హాజరయ్యారు. 155 మంది కార్మికులు లీవ్‌లో ఉండగా సుమారు 2400 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొనడంతో ఓసీలో ఓబీ పనులు నిలిచాయి. బొగ్గు రవాణాలేని కారణంగా ఆర్సీహెచ్పీలో లారీలు నిలిచిపోయాయి. కాగా ఉత్పత్తి సజావుగా సాగిందని అధికారులు చెప్పుకొస్తున్నారు.