పరీక్ష రాస్తున్న విద్యార్థులు
-
69 శాతం హాజరు నమోదు
-
పడిపోయిన హాజరు శాతం
కమాన్‌చౌరస్తా : ఎంసెట్–3 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరిగింది. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో2, ఎస్సారార్ కళాశాలలో 2, శాతవాహనలో 2, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ జూనియర్ కళాశాలలో ఒకటి చొప్పున మెుత్తం 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3,361 మంది విద్యార్థులకు 2,320 మంది పరీక్షకు హాజరయ్యారుకాగా 69 శాతం హాజరు నమోదైంది. ఎంసెట్–2 పరీక్షకు 91.5 శాతం హాజరు నమోదు కాగా ప్రస్తుతం సుమారు 30 శాతం వరకు తగ్గింది. బయోమెట్రిక్ విధానంతో విద్యార్థులు హాజరు నమోదు చేశారు. కొన్ని కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలు మెురాయించినా సిబ్బంది సరిచేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమనే అధికారులు ఆదేశాలతో ఎక్కువ మంది అభ్యర్థులు 10 గంటల్లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ‘నిమిషం’ నిబంధనతో కొందరు పరీక్ష రాసే అవకాశం కోల్పోయినట్లు తెలిసింది.