షార్లెట్‌లో వైఎస్సార్‌సీపీ సిద్ధం! | Siddham Meeting Grand Success In Charlotte, North Carolina - Sakshi
Sakshi News home page

షార్లెట్‌లో వైఎస్సార్‌సీపీ సిద్ధం!

Published Thu, Mar 28 2024 9:52 AM | Last Updated on Thu, Mar 28 2024 10:38 AM

The Siddham Meeting Held In Charlotte North Carolina Grand Success - Sakshi

నార్త్ కరోలినా షార్లెట్‌లో నిర్వహించిన సిద్ధం సభ విజయవంతమైంది. కారుమూరు శివారెడ్డి నాయకత్వములో దుష్యంత్ ఎల్లపల్లి, సతీష్ కర్నాటి, సంజీవ రెడ్డి, సబ్బసాని, సతీష్ వద్దిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏపీ సీఎం జగన్‌ కోసం తాము కూడా సిద్ధం అని అమెరికాలోని ప్రవాసులు ప్రకటించారు.

ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పడ్డ తండ్రికి తగ్గ తనయుడుగా నేను విన్నాను నేను ఉన్నాను అని, కరోనా కష్టాలను కూడా అధికమించి ప్రజలకు ఎంతో మేలు చేసిన మన ప్రియతమా ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌ని మళ్లీ గెలిపించు కోవడానికి మేము సిద్ధం అని అందరు నినదించారు.

మహిళలు సైతం మేం సిద్ధం అంటూ మద్దతుగా కేరింతలు కొడుతూ.. సందడి చేశారు. జై జగన్ జై జగన్ అంటూ నినదించటంతో ఆడిటోరింలో సందడివాతావరణం నెలకొంది. వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.

(చదవండి: చంద్రబాబు ఫ్రెండ్‌ ఈశ్వరన్‌పై మొత్తం 35 కేసులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement