Siddham
-
మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
ఏలూరు, సాక్షి: చంద్రబాబు ప్రలోభాలకు గురి కావొద్దని.. మళ్లీ మోసపోవద్దని కైకలూరు ఓటర్లకు సీఎం జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. పథకాలు కొనసాగాలన్నా.. ఇంటింటా అభివృద్ధి జరగాలన్నా మీ బిడ్డ జగన్‌ను మళ్లీ ఆశీర్వాదించాలని కోరారాయన. కైకలూరులో జరిగిన ఎన్నికల ప్రచార భేరిలో ఆయన మాట్లాడుతూ..కైకలూరు సిద్ధమా?.. ఇంతటి ఎండను ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లేదు. ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా అందరి ముఖంలో చిక్కటి చిరునవ్వు కనిపిస్తోంది. మీ అందరి ప్రేమానురాగాలు, మీ అందరి ఆప్యాయతల నడుమ.. ఇక్కడకు వచ్చిన నా ప్రతీ అక్కకూ, నా చెల్లెమ్మకి, నా ప్రతీ అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతీ సోదరుడికి, నా ప్రతీ స్నేహితునికీ ..మీ అందరికి మీ బిడ్డ జగన్ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.మరో 36 గంటల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. పొరపాటున చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. అక్కచెల్లెమ్మల కోసం మీ బిడ్డ జగన్ వివిధ పథకాల కోసం 130 సార్లు బటన్ నొక్కాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఏదేళ్లు ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ కావడం అనేది గతంలో ఎప్పుడైనా జరిగిందా?.గతంలో ఎప్పుడూ చూడని విధంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 59 నెలల పాలనలో మీ బిడ్డ ఇవ్వగలిగాడు. ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవారు. ఎన్నికలయ్యాక చెత్త బుట్టలో వేసే పరిస్థితిని మీ బిడ్డ మార్చాడు. ఏకంగా 99% హామీలు నెరవేర్చి, ఆ మేనిఫెస్టోను ప్రతీ అక్కచెల్లెమ్మల ప్రతీ ఇంటికి పంపించాడు. మీరే టిక్కు పెట్టండి అంటూ విశ్వసనీయత పరిస్థితి ఈ 58 నెలల కాలంలోనే జరిగింది.ఇప్పుడు నేను గడగడా గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు చెబుతా. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు.. ఐబీ దాకా ప్రయాణం. గవర్నరమెంట్ బడుల్లో చదివే పిల్లల కోసం బైలింగువల్ టెక్స్ట్ బుక్‌లు. బడులు తెరిచేసరికే విద్యాకానుక. బడుల్ పిల్లలకు గోరుముద్ద. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా.. పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి. పెద్ద చదవుల కోసం ఏ తల్లీ తండ్రీ అప్పులపాలు అవ్వకూడదని.. మెడిసిన్, డిగ్రీలు చదువుతున్న పిల్లల కోసం అప్పులపాలయ్యే పరిస్థితి లేకుండా 93 శాతం పూర్తి ఫీజులు కడుతూ.. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన.మొట్టమొదటిసారిగా డిగ్రీలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సర్టిఫైడ్ కోర్సులు.. మాండేటరీ ఇంటర్న్‌షిప్.. ఈ చదువుల విప్లవాలు గతంలో ఏనాడైనా జరిగాయా?అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా.. వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని.. నా అక్కచెల్లెమ్మల కోసం ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో ఏకంగా కడుతున్న ఏకంగా 22 లక్షల ఇళ్లు.. ఇంతగా అక్కచెల్లెమ్మల కోసం తాపత్రయపడిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా?గతంలో ఎప్పుడూ జరగని విధంగా.. అవ్వాతాతలకు నేరుగా ఇంటి వద్దకే పెన్షన్. ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు. ఇంటి వద్దకే పథకాలు.. గతంలో మీ ఇంటి వద్దకే ఎప్పుడైనా వచ్చాయా?. ఇంటికే పెన్షన్ వచ్చిందా?. ఇంటికే రేషన్ వచ్చిందా.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇప్పుడు జరిగింది. మొట్టమొదటిసారిగా.. రైతన్నకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ.. పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా. రైతన్నలకు ఉచిత పంటలబీమా. సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ. రైతన్నలకు పగటి పూటే 9 గం.ల నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నల చేయి పట్టుకుని నడిపించే గ్రామంలో ఒక ఆర్బీకే వ్యవస్థ.. గతంలో ఇన్నిన్ని మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి తోడుగా.. అండగా.. సొంతంగా ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవర్ అన్నదమ్ములకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా.. ఫుట్‌పాత్‌ల ఉన్న నా అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలు, కూరగాయలు అమ్ముకునేవాళ్లు, ఫుట్‌పాత పక్కన ఇడ్లీలువేసుకునేవాళ్లు.. వారి కోసం ఈరోజు జగనన్న తోడు. రజకులకు, బ్రహ్మణులకు ఓ చేదోడు, లాయర్లకు ఒక లా నేస్తం. గతంలో ఇన్ని పథకాలు ఏనాడైనా ఉన్నాయా?.గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని.. మొట్టమొదటిసారిగా ఆరోగ్యరక్షగా విస్తరించిన ఆరోగ్యశ్రీ. ఉచితంగా రూ.25 లక్షల దాకా విస్తరించిన ఆరోగ్యశ్రీ. ఆపరేషన్ అయ్యాక రెస్ట్ పీరియడ్‌లో పేదవాడికి ఆరోగ్య ఆసరా. మొట్టమొదటిసారిగా గ్రామంలోనే విలేజ్ క్లినిక్. ఆ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. పేదవాడి కోసం ఇంటి వద్దకే టెస్టులు చేస్తూ.. మందులిస్తున్న ఆరోగ్య సురక్ష. ఇంతగా పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకున్న పరిస్థితులు ఉన్నాయా?.గ్రామంలో అయినా 600 సేవలు అందిస్తూ కనిపిస్తున్న సచివాలయం. అదే గ్రామంలో వలంటీర్ వ్యవస్థ. నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ ఓ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే కనిపిస్తుంది ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరరీ. మొట్టమొదటిసారి నా అక్కచెల్లెమ్మల కోసం.. వాళ్ల రక్షణ కోసం గ్రామంలోనే మహిళా పోలీస్. మొట్టమొదటిసారి అక్కచెల్లెమ్మల కోసం ఫోన్లోనే దిశ యాప్. దిశ యాప్ ద్వారా అక్కచెల్లెమ్మలు ఏ ఆపదలో ఉన్నా.. ఫోన్ ఐదుసార్లు షేక్ చేసినా పోలీసులు వచ్చి ‘‘చెల్లెమ్మా ఏం జరిగింది?’’ అని అడుగుతున్న పరిస్థితి. గతంలో ఇలాంటి పరిస్థితులు చూశారా? ఆలోచన చేయండి.పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి.. మూడుసార్లు సీఎం చేశానంటాడు. మరి పేదవాళ్లకు ఒక్కటంటే ఒక్కటైనా మంచి గుర్తుకొస్తుందా?.(లేదు.. అనే సమాధానం వచ్చింది). చంద్రబాబు పేరు చెబితే ఏ పథకం కూడా గుర్తుకు రాదు. ఏ మంచి గుర్తుకు రాలేదు. ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు.. మోసాలు.ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ).. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ ఫాంప్లెట్ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి.. సంతకం పెట్టిన ఈ ఫాంప్లెట్‌ను మీ ప్రతి ఇంటికీ పంపించాడు. 2014 ప్రజలు నమ్మి చంద్రబాబుకి ఓటేశారు. ముఖ్యమైన హామీలంటూ ప్రతీ ఇంటికి పంపించిన వాటిల్లో ఒక్కటైనా చేశారా?.రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు ఈ పెద్దమనిషి చంద్రబాబు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు.. మాఫీ అయ్యాయా?. రెండో హామీ.. పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ రద్దు చేస్తానన్నాడు. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాలు ఒక్క రూపాయైనా మాఫీ అయ్యాయా?. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ వేస్తామన్నారు చంద్రబాబు. నేను అడుగుతున్నాను.. రూ.25 వేల కథ దేవుడెరుగు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కదా? ఒక్కరి అకౌంట్లో అయినా కనీసం ఒక్క రూపాయి అయినా చంద్రబాబు వేశారా? అని అడుగుతున్నా.అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు. చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా?. ఇంటింటికీ ఉద్యోగం అన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నారు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చారా?రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నారు? చేశారా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నారు? చేశారా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నారు.. చేశారా? కైకలూరులో ఏమైనా జరిగిందా? పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చారా? దాన్నీ అమ్మేశారు. మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా?..మళ్లీ ఇదే ముగ్గురూ.. ఇదే కూటమి.. ఇదే చంద్రబాబు.. సూపర్ సిక్స్ అంట.. నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట.. నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట.. నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు అంట.. నమ్ముతారా? ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.ఇలాంటి అబద్ధాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు ప్రలోభాలను నమ్మొద్దు. ఐదేళ్లు మీ అందరికి క్యాలెండర్‌ఇచ్చి.. ఏ నెలలో ఏం చేస్తాం అనేది.. ఏ నెలలో చేయూత, అమ్మ ఒడి అని ప్రతీ నెలా.. క్రమం తప్పకుండా చేస్తున్న మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి. చంద్రబాబు ప్రలోభాలతో మోసపోకండి. జరుగుతున్న మంచిని పొగొట్టుకోకండి.వలంటీర్లు ఇంటికే రావాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా.. నొక్కిన బటన్ డబ్బులు మళ్లీ నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాలో పడాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.కొల్లూరు సమస్య పరిష్కారం కావాలన్నా.. మీ బిడ్డ సీఎం కావాలి. చెప్పిన మాట ప్రకారం సర్వే జరుగుతోంది. సర్వేకు సంబంధించిన రిపోర్టు పూర్తికాగానే.. అదనపు భూమిని పంచుతాం. అదీ బిడ్డ జగన్ చేతుల మీదుగానే జరుగుతుంది.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ.. మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్.. చెల్లి మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి. బీజేపీ ఎక్కడ ఉండాలి.. సింక్‌లోనే ఉండాలి. కాదు.. చెరువులో ఉండాలి.వైఎస్సార్సీపీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీఎన్ఆర్(దూలం నాగేశ్వరరావు) , కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెలమలశెట్టి సునీల్ గెలిపించాలని సీఎం జగన్ ప్రజలను కోరుతూ ప్రసంగం ముగించారు. -
చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోవొద్దు: సీఎం జగన్
పల్నాడు, సాక్షి: చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు చెబుతారని.. అధికారంలోకి వచ్చాక మాయలు, మోసాలే ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం ఉదయం చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. .. ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ).. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడ్డారు. ఈ ఫాంప్లెట్ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి.. ముఖ్యహామీలంటూ ప్రతి ఇంటికీ పంపించారు. నేను ఇవాళ అడుగుతున్నాను. మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా?చంద్రబాబు విఫల హామీలుమొదటిది.. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా?. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాల్లో.. ఒక్క రూపాయైనా మాఫీ చేశారా?. మూడో ముఖ్యమైన హామీ.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. రూ.25 వేల కథ దేవుడెరుగు.. కనీసం ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో వేశారా?..ప్రతి ఇంటికీ ఉద్యోగం అన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నారు. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నారు , చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నారు. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నారు. సింగపూరుకు మించి అభివృద్ధి అన్నారు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు?.. జరిగిందా? మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా? అక్కా నమ్ముతారా? అన్నా నమ్ముతారా? చెల్లి నమ్ముతారా? మరి ఆలోచన చేయమని అడుగుతున్నాను. మళ్లీ ఇదే ముగ్గురూ కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడి ఏమంటున్నారు? ఇవాళ మళ్లీ కొత్త మేనిఫెస్టో అంట, సూపర్ సిక్స్ అంట.. నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట.. నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట.. నమ్ముతారా?.. ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.చంద్రబాబు పెట్టే ప్రలోభాలకు లొంగిపోవద్దు. ఈ ఐదు సంవత్సరాల మీ బిడ్డ పాలనలో క్యాలెండర్ ఇచ్చి మరీ.. ఏ నెలలో అమ్మ ఒడి, చేయూత అని ఫలానా నెలలో ఫలానా ఇస్తామని చెప్పి మరీ మేలు చేశాడు. పొరపాటును చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి.. ఇంటికి జరుగుతున్న మంచిని పొగొట్టుకోవద్దు.వాలంటీర్లు ఇంటికే రావాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా.. నొక్కిన బటన్ డబ్బులు మళ్లీ నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాలో పడాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి. వైఎస్సార్సీపీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావటి మనోహర్ నాయుడు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్‌లను గెలిపించాలని సీఎం జగన్ చిలకలూరిపేట ప్రజలను కోరుతూ ప్రసంగం ముగించారు. సెల్ఫీతో సీఎం జగన్ సందడిచిలకలూరిపేటలో ఎన్నికల ప్రచారం ముగించుకుని కైకలూరు బయల్దేరిన సమయంలో కొందరు అభిమానులు సీఎం జగన్‌తో సెల్ఫీ కోరారు. తన ప్రచార రథం దిగి కిందకు వచ్చిన ఆయన.. వాళ్లతో సరదాగా సెల్ఫీ దిగారు. ఆపై అశేష జనవాహిని నడుమ సీఎం జగన్ ప్రచార రథం నెమ్మదిగా ముందుకు సాగింది. -
బాలకృష్ణ, దత్తపుత్రుడికి జిరాక్స్ కాపీలిచ్చారా?: సీఎం జగన్
పల్నాడు, సాక్షి: లంచాలు,అవినీతి లేని పాలనతో పథకాలు కొనసాగాలన్నా, ఇంటింటి అభివృద్ధి జరగాలన్నా.. జగన్‌కు ఓటేయాలని, పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ముగింపుతో పాటు మోసపోతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం ఉదయం చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.చిలకలూరిపేట సిద్ధమా?.. దేవుడి దయతో ఇవాళ వాతావరణం చల్లగా ఉంది. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ మీ బిడ్డకు అండగా, తోడుగా ఉంటున్న నా ప్రతీ అక్కకూ, నా చెల్లెమ్మకి, నా ప్రతీ అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతీ సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరికి మీ బిడ్డ జగన్ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.జరగనున్నాయి ఎన్నికల సమరం. బ్యాలెట్ బద్దలు కొట్టేందుకు సిద్ధమేనా?. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది గతంలో జరిగాయా?గతంలో ఎప్పుడూ చూడని విధంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 59 నెలల పాలనలో మీ బిడ్డ ఇవ్వగలిగాడు. ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవారు. ఎన్నికలయ్యాక చెత్త బుట్టలో వేసే పరిస్థితిని మీ బిడ్డ మార్చాడు. మేనిఫెస్టోను ఒక బైబుల్ గా ఒక ఖురాన్‌గా ఒక భగవద్గీతగా నిర్వచనమిస్తూ.. ఏకంగా 99% హామీలు నెరవేర్చి, ఆ మేనిఫెస్టోను ప్రతీ అక్కచెల్లెమ్మల ప్రతీ ఇంటికి పంపించాడు. మీరే టిక్కు పెట్టండి అంటూ విశ్వసనీయత పరిస్థితి ఈ 58 నెలల కాలంలోనే జరిగింది.ఇప్పుడు నేను గడగడా గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు చెబుతా. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు.. ఐబీ దాకా ప్రయాణం. గవర్నరమెంట్ బడుల్లో చదివే పిల్లల కోసం బైలింగువల్ టెక్స్ట్ బుక్‌లు. బడులు తెరిచేసరికే విద్యాకానుక. బడుల్ పిల్లలకు గోరుముద్ద. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా.. పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి. పెద్ద చదవుల కోసం ఏ తల్లీ తండ్రీ అప్పులపాలు అవ్వకూడదని.. మెడిసిన్, డిగ్రీలు చదువుతున్న పిల్లల కోసం 93 శాతం పూర్తి ఫీజులు కడుతూ.. ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా జరిగాయా?నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని.. నా అక్కచెల్లెమ్మల కోసం ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో ఏకంగా కడుతున్న ఏకంగా 22 లక్షల ఇళ్లు.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్. ఇంటి వద్దకే రేషన్, పౌర సేవలు. పథకాలు.. గతంలో మీ ఇంటి వద్దకే ఎప్పుడైనా వచ్చాయా?. గతంలో ఎప్పుడైనా జరిగిందా?, మొట్టమొదటిసారిగా.. రైతన్నకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ.. పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా. మొదటిసారిగా రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, మొట్టమొదటిసారిగా సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, మొట్టమొదటిసారిగా పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, గ్రామంలో ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇన్నిన్ని మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుతూ.. సొంతంగా ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా.. ఫుట్‌పాత్‌ల మీద శ్రమజీవులను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా?. ఇవాళ వాళ్లకు ఓ తోడు.. బ్రహ్మణులకు, రజకులకు ఓ చేదోడు, లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?ఏ పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని.. ఏకంగా రూ. 25 లక్షలకు విస్తరించిన ఆరోగ్యశ్రీ. రెస్ట్ పీరియడ్‌లో పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్ క్లినిక్. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. ఇంటికే టెస్టులు చేస్తూ.. మందులిస్తున్న ఆరోగ్య సురక్ష. ఇంతంగా పేదవాడి ఆరోగ్యం కోసం ఇంతలా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా?.గ్రామంలోకి అడుగుపెడుతూనే ఒక సచివాలయ వ్యవస్థ. ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడు ద్వారా బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూల్. మరో నాలుగు అడుగులు వేస్తే కనిపిస్తుంది ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరరీ. మొట్టమొదటిసారి నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. మొట్టమొదటిసారి అక్కచెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్. ఏ ఆపదలో ఉన్నా.. ఫోన్ ఐదుసార్లు షేక్ చేసినా చెల్లెమ్మా ఏం జరిగింది అని అడుగుతున్న పరిస్థితి. లంచాలు, అవినీతి లేని పాలన.. నేను చెప్పినవన్నీ కూడా గతంలో లేనివి...మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలల్లో జరిగినవి.. నిజమా? కాదా? అని అడుగుతున్నాను.కుట్రలు గమనించాలిజరగబోయేది రెండు కులాల మధ్య యుద్ధం కాదు. రెండు సిద్దాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది. పేదవాడు ఒకవైపు.. పెత్తందారు ఒకవైపు ఉన్నారు. జరుగుతున్న కుట్రలు గమనించాలి. రెండు నెలల కింద దాకా అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికే వచ్చేది. అలాంటిది.. ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందో అని పెన్షన్ ఆపేసి.. ఆ అవ్వాతాతల ఉసురు తగిలించుకున్నారు.ఏ ప్రభుత్వమైన 60 నెలల కోసం ప్రజలు ఎన్నుకుంటారు. కానీ, 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కిన సొమ్మును ఆ అక్కాచెల్లెమ్మలకు ఇవ్వకుండా ఢిల్లీతో కలిసి కుట్రలు చేస్తున్నారు. ఈ డబ్బంతా ఎన్నికలయ్యాక ఇస్తారట. 14వ తేదీ ఇస్తారట. ఇది కుట్ర కాదా?. అయినా ఫర్వాలేదు. కారణం ఏంటంటే.. నాకు కావాల్సింది.. నా అక్కాచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం. వాళ్ల పిల్లల చదువులు, రైతన్నల ముఖంలో సంతోషం.అలాగే.. ల్యాండ్ టైటిలింగ్‌యాక్ట్, రిజిస్ట్రేషన్ల మీద ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో చూస్తున్నాం. ఇదే చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ విశాఖలో, దత్తపుత్రుడు(పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి..) ఏపీలో భూములు కొన్నారు. మరి వారికి ఒరిజినల్ ఇచ్చారా?.. మరి జిరాక్స్‌లు ఇచ్చారా? అని అడుగుతున్నా. ఏపీలో 9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ, చంద్రబాబు దుష్ప్రచారం ఏ స్థాయిలో ఉందో గమనించాలి అని సీఎం జగన్ కోరారు. -
పిఠాపురంతోనే సీఎం జగన్ లాస్ట్ పంచ్
గుంటూరు, సాక్షి: లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా.. పవన్ కల్యాణ్ సినిమాలోని డైలాగ్ ఇది. కానీ, రియల్‌లైఫ్‌లో పవన్‌కు ఆ పంచ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుచిచూపించన్నారా?. ఎన్నికల ప్రచారంలో ఇవాళ ఆఖరు తేదీ కాగా.. వైఎస్సార్సీపీ తరఫున చివరి ప్రచార సభను పిఠాపురంతోనే ముగించబోతున్నారు ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్.ఒకవైపు ఓట్ల కోసం కూటమి నేతల పరుగులు.. మరోవైపు 59 నెలల పాలన, జరిగిన సంక్షేమాన్ని వివరిస్తూనే ప్రత్యర్థులపై పంచ్‌లతో సాగిన సీఎం జగన్ ప్రసంగాలు.. అన్నీ.. అన్నీ.. ఇవాళ్టి సాయంత్రంతో బంద్ కానున్నాయి. ఆ వెంటనే ఏపీలో సైలెంట్ పీరియడ్ మొదలుకానుంది. అయితే ఈ ఎన్నికల ప్రచారం సీఎం జగన్ దూకుడుతో.. ప్రత్యర్థి పార్టీలు ఏమాత్రం పోటీ పడలేకపోయాయన్నది వాస్తవం. ఇక సంక్షేమ పాలనతో దేశ రాజకీయాల్లోనే ట్రెండ్ సెట్టర్‌గా మారిన సీఎం జగన్.. ప్రచారంలోనూ కొత్త ఒరవడి సృష్టించారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి ఏపీలో ఎన్నికల ప్రచారం కొనసాగింది. అందుకు ప్రధాన కారణం.. సీఎం జగన్. ఎన్నికల కోసం పార్టీని ముందు నుంచే ‘సిద్ధం’ చేస్తూ వచ్చిన ఆయన.. 44 రోజుల్లో ఏకంగా 118 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి రికార్డు సృష్టించారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఆఖరికి ప్రచార సభలతో జనంలోకి వెళ్లి.. అపూర్వ స్పందన దక్కించుకున్నారు. ప్రచార వేదికలపై ర్యాంప్ వాక్.. ఏ రాజకీయ నాయకుడి నుంచైనా ఊహించగలమా?. ఈ చర్యతో తన ప్రత్యేకతను చాటుకోవడం మాత్రమే కాదు.. ప్రత్యర్థులు, పచ్చ మీడియా ఎంతగా విషం చిమ్మిన ప్రజలకు ఎప్పుడూ తాను దగ్గరేనని చాటి చెప్పారు. తన సభలకు వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలతో ప్రసంగాలను మొదలుపెట్టి.. తనకు ఓటేస్తే పథకాల కొనసాగింపు, అదే చంద్రబాబుని నమ్మి ఓటేస్తే ఏం జరుగుతుందో గతాన్ని గుర్తు చేస్తూ మరి ఏపీ ప్రజలకు వివరించారాయన.బాబుకి ఓటేస్తే.. చంద్రముఖి నిద్రలేచి లక లక అంటూ ప్రజల రక్తం తాగుతుందిబాబుని నమ్మితే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లేజగన్‌కు ఓటేస్తే పథకాల కొసాగింపు.. ఇంటింటా అభివృద్ధిఅదే పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే.. పథకాల ముగింపు, మళ్లీ మోసపోవడమేమంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి 59 నెలల పాలనలో జరిగిన విప్లవాత్మక మార్పులు, బడుల మొదలు గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, అక్కచెల్లెమ్మలకు, అవ్వతాతలకు, అన్ని వర్గాలకు చేకూరిన లబ్ధిని వివరిస్తూ.. డీబీటీ ద్వారా బటన్‌నొక్కి నేరుగా 2 లక్షల 70వేల కోట్ల రూపాయలను ఎలాంటి సంక్షేమానికి ఖర్చు చేశారో వివరిస్తూ వచ్చారు. ‘‘మీ ఇంట మంచి జరిగితేనే నాకు అండగా ఉండాలని.. ఆలోచనతో ఓటు వేయాలి’’ అని కోరిన ఏకైక నాయకుడిగా గుర్తింపు దక్కించుకున్నారు.ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలు పేదల తలరాతను మారుస్తాయని, పేదల మీద జగన్‌కు ఉన్నంత ప్రేమ మరెవ్వరికీ ఉండబోదని, పేద లబ్ధిదారులే తనకు స్టార్ క్యాంపెయినర్లు అని ప్రకటించుకుని.. వాళ్ల ద్వారానే జరిగిన సంక్షేమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.మేనిఫెస్టోను చెత్త బుట్టలో వేసే సంప్రదాయాన్ని చెరిపేసి.. పవిత్రంగా భావిస్తూ 99 శాతం హామీల్ని అమలు చేయడం, ఇప్పుడూ ఆ మేనిఫెస్టోను ఇంటింటికి పంపించి ఆశీర్వదించడమని అడగడం.. అదే మేనిఫెస్టోతో 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది పూస గుచ్చినట్లు వివరించారాయన. సంక్షేమం కొనసాగాలన్నా.. వలంటీర్లు పెన్షన్లు అందించాలన్నా.. ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని కోరారు. 175 సీట్లకు 175 అసెంబ్లీ సీట్లు, 25 కి 25 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా.. తగ్గేదేలే అంటూ ఎన్నికల కార్యాచరణ అమలు చేశారాయన.విస్తృత పర్యటనలతో ఎన్నికల ప్రచార భేరిలో దుమ్ము రేపిన సీఎం జగన్.. చివరి 12రోజుల్లో 34 సభల్లో పాల్గొని వైఎస్సార్సీపీ కేడర్‌లో ఫుల్ జోష్ నింపారు. ముఖ్యంగా.. కూటమి పార్టీల్లోని కీలక నేతల నియోజకవర్గాల్లో ఆయన ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన రావడం గమనార్హం. అదే సమయంలో ప్రత్యర్థుల పేర్లను ప్రస్తావించకుండానే సాగిన ఆయన ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం జగన్ చివరి మూడు ప్రచార సభలపై ఆసక్తి నెలకొంది. తొలుత చిలకలూరిపేట, కైకలూరు, ఆపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయబోయే పిఠాపురంలో జరగబోయే ప్రచార సభతో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో ఆ ఆఖరి ప్రచార సభలో సీఎం జగన్ ఎలాంటి పంచులు పేలుస్తారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
వాళ్లు గొంతు నొక్కేది మీ బిడ్డ ప్రభుత్వానిది మాత్రమే కాదు.. : సీఎం జగన్
గుంటూరు, సాక్షి: రాజకీయాల్లో.. పట్టపగలే ఇంతదారుణంగా ప్రజల్ని మోసం చేస్తున్న పరిణామాలను చూస్తున్నామని, సరిగ్గా ఎన్నికల వేళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలకు తెర తీశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరి ప్రచార సభలో అన్నారు.‘‘ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని కేసు పెడతాం. మోసం చేస్తే చీటింగ్ కేసు పెడతాం. మరి మేనిఫెస్టో పేరుతో మోసగించే చంద్రబాబు లాంటి వాళ్ల మీద ఎలాంటి కేసులు పెడదాం?. వీళ్ల కుట్రలు ఏ స్థాయిలో ఉందంటే.. జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందనో.. అన్ని వర్గాలు ఎక్కడ జగన్‌ను తమ వాడిగా భావిస్తున్నాయో అని అసూయతో కుట్రలకు తెర తీశాయి... అవ్వాతాలకు పెన్షన్ రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్లు. వీళ్ల కుట్రలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నాయంటే.. రెండు నెల కిందట బటన్ నొక్కితే ఎన్నికల కోడ్ పేరుతో అక్కచెల్లమ్మలకు డబ్బు వెళ్తాయో అని దానిని కూడా అడ్డుకున్నారు. వీటి మీద స్వయంగా ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లారంటే.. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవాలి.ఇదీ చదవండి: ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్.. మీ బిడ్డ జగన్ ఏదీ ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ పాలనలో అలాంటి దాఖలాలూ లేవు. మొదటి రోజు నుంచి ప్రతీ నెలా క్యాలెండర్ ఇస్తూ ఈ నెలల రైతు భరోసా, ఈ నెలలో ఈ పథకం ఇస్తాం అంటూ సంవత్సరం క్రమం తప్పకుండా అందరికీ మంచి చేస్తూ వస్తున్నాడు. కానీ, ఎన్నికలకు ముందే కుట్రలు, కుతంత్రాలకు తెర తీశారు... మన ప్రజాస్వామ్యంలో ఐదేళ్ల కోసం ప్రభుత్వం ఎన్నుకుంటున్నారు. 57 నెలలకే ఈ ప్రభుత్వం గొంతు పిసికేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వం గొంతు పికసడం మాత్రమే కాదు. అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు, రైతులు, పేద విద్యార్థుల గొంతుల్ని నొక్కడమే అని గమనించండి. మళ్లీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి?.. బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాన్, అక్కడ చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్.. అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి.. ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి.. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి.. సింకులోనే ఉండాలి.నా చెల్లిని పరిచయం చేస్తున్నా. లావణ్యమ్మ(మురుగుడు లావణ్య) మీలో ఒకరు. మంగళగిరి సీటు బీసీల సీటు. వెనుక బడిన వర్గాల సీటు. నేను గతంలో ఆర్కేకు ఇచ్చా. ఇప్పుడు ఆర్కేను త్యాగం చేయమని చెప్పి.. బీసీకి ఇప్పించా. కానీ, అవతల నుంచి పెద్ద పెద్ద నేతలు వచ్చి.. డబ్బు వెదజల్లుతున్నారు. మీ బిడ్డ దగ్గర పెద్దగా డబ్బు లేదు. బటన్లు నొక్కి పంచిపెట్టడమే ఉంది. చంద్రబాబు పాలనలో అంతా దోచుకోవడం.. పంచుకోవడమే. కాబట్టి చంద్రబాబు మాదిరి మీ బిడ్డ దగ్గర డబ్బు లేదు. అందుకే ఆయన గనుక డబ్బు ఇస్తే వద్దు అనకండి తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మన దగ్గరి నుంచి దోచుకుందే. కానీ, ఎవరి వల్ల మంచి జరిగింది.. ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అనేది ఆలోచన చేయండి. ప్రతీ ఒక్కరూ ఓటేయండి. అలాగే ఎంపీ అభ్యర్థిగా రోశయ్య నిలబడుతున్నారు. మీ ఆశీస్సులు రోశయ్యపై కూడా ఉంచాల్సిందిగా కోరుతూ.. ఓటేయమని కోరుతున్నా అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు. -
మీ బిడ్డ పాలనలోనే ఈ గొప్ప మార్పులు: సీఎం జగన్
కర్నూలు, సాక్షి: గతంలో ఎన్నడూ చూడని విప్లవాత్మక మార్పులు ఈ 59 నెలల పాలన కాలంలోనే జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఉదయం వైఎస్సార్ సర్కిల్లోని ఎస్పీ కాంప్లెక్స్ రోడ్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన ప్రచార భేరిలో ఆయన పాల్గొని ప్రసంగించారు.కర్నూలు.. సిద్ధమేనా?. ఇంతటి ఎండలో మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల మధ్య ఇక్కడకు వచ్చిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమాభిమానాలకు మీ బిడ్డ, మీ జగన్ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు.కేవలం నాలుగు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది. ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పదల్చుకున్నా. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయేవి ఈ ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు.. మళ్లీ మోసపోటమే. ప్రతీ ఒక్కరూ ఈ విషయం గుర్తు పెట్టుకోండి. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే.. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలకు అర్థం. మంచి చేసిన మనందరి ప్రభుత్వం ఒకవైపు. గత చరిత్రను మారుస్తూ.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోను చెత్త బుట్టలో వేసే సంప్రదాయాన్ని మారుస్తూ.. 99 శాతం హామీలు అమలు చేసింది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 59 నెలల పాలనలో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. ఇదే 59 నెలల కాలంలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అయ్యింది. అదీ ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా. గతంలో ఎప్పుడూ జరగని గొప్ప మార్పులివి.ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన, ఎనిమిదో తరగతి నుంచే పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, ఐబీ దాకా ప్రయాణం, బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?.పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా చూసారా?. నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని, ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమంతో పాటు అందులో 20 లక్షల ఇళ్లు కడుతున్న కార్యక్రమం కూడా చేపట్టాం. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం.. మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా జరిగిందా?.రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల నాణ్యమైన ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను. రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే.. ఇవన్నీ గతంలో చూశారా?స్వయం ఉపాధికి అండగా, తోడుగా.. ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ జగనన్న తోడు చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. గతంలో ఇలాంటి పథకాలు ఉన్నాయా?..పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. పేదవాడికి ఆరోగ్య ఆసరా.. మొట్టమొదటిసారిగా పేదవాడి కోసం గ్రామంలోనే విలేజ్ క్లినిక్. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. జల్లెడ పడుతూ ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతున్నాను.ఏకంగా 600 రకాల సేవలు అందించే గ్రామ సచివాలయం. 60-70 ఇళ్లకు ఒక వలంటీర్. పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం. పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం. పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు. రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అని అడుగుతున్నాను. నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశారా?.. ఎప్పుడైనా జరిగిందా? కేవలం 59 నెలల కాలంలో.. దేవుడి దయతో, మీ చల్లని ఆశీస్సులతో మీ బిడ్డ చేశాడు.మాట్లాడితే 14 ఏళ్లు పాలించానని.. మూడు సార్లు సీఎం చేశానని చంద్రబాబు అంటారు. మరి ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి, సంక్షేమ పథకం అయినా గుర్తుకు వస్తుందా? అని కర్నూలు అశేష జనవాహిని నడుమ సీఎం జగన్ ప్రసంగించారు. -
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
కర్నూలు, సాక్షి: చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయమని, అది బాగా ముదిరిపోయిన తొండగా మారిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. కర్నూలు ఎన్నికల ప్రచార భేరీలో మైనారిటీల రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్ ప్రధానంగా స్పందించారు. ‘‘చంద్రబాబు ఒకపక్క ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జత కడతారు. మరోవైపు మైనారిటీలను మోసం చేసేందుకు దొంగ ప్రేమ నటిస్తారు. ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఉంటాయా?. ఆరు నూరైన.. నూరు ఆరైన నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట. ఇది వైఎస్సార్ బిడ్డ మాట’’ అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ‘‘ మైనారిటీలకు రిజర్వేషన్లపై మోదీ సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలగా?. అసలు మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నా కూడా ఎందుకు బీజేపీతో కొనసాగుతున్నారు’’ అని సీఎం జగన్ నిలదీశారు. మీ బిడ్డది మనసున్న ప్రభుత్వం. కులం, మతం, వర్గం చూడకుండా.. ఏ పార్టీకి ఓటేశారన్నది కూడా చూడకుండా.. కేవలం పేదరికం మాత్రమే చూశాడు. వాళ్ల బతుకుల్ని మార్చడం కోసమే అడుగులు వేశాడు. కానీ, చంద్రబాబు అలా కాదు. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం. ఇక్కడున్న వేల జనాలకే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నప్రజలకూ చెప్పాలి. నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపాదికన ఇచ్చింది కాదు. ముస్లింలలో ఉన్న పటాన్, సయ్యద్, మొగల్స్ లాంటి వాళ్లకు ఇవ్వడం లేదు.. కేవలం వెనుకబాటు తనంగా ఆధారంగానే ఇచ్చింది ఈ రిజర్వేషన్లు.అన్ని మతాల్లో బీసీలు, ఓసీలు ఉంటారు. మైనారిటీలను వేరుగా చూడడం, వాళ్ల నోటిదాకా వెళ్తున్న కూడును లాగేయడం ఎంత వరకు సబబు?. ఇది కేవలం రాజకీయ స్వార్థం కోసంవాళ్ల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాదా?.. అందుకే ఎన్నార్సీ, సీఏఏ విషయంలో.. ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు, ఇజ్జత్ ఇమాందార్‌కు మేం మద్దతుగా నిలబడతాం. ఆరు నూరైనా ముస్లిం రిజర్వేషన్లు ఉండాల్సిందే.. ఈ ప్రభుత్వంలో మైనారిటీల కోసం షాదీ తోఫా లాంటి పథకాలు మాత్రమే ఇచ్చి ఆగిపోలేదు. ఉర్దూ భాషకు ప్రత్యేక గుర్తింపు, ఐదేళ్లు నా పక్కనే ఒక మైనారిటీ సోదరుడికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం, ఏకంగా ఏడుగురికి ఎమ్మెల్యేలుగా అవకాశమిచ్చాం.. ఇలా మైనారిటీలకు సముచిత స్థానం ఇచ్చింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నా. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ప్రతీసారి నేను ఎందుకు అంటానంటే.. ఎంతగా వారి మీద ప్రేమ చూపిస్తే వెనకబడిన ఆ వర్గాలకు రాష్ట్రంలో వారికిచ్చే గౌరవం పెరుగుతుంది. వాళ్లలో ఆత్మ స్థైర్యం, ఆత్మ గౌరవం పెరుగుతుంది. అందుకే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నేను నా.. నా.. అని చెప్తాను అని సీఎం జగన్ స్పష్టం చేశారు. -
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
-
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తూర్పు గోదావరి, సాక్షి: మాములుగా ఒక ప్రభుత్వం 60 నెలల పాటు పని చేస్తుంది.ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేస్తారు. అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బ తీయడం కోసం, ఇబ్బందులు పెట్టడం కోసం టీడీపీ- చంద్రబాబునాయడు ఢిల్లీ పెద్దలతో కలిసి ఎలాంటి కుట్రలు చేస్తున్నారో గమనించాలని ఏపీ ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జంక్షన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.రాజానగరం సిద్ధమా? ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల చూపిస్తున్న ప్రతీ అక్కకూ, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు మీ జగన్ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఇవి ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మరో 6 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. చంద్రబాబును నమ్మితే ఏమౌతుంది. మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా సంక్షేమ పథకాలు అందించాం. రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా?. గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ఉంటే.. మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో 2.31 లక్షల ఉద్యోగాలు... కేవలం ఈ 59 నెలల కాలంలోనే వచ్చాయి.మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99 శాతం హామీలు అమలు చేసి.. ప్రతీ ఇంటికి ఆ మేనిఫెస్టోను పంపించి ఇందులో చెప్పినవి జరిగాయా? లేదా? అని అక్కచెల్లెమ్మల ద్వారా టిక్కు పెట్టిస్తూ ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం గతంలో జరిగిందా?. ఇప్పుడు నేను గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ ఎవరైనా చేశారా? అని మీరే ఆలోచించండి.నాడు నేడు బాగుపడ్డ గవర్నమెంట్ బడులు. పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా జరిగాయా?.. నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని, ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో కడుతున్నవి మరో 22 లక్షల ఇళ్లు. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం..మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా?నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా?. ఇంటికే అందించడం ఎప్పుడైనా జరిగిందా?. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి అండగా.. తోడుగా ఉంటూ సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్ క్లినిక్. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతున్నాను.గ్రామ సచివాలయ వ్యవస్ధతో సమూల మార్పులు. గ్రామంలో అడుగు పెడుతూనే ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం. పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం. పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు. రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అని అడుగుతున్నాను.ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల భద్రతకు తోడుగా ఫోన్లోనే దిశ యాప్. ఇవన్నీ గతంలో ఉన్నాయా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.మరో పక్క 14 ఏళ్లు సీఎంగా చేసానంటాడు చంద్రబాబు. మూడు సార్లు సీఎం అంటాడు. చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఆయన చేసిన ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా? అని అడుగుతున్నాను. సైకిల్ డ్యామేజ్ ఎంతలా అంటే.. ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేదు. ప్రతీకారంగానే 2019లో రైతన్నలు, ఆడపడుచులు, అన్ని సామాజిక వర్గాలు.. పల్లె పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్‌ను ఏ ముక్కకు ఆ ముక్క విరిసి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్‌కు చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు. ఆ రిపేర్ చేసే క్రమంలో ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్తే.. ఫలితం రాలేదు. ఆ తర్వాత దత్త పుత్రుడ్ని పిలుచుకున్నారు. తుప్పు పట్టింది.. నేను క్యారేజీ మీద మాత్రమే ఎక్కుతాను. టీ గ్లాస్ పట్టుకుని తాగుతా అని దత్త పుత్రుడు అన్నాడు. ఆ తర్వాత బాబు తన వదినమ్మను ఢిల్లీ పంపించారు. ఆమె ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి సైకిల్ రిపేర్ కోసం మెకానిక్‌లను పిలిపించుకున్నారు. వాళ్లొచ్చి.. తుప్పు పట్టిన ఆ సైకిల్‌ను చూశారు. ఆ సైకిల్‌కు సీటు లేదు. చక్రాల్లేవ్. సైకిల్‌కు పెడెల్ లేదు. ట్యూబ్‌లు ల్లేవ్. మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. మరి ఇంతలా తుప్పు పడితే ఎలా బాగు చేస్తామయ్యా అని అడిగారు. పిచ్చి చూపులు చూసి బెల్ కొట్టడం మొదలుపెట్టాడు. ఆ బెల్ పేరే అబద్ధాల మేనిఫెస్టో.ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు చెబుతారు. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో...ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను. ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) 2014లో ముఖ్యమైన మేనిఫెస్టో పేరుతో ఇదే పెద్ద మనిషి.. ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ ఇచ్చారు. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి.. ఇంటింటికి పంపించారు. నేను ఇవాళ అడుగుతున్నాను. ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి. మొదలుపెట్టమంటారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అక్కా పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు, చెల్లెమ్మా ఏకంగా రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇందులో ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? . ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. రూ.25 వేల కథ దేవుడెరుగు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కదా? మీ అకౌంట్లలో చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ వేశాడా?. ఇంటింటికీ ఉద్యోగం.. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చాడా?. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు కదా. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? రాజానగరంలో కనిపిస్తోందా? మరి నేను ఒక్కటే అడుగుతున్నాను. ఇదే ముగ్గురు 2014లో పంపించి.. ఆ తర్వాత ఐదేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు. అయినా ఇందులో ఒక్కటైనా జరిగిందా?ఇప్పుడు మళ్లీ ఇదే ముగ్గురు మళ్లీ కూటమిగా ఏర్పడ్డారు. మేనిఫెస్టో డ్రామాలాడుతున్నారు. సూపర్ సిక్స్ అంట నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట నమ్ముతారా? అక్కా నమ్ముతారా? ఏమ్మా నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.ఢిల్లీతో కుట్రలు పన్ని..ఎన్నికలకు రెండు నెలల ముందు అవ్వాతాతలకు ఇంటికి పెన్షన్ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. అలాంటప్పుడు రెట్టించిన ఉత్సాహంతో అవ్వాతాతలు జగన్‌కు ఓటు వేయరా?. జగన్ ఏదైనా బటన్లు నొక్కాడో.. ఆ బటన్లు నొక్కిన సొమ్ముకూడా రాకుండా కలిసి ఢిల్లీ వాళ్లతో కుట్రలు చేస్తున్నారు. స్వయానా ఒక సీఎం కోర్టుకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే స్థాయికి రాజకీయం దిగజారింది. ఈ బటన్లు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కింది రాదు. ఈ ఐదేళ్లలో క్రమం తప్పకుండా నొక్కుతూ వస్తున్న పథకాలకు సంబంధించినవే. అసెంబ్లీలో ఆమోదం తెలిపినవే ఇవి. క్యాలెండర్ ప్రకారం ఇస్తూ వస్తున్నవే. జగన్‌ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితి. ఓటనే అస్త్రంతో చంద్రబాబుకి, ఆయన కుట్రలకు సమాధానం చెప్పమని కోరుతున్నా. పథకాలను ఆపగలరేమోగానీ.. మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు. మళ్లీ మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు. జూన్ 4వ తేదీ తర్వాత.. ఒక వారంలోనే ఆ బటన్లు అన్నీ క్లియర్ చేస్తాడు. 👉కుట్రలు చేస్తున్న చంద్రబాబు దగ్గర డబ్బు ఉంది. ఎందుకంటే జగన్లాగా బాబు బటన్లు నొక్కలేదు. ప్రజల కోసం అక్కచెల్లెమ్మల కోసం డబ్బులు ఇవ్వలేదు. ఏ పథకం లేదు. మీ బిడ్డ అలా కాదు. 59 నెలల కాలంలో 130 బటన్లు నొక్కాడు. రూ.2 లక్షల 70 వేల కోట్లు జమ చేశాడు. చంద్రబాబు దగ్గర దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఎన్నికల కోసం ఆ డబ్బు పంచే ప్రయత్నం చేస్తాడు. ఆ డబ్బు చంద్రబాబు ఇచ్చేది మనదే.. మన దగ్గర దోచేసిన సొమ్ము. కాబట్టి, ఏ ఒక్కరూ వద్దు అని చెప్పకండి. కానీ, ఓటేసేటప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి.👉ఇది కులాల మధ్య యుద్ధం కాదు. ఇది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపు. పెత్తందారు మరోవైపున జరుగుతున్న యుద్ధం. ఇంట్లోవాళ్లతో అందరితో మాట్లాడండి. అభిప్రాయం తీసుకోండి. ఎవరి వల్ల మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగిందనేది చూడండి. జాగ్రత్తగా ఓటేయండి. ఈ విషయం చెప్పడం అవసరం.👉ఈ ప్రాంతంలో భూముల సమస్య గురించి తెలుసు. అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కరించి.. మీ ముందుకు మళ్లీ వస్తా. మీ అందరిని కోరేది ఒక్కటే. జరగబోయే కురుక్షేత్రంలో 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి.రాజానగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా జక్కంపూడి రాజాకి ఓటేయండి. ఛీటింగ్ కేసుల్లో ఉన్న వ్యక్తికి ఓటేయకండి. అలాగే.. ఎంపీ అభ్యర్థిగా డా. గూడురి శ్రీనివాసులను గొప్ప మెజారిటీతో గెలిపించాలని పేరుపేరున ప్రార్థిస్తున్నా అని సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. -
‘నా అక్కాచెల్లెమ్మలందరూ సిద్ధం’
గుంటూరు, సాక్షి: ఎన్నికల ప్రచారంలో కొత్త ఒరవడి సృష్టిస్తూ.. పేదల తరఫున పెత్తందారులతో సమరానికి సిద్ధం అయ్యారు వైస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో.. ఎక్కడికి వెళ్లినా సంక్షేమ సారథికి జనం నీరాజనం పడుతున్నారు. సిద్ధం, మేమంతా సిద్ధం, జగన్ కోసం సిద్ధం.. ఏ కార్యక్రమం చేపట్టినా స్వచ్ఛందంగా ప్రజలు అందులో భాగం అవుతున్నారు. జగన్ వన్స్‌మోర్.. జగనే మళ్లీ మా సీఎం అంటూ నినాదాలతో మారుమోగిపోయేలా చేస్తున్నారు. అంతేకాదు ఎక్కడికి వెళ్లినా సిద్ధం నినాదాన్ని వినిపిస్తున్నారు కూడా. తాజాగా నా అక్కచెల్లెమ్మలందరూ సిద్ధం! అంటూ ట్వీట్ చేశారాయన. నా అక్కచెల్లెమ్మలందరూ సిద్ధం! #VoteForFan#YSRCPStarCampaigners pic.twitter.com/AIxA9Nccsm— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2024 గత 59 నెలల పాలనలో అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం సీఎం జగన్ ఎంతో పాటు పడ్డారు. సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా బటన్ నొక్కి వాళ్ల ఖాతాల్లోనే జమ చేశారు. అంతేకాదు.. ఇళ్ల పట్టాలను సైతం మహిళల పేరిటే రిజిస్టర్ చేయించారు. అంతటితోనే ఆగకుండా.. సొంత కాళ్ల మీద నిలబడేందుకు పథకాల ద్వారా ఆసరాగా నిలుస్తూ వచ్చారు. అందుకే ఏపీ మహిళా లోకం జగన్ కోసం సిద్ధం అంటోంది. మరోవైపు చంద్రబాబుకు ఉన్నట్లు తనకు పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన స్టార్ క్యాంపెయినర్లు లేరని.. తాను చేసిన మంచిని అందుకున్న సామాన్యులే తన స్టార్‌క్యాంపెయినర్లు అని సీఎం జగన్ స్వయంగా ప్రకటించుకున్నారు. అందుకు తగ్గట్లే.. 12 మంది సామాన్యులను ఎంపిక చేసింది వైస్సార్సీపీ. అందులోనూ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. -
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
వైవీయూ: ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన ‘సిద్ధం’ పాటల సీడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ ఆవిష్కరించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీడీని రూపొందించిన సూర్య చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు, ఎన్ఆర్ఐ సూర్యనారాయణ, పాటల రూపకర్త, ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ ఎం.ప్రభాకర్‌లను భారతమ్మ అభినందించారు.ఈ సందర్భంగా డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘జనహృదయాల్లోకి చొచ్చుకెళ్లే శక్తి పాటకు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ యజ్ఞాన్ని పాటల రూపంలో గ్రామస్థాయికి తీసుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. సోషల్ మీడియా ద్వారా కోట్లాది మంది అభిమానులకు ఈ పాటలను అందుబాటులోకి తెస్తాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ‘సిద్ధం’ పాటల సీడీ రూపకల్పనకు సహకారం అందించిన బి.రామతులసి, డా.వి.ఉష, ఎన్.సుదీప్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను ప్రారంభించిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను వైఎస్సార్సీపీ ప్రారంభించింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, జగన్ కోసం సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.వేరే దేశాలలో ఉన్న ఎన్నారైలు ఏపీకి వచ్చి పని చేయడం హ్యాపీగా ఉందని.. జగన్ గెలుపు మన ఇంట్లో గెలుపులా మహిళలు సైతం భావిస్తున్నారని సజ్జల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ఉంటుందన్న ఆయన... చేసిన మంచి గురించి ప్రజలకు వివరించటం చాలా మంచి పరిణామన్నారు.పార్టీ, జగన్ తరపున ఎన్నారైలకు కృతజ్ఞతలు. టీడీపీ వికృత చేష్టలు పెరిగాయి. కోమటి జయరాం అనే టీడీపీ అహంకారి నోట్లతో ఓట్ల కొనాలనటం సిగ్గు చేటు. రాజకీయం అంటే డబ్బు కాదు, ప్రజలకు మంచి చేయడం. లీడర్ని బట్టి కార్యకర్తలు ఉంటారు. ప్రజల కోసం వైసీపీ ఎన్నారై లు వస్తే.. డబ్బులు పంచడం కోసం టీడీపీ ఎన్నారైలు వచ్చారు. సమాజంలో మార్పు ప్రజలకు చెప్పాలని వైసీపీ ఎన్నారై టీమ్ పనిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 4 బస్సులతో స్టార్ క్యాంపైనర్స్ ప్రచారం చేస్తారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. -
YSRCP మరో అడుగు.. ఇక ఇంటింటికీ మేనిఫెస్టో
గుంటూరు, సాక్షి: పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో.. ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జనంలోకి చొచ్చుకుపోయేలా.. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష కూటమికి వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటున్నాయి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార ప్రసంగాలు. మరోవైపు పార్టీ అధినేత ఆదేశాలనుసారం పార్టీ శ్రేణులు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.జగన్ కోసం సిద్ధం.. ఇదీ ఇప్పుడు వైఎస్సార్సీపీ చేపట్టిన కొత్త కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఇంటికి వైఎస్సార్సీపీ మేనిఫెస్టో-2024ను చేరవేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా.. సీఎంగా జగన్ ఉంటేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, పేదల భవిష్యత్తు మారుతుందని ప్రచారం చేయనుంది. ఇవాళ పార్టీ కీలక నేతలు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు మొదటి నుంచి తన ప్రసంగాల్లో, ఎన్నికల ప్రచారంలోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమం పొందిన సామాన్యులే తన స్టార్ క్యాంపెయినర్లంటూ సీఎం జగన్ చెబుతూ వస్తున్నారు. దీంతో ఆ సామాన్యుల్నే ఇప్పుడు జగన్ కోసం సిద్ధం కార్యక్రమంలో భాగం చేయబోతోంది పార్టీ.మేనిఫెస్టోను దాదాపుగా పూర్తి స్థాయిలో(99 శాతం పైనే) అమలు చేసింది వైఎస్సార్సీపీనే కాబోలు!. అలవుగాని హామీలను ఇవ్వబోమని, చేయగలిగింది మాత్రమే చెబుతామని, చెప్పిందే చేస్తామని, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇంకా ఎక్కువే చేస్తామని మేనిఫెస్టో ప్రకటన సమయంలో సీఎం జగన్ స్పష్టం చేశారు. అంతేకాదు.. మేనిఫెస్టోను ఓ ప్రొగ్రెస్ రిపోర్టులాగా.. 58 నెలల కాలంలో ఎప్పటికప్పుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ వస్తున్నామంటూ పేర్కొన్నారాయన. దీంతో ఈ హామీలనే జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని, తద్వారా మరోసారి ప్రజల ఆదరణ చురగొనాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. -
వీళ్లా YSR వారసులు?.. పులివెందులలో సీఎం జగన్ ఫైర్
వైఎస్సార్, సాక్షి: ఒకప్పుడు కరువు ప్రాంతంగా పేరున్న పులివెందులకు.. ఇప్పుడు కృష్ణా జలాలు వస్తున్నాయి. నా తండ్రి, ఆ మహానేత దివంగత నేత వైఎస్సార్ వల్లే ఈ అభివృద్ధి పరుగులు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఎన్నికల నామినేషన్ కోసం పులివెందుల వెళ్లిన సీఎం జగన్.. అంతకు ముందు సీఎస్ఐ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో భావోద్వేగంగా మాట్లాడారు. ‘‘నా పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం.. ప్రతీ కష్టంలో నా వెంట నడిచిన ప్రతీ ఒక్కరికీ మీ జగన్, మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాడు. పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ. ఈ అభివృద్ధికి కారణం వైఎస్సార్. వైఎస్సార్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం. పులివెందులలో ఏం ఉంది? అనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదు? అనే స్థాయికి చేరుకున్నాం. అందుకే పులివెందుల ఒక విజయగాథ.... పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. మంచి చేయడం, మంచి మనసుతో ఉండడం, బెదిరింపులకు లొంగకపోవడం, మాట తప్పకపోవడం మన కల్చర్. టీడీపీ మాఫియా, నాలుగు దశాబ్దాల దుర్మార్గాన్ని ఎదురించింది ఈ పులివెందుల బిడ్డేలే. .. వైఎస్సార్, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. ఆ కుట్రలో భాగంగా ఈ మధ్య వైఎస్సార్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారు. అసలు ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు?.. ప్రజలే. మీ బిడ్డను ఎదుర్కొనలేక వీళ్లంతా ఏకం అయ్యారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీలతో పాటు నా ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలో భాగం అయ్యారు... వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు?.. నాన్నగారిపై కక్షతో, కుట్రపూర్వకంగా కేసులు పెట్టింది ఎవరు?. వైఎస్సార్ పేరును ఛార్జిషీట్లో చేర్చింది ఎవరు?. వైఎస్సార్ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని, వైఎస్సార్సీపీకి పేరు దక్కవద్దని, విగ్రహాలు తొలగిస్తామని చెబుతున్నవాళ్లు, ఆ పార్టీలతో చేతులు కలిపినవాళ్లా? వైఎస్సార్ వారసులా?.. పసుపు చీరలు కట్టుకుని వైఎస్సార్ శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు, ఆ పార్టీలో చేరిన వాళ్లు వాళ్లా వైఎస్సార్ వారసులు?.. అని ప్రశ్నిస్తున్నా... YSR పేరు కనబడకుండా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా?. హోదాను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా?. నోటాకు వచ్చినన్ని ఓటర్లు రాని కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా?. కాంగ్రెస్‌కు ఓటేస్తే బాబుకి ఓటేసినట్లు కాదా?. మన ఓట్లు చీలిస్తే చంద్రబాబుకు, బీజేపీకి లాభమా? కాదా?. .. నా చిన్నాన్న వివేకాను చంపింది ఎవరో దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు?. వివేకాకు రెండో భార్య ఉన్నది, సంతానం ఉన్నది వాస్తవం కాదా?. ఆనాడు ఎవరు ఫోన్ చేస్తే.. అవినాష్ అక్కడికి వెళ్లారు?. పలు ఇంటర్వ్యూల్లో అవినాష్ లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా!. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదు. అది బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చాను. అవినాష్‌రెడ్డి జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. అవినాష్‌ను కనుమరుగు చేయాలనుకోవడం ఎంత దారుణమో ఆలోచించండి.ఇదీ చదవండి: సునీత, దస్తగిరి లాలూచీ!.. అవినాష్ లేవనెత్తిన అభ్యంతరాలు ఏంటంటే.... బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో మీ అందరికీ కనిపిస్తోంది. పసుపు మూకలతో మన చెల్లెమ్మలు ఈ కుట్రలో భాగం కావడం దుర్మార్గం. చిన్నాన్న వివేకాను అన్యాయంగా ఎన్నికల్లో ఓడించిన వాళ్లతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వైఎస్సార్‌పై కుట్రలు చేసిన వాళ్లు అందిస్తున్న స్క్రిప్ట్ చదువుతున్న వీళ్లా వైఎస్సార్ వారసులు?. తమ సొంత లాభంకోసం ఎవరు ఈ కుట్ర చేయిస్తున్నారో ప్రజలు గమనించాలి. ప్రతీ ఒక్కరూ చెడిపోయిన ఈ రాజకీయాలను చూడండి. .. పరిపాలనలోనూ, పథకాల్లోనూ, సంక్షేమంలోనూ జగన్‌ను ఎవరూ కొట్టలేరు. ఏ రంగంలోనూ జగన్ కంటే మంచి చేశామని వాళ్లు చెప్పుకోలేరు. వైఎస్సార్, జగన్ పేర్లు చెరిపేయాలని చూసేవాళ్లు మన శత్రువులే. జగన్ బ్రాండ్, వైఎస్సార్ బ్రాండ్‌ను దెబ్బ కొట్టాలని చూస్తున్నవాళ్లకు గుణపాఠం చెప్పడానికి పులివెందుల సిద్ధమా? అని సీఎం జగన్ గర్జించారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేని పాలన అందించాం. పులివెందుల వాసుల చిరకాల కల మెడికల్ కాలేజీ. త్వరలో ఆ కాలేజీ ప్రారంభిస్తాం. పేదలకు మంచి చేయాలని ఆ దేవుడు మీ బిడ్డకు సీఎం పదవి ఇచ్చాడు. అందుకే మరింత మంచిని అందించే అవకాశం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు. -
Siddham: సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్
వైఎస్సార్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. కాసేపటి కిందటే ఆయన వైఎస్సార్ జిల్లా పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే అందుకు ముందు బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. నామినేషన్ గ్యాప్‌లో తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. సిద్ధం పేరుతో ఒకవైపు వైఎస్సార్సీపీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తూనే.. మరోవైపు ఏపీ ఓటర్లకు ఆయన సంక్షేమ పాలన చూసి ఓటేయాలని కోరుతున్న సంగతి చూస్తున్నాం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సిద్ధం.. ఓట్ ఫర్ ఫ్యాన్ అంటూ తాజాగా ట్వీట్ చేశారాయన. Andhra Pradesh Siddham!#VoteForFan— YS Jagan Mohan Reddy (@ysjagan) April 25, 2024 అంతకు ముందు వైఎస్సార్సీపీ సిద్ధం సభల్లో తన ప్రసంగాలతో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్రంలో ఎన్నికల మూడ్ తీసుకొచ్చిన సీఎం జగన్.. ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్రల సమయంలోనూ ఆయా జిల్లాలను ఉద్దేశిస్తూ సిద్ధం అని ట్వీట్లు చేసింది చూశాం. ఇప్పుడు ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుస్తూ.. పార్టీలో జోష్ నింపుతూ ఆంధ్రప్రదేశ్ సిద్ధం అంటూ ట్వీట్ చేశారు. -
పులివెందుల నా ప్రాణం.. శత్రువులతో చేతులు కలిపిన నా చెల్లెమ్మలు.. సీఎం జగన్ డైనమిక్ ప్రసంగం (ఫొటోలు)
-
సరికొత్త నినాదంతో జనంలోకి YSRCP
గుంటూరు, సాక్షి: నిలువెల్లా విషం నింపేసుకున్న రాజకీయ ప్రత్యర్థులు.. అక్కసుతో ఆయనపై రాళ్లు వేయించారు. పైగా సింపథీ డ్రామాలంటూ ఎల్లో మీడియా ద్వారా రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. కానీ, సీఎం జగన్‌ది ఉక్కు సంకల్పం. సంయమనంతో వ్యవహరిస్తూ.. నొప్పిని భరిస్తూనే చిరునవ్వుతో ముందుకు సాగుతున్నారు. పచ్చ కుట్రల్ని అర్థం చేసుకుంటున్నారు గనుకే జనం సైతం ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త స్లోగన్ తెరపైకి రాగా.. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. కొన్నాళ్ల కిందట సిద్ధం.. పేరుతో ఎన్నికల సమరశంఖారావం పూరించారు సీఎం జగన్. కేవలం రెండు అక్షరాలతోనే షెడ్యూల్ రాకముందే ఎన్నికల వాతావరణం సృష్టించగలిగారాయాన. అంతేకాదు దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో నాలుగు సిద్ధం సభల్ని నిర్వహించి.. అశేష ప్రజా స్పందన దక్కించుకున్నారు. సిద్ధంను కాపీ కొట్టి మేము కూడా సిద్ధం, సంసిద్ధం అంటూ విపక్షాలు ప్రచారం చేసుకున్నాయేగానీ అవి అస్సలు వర్కవుట్ కాలేదు. ఆపై కొత్తగా ఎన్ని స్లోగనులు తెచ్చినా.. జనాలను ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ టైమ్ లో వైసీపీ మరో సరికొత్త ప్రచార అస్త్రాన్ని రెడీ చేసింది. మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రతో ముందుకు వచ్చింది. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాల్ని మినహాయించి 21 రోజుల యాత్రను చేపట్టారు సీఎం జగన్. మేమంతా సిద్ధంలోనూ సీఎం జగన్‌కు బ్రహ్మరథమే పడుతున్నారు జనం. ఇక ఇప్పుడు.. జగన్ కోసం సిద్ధం అంటూ మరో కొత్త స్లోగన్‌ను తెరపైకి తెచ్చింది. పార్టీకి సంబంధించి ప్రచారాల విషయంలో వైఎస్సార్సీపీ మొదటి నుంచి దూకుడునే ప్రదర్శిస్తోంది. వైవిధ్యతతో జనాల్ని ఆకట్టుకోగలగడమే కాకుండా.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతోంది. ఈ విషయంలో అనుకూల మీడియా, ఆస్థాన రచయితలు ఉన్న టీడీపీ మాత్రం ప్రచార వ్యూహాల్లో వైఎస్సార్సీపీకి దరిదాపుల్లోకి రాలేకపోవడం గమనార్హం. -
పల్లెల్లో అపూర్వ ఆదరణ
కర్నూలు (సెంట్రల్): మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో అపూర్వ ఆదరణ లభించింది. సీఎం జగన్ రాక కోసం ఉదయం నుంచి రాత్రి వరకు పల్లెలు ఎదురు చూశాయి. మూడో రోజు బస్సు యాత్ర కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో దాదాపు 108 కిలోమీటర్ల మేర సాగింది. శుక్రవారం ఉదయం 10.35 గంటలకు కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం పెంచికలపాడులో రాత్రి బస చేసిన శిబిరం నుంచి ప్రారంభమైన బస్సుయాత్ర పత్తికొండ మండలం రాతన వరకు కొనసాగింది. మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తిగా రాత్రి వేళ సాగినా ప్రజలు వైఎస్ జగన్ రాక కోసం నిరీక్షించారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దల నుంచిపిల్లల వరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మూడో రోజు యాత్ర సైడ్‌లైట్స్ ♦ ఉదయం 9.30 గంటలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, డాక్టర్ జె.సుధాకర్, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మణిగాంధీ, ఎస్వీ మోహన్‌రెడ్డి సీఎం వైఎస్ జగన్‌ను పెంచికలపాడు శిబిరంలో కలిశారు. ♦ 10.35 గంటలకు పెంచికలపాడులోని రాత్రి బస శిబిరం నుంచి సీఎం వైఎస్ జగన్ బయటకు వచ్చి బస్సు ఎక్కారు. అక్కడ భారీగా వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. ♦ 11.35 గంటలకు సీఎం జగన్ కోడుమూరు పట్టణానికి చేరుకున్నారు. అక్కడ వేలాది మంది ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు షోలో ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు. ♦ 11.38 గంటలకు సీఎంకు కోడుమూరులో చేనేతలు మగ్గం, నేసిన చీరను బహూకరించారు. గొర్రెల పెంపకందారులు గొర్రె పిల్లలను అందించి తమ అభిమానం చాటుకున్నారు. ♦ 11.45 గంటలకు కోడుమూరులో బుడగ జంగాలు తమకు ఎస్సీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరగా, వచ్చే ప్రభుత్వంలో ప్రాధాన్యతగా తీసుకుంటామని సీఎ జగన్ హామీ ఇచ్చారు. ♦ 12.20 గంటలకు కోడుమూరు మండలం వర్కూరుకు బస్సు యాత్ర చేరుకుంది. ♦మధ్యాహ్నం 1.15 గంటలకు సీఎం బస్సుయాత్ర ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగొండ్ల మండలం వేముగోడుకు చేరుకోగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకా ఘన స్వాగతం పలికారు. ♦ 1.59 గంటలకు సీఎం జగన్ బస్సు యాత్ర గోనెగండ్ల చేరుకోగా, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. ♦ 2.30 గంటలకు సీఎం జగన్ భోజన విరామం కోసం గోనెగండ్ల మండలం రాళ్లదొడ్డిలో ఏర్పాటు చేసిన శిబిరానికి చేరుకున్నారు. ♦ సాయంత్రం 4 గంటలకు గోనెగండ్ల మండల మాజీ ఎంపీపీ కేవీ కృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరగా, ఆయనకు సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ♦ భోజన విరామం అనంతరం సాయంత్రం 4.30గంటలకు బస్సు యాత్ర ప్రారంభమైంది. ♦ సాయంత్రం 5.45 గంటలకు ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం జగన్ చేరుకున్నారు. ♦ రాత్రి 7.14 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలోని హనుమాపురం గ్రామానికి సీఎం జగన్ చేరుకోగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ♦ 7.25 గంటలకు ఎమ్మిగనూరు మండలం అరెకల్కు, అక్కడి నుంచి 8.15 గంటలకు ఆదోని క్రాస్ చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ♦ 8.20 గంటలకు ఆదోని నియోజకవర్గం విరుపాపురం చేరుకున్నారు. ♦ 9 గంటలకు ఆలూరు నియోజవకర్గం బిణిగేరి మీదుగా ఆస్పరి చేరుకున్నారు. ♦ 9.30 గంటలకు చిన్నహుల్తి మీదుగా పత్తికొండ బైసాస్ చేరుకోగా నేతలు అపూర్వ స్వాగతం పలికారు. ♦ రాత్రి 9.47 గంటల సమయంలో పత్తికొండ మండలం రాతన సమీపంలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. నేడు తుగ్గలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి 4వ రోజు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బస్సు యాత్ర సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నాలుగో రోజైన శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొనసాగనుంది. బస్సు యాత్ర నాలుగో రోజు షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం రాత్రి వెల్లడించారు. పత్తికొండలో రాత్రి బస చేసిన ప్రదేశం నుంచి సీఎం జగన్ శనివారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. రాతన మీదుగా తుగ్గలి చేరుకుని ఉదయం 10 గంటలకు గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జొన్నగిరి, గుత్తి మీదుగా ప్రయాణించి.. గుత్తి శివారులో ముఖ్యమంత్రి భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి 3 గంటలకు బయలుదేరి పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి మీదుగా సంజీవపురం శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. -
వచ్చే ఎన్నికల్లో YSRCP గెలిచే ఛాన్స్ ఎంత...ఆధారాలతో శేఖర్ రెడ్డి
-
ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు యాత్ర ప్రారంభం
-
షార్లెట్‌లో వైఎస్సార్సీపీ సిద్ధం!
నార్త్ కరోలినా షార్లెట్‌లో నిర్వహించిన సిద్ధం సభ విజయవంతమైంది. కారుమూరు శివారెడ్డి నాయకత్వములో దుష్యంత్ ఎల్లపల్లి, సతీష్ కర్నాటి, సంజీవ రెడ్డి, సబ్బసాని, సతీష్ వద్దిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏపీ సీఎం జగన్ కోసం తాము కూడా సిద్ధం అని అమెరికాలోని ప్రవాసులు ప్రకటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పడ్డ తండ్రికి తగ్గ తనయుడుగా నేను విన్నాను నేను ఉన్నాను అని, కరోనా కష్టాలను కూడా అధికమించి ప్రజలకు ఎంతో మేలు చేసిన మన ప్రియతమా ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌ని మళ్లీ గెలిపించు కోవడానికి మేము సిద్ధం అని అందరు నినదించారు. మహిళలు సైతం మేం సిద్ధం అంటూ మద్దతుగా కేరింతలు కొడుతూ.. సందడి చేశారు. జై జగన్ జై జగన్ అంటూ నినదించటంతో ఆడిటోరింలో సందడివాతావరణం నెలకొంది. వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. (చదవండి: చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వరన్‌పై మొత్తం 35 కేసులు) -
నేడు నంద్యాలలో సీఎం జగన్ సభ..
-
ప్రజలకు చేసిన మేళ్లే..మరో చారిత్రక విజయానికి మెట్లు
-
నంద్యాల సీఎం జగన్ సభకు భారీ ఏర్పాట్లు
-
Best Photos Of Siddham : మేమంతా సిద్ధం (ఫొటోలు)
-
మేమంతా సిద్ధం.. సీఎం జగన్ 21 రోజుల బస్సు యాత్ర
-
సీఎం జగన్ సక్సెస్ ఫార్ములా.. ప్రతిపక్షాల వెన్నులో వణుకు
-
Public Watching Siddham Meeting: ఊరు వాడ.. జగన్ కోసం జనం (ఫొటోలు)
-
Sidham : లండన్ లో YSRCP భారీ కార్ ర్యాలీ
#why not 175 వైనాట్ 175 అంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుపై లండన్ లోని ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేశారు. YSRCP UK కమిటీ ఆధ్వర్యంలో లండన్‌లోని ఈస్ట్ హామ్ లో ఘనంగా YSRCP సిద్ధం సభను నిర్వహించారు. అనంతరం భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో YSRCP ఘన విజయం సాధిస్తుందని, రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. YSRCP లండన్ కన్వీనర్లు Dr ప్రదీప్ చింతా, ఓబుల్‌రెడ్డి పాతకోట అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అద్దంకి సిద్ధం సభను పురస్కరించుకుని UKలోని వైఎస్సార్ సిపి అభిమానులు, నాయకులు గత కొన్ని నెలలుగా పార్టీ నాయకులను సమాయత్తం చేస్తున్నారు. గత ఎనిమిది నెలల్లో UKలో నిర్వహించిన 5వ YSRCP సభ ఇది. ఈ కార్యక్రమంలో UK నలుమూలల నుండి YSRCP కార్యకర్తలు, జగనన్న అభిమానులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమానికి కిషోర్ మలిరెడ్డి, కిరణ్ పప్పు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సిద్ధం స్మరణతో సభా ప్రాంగణం మారుమ్రోగిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలోనే ఎన్నికలు జరగనున్నాయని, ముఖ్యమంత్రి జగన్ పాలన పట్ల ప్రజలకు మరింత వివరించి చెప్పాల్సిన బాధ్యత ఉందని YSRCP NRI ఛైర్మన్ వెంకట్ మేడపాటి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. NRIలు ఏవిధంగా ఎన్నికలకు సన్నద్దమవాలో వివరించారు. Dr ప్రదీప్ చింతా తన ప్రసంగంతో కార్యకర్తలను ఉత్తేజపరిచారు. సీఎం జగన్ జనరంజక పాలన చేస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమం రెండింటిలోనూ దేశంలోనే బెస్ట్ గా నిలిచారని కొనియాడారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పనులు వచ్చే పాతికేళ్లు కొనసాగాలని ఆశించారు. ఈ సభలో YSRCP నూతన కార్యవర్గాన్ని కన్వీనర్లు సభకు పరిచయం చేశారు. కార్యక్రమంలో UK కమిటీ సభ్యులు శ్రీకాంత్ పసుపుల, మన్మోహన్ యమ్మసాని , PC రావు కోడె, అనంత్ రాజ్ పరదేశి, శ్రీనివాస్ తాల్ల, సుబ్బారెడ్డి ఆకేపాటి, శ్రీనివాస్ దొంతిబోయున, సురేందర్ అలవల, రవి మోచర్ల, రాజేష్ యాదవ్, వంశీ కృష్ణ మద్దూరి, విజయ్ పెండేకంటి, కార్తీక్ కొలిశెట్టి ,జయంతి రెడ్డి, కార్తీక్ భూమిరెడ్డి, ప్రతాప్ భీమిరెడ్డి, NR నందివెలుగు, మధు గట్టా, వజ్రాల రాజశేఖర్ , సుధాకర్ ఏరువ, భస్కర్ మాలపాటి , శ్యామ్ తొమ్మండ్రు , నరసింహారెడ్డి వేములపాటి పాల్గొన్నారు -
Addanki Siddham Sabha Photos: కిక్కిరిసిన రోడ్లు, జన సముద్రం (ఫొటోలు)
-
Top 5 Pictures Of The Day Addanki Siddham Sabha: దద్దరిల్లిన అద్దంకి సిద్ధం సభ (ఫొటోలు)
-
ఆంధ్రప్రదేశ్ ‘సిద్ధం’ (ఫొటోలు)
-
అద్దంకి సిద్ధం సభకు ఎన్ని ప్రత్యేకతలో తెలుసా?
సాక్షి, బాపట్ల: రాష్ట్ర వ్యాప్తంగా అద్దంకి 'సిద్ధం' సభ హోరెత్తుతోంది. ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగో.. చివరి క్యాడర్ సమావేశం ఇది. ఈ సమావేశానికి బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, తిరుపతి మొత్తం ఆరు జిల్లాల (మొత్తం 43 నియోజక వర్గాలు) నుంచి ఏకంగా 15 లక్షల మంది హాజరయ్యారని ఒక అంచనా. బాపట్ల ఈవెంట్లో ప్రత్యేకత ఏమిటంటే.. మేదరమెట్లలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం పై నుంచి చూస్తే 'వై' లాగా కనిపించే ర్యాంప్, సీఎం జగన్ యుద్ధ నినాదం 'వై నాట్ 175' అని మధ్యలో రాసి ఉంది. హీలియం బెలూన్లు, సిద్ధమ్ కటౌట్లు, జెండాలు, ఆటో బ్రాండింగ్, బైక్ బ్రాండింగ్ వంటి బ్రాండింగ్ కార్యకలాపాలు, వేదిక స్థలంలో ఎక్కువ మంది సీఎం జగన్ ప్రసంగం వీక్షించేలా పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 'సిద్ధం' స్టాంపుల వంటి ఇంటరాక్టివ్ కార్యకలాపాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పటికే వైఎస్సార్సీపీ మూడు సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయి. జనవరి 27న భీమిలిలో జరిగిన మొదటి సభకు 3 లక్షల కంటే ఎక్కువ మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 3న ఏలూరులో జరిగిన రెండో సభకు 6 లక్షల మంది హాజరయ్యారు. ఆ తరువాత ఫిబ్రవరి 18న అనంతపురం సభకు 10 లక్షల మంది (1 మిలియన్) హాజరై.. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రాజకీయ ర్యాలీగా రికార్డ్ క్రియేట్ చేసింది. పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా 'మేం సిద్దం' అనే పేరుతో వెబ్సైట్ ప్రారంభించింది. ఇందులో 'జగనన్న కనెక్ట్స్' ద్వారా వారి పేరుతో ఫ్రీ సిద్దం పోస్టర్‌ను రూపొందించుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇప్పటికే.. కేవలం నాలుగు గంటల వ్యవధిలో ఈ వెబ్సైట్ ద్వారా 4,00,00లకు పైగా ప్రత్యేక పోస్టర్లు క్రియేట్ చేసుకున్నారు. సరికొత్త ప్రచారం 'నా కల' ఇక పొతే ఏపీలో వైఎస్సార్సీపీ కొత్త క్యాంపెయిన్ 'నా కల'కు శ్రీకారం చుట్టింది. అద్దంకి సిద్ధం సభ వేదికపై సీఎం జగన్ ఈ కొత్త ప్రచార కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోనే ముందస్తుగా.. రాష్ట్ర వ్యాప్తంగా నా కల పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. యువత, రైతులు, మహిళలు, కార్మికులు, వృద్ధులు, విద్యార్థుల కోసం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది అధికార వైఎస్సార్సీపీ. -
జగన్ వన్స్‌మోర్ నినాదాలతో మారుమోగిన అద్దంకి సిద్ధం సభ (ఫొటోలు)
-
సిద్ధం సభకు పటిష్ట బందోబస్తు
మేదరమెట్ల: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పీ.గుడిపాడు జాతీయ రహదారి సమీపంలో ఆదివారం నిర్వహించనున్న సిద్ధం సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతున్న సందర్భంగా పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు గుంటూరు రేంజి ఐజీ పాలరాజు, అడ్మిన్ ఐజీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఎస్పీ వకుల్ జిందాల్ మేదరమెట్లలో శుక్రవారం పోలీసు అధికారుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా పోలీసు అధికారులు తీసుకుంటున్న బందోబస్తు గురించి ఎస్పీ వివరించారు. సిద్ధం సభకు మొత్తం 10 లక్షలకు పైగా ప్రజలు హాజరవుతారని, సభకు వచ్చే వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు, సభ నిర్వహణకు మొత్తం 338 ఎకరాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. సభ సజావుగా జరిగేందుకు ప్రతి పోలీసు అధికారి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఐజీ మాట్లాడుతూ సిద్ధం సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతున్న సందర్భంగా వాహనాలను దారి మళ్లింపు విషయంలో ప్రజలకు అర్థమయ్యేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కమ్యూనికేషన్ సెట్ల ద్వారా ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. సభకు వచ్చే వాహనాలు ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా వాహనాలను వరుస క్రమంలో పార్కింగ్ చేయించాల్సిన బాధ్యత కూడా పోలీసులపై ఉందన్నారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, ప్రకాశం జిల్లా ఎస్పీ పీ.పరమేశ్వరరెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ కే.తిరుమలేశ్వరరెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
LIVE: మేము సిద్ధం..మా పోలింగ్ బూత్ సిద్ధం
-
Feb 19th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 08:50 PM, Feb 19th, 2024 టీడీపీకి ఓటు వేసి వృథా చేసుకోవద్దు: ఎంపీ కేశినేని నాని బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారంటీ అని టీడీపీ వాళ్లు వచ్చే ఉంటారు: గ్యారంటీ అని టీడీపీ వాళ్లు వచ్చే ఉంటారు టీడీపీలో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఉన్నారు.. మీ ఓటు వృథా చేసుకోవద్దు చంద్రబాబు అంటేనే పచ్చి మోసం పనికిమాలిన కొడుకును సీఎం చేయడమే చంద్రబాబు ఎత్తుగడ పాపం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ కూడా మోస పోతున్నాడు టీడీపీ ఎలాగూ గెలవదు.. ఎలక్షన్ అనంతరం ప్రక్కనే ఉన్న తెలంగాణకు బాబు, కొడుకులు వెళ్లిపోతారు టిడిపి ఎలాగూ గెలవదు.. ఎలక్షన్ అనంతరం ప్రక్కనే ఉన్న తెలంగాణకు బాబు,కొడుకులు వెళ్ళిపోతారు 08:30 PM, Feb 19th, 2024 ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే ఉంటాం: తిరువూరు వైఎస్సార్సీపీ ఇంచార్జ్ స్వామిదాస్ నేను పక్కా లోకల్ .. ముప్పై ఏళ్లుగా ప్రజల తోనే ఉన్నా ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే ఉంటాం రోజుకొక వేషం వేసుకుని నియోజకవర్గంలోకి కొందరు వస్తున్నారు ఇప్పటికే నన్ను,తర్వాత ఇంకొకరు,ఆ తర్వాత మరొకరు ఇలా టీడీపీలో ఎందర్ని ఎందుకోసం మారుస్తున్నారో ప్రజలకు తెలుసు టక్కుటమార విద్యలలో మన ముందుకు ఐదేళ్లకోసారి జాతర కోసమన్నట్లు వస్తూనే ఉన్నారు 07:15 PM, Feb 19th, 2024 చంద్రబాబు, ఎల్లోమీడియా పై మాజీమంత్రి కొడాలి నాని ఫైర్ వినేవాళ్లు తెలుగు తమ్ముళ్లైతే...చెప్పేవాడు చంద్రబాబు ఇప్పటి వరకూ అభ్యర్ధుల్ని ,ఇంఛార్జ్ లను ఏడు విడతల్లో జగన్మోహన్రెడ్డి ప్రకటించారు అభ్యర్ధుల్ని మార్చేచోటే మార్పులు చేర్పులు చేస్తున్నారు వైఎస్సార్సీపీలో సీట్ల మార్పులు జగన్మోహన్రెడ్డి చేస్తారు.. ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు, మహాటీవీ వంశీ కాదు నరేంద్రమోదీకి కూడా గుడివాడలో ఏబీఎన్ రాధాకృష్ణ టికెట్ ఇవ్వగలడు నన్ను ఓడించాలంటే చంద్రబాబును తెచ్చి గుడివాడలో పోటీచేయమనండి గుడివాడలో నేను పోటీచేయాలో లేదో జగన్మోహన్రెడ్డి చెబుతారు.. టీవీ5, ఏబీఎన్, మహాన్యూస్పకోడీగాళ్లు కాదు ఏబీఎన్ రాధాకష్ణ,బీఆర్ నాయుడు పోటీచేస్తారని నేను కూడా ఫ్లెక్సీలు పెట్టిస్తా ... నిజమైపోతుందా గన్నవరంలో వంశీని,గుడివాడలో నన్ను మారుస్తామని జగన్మోహన్రెడ్డి చెప్పారా మా సీట్లు ఇవ్వడానికి ఈ ఏబీఎన్..టివి5,మహాటీవీ బఫూన్ గాళ్లు ఎవరు పక్కలేస్తే సీట్లివ్వడం...డబ్బులకు అమ్ముకోవడం వైఎస్సార్సీపీలో ఉండదు వంద కోట్లుంటే చంద్రబాబు టీడీపీలో టిక్కెట్లిస్తాడు మా మైలవరం అభ్యర్ధికి ఎకరం పొలం తప్ప ఏమీ లేదు వైఎస్సార్సీపీలో ఒకడు ట్రైచేస్తేనో...బ్రోకర్ గాడు చెబితేనే టిక్కెట్లు రావు సామాజిక సమీకరణాల ప్రకారమే ఎస్సీ,బీసీ,ఎస్టీ ,మైనార్టీలకు జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు చంద్రబాబుకు దమ్ముంటే..మగాడైతే బీసీలకు ఎక్కువ సీట్లివ్వాలి సీట్లు మారుస్తాడా లేదా..అనేది మాకు జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం మధ్యలో తెలుగుదేశం బ్రోకర్లకు పనేంటి ఏబీఎన్ రాధాకృష్ణ బ్రోకర్ పనులు టీడీపీలో చేసుకోమనండి జగన్ మోహన్ రెడ్డిని ఎదుక్కోలేక పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి ఎందరు కలిసొచ్చినా జగన్మోహన్రెడ్డిని ఎదిరించలేరు జగన్ సింగిల్ గా వస్తానని చెబుతున్నాడు ...మీరెందుకు ఒకరి సంక మరొకరు ఎక్కుతున్నారు చంద్రబాబు పర్మినెంట్ గా మాజీగానే ఉంటాడు ఈ రాష్ట్రానికి పర్మినెంట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదిలక్షల మంది జనం వచ్చిన చోట ఆంధ్రజ్యోతి పేపర్ ఫోటో గ్రాఫర్ కు పనేంటి ఏబీఎన్ ను , వాళ్ల పేపర్ ను మేం బ్యాన్ చేశాం..ఎవరు రమ్మన్నారు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ,బీఆర్ నాయుడు మా సభలకు మీ లోగోలు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా మీరు మా సభలకు వస్తే మా కార్యకర్తలు మీ కాలుకు కాలు విరిచేస్తారు 06:53 PM, Feb 19th, 2024 నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ, జనసేనకి భారీ షాక్ జనసేన, టీడీపీకి చెందిన 500 మంది యువకులు వైఎస్సార్సీపీలో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి యువతలో సీఎం జగన్‌కు మంచి క్రేజ్ ఉందని, వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా 05:17 PM, Feb 19th, 2024 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు?: సజ్జల గత ఐదేళ్లలో ఏ అభివృద్ధీ చేయని చంద్రబాబు ఇప్పుడు మాకు సవాల్ చేయటం కరెక్టు కాదు చంద్రబాబుకు సత్తా ఉంటే గతంలో ఏం చేశారో చెప్పాలి చంద్రబాబు పాలన చెత్తపాలన అని పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారు మద్యం విషయంలో దశలవారీగా చేస్తున్నాం సీఎం జగన్‌కు సవాల్ విసిరే అర్హత చంద్రబాబుకు లేదు చంద్రబాబు సవాల్‌కి మేము సిద్ధమే మా తరపున ఎవరో ఒకరు చర్చకు వస్తారు అంతకంటే ముందు గత పాలనలో ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలి జగన్ పాలనలో చెప్పి, చేయనవి ఏంటో చంద్రబాబు చెప్పాలి కౌంట్ డౌన్ మొదలైంది ఇంకో యాభై రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు మా వాలంటీర్ల వ్యవస్థ మంచిది కాదు, మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తానని డైరెక్ట్‌గా చెప్పాలి సిద్ధం సభలను ప్రజలు చూస్తూనే ఉన్నారు ఏ సభలోనూ జగన్ పరుషంగా ఎప్పుడూ మాట్లాడలేదు కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాటలు ఎలా ఉన్నాయో కూడా జనం చూస్తున్నారు ఊరూరా జరిగిన అభివృద్ధిని ఎవరూ కాదనలేదు ఎల్లోమీడియా రోజూ తప్పుడు వార్తలు రాస్తున్నారు చేసిన అభివృద్ధి, సంక్షేమం వారికి కనపడదా? 87% మంది ప్రజలు నేరుగా ప్రభుత్వ లబ్ది పొందారు ఆ కృతజ్ఞతలు చూపిస్తున్నారు జగన్ మీద వ్యతిరేకత ఉంటే మరి చంద్రబాబుకు పొత్తులు ఎందుకు? రెండు ఎకరాల నుండి లక్షల కోట్ల ఆస్థులు చంద్రబాబు ఎలా సంపాదించారు? జగన్ ఆస్తులు ప్రజలకు పంచాలన్న లోకేష్ ప్రకటన హాస్యాస్పదం చేతిలో పచ్చమీడియా ఉన్నందున ఏది మాట్లాడినా వార్తలు వేస్తారని చంద్రబాబు, లోకేష్ అనుకుంటున్నారు చంద్రబాబు నిజం చెప్తే తల వెయ్యి ముక్కలు అవుతుందని ముని శాపం ఉందని గతంలో వైఎస్సార్ అనేవారు ఆ సంగతి తెలీక లోకేష్ ఆ సామెతని జగన్‌కి చుడుతున్నాడు జైల్లో ఉన్నప్పుడు సర్వరోగాలు ఉన్నాయని చెప్పుకుని బెయిల్ పై బయటకు వచ్చారు ఆ రోగాలన్నీ ఇప్పుడు ఏం అయ్యాయో చంద్రబాబు చెప్పాలి కేసులపై కోర్టులు తీర్పులు ఇస్తాయి త్వరలోనే మ్యానిఫెస్టోని ప్రకటిస్తాం.. చేయగలిగినదే చెప్తాం 05:15 PM, Feb 19th, 2024 చంద్రబాబు సవాల్‌పై కొట్టు సత్యనారాయణ ధ్వజం చంద్రబాబు నాయుడుకి మతి భ్రమించింది చంద్రబాబు అభివృద్ధి మీద చర్చిద్దాం అనడం హాస్యాస్పదం ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన వ్యక్తి చంద్రబాబు సీఎం జగన్‌తో సవాల్ చేసే స్థాయి చంద్రబాబుకి లేదు మర్రిచెట్టుకి వచ్చినట్లు ఏళ్ళు వస్తే సరిపోదు బుద్ధి జ్ఞానం ఉండాలి నా పరిపాలన చూసి ఓటెయ్యమని అడిగే దమ్ము దైర్యం చంద్రబాబుకి ఉంటే చెప్పాలి 04:40 PM, Feb 19th, 2024 చంద్రబాబు సవాల్‌కు జగన్‌కు రావాల్సిన అవసరం లేదు.. మేమే సరిపోతాం: పోతుల సునీత చంద్రబాబు సవాల్‌కు సీఎం జగన్ రావాల్సిన అవసరం లేదు.. మేమే చంద్రబాబుకు సమాధానం ఇస్తాం రాబోయే రోజుల్లో ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధం గా ఉన్నారు. రెండు బటన్లు నొక్కేందుకు ప్రజలు సిద్ధం గా ఉన్నారు.. చంద్రబాబు అంటే భయపడాల్సిన అవసరం జగన్‌కు లేదు చంద్రబాబు తన హయాంలోనే సారాను ఏరులై పారించారు ఇసుక అక్రమ రవాణా చేసి కోట్ల గడించారు సిద్ధం సభలు భారీ సక్సెస్ అవుతున్నాయి విద్య, వైద్య రంగాల్లో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు చేశారు అంబేద్కర్ స్ఫూర్తితో జగన్ పరిపాలన సాగిస్తున్నారు అందుకే సిద్ధం సభలకు భారీగా జనం తరలివస్తున్నారు 04:20 PM, Feb 19th, 2024 చంద్రబాబుతో చర్చకు జగన్ అవసరం లేదు : కేశినేని నాని వైఎస్సార్సీపీ చేసిన అభివృద్ధిపై మేం చర్చకు సిద్ధం తాత్కాలిక సచివాలయం కటడం అభివృద్ధా? ఏపీలో 10 వేలకు పైగా గ్రామ సచివాలయాలు అభివృద్ధి కాదా? సంపదను చంద్రబాబు దోచుకున్నారా? 04:15 PM, Feb 19th, 2024 మమ్మల్ని విమర్శించే స్థాయి లోకేష్‌కు లేదు : ధర్మాన కృష్ణదాస్ లోకేష్ అవివేకి, ఆయన మాటలకు విలువలేదు రెడ్ బుక్ చూపిస్తే ఎవరూ భయపడరు దమ్ముంటే లోకేష్ నాపై పోటీ చేయాలి 04:10 PM, Feb 19th, 2024 బుద్ధా వెంకన్న కిడ్నీలు దానం చేసినా ప్రయోజనం లేదు: వెల్లంపల్లి బుద్ధా వెంకన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు బుద్ధా వెంకన్న విచిత్ర వేషాలు కామెడీగా ఉన్నాయి బోండా ఉమా, బుద్ధా వెంకన్నను పిచ్చాస్పత్రికి పంపాలి 02:45 PM, Feb 19th, 2024 కాకినాడ రాజకీయ స్వార్థం తో నాపై విమర్శలు చేస్తున్నారు: ఎమ్మెల్యే ద్వారంపూడి మత్స్యకార జాతిని గౌరవిస్తాను, ఆరాధిస్తాను జాతి అంటే కొండ బాబు కుటుంబం అని ఆ రోజే చెప్పాను మత్స్యకారులుకి ఎమ్మెల్సీ ఇప్పించడం లో నేను కృషి చేశాను కొండ బాబు మత్స్యకారులుకి ఏమి చేశాడు? మత్స్యకార జాతి లో నేను పుట్టకపోవచ్చు..వారి కోసం నేను తప్పిస్తాను 02:40 PM, Feb 19th, 2024 చంద్రబాబు సవాల్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పేర్నినాని చంద్రబాబు పిట్టల దొరలా ఊరూరా తిరిగి హామీలిచ్చాడు బందరులో ఓట్లు అడుక్కోవడానికి వచ్చి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు బందరు పోర్టును పూర్తిచేశావా చంద్రబాబు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నావ్...మూడు గజాలైనా ఇచ్చావా? ఆక్వా హబ్ ను చేస్తానన్నావ్ చేశావా? హైదరాబాద్ నుంచి బందరుకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానన్నాడు చేశాడా గురివింద గింజకు ఒక్కచోటే మచ్చ ఉంటుంది చంద్రబాబుకు నిలువెల్లా మచ్చలే ఎన్నికల ముందు మాటిచ్చి ఓటేసిన తర్వాత మోసం చేసే గుణం ఉన్నోడే చంద్రబాబు ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట 99 శాతం హామీలు నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్రెడ్డి జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు 14 ఏళ్లలో చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్కపథకమైనా ఉందా? జగన్మోహన్రెడ్డికి సవాల్ విసిరే అర్హత చంద్రబాబుకు లేదు 02:20 PM, Feb 19th, 2024 టీడీపీ కుట్ర బట్టబయలు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టుల ద్వారా వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం షర్మిలపై ఐటీడీపీ అసభ్య పోస్టింగ్‌లు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సభ్యుడి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టి సోషల్ మీడియా ముసుగులో వైఎస్సార్సీపీపై విషం జిమ్మిన టీడీపీ టీడీపీ సానుభూతిపరుడు పినపాల ఉదయ్ భూషణ్ పేస్‌బుక్‌లో షర్మిల, నర్రెడ్డి సునీతపై జుగుప్సాకరంగా పోస్టింగ్‌లు ఫేక్ పోస్టులతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచేందుకు చంద్రబాబు ఎత్తుగడ ప్రజలు ఎప్పుడో మరిచిపోయిన కాంగ్రెస్‌ను జాకీలెత్తి లేపే ప్రయత్నం 01:42 PM, Feb 19th, 2024 అభివృద్ది పై చంద్రబాబుతోనైనా చర్చిస్తాం: దేవినేని అవినాష్ రాష్ట్రంలో నిజమైన అభివృద్ది జగన్ హయాంలోనే జరిగింది తూర్పు నియోజకర్గంలోనే 650 కోట్ల అభివృద్ది జరిగింది కొండ ప్రాంతాలు..కరకట్ట ప్రాంతం ఏంతో అభివృద్ది చేశాం రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి ప్రజలకు అండగా నిలిచాం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏ అభివృద్ధీ చేయలేదు గద్దె దిగజారుడు వ్యాఖ్యలు చేసి తన అక్కసు వెళ్లగక్కుతున్నారు ప్రభుత్వంపై, దేవినేని నెహ్రూపై గద్దె రామ్మెహన్ దిగజారి విమర్శలు చేస్తున్నారు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి సంక్షేమం పై గద్దె రామ్మోహన్ చర్చకు రావాలి గద్దె తూర్పులో ఏం అభివృద్ది చేశాడో చెప్పాలి సెటిల్మెంట్ వారసుడు అని నా పై నోరుపారేసుకోవడం మానుకోవాలి మేము చేసిన అభివృద్ది పై చంద్రబాబుతోనైనా చర్చిస్తాం 70 ఏళ్ల గద్దె రామ్మోహన్ 35 ఏళ్ల నన్ను చూసి వణికిపోతున్నారు జీరో ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ చరిత్రలో నిలిచిపోతారు హెరిటేజ్ వ్యానులో గంజాయి తీసుకెళ్లింది టీడీపీ నేతలే కాల్ మనీ సెక్స్ రాకెట్, కాల్ నాగ్ అంటే గుర్తొచ్చేది గద్దె రామ్మోహన్ గద్దె భండారం త్వరలోనే బయటపెడతాం సిద్ధం సభలు చూసి టీడీపి శ్రేణులు, దాని మిత్ర పక్షాలుకి మైండ్ బ్లాక్ అయింది నారా లోకేష్ అతనికి ఉన్న ఆస్తుల పై వివరణ ఇవ్వాలి చంద్రబాబు అక్రమ ఆస్తులు పేదలకు పంచాలి తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ వ్యాఖ్యలు 01:09 PM, Feb 19th, 2024 అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా: అలీ వైఎస్సార్సీపీ ఆదేశిస్తే.. ఎన్నికల్లో పోటీ చేస్తా అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటా గుంటూరు, రాజమండ్రి, నంద్యాల ఏ స్థానం నుంచైనా పోటీకి సిద్ధం రాప్తాడు సభ చూశాక వైఎస్సార్సీపీ విజయం ఖాయమని అర్థమైపోయింది సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ 12:40 PM, Feb 19th, 2024 బ్రాహ్మణి.. మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: గంజి చిరంజీవి లోకేష్ భార్య బ్రాహ్మణి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు 2014 నుంచి 2019 వరకు మీ మామ చంద్రబాబు నాయుడు చేనేతలకు ఏం చేశాడో చెప్పండి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చేనేత పరిశ్రమంలో నాశనం చేశాడు ఇప్పుడొచ్చి మాయ మాటలు చెప్తే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు వైఎస్సార్సీపీ మంగళగిరి ఇన్‌ఛార్జి గంజి చిరంజీవి కామెంట్స్ 12:34 PM, Feb 19th, 2024 చంద్రబాబు ఛాలెంజ్.. కేశినేని నాని సూటి ప్రశ్నలు చంద్రబాబు ఛాలెంజ్‌కు.. కేశినేని నాని ప్రతి ఛాలెంజ్ చంద్రబాబు స్టేట్మెంట్ చూశా ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాల్లో అభివృద్ధి పై చర్చకు సిద్ధమా? అన్నాడు అభివృద్ధి పై జగన్ వరకు ఎందుకు చంద్రబాబుతో చర్చించేందుకు నేను సిద్దం తాత్కాలిక సచివాయలం ఒకటి కట్టడం అభివృద్ధా? రాష్ట్రంలో సీఎం జగన్ కట్టిన 10వేలకు పైగా సచివాలయాలు అభివృద్ధా? చంద్రబాబు కుటుంబం, వారి అనుయాయులు ప్రభుత్వం సంపదను దోచుకోవడం అభివృద్ధా...? మానవ అభివృద్ధి కోసం చదువులు, ఆరోగ్యం,సంక్షేమం ఇలా చేయడం అభివృద్ధా..? చంద్రబాబు 45 ఏళ్ల ఇండ్రస్ట్రీ అంటాడు...అందులో స్వామిదాస్ 35 ఏళ్ల ఇండస్ట్రీ, నాది పదేళ్లు మేము చెబుతాం ప్రజలకు చంద్రబాబు నీది కాదు అభివృద్ధి.. సీఎం జగన్ దే అభివృద్ధి అని టీడీపీ పార్టీ ఈనాడు పేపర్ చేతుల్లో ఉంది రామోజీరావు 2 వేల ఎకరాల కోటలో నుంచి ఆంధ్రాను చూస్తాడు పేదలను బెదిరించి, ముఖ్యమంత్రు లను లొంగ తీసుకున్న రామోజీరావుకు ఆయన టాయిలెట్ అంత ఉండదు మన అభివృద్ధి 2వేల ఎకరాల కోట అందులోనే ఎయిర్ డ్రోమ్ ,ఫిల్మ్ సిటీ ఇవన్నీ రామోజీరావు అభివృద్ధి చంద్రబాబు చేసేవి మాత్రమే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5,సోషల్ మీడియా, అమెరికాలో ఉండే కుహనా మేధావులకు అభివృద్ధిలా కనిపిస్తాయి తిరువూరు నియోజకవర్గానికి 2,200 కోట్లు సంక్షేమం, అభివృద్ధి పథకాల పేరుతో ప్రజలకు అందాయి ఇది కాదా చంద్రబాబు అభివృద్ధి 12:02 PM, Feb 19th, 2024 విశాఖలో పవన్ రెండో రోజు పర్యటన సీట్ల సర్దుబాటు పై కసరత్తు చేస్తున్న జనసేనాని అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పవన్ నిన్న కొణతాలతో ప్రత్యేకంగా సమావేశమైన పవన్ ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం నేతలతో భేటీ పోటీకి సిద్ధపడుతున్న పలువురు జనసేన నేతలు విశాఖ దక్షిణం నుంచి ఎమ్మెల్సీ వంశీకృష్ణ పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు గాజువాక నుంచి సుందరపు సతీష్ కుమార్ అనకాపల్లి ఎంపీగా పోటీకి నాగబాబు ఆసక్తి.. పోటీకి దిగుతానంటున్న కొణతాల రామకృష్ణ 11:31 AM, Feb 19th, 2024 మరోసారి ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విచారణ మధ్యాహ్నం గంటలకు హాజరుకావాలంటూ స్పీకర్ నోటీసులు నోటీసుల్లో తుది విచారణగా పేర్కొన్న స్పీకర్ తమ్మినేని సీతారాం రాకపోతే.. ఇప్పటివరకు జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టీకరణ వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన కోటంరెడ్డి, ఆనం, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీదేవి ఫిరాయింపు ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణలకు సైతం నోటీసులు విచారణకు హాజరవుతారా ? లేదా ? అనే దానిపై సందిగ్థత 11:02 AM, Feb 19th, 2024 బాబును నమ్ముదామా? వద్దా?.. బీజేపీ నిర్ణయంపై ఆసక్తి ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్టానం తేల్చే అవకాశం ఒకట్రెండు రోజుల్లో రానున్న స్పష్టత రాష్ట్ర నాయకత్వానికి క్లారిటీ ఇవ్వనున్న హైకమాండ్ చంద్రబాబును నమ్మాలా? వద్దా? అనే అనుమానంలో బీజేపీ పవన్ కల్యాణ్ కూడా విశ్వసనీయమైన మిత్రుడు కాదన్నయోచనలో కమలనాథులు అయినా సరే, పొత్తు పెట్టుకుందామంటోన్న బాబు, పవన్ విశాఖ టూర్ తర్వాత ఢిల్లీకి వెళ్లే యోచనలో పవన్ పిలిస్తే క్షణంలో ఢిల్లీకి వస్తానంటున్న బాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న బీజేపీ నేతలు ఏపీలో పార్టీ పరిస్థితిపై అధిష్టానానికి వివరించిన బీజేపీ నేతలు హైకమాండ్ నిర్ణయం పై ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ బీజేపీ నేతలు 10:42 AM, Feb 19th, 2024 అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు: లక్ష్మీపార్వతి మహిళకు సాధికారత అందిస్తేనే సమాజం వృద్ధి చెందుతుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మారు రామ్ మనోహర్ లోహియా మహిళా పక్షపాతి జగన్ మోహన్ రెడ్డి మహిళా సంస్కర్త ఇందిరాగాంధీ మహిళల స్థితి గతులు తెలుసుకునేందుకు రామచంద్రగుహ కమిటీ వేశారు రామచంద్రగుహ కమిటీ ఓ నివేదిక ఇచ్చినా మహిళల ఇబ్బందులు మారలేదు 16 ఏళ్ల ఇందిరాగాంధీ పాలనలో కూడా మహిళల స్థితిగతులు మారలేదు ఇందిరాగాంధీ చేయలేని పనిని జగన్ మోహన్ రెడ్డి చేసి చూపించారు మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కింది మహిళల కోసం తొలిసారిగా పద్మావతి యూనివర్శిటీని ఎన్టీఆర్ స్థాపించారు మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు ఎన్టీఆర్ తర్వాత మహిళల సాధికారితకు కృషి చేసింది నాడు వైఎస్సార్.. నేడు వైఎస్ జగన్ మహిళలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేసిన సీఎం భారతదేశంలో జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే ప్రజలు మంచి మనసుతో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి రాబోయే 15 ఏళ్లపాటు ఇదే ప్రభుత్వం ఉంటే ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలుస్తుంది భారతదేశ చరిత్రలో విద్యకు ఇంత ప్రాధాన్యం ఇచ్చిన ఒకే ఒక్కరు జగన్ వయసులో చిన్నవాడే అయినా జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు చాలా గొప్పవి జగన్ మోహన్ రెడ్డి ఒక వ్యవస్థ అణగారిన వర్గాలకు గుర్తింపునిచ్చిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి పేదలు.. మహిళల అభ్యున్నతికి ఒక మహర్షిలా జగన్ పాటు పడుతున్నారు జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మంచి పనులను మనమంతా అందరికీ చెప్పాలి గత ఐదేళ్లలో రూ. 6 లక్షల కోట్లు లూటీ జరిగింది అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు చంద్రబాబు బాధితుల్లో నేను,నాభర్త ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాం ఆడవారంటే చంద్రబాబుకి అసహ్యం జగన్ మోహన్ రెడ్డిని తిట్టడానికే చంద్రబాబు మీటింగ్ లు పెడుతున్నాడు మంచి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి కావాలో ప్రజలు ఆలోచించాలి చంద్రబాబు ముసలోడైపోయాడు.. మూడుకాళ్లొచ్చేశాయి తన కొడుకుని సీఎం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు పొరబాటున ప్రభుత్వం మారితే ఏపీ పూర్తిగా దోపిడీకి గురవుతుంది :::తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు 09:58 AM, Feb 19th, 2024 మైలవరం టీడీపీలో ముసలం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మళ్లీ వేడెక్కిన రాజకీయం వసంత వర్సెస్ దేవినేని ఉమాగా మారిన పరిణామాలు టికెట్ విషయంలో ఎవరికీ క్లారిటీ ఇవ్వని టీడీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దేవినేని ఉమా వర్గం మైలవరంలో ఎన్నికల ప్రచారానిని ఉమా నిర్ణయం 21 నుంచి అన్నరావుపేట నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని ప్లాన్ 09:28 AM, Feb 19th, 2024 ‘నాగబాబుకి ఇవ్వడమేంటండి!’ ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన లో రేగుతున్న చిచ్చు నాగబాబు పవన్ పర్యటనకు కొణతాల రామకృష్ణ డుమ్మా నాగబాబు విశాఖ అనకాపల్లి పర్యటనలకు కొణతాల దూరం నిన్న విశాఖ వచ్చిన పవన్ ను కలవని కొణతాల అనకాపల్లి ఎంపీ సీటు నాగబాబుకి ఇవ్వడం పై కొణతాల అసంతృప్తి జిల్లాలో తనకు తెలియకుండా పర్యటించడంపైన ఆగ్రహం కొణతాల ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్ 08:55 AM, Feb 19th, 2024 వన్స్ మోర్ జగన్ రాప్తాడు సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ రాయలసీమ వ్యాప్తంగా తరలివచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు వన్స్ మోర్ జగన్ అంటూ నినదించిన వైఎస్సార్ సీపీ క్యాడర్ భీమిలి, దెందులూరు, రాప్తాడు సభలు విజయవంతం కావటంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్త కూ అండగా ఉంటానన్న సీఎం జగన్ ప్రత్యర్థులపై పంచులు గుప్పించిన సీఎం జగన్.. సర్వత్రా చర్చ 08:25 AM, Feb 19th, 2024 పవన్.. మళ్లీ భీమవరమేనా? ఉమ్మడి తూర్పు గోదావరిలో నేడు పవన్ కల్యాణ్ పర్యటన పార్టీ కీలక నేతలతో సమావేశం రేపు భీమవరానికి పవన్ రెండు రోజులపాటు భీమవరంలోనే పవన్ మకాం భీమవరం నుంచే పవన్ పోటీ చేస్తాడనే ప్రచారం 08:12 AM, Feb 19th, 2024 జగన్ పంచులు.. వర్మ మాస్ ట్రోలింగ్ ఏపీ పొత్తు రాజకీయాలపై తనదైన శైలిలో ఆర్జీవీ సెటైర్లు టీ గ్లాస్ సింక్‌లో పడేసిన వీడియో పోస్ట్ చేసిన వర్మ రాప్తాడు సిద్ధం సభలో ప్రతిపక్షాలపై సీఎం జగన్ పంచులు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి.. గ్లాస్ సింక్ లో ఉండాలన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జనసేనపై సీఎం జగన్ పంచ్‌ను ఇలా చూపించిన వర్మ pic.twitter.com/o3EMhMJ57S — Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2024 07:43 AM, Feb 19th, 2024 ఫుల్ జోష్‌తో వైఎస్సార్సీపీ సిద్ధం భారీ సభలతో దూసుకువెళ్తున్న వైఎస్సార్సీపీ చరిత్ర సృష్టించిన నిన్నటి రాప్తాడు సిధ్దం సభ ఇప్పటికే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో సిద్ధం సభలు పూర్తి త్వరలోనే పల్నాడు జిల్లాలో మరో సిద్ధం సభ ఉండే అవకాశం ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా సాగుతున్న సభలు పార్టీ నేతలు, క్యాడర్ లో ఫుల్ జోష్ 07:02 AM, Feb 19th, 2024 మారణాయుధాలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి పల్నాడు జిల్లా మంచికల్లు గ్రామంలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు మేకపోతుల ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి పరిస్థితి విషమం ప్రశాంతంగా ఉన్న పల్నాడులో గొడవలను రెచ్చగొడుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఫైర్ 06:58 AM, Feb 19th, 2024 రాప్తాడు సిద్ధం సభపై ఆర్జీవీ ట్వీట్ సముద్రాన్ని తలపించిన రాప్తాడు సిద్ధం సభ వైఎస్సార్సీపీ బహిరంగ సభపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందన సీఎం జగన్ సిద్ధం సభను చూసి ఆశ్చర్యపోయానంటూ ట్వీట్ పది లక్షల మందికిపైగా హాజరై ఉంటారని వర్మ అంచనా దేశంలోనే అతిపెద్ద సభ కాబోలు అంటూ ఆశ్చర్యం In the DRY region of Rayalaseema suddenly a OCEAN emerged and this is a ocean of nearly 10 LAKH people who came to attend a meeting of @ysjagan and this is the BIGGEST gathering ever in the political HISTORY of india https://t.co/woJ5M9t3wQ — Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2024 06:41 AM, Feb 19th, 2024 సోషల్ మీడియాలోనూ సిద్ధమా?: సీఎం జగన్ ఎన్నికల వేళ.. కపట వాగ్ధానాలు చేస్తున్న చంద్రబాబు ఎల్లో మీడియా తప్పుడు కథనాలు అంతటిని ఎండగట్టడానికి సోషల్ మీడియా సైన్యమంతా సిద్ధమా? అంటూ సీఎం జగన్ పిలుపు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై పచ్చమంద చేస్తున్న దుష్ప్రచారాన్ని మీ సెల్‌ఫోన్ ద్వారా తిప్పికొట్టాలని పార్టీ కేడర్‌ను పిలుపు చంద్రబాబు కపట వాగ్ధానాలు, ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ఎండగట్టడానికి మన సోషల్ మీడియా సైన్యమంతా సిద్ధమా? సోషల్ మీడియాలో మన ప్రభుత్వంపై పచ్చమంద చేస్తున్న దుష్ప్రచారాన్ని మీ సెల్‌ఫోన్ ద్వారా తిప్పికొట్టండి! #Siddham pic.twitter.com/p9d0j2lCv8 — YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2024 06:36 AM, Feb 19th, 2024 పవన్ బుజ్జగింపు పర్వం మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇంటికి పవన్ కల్యాణ్ అభ్యర్ధుల ఎంపికపై కొణతాలతో సమావేశమైన పవన్ కల్యాణ్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా కొణతాల నివాసానికి పవన్ అనకాపల్లిలో నాగబాబు టూర్ కు దూరంగా ఉన్న కొణతాల నిన్న కొణతాల ఇంటికి వెళ్లిన నాగబాబు ఆసక్తిగా మారిన కొణతాల, పవన్ సమావేశం అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా నాగబాబు పేరు ప్రచారం కావడంతో పవన్-కొణతాల భేటీకి ప్రాధాన్యత 06:30 AM, Feb 19th, 2024 ఎవరు పోటీలో ఉన్నా.. మనకే ప్రజల బ్రహ్మరథం: సీఎం జగన్ పార్టీ క్యాడర్ని ఉద్దేశించి వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి మన పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటా అలానే ప్రజాసేవలో ఉన్న వారికి మరో రెండు మెట్లు పైకి ఎక్కే అవకాశం కల్పిస్తా ఈ ఐదేళ్లు ప్రజలకు మంచి పాలన అందించాం కాబట్టి, మనలో ఎవరు పోటీలో ఉన్నా ప్రజలు బ్రహ్మరథం పడతారు మన @YSRCParty కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటా… అలానే ప్రజాసేవలో ఉన్న వారికి మరో రెండు మెట్లు పైకి ఎక్కే అవకాశం కల్పిస్తా… ఈ ఐదేళ్లు ప్రజలకు మంచి పాలన అందించాం. కాబట్టి, మనలో ఎవరు పోటీలో ఉన్నా ప్రజలు బ్రహ్మరథం పడతారు!#Siddham pic.twitter.com/wny9gwiYnj — YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2024 -
ట్రెండింగ్‌లో ‘సిద్ధం’
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం నిర్వహించిన ‘సిద్ధం’ సభ సోషల్ మీడియా (సామాజిక మధ్యమాలు)లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఎక్స్(ట్విట్టర్)లో దేశంలోనే మొదటి స్థానంలో ‘సిద్ధం’ హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ అయింది. సిద్ధం సభ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వైఎస్సార్సీపీ అభిమానులు భారీ ఎత్తున ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టులు చేశారు. జనసంద్రాన్ని తలపిస్తున్న ‘సిద్ధం’ సభా ప్రాంగణం, సభకు హాజరైన ప్రజలు సీఎం వైఎస్ జగన్‌కు నీరాజనాలు పలుకుతున్న జనం ఫొటోలతో సామాజిక మాధ్యమాలు నిండిపోయాయి. వైఎస్ జగన్ ఎగైన్, ఎండ్ ఆఫ్ టీడీపీ హ్యాష్‌ట్యాగ్‌లతోనూ ‘సిద్ధం’ సభ విశేషాలను ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూ అభిమానులు హోరెత్తించారు. తద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఉన్న క్రేజ్ గురించి మరోమారు దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చింది. -
రాయలసీమ చరిత్రలోనే భారీ బహిరంగ సభ
-
Watch Live: రాష్ట్ర చరిత్రలోనే భారీ బహిరంగ సభ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ జనసముద్రంలా కనిపిస్తోంది పెత్తందారులతో మన యుద్ధం జరగబోతుంది 2024లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది పెత్తందార్లతో యుద్ధానికి మీరు సిద్ధమేనా? విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతోంది పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా? చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? ప్రజల మంచి కోసం చంద్రబాబు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా? చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా? చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికైనా సామాజిక న్యాయం గుర్తుకొస్తుందా? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 10 శాతమైనా అమలు చేశారా? 1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టోలో 10 శాతమైనా అమలు చేశారా? మళ్లీ అబద్దాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నారు రంగురంగుల మేనిఫెస్టోలతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడు చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకు అనేది చంద్రబాబు సిద్ధాంతం 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏ ప్రాంతానికైనా న్యాయం చేశారా? చంద్రబాబు అబద్ధాలను నమ్మొద్దని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారు గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతపెట్టి చంద్రబాబు కుర్చీని మడతేసి వాళ్ల సీట్లను తగ్గించారు చంద్రబాబును మళ్లీ ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పనైనా గుర్తొస్తుందా? కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బాబు మార్క్ ఎక్కడైనా ఉందా? 57 నెలల పాలనలో చిత్తశుద్ధితో పాలన అందించాం 57 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం 57 నెలల పాలనలో జరిగిన మంచిని ప్రజలందరికీ వివరించండి ప్రతీ ఇంట్లో జరిగిన మంచిని ప్రతీ ఒక్కరికీ వివరించండి చేసినవి చెప్పాలి, వాటి కొనసాగింపు ఎంత అవసరమో చెప్పాలి ప్రతి అవ్వా, తాత ముఖంలో చిరునవ్వులు చూశాం ప్రతి అక్క, చెల్లెమ్మకు ఎంతో మేలు చేశాం రైతులకు రైతు భరోసా తీసుకొచ్చి ఇచ్చాం రైతన్నకు పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చాం మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెని చంద్రబాబు లాక్కుంటారు వైఎస్ఆర్ సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఎన్నో పథకాలు గుర్తొస్తాయి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం మనది ప్రతీ అక్కచెల్లెమ్మ ఫోన్ లో దిశ యాప్ తీసుకొచ్చాం చంద్రబాబు మోసాలను ప్రతీ రైతన్నకు వివరించాలి సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలి ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి గతంలో ఎన్నడూ చూడని విధంగా నాడు-నేడుతో మార్పులు తెచ్చాం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం పేద విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చాం కేవలం కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు రాకూడదంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావాలి వాళ్లంతా మనకు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలి సైకిల్ గుర్తుకు ఓటు వేయడమంటే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడమే YSRCP మార్క్ ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కనిపిస్తోంది ప్రజలు ఒక్కసారి అధికారం ఇస్తేనే ఇవన్నీ చేశాం ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తే మరిన్ని మంచి పనులు చేస్తాం లంచాలకు తావులేకుండా పేదల ఖాతాల్లోకి నగదు బదిలీ జరుగుతోంది 57 నెలల్లోనే 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం చంద్రబాబుకు ఓటు వేయడమంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయడమే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేశాం 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదు అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు? విద్యాదీవెన, వసతి దీవెనతో విద్యార్ధులకు అండగా నిలిచాం పెత్తందారుల పిల్లలతో మన పిల్లలు పోటీ పడాలంటే మళ్లీ మన ప్రభుత్వమే రావాలి మన పిల్లలు ప్రపంచ స్థాయికి ఎదిగేలా విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చాం పెన్షన్ కొనసాగాలంటే మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే రావాలి మీ అన్న ప్రభుత్వమే సంక్షేమ పథకాలను కొనసాగించగలదు జరుగుతున్న మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వమే రావాలి వైఎస్ఆర్ సీపీ పేరు చెబితే సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి కోవిడ్ కష్టకాలంలోనూ అందించిన సేవలు గుర్తొస్తాయి లంచాలకు తావు లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బు వేశాం మీ బిడ్డ 125 సార్లు బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నిధులు జమ చేశాం రూ.2.55 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ఖాతాల్లో వేశాం వైఎస్ఆర్ సీపీ మార్క్ ప్రతీ ఇంట్లోనూ కనిపిస్తోంది మళ్లీ అవకాశమిస్తే ఇంకెంత మంచి జరుగుతుందో ఆలోచించమని చెప్పండి 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవుల్లో ప్రాధాన్యతనిచ్చాం కేవలం 57 నెలల కాలంలో 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాం నిరుపేద వర్గాలకు 80 శాతం ఉద్యోగాలు ఇచ్చాం మేనిఫెస్టోను మీ బిడ్డ మాదిరిగా అమలు చేసిన వారెవరైనా ఉన్నారా? చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటేయాలి? జగన్ కు జనబలం లేకుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు? తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర ఎందుకు? సైకిల్ ను తొయ్యడానికి ప్యాకేజ్ స్టార్ ఎందుకు? ప్రజల కోసం 125 సార్లు నేను బటన్ నొక్కాను మళ్లీ ఫ్యాన్ కు ఓటేస్తే చంద్రముఖి బెడద ఇక మీకుండదు సైకిల్ కు ఓటేస్తే పేదల రక్తం తాగేందుకు చంద్రముఖి వస్తుంది పేదవాడి బతుకును మార్చేందుకు మనం యుద్దం చేస్తున్నాం చంద్రబాబు పెత్తందారుల తరపున సంసిద్ధం అంటున్నారు టీడీపీ దేనికి సంసిద్ధమని అడుగుతున్నా ?? దుష్టచతుష్టయం బాణాలకు తల వంచేందుకు ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు, అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ప్రజలున్నారు వైఎస్ఆర్ సీపీ మీ అందరి పార్టీ మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు.. ప్రజలతోనే మా పొత్తు గతంలో లంచాలు పిండుతూ తన వారికే చంద్రబాబు పథకాలిచ్చుకున్నాడు పార్టీలో ప్రతి కార్యకర్తకూ మీ అన్న జగన్ తోడుగా ఉంటాడు నాయకుడంటే ప్రతీ కార్యకర్తా కాలర్ ఎగరేసేలా ఉండాలి వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175 అసెంబ్లీ స్థానాలు వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25కి 25 ఎంపీ స్థానాలు 650 హామీలిచ్చి 10 శాతం కూడా చంద్రబాబు అమలు చేయలేదు మేనిఫెస్టోలో వైఎస్ఆర్ సీపీ 99 శాతం హామీలు అమలు చేసింది ఎల్లోమీడియా దుష్ప్రచారాలను తిప్పి కొట్టేందుకు మీరు సిద్ధమా? మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమా? ఈ ఎన్నికల తర్వాత టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవు ఎల్లో మీడియా చీకటి రాతలు తిప్పి కొట్టేందుకు మీరు సిద్ధమా? పెత్తందారులంతా తోడేళ్లుగా ఏకమవుతున్నారు ఈ ఎన్నికలు చాలా కీలకం పొరపాటు జరిగితే పేదవాడి బతుకు అతలాకుతలమవుతుంది సమర భేరి మోగిద్దాం... సమర నినాదం వినిపిద్దాం -
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వైఎస్సార్ సీపీదే
-
YSRCP Siddham Sabha: మేము సైతం ‘సిద్ధం’
అనంతపురం: రాప్తాడులో ఈ నెల 18న జరుగనున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘సిద్ధం’ సభకు రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది పార్టీ శ్రేణులు హాజరుకానున్నారు. ఏ చిన్నలోటుపాట్లు తలెత్తకుండా ఏర్పాట్లకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వలంటీర్లుగా పనిచేసేందుకు విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వైస్సార్సీపీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నేతృత్వంలో వచ్చిన పలువురు విద్యార్థులతో మంగళవారం సిద్ధం సభాస్థలి వద్ద ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ భేటీ అయ్యారు. వలంటీర్లుగా విద్యార్థులు అందించాల్సిన సేవలపై తలశిల దిశానిర్దేశం చేశారు. జరగబోయే ఎన్నికల యుద్ధంలో విపక్షాలన్నీ కట్టగట్టుకుని జగనన్న ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం మీద, ప్రతి ఇంటికీ మనం చేస్తున్న మంచి, అభివృద్ధి మీద దాడి చేస్తున్నాయన్నారు. పేదోడి బంగారు భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, కుతంత్రాల్ని, చీల్చి, చెండాడటానికి, మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని తలశిల రఘురామ్ పిలుపునిచ్చారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న రాబోయే తరం విద్యా విధానాన్ని నీరుగార్చేందుకు పెత్తందార్లంతా ఏకమవుతున్నారని ఆరోపించారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడు–నేడుతో మారుతున్న స్కూళ్లు, ఆస్పత్రులు, పారిశ్రామిక అభివృద్ధి, మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి మీద వారి దండ యాత్ర కొనసాగుతుందన్నారు. వారి కుట్రలను విద్యార్థిలోకం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో విద్యార్ధి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేంద్రరెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవ, రాష్ట్ర అధికార ప్రతినిధి కేశవ, రాష్ట్ర కార్యదర్శి షెక్షావలి, నాయకులు శ్రీకాంత్, రమేష్, విజయ్, ఆదాం, కిరణ్, అనిల్, వినోద్, ప్రశాంతి, కోమల, ఇమ్రాన్, ఇర్షాద్, చంద్ర, పవన్ పాల్గొన్నారు. -
Yatra 2 @ London : లండన్‌లో యాత్ర 2 సక్సెస్ మీట్
యాత్ర 2 సినిమా కొత్త ఒరవడి సృష్టిస్తోంది. విదేశాల్లో ఉంటోన్న ప్రవాసాంధ్రులను, ముఖ్యంగా వైఎస్సార్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. యూకే & యూరప్ YSRCP వింగ్ ఆధ్వర్యంలో లండన్ మహానగరంలోని హౌన్సలో ప్రాంతంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. మనం చూసే ప్రతి సినిమా మనలో ఒకరి జీవన ప్రతిబింబం. కొందరి జీవితాలు స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం. దివంగత నేత వైఎస్సార్ జీవితంలోని అటువంటి సంఘటనలను ఆధారంగా చేసుకొని వినోదాత్మకంగా మరియు సందేశాత్మకంగా సినిమాని మలచడంలో దర్శకుడు మహి రాఘవ సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు లండన్‌లోని YSRCP వింగ్ నాయకులు. ప్రజల మనసులను గెలిచిన మారాజు డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జీవన వృత్తాంతాన్ని చక్కగా సినిమాగా రూపొందించారని ప్రశంసించారు. యాత్ర2 సినిమా చూసిన తరువాత ఇది అద్భుతం అని అనకుండా వుండలేమన్నారు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి జీవితాన్ని హృద్యంగా చిత్రీకరించిన సన్నివేశాలతో మహీ రాఘవ ప్రేక్షకులను కట్టిపడేశాడని కొనియాడారు. అలాగే నిజజీవితంతో పెనవేసుకున్న ఎమోషనల్ డ్రామాను చాలా రియలిస్టిక్ గా చిత్రీకరించారని మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆఖర్లో రియల్ సీన్లను కలిపి చేసిన జగన్ గారి ప్రమాణస్వీకార సన్నివేశం రోమాలు నిక్కపొడుచుకునేలా తీశారని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా చరిత్రలో చెరగని పేజీగా యాత్ర 2 నిలిచిపోతుందన్నారు. భవిష్యత్తులో యాత్ర 3 సినిమా కూడా వస్తే మరింత బాగుంటుందన్నారు. నటులు మమ్ముట్టి, జీవా పాత్రలకు ప్రాణం పోశారని కొనియాడారు. -
రాప్తాడు సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు
-
ఈ వీడియో చూసి చెప్పండ్రా అబ్బాయిలు
-
వచ్చి రాగానే జగన్ ఏం చేశారో చూడండి
-
సిద్ధం సభ: బస్సు నడిపిన మాజీ మంత్రి పేర్ని నాని
-
కార్యకర్తలతో కలిసి సీఎం జగన్ సభకు పేర్ని నాని
-
Updates: నాకున్న సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే: సీఎం జగన్
UPDATES: 05:47 PM, Feb 3, 2024 దెందులూరు వైఎస్సార్సీపీ సిద్ధం సభ.. సీఎం జగన్ తన ప్రసంగం అనంతరం వేదిక దిగుతుండగా సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు, ప్రజాప్రతినిధులు వారితో ఓపిగ్గా సెల్పీలు దిగిన సీఎం జగన్ 05:14 PM, Feb 3, 2024 ముగిసిన సిద్ధం బహిరంగ సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు 04:14 PM, Feb 3, 2024 సిద్ధమా అంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం జగన్ ►మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా: సీఎం జగన్ ►ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు మీరు సిద్ధమా ►దుష్టచతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా ►పేదల భవిష్యత్‌ను కాటేసే ఎల్లో వైరస్‌పై యుద్ధానికి మీరు సిద్ధమా ►రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు ►ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరిగానే కనిపిస్తాడు ►కానీ నిజం ఏంటంటే..కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడు ►జగన్ ఒంటరివాడు కాదన్నది ఇక్కడ కనిపిస్తున్న జనమే నిజం ►కోట్లాది మంది గుండెల్లో జగన్ ఉండటమే నిజం ►నాకున్న సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే: సీఎం జగన్ ►జగన్ ఎప్పటికీ ఒంటరివాడు కాదు ►నా తోడు, నా ధైర్యం, నా బలం పైనున్న ఆ దేవుడు, మీరే ►నాకున్న నమ్మకం మీరే ►వచ్చే ఎన్నికల రణక్షేత్రంలో మీరంతా కృష్ణుడైతే నేను అర్జునుడిని ►దుష్టచతుష్టయం దాడి అంతా అభివృద్ది, సంక్షేమం మీదనే ►రాబోయే తరం విద్యావిధానాల మీద దుష్టచతుష్టయం దాడి చేస్తోంది ►రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తోంది ►మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం మనది ►పేదవాడి భవిష్యత్తు, సంక్షేమం మీద వారంతా దాడి చేస్తున్నారు ►గ్రామగ్రామాల్లో మనం తెచ్చిన మార్పు స్పష్టం కనిపిస్తోంది. ►అవినీతి, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం ►అందించిన సంక్షేమ పాలనకు ప్రతీ పేద కుటుంబమే సాక్ష్యం ►175కు 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యం ►నా మాటలన్నీ ప్రతీ ఇంటికి వెళ్లి పంచుకోవాలని కోరుతున్నా ►చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు తేడాను గమనించండి ►పేద కుటుంబాలకు చంద్రబాబు ఏం చేశాడో అడగండి ►చంద్రబాబు హయాంలో ఇచ్చిన స్కీములు ఏమున్నాయో అడగండి ►కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ ఏ గ్రామానైన్నా తీసుకోండి ►గతంలో లేనిది ఇప్పుడు గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించండి ►సచివాలయ వ్యవస్థతో గ్రామాల్లో వచ్చిన మార్పులు గమనించండి ►ఈ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారంటే జగన్ అని చెప్పండి ►ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వాతాతలకు పింఛన్ అందిస్తున్నాం ►అసైన్డ్ భూములకు శాశ్వత భూహక్కు ఇచ్చాం ►డీబీటీ ద్వారా 2 లక్షల 55 కోట్లు పేదలకే అందించా ►కేబినెట్లో 68 శాతం పదవులు ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలకే ఇచ్చాం ►4 డిప్యూటీ సీఎం పదవులు, స్పీకర్‌తో సహా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం అమలు చేశాం ►అక్క చెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబన అందించాం ►31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ►మీ బిడ్డ జగన్ పాలనలోనే ఇళ్ల పట్టాలు వచ్చాయని చెప్పేందుకు గర్వపడుతున్నా ►దిశ యాప్‌తో అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం ►రాష్ట్రంలో కొత్తగా 15 మెడికల్ కాలేజీలు కడుతున్నాం ►కొత్తగా 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం ►మహానేత వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తూ పాలన అందిస్తున్నాం ►అబద్దాల పునాదులపై ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి ►వచ్చే ఎన్నికలు.. పేదల భవిష్యత్‌ను నిర్ణయించేవి ►ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ జగనే ►3వేల పెన్షన్ అందాలన్నా.. భవిష్యత్‌లో పెరగాలన్నా.. మీ జగనే రావాలి ►ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికీ చెప్పాలి ►చెప్పిన ప్రతీది చేసిన ప్రభుత్వం మనది ►ప్రజలు నా స్టార్ క్యాంపెయినర్లు ►జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యమని చెప్పాలి ►పేదల సొంతింటి కల నెరవేరాలంటే జగనన్నే కావాలని చెప్పండి ►రైతు భరోసా కొనసాగాలన్నా జగనన్నే మళ్లీ రావాలని చెప్పండి ►పేదలకు అండగా నిలిచేందుకు 57 నెలల్లో 124 సార్లు బటన్ నొక్కాం.. ►రూ.2 లక్షల 55వేల కోట్లు పేదల ఖాతాల్లో నేరుగా జమ చేశాం ►మీరు నా కోసం ఒక్కసారి బటన్ నొక్కండి ►ఒకటి అసెంబ్లీ,ఒకటి పార్లమెంట్‌కు ఫ్యాన్ మీద నొక్కితే చంద్రముఖి బెడద మీకు శాశ్వతంగా ఉండదు ►ప్యాకేజీ కోసం రా.. కదలిరా అంటూ బాబు.. దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు ►చంద్రబాబు అండ్ కో.. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ ►175 స్థానాల్లో పోటీ చేసేందుకు చంద్రబాబుకు అభ్యర్థులే లేరు ►చంద్రబాబు అండ్‌కోపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా ►చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మకు ఏపీతో ఏం సంబంధం ►దిగజారుడు పార్టీలన్నీ పేదవాడి భవిషత్తునే టార్గెట్ చేసుకుంటున్నాయి ►ప్రజల రక్షణ కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ 04:10 PM, Feb 3, 2024 దెందులూరులో భారీ జనసందోహానికి సీఎం జగన్ అభివాదం సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికిన వైఎస్సార్సీపీ శ్రేణులు దెందులూరులో జగనన్న ప్రభంజనం కనిపిస్తోంది: అబ్బయ్య చౌదరి ఎటుచూసిన వైఎస్సార్సీపీ జెండాలే రెపరెపలాడుతున్నాయి. విశ్వసనీయతకు మారు పేరు సీఎం జగన్ సీఎం జగన్ రంగంలోకి దిగితే వార్ వన్‌సైడే పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధానికి మేం సిద్ధం 03:56 PM, Feb 3, 2024 సిద్ధం సభావేదికపై వైఎస్సార్‌కు సీఎం జగన్ నివాళి సిద్ధం సభావేదికపై వైఎస్సార్‌కు నివాళి అర్పించిన సీఎం జగన్, వైఎస్సార్సీపీ నేతలు భారీ వాక్ వేపై పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన సీఎం జగన్ 50 నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు 03:41 PM, Feb 3, 2024 సిద్ధం వేదికపైకి సీఎం జగన్ ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్సీపీ సిద్ధం సభ సిద్ధం సభా వేదికపైకి చేరుకున్న సీఎం జగన్ ‘సిద్ధం’ పాటతో మారుమోగుతున్న దెందులూరు సభా ప్రాంగణం కాసేపట్లో పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్ 03:29 PM, Feb 3, 2024 దెందులూరు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ హెలికాఫ్టర్‌లో దెందులూరు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ దెందులూరులో వైఎస్సార్సీపీ సిద్ధం సభ వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం సభలో పాల్గొననున్న సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్ 03:22 PM, Feb 3, 2024 సిద్ధం సభ ప్రతిపక్షాల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది: మంత్రి వేణు అంబేద్కర్ చెప్పిన సామాజిక న్యాయాన్ని జగన్ చేతల్లో చూపించారు సీఎం జగన్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమైంది చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు కుట్రలు చేయడమే చంద్రబాబు పని 03:15 PM, Feb 3, 2024 సీఎం జగన్ పేదల పక్షపాతి: ఆళ్ల నాని ప్రతిపక్షాలు సీఎం జగన్‌ను ఎదుర్కొలేక కుట్రలు చేస్తున్నాయి ప్రతీ ఇంటికీ సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు సీఎం జగన్ పాదయాత్రలో పేదల కష్టాలు తెలుసుకొని జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారు. పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది 03:00 PM, Feb 3, 2024 తాడేపల్లి నుంచి దెందులూరు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో ఏలూరు సిద్దం సభకు హాజరు జగన్‌ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధం: కొట్టు సత్యనారాయణ మా ప్రజాబలం చూసి చంద్రబాబుకు మతిభ్రమించింది. సీఎం జగన్ వెంటే ప్రజలు ఉన్నారు. 175కు 175 సీట్లు గెలవడమే మా టార్గెట్ జగన్‌కు ఉన్న స్టార్ క్యాంపెయినర్లను చూశారా? వైస్సార్సీపీకి సామాన్య ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు పచ్చ బ్యాచ్‌కు మాత్రం దండిగా స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబుకి సపోర్ట్‌గా దత్తపుత్రుడు పవన్, వదిన.. బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో ఉన్న బాబు అభిమాన సంఘం పొరుగు రాష్ట్రాల్లో ఉంటూ ప్రభుత్వంపై విద్వేషం గుప్పించే యెల్లో మీడియా కానీ, సీఎం జగన్‌కు నో స్టార్ క్యాంపెయినర్లు వైఎస్సార్సీపీకి సామాన్యులే క్యాంపెయినర్లు అందుకు ప్రత్యక్ష తార్కాణం.. ఏలూరు దెందలూరు సిద్ధం సభకు పోటెత్తిన జన ప్రభంజనం Star Campaigners of YSRCP…🔥 సామాన్య ప్రజలే మన పార్టీ స్టార్ క్యాంపైనర్లు…#YSJaganAgain #Siddham#YSRCPStarCampaigners pic.twitter.com/kg1Nv4I2Tq — YSR Congress Party (@YSRCParty) February 3, 2024 జనజాతరను తలపిస్తున్న@YSRCParty దెందులూరు సిద్ధం సభ🔥#Siddham#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/Hg07fTSKQk — YSR Congress Party (@YSRCParty) February 3, 2024 02:30 PM, Feb 3, 2024 తూర్పుగోదావరి జిల్లా ఏలూరు సిద్ధం సభకు భారీగా తరలి వెళుతున్న వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు... రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బస్సులు, కార్లలో తరలింపు. అభ్యర్థులను ప్రకటించి సిద్ధంగా ఉన్నాం: రాజమండ్రి ఎంపీ భారత్. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ప్రజలంతా మేము సిద్ధంగా ఉన్నామని సభకు వస్తున్నారు. మేము సిద్ధం అంటే .. సంసిద్ధం అంటూ ప్రతిపక్షాలు అనడం సిగ్గుచేటు. ఒక పార్టీ ఇచ్చిన నినాదాన్ని మరొక పార్టీ కూడా ఫాలో అయ్యే పరిస్థితికి ప్రతిపక్షాలు దిగజారిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు పెద్దపీఠం వేసి మేము ఎన్నికలకు సిద్ధ పడుతున్నాం. మేము 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించి మేము సిద్ధం అంటున్నాం. మీరు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత సంసిద్ధం అని చెప్పండి.. ఊరికనే కాదు. 01:50 PM, Feb 3, 2024 కృష్ణాజిల్లా : దెందులూరులో జరిగే సిద్ధం సభకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల నుండి 100 బస్సుల్లో బయల్దేరిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు. సిద్ధం సభకు బస్సు డ్రైవర్‌గా మారిన మాజీ మంత్రి పేర్ని నాని. కార్యకర్తలతో వెళ్తున్న బస్సును స్వయంగా నడిపిన పేర్ని నాని. 01:30 PM, Feb 3, 2024 ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో సిద్ధం సభకు భారీగా బయలుదేరిన వాహన శ్రేణులు జాతీయ రహదారిపై జెండా ఊపి బస్సులను ప్రారంభించి వారితో సభకు కలిసి వెళ్లిన ఉదయభాను. దెందురూరులో,సీఎం జగన్ సిద్ధం సభకు మైలవరం నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వెళ్ళిన వైఎస్సార్సీపీ శ్రేణులు. దెందురూరులో సిద్ధం సభకు మైలవరం నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వెళ్ళిన వైఎస్సార్సీపీ శ్రేణులు.. 12:50 PM, Feb 3, 2024 తూర్పుగోదావరి జిల్లా: రాజానగరం నియోజకవర్గ నుండి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో 92 బస్సుల్లో వేలాదిగా సిద్ధం సభకు తరలిన అభిమానులు, కార్యకర్తలు కృష్ణా జిల్లా: పెనమలూరు,కంకిపాడు, ఉయ్యూరు నుండి దెందులూరు సిద్ధం బహిరంగ సభకు భారీగా తరలివెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు. దెందులూరు లో సీఎం జగన్ ‘సిద్ధం’ సభకు పెడన నియోజకవర్గం ఇన్చార్జి ఉప్పాల రాము ఆధ్వర్యంలో వేలాదిగా తరలి వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులు 12:26PM, Feb 03, 2024 సిద్ధం సభకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తరలివెళ్లిన కార్యకర్తలు కార్యకర్తలతో కలిసి బయల్దేరిన ఎమ్మెల్యే, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా బస్సుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన వెలంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి 12:20PM, Feb 03, 2024 వైఎస్ జగన్‌ను మరోసారి సీఎం చేసేందుకు మేమంతా సిద్ధం: మంత్రి చెల్లుబోయిన మరో ఐదేళ్లపాటు ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం దెందులూరు సిద్ధం సభను విజయవంతం చేస్తాం సేవే లక్ష్యంగా పని చేస్తున్న సీఎం జగన్ కోసం మేమంతా సిద్ధం నాయకుడి లక్ష్యం నెరవేర్చడమే పార్టీ కేడర్ ఉద్దేశం సిద్ధం సభ.. దేశ రాజకీయాల్లో సేవే లక్ష్యమని చాటి చెప్పడం సేవకి సైన్యం సిద్ధమైంది 12:15PM, Feb 03, 2024 గుడివాడ నుండి సిద్ధం సభకు వేలాదిగా వైఎస్సార్సీపీ శ్రేణులు దెందులూరులో సీఎం జగన్ సిద్ధం సభకు ఎమ్మెల్యే కొడాలి నాని నేతృత్వంలో గుడివాడ నుండి వేలాదిగా తరలి వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులు గుడివాడ VKR VNB ఇంజనీరింగ్ కళాశాల వద్ద పార్టీ శ్రేణుల బస్సు ర్యాలీని పార్టీ జెండా ఊపి ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్. 12:00 PM, Feb 3, 2024 కృష్ణా జిల్లా: మచిలీపట్నం నుంచి సిద్ధం సభకు బస్సుల్లో కదలిన వైఎస్సార్సీపీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి బయల్దేరిన బస్సులో దెందులూరు బయల్దేరిన కృష్ణాజిల్లా వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు. నేడు ఏలూరు జిల్లా దెందులూరులో వైయస్ఆర్సీపీ రెండో ఎన్నికల సన్నాహక సభ సిద్ధం బహిరంగ సభకు 50 నియోకవర్గాల నుంచి తరలిరానున్న కేడర్ 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం @ysjagan#Siddham#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/k9WIu7L5D8 — YSR Congress Party (@YSRCParty) February 3, 2024 11:30 AM, Feb 3, 2024 వైఎస్సార్సీపీ ఎన్నికల సన్నాహక సమావేశానికి తూర్పుగోదావరి జిల్లా నుంచిమంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో దెందులూరు బయలుదేరిన అభిమానులు కార్యకర్తలు. దెందులూరు సిద్ధం సభకు రాజమండ్రి నుంచి భారీగా బయలుదేరిన అభిమానులు కార్యకర్తలు. ఎంపీ భరత్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బస్సులు, కార్లలో తరలి వెళ్తున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు సీఎం జగన్ సభను విజయవంతం చేసేందుకు ఉత్సాహంతో బయలుదేరిన అభిమానులు 11:23AM, Feb 03, 2024 ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నుండి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు జెండా ఊపి బస్సులను ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాస్ 11:20AM, Feb 03, 2024 ఏలూరు జిల్లా: కైకలూరు నుండి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు జెండా ఊపి బస్సుల ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు 11:10 AM, Feb 3, 2024 ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నుంచి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు, జెండా ఊపి బస్సులను ప్రారంభించిన నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఏలూరు జిల్లా: కైకలూరు నుంచి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు, జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. సాక్షి, ఏలూరు: జన జాతరకు.. జన గోదావరి సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులకు ‘సిద్ధం’ సభా వేదికగా శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో 19, ఉమ్మడి పశ్చిమగోదావరిలో 15, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు మొత్తం 50 నియోజకవర్గాల నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీలు, ముఖ్యనేతలతో పాటు పార్టీ కార్యకర్తలు, పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు, ప్రజలు లక్షలాది మంది సభకు తరలిరానున్నారు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంఖం పూరించారు. ఆ సభ సూపర్‌హిట్ అయిన నేపథ్యంలో శనివారం ఏలూరులో ‘సిద్ధం’ రెండో సభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం లక్షలాదిగా తరలివచ్చే పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తారు ఏలూరు ఆటోనగర్–దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్‌లో 110 ఎకరాల ప్రాంగణాన్ని బహిరంగ సభ కోసం ముస్తాబు చేశారు. ఎనిమిది ప్రాంతాల్లో 150 ఎకరాల్లో పార్కింగ్ సెంటర్లతో సర్వం సన్నద్ధం చేశారు. సభా వేదిక నిర్మాణం, వేదిక ముందు భాగంలో ‘ఫ్యాన్’ గుర్తులో వాకింగ్‌వే ఏర్పాటుచేశారు. ప్రతి గ్యాలరీలో మంచినీరు, మజ్జిగ అందించేలా ఏర్పాట్లతో పాటు వైద్యసేవలు కూడా అందుబాటులో ఉంచారు. సభా ప్రాంగణం చుట్టూ ఏర్పాటుచేసిన పార్టీ ఫ్లెక్సీలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ‘మేం సిద్ధం’ అంటూ పార్టీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలతో ప్రాంగణాన్ని నింపేశారు. పదుల సంఖ్యలో సీఎం జగన్ భారీ కటౌట్లను స్థానిక నేతలు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో 15కు పైగా భారీగా ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటుచేశారు. సభా ప్రాంగణం వెనుక భాగంలో హెలీప్యాడ్ సిద్ధమైంది. సీఎం షెడ్యూల్ ‘సిద్ధం’ బహిరంగ సభకు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైంది. మూడో తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లిలోని హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 3.20 గంటలకు దెందులూరులో సభా ప్రాంగణం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులను కలిసిన అనంతరం 3.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని 4.55 గంటలకు సభ ముగిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్లో తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. -
నేడు ఏలూరులో ‘సిద్ధం’ సభ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు/దెందులూరు: జన బలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే అభిమతంగా శాసనసభ, లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేసూ్తనే.. మరోవైపు 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 63 శాసనసభ, 16 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల్ని నియమించడంతో పాటు ‘సిద్ధం’ పేరుతో శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంఖం పూరించారు. ఆ సభ సూపర్‌హిట్ అయిన నేపథ్యంలో శనివారం ఏలూరులో ‘సిద్ధం’ రెండో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తర కోస్తా (ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు)లోని 50 నియోజకవర్గాల నుంచి భారీగా శ్రేణులు, అభిమానులు తరలిరానున్నారు. గోదావరి జిల్లాల రాజకీయ చరిత్రలో ఈ సభ అతి పెద్ద రాజకీయ బహిరంగ సభ కానుంది. ఏలూరు నగర శివారు ఆటోనగర్ సమీపంలో, దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు సర్వం సన్నద్ధమైంది. లక్షలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల రాక నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల సభా ప్రాంగణం, ఎనిమిది ప్రాంతాల్లో 150 ఎకరాల్లో పార్కింగ్ సెంటర్లతో సర్వం సన్నద్ధం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం లక్షలాదిగా తరలివచ్చే పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తారు. యుద్ధ ప్రాతిపదికన సభా వేదిక, హెలిప్యాడ్ నిర్మాణం, గ్యాలరీలు, సిట్టింగ్ ఏర్పాట్లు, తాగునీరు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆరి్డనేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్యచౌదరి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, వడ్డీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముంగర సంజీవ్‌కుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు తదితరులు ఏర్పాట్లు పరిశీలించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, ఎస్పీ డి.మేరి ప్రశాంతి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
ఏలూరు ‘సిద్ధం’కు చురుగ్గా ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షిఅమావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల మూడో తేదీన ఏలూరు జిల్లాలో నిర్వహించనున్న ‘సిద్ధం’ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ప్రజాప్రతినిధులు గురువారం పరిశీలించారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు సభకు తరలిరానున్న క్రమంలో ఆ మేరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల సువిశాల ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది. ఏలూరు ఆటోనగర్, దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ వేదిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ సభా వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీల ఏర్పాటు, పార్టీ శ్రేణులందరి దగ్గరకు వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా పార్టీ గుర్తయిన ‘ఫ్యాన్’ ఆకారంలో భారీ వాక్‌వేను ఏర్పాటు చేశారు. జిల్లా చరిత్రలోనే లక్షలాది మందితో నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో జాతీయ రహదారిపైన ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లూ చేశారు. గోదావరి ప్రజలు సిద్ధం : మంత్రి కారుమూరి ఎన్నికలకు జగన్మోహన్రెడ్డి సిద్ధమంటే గోదావరి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, ఉభయగోదావరి జిల్లాలు జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి ప్రతి ఇంటి బిడ్డ అని, సంక్షేమాన్ని ప్రతి ఇంటికి చేర్చి దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించిన నేత అని కొనియాడారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ దెందులూరులో జనసునామీ చూడబోతున్నారని, చంద్రబాబునాయుడు కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు ఎకరాల్లోనే సభలు పెడుతుంటే జనం రాని పరిస్థితి ఉందని, కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక పిలుపుతో 110 ఎకరాల్లో జరిగే సభకు లక్షలాది మంది తరలిరానున్నారని చెప్పారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు, సీఎం ప్రోగ్రామ్స్ కోఆరి్డనేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ళ నాని తదితరులు ఉన్నారు. 3న దెందులూరుకు సీఎం ‘సిద్ధం’ బహిరంగ సభకు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైంది. మూడో తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లిలోని హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 3.20 గంటలకు దెందులూరులో సభా ప్రాంగణం వెనుక భాగంలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులను కలిసిన అనంతరం 3.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని 4.55 గంటలకు సభ ముగిస్తారు. ఐదు గంటలకు హెలికాప్టర్లో తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. -
3న ఏలూరులో ‘సిద్ధం’ బహిరంగ సభ!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం బహిరంగసభ ‘సిద్ధం’కు ఏలూరు ముస్తాబవుతోంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది పార్టీ కేడర్ సభకు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను పార్టీ ముఖ్యులు పరిశీలించారు. గోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌కుమార్‌యాదవ్, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సభా ప్రాంగణంలో ‘సిద్ధం’ పోస్టర్లను ఆవిష్కరించారు. 110 ఎకరాల ప్రాంగణంలో.. ఏలూరు నగర సమీపంలో, దెందులూరు జాతీయ రహదారి వద్ద 110 ఎకరాల స్థలంలో సభావేదిక నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీలు.. కార్యకర్తలందరికీ దగ్గరగా వెళ్లి అభివాదం చేసేందుకు సభా వేదిక నుంచి వాక్‌వే ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా ప్రాంగణం వెనుక భాగంలో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది రానున్న క్రమంలో వాహనాల పార్కింగ్తో సహా ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. సభా ప్రాంగణానికి సమీపంలోని దెందులూరు ఊరు ప్రారంభంలో 40 ఎకరాల ప్రాంగణాన్ని, అలాగే సభా ప్రాంగణానికి, ఆటోనగర్‌కు మధ్యలో 25 ఎకరాల ప్రాంగణం, మరో రెండు పార్కింగ్ స్థలాలు, ఆటోనగర్ లోపల, ఆశ్రం కళాశాల, ఏలూరు ప్రారంభంలోని రియల్ ఎస్టేట్ వెంచర్లో మొత్తం 150 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించి జిల్లాల వారీగా వచ్చే వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. బుధవారం ఎంపీ మిథున్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ ఏలూరు జిల్లా రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ‘సిద్ధం’ బహిరంగ సభ జరుగుతుందని, 3న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ సభా ప్రాంగణానికి చేరుకుని పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తారని వివరించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, ఎస్పీ డీ.మేరీప్రశాంతి తదితరులున్నారు. -
YSRCP: జనక్షేత్రంలో జేజేలు
సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లలో దాదాపు రూ.4.21 లక్షల కోట్లను డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో రాష్ట్ర ప్రజలకు అందించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమంతో పలుకరించింది. సుపరిపాలనతో ఎన్నికల హామీలను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదిస్తూ ప్రజలు ప్రతి అడుగులోనూ వెన్నంటే నిలుస్తున్నారు. తాజాగా నిర్వహించిన భీమిలి సభ సీఎం జగన్‌కు జనామోదం ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపించింది. సముద్రంలా ఉప్పొంగిన జన వాహిని సంక్షేమ ప్రభుత్వానికి మద్దతు పలికింది. మరోవైపు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు లక్షల మందిని సమీకరించాలని ఆదేశించినా ఏ సభ చూసినా పట్టుమని 10 – 15 వేల మంది కూడా రాకపోవడంతో బేజారెత్తుతున్నారు. నియోజకవర్గాల ఇన్‌చార్జీలపై కన్నెర్ర చేస్తున్నారు. ప్రజాభీష్టం అలా ఉన్నప్పుడు తామేం చేయగలమని పార్టీ నేతలు నిస్పృహ వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు 15 సభలకు వచ్చిన జనం మొత్తం అంతా కలిపినా కూడా సీఎం జగన్ తాజాగా పాల్గొన్న ఒక్క భీమిలి సభతో పోలిస్తే సగం మంది కూడా లేకపోవడం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీలపై ప్రజల్లో అసంతృప్తి కలగడం సాధారణం! కానీ రాష్ట్రంలో మాత్రం ఎన్నిక ఏదైనా సరే ఏకపక్షంగానే ఫలితాలు వెలువడటం ప్రజాభీష్టానికి తార్కాణంగా నిలుస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజురోజుకూ ప్రజాదరణ వెల్లువెత్తుతోంది. పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక.. బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో ఇది స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 25కు 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఇటీవల టైమ్స్ నౌ లాంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. గత 56 నెలలుగా ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పే వైఎస్సార్సీపీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరగడానికి దారి తీస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకవైపు సీఎం జగన్‌కు జనం నీరాజనాలు పలుకుతుండటం, వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ప్రతి నియోజకవర్గంలోనూ జనం పోటెత్తుతుండటం.. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభలకు జనం మొహం చాటేస్తుండటాన్ని బట్టి చూస్తే 2019కి మించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అత్యంత భారీ విజయాన్ని సాధించడం ఖాయమని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. నిబద్ధతతో పెరుగుతున్న విశ్వసనీయత.. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు తన దృష్టికి తెచ్చిన వాటితోపాటు తాను స్వయంగా గుర్తించిన సమస్యలను క్రోడీకరించి వాటి పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను రూపొందించి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ (88 శాతం) స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. దేశ చరిత్రలో ఇంత ఘనవిజయం సాధించిన పార్టీ మరొకటి లేదు. టీడీపీ 39.17 శాతం ఓట్లతో 23 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకే పరిమితమైంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం హామీలను అమలు చేసిన సీఎం జగన్ నిబద్ధత చాటుకుంటూ ఇప్పటికే 99.5 శాతం హామీలను నెరవేర్చారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదు. ఇప్పటిదాకా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.53 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.1.68 లక్షల కోట్లు వెరసి మొత్తం రూ.4.21 లక్షల కోట్ల మేర పేదలకు ప్రయోజనాన్ని చేకూర్చారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో ప్రజలకు మరెవరూ మేలు చేసిన దాఖలాలు లేవు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం పదవులు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా సామాజిక న్యాయం అంటే ఇదీ అని దేశానికి సీఎం జగన్ చాటి చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. వలంటీర్ల ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను చేరువ చేశారు. విద్య, వ్యవసాయ, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో అగ్రభాగాన నిలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్‌పై ప్రజల్లో విశ్వసనీయత రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నడూ ఇచ్చిన మాటకు కట్టుబడని నైజం కలిగిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరి పట్ల నానాటికీ వ్యతిరేకత పెరుగుతోంది. విశ్వసనీయతకు పట్టం.. టీడీపీ చరిత్రలో 2019 ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు చెల్లాచెదరయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల.్లో పోటీ చేసేందుకు ఆపార్టీకి అభ్యర్థులు సైతం దొరకని దుస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో ఆందోళన చెందిన చంద్రబాబు నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్ర చేశారు. 2021 ఫిబ్రవరిలో 13,094 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా వైఎస్సార్సీపీ మద్దతుదారులు 10,299 పంచాయతీల్లో (80 శాతం) గెలుపొందారు. టీడీపీని 2,166, జనసేనను 157 పంచాయతీలకు ప్రజలు పరిమితం చేశారు. ► ఆ తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించిన చంద్రబాబు పంచాయతీ ఎన్నికల కంటే మరింత ఘోర పరాభవం తప్పదని పసిగట్టి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలకు భారీ ఎత్తున ఇం‘ధనం’ సమకూర్చి నిమ్మగడ్డ రమేష్‌తో కలిసి కుట్రలకు పాల్పడినా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించింది. ► మండల, జిల్లా పరిషత్ ఎన్నికల తరహాలోనే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ నిమ్మగడ్డ రమేష్‌తో కలిసి చంద్రబాబు పన్నిన కుట్రలను ప్రజలు చిత్తు చేశారు. వైఎస్సార్సీపీకి చారిత్రక విజయాన్ని అందించారు. ► స్థానిక సంస్థల ఎన్నికల్లో (పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్) టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సైకిల్ నామరూపాలు లేకుండా పోయింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ గెలుస్తూ వస్తున్న, ప్రస్తుతం బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోనూ చిత్తుగా ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నెగ్గిన 23 నియోజకవర్గాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం గమనార్హం. ► తిరుపతి లోక్‌సభ, బద్వేలు శాసనసభ స్థానాలకు 2021లో, ఆత్మకూరు శాసనసభ స్థానానికి 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కంటే అత్యధిక మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ► సీఎం జగన్ విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారనేందుకు అధికారం చేపట్టిన నాటి నుంచి వైఎస్సార్సీపీ సాధించిన వరుస ఘనవిజయాలే తార్కాణమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ► ఇటీవల జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ప్రజా తీర్పు పేరుతో నిర్వహించిన సర్వేలో 1.16 కోట్ల కుటుంబాలు (80 శాతం కుటుంబాల ప్రజలు) మా నమ్మకం నువ్వే జగన్ అంటూ నినదించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో 25కు 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని తాజాగా టైమ్స్ నౌ లాంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ వెల్లడైంది. -
ఎన్నికల కురుక్షేత్రంలో అభిమన్యుడిని కాను.. అర్జునుడిని: సీఎం జగన్
అటు సముద్రం.. ఇటు జన సముద్రం కనిపిస్తోంది. ఇక్కడకు వచ్చిన ప్రతి అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, స్నేహితుడు, అవ్వ, తాతల్లో కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం, సేనాధిపతులు కనిపిస్తున్నారు. ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తుంటే.. అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది. గజదొంగల ముఠా ఉంది. వారి వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు మోసపూరిత వాగ్దానాలు, ఎత్తులు, పొత్తులు, చిత్తుల పద్మవ్యూహం కనిపిస్తోంది. ఆ పద్మవ్యూహంలో చిక్కుకొని బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఈ అర్జునుడికి మీ అందరి తోడు.. కృష్ణుడి రూపేణా అండదండలున్నాయి. అందుకే మీ బిడ్డ భయపడడు. దేనికీ తొణకడు. గత ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేశాం. తద్వారా చెప్పాడంటే చేస్తాడంతే.. అని నిరూపించాం. ఇది నా ఒక్కడి పార్టీ కాదు. ఇది అందరి పార్టీ. అందుకే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని పదవులు, నియామకాల్లో అగ్రభాగం కల్పించాం. రానున్న ఎన్నికలు పేదలకు ఎంతో కీలకం. మన పిల్లలకు ఇంగ్లిష్ విద్య అందాలన్నా.. వారికి ట్యాబ్‌లు రావాలన్నా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఐఎఫ్బీ ప్యానల్స్‌తో విద్యను అందించాలన్నా.. పోటీ ప్రపంచంతో మన విద్యార్థులు ధైర్యంగా ఢీకొట్టాలన్నా.. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే పింఛను చేతికి అందాలన్నా.. ఆర్బీకేల ద్వారా రైతుల అవసరాలు తీరాలన్నా.. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ విధానం కొనసాగాలన్నా.. మనందరి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి. ఇందుకోసం ప్రతీ ఒక్కరు గడప గడపకు వెళ్లి మన ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భీమిలిలో అటు సముద్రం.. ఇటు జన సముద్రం సాక్షిగా దిక్కులు పిక్కటిల్లేలా లక్షలాది జన నినాదాల నడుమ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. అబద్ధానికి, నిజానికి.. మోసానికి, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఇక్కడున్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడని సీఎం జగన్ స్పష్టం చేశారు. పొత్తులు, జిత్తుల పద్మవ్యూహాలతో చంద్రబాబు నేతృత్వంలోని కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ వంటి కృష్ణుడి ఆశీస్సులతో మీ బిడ్డ జగన్ సిద్ధంగా ఉన్నాడని ప్రకటించారు. 2024 జైత్ర యాత్రకు భీమిలి నుంచే శంఖం పూరిస్తున్నామని చెప్పారు. భీమిలి నియోజకవర్గం తగరపువలస జంక్షన్ వద్ద శనివారం ‘సిద్ధం’ పేరుతో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర వైఎస్సార్ కుటుంబ సమావేశానికి సీఎం హాజరయ్యారు. సభలో అభిమాన జనం మధ్య ఏర్పాటు చేసిన ర్యాంపుపై అడుగులు ముందుకు వేస్తూ అభివాదం చేశారు. శంఖం పూరించి.. నగారా మోగించి 2024 ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధమని లక్షలాది మంది శ్రేణుల ఈలలు, కేకలు, నినాదాల మధ్య ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సాధించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గత 56 నెలలో కాలంలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్ని చూసినా మనం చేసిన మంచి కనపడుతుందని తెలిపారు. సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాడు–నేడుతో మారిన పాఠశాలలతో రాష్ట్రమంతటా వైఎస్సార్సీపీ మార్క్, జగన్ మార్క్ కనిపిస్తోందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు హయాంలో ఆయన మార్క్ పని ఒక్కటీ లేదని దుయ్యబట్టారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పథకాలే ఎన్నికల బాణాలు, అస్త్రాలు ► 2024 ఎన్నిల్లో మన పార్టీ జైత్ర యాత్రకు.. మరో పాతికేళ్ల పాటు సంక్షేమ, అభివృద్ధి పాలన కొనసాగింపునకు.. ఈ భీమిలిలో సన్నాహక సమావేశం జరుగుతోంది. మన పార్టీని భుజాన మోసిన, మోస్తున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆత్మీయులలో ఆత్మవిశ్వాసం నింపేందుకే ఇక్కడ సమావేశమయ్యాం. మేనిఫెస్టో ద్వారా మనం ఇచ్చిన ప్రతి మాటా అధికారంలోకి వచ్చాక త్రికరణ శుద్ధితో ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చిన ఈ పార్టీలో మీతో నా ఆలోచనలను పంచుకోడానికే ఈ సమావేశం. ► పేద ప్రజల మీద ప్రేమతో, బాధ్యతతో 56 నెలల కాలంలో అమలు చేస్తున్న పథకాలే మనకు రానున్న ఎన్నికలకు బాణాలు, అస్త్రాలు. ఈ యుద్ధంలో 175కు 175 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. గెలుపే మన లక్ష్యం. దేవుడి దయతో ప్రతి ఇంటికి, ప్రాంతానికి, ఊరికి చేసిన మేలుతో చంద్రబాబుతో సహా వారంతా ఓడాల్సిందే. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం వారికి లేదు ► గత ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు చెప్పిన మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్తబుట్టలో వేశాయి. మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది. అందుకే ప్రజలకు మనం దగ్గరయ్యాం. వైఎస్సార్ కాంగ్రెస్‌ను ప్రజలు తమ పార్టీగా భావిస్తున్నారు. చంద్రబాబు 75 ఏళ్ల వయస్సు మళ్లిన నాయకుడు. ► ఒంటిరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడు తున్నాడంటే దాని అర్థం ఏమిటో ఆలోచించండి. చంద్రబాబు తాను మంచి పని చేశానని, ఒక స్కీమ్ పెట్టామని చెప్పలేక.. కొత్త వాగ్దానాలతో గారడి చేయాలని చూస్తున్నాడంటే ప్రజల్లో వారు లేరని అర్థం. చివరికి 2019లో వచ్చినన్ని 23 స్థానాలు కూడా వారికి రావని అర్థం. 175 స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు అభ్యర్థులు కూడా లేరని అర్థం. మన చరిత్ర ఇంటింటి విజయగాథ ► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఓ విప్లవ గాథ. మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయ గాథ. మన భవిష్యత్తు.. సామాజిక వర్గాల ఇంద్ర ధనస్సు. మనది వయస్సుతో పాటు మంచి భవిష్యత్తు ఉన్న పార్టీ. మన పాలనలో అన్ని రంగాల్లో చిత్తశుద్ధితో సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తుంది. ఈ రెండింటిలో సరికొత్త రికార్డును సృష్టించిన పార్టీ అని గర్వంగా చెబుతున్నా. నేను మోసాన్ని నమ్ముకోలేదు. ఇంటింటికి చేసిన సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకొని ప్రజల దగ్గరకు మళ్లీ వెళుతున్నాను. ► పేదరికం, అసమానత సంకెళ్లను బద్దలు కొట్టి.. ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ.. 21 శతాబ్ధంలోకి నడిపిస్తున్న మనసున్న, బాధ్యత గల ప్రభుత్వం మనది. ఇదే విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. 70 రోజుల్లో ఎన్నికల యుద్ధానికి ప్రతి ఒక్కరి భుజస్కందాలపై బాధ్యతలు పెడుతున్నాం. అబద్ధానికి నిజానికి.. మోసానికి, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న యుద్ధమిది. 2014లో చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో 650 వాగ్దానాలు ఇచ్చారు. అందులో 10 శాతం కూడా అమలు చేయలేదు. మన ప్రభుత్వం 99 శాతం వాగ్దానాలు అమలు చేయడం వల్ల ప్రతి ఇంట్లో సంతోషం చూసి సంబర పడుతున్నాం. నా గుండెల నిండా మీరే.. ► పేద సామాజిక వర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టే నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంటూ నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరీ సగం పదవులన్నీ ఈ వర్గాలకే ఇచ్చాం. కేబినెట్లో ఏకంగా 68 శాతం మంత్రి పదవులు, నలుగురు డిప్యూటీ సీఎంలు, చట్టసభ స్పీకర్ ఒక బీసీ, కౌన్సిల్ చైర్మన్‌గా ఒక ఎస్సీ, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఒక మైనార్టీ కనిపిస్తున్నారు. స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసి వారిని గుండెల్లో పెట్టుకున్నాం. ఆలయ కమిటీ చైర్మన్లుగా, ఏఎంసీ చైర్మన్లుగా కనిపిస్తున్నారు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు. ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టే ఇది మనందరి ప్రభుత్వం. ► ఈ 56 నెలల్లో 2.13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకొచ్చాం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 4 లక్షల ఉద్యోగాలు ఉంటే.. మీ బిడ్డ ప్రభుత్వం మరో 2.13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది. ఇందులో ఏకంగా 80 శాతం నా.. నా.. నా.. అని పిలుచుకొనే నా తమ్ముళ్లు, చెల్లెమ్మలు ఉన్నారని గర్వంగా తెలియజేస్తున్నా. ► అక్కచెల్లెమ్మలపై ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టే లంచాలు, వివక్ష లేకుండా మీ బిడ్డ ఒక బటన్ నొక్కి రూ.2.53 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి వేశాడు. ఇంతటి ఆప్యాయత చూపిస్తున్నాం కాబట్టే అట్టడుగున ఉన్న వారికి అధికారుల నుంచి లీడర్ల దాకా చిక్కటి చిరునవ్వుతో సెల్యూట్ కొడుతున్నారు. పేద, సామాజిక వర్గాల మీద ప్రేమ చూపించడంలో చంద్రబాబు మార్క్ ఎక్కడ? ► పేద వర్గాలు కనిపిస్తే ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా.. అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడతాడు. సాక్షాత్తు సీఎం నోటి నుంచి అటువంటి మాటలు వస్తే గ్రామాల్లో ఎవరైనా ఆ ఎస్సీలను పట్టించుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తా ఖబడ్దార్.. అంటే గ్రామాల్లో వారిని పట్టించుకుంటారా? చంద్రబాబుకు పేద, సామాజిక వర్గాలపై, వారి అభ్యున్నతిపై ప్రేమ ఎక్కడుంది? ఎక్కడ చూసినా, ఏ పేదవాడి ఇంటికి వెళ్లినా కనిపించేది వైఎస్సార్సీపీ, జగన్ మార్క్ మాత్రమే. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు.. ► రాష్ట్రంలో కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామానికైనా వెళ్లండి. మీ ఇష్టం. ఎక్కడకు వెళ్లినా ఆ గ్రామానికి చంద్రబాబు ఏం చేశారంటే చెప్పడానికి ఏమీ కనిపించదు. జగన్ ఏం చేశాడంటే.. ఈ 56 నెలల్లో ప్రతి గ్రామంలో ఎన్నెన్నో మార్పులు కనిపిస్తున్నాయి. గ్రామ సచివాలయాలు కనిపిస్తాయి. 540 పౌర సేవలు. అందులో దాదాపు 10 మంది మన పిల్లలు శాశ్వత ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. ఎక్కడా అవినీతి, లంచాలు, వివక్ష ఉండదు. ► ఇంటింటికీ ఒకటో తేదీ ఉదయాన్నే పెన్షన్ అయినా, పౌర సేవలైనా, ఏ పథకమైనా మన గడపకే తెచ్చి చిరునవ్వుతో అందించే మనలో భాగమైన ఓ గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. రైతన్నను చేయి పట్టుకొని నడిపించే ఆర్బీకే వచ్చింది. అదే గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం.. ఇటువంటివన్నీ మీ బిడ్డ పాలనలోనే వచ్చాయి. ► నాడు–నేడుతో విద్యా రంగానికి మంచి రోజులు వచ్చాయి. ఇంగ్లీష్ మీడియంతో మొదలు ట్యాబ్‌లు, ఐఎఫ్బీ, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్‌లు ఇలా అన్నీ మన ప్రభుత్వంలోనే అమలయ్యాయి. అదే గ్రామంలో సచివాలయంలో మహిళా పోలీస్. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలోని ఫోన్లో దిశ యాప్.. వారికి ఎటువంటి అపాయం సంభవించినా కేవలం బటన్ నొక్కిన వెంటనే లేదా మొబైల్ అయిదుసార్లు ఊపితే 10 నిమిషాల్లో పోలీస్ సోదరుడు వచ్చి చెల్లమ్మను ఏమైందని అడిగే వ్యవస్థ వచ్చింది ఇప్పుడే. బ్రాడ్ బ్యాండ్, డిజిటల్ లైబ్రరీలు కట్టిందీ ఇప్పుడే. ► ఇలాంటి మంచి పనులు చేయాలనే ఆలోచన 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు ఏనాడూ రాలేదు. ఎందుకంటే వీరు పెత్తందారులు కాబట్టి. పల్లె ప్రజలంటే బాబు దృష్టిలో పని మనుషులు. పెత్తందారుల పొలాల్లో, ఇళ్లలో పని చేసే పని మనుషులు. పొట్ట పోసుకోవడం కోసం ఉండే జనావాసం ఆ పల్లె అని చంద్రబాబు నమ్మకం. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ గ్రామం, పల్లె బాగుపడదు. ప్రజలు, పేదవాడు బాగుపడాలి, గొప్పగా చదవాలి, భవిష్యత్తు మారాలన్న తాపత్రయం పెత్తందార్లకు లేదు. ఎక్కడ చూసినా వైఎస్సార్సీపీ, జగన్ మార్క్ ► రైతు సంక్షేమాన్ని చూస్తే మనమక్కెడ.. చంద్రబాబు ఎక్కడ? అని ఆలోచన చేయాలి. రుణమాఫీ చేస్తానని నిలువునా ముంచింది చంద్రబాబు. రైతులు 87,612 కోట్లు బ్యాంకులకు కట్టొద్దని పిలుపిచ్చాడు. మొట్టమొదటి సంతకంతో రుణమాఫీ అని వాగ్దానం చేశాడు. మేనిఫెస్టోలో పెట్టి రైతులను మోసం చేశాడు. ► ఈ రోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఆర్బీకే అంటే జగన్. సకాలంలో విత్తనమైనా, ఎరువులైనా, ఇన్పుట్ సబ్సిడీ అయినా సకాలంలో అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగన్. పగటి పూట ఉచిత్ విద్యుత్, ఉచిత బీమా, సున్నా వడ్డీ అందుతున్నాయన్నా, ఆక్వా రైతులకు కరెంట్ సబ్సిడీ అందుతోందంటే గుర్తుకొచ్చేది జగన్. ► ఏ పొలంలోకి వెళ్లినా చంద్రబాబు చెప్పుకోడానికి ఏముంది? చంద్రబాబు మార్క్ ఎక్కడుంది? ఎక్కడ చూసినా వైఎస్సార్సీపీ, జగన్ మార్క్ కనిపిస్తోంది. ప్రజల వైద్యం, ఆరోగ్యం విషయానికి వస్తే.. 108, 104 చూసినా, 3,257 ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ విస్తరించినా.. ఆరోగ్య ఆసరా చూసినా, గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్, ఇంటింటినీ జల్లెడ పడుతూ నిర్వహిస్తున్న ఆరోగ్య సురక్ష, 17 కొత్త మెడికల్ కాలేజీలు, వైద్య రంగంలో 53 వేల కొత్త నియామకాలు.. నాడు–నేడుతో బాగుపడుతున్న ఆస్పత్రులు.. ఇలా ఏది తీసుకున్నా ఒక వైఎస్సార్సీపీ, జగన్ మార్క్ కనిపిస్తోంది. ► ఏ ప్రభుత్వ బడిని తీసుకున్నా.. మొత్తంగా విద్యా రంగాన్ని తీసుకున్నా.. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, తెలుగు, ఇంగ్లిష్ భాషలు ఉన్న పాఠ్యపుస్తకాలు, బైజూస్ కంటెంట్, మన ప్రభుత్వ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, క్లాస్‌రూమ్‌లలో ఐఎఫ్‌పీలు, గోరుముద్ద, బడి తెరిచే సరికే విద్యా కానుక, పెద్ద చదువులు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలు అవ్వకూడదని ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తూ జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, విదేశాల్లోని టాప్ యూనివర్శిటీల్లో ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా డిగ్రీల అనుసంధానం ఇలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. జాబ్ ఓరియంటెడ్ కరిక్యులం ద్వారా ఇంటర్న్‌షిప్‌తో డిగ్రీలో చేర్చడం, ఇలా విద్యా రంగంలో ఏది తీసుకున్నా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పెత్తందారులను ఓడిద్దాం ► వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం. వారి వంచనకు, మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు వారి దోచుకో, పంచుకో, తినుకో అనే విధానానికి మన డీబీటీ అంటే బటన్ నొక్కడం.. నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బు వెళ్లిపోడానికి మధ్య జరుగుతున్న యుద్ధం. వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారి కుట్రలకు, మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య యుద్ధం. వచ్చే రెండు నెలలు మనందరికీ నిత్యం యుద్ధమే. ఈ 70 రోజులు ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీకి ఒక సైన్యంలా పని చేయాలి. ► ప్రతిపక్షాలు పది వైపుల నుంచి చేసే దాడులను వారి ఎల్లో మీడియాను, వారి సోషల్ మీడియాను, అందులో చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి. ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్పోన్లు ఉన్నాయి. అవే మీకు అస్త్రాలు. సెల్‌ఫోన్ ఉన్న ప్రతి పేద వాడు కూడా సోషల్ మీడియాను శాసించవచ్చు. బూత్ కమిటీల సభ్యులు, గృహ సారథులు, వలంటీర్లు, సామాన్య కార్యకర్త మొదలు, రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కీలకమైన పాత్ర పోషించాలి. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు. 25కి 25 ఎంపీలు మన లక్ష్యం. ► ప్రతి ఇంటికి మంచి చేశాం. ప్రతి గ్రామంలో మంచి జరిగింది. అందులో 60 శాతం కుటుంబాలు మీ వెంట, మన వెంట ఉంటే అన్ని సీట్లు మనవే. మంచి చేసిన, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, ప్రతి పేదవాడి భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన, చేస్తున్న ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం. ఈ యుద్ధానికి సిద్ధం, సై అంటున్న మీ బిడ్డకు మీరందరూ తోడుగా ఉండడానికి సిద్ధమా అని అడుగుతున్నా. (సిద్ధం.. అని జనం నుంచి కేకలు) జనంలో లేని, పేదవారి గుండెల్లో లేని వారు, దిగజారుడు పార్టీలన్నింటికీ మీ జగనన్నే టార్గెట్. పేదవాడి భవిష్యత్తు, వైఎస్సార్సీపీయే లక్ష్యంగా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. దుష్ట చతుష్టయాన్ని, గజదొంగల ముఠాను, ఓడించేందుకు మీరు సిద్ధమా.. (సిద్ధమేనని నినాదాలు) వారందరిపై ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు, దేవుడి దయ ఉన్నంత వరకు మీ బిడ్డ ఏ ఒక్కరికీ భయపడడు. సమరనాదం చేస్తూ ఎన్నికల శంఖారావం పూరిస్తూ మేం యుద్ధానికి సిద్ధమని వైఎస్సార్సీపీ ఇక్కడి నుంచి పిలుపునిస్తోంది. -
దుష్టచతుష్టయం.. గజదొంగల ముఠాతో ఇక సమరమే: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని.. అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. భీమిలి నియోజకవర్గం సంగివలసలో ఎన్నికల శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావని.. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరన్నారు. చేసిన మంచిని నమ్ముకునే .. మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడు. మరో 75 రోజుల్లోనే ఎన్నికలు. అబద్దానికి, నిజానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. గతంలో చంద్రబాబు 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదు. మనం మేనిఫెస్టో లోని ప్రతి హామీని నెరవేర్చాం. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయాలనే ఆలోచన లేదని.. ఎందుకంటే చంద్రబాబు అండ్ కో పెత్తందార్లు కాబట్టి.. చంద్రబాబు సీఎంగా ఉంటే ఏ గ్రామం బాగుపడదని సీఎం ధ్వజమెత్తారు. ‘‘ప్రజలే .. నా స్టార్ క్యాంపెయినర్లు. పేదల భవిష్యత్ మారాలంటే.. జగనే గెలవాలని చెప్పండి. ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే.. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి. రైతు భరోసా, ఇన్ ఫుట్ సబ్సిడీ అందాలంటే .. మీ జగన్ సీఎం కావాలని చెప్పాలన్నారు ‘‘మీరు వేసే ఓటు.. పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ఓటు అని చెప్పండి. ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇస్తాయి. మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం.. మోసాలు చేయడం తెలియదు. మీ బిడ్డ చెప్పాడంటే.. చేస్తాడంతే. ఈ యుద్దానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా ?. ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా ?. దుష్టచతుష్టయాన్ని.. గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా.? వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే. ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి. దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ , 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే’’ అని సీఎం స్పష్టం చేశారు. -
సంగివలసలో సీఎం జగన్ సింహనాదం
సాక్షి, విశాఖపట్నం: ఇక్కడ ఉన్నది అర్జునుడు.. ఇటు పక్క పాండవ సైన్యం ఉంది. అటు పక్క కౌరవ సైన్యం ఉంది. అక్కడ పద్మ వ్యూహం పొంచి ఉంది. ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు. ఈ అర్జునుడికి తోడు కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. భీమిలి నియోజకవర్గం సంగివలస బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ యుద్ధంలో 175కి 175 సీట్లు గెలుపే మన లక్ష్యమన్నారు. ‘‘ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. మరో 25 ఏళ్ల పాటు మన జైత్ర యాత్రకు శ్రీకారం చుడుతున్నాం. మన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చాం చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. అందుకే దత్త పుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు. గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు. చేసిన మంచిని నమ్ముకునే.. మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడు’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘మరో 75 రోజుల్లోనే ఎన్నికలు. అబద్దానికి, నిజానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. గతంలో చంద్రబాబు 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదు. మనం మేనిఫెస్టో లోని ప్రతి హామీని నెరవేర్చాం. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ప్రతి గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు. 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం. లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశాం. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాం. రైతులకు తోడుగా ఆర్బీకే లను నిర్మించాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. ప్రతి గ్రామానికి డిజిటల్ లైబ్రరీలు, బ్రాడ్ బాండ్ లు తీసుకొచ్చాం’’ అని సీఎం తెలిపారు. ‘‘14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయాలనే ఆలోచన లేదు. ఎందుకంటే చంద్రబాబు అండ్ కో పెత్తందార్లు కాబట్టి చంద్రబాబు సీఎంగా ఉంటే ఏ గ్రామం బాగుపడదు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నిలువునా ముంచాడు. మీ జగన్.. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు 3,527 ప్రొసీజర్ల కు ఆరోగ్యశ్రీ ని విస్తరించాం. ఒక్క వైద్యరంగంలోనే 53 వేల కొత్త నియామకాలు చేపట్టాం. అందుకే ఎక్కడ చూసినా వైఎస్ జగన్ మార్కే కనిపిస్తోంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువును అందుబాటులోకి తెచ్చాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం . నామినేటెడ్ పదవుల్లో సగం పదవులు బలహీనవర్గాలకే ఇచ్చాం. స్థానిక సంస్థల పదవులు ఆన్నింటిలోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. లంచాలు, వివక్ష లేకుండా రూ. 2 లక్షల 53 వేల కోట్లు నేరుగా మీ ఖాతాలో వేశాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘పేదల సొంతింటి కలను నెరవేర్చాం. అక్కచెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మాది. 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇచ్చాం. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారు. అన్నింటిలోనూ చంద్రబాబు మోసమే కనిపిస్తుంది. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు అన్నారు బడుగుబలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమ లేదు. మీ జగన్ రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. గత పదేళ్ల మీ బ్యాంకు అకౌంట్ల ను చెక్ చేసుకోండి. చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి అయినా పడిందా ?. మన పాలనలో మీ ఖాతాల్లో రూ. 2 లక్షల 53 వేల కోట్లు వేశాం. ఎన్ని కష్టాలు ఎదురైనా .. అన్ని వర్గాలకు మంచి చేశాం. మీ జగన్.. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు. 56 నెలల కాలంలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం. కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి మనం చేసిన మంచిని చెప్పండి. మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమల్ని మాత్రమే. ప్రజలే .. నా స్టార్ క్యాంపెయినర్లు. పేదల భవిష్యత్ మారాలంటే .. జగనే గెలవాలని చెప్పండి. ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే .. జగన్ గెలవాలని చెప్పండి ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే .. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి. రైతు భరోసా, ఇన్ ఫుట్ సబ్సిడీ అందాలంటే .. మీ జగన్ సీఎం కావాలని చెప్పండి’’ అని సీఎం చెప్పారు. మీరు వేసే ఓటు.. పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ఓటు అని చెప్పండి. ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇస్తాయి. మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం.. మోసాలు చేయడం తెలియదు. మీ బిడ్డ చెప్పాడంటే.. చేస్తాడంతే. ఈ యుద్దానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?. ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా ?. దుష్టచతుష్టయాన్ని.. గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా?. వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే. ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి. దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ, 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే’’ అని సీఎం పేర్కొన్నారు. -
Bheemili : యుద్ధానికి YSRCP సిద్ధం
సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు 5.45pm, జనవరి 27, 2024 భీమిలిలో అటు సముద్రం ... ఇటు జనసముద్రం కనిపిస్తోంది కురుక్షేత్ర యుద్దానికి సిద్ధమైన పాండవుల సైన్యం కనిపిస్తోంది అటు కౌరవ సైన్యం ఉంది .. గజ దొంగల ముఠా ఉంది ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు .. అర్జునుడు 175కు 175 ఈ యుద్ధంలో 175 కు 175 సీట్లు గెలుపే మన లక్ష్యం ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే మరో 25 ఏళ్ల పాటు మన జైత్రయాత్ర కు శ్రీకారం చుడుతున్నాం మన మేనిఫెస్టో లో 99 శాతం హామీలను నెరవేర్చాం చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీ కి రావు 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు మంచి చేసాం.. ఓట్లు అడుగుతున్నాం చేసిన మంచిని నమ్ముకునే .. మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడు మరో 75 రోజుల్లోనే ఎన్నికలు అబద్దానికి, నిజానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది గతంలో చంద్రబాబు 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదు మనం మేనిఫెస్టో లోని ప్రతి హామీని నెరవేర్చాం ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు చంద్రబాబు చేసిందేమీ లేదు ప్రతి గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశాం ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాం రైతులకు తోడుగా ఆర్బీకే లను నిర్మించాం ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం ప్రతి గ్రామానికి డిజిటల్ లైబ్రరీలు, బ్రాడ్ బాండ్ లు తీసుకొచ్చాం ఇదీ వెన్నుపోటు బాబు పాలనకు, రాజన్న రాజ్యానికి తేడా 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయాలనే ఆలోచన లేదు ఎందుకంటే చంద్రబాబు అండ్ కో పెత్తందార్లు కాబట్టి చంద్రబాబు సీఎంగా ఉంటే ఏ గ్రామం బాగుపడదు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నిలువునా ముంచాడు మీ జగన్ ... రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు 3,527 ప్రొసీజర్ల కు ఆరోగ్యశ్రీ ని విస్తరించాం ఒక్క వైద్యరంగంలోనే 53 వేల కొత్త నియామకాలు చేపట్టాం అందుకే ఎక్కడ చూసినా వైఎస్ జగన్ మార్కే కనిపిస్తోంది విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువును అందుబాటులోకి తెచ్చాం పదవుల్లో, అధికారంలో పెద్దపీట బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం నామినేటెడ్ పదవుల్లో సగం పదవులు బలహీనవర్గాలకే ఇచ్చాం స్థానిక సంస్థల పదవులు ఆన్నింటిలోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం లంచాలు, వివక్ష లేకుండా రూ. 2 లక్షల 53 వేల కోట్లు నేరుగా మీ ఖాతాలో వేశాం పేదల సొంతింటి కలను నెరవేర్చాం అక్కచెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మాది 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇచ్చాం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారు అన్నింటిలోనూ చంద్రబాబు మోసమే కనిపిస్తుంది ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు అన్నారు బడుగుబలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమ లేదు మీ జగన్ రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే మీ ఖాతాను అడగండి చెబుతుంది గత పదేళ్ల మీ బ్యాంకు అకౌంట్ల ను చెక్ చేసుకోండి చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి అయినా పడిందా ? మన పాలనలో మీ ఖాతాల్లో రూ. 2 లక్షల 53 వేల కోట్లు వేశాం ఎన్ని కష్టాలు ఎదురైనా .. అన్ని వర్గాలకు మంచి చేశాం మీ జగన్ .. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు 56 నెలల కాలంలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి మనం చేసిన మంచిని చెప్పండి మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమల్ని మాత్రమే ప్రజలే .. నా స్టార్ క్యాంపెయినర్లు పేదల భవిష్యత్ మారాలంటే .. జగనే గెలవాలని చెప్పండి ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే .. జగన్ గెలవాలని చెప్పండి ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే ... జగన్ గెలవాలని చెప్పండి పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే .. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి రైతు భరోసా, ఇన్ ఫుట్ సబ్సిడీ అందాలంటే .. మీ జగన్ సీఎం కావాలని చెప్పండి మీరు వేసే ఓటు .. పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ఓటు అని చెప్పండి ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇస్తాయి మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం .. మోసాలు చేయడం తెలియదు మీ బిడ్డ చెప్పాడంటే .. చేస్తాడంతే ఈ యుద్దానికి నేను సిద్ధం .. మీరు సిద్ధమా ? ఒంటరి పోరాటానికి నేను సిద్ధం .. మీరు సిద్ధమా ? దుష్టచతుష్టయాన్ని ..గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా ? వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి దుష్టచతుష్టయం సోషల్ మీడియా లో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ , 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే Updates.. సంగివలసలో సీఎం జగన్ ఎన్నికల శంఖారావం మీరు వేసే ఓటు .. పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ఓటు అని చెప్పండి ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇస్తాయి మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం.. మోసాలు చేయడం తెలియదు మీ బిడ్డ చెప్పాడంటే... చేస్తాడంతే ఈ యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?: ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? దుష్ట చతుష్టయాన్ని, గజ దొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా? వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి మన టార్గెట్ 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే ప్రతి పక్షాలకు ఓటేయడం అంటే దాని అర్ధం.. మాకు ఈ స్కీములు వద్దని, ఈ స్కీములకు రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని గ్రహించండి అలా చేస్తే మళ్లీ లంచాలు, వివక్ష కల్గిన జన్మభూమి కమిటీలకు ఆమోదం తెలిపినట్లే పొత్తు లేకపోతే పోటీ చేయడానికే అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు వారి మాటలు వింటుంటే కొన్ని సామెతలు గుర్తుకువస్తున్నాయి ఓటి కుండకు మోత ఎక్కువ.. చేతగాని వాడికి మాటలు ఎక్కువ అనే సామెతలు గుర్తుకు వస్తున్నాయి. కార్యకర్తలు.. మన ప్రభుత్వం చేసిన మంచిని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి పేదల భవిష్యత్ మారాలంటే.. జగనే గెలవాలని చెప్పండి ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే జగన్ గెలవాలని చెప్పండి ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే.. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమ్మల్ని మాత్రమే ప్రజలే.. నా స్టార్ క్యాంపెయినర్లు 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు ప్రభుత్వం ఏం సంక్షేమం అందించిందో మీ బ్యాంక్ అకౌంట్లు చూస్తే అర్ధమవుతుంది ఏ ఒక్క రూపాయి అయినా సంక్షేమం ద్వారా అందించారా అని వారినే అడగండి మళ్లీ అడగండి.. 2019 నుంచి 2024 వరకూ మీ జగన్ ప్రభుత్వం అందించిన సొమ్మును చూడమనండి రూ. 2 లక్షల 53 వేల కోట్లు వేశాం కోవిడ్ కష్టకాలంలో సాకులు వెతుక్కోలేదు కోవిడ్ కష్టాలు ఎన్నొచ్చినా, ఆదాయాలు తగ్గినా సాకులు చెప్పలేదు.. తోడుగా అండగా నిలబడింది మీ బిడ్డ ప్రభుత్వమని అందరికీ చెప్పండి వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్జీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, మేయర్లు, కార్పోరేటర్లు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ఇలా ప్రతి ఒక్కరికీ ఒక్కటే చెబుతున్నా ఇది మీ పార్టీ.. ఇది ఒక జగన్ పార్టీ కాదు.. మీ అందరి పార్టీ వైఎస్సార్సీపీలో ఉన్నవారు.. వైఎస్సార్సీపీ కోసం కష్టపడ్డవారందరికీ కూడా ఏ రాజకీయ పార్టీ ఇవ్వని గౌరవం ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్సీపీనే 58 నెల కాలంలో ప్రతీ ఇంటికి మంచి చేయగలిగాం పేద సామాజిక వర్గాల మీద ప్రేమ చూపడంలో చంద్రబాబు మార్క్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నా పేద వర్గాలు కనిపిస్తే.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలా అంటాడు ఇటువంటి మాటలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడితే గ్రామాల్లో ఉన్న ఎస్సీలు ఎవరైనా పట్టించుకుంటారా? బీసీలు తోకలు కత్తిరిస్తా ఖబడ్దార్ అంటాడు చంద్రబాబు.. అలా చేస్తే గ్రామాల్లో ఉన్న బీసీలు పట్టించుకుంటారా? అసలు ఎక్కడ ఉంది.. చంద్రబాబుకు సామాజిక వర్గాలపై ప్రేమ అసలు ఎక్కడ ఉంది.. పేద సామాజిక వర్గాల అభ్యున్నతిలో చంద్రబాబు మార్క్ డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానని అక్కా చెల్లెమ్మలకు చంద్రబాబు మోసం చేశాడు అక్కా చెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మాది 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశాం ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాం రైతులకు తోడుగా ఆర్బీకేలను నిర్మించాం ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం ప్రతి గ్రామానికి డిజిటల్ లైబ్రరీలు, బ్రాడ్‌బ్యాండ్‌లు తీసుకొచ్చాం 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయాలనే ఆలోచన లేదు ఎందుకంటే చంద్రబాబు అండ్ కో పెత్తందార్లు కాబట్టి సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నిలువునా ముంచాడు మీ జగన్.. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం పేద పిల్లలకు ఇంగ్లిష్ చదువును అందుబాటులోకి తెచ్చాం ఏ రంగంలో చూసినా వైఎస్జగన్ మార్కే కనిపిస్తోంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం నామినేటెడ్ పదవుల్లో సగం పదవులు బలహీన వర్గాలకే ఇచ్చాం స్థానిక సంస్థల పదవులు అన్నింటిలోను సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం 3,257 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని విస్తరించాం ఒక్క వైద్య రంగంలోనే 53 వేల కొత్త నియామకాలు నాడు-నేడు ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మార్చాం అందుకే ఎక్కడ చూసినా వైఎస్ జగన్ మార్కే కనిపిస్తోంది భీమిలిలో అటు సముద్రం.. ఇటు జన సముద్రం కనిపిస్తోంది ఇక్కడకు వచ్చిన ప్రతీ అక్క, చెల్లెమ్మల్లోనూ, ప్రతి అన్న, తమ్ముడిలోనూ, ప్రతి అవ్వలోనూ నాకు సేనాధిపతులే కనిపిస్తున్నారు ఇటు పక్క పాండవ సైన్యం ఉంది అటు పక్క కౌరవ సైన్యం ఉంది అక్కడ పద్మ వ్యూహం పొంచి ఉంది ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ అభిమన్యుడు కాదు..ఇక్కడ ఉన్నది అర్జునుడు ఈ అర్జునుడికి తోడు కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారు ఈ యుద్ధంలో చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందే మరో 25 ఏళ్లపాటు జైత్రయాత్రకు శ్రీకారం చుడుతున్నాం చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు మన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చాం పేదరికాన్ని, అసమానతలను పోగొట్టిన బాధ్యతల ప్రభుత్వం మనది అని గర్వంగా చెబుతున్నా 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది ఆలోచన చేయండి.. ప్రతీ ఒక్కరి భుజస్కందాలపై బాధ్యత పెడుతున్నాను ఇంటింటికీ వెళ్లి మన ప్రభుత్వం చేసిన మంచిని చెప్పండి.. ప్రతీ పేద కుటుంబానికి వివరించండి ఈ యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య జరుగుతోంది ఈ యుద్ధం మోసానికి, నిజాయితీకి మధ్య జరుగుతుంది మీరే చూడండి.. చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో కనీసం 10 శాతం కూడా నెరవేర్చలేదు మన ప్రభుత్వం 99 శాతం హామీలను నెరవేర్చి ప్రజల పట్ల విశ్వసనీయతతో ఉన్నాం చంద్రబాబు ఏమి చేశాడో చెప్పడానికి ఏమీ కనిపించదు.. చేసింది ఏమీ లేదు కాబట్టి ఆ పెద్ద మనిషి ఏమీ చెప్పలేడు మన ప్రభుత్వం అలా కాదు.. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ చంద్రబాబు చేసేందేమీ లేదు ప్రతీ గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం 3:40PM, Jan 27, 2024 సంగివలస చేరుకున్న సీఎం జగన్ సంగివలస సభ ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ భీమిలి నియోజకవర్గం సంగివలసలో బహిరంగ సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు 3:30PM, Jan 27, 2024 పేదల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేర్చారు: మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్ పాలనలో కార్యకర్తలకు గౌరవం పెరిగింది చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు గమనించాలి కుల, మత పార్టీలకతీంగా అందరికీ సంక్షేమం అందించాం 3:23PM, Jan 27, 2024 విశాఖ చేరుకున్న సీఎం జగన్ భీమిలి నియోజకవర్గం సంగివలసలో బహిరంగ సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం జగన్ 175కు 175 అసెంబ్లీ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యం విశాఖ బయల్దేరిన సీఎం జగన్ ►కాసేపట్లో భీమిలి నియోజకవర్గం సంగివలసలో బహిరంగ సభ ►ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం జగన్ ►టీడీపీ, జనసేన కుట్రలను చిత్తు చేసేలా శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం ►34 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ►175కు 175 అసెంబ్లీ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యం ►రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. ►వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ సాంగ్.. ఓ వైసీపీ కార్యకర్తలారా Full Song! 🎵🎶#Siddham pic.twitter.com/jaP4ASEMFH — YSR Congress Party (@YSRCParty) January 27, 2024 ►ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన సహా వివిధ పార్టీల జెండాలతో జతకట్టి.. కుటుంబాలను చీల్చుతూ పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలను చిత్తుచేసి, విజయభేరి మోగించడానికి.. పార్టీ శ్రేణులను సిద్ధంచేయడానికి ఆయన నడుం బిగించారు. జగనన్న పాలనలో పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకుంటున్న పెత్తందార్లపై యుద్ధానికి సిద్ధం…✊🏻 పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకునేందుకు జెండాలు జతకట్టే టీడీపీ, జనసేన దోపిడీదారులపై యద్ధానికి సిద్ధం….✊🏻#Siddham#JaganannaAgenda pic.twitter.com/ypxwmcgfY7 — YSR Congress Party (@YSRCParty) January 26, 2024 ►ఇందుకు ‘సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో నాలుగుచోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో శనివారం నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి భారీఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ►సుమారుగా 15 ఎకరాల స్థలంలో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. అంతేకాక.. నియోజకవర్గాల వారీగా పలువురు కార్యకర్తలతో కూడా సీఎం ముఖాముఖి మాట్లాడనున్నారు. ►సామాజిక న్యాయం చేకూర్చడంలో మరో అడుగు ముందుకేస్తూ శాసనసభ, లోక్‌సభ స్థానాల సమన్వయకర్తలను సీఎం జగన్ మారుస్తున్నారు. ఇప్పటికే 58 శాసనసభ, 10 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించారు. గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాల కోసం అవసరమైన చోట్ల సమన్వయకర్తలను మార్చడంపై కసరత్తు కొనసాగిస్తున్నారు. సీఎం జగన్ పర్యటన ఇలా.. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి శనివారం మ.2.05 గంటలకు బయల్దేరి మూడు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో సభాస్థలికి చేరుకుంటారు. సభానంతరం తిరిగి హెలికాప్టర్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని గన్నవరానికి బయల్దేరుతారు. బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి.. ►మరోవైపు.. గత మూడ్రోజులుగా జరుగుతున్న ‘సిద్ధం’ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ఏర్పాట్లను శుక్రవారం సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్, వరుదు కల్యాణి, విశాఖ పశ్చిమ సమన్వయకర్త ఆడారి ఆనంద్, సాంస్కృతిక శాఖ చైర్మన్ వంగపండు ఉష పరిశీలించారు. -
Vizag : భీమిలిలో పోరుకు ‘సిద్ధం’
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/తగరపువలస (విశాఖ జిల్లా) : రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన సహా వివిధ పార్టీల జెండాలతో జతకట్టి.. కుటుంబాలను చీల్చుతూ పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలను చిత్తుచేసి, విజయభేరి మోగించడానికి.. పార్టీ శ్రేణులను సిద్ధంచేయడానికి ఆయన నడుం బిగించారు. ఇందుకు ‘సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో నాలుగుచోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో శనివారం నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి భారీఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. సుమారుగా 15 ఎకరాల స్థలంలో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తారు. అంతేకాక.. నియోజకవర్గాల వారీగా పలువురు కార్యకర్తలతో కూడా సీఎం ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇక మ.3.30 గంటల నుంచి సా.5 వరకూ ఈ బహిరంగ సభ జరుగుతుంది. కదనరంగంలో ముందడుగు.. ఎన్నికల పరుగు పందెంలో ఎవరి అడుగు ముందుపడితే విజయం వారినే వరిస్తుందంటూ రాజకీయ విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. ఓ వైపు పొత్తులో ఎవరు ఏ స్థానాల్లో పోటీచేయాలన్నది తేల్చుకోలేక.. పోటీ చేయడానికి అభ్యర్థులు దొరక్క, మరోవైపు బీజేపీని జతచేసుకునేందుకు పాకులాడుతూ టీడీపీ–జనసేన సతమతవుతున్నాయి. మరోవైపు.. జనబలమే గీటురాయిగా.. సామాజిక న్యాయం చేకూర్చడంలో మరో అడుగు ముందుకేస్తూ శాసనసభ, లోక్‌సభ స్థానాల సమన్వయకర్తలను సీఎం జగన్ మారుస్తున్నారు. ఇప్పటికే 58 శాసనసభ, 10 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించారు. గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాల కోసం అవసరమైన చోట్ల సమన్వయకర్తలను మార్చడంపై కసరత్తు కొనసాగిస్తూనే.. ఎన్నికల శంఖారావాన్ని పూరించడం ద్వారా సీఎం జగన్ కదనరంగంలో దూసుకుపోతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రతి ఇంటా విప్లవాత్మక మార్పు.. ఇక ప్రజా సంకల్ప పాదయాత్రలో తాను గుర్తించి, ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలను రెండు పేజీలతో మేనిఫెస్టోగా వైఎస్ జగన్ రూపొందించి 2019 ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం హామీలను అమలుచేశారు. ఇప్పటికి 99.5 శాతం హామీలు అమలుచేశారు. గత 56 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రమాణికంగా.. పారదర్శకంగా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.53 లక్షల కోట్లు.. నాన్ డీబీటీ రూపంలో రూ.1.68 కోట్లు వెరసి రూ.4.21 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చారు. ఇందులో 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేరాయి. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. సీఎం జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి ఇంటా, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గంలో కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. ఇదే అంశాన్ని గుర్తుచేస్తూ ప్రభుత్వంవల్ల మంచి జరిగిందని భావిస్తేనే తనకు అండగా నిలబడాలని ప్రజలకు సీఎం జగన్ పిలుపునిస్తున్నారు. ఇదే అంశాన్ని పార్టీ శ్రేణులకు వివరించి.. ప్రతి ఇంటికీ చేసిన మంచిని చాటిచెప్పి.. మరింత మంచి చేసేందుకు ఆశీర్వదించాలని కోరాలని దిశానిర్దేశం చేయనున్నారు. 2022, మే 11 నుంచే గడప గడపకూ.. నిజానికి.. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రతి ఇంట్లో వచ్చిన మార్పును గుర్తుచేసి.. మరింత మంచి చేయడానికి ఆశీర్వదించాలని కోరేందుకు 2022, మే 11న ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం చేసిన మంచి కళ్లెదుటే కన్పిస్తున్నప్పుడు 175కు 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం సుసాధ్యమేనని ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ వర్క్‌షాప్‌లలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అలాగే, ప్రతి ఇంటికీ చేసిన మంచిని వివరించడానికి చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో 80 శాతం ప్రజలు ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ నినదించి, ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఇది జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ప్రస్ఫుటితమైంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 25కు 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం తథ్యమని టైమ్స్ నౌ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే గడాది అక్టోబరు 10న విజయవాడలో పార్టీ ప్రతినిధుల సదస్సు నిర్వహించి 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి.. మరోవైపు.. గత మూడ్రోజులుగా జరుగుతున్న ‘సిద్ధం’ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ఏర్పాట్లను శుక్రవారం సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్, వరుదు కల్యాణి, విశాఖ పశ్చిమ సమన్వయకర్త ఆడారి ఆనంద్, సాంస్కృతిక శాఖ చైర్మన్ వంగపండు ఉష పరిశీలించారు. హెలికాప్టర్ ట్రయల్ రన్ కూడా పూర్తయింది. సుమారు 3 వేలకు పైగా పోలీసులు శుక్రవారం సాయంత్రానికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌కు ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి శనివారం మ.2.05 గంటలకు బయల్దేరి 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో సభాస్థలికి చేరుకుంటారు. సభానంతరం తిరిగి హెలికాప్టర్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని గన్నవరానికి బయల్దేరుతారు. జగన్‌ను మళ్లీ సీఎం చేసుకునేందుకు ప్రజలు ‘సిద్ధం’ వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ తదితర ప్రతిపక్ష నేతలు చేస్తున్న దు్రష్పచారాలను తిప్పికొట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సంగివలస జాతీయ రహదారి వద్ద జరగనున్న సభకు సంబంధించి ఏర్పాట్లను ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాల దు్రష్పచారాలను తిప్పికొట్టేందుకు సీఎం జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారన్నారు. పక్క రాష్ట్రాల్లో ఆదరణ కోల్పోయిన నాయకులు ఇక్కడి ప్రజలకు సేవ చేయడానికి వచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి సమర్థవంతంగా సంక్షేమాభివృద్ధి పథకాలు అమలుచేశారని.. ఆ నమ్మకంతోనే మళ్లీ ఆయననే ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వారే వైఎస్సార్సీపీ క్యాంపెయినర్లన్నారు. ఈ సభకు రెండున్నర లక్షల మంది తరలిరానున్నారని అందుకు తగిన ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు.