
సాక్షి, తాడేపల్లి: ‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను వైఎస్సార్‌సీపీ ప్రారంభించింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, జగన్ కోసం సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

వేరే దేశాలలో ఉన్న ఎన్నారైలు ఏపీకి వచ్చి పని చేయడం హ్యాపీగా ఉందని.. జగన్ గెలుపు మన ఇంట్లో గెలుపులా మహిళలు సైతం భావిస్తున్నారని సజ్జల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ఉంటుందన్న ఆయన... చేసిన మంచి గురించి ప్రజలకు వివరించటం చాలా మంచి పరిణామన్నారు.

పార్టీ, జగన్ తరపున ఎన్నారైలకు కృతజ్ఞతలు. టీడీపీ వికృత చేష్టలు పెరిగాయి. కోమటి జయరాం అనే టీడీపీ అహంకారి నోట్లతో ఓట్ల కొనాలనటం సిగ్గు చేటు. రాజకీయం అంటే డబ్బు కాదు, ప్రజలకు మంచి చేయడం. లీడర్‌ని బట్టి కార్యకర్తలు ఉంటారు. ప్రజల కోసం వైసీపీ ఎన్నారై లు వస్తే.. డబ్బులు పంచడం కోసం టీడీపీ ఎన్నారైలు వచ్చారు. సమాజంలో మార్పు ప్రజలకు చెప్పాలని వైసీపీ ఎన్నారై టీమ్ పనిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 4 బస్సులతో స్టార్ క్యాంపైనర్స్ ప్రచారం చేస్తారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment