చేబ్రోలు కిరణ్‌ను పెంచి పోషించేది చంద్రబాబే: అంబటి | Ysrcp Ambati Rambabu Fires On Chandrababu And Itdp | Sakshi
Sakshi News home page

చేబ్రోలు కిరణ్‌ను పెంచి పోషించేది చంద్రబాబే: అంబటి

Published Sat, Apr 26 2025 5:14 PM | Last Updated on Sat, Apr 26 2025 6:06 PM

Ysrcp Ambati Rambabu Fires On Chandrababu And Itdp

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఏడాది కాలం పాలనలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏమీ చేయకపోయినా చంద్రబాబును హీరోలా చూపిస్తూ ఆయన అనుకూల మీడియా కథనాలు ప్రసారం చేస్తుందని.. చంద్రబాబు హీరో కాదు.. విలన్’’ అంటూ ఆయన దుయ్యబట్టారు. గతంలోనూ విలన్ లాగే వ్యవహరించారు. సోషల్ మీడియా సైకోల తోక కత్తిరిస్తానంటూ అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టేవారి కోరలు పీకేస్తామన్నారు. పిడి యాక్ట్ పెట్టి తాటతీస్తామన్నారు. చంద్రబాబు అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

‘‘వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌, ఆయన కుటుంబ సభ్యులపై చాలా దారుణమైన పోస్టులు పెట్టారు. తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చేబ్రోలు కిరణ్‌ను పెంచిపోషించింది చంద్రబాబు కాదా?. చేబ్రోలు కిరణ్ ఎంతో మందిపై చాలా దారుణంగా మాట్లాడాడు. చేబ్రోలు కిరణ్‌ను అరెస్ట్ చేసి వదిలేశారు. చేబ్రోలు కిరణ్ విడుదలైనంత తొందరగా సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయిన వారెవరూ విడుదల కాలేదు. వైఎస్సార్‌సీపీ నుంచి ఎవరు అరెస్ట్ అయినా వారిని పిటిషన్ వేసి కస్టడీకి తీసుకుంటున్నారు. కానీ చేబ్రోలు కిరణ్‌ను మాత్రం పోలీస్ కస్టడీకి తీసుకోలేదు. చంద్రబాబు పెంచి పోషించాడు కాబట్టే.. చేబ్రోలు కిరణ్ కేసులో 24 గంటల్లో విచారణ పూర్తయిపోయింది

..చంద్రబాబు చేయించిన ఏ అరెస్ట్ లోనూ ఇంత త్వరగా విచారణ పూర్తికాలేదు. చంద్రబాబు డైరెక్షన్‌లో కొన్ని వందల మంది ఐ-టీడీపీలో పనిచేస్తున్నారు. ఎవరిని ఎక్కువ బూతులు తిడితే వారిని అంత పోషిస్తామని చెబుతున్నారు. చంద్రబాబు మాటలన్నీ దొంగమాటలు. స్వాతి రెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్త పేరు స్వాతి చౌదరి. వైఎస్‌ జగన్‌ ఫోటోలు మార్ఫింగ్ చేయించేది చంద్రబాబు, లోకేష్‌లే. టీడీపీని మేం ప్రశ్నిస్తే వాళ్లకంటే ముందు సీమ రాజా అనేవాడు స్పందిస్తాడు. వైఎస్సార్‌సీపీ కండువా వేసుకుని టీడీపీ తరపున మమ్మల్ని తిడతాడు. సీమరాజాపై ఒకసారి కేసుపెట్టా.. మళ్లీ పెడతా. కిరాక్ ఆర్పీ అనేవాడు రోజూ వైఎస్‌ జగన్‌ను, నన్ను, రోజాను తిడతాడు. చంద్రబాబుతో ఫోటోలు దిగుతాడు. వ్యక్తిత్వ హననం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టి విద్య. ఎన్టీఆర్‌తో మొదలుపెట్టి ఇప్పటికీ ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూనే ఉన్నాడు

..వ్యక్తిత్వ హననం చేసి చంద్రబాబు పైశాచికానందం పొందుతున్నాడు. సోషల్ మీడియాలో వారిని పెంచి పోషించేది వారికి డబ్బులిచ్చేది చంద్రబాబే. సోషల్ మీడియాలో పనిచేస్తే పేమెంట్ ఇస్తానని చెప్పింది చంద్రబాబు. ఎవరు బాగా తిడితే వారికి ఎక్కువ పేమెంట్ ఇస్తామని సాక్షాత్తూ చంద్రబాబే చెప్పారు. యూ ట్యూబ్‌లలో సైతం ఎంతో దుర్మార్గంగా.. దారుణమైన పోస్టులు పెడుతున్నారు. వెంకట కృష్ణ ఒక కీ ఇచ్చే బొమ్మ. వెనకుండి నడిపించేది రాధాకృష్ణ. మార్ఫింగ్ చేసిన పోస్టులు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరు. చేబ్రోలు కిరణ్ వంటి వారిని పెంచి ప్రోత్సహిస్తూ.. మహిళలను ఏదైనా అంటే సహించేది లేదని బిల్డప్ ఇస్తున్నారు.

..చంద్రబాబుని మోసేది సీమరాజా, కిర్రాక్ ఆర్పీ వంటి వారే. ఇంత నీచమైన స్థితికి టీడీపీ దిగజారిపోవడం బాధాకరం. ఐ-టీడీపీ ద్వారా జరుగుతున్న నీచమైన ప్రచారాలకు చంద్రబాబు చెక్ పెట్టాలి. ఏ ఒక్కరినీ వదలం అందరిపైనా కేసులు పెడతాం. అనిత పేరుకే హోంమంత్రి. హోంశాఖ గురించి ఆమెకు తెలియదు.. హోంశాఖను నడిపించేది లోకేష్. మా ఫిర్యాదులపై పోలీసులు కేసులు రిజిస్టర్ చేయకపోతే న్యాయపరంగా పోరాడతా. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వికృతచేష్టలపై పోరాడతాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement