Chandrababu Naidu
-
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది: బొత్స సత్యనారాయణ
-
రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ విఫలం: వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అకాల వర్షాలకు, వడగళ్ల వానకు నష్టపోయిన అరటి రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన పులివెందులలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నష్టపోయిన రైతులను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఆనాడు వైఎస్సార్సీపీ తరపున సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు నష్టపోయిన ప్రతి హెక్టారుకు రూ.20 వేల సాయం అందిస్తాం. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఒక్క రూపాయి సాయం అందించలేదు. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి’’ అని అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు.‘‘ఇటీవల అకాల వర్షాల వల్ల లింగాల మండలంలో చోటు చేసుకున్న ఉద్యాన పంటల నష్టానికి.. రైతులకు పరిహారం ఇచ్చేందుకు వైఎస్ జగన్ సముఖత వ్యక్తం చేశారు. 630 మంది రైతులకు హెక్టారుకు రూ. 20 వేల చొప్పున పార్టీ తరఫున పరిహారం ఇచ్చేందుకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ పరిహారానికి సంబంధించిన త్వరలోనే ఆయా గ్రామాల వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో రైతులందరికీ డీడీలు అందిస్తాం. 630 మందికి రూ. 1.30 కోట్ల పరిహారాన్ని డీడీల రూపంలో అందజేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరుచుకోవాలి. తన బాధ్యతను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’’ అని అవినాష్‌రెడ్డి హితవు పలికారు.‘‘రూ.26 కోట్లతో అరటి రైతుల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌ను ఏర్పాటు చేసింది.. కానీ దాని వినియోగంలోకి తీసుకురావడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం విఫలమైంది. పులివెందుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధితో ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ కోల్డ్ స్టోరేజ్‌ని వినియోగంలోకి తీసుకొచ్చి ఉంటే ధరల స్థిరీకరణకు అవకాశం ఉండేది. ధరల స్థిరీకరణ జరిగితే రైతుకు ప్రయోజనం కలిగేది. గత నెలలో అరటి ధర ఓ మోస్తారుగా ఉండేది. ఇప్పుడు అరటి ధర పడిపోయి రైతుకు గిట్టుబాటు కావడం లేదు..మెడికల్ కాలేజ్ నిర్మించి 50 సీట్లు మంజూరు అయ్యేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తే.. వచ్చిన సీట్లను వద్దని రాసి పంపించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. 6 సార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా, కడప నుంచి నాలుగుసార్లు ఎంపీగా, రెండుసార్లు సీఎం గా గెలిచి పులివెందులను అభివృద్ధి చేస్తే.. ఇప్పుడు మెడికల్ కాలేజీకి ఆయన పేరును తీసివేసి కూటమి ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతుంది. మెడికల్ కాలేజీ మెయిన్ గేట్‌కు ఉన్న వైఎస్సార్ పేరు తొలగిస్తారేమో కానీ.. ఈ ప్రాంత ప్రజల్లో ఆయనకున్న స్థానాన్ని అయితే చెరిపి వేయలేరు. చెయ్యని పనులు చేసినట్లు చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఏ పని ఎవరు చేశారో ప్రజలందరికీ తెలుసు’’ అని వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గండి క్షేత్రంలో 26 కోట్లతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్న చిన్న చిన్న పనులు చేయలేక అసంపూర్తిగా వదిలేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో గంజాయి రవాణా విస్తృతంగా పెరిగిపోయింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యపానాన్ని కట్టడి చేస్తే.. ఈ ప్రభుత్వం వచ్చాక విచ్చలవిడిగా వీధికి ఒక మద్యం షాపును తెరిచింది’’ అని అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
కూటమి ప్రభుత్వంపై దేవినేని అవినాష్ ఫైర్
-
‘వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు ఇదే తేడా..’
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తుందని.. సంక్షేమ పథకాలు, కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. వైఎస్ జగన్ కార్మికుల కోసం పనిచేశారన్నారు. గురువారం.. వైఎస్సార్సీపీ టీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేశారు.ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, వైఎస్ జగన్ హయాంలో ఆటో కార్మికులకు వాహన మిత్ర పేరుతో రూ.10 వేలు అందించేవారని.. కేసులు, పైన్స్ లేకుండా చేశారన్నారు. ఇప్పుడు ఆటో రోడ్డు ఎక్కితే పైన్స్ వసూళ్లు చేస్తున్నారు. చిరు వ్యాపారులకు జీవన భృతి కోసం 10 వేలు, గుర్తింపు కార్డు జగన్ ఇచ్చారు. చిరు వ్యాపారులు టీడీపీ నేతలకు ప్రతిరోజు లంచాలు ఇవ్వాల్సిన పరిస్ధితి వచ్చింది. వైఎస్ జగన్ ఆప్కాస్ పెట్టి మున్సిపల్ కార్మికులను ఆదుకున్నారు. ఉద్యోగాలు ఇచ్చారు. ఆప్కాస్‌ను కూటమి ప్రభుత్వం తీసేయాలని చూస్తుంది. ఏ ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వ పాలనలో సంతోషంగా లేదు’’ అని అవినాష్ పేర్కొన్నారు.‘‘సంక్షేమం లేదు.. అభివృద్ది లేదు.. ప్రజలను కూటమి ప్రభుత్వ మోసం చేస్తుంది. సింహచలం వంటి ఘటన ఎప్పుడైన జరిగిందా?. తొక్కిసలాట.. తోపులాట ఎప్పుడు జరగలేదు. రాష్ట్రంలో పాలన ఉందా? అనే అనుమానం కలుగుతుంది. వైకుంఠ ఏకాదశినాడు తిరుపతిలో చనిపోయారు. ఇప్పుడు సింహాచలంలో చనిపోయారు. రైడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంపైనే దృష్టి పెడుతున్నారు. వైజాగ్ మా నాయకుడు వెళ్లాడు.. మీరు ఒక్కరైన వెళ్లారా?. వైఎస్ జగన్ కట్టిన రక్షణ గోడ లక్షలాది మందిని కాపాడింది. మీరు కట్టిన గోడ నాసిరకంగా కట్టడంతో 8 మంది చనిపోయారు. వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి కార్మికుడికి వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని దేవినేని అవినాష్ చెప్పారు. -
ఎవరి అక్షయపాత్ర అమరావతి?
'అక్షయపాత్ర అమరావతి" ఎల్లో మీడియా ఈనాడులో ప్రధాన శీర్షిక ఇది. ప్రశ్న ఏమిటంటే.. ఇది ఎవరి అక్షయపాత్ర? పేదలకా? లేక ధనికులు, భూస్వాములు, కాంట్రాక్టర్లకా? బాబు గారి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని ఒకరోజు కోసమైనా మళ్లించేందుకు ఇలాంటి శీర్షికలు, కథనాలు ఉపయోగపడతాయేమో కానీ.. అన్నివేళలా మాత్రం కాదు. లేదంటే.. తమ వర్గానికి అనూహ్యస్థాయి లబ్ధి చేకూరుతోందని ఈనాడు యాజమాన్యం సంతోషంతో ఇలాంటి కథనాలు వండి వార్చి ఉండాలి. అయితే... ఈ కథనం వచ్చిన రోజే సాక్షి దినపత్రికలో ఇంకో కథనం వచ్చింది. దీని శీర్షిక 'అవినీతి ఐకానిక్’... అమాంతంగా పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం’’ అని వివరమైన బ్యానర్ కథనం వచ్చింది. నిజానికి పాత్రికేయ వృత్తిలో ఉన్నవారు. ప్రభుత్వ వ్యవహారాలతోపాటు, అధికారంలో ఉన్నవారు చేస్తున్న వాటిలో మంచి,చెడు విశ్లేషించి రాయాలి. ఎల్లో మీడియా ఆ పని మానేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అధికారంలో ఉన్నా, లేకపోయినా, ఆయనపైనే ఏడుపుగొట్టు వార్తలు, అబద్ధాలు రాయడమే పనిగా పెట్టుకుంది. కూటమి వైఫల్యాలను కప్పిపుచ్చుతూ ప్రజలను వంచించడానికి కృషి చేస్తోంది. అందుకే ఆరికి అమరావతిలో అంతా అద్భుతంగానే కనిపిస్తోంది.2014-19 మధ్యకాలంలోనూ అమరావతికి విపరీతమైన హైప్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి అదే బాకా ఊదుతున్నారు. అక్షయపాత్ర అని, ప్రపంచ స్థాయి రాజధాని అని ఊదరగొడుతున్నారు. అయితే వీరి ప్రచార ఆర్భాటానికి మోసపోయి అప్పట్లో భూములు కొన్న వారు ఇప్పటికీ తేరుకోలేదు. మరోసారి మోసపోయేందుకు వారు సిద్ధంగా ఉన్నారా? అన్నది ప్రశ్న. చంద్రబాబు ప్రధానమంత్రి మోడీని కలిసి అమరావతి పనుల పునఃప్రారంభానికి ఆహ్వానించారు. అంతవరకు ఓకే. కాని ఆ సందర్భంగా మోడీతో మాట్లాడిన విషయాలు అంటూ ఈ అక్షయపాత్రను సృష్టించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల వాసుల అవసరాలు తీర్చే నగరంగా తీర్చిదిద్దనున్నామని, విద్య, ఉపాధి, వైద్య అవకాశాలు కల్పించే అక్షయపాత్రలా తయారు చేయాలన్నది ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు ప్రధానితో అన్నారని ఈ కథనంలో చెప్పారు.ఇది ఎంత వరకూ వాస్తవరూపం దాలుస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రజలందరి నెత్తిన రూ. లక్ష కోట్ల రుణ భారమైతే గ్యారెంటీ. ఎందుకంటే చంద్రబాబు అండ్ కో గతంలో నొక్కి వక్కాణించినట్లు ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ నగరం ఏమాత్రం కాదని ఇప్పటికే స్పష్టమైపోయింది. ఈ నగర నిర్మాణానికి తెచ్చే అప్పులు ఏదో ఒక రూపంలో కట్టాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. లబ్ధి మాత్రం నేతలదవుతుంది. అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణ టెండర్లు పిలిచిన తీరు, కావల్సిన వారికి వాటిని కేటాయించుకున్న వైనం, అమాంతం రేట్లు పెంచేసిన పద్దతి ఇవన్ని చూస్తుంటే కాంట్రాక్టర్లకు, కూటమి పెద్దలకు అమరావతి కచ్చితంగా అక్షయపాత్రే కానుందని చెప్పవచ్చు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సిమెంట్, స్టీల్ రేట్లు 2019 నాటికన్నా తగ్గాయని, అయినా అమరావతిలో నిర్మాణాల వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి రూ.77 వేల కోట్లకు పెంచేశారని విమర్శించారు. సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాల అధిపతుల కార్యాలయాల కోసం సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. చదరపు అడుగుకు రూ.8981ల చొప్పున ఖర్చుపెట్టడానికి ఓకే అయింది. మొత్తం రూ.4688 కోట్ల వ్యయం అవుతుంది. 2018లో ఇవే టవర్లకు రూ.2271 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అప్పట్లో చదరపు అడుగుకు రూ.4350లే చాలా ఎక్కువ అని అనుకుంటే, ఇప్పుడు దానిని డబుల్ చేశారు.నిజానికి హైదరాబాద్‌లో భూమి విలువతో లెక్కవేసుకున్నా ఈ స్థాయి ఖర్చు కాదని పలువురు బిల్డర్లు చెబుతున్నారు. అమరావతిలో భూమి ఖర్చు లేదు. ఇసుక ఉచితం. ఇతర నిర్మాణ సామాగ్రీ ధరలు కూడా గతంతో పోలిస్తే తక్కువగా ఉన్న నేపథ్యంలో నిర్మాణ వ్యయం పెరగడం అసాధారణమైన విషయమని చెబుతున్నారు. ఒక ఐకానిక్ టవర్‌లో 49 అంతస్తులు, మరో మూడు టవర్లు 39 అంతస్తులు చొప్పున నిర్మించబోతున్నారు. మొత్తం ప్రభుత్వంలో పర్మనెంట్ సిబ్బంది రెండువేల లోపు ఉంటే, ఇతరత్రా అంతా కలిపి మరో రెండువేల మంది ఉంటారని అనుకున్నా, ఈ స్థాయిలో భవనాల అవసరం ఏమిటో అర్థః కాదు.ప్రస్తుతం తాత్కాలిక సచివాలయంలో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. పోనీ దీనికి రెట్టింపు స్థలం అవసరం అనుకుంటే 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలు నిర్మిస్తే సరిపోతుంది. అలా కాకుండా ఏకంగా 52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు చేపడతారట. నాలుగు టవర్లలో మొత్తం సచివాలం నిర్మిస్తుంటే, ఇన్నివేల ఎకరాల భూమి దేనికో తెలియదు.ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ సచివాలయంతో సహా అన్ని భవనాలు కలిపి కూడా సుమారు 250 ఎకరాలలోపే ఉంటాయని అంటారు. ఇతర రాష్ట్రాల రాజధానులలో సైతం ఎక్కడా రెండు, మూడు వేల ఎకరాలకు మించి కార్యాలయాలకు వాడడం లేదు. తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నిర్మించిన సచివాలయానికి సుమారు వెయ్యికోట్లు అయితే, విభజిత ఏపీలో కేవలం రూ.4688 కోట్లు ఖర్చుపెట్టబోతున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందని గ్యారంటీ లేదు. ఇప్పటికే తాత్కాలిక సచివాలయం కోసం వెయ్యి కోట్లకుపైనే వ్యయం చేశారు. అందులో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడం, కేంద్ర ప్రభుత్వ శాఖలు అప్పటి చంద్రబాబు పీఏ ఇంటిపై దాడిచేసి రూ.రెండు వేల కోట్ల అక్రమాలు జరిగాయని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు దానిని మేనేజ్ చేశారని అంటున్నారు. అందువల్లే అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు తదుపరి అడుగు ముందుకు వేయలేదు. అది వేరే సంగతి.ఇప్పుడు కూడా ఈ స్థాయిలో ఖర్చుపెడితే ప్రజలపైనే భారం పడుతుంది కదా! అసెంబ్లీ, తదితర నిర్మాణాలకు ,భూములు ఇచ్చిన రైతులకు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నీరు తదితర అన్ని వసతులు కల్పించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో ఎవరూ చెప్పలేరు. కాంట్రాక్టర్లకు పనుల విలువలో పది శాతం ముందుగానే ప్రభుత్వం చెల్లిస్తుందట. ఇందులో ఎనిమది శాతం వరకు ప్రభుత్వ పెద్దలకు కాంట్రాక్టర్లు ముట్ట చెబుతారని ఇప్పటికే వైసీపీ ఆరోపించింది. గతంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ పద్దతిని వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తోందో చెప్పాలి కదా? మొత్తం మీద ఇది పేదలు, మధ్య తరగతి వర్గాలకు ఉపయోగపడే రాజధాని కాదు. పెత్తందార్లకు, కాంట్రాక్టర్లు, బడాబాబులకు మాత్రమే ఉపయోగపడేదని తేలడం లేదా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చెత్త ప్రభుత్వం.. సింహాచలం భక్తులు సంచలన వ్యాఖ్యలు
-
Big Question: బాబు పాపం - భక్తులకు శాపం
-
కేవలం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలు బలి: వైఎస్ జగన్
-
సింహాచలంలో ఊహకందని విషాదం
-
ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన YSRCP నేతలు
-
బాబు హయాంలో.. పుణ్యక్షేత్రాలలో మృత్యుఘోష!
ఏమిటీ వైపరీత్యం...? తరచూ ఏమిటిలా భక్తుల మృత్యుఘోష...? చంద్రబాబు ప్రభుత్వ దారుణ వైఫల్యం.. భక్తుల పాలిట మృత్యు ఘంటికలు మోగిస్తోంది.. నాటి గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట ఘటన మొదలు నిన్నటి తిరుమల వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన.. నేటి సింహాచల అప్పన్న చందనోత్సవంలో గోడ కూలిపోవడం వరకు చంద్రబాబు జమానాలో ఎన్నో ఉదంతాలు.. పుణ్యక్షేత్రాలలో రెగ్యులర్‌గా జరిగే కార్యక్రమాల గురించి, వాటికి వచ్చే భక్త జన సందోహం గురించి. ప్రభుత్వం చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్ల గురించి చంద్రబాబు పట్టించుకోకపోవడం దారుణం అని జనం చర్చించుకుంటున్నారు.. అతి ప్రచార కండూతి.. అంతులేని నిర్లక్ష్యం.. చంద్రబాబు మార్కు పాలనకు ప్రతీకలుగా మారాయి.. -
డిప్యూటీ సీఎంకు పంగ‘నామం’
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న అమరావతి రాజధాని పునహ్వార్మాణ కార్యక్రమం ఆహ్వానపత్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ముద్రించకపోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో విరుచుకుపడడంతో మళ్లీ ఆయన పేరును చేర్చి ఆహ్వాన పత్రాలు ముద్రించారు. అయితే ఇప్పటికే 90శాతం ఆహ్వాన పత్రాల పంపిణీ జరిగిపోయింది. మోదీ, బాబు పేర్లు మాత్రమే..! ఈ నెల 2న వెలగపూడిలో అమరావతి పునర్నిర్మాణం పేరుతో భారీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించి సీఆర్డీఏ నాలుగు పేజీల ఆహ్వానపత్రాన్ని ముద్రించి అందరికీ పంపిణీ చేసింది. మొదటి పేజీ, చివరి పేజీలో అమరావతి డిజైన్లు, ప్రభుత్వ రాజముద్ర, 2వ పేజీలో ఇంగష్, 3వ పేజీలో తెలుగులో ఆహ్వాన పత్రాన్ని ముద్రించారు. అందులో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు పేర్లు మాత్రమే ముద్రించారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పేరు లేదు. ఈ ఆహ్వానపత్రికలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీఐపీలు, వీవీఐపీలు, ముఖ్యులకు పంపించారు. ఆహ్వానపత్రికలో పవన్ పేరు లేదని ఆలస్యంగా గుర్తించిన జనసేనపార్టీ మిన్నకుండిపోయింది. పవన్ కళ్యాణ్ కూడా సర్దుకుపోయారు. అయితే జనసేన శ్రేణులు మాత్రం తీవ్రంగా స్పందించారు. సోషల్‌మీడియాలో ప్రభుత్వ తీరుపై నిప్పులుచెరిగారు. తమ నేతను కరివేపాకులా తీసి పారేశారంటూ ఆవేదన వెళ్లగక్కారు. తమ పార్టీ లేకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవారు కాదని, తమ నేతకే పంగనామాలు పెడతారా? అంటూ పోస్టులు పెట్టారు. దీనికి టీడీపీ శ్రేణులూ కౌంటర్ ఇచ్చాయి. రెండుపార్టీల మధ్య సోషల్‌మీడియా వార్ జరుగుతోంది.మరిచిపోయినట్టు నటించి దిద్దుబాటు చర్యలు ఇది చిలికిచిలికి గాలివానలా మారుతోందని గుర్తించిన టీడీపీ పెద్దలు పేరు మరిచిపోయినట్టు నటించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీంతో సీఆర్డీఏ అధికారులు ఆహ్వానపత్రంలో మొక్కుబడిగా పవన్ పేరు చేర్చి మళ్లీ ముద్రించి విడుదల చేశారు. అయితే ఇప్పటికే 90శాతం పత్రికల పంపిణీ పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనతో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యంపై సర్వత్రా చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకు తలొగ్గి అన్ని విషయాల్లో బేషరతుగా మద్దతు ఇస్తున్నా ప్రభుత్వంలో ఆయనకు ఏమాత్రం విలువ లేదని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
చంద్రబాబే బాధ్యుడు: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సింహాచలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దాదాపు ఏడాది కాలంగా గుడులు, గోపురాల్లో జరుగుతున్న ఘటనలన్నింటిలో చంద్రబాబే అసలు దోషి అని మండిపడ్డారు. వైకుంఠ ఏకాదశి, చందనోత్సవం ఎప్పుడు జరుగుతాయో ముందే తెలిసినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ధ్వజమెత్తారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు, ఇప్పుడు ఇక్కడ చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు చనిపోవడంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కళ్లకు కడుతోందని చెప్పారు. సింహాచలం ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. మొత్తం ఏడుగురు చనిపోగా, ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. మృతులు పిల్లా ఉమామహేశ్వరరావు, పిల్లా శైలజ కుటుంబ సభ్యులను చంద్రంపాలెం వద్ద ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింహాచలంలో చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో.. ఎంత మంది భక్తులు వస్తారో తెలిసినా కనీస ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ముఖ్యమైన గోడను ముందే ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. 70 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తున గోడను నాలుగు రోజుల్లో నిర్మాణం పూర్తి చేశారని, ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ధ్వజమెత్తారు. గాలికి ఫ్లెక్సీ ఊగినట్లు ఈ గోడ కూలిపోయే ముందు ఊగిందని భక్తులు చెబుతున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం అవుతోందన్నారు. ‘ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? మంత్రుల పర్యవేక్షణ ఏమైంది? ఐదుగురు సభ్యుల కమిటీ ఏం చేసింది? టెండర్లు పిలవకుండానే ఇంత పెద్ద గోడ ఎలా నిర్మించారు? కాంక్రీట్ గోడ (రీ ఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ వాల్) కట్టాల్సిన చోట ఫ్లైయాష్ ఇటుకలతో నిర్మించారు. ఎక్కడా కాలమ్స్ లేవు. ఏ మాత్రం నాణ్యత పాటించ లేదు. ఇలాగైతే ఆ గోడ ఎలా నిలబడుతుంది? రెండు రోజుల క్రితం పూర్తయిన ఈ గోడ పక్కనే అంత మంది భక్తులను ఎలా నిలబెట్టారు? ఫలితంగా ఆ గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం దారుణం’ అని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. బాబు పాలనలో అన్నీ దారుణాలే.. చంద్రబాబు పాలన ప్రారంభమైనప్పటి నుంచి అన్నీ దారుణాలే జరుగుతున్నాయి. రాజకీయాల కోసం తిరుమల శ్రీవారి ప్రసాదంపై దు్రష్పచారం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కనీస ఏర్పాట్లు చేయడంలో విఫలం కావడం వల్లే తిరుపతిలో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయారు. భద్రతా సిబ్బందిని చంద్రబాబు పర్యటనకు కుప్పం పంపారు. అదే సమయంలో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం వచి్చన భక్తులందరినీ ఓ పార్కులోకి పంపారు. వారందరినీ ఒక్కసారిగా వదలడం వల్ల తొక్కిసలాట జరిగింది. గోశాలలో ఆవులు పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డాయి. వైఎస్సార్ జిల్లా కాశినాయన క్షేత్రాన్ని కలెక్టర్ సమక్షంలోనే బుల్డోజర్లతో కూల్చి వేశారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. చంద్రబాబు గత పాలనలో గోదావరి పుష్కరాల సందర్భంగా ఆయన ప్రచార ఆర్భాటం కోసం భక్తులను గుంపుగా వదలడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చంద్రబాబు వస్తారు.. ఎంక్వైరీ వేస్తున్నామంటారు. తీరా ఎలాంటి చర్యలూ ఉండవు. ఎందుకంటే ఆయా ఘటనలన్నింటికీ చంద్రబాబే బాధ్యుడు కాబట్టి. తిరుపతి క్యూలైన్లలో తొక్కిసలాట ఘటనలో తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యలు తీసుకున్నారు. పైగా వాటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందుకు సంబంధించిన ఏ అధికారికైనా ఉద్యోగాలు పోతాయి.. యూనిఫాం పోతుందని ఒంట్లో భయం ఉండాలి. అప్పుడే క్రమశిక్షణ ఉంటుంది. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం ఆగిపోతుంది. పశ్చాత్తాపం ఉండాలి» ఈ ఫొటో చూడండి.. ఎక్కడైనా కాలమ్స్ కనిపిస్తున్నాయా చెప్పండి? 10 అడుగుల ఎత్తు.. 70 అడుగుల పొడవున్న గోడ కూలిపోయేటప్పుడు ఫ్లెక్సీ మాదిరిగా ఊగిందని చెబుతున్నారు. ఏం నిర్మాణం చేశారు? ఏ రకంగా పని చేయిస్తున్నారు? జగన్ ఇచ్చే లోపే ఆ కుటుంబాలకు రూ.కోటి ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నా. బాధ్యులపై, బాధ్యత తీసుకున్న మంత్రులపై, ఆలయాన్ని నడిపే బాధ్యతలో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇటువంటివి పునరావృతం కావు.» ప్రతీదీ డైవర్షన్ పాలిటిక్సే.. ఎక్కడా కూడా తప్పు చేశామన్న పశ్చాత్తాపం వీళ్లలో కనిపించడం లేదు. చంద్రబాబులో అది ఎక్కడా కనిపించదు. నేను ఇక్కడకు వస్తున్నానని తెలుసుకుని మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం, ఒక ఉద్యోగం ప్రకటించారు. ప్రభుత్వం అనేది ప్రజలకు భరోసా ఇచ్చేలా ఉండాలి. ప్రజలకు తోడుగా ఉండాలి.» ఏదైనా ప్రమాదం జరిగి ప్రజలు చనిపోతే.. ప్రభుత్వంలో ఉన్నవారు పశ్చాత్తాపం చెందాలి. మనం ఆ కుటుంబానికి ఏం చేస్తున్నామనేది మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. మన ప్రభుత్వంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఒక్కొక్క కుటుంబానికి రూ.కోటి ఇచ్చి ఆదుకున్నాం. ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఈ ఘటన జరిగినప్పుడు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తున్నావ్ చంద్రబాబూ? నేను ఒకటే చెబుతున్నా.. మీరు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. ఈ కుటుంబాల్ని గుర్తు పెట్టుకుంటున్నాను. మేం మళ్లీ అధికారంలోకి వచి్చన తర్వాత రూ.కోటికి మిగిలిన బ్యాలెన్స్ నేను ఇప్పిస్తాను. » ఈ కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, భీమిలి ఇన్చార్జ్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, తలశిల రఘురాం, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ ఎంపీ బొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు.ఈ గోడ ఎవరు కట్టారో తెలియదట! ప్రతి చోటా నిర్లక్ష్యమే. ప్రతిచోటా డైవర్షన్ పాలిటిక్సే. డైవర్షన్ పాలిటిక్స్ ఏ స్థాయిలో దిగజారిపోయాయో మంత్రుల ప్రకటనలు చూస్తేనే అర్థమవుతోంది. సింహాచలం ఘటనలో మంత్రులు మొదటగా ఏమన్నారంటే.. ఈ గోడ ఎవరి హయాంలో.. ఎవరు కట్టారో చూడాలని మాట్లాడారు. వారి తీరు చూస్తే.. వేరే వాళ్లపై నెట్టేసేందుకేనని అర్థమవుతోంది. వాళ్ల హయాంలోనే వారం రోజుల క్రితమే గోడ కట్టారని ఎప్పుడైతే తెలుసుకున్నారో.. గోడ పిల్లర్లతో కట్టారో.. సిమెంట్‌తో కట్టారో.. బ్రిక్స్‌తో కట్టారో అనేది మాకు తెలీదని మాట్లాడుతున్నారు.ఏమీ తెలుసుకోకపోతే.. ముందస్తు ఏర్పాట్ల పేరుతో మంత్రుల కమిటీ పేరుతో ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీ సమక్షంలోనే ముందస్తు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ గోడ ఎందుకు కట్టారు? 70 అడుగుల పొడవు.. 10 అడుగుల ఎత్తుతో ఒక్క కాంక్రీట్ పిల్లర్ కూడా లేకుండా గోడ ఎందుకు కట్టించారు? చందనోత్సవం జరిగిన ప్రతిసారీ వర్షం పడింది. కొత్త గోడ అని తెలిసి.. వర్షం పడుతుందని తెలిసినప్పుడు ఈ గోడ పక్కన ఎందుకు భక్తుల్ని ఉంచారు?అండగా ఉంటాం..మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తామని హామీమధురవాడ (విశాఖ): చందనోత్సవంలో గోడ కూలి మృతి చెందిన ఉమా మహేశ్వరరావు, శైలజ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం మధురవాడ చంద్రంపాలెం ఎన్జీవోస్ కాలనీ శ్మశాన వాటిక వద్ద పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్‌ను చూసి మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయన బాధితులతో మాట్లాడారు. వారు ఎన్ని గంటలకు దేవస్థానానికి వెళ్లారు.. ప్రమాదం ఎలా జరిగింది.. పిల్లలు ఎంత మంది.. పరిహారం ఎంత ఇస్తున్నారు.. తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.తాము రూ.కోటి అడిగామని, రూ.25 లక్షలు, ఉద్యోగం ఇస్తామని మంత్రులు చెప్పారన్నారు. అది ప్రభుత్వ ఉద్యోగమా.. ప్రైవేటు ఉద్యోగమా అని అడగ్గా.. ప్రభుత్వ ఉద్యోగమేనని చెప్పారు. తమ కుటుంబాన్ని అన్ని విధాలుగా పోషించే వ్యక్తి చని పోయాడని, మూడేళ్ల క్రితం అల్లుడు కూడా చనిపోయాడని, చెల్లి పిల్లలను కూడా తమ కొడుకే సాకుతున్నాడని ఇప్పుడు అతడు కూడా చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు అప్పలనాయుడు, శాంతి గుండెలవిసేలా రోదిస్తూ చెప్పారు. తాము అండగా ఉంటామని, రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. బాధితుల తరఫున గట్టిగా మాట్లాడతామని పేర్కొన్నారు. -
కష్ట జీవులకు ఝలక్!
సాక్షి, అమరావతి: భవన నిర్మాణ, ఇతర అంసఘటిత రంగ కార్మికులు, కూలీల జీవితాలు కొద్ది నెలలుగా దుర్భరంగా మారాయి. అరకొర పనులు, అప్పుల బాధలు, కష్టాల సుడిగుండాల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులకు సైతం డబ్బు పుట్టక బతుకు భారంగా ఈడుస్తున్నారు. కష్టాన్ని నమ్ముకున్న కోట్ల మంది అర్ధాకలితో అలమటిస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ అలవిగాని హామీల వర్షం కురిపించి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. కొత్త పథకాలు అమలు చేయకపోగా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన పథకాలకు సైతం గండి కొట్టింది. కార్మిక శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.80 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. లెక్కల్లోకి రాని వారు మరికొన్ని లక్షల్లో ఉంటారు. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగంపై ఆధారపడిన తాపీ మేస్త్రీలు, కూలీలు, రాడ్ బెండర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వడ్రంగులు, పెయింటర్లు ఉన్నారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలప్పుడు భవన నిర్మాణ బోర్డ్‌ను పునరుద్ధరిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేస్తాం. అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, రుణాలు తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డ్ ఏర్పాటు చేస్తాం’ అని కూడా హామీ ఇచ్చారు. నేటి వరకు ఆ ఊసే ఎత్తలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సాయం ఇలా» వైఎస్సార్ కళ్యాణమస్తు కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష.. ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, బీసీల కులాంతర వివాహాలకు రూ.75 వేలు, షాధీ తోఫా కింద ముస్లింలకు రూ.1 లక్ష.. భవన, ఇతర నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు చొప్పున అందించారు. » వైఎస్సార్ బీమా పథకం కింద ప్రమాద మరణాల్లో బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, సహజ మరణాలకు రూ.లక్ష, వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షల చొప్పున ఇచ్చి ఆదుకున్నారు. » రిజిస్టర్ అవ్వని కార్మికులు ప్రమాదాల్లో మరణిస్తే రూ.5 లక్షలు, వైకల్యం సంభవిస్తే రూ.2.5 లక్షలు ఇచ్చారు. » జగనన్న అమ్మ ఒడి పథకం కింద ఇంటర్మీడియట్ వరకూ రూ.15 వేలు ఇచ్చారు. ఆపై ఉన్నత విధ్యకు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా మద్దతుగా నిలిచారు. వసతి దీవెన కింద ఇంజినీరింగ్, డిగ్రీ చదివే పిల్లలకు రూ.20 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున సాయం అందించారు.» అసంఘటిత రంగ కార్మిక కుటుంబాల్లోని వ్యక్తులు అనారోగ్యంబారిన సందర్భాల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకు వైద్య సేవలను పూర్తి ఉచితంగా అందించారు. పేరు మార్పు తప్ప సాయం లేదు» అసంఘటిత రంగ కార్మికులు, ఇతర బలహీన వర్గాల కుటుంబాల్లోని వ్యక్తుల సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణానికి రూ.10 లక్షలు బీమా అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వంలో అమలైన వైఎస్సార్ బీమా పథకానికి చంద్రన్న బీమాగా పేరు మార్చారు. అంతకు మించి పథకం అమలుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.» దీంతో సంపాదించే వ్యక్తి మరణించిన, అంగ వైకల్యానికి గురైన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. గత ప్రభుత్వంలో వైఎస్సార్ బీమా పథకం కింద 81 వేల కుటుంబాలకు రూ.876 కోట్ల మేర సాయం అందింది. ఈ ప్రభుత్వంలో అది పూర్తిగా నిలిచిపోయింది. » చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే ఈ పథకాలన్ని ఆగిపోయాయి. ప్రభుత్వం నుంచి కనీస భరోసా కరువై కార్మికుల జీవితాల్లో చీకట్లు అలముకున్నాయి. పిల్లల చదువులు, ఆడ బిడ్డల పెళ్లిళ్లు, అనారోగ్యం, ఇతర అవసరాలకు ప్రభుత్వం నుంచి సాయం లేక ఎన్నో అగచాట్లు పడుతున్నారు. » రాష్ట్రంలో భవన నిర్మాణ, ఇతర అసంఘటిత రంగ కార్మికులకు పటిష్టమైన జీవన ప్రమాణాలు మెరుగు పరచడం కోసం గత వైఎస్ జగన్ ప్భుత్వం నిర్మాణాత్మక సంక్షేమాన్ని అందించింది. వారి బిడ్డల విద్యకు ఊతమిచ్చింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఈఎస్ఐ పథకాల కింద ఉచిత వైద్య సేవలతో ఆరోగ్యాలకు భరోసాగా నిలిచింది. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందినా, వైకల్యం పొందినా.. ఉపాధి కోల్పోయే ఆ కుటుంబానికి బీమా ద్వారా ధీమా కల్పించింది. అమ్మ ఒడి, నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు, వసతి దీవెన, విద్యా దీవెన, చేదోడు, భరోసా, వాహన మిత్ర ఇలా డీబీటీ, నాన్‌డీబీటీ పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపింది. అరకొర పనులే కొన్నేళ్లుగా భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక అని ఆర్భాటం చేశారు. వాస్తవానికి ఇసుక ఉచితంగా దొరకడం లేదు. సిమెంట్, ఐరన్, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతున్నాయి. దీంతో కొత్త నిర్మాణాలకు పెద్దగా మొగ్గు చూపడం లేదు. వారం అంతా పని దొరకడం గగనంగా మారింది. దీంతో కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తోంది. – టి.నాగబాబు, సంతజూటూరు, నంద్యాల జిల్లాఆగిన ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వంలో మా ఊర్లో పేదల ఇళ్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున లేఅవుట్లు ఏర్పాటు చేశారు. వాటిలో వేలల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. దీంతో బయటకు ఎక్కడికి వెళ్లే పని లేకుండా ఊర్లోనే పనులు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చాక కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. పెయింటింగ్, ఉడ్వర్క్స్, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులపై ఈ ప్రభావం పడుతోంది. వారాలు, నెలల తరబడి ఇంటి పట్టునే ఉంటే మా కుటుంబాలు ఎలా గడుస్తాయి? నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లడం కూడా కష్టమవుతోంది. – ఆదాం, పెయింటర్, కృష్ణా జిల్లాఆదుకునే పథకాలేవీ? రోజూ ఉదయాన్నే బెంజ్ సర్కిల్ అడ్డా మీదకు పని కోసం వస్తాను. వారంలో మూడు రోజులు పని దొరకడం చాలా కష్టంగా ఉంటోంది. గతంలో ఈ పరిస్థితులు లేవు. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో జీవనం సాగిస్తున్నాం. ముఖ్యంగా పిల్లల చదువులు భారంగా మారాయి. గతంలో అమ్మ ఒడి, వసతి దీవెన కింద సాయం అందేది. ఇప్పుడు ఆదుకునే ఆ పథకాలు కూడా లేకుండా పోయాయి. – వెంకటేశ్, తాపీ మేస్త్రీ, విజయవాడ -
చంద్రబాబు పాలనలో.. జగన్ పాలనలో
-
బాబు ఏడాది పాలనలోనే ఇంతటి దారుణాలు చూడాల్సి వచ్చింది: వైఎస్ జగన్
విశాఖపట్నం, సాక్షి: చంద్రబాబు ఏడాది పాలనలోనే దారుణమైన పరిస్థితులు.. అదీ ఆలయాల్లో చూడాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం సింహాచలం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.సింహాచలంలో గోడ కూలిపోయి ఏడుగురు చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వైకుంఠ ఏకాదశి నాడు కూడా ఇలాగే చేశారు. నాడు తిరుపతిలో జరిగిన తోపులాటలో ఆరుగురు చనిపోయారు. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో ఈ ప్రభుత్వానికి తెలీదా?. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యం వహించారు. కనీస సౌకర్యాలు కూడా లేవని భక్తులు చెబుతున్నారు. ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. రెండు రోజుల కిందట పూర్తి చేశారు. పదడుగుల ఎత్తు.. డెబ్బై అడుగుల పొడవుతో గోడ కట్టారు. కనీసం ఎటువంటి టెండర్లు లేకుండా ఈ గోడ పని పూర్తి చేశారు. దాదాపుగా సంవత్సరం అయ్యింది చంద్రబాబు అధికారంలోకి వచ్చి. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకి తెలియదా?. జరుగుతుందని తెలిసి కూడా ముందే గోడ కట్టే కార్యక్రమం చేపట్టలేకపోయారు?. ముందస్తు ఏర్పాట్లపై ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు. మంత్రుల కమిటీ ఏం చేసిందసలు?. కాంక్రీట్ గోడతో కట్టాల్సిన చోట.. ఫ్లైయాష్ ఇటుకలతో నిర్మించారు. కనీసం నాణ్యంగా ఆ గోడను ఎందుకు నిర్మించలేకపోయారు?. వర్షం పడిందని తెలుసు. చందనోత్సవం సందర్భంగా ప్రతీసారి వర్షం పడుతుందని తెలుసు. అయినా రెండు రోజుల కిందట కట్టిన ఆ గోడ పక్కనే క్యూ లైన్ పెట్టారు. చంద్రబాబు ఏడాది పాలనలో దారుణాలు చూడాల్సి వస్తోంది. రాజకీయాల కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారు. తొక్కిసలాట ఘటనలో ఏడుగురిని బలిగొన్నారు. తిరుమల గోశాలలో గోవులు కూడా చనిపోయాయి. కాశినాయన గుడిని బుల్డోజర్లతో కూల్చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఆలయంలో తాబేళ్లు మృతి చెందాయి. అంతకు ముందు గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలిగొన్నారు. ఇన్ని జరుగుతున్నా చర్యలు లేవు. ఎందుకంటే అన్నింటిలోనూ చంద్రబాబే దోషి. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఈ ఘటనలోనూ నిందను మాపైకి నెట్టే యత్నం చేశారు. కానీ, వాళ్ల హయాంలో.. అదీ రెండు రోజుల కిందటే ఆ గోడ కట్టిందని తేలింది. అయినా చంద్రబాబులో ఎక్కడా పశ్చాత్తాపం కనిపించడం లేదు.ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇచ్చేదిగా ఉండాలి. మొక్కుబడిగా రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. జగన్ వస్తున్నాడనే ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం తప్పిదం కాబట్టి పరిహారం పెంచి ఇవ్వాలి. మా ప్రభుత్వంలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే.. బాధ్యతగా అధిక పరిహారం చెల్లించాం. ఈ బాధిత కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం వచ్చాక ఆ పని తప్పకుండా చేస్తాం’’ అని వైఎస్ జగన్ ప్రకటించారు. కానీ, బాధ్యులపైనా కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి పునరావృతం కావని చంద్రబాబుకి వైఎస్ జగన్ హితవు పలికారు. -
చంద్రబాబు, పవన్ అడుగుపెట్టిన నుండి అపశృతులే
-
Simhachalam Incident: రూ. కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్
-
ప్రభుత్వ వైఫల్యంతోనే సింహాచలం దుర్ఘటన: వెల్లంపల్లి
సాక్షి, హైదరాబాద్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో పాల్గొని, స్వామివారి నిజరూప దర్శనం కోసం వెళ్లిన భక్తులు ఏడుగురు గోడ కూలి దుర్మరణం చెందడం దురదృష్టకరమని దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సింహాచలం దుర్ఘటనకు కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే కారణమని హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన స్పష్టం చేశారు.హిందువుల మనోభావాలకు విఘాతం:సింహాచలం ఆలయంలో ఏటా ఆనవాయితీగా జరిగే చందనోత్సవాన్ని నిర్వహించడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కూటమి పార్టీలు హిందువులను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి. దేవాలయాల సంరక్షణ, వాటి అభివృద్ధితో పాటు, హిందువుల మనోభావాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది.2014–19 మధ్య కూడా చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో అత్యంత దుర్మార్గంగా పదుల సంఖ్యలో ఆలయాలను కూల్చడమే కాకుండా, ఆ దేవతామూర్తుల విగ్రహాలను మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్లలో తరలించి హిందువుల మనోభావాలు గాయపర్చారు. ఇంకా గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి రాజమహేంద్రవరంలో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారు. చంద్రబాబు సీఎం అయ్యాడంటే భక్తులు చనిపోవడం అనేది ఆనవాయితీగా మారింది.ప్రభుత్వ ఉదాసీనత. నాసిరకం పనులు:సింహాచలంలో చందనోత్సవానికి లక్షలాది భక్తులు వస్తున్నారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. తూతూమంత్రంగా నాసిరకంగా చేసిన పనుల కారణంగానే భక్తుల మరణాలు సంభవించాయి. చందనోత్సవం ఏర్పాట్లకు సంబంధించిన రివ్యూ మీటింగ్‌లో ఎమ్మెల్యేలు ఎవరికెన్ని పాసులు పంచుకోవాలని వాదించుకోవడంతోనే సరిపోయింది. అంతే తప్ప, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆలయం వద్ద భక్తుల రద్దీ తట్టుకునే తగిన ఏర్పాట్లపై ఎవరూ చొరవ చూపలేదు.మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్ అక్కడే ఉండి కూడా ఏర్పాట్లపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టలేదు. చివరకు టాయ్‌లెట్ సౌకర్యం కూడా కల్పించక పోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.ఏదో అపచారం:వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా, 40 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పుడు సింహాచలం స్వామివారి దర్శనం కోసం వచ్చి, ఏడుగురు మృత్యువాత పడ్డారు. వరసగా జరుగుతున్న దారుణాలు చూస్తుంటే, ఎక్కడో ఏదో అపచారం జరిగిందని మాత్రం అర్థమవుతుంది.పవన్‌కళ్యాణ్ ఇప్పుడు దీక్షలు చేయాలి:నాడు ఎక్కడా జరగని అపచారానికి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆర్భాటంగా ప్రాయశ్చిత్త దీక్షలు చేశారు. హిందూ మతానికి తానే బ్రాండ్ అంబాసిడర్‌ను అన్నట్లు ప్రచారం చేసుకున్నారు. కాగా ఇప్పుడు సింహాచలం, గత జనవరిలో తిరుపతిలో జరిగిన దారుణాలు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. పవన్‌కళ్యాణ్‌కు ఏ మాత్రం మానవత్వం ఉన్నా, ఆయన ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి.అలాగే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆలయాల్లో జరుగుతున్న అన్యాయాలపై ఇప్పుడు బయటకొచ్చి మాట్లాడాలి. తిరుమలలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. చెప్పులేసుకుని దర్శనానికి వస్తున్నారు. బిర్యానీలు తింటున్నారు. టీటీడీ గోశాలలో వందల సంఖ్యలో గోవులు చనిపోతున్నాయి. శ్రీకూర్మంలో విష్ణుమూర్తి రూపంగా భావించే నక్షత్ర తాబేళ్లు చనిపోతే చడీచప్పుడు కాకుండా కాల్చేశారు. పవన్‌కళ్యాణ్ ప్రకటించిన వారాహి డిక్లరేషన్ ఇదేనా? భక్తులు చనిపోవడం, ఆలయాల్లో అపచారాలు చేయడమేనా మీ ఉద్దేశం?.శిక్షించలేనప్పుడు కమిటీలెందుకు?:తిరుపతిలో తొక్కిసలాటపై దర్యాప్తునకు కమిటీ వేసిన ప్రభుత్వం ఏం తేల్చింది? తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకున్నారా? ఇప్పుడు మళ్లీ త్రిసభ్య కమిటీ వేశామంటున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించలేనప్పుడు కమిటీలు వేసి ఏం ప్రయోజనం? ఆలయాల్లో వరుసగా భక్తులు చనిపోతుంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోదా?. బాధిత కుటుంబాలకు ఏదో పరిహారం ఇచ్చి, క్షతగాత్రులకు వైద్యం చేయించి చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ, ఇది ఏ మాత్రం సరికాదని, భక్తుల మనోభావాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడటం మానుకోవాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. -
హవ్వ.. ఇంకో 44 వేల ఎకరాలా?
పిచ్చి ముదిరిందంటే.. తలకు రోకలి చుట్టమన్నాడట వెనుకటికి ఎవడో. అలా ఉంది ఏపీ ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు. రాజధాని పేరుతో ఇప్పటికే 33 వేల ఏకరాల భూమి సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఇంకో 44676 ఎకరాలు సేకరించాలని నిర్ణయించడం ఆందోళన కలిగిస్తోంది. రైతులపై మాత్రమే కాదు.. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలందరిపై పిడుగుపాటే. ఇప్పటికే సేకరించిన భూమిలో ఒక్క భవనాన్ని కూడా పూర్తి చేయలేదు. అన్నీ తాత్కాలిక నిర్మాణాలే. అయినాసరే.. ఇంకో 44 వేల పైచిలుకు ఎకరాలు సేకరించాలన్న నిర్ణయం ఏ రకంగా చూసినా సహేతుకం కాదు.ఈ నిర్ణయానికి వైఎస్సార్ కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలన్నీ తమ జేబు పార్టీలే అన్న ధీమాతో టీడీపీ ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రశ్నిస్తానని రాజకీయ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పని ఎప్పుడో మానేశారు. పురంధేశ్వరి వంటి స్థానిక బీజేపీ నేతలు సరేసరి. ఎన్టీయే వ్యతిరేకినని జాతీయ స్థాయిలో చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో పరోక్ష మద్దతుదారుగా మారిపోయింది.ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు సలహాలు, సూచనల మేరకే పార్టీని నడుపుతున్నారన్నది కాంగ్రెస్ వాదుల భావన. వామపక్ష పార్టీ సీపీఐ పైపైకి టీడీపీని విమర్శిస్తున్నట్లు కనిపిస్తున్నా, మానసికంగా చంద్రబాబుకే దగ్గరగా ఉన్న విమర్శ ఉంది. ఒక్క సీపీఎం మాత్రం కాస్తో, కూస్తో స్వతంత్రంగా ఉండే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇంత అడ్డగోలుగా నిర్ణయాలు చేయగలుగుతున్నారు. అమరావతి పేరుతో గత టర్మ్‌లో చంద్రబాబు నాయుడు 33 వేల ఎకరాలు సమీకరిస్తున్నప్పుడు కొంతమంది రైతులు స్వచ్ఛందంగానే ఇచ్చినా చాలా మంది తీవ్రంగా వ్యతిరేకించారు. భూ సేకరణను వ్యతిరేకించిన కొన్ని గ్రామాల వారికి పవన్ కళ్యాణ్ అప్పట్లో మద్దతిచ్చారు, చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కూడా. కానీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామయ్యాక ఆయన పన్నెత్తిన పాపన పోలేదు. పిఠాపురంలో శాంతిభద్రతల సమస్యపై తీవ్రంగా స్పందించిన తర్వాత ఏమైందో కాని, చంద్రబాబును పొగడడమే లక్ష్యంగా పెట్టుకుని పవన్ కళ్యాణ్ తన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డారు. ప్రభుత్వంలో జరిగే అవకతవకలు ఎత్తి చూపకుండా ఉండేందుకు ఏమైనా డీల్ కుదిరిందేమో!విశాఖతోసహా ఏపీ మొత్తమ్మీద రియల్ ఎస్టేట్ పెద్దగా పుంజుకుంది లేదు. అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం లేదన్న ఆందోళన ఇప్పటికే అక్కడి రైతులలో ఉంది. కృత్రిమంగానైనా పెంచేందుకు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ ఖర్చుపెట్టేందుకు ప్రయత్నించినా ఫలితం పెద్దగా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అదనంగా మరింత భూమి సేకరిస్తే డిమాండ్ భారీగా పడిపోతుంది.అమరావతి గ్రామాలలో విమానాశ్రయం ఏర్పాటైతే భూముల విలువ పెరుగుతాయంటూ చంద్రబాబు తాజాగా కొత్త పాట అందుకున్నారు. భూ సమీకరణ ద్వారా మూడు పంటలు పండే పచ్చటి పొలాలను ప్రభుత్వం బీళ్లుగా మార్చింది. తెలంగాణలో 400 ఎకరాల ప్రభుత్వ భూమి అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తేనే పర్యావరణవేత్తలు, వివిధ రాజకీయ పక్షాలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశాయి. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోడీ సైతం కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. అలాంటిది అమరావతిలో లక్ష ఎకరాల భూమిని అనవసరంగా తీసుకుంటున్న తీరుపై మాత్రం ఎవరూ కిమ్మనడం లేదు.చంద్రబాబు తన ఇంటి కోసం ఐదు ఎకరాలు కొనుగోలు చేసి, శంకుస్థాపన చేసిన విషయంలో కూడా మతలబు ఉండవచ్చన్న భావన ఉంది. రియల్ ఎస్టేట్ పెరగడానికి వీలుగా ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో టీడీపీ కూటమి ఓటమి పాలైతే, చంద్రబాబు కాని, ఆయన కుటుంబం కాని అమరావతిలోనే నివసిస్తుందా? ఎందుకంటే చంద్రబాబు లోకేశ్‌లు పేరుకు అక్కడ నివసిస్తున్నా, కుటుంబ సభ్యులు.. వారాంతాల్లో ఆయన కూడా హైదరాబాద్‌కు వచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ది కూడా అదే తీరు. చిత్రమేమిటంటే చంద్రబాబు అమరావతిలో గజం రూ.60 వేలకుపైగా ఉందని ప్రచారం చేస్తున్నా, ఆయన కుటుంబం మాత్రం ఐదెకరాల భూమిని గజం రూ.7500లకే కొనుగోలు చేసిందట. రిజిస్ట్రేషన్ అయితే గజం రూ.ఐదు వేలకే చేశారు.మరి చంద్రబాబు ప్రచారం చేసిన విధంగా రియల్ ఎస్టేట్ విలువలు లేవా? లేక చంద్రబాబు నిర్దిష్ట మొత్తం కాకుండా మిగిలిన దానిని భూ యజమానులకు బ్లాక్‌లో నగదు రూపంలో అందించారా అన్నది చర్చనీయాంశం. ఏభైవేల మంది పేదలకు గత ప్రభుత్వం సెంటు భూమి చొప్పున ఇస్తే, దానిని వెనక్కి లాక్కుంటున్న కూటమి ప్రభుత్వం, ధనవంతులకు మాత్రం ఎకరాలలో ఇళ్లు కట్టుకునే వెసులుబాటు కల్పిస్తోందన్న మాట. రైతుల గుండెలు గుభేలు మనేలా ప్రభుత్వం అదనపు భూమి సమీకరణకు సిద్దమవుతున్న తరుణంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబు సర్కారుకు వంత పాడుతూ కథనాలు ఇస్తోంది. ఈనాడు మీడియా ఎంత దారుణమైన కథనాన్ని ఇచ్చిందంటే రైతుల విజ్ఞప్తి మేరకే అదనంగా మరో 44 వేల ఎకరాల భూమి తీసుకోవాలని తలపెట్టారట.మంత్రి నారాయణను కలిసి వారు ఈ మేరకు కోరారట. మెడకాయ మీద తలకాయ ఉన్నవారెవరైనా ఈనాడు పిచ్చి రాతలను నమ్ముతారా? ప్రస్తుతం ఉన్న రాజధాని భూమిలో ప్రభుత్వానికి మిగిలేది రెండువేల ఎకరాలేనట.అది చాలదట. గతంలో పదివేల ఎకరాల భూమి మిగులుతుందన్నారు. ఇప్పుడు దానిని రెండువేలకు తగ్గించారు. అనేక సంస్థలు ఇక్కడ భూమి కావాలంటున్నాయట. నిజంగా ఇవన్ని జరిగి ఉంటే ఈ ఎల్లో మీడియా ఏ స్థాయిలో ఈపాటికి ఊదరగొట్టేవి! ఎవరిని మోసం చేయడానికి ఈ రాతలు? గతంలో చంద్రబాబు, ఎల్లో మీడియా ఏమని ప్రచారం చేశాయి? అమరావతికి అసలు ప్రభుత్వం డబ్బు రూపాయి ఖర్చు చేయనక్కర్లేదని, దానికి అదే సంపాదించుకుంటుందని కదా? కాని ఇప్పుడేమీ చేస్తున్నారు. బడ్జెట్లో రూ. ఆరు వేల కోట్లు కేటాయించారు. మరో రూ.ముప్పై వేల కోట్లు అప్పులు తీసుకు వస్తున్నారు. డబ్బై ఏడువేల కోట్లు అవసరం అవుతాయని చంద్రబాబు ఆర్థిక సంఘానికి తెలిపారు. కాని ఒక్క ఎకరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి సుమారు రూ.రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా. ఆ రకంగా చూస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలో లెక్క వేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నుంచి వసూలు చేసే పన్నులతో చేపట్టవలసిన ఈ అభివృద్ది పనులను ప్రభుత్వమే చేపడుతోందన్నమాట. ఇది ప్రైవేటు వ్యక్తులకే ప్రయోజనం తప్ప, ప్రభుత్వానికి కాదు. అప్పులు మాత్రం రాష్ట్రం అంతా ప్రజలు భరించాలి.సదుపాయాలు మాత్రం కొద్దిమంది ప్రైవేటు ఆసాములు పొందుతారన్నమాట. అందుకే ఇది రైతులపైనే కాదు.. ఏపీ ప్రజలపైనే పిడుగుపాటుగా పరిగణించాలనిపిస్తుంది. ఇంత చేసినా ప్రభుత్వం అమ్ముకోవడానికి భూమి సరిపోదట. అందుకే మళ్లీ భూమి తీసుకుంటారట. అంటే ఇంతకాలం అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసినట్లు వీరు ఒప్పుకుంటారా? అమరావతిలో మరో విమానాశ్రయానికి నాలుగైదువేల ఎకరాలు సేకరిస్తారట. ప్రస్తుతం 30, 40 కిలోమీటర్ల దూరంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అక్కడ విస్తరణకు కూడా భూమి తీసుకుంది. వారిలో పలువురికి అమరావతి గ్రామాలలో ప్లాట్లు ఇచ్చారు. ఇంతా చేసి ఆ విమానాశ్రయం కాదని మరోకటి కడతారట. ఉన్న ఎయిర్ పోర్టును వృథాగా పెట్టి కొత్తది కడతారట.ఇప్పటికే పచ్చటి పొలాలను బీడు పెట్టి, రైతులకు కౌలు రూపంలో ఏటా వందల కోట్లు చెల్లించవలసి వస్తోంది. మళ్లీ అదే ప్రకారం భూముల సేకరణ చేస్తే రైతులు ఎంతవరకు సిద్దపడతారాన్నది అనుమానమే. ఒకవేళ రైతులు తమ భూములు ఇవ్వబోమని అంటే చంద్రబాబు వద్ద ఎటూ తన కుమారుడు లోకేశ్ రెడ్ బుక్ ఉంటుంది. పోలీసులను ప్రయోగించి రైతులను వేధించవచ్చు. కిందటిసారి కూడా అలాగే చేశారు. అయితే ముందుగా తమకు అనుకూలంగా ఉన్న గ్రామాలలో భూములు సమీకరిస్తారట. ఆ తర్వాత మిగిలిన గ్రామాలపై పడతారట. రాజధాని పేరుతో తమ భూములకు ఎసరు పెట్టలేదులే అనుకున్న రైతులకు ఇది షాకింగ్ వార్తే అని చెప్పాలి. ఈ పరిస్థితిని వారు ఎలా ఎదుర్కుంటారో చూడాల్సిందే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబు ట్వీట్ కు దిమ్మదిరిగే కౌంటర్లు బయటపెట్టిన జర్నలిస్ట్ కృష్ణంరాజు
-
విడుదల తరువాత గోరంట్ల మాధవ్ రియాక్షన్
-
తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..
సాక్షి, విశాఖపట్నం: తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే.. సింహాచలంలో మరో ఘోర విషాదం జరిగింది. సింహాచలం అప్పన చందనోత్సవంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా.. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. ఘటన జరిగిన సమయంలో ఒక్క పోలీసు కూడా కనిపించలేదు.. భక్తులను ఆదుకోవడానికి ఒక్క ఎండోమెంట్ ఉద్యోగి కూడా అక్కడ లేరు. అందుబాటులో ఉన్న వాలంటీర్లు, భక్తులు మాత్రమే సహాయక చర్యలు చేపట్టారు. కటిక చీకటిలో భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో అంతా అంధకారం అలుముకుంది. గోడ కూలిపోవడంతో భక్తుల అరుపులు, రోదనలు మిన్నంటాయి. అప్పటికే భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ఘటనపై పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకుంటున్నాం. సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరుదు కల్యాణి అన్నారు. కటిక చీకట్లో భక్తుల కోసం క్యూలైన్లా?. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే. ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెడుతోందని ఆమె అన్నారు.మరోవైపు, సింహాచలం ఘటనపై వీహెచ్‌పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని.. నిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని మండిపడింది.సింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్ నడుస్తోంది. ఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్త.. భగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపని.. హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. పాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోంది.. చందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్ లేదు’’ అంటూ వీహెచ్‌పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఆంధ్రప్రదేశ్‌లో అంతులేని అవినీతి, అంతా అరాచకమే... చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
గజం రూ.లక్షల్లో ఉంటే ఎకరా 99 పైసలకే ఇచ్చేస్తారా?
డాబాగార్డెన్స్: విశాఖ నగరంలో గజం స్థలం రూ.లక్ష, రూ.లక్షన్నర ఉంటే.. ఎకరా భూమిని 99 పైసలకే ఇవ్వడంలో ఆంతర్యమేంటని యూపీఎస్సీ మాజీ ఇన్చార్జి చైర్మన్ ప్రొఫెసర్ కేఎస్ చలం, పర్యావరణ ఉద్యమ కార్యకర్త సోహన్ హటంగడి, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖ ప్రజలంటే కూటమి ప్రభుత్వానికి చులకనగా ఉందని, ఇది పెద్ద భూ కుంభకోణమని, దీని వెనుక అధికార పార్టీ నాయకుడి హస్తం ఉందని ఆరోపించారు. ఈ భూముల విషయంపై చంద్రబాబు స్పందించకపోవడం శోచనీయమన్నారు.విశాఖలో ప్రభుత్వ భూములు, ఆస్తుల బదలాయింపుపై వార్వా నివాస్ ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రొఫెసర్ కేఎస్ చలం మాట్లాడుతూ ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకుని పెట్టుబడిదారులు మన ఆస్తులు, భూములు కొట్టేస్తున్నారని, మనపై పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డిరు. విస్తారంగా ఉన్న రక్షిత అడవుల్ని, తీర ప్రాంతాన్ని కూడా చేజిక్కించుకుంటున్నారని అన్నారు. టాటా ఏమైనా పేద సంస్థా? పర్యావరణ కార్యకర్త సోహన్ హటంగడి మాట్లాడుతూ విశాఖకు ప్రాణవాయువు సరఫరా చేసే ప్రాంతాన్ని ఎకరా 99 పైసలు చొప్పున 22 ఎకరాలు టాటా (టీసీఎస్) కంపెనీకి ఇచ్చేయడానికి టాటా ఏమన్నా పేద సంస్థా? అని ప్రశ్నించారు. ఇది చాలా అన్యాయమని, నగరంలోని పచ్చని ప్రదేశాల్ని కాంక్రీట్ అడవులుగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్కే బీచ్ నుంచి హార్బర్ పార్క్ వరకు 14 ఎకరాల్లో లూలు మాల్ పెడితే ఆ ప్రాంతం, పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ట్రాఫిక్‌తోపాటు, కాలుష్యం భయంకరంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.తక్షణమే ఉపసంహరించుకోవాలి మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అని, ప్రజల భూమిని ప్రజా ప్రయోజనం కోసం వినియోగించాలని సూచించారు. ఉపాధి కల్పిస్తామనే ఉత్తుత్తి హామీలతో విశాఖలో భూముల్ని కార్పొరేట్లకు ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో ఇలాగే భూములు ఇచ్చారని, కానీ ఉద్యోగాలు మాత్రం కల్పించలేదన్నారు. అభివృద్ధి పేరిట భూముల అమ్మకం నగర వినాశనానికే దారి తీస్తుందన్నారు. ఇటువంటి నిర్ణయాల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రజా మద్దతుతో తిప్పి కొడతామని హెచ్చరించారు. వార్వా అధ్యక్షుడు ఎన్.ప్రకాశరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో వార్వా ప్రధాన కార్యదర్శి బీబీ గణేష్, నివాస్ అధ్యక్షుడు బి.గురప్ప, ప్రధాన కార్యదర్శి పిట్టా నారాయణమూర్తి, హరి ప్రసాద్, బీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీలో పారని బాబు పాచిక!
సాక్షి, అమరావతి : బీజేపీ రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారులో ముఖ్యమంత్రి చంద్రబాబు నడిపిన మంత్రాంగం పని చేయలేదు. ఆయన్ను పట్టించుకోకుండా పార్టీకి చెందిన ముఖ్య నేత పాకా సత్యనారాయణను బీజేపీ అగ్ర నాయకత్వం ఎంపిక చేసింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని బీజేపీలో తనకు అనుకూలంగా ఉండే వారికి ఇప్పించుకోవడానికి చంద్రబాబు తెర వెనుక శాయశక్తులా ప్రయత్నించినట్లు తెలిసింది. ఇటీవల రెండుసార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ఈ విషయం గురించి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో మాట్లాడినట్లు సమాచారం. కానీ వారు చంద్రబాబు సూచనను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఆయన ఒక నాయకుడి పేరు చెప్పి ఆయనకు ఇస్తే కూటమికి ఉపయోగం ఉంటుందని తన మాయజాలంతో బీజేపీ పెద్దలను ఒప్పించేందుకు యత్నించారు. ఆ వ్యక్తికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించేందుకు బీజేపీలోని తన మనుషులతో గట్టి లాబీయింగ్ కూడా చేయించారు. బీజేపీలో ఉంటూ చంద్రబాబు కోసం పనిచేసే నేతలు అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వారంతా చంద్రబాబు సూచించిన వ్యక్తికి సీటు ఇప్పించేందుకు గట్టిగా ప్రయత్నించారు. కానీ బీజేపీ పెద్దలు మాత్రం అవేమీ పట్టించుకోకపోవడం విశేషం.రకరకాల ప్రచారాలు..ఎత్తులుతాను సూచించిన అభ్యర్థికి రాజ్యసభ అభ్యర్థిత్వం వచ్చే అవకాశం లేదని తెలిశాక, మొదటి నుంచి బీజేపీలోనే ఉంటూ ఇప్పుడు రేసులో ఉన్న నాయకుల్లో తనకు అనుకూలంగా ఉండే ఒక నేతను చంద్రబాబు ప్రోత్సహించినట్లు తెలిసింది. ఒక దశలో ఈ సీటును తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలైకి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ బీజేపీ అనూహ్యంగా భీమవరానికి చెందిన ఆ పార్టీ సీనియర్ నేత పాకా సత్యనారాయణను ఎంపిక చేసింది. ఈ పేరు ఖరారైన తర్వాతే ఆయన గురించి అందరికీ తెలిసింది. నిజానికి ఒరిజినల్ బీజేపీకి చెందిన నేతలు చాలా మంది మాత్రం ఆయనకు అవకాశం ఉంటుందని భావించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆయన పేరు బలంగా వినిపించింది. కానీ ఆ సీటును సోము వీర్రాజుకు కేటాయించారు. దీంతో ఇప్పుడు పాకా సత్యనారాయణకు రాజ్యసభ అవకాశం దక్కింది. ఈయనతో పాటు ప్రస్తుత కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, సోము వీర్రాజు వంటి వారంతా సుదీర్ఘకాలం నుంచి బీజేపీలో ఉంటూ ఆ పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేస్తున్న వారుగా పేరుంది. చంద్రబాబుకు షాకే!చంద్రబాబు బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా తనకు అనుకూలంగా ఉండే వారిని విడతల వారీగా బీజేపీలోకి పంపారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వంటి చాలా మంది చంద్రబాబు అనుయాయులే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చంద్రబాబుకు స్వయానా వదిన. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీలో సగం మంది చంద్రబాబు వర్గానికి చెందిన వారే కనిస్తారు. తద్వారా బీజేపీకి కేటాయించిన ఏ పదవినైనా తన వర్గంలోని ఎవరో ఒకరికి ఇప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిసూ్తనే ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆయన మనుషులకే పదవులు కూడా దక్కాయి. కానీ కొద్ది కాలంగా బీజేపీ బాబు వ్యవహారాన్ని గమనించి సొంత నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి పదవి, సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ, ఇప్పుడు పాకా సత్యనారాయణకు రాజ్యసభ పదవులు దక్కాయి. ఈ నిర్ణయాలు ఒకరకంగా చంద్రబాబుకు షాక్‌లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
హామీల అమలులో ‘కూటమి’ ఘోర వైఫల్యం: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ‘వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్’గా వైఎస్సార్సీపీ పని చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించారని మాజీ మంత్రి, పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున వెల్లడించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారుఆ బాధ్యత పార్టీపై ఉంది:రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్దేశించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, ప్రజాసమస్యలపై ఉద్యమించేందుకు సిద్దంగా ఉండేలా పార్టీని సమాయత్తం చేయాలని ఆయన ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమై, ప్రజల గోడు పట్టించుకోని నిర్లక్ష్యం తాండవిస్తోందని, దీనిపై ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని జగన్ గుర్తు చేశారు.వాటిపై దృష్టి సారించాల్సి ఉంది:రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారికి వైఎస్సార్సీపీ అండగా ఉండాలనే కోణంలో సమావేశంలో జగన్ పలు అంశాలు నిర్దేశించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ, కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయడంతో పాటు, పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. నియోజకవర్గ సమన్వయకర్త నుంచి మండల స్థాయి వరకు పార్టీ శ్రేణులు పూర్తి సమన్వయంతో పని చేయాలని కోరారు.హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలి:రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. బాధితులకు అన్యాయం జరుగుతున్న ప్రతిచోటా వైయస్ఆర్సీపీ ఉండాలని వైయస్ జగన్ సూచించారు. ప్రజలకు కూటమి పార్టీలు 143 వాగ్ధానాలను ఇచ్చాయి. సూపర్ సిక్స్ కాస్తా గాలికి వదిలేశారు. గత వైయస్ఆర్సీపీ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు, ప్రజల జీవన ప్రమాణాల్లో తీసుకువచ్చిన మార్పులను మరోసారి గుర్తు చేసుకోవాలి.ఇప్పుడు వాగ్దానాల అమలు అనేది ఎక్కడా లేదు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోంది. సంక్షేమ పథకాలు పేదలకు చేరువ కావడం లేదు. విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పేదలు తమ పిల్లలను చదివించుకోలేక, బడికి పంపాల్సిన పిల్లలను కూలికి పంపుతున్నారు. ఇటువంటి స్థితిలో వైయస్సార్సీపీ వారికి అండగా నిలబడుతుంది.రైతుల్లో భరోసా కల్పించాలి:రైతులను పట్టించుకునే తీరికే కూటమి ప్రభుత్వానికి లేదు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో రైతేరాజుగా ప్రాధాన్యత ఇచ్చాం. రైతుభరోసా ద్వారా రైతులకు అండగా నిలిచాం. విత్తనం నంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా ఆనాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకుంది. నేడు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవలే గుంటూరు మిర్చియార్డ్‌కు వెళ్ళిన వైఎస్ జగన్‌కి మిర్చిరైతులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. దీనిపై వెంటనే సీఎం చంద్రబాబు స్పందించి కేంద్రానికి ఒక లేఖ రాసి, కేంద్రం ద్వారా మిర్చి కొనుగోళ్లు చేయిస్తామంటూ ఒక ప్రకటన చేసి, చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత మిర్చి రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.ఇప్పుడు మిర్చి రైతులు కనీస ధరలు లేక, అప్పులపాలై దారుణ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మిర్చి రైతులకు అండగా వైయస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడంతో పాటు, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకంగా మిర్చి రైతులను ఆదుకుంటామో కూడా వారికి ఒక భరోసాను కల్పించాలని వైఎస్ జగన్ నిర్ధేశించారు.పొగాకు రైతుల గోడు కూటమి సర్కార్‌కు పట్టడం లేదు:పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పొగాకు రైతులు తమ పంటను వ్యాపారులు కనీస మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయడం లేదని చెబితే, సదరు వ్యాపారుల ఫ్యాక్టరీలకు కరెంట్ తీసేస్తాను అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడారు. పొగాకు రైతులను అప్పటికప్పుడు నమ్మించి పంపి, ఆ తరువాత వారి గోడును కనీసం పట్టించుకోని ఘనుడు చంద్రబాబు.అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పొగాకు రైతుల విజ్ఞప్తులకు స్పందించి వ్యాపారులు తప్పకుండా కొనుగోలు చేయాలని, లేని పక్షంలో మేమే కొనుగోలు చేస్తామని చెప్పి, మార్క్‌ఫెడ్ ద్వారా రూ.200 కోట్లకు పైగా వెచ్చించి మద్దతు ధరకు కొనుగోలు చేయించారు. అదీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ది. ఈరోజు మార్కెట్లో క్వింటా పొగాకు రూ.36 వేలు ధర పలకాల్సి ఉండగా, మార్కెట్లో రూ.22 వేలకు కూడా కొనడం లేదు. అందుకే పొగాకు రైతుల పక్షాన ఉద్యమించడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉండాలని సమావేశంలో వైఎస్ జగన్ నిర్దేశించారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున వివరించారు. -
AP ఫైబర్ నెట్ క్లోజ్? రోడ్డున పడ్డ ఆపరేటర్లు
-
LIVE: YSRCP జిల్లా అధ్యక్షులతో YS జగన్మోహన్రెడ్డి భేటీ
-
Amaravati: రాజధాని అవసరాలకు మరో 44,676 ఎకరాల భూసేకరణ!
-
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కూటమిలో ఫ్లెక్సీ వార్
-
YSRCP అధికార ప్రతినిధులకు సజ్జల దిశానిర్దేశం
-
Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
చంద్రబాబు వికృత రాజకీయ క్రీడను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సాక్షి, అమరావతి: రాజకీయం పేరుతో సీఎం చంద్రబాబు సాగిస్తున్న వికృత క్రీడను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులపై ఉందని పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులతో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘చంద్రబాబు పాలనలో జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి.దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఏం చేశామన్నది మాత్రమే రాజకీయ పార్టీ పనితీరుకు ప్రాతిపదిక అవుతుందని బలంగా నమ్మారు. చంద్రబాబు మాత్రం మీడియా ద్వారా ప్రజలను ప్రలోభపెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింత ఎక్కువగా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్లో వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. టీడీపీ అనుకూలంగా ఓటు వేసింది. కానీ, టీడీపీ తిరిగి వారి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ద్వారా వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారం చేసింది.టీడీపీ వాళ్లు చేసిన స్కామ్‌లకు ఆధారాలున్నా వాటిపై కూడా ఫేక్ ప్రచారం చేస్తూ ప్రజలు ఆలోచించే అవకాశం లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో పై స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బందిపోట్ల తరహాలో ఇసుక, కాంట్రాక్టులు, నామినేటెడ్ పనుల్లో దోపిడీ చేస్తున్నారు. అమరావతి పేరుతో అంచనాలు పెంచి దోచేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రకటిస్తూ మొబిలైజేషన్ అడ్వాన్సులు ప్రవేశపెట్టి దాని ద్వారా మొదట్లోనే కమీషన్లు దండుకుంటున్నారు. ప్రాజెక్టులు వచ్చినా, రాకపోయినా అడ్వాన్సుల పేరిట దోచుకుంటున్నారు. ఇవి ప్రజల దృష్టిలో పడకుండా డైవర్షన్ కోసం వైఎస్సార్సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. అధికారంలో ఉండగా వైఎస్ జగన్ నిబద్ధతతో కూడిన రాజకీయం చేశారు.పేదలకు, సంపన్నులకు మధ్య అంతరాలు తగ్గించడం, నిజమైన ప్రజాస్వామ్యంలో మహాత్మా గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించడం కోసం ఏం చేయాలో... అది చేసి చూపించిన నాయకుడు వైఎస్ జగన్. ఐదేళ్లు జగన్ పాలనలో కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమాన్ని చూశాం. చంద్రబాబు పాలనలో టీడీపీ కార్యకర్తలు, నేతల ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
ఈ ప్రశ్నకు జవాబు ఉందా?
ఒక సీజనల్ పొలిటీషియన్ ఎంత ‘లోతు’ తక్కువ రాజకీయాలు చేయగలిగితే,అంతలా వేగంగా మాటలు మారుస్తూ, ఎన్నాళ్ళు అయినా ఎలాగోలా అధికా రంలో ఉండగలడు. అయితే ఒక లీడర్‌గా వారి స్థాయి ఏమిటి అనేది రేపు చరిత్ర ఎటూ రికార్డు చేస్తుంది. తమదొక ‘పొలిటికల్ ఫిలాసఫీ’ అని ఇటువంటివారు నమ్మబలికితే, ‘అదే మని’ ఎవరూ ప్రశ్నించరు. అదేమిటో చెప్పలేక పోయినా, అదేమిటో ఎవరికీ తెలియకపోయినా, అప్పటికే దాని నుంచి ఫలాలు కోసుకునే వర్గం వారి వెనుక తమ ‘టర్న్’ కోసం కనిపెట్టుకుని ఉండి గుంపుగా తయారై ఆ నాయకునికి సమర్థన కూడా మొదలవుతుంది. విషయాల లోతులు మనకు అక్కర లేనప్పుడు, ఆ మేరకే మన ఎంపికలు కూడా ఉంటాయి. అక్కడ ఎక్కువ ఆశించడం తప్పు. ఇటువంటి చోట – ‘నువ్వు నన్ను నమ్మనప్పుడు, నిన్ను నేను మాత్రం ఎందుకు నమ్మాలి?’ అనే లాజిక్ నాయకునికి ఎటూ ఉంటుంది. ఇలా పరస్పర విశ్వాసాలు లేకుండానే ఎన్నికయిన నాయకులకు ఈ అధి కారం, తమకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని వారు అను కోరు కనుక ఇప్పటికి ఇదే ప్రస్తుతం.బ్రిటిష్ పాలన తర్వాత కూడా యాభై–అరవై దశకాల్లో భూమి–నీరు–వ్యవసాయం కేంద్రితంగా మన రాష్ట్ర రాజకీయాలు ఉండేవి. కారణం ప్రజలు జీవన సంస్కృతి ఆ రెండింటి చుట్టూనే ఉండేది. అయితే, డెబ్బై దశకంలో వచ్చిన ‘జై ఆంధ్ర’ ఉద్యమ రూపంగా పొడచూపిన 1972 నాటి సాంఘిక సంజ్ఞను సకాలంలో మనం అర్థం చేసుకోలేక పోయాం. అప్పుడే దాన్ని గుర్తించి దాన్ని ‘అడ్రెస్’ చేసి ఉంటే, మన పరిస్థితి మరోలా ఉండేది. అప్పట్లో ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు మొదలైన రైతు కుటుంబాల యువత ఉపాధి వలసల తీవ్రత తగ్గేది. ఆ వలసల ఒత్తిడితో ఆ దశకం చివర 1978లో కొత్తగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటు అవసరం అయింది. రంగా రెడ్డి ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ వద్ద ఆంధ్రుల రద్దీతో విషయం అర్థమయినా అప్పటికే ఇక్కడ కొత్తగా మహిళా కళాశాలలు కూడా మొదలయ్యాయి.ఏమైంది, గుప్పిట్లోని ఇసుకలా కాలం కళ్ళముందు అలా జారిపోయింది. వెనక్కి తిరిగివచ్చి చూసుకుంటే, ఒకప్పటి తయారీ రంగం ఉపాధి అవకాశాల్ని ‘సర్వీస్ సెక్టార్’ ఆక్రమించాక, మూడు దశాబ్దాలుగా ఎక్కడా నిలకడ లేని ఉపాధిరంగం మిగిలింది. ఇప్పుడు ఉన్నది భుజానికి సంచి (షోల్డర్ బ్యాగ్ఎంప్లాయ్మెంట్) ఉపాధి. ఇక్కడ ఉద్యోగే కాదు,కంపెనీ అధిపతిది కూడా అమూర్త (రూపం తెలి యని) స్థితే. ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారో అది ఎన్నాళ్ళో తెలియని స్థితి.అయినా ‘లీడర్’ అంటే ప్రజలు–ప్రాంతము పక్షంగా నిలబడి, అక్కడి సామాజిక పర్యావరణానికి తగిన ‘జియో–ప్లానింగ్’తో అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన వాతావరణం సృష్టించాలి. మన ప్రయోజనాలు కాపాడుకుంటూనే, మనవి కాని బయట పవనాల వేగాన్ని అతడు ఎదుర్కోవాలి. అది లేకపోగా ముప్పై ఏళ్ళుగా ఏదొచ్చినా అదంతా నా వల్లనే అని ‘క్లెయిం’ చేసుకునే పరిస్థితి. ఇక్కడే అస్సలు ఒక నాయకుడి మూలాలు ప్రశ్న అవుతున్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు (74) కాలం చూస్తే, 1995 నుంచి తొమ్మిదేళ్లు; మధ్యప్రదేశ్ దిగ్విజయ్ సింగ్ (78) 1993 నుంచి పదేళ్ళు, శరద్ పవార్ (84) మహరాష్ట్రలో 1988 నుంచి 1995 వరకూ కనిపిస్తారు. వీరిలో చంద్రబాబుది తప్ప మిగతా ఇద్దరిదీ రాజకీయ కుటుంబ నేపథ్యం. దిగ్విజయ్ సింగ్ తండ్రి 1951లో శాసనసభ్యులు, శరద్ పవార్ తండ్రి 1937–1952 మధ్య మూడుసార్లు జిల్లా బోర్డు సభ్యుడు, ఖాదీ, సహకార చక్కెర రైతు సంఘాల రాష్ట్ర నాయకుడు. అయితే, ఈ కాలంలో స్వయం ప్రతిభతో ఎదిగిన నాయకుడు లాలూప్రసాద్ యాదవ్. పట్నా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా చేస్తూ 1977లో 29 ఏళ్లకే ఎంపీగా పార్లమెంట్‌లోకి వెళ్ళిన అరుదైన చరిత్ర ఆయనది. బిహార్‌పై వీరి బలమైన ప్రభావం 1990–1997 వరకూ ఉంది. ఆయన సతీమణి రబ్రీదేవి ప్రభావం 2000–2005 వరకూ కనిపిస్తుంది. స్వాతంత్య్రం తర్వాత ఈ దేశం గురించి సమీక్ష అంటే, దాన్ని మండల్ కమీషన్ నివేదిక అమలు, పి.వి. నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ఈ పూర్వరంగంలో విధిగా చూడాలి. అలా ‘లాలూ– బిహార్’ లోతుల్ని కనుక వెతికితే ఏముంది? ఒక ప్పుడు ఆసియా జ్ఞాన కేంద్రాలకు నెలవైన బిహార్‌లో ‘రీ మ్యాపింగ్ ఇండియా’ మొదలై– జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ అనే మరో రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.వీరితో పోల్చినప్పుడు జగన్ మోహన్ రెడ్డికి సీఎంగా గత అనుభవం లేదు, అయినా ‘జై ఆంధ్ర’ ఉద్యమ 50 ఏళ్ళ చరిత్ర తర్వాత, జరిగిన రాష్ట్ర విభజన వల్ల ‘పరిపాలన–అభివృద్ధి–సంక్షేమం–ఉపాధి’ రాష్ట్రం అంచులకు చేరేలా ‘జియో–ప్లానింగ్’ చేశారు. మరో 13 జిల్లాలు ఏర్పాటు చేసి, 26 జిల్లాలతో తన వికేంద్రీకరణ పని మొదలు పెట్టారు. ఆ పాలనలోని మంచి–చెడులు గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. అది సహజం కానీ, పార్టీలకు రాజకీయా లకు బయట ఉండి రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలో చించేవారు, ఏపీకి కీలకమైన కాలంలో తాము ఎంత బాధ్యత కలిగిన పౌరసమాజంగా ఉన్నాం? అనే ప్రశ్నకు మాత్రం జవాబు వెతుక్కోవలసి ఉంటుంది.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
రాజధానిలో మరిన్ని భూములు సమీకరణ
సాక్షి, అమరావతి: రాజధానిలో మరిన్ని భూములు సమీకరించాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం నిర్మాణాలకు మరికొంత భూమి అవసరం అని.. దీనికి అనుగుణంగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ‘‘హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూ సేకరణ జరిగినప్పుడు 5 వేల ఎకరాలు ఎందుకని కొందరు ప్రశ్నించారు. కానీ, నాడు ముందుచూపుతో సేకరించినందునే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణంతో పాటు పెద్ద హోటళ్లు, మాల్స్ వచ్చి ఎకనమిక్ యాక్టివిటీ పెరిగింది. చుట్టుపక్కల భూములకు విలువ పెరిగి రైతులకు మేలు చేకూరింది’’ అని అన్నారు. అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు సోమవారం తన నివాసంలో సమావేశమయ్యారు.రాజధాని అవసరాలకు అదనంగా భూ సేకరణ సహా పలు అంశాలను చర్చించారు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా, వారికి నష్టం జరిగేలా ఏ కార్యక్రమం, నిర్ణయం ఉండదని సీఎం తెలిపారు. అదనపు భూసేకరణ కారణంగా ఈ ప్రాంతంలో ధరలు పడిపోతాయనే అపోహలకు గురికావద్దన్నారు. తనకు, రైతులకు మధ్య దూరం ఉండదని చెప్పారు. ‘కృష్ణా నదిపై మరో మూడు నాలుగు వారధులు కూడా వస్తాయి. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు వస్తాయి. ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. రాజధాని విస్తరించి పెద్దఎత్తున సంస్థలు, పెట్టుబడులు వస్తాయి.మీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ జరగదు’’ అని సీఎం పేర్కొన్నారు. రాజధాని ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని రైతులు కోరగా... శాతవాహన కాలం నుంచి అమరావతి ఉద్యమం వరకు జరిగిన పరిణామాలన్నీ క్రోడీకరిస్తూ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. రాజధాని పరిధిలోని గ్రామ కంఠాల్లో ప్రస్తుతం నివాసం ఉంటూ పట్టాలేని వారికి పట్టాలివ్వాలని అభ్యరి్థంచగా, దీన్ని కూడా త్వరలోనే చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. ⇒ అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి రావాలంటూ రాజధాని రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వనించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు అని.. రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య అడుగు అవుతుందని సీఎం చెప్పారు. రైతుల త్యాగం కారణంగానే నేడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేసుకుంటున్నామని, రైతుల మంచి మనసును ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి కేటాయించే ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజధానిలో జరిగే ప్రతి కార్యక్రమం, పనుల్లో భాగస్వామ్యం కావాలని రాజధాని గ్రామాల రైతులను చంద్రబాబు ఆహ్వనించారు. సమావేశంలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.బయటపడిన బాబు భూ దాహం రాజధాని అవసరాలకు మరో 44,676 ఎకరాలు సమీకరించనున్నట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం లీక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు భూ దాహం రాజధాని రైతులతో నిర్వహించిన సమావేశంలోనే బయటపడింది. ప్రభుత్వ భూమితో కలిపి ఇప్పటికే రాజధాని అవసరాలకు సీఆర్డీఏ చేతిలో 53,749 ఎకరాలున్న విషయం తెలిసిందే. ఇందులో రైతుల నుంచి సమీకరించిన భూమి 34,566 ఎకరాలు ఉంది. ఇంత భూమి ఉన్నప్పటికీ అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాల పేరుతో మరో 44 వేల ఎకరాలకు పైగా భూములను రైతుల నుంచి తీసుకోవాలని ముందుగా నిర్ణయించుకున్న తరువాతనే చంద్రబాబు ప్రభుత్వం మీడియాకు లీకు ఇచ్చింది.ఈ విషయం సోమవారం రైతులతో సీఎం నిర్వహించిన సమావేశంలోనే బట్టబయలైంది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధి లో మరిన్ని గ్రామాలలో భూములు సమీకరించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసేసుకుని.. ఇప్పుడు భూముల విలువ పెరగాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం నిర్మాణం పేరు చెబుతోంది. అవి చేపట్టడానికి అవసరమైన భూములను రైతుల నుంచి తీసుకుంటామని రైతుల సమావేశంలో సీఎం చెప్పడం గమనార్హం. -
రద్దు దిశగా ఆప్కాస్!
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఔట్‌సోగ్ ఉద్యోగుల జీవితాలతో మళ్లీ ఆటలు మొదలుపెట్టింది. చిరుద్యోగుల పొట్టకొట్టి అస్మదీయులకు చెందిన ప్రైవేటు ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఔట్‌సోగ్ విధానాన్ని సమీక్షించేందుకంటూ ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్స్డ్ సర్వీసెస్(ఆప్కాస్)ను రద్దు చేసి.. మళ్లీ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తే తమ జీవితాలు రోడ్డున పడతాయని చిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆప్కాస్‌తో చిరుద్యోగులకు భద్రత..గతంలో చంద్రబాబు హయాం(2014–19)లో ప్రైవేటు ఏజెన్సీలు, దళారుల చేతుల్లో చిరుద్యోగుల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఔట్‌సోగ్ ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇవ్వకుండా ప్రైవేట్ ఏజెన్సీలు వేధించేవి. ఐదు శాతానికి పైగా కమీషన్లు తీసుకోవడంతో పాటు ఇష్టానుసారంగా ఉద్యోగులను తొలగించేవి. అనంతరం ఏర్పడిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఔట్‌సోగ్ ఉద్యోగుల నియామకాలు, జీతాల చెల్లింపుల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు.. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఆప్కాస్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారానే ఔట్‌సోగ్ ఉద్యోగుల నియామకాలు జరిగేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తద్వారా ప్రైవేట్ ఏజెన్సీల వేధింపులు, కమీషన్ల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు విముక్తి కల్పించింది. దీని ద్వారా లక్ష మంది ఔట్ సోగ్ ఉద్యోగులు వివిధ శాఖల్లో పనిచేస్తుండగా..లంచాలు అనే ప్రసక్తే లేకుండా ఠంచన్‌గా ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు అందేవి. ఈపీఎఫ్,ఈఎస్ఐ వంటివి కూడా ప్రతి నెలా సక్రమంగా జమ అయ్యేవి. విరమించుకోకపోతే.. ఉద్యమిస్తాంతాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఔట్‌సోగ్ ఉద్యోగులపై కక్ష కట్టింది. ఆప్కాస్‌ను రద్దు చేసి.. తమ ఏజెన్సీల ద్వారా ఔట్‌సోగ్ ఉద్యోగులను నియమించుకునే ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగానే మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిందని చిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తద్వారా ప్రైవేటు ఏజెన్సీలతో పాటు తమ జేబులు కూడా నింపుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏపీఐఐసీ, మారిటైమ్ బోర్డులలో పనిచేస్తున్న చిరుద్యోగులను తొలిగించిందని.. ఇప్పుడు ఆప్కాస్ రద్దు ద్వారా తమ పొట్టకొట్టేందుకు సిద్ధమైందని వాపోతున్నారు. ఈ ఆలోచనను విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామక వ్యవస్థపై సమీక్షమంత్రుల బృందం ఏర్పాటుసాక్షి, అమరావతి: ఔట్‌సోగ్ సిబ్బంది నియామక ప్రస్తుత వ్యవస్థను సమీక్షించడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. మంత్రులు నారాయణ, నారా లోకేశ్, పయ్యావుల కేశవ్‌లతో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంత్రుల బృందం కార్యకలాపాలను సమన్వయం చేయడానికి సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) ముఖ్యకార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఈ బృందం సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా ఆర్థిక శాఖ (హెచ్ఆర్) కార్యదర్శి హాజరవుతారు. మంత్రుల బృందం విధి విధానాలు ఇలా ఉన్నాయి..⇒ ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తోన్న ఔట్‌సోగ్ సిబ్బంది సంఖ్య ప్రస్తుత స్థితిని సమీక్షించాలి.⇒ ఔట్‌సోగ్ సిబ్బంది నియామకానికి సంబంధించి ప్రస్తుత మెకానిజంను సమీక్షించాలి.⇒ వ్యవస్థలోని లోపాలు, ఫిర్యాదులను పరిశీలించాలి.⇒ ఇందుకోసం ఔట్‌సోగ్ సిబ్బందితో సంప్రదింపులు జరపాలి.⇒ ప్రస్తుత వ్యవస్థ కంటే మరింత జవాబుదారీగా, సమర్థవంతంగా, పారదర్శకంగా ఔట్‌సోగ్ సిబ్బంది సంక్షేమాన్ని పెంపొందించడానికి చర్యలను సూచించాలి.⇒ ఈ విషయంలో సముచితమని భావించే ఏదైనా ఇతర అంశాన్ని మంత్రుల బృందం పరిగణించవచ్చు. -
కూటమి ఎత్తు.. ప్రజాస్వామ్యం చిత్తు
అధికార పార్టీ నేతలు ప్రలోభాల వల విసిరారు. ఉద్యోగాలు ఎరవేశారు. మాట వినని వారి అంతుచూస్తామని బెదిరించారు. కుప్పం, మాచర్ల, తుని, పాలకొండ, విశాఖపట్నం, గుంటూరు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లను అనైతిక మార్గాల్లో లొంగదీసుకున్నారు. సోమవారం జరిగిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మేయర్ ఉప ఎన్నికల్లో మాయా పాచికలనే కూటమి పార్టీలు నమ్ముకున్నాయి. బలం లేకున్నా.. బరిలోకి దిగాయి. మొదట భంగపడినా.. చివరకు మాయతోనే మోసగించాయి. శకునికి మించిన ఎత్తులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పెత్తనం చెలాయించేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు.సాక్షి నెట్వర్క్: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అధికారపార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. బలం లేకపోయినా కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని లాక్కున్నారు. వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచిన కౌన్సిలర్లలో ఒక్కొక్కరికీ రూ.50 లక్షలు, ఒకరికి మున్సిపల్ ఉద్యోగం ఎరవేసి లొంగదీసుకున్నారు. మరో ఇద్దరిని భయపెట్టి ఎన్నికలో పాల్గొనకుండా అడ్డుకున్నారు. 8మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి లాక్కుని చైర్పర్సన్ కుర్చీని దక్కించుకుని అనైతికంగా విజయం సాధించారు.కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ స్థానానికి సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉంటే.. అందులో 19 వార్డుల నుంచి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లే ఎన్నికయ్యారు. టీడీపీకి కేవలం ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే ఉండగా.. కూటమి అధికారంలోకి వచ్చాక మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం బెదిరింపులకు తెరలేపారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఉన్న డాక్టర్ సుధీర్ రాజీనామా చేయటంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నలుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరినా.. వైఎస్సార్సీపీకి 15 మంది కౌన్సిలర్లతో చైర్‌పర్సన్‌ను ఎన్నుకునేందుకు అవసరమైన పూర్తిస్థాయి బలం ఉంది.బరితెగించి.. ఇబ్బందులకు గురిచేసి..టీడీపీ బరితెగింపునకు భయపడి 15 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు కౌన్సిలర్లకు చెందిన భూములు లాక్కుంటామని బెదిరించగా.. మరికొందరిని కేసులు పెడుతామని హెచ్చరించినట్లు తెలిసింది. తమకు మద్దతు ఇచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు ఇస్తామని ఆశ చూపించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ విప్ జారీ చేసినా అధికారపార్టీ నేతల ప్రలోభాలకు 8 మంది కౌన్సిలర్లు లొంగిపోయారు.ఇద్దరు కౌన్సిలర్లు మునస్వామి, తిలగవతి టీడీపీ నేతల బెదిరింపులకు భయపడి ఎన్నికల్లో పాల్గొనకుండా గైర్హాజరయ్యారు. ఉప ఎన్నికలో మొత్తం 22 మంది కౌన్సిలర్లు పాల్గొనగా.. టీడీపీ బలపరచిన అభ్యర్థి సెల్వరాజ్‌కి 13 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. కాగా.. విప్ ధిక్కరించిన కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త భరత్ ప్రకటించారు. పాలకొండలో.. అడ్డదారిలో..పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ పదవి కోసం జరిగిన ఉప ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని ఎస్సీలకు రిజర్వు చేశారు. మొత్తం 20 వార్డులు ఉండగా.. 17 వార్డుల్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. 19, 2వ వార్డులకు చెందిన ఇద్దరు మాత్రమే ఎస్సీ సభ్యులు ఉండగా.. 19వ వార్డుకు చెందిన యందవ రాధాకుమారిని చైర్‌పర్సన్‌గా అప్పట్లో వైఎస్సార్సీపీ ఎంపిక చేసింది.ఇటీవల వ్యక్తిగత కారణాలతో రాధాకుమారి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. చివరకు 2వ వార్డుకు చెందిన ఎస్సీ సభ్యురాలు ఆకుల మల్లీశ్వరి ఉండగా.. ఆమెనే తదుపరి చైర్‌పర్సన్‌గా ప్రకటించాలని వైఎస్సార్సీపీ నాయకులంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ పీఠంపై కూటమి పార్టీలు కన్నేశాయి. సోమవారం మరోమారు ఎన్నిక నిర్వహించగా.. టీడీపీ మాయోపాయంతో స్వతంత్ర అభ్యర్థినంటూ మల్లీశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.టీడీపీకి చెందిన ఇద్దరు సభ్యుల మద్దతు అందించడంతో ఆమె చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఆ వెంటనే మల్లీశ్వరికి రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ టీడీపీ కండువా వేసి పాలకొండ చైర్పర్సన్ పదవి తమదేనని ప్రకటించుకున్నారు. ఈ ఎన్నికకు వైఎస్సార్సీపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు హాజరు కాలేదు. మిగిలిన చోట్ల ఇలా..⇒ గుంటూరు మేయర్‌గా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర (నాని) గెలుపొందారు. మార్చిలో అప్పటి మేయర్ కావటి మనోహర్‌నాయుడు రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 56 మంది సభ్యుల్లో కూటమి బలం కేవలం 11.. కాగా 18 మందిని చేర్చుకోవడంతో వారి బలం 29కి చేరింది. ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఎక్స్–అఫిషియో సభ్యులు ఉండటంతో వారి బలం 34 అయ్యింది. వైఎస్సార్సీపీకి ఇద్దరు ఎమ్మెల్సీలతో కలిసి 29 మంది బలం ఉండగా.. ఇద్దరు సభ్యులు హాజరుకాకపోవడంతో 27 ఓట్లు వచ్చాయి. ⇒ కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన 17 మంది కౌన్సిలర్లు హాజరు కాగా.. 11 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఎన్నికను బహిష్కరించారు. పోటీలో మరెవరూ లేకపోవడంతో చైర్‌పర్సన్‌గా నార్ల భువనసుందరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి, డీపీఓ రవికుమార్ ప్రకటించారు.⇒ గ్రేటర్ విశాఖ మేయర్‌గా టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం ప్రిసైడింగ్ అధికారి మయూరి అశోక్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. ⇒ మొత్తం మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులు ఉన్నాయి. 31 వార్డులనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. కూటమి అధికారంలోకి రావడంతో వైఎస్సార్సీపీ సభ్యులపై రకరకాల ఒత్తిళ్లు తెచ్చి.. భయపెట్టి పలుదఫాలుగా 21 మంది కౌన్సిలర్లను టీడీపీ తనవైపు తిప్పుకుంది. వారి సాయంతో వైస్ చైర్‌పర్సన్‌గా మదార్ సాహెబ్‌ను గెలిపించుకుని విలువలకు పాతరేసింది.⇒ తాడిపత్రి మునిసిపల్ వైస్ చైర్పర్సన్–1గా టీడీపీకి చెందిన 26వ వార్డు కౌన్సిలర్ షెక్షావలి, వైస్ చైర్పర్సన్–2గా సీపీఐకి చెందిన 12వ వార్డు కౌన్సిలర్ అరుణ ఎన్నికయ్యారు. అధికార పార్టీకి సంఖ్యాబలం ఉండటంతో ఈ పదవులకు వైఎస్సార్సీపీ నుంచి ఎవరినీ పోటీకి దింపలేదు.కూటమి విజయం అనైతికం: ఎమ్మెల్సీ భరత్కుప్పం రూరల్: ‘కుప్పంలో ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే. మున్సిపల్ చైర్పర్సన్ ఉప ఎన్నికల్లో టీడీపీ అనైతికంగా విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అప్రతిష్ట పాలైంది’ అని ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ అన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ సీపీకి 18 మంది సభ్యుల బలముంది. అయినా ఓడిపోవాల్సిన దుస్థితి పట్టింది. అధికార పార్టీ నేతలు మా కౌన్సిలర్లను కూరగాయల్లా రూ.లక్షలకు లక్షలు పోసి కొన్నారు. అధికారం శాశ్వతం కాదు. హుందాతనం ముఖ్యం. సాక్షాత్తు సీఎం ప్రాతినిధ్య వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలా అనైతిక ఎన్నికలు జరుగుతుంటే.. ఇక రాష్ట్రమంతా పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగింది.ప్రజాస్వామ్యం ఖూనీ: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, స్థానిక సంస్థల పదవులను చేజిక్కించుకునేందుకు గజారుడు రాజకీయానికి పాల్పడిందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రలోభాలు, బెదిరింపులతో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను తమవైపు తిప్పుకుని పదవులను దక్కించుకోవడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. చంద్రబాబు అరాచక పాలనను చూసి ప్రజాస్వామ్యవాదులు నివ్వెరపోతున్నారని అప్పిరెడ్డి విమర్శించారు. కుప్పం, పాలకొండ, మాచర్ల, తుని, గుంటూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో తాడిపత్రి మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ కంటే 2 స్థానాలు టీడీపీ అధికంగా గెలుచుకుంటే నాటి సీఎం వైఎస్ జగన్ హుందాగా వ్యవహరించారని గుర్తుచేశారు. -
AP: మళ్ళీ భూములు సమీకరణకు చంద్రబాబు
విజయవాడ: రాజధాని కోసం అంటూ ఇప్పటికే వేల ఎవరాలు సేకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మళ్లీ భూముల సమీకరణకు సిద్ధమయ్యారు. ఎయిర్ పోర్ట్, క్రికెట్ స్టేడియం పేరుతో మళ్లీ భూ సమీకరణ చేపట్టడానికి సిద్ధమైంది చంద్రబాబు సర్కారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రైతుల సమావేశంలో చెప్పేశారు. ఎయిర్ పోర్టు, స్టేడియం నిర్మాణంతో భూముల విలువ పెరుగుతుందని మరో కథ చెప్పేశారు చంద్రబాబు. రాజధాని పనులు పునః ప్రారంభ కార్యక్రమానికి రైతులను ఆహ్వనిస్తామన్నారు. రైతులకు రిటర్న్ బుల్ ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామన్నారు. త్యాగాలు చేసిన రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ కార్యక్రమమూ ఉండదన్నారు చంద్రబాబు. -
Ambati: 17 మందిని కూడా లాగేసుకున్నావ్.. ఇది నీకు న్యాయమేనా బాబు..
-
చంద్రబాబు రోజురోజుకూ దిగజారిపోతున్నారు: అంబటి
గుంటూరు, సాక్షి: టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కారు. 57 డివిజన్లకుగాను మా సంఖ్యా బలం 44. 17 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను బెదిరించి తీసుకుపోయారు. చంద్రబాబు రోజురోజుకూ దిగజారిపోతున్నారు. విప్‌ను ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటాం. -
ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ఖూనీ చేసింది: MLC లేళ్ల అప్పిరెడ్డి
-
లిక్కర్ కేసులో కుట్రలు తప్ప మరేమీ కనిపించడం లేదు: Manohar Reddy
-
జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ధైర్యంతో... ఎమ్మెల్సీ భరత్ కామెంట్స్
-
లిక్కర్ కేసులో భేతాళ కథలు.. అన్నీ కుట్రలే: మనోహర్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణాన్ని బయట పెట్టినందుకే ఇప్పుడు పోటీగా కేసును పెట్టారని చెప్పుకొచ్చారు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. లిక్కర్ కేసులో భేతాళ కథలు, కుట్రలు తప్ప మరేమీ లేదని ఎద్దేవా చేశారు. దీనిపై ఎల్లో మీడియా అడ్డగోలుగా విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో లిక్కర్ స్కాం అంటూ ఎవరితోనో ఒక లెటర్ రాయించి కేవలం తొమ్మిది రోజుల్లోనే విచారణ చేసినట్టు చూపించారు. అసలు ఆ తొమ్మిది రోజుల్లో ఎవరెవరిని విచారణ చేశారో కూడా చెప్పలేదు. తాము ఇరికించాలనుకున్న వ్యక్తుల పేర్లను లిక్కర్ కేసులో వరుసగా పెట్టేస్తున్నారు. సిట్‌ని ఏర్పాటు చేస్తే దానికంటూ ప్రత్యేకంగా ఒక పోలీసు స్టేషన్ ఉండాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కానీ అవేమీ లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారుఅప్పటి ముఖ్యమంత్రిని కూడా కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్‌లోని అధికారులంతా పాలకులు చెప్పినట్టే కేసును నడిపిస్తున్నారు. గౌరవంగా బతికే పారిశ్రామికవేత్తలను కూడా వేధిస్తున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కాంని బయటపెట్టినందుకే పోటీగా ఇప్పుడు కేసును పెట్టారు. నేర అంగీకార పత్రాలపై రాజ్ కెసిరెడ్డి సంతకాలు చేయలేదు. దీన్ని కోర్టు కూడా గుర్తించింది. అయినప్పటికీ ఎల్లో మీడియా అడ్డగోలుగా విష ప్రచారం చేస్తోంది.జగన్ ప్రభుత్వ హయాంలో అత్యంత పారదర్శకంగా లిక్కర్ పాలసీ అమలైంది. చంద్రబాబు హయాంలో స్కాం జరిగినట్టు లెక్కలే తేల్చాయి. 53% మద్యాన్ని నాలుగు కంపెనీల ద్వారా కొనుగోలు చేయటం వెనుక కుట్ర దాగుంది. ఈ అక్రమాలపై విచారణకు కూటమి ప్రభుత్వానికి దమ్ముందా?. సీబీఐతో విచారణకు ముందుకు రాగలరా?. మా సవాల్ స్వీకరించే ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉందా?. జగన్ హయాంలో పారదర్శకంగా లిక్కర్ పాలసీ అమలైనందున అక్రమాలకు అవకాశం లేదు. కానీ మిథున్‌రెడ్డి సహా అనేక మందిని ఇబ్బందులు పెట్టాలని ప్రభుత్వం చూస్తోంది. పోలీసు అధికారులు చట్టప్రకారం చేయాల్సిన పని చేయటం లేదు. పారిశ్రామిక వేత్తల నుండి వైఎస్సార్సీపీ నేతల వరకు అందరినీ బెదిరిస్తున్నారు. తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసి, ఇబ్బందులు పెడుతున్న పోలీసులపై చర్యలు తప్పవు’ అంటూ హెచ్చరించారు. -
ఎల్లో మీడియాకు ఎంత ముడుతోందో?
‘ఖజానాకు కిక్కు’ కొద్ది రోజుల క్రితం ఎల్లో మీడియా పత్రిక ఒకటి పెట్టిన శీర్షిక ఇది. ఏపీలో మద్యం విచ్చలవిడి ప్రవాహంపై ఆందోళన చెందాల్సిన మీడియా ఏడాదిలో మద్యం వ్యాపారం ద్వారా ప్రభుత్వ ఆదాయం 14 శాతం వృద్ది చెందిందని సంబరపడింది. 2024-25లో రూ.28,842 కోట్ల రాబడి మద్యం ద్వారా వచ్చిందని ఎగిరి గంతేసినట్లు ప్రచారం చేసింది.గత సంవత్సరం అంటే జగన్ ప్రభుత్వ చివరి సంవత్సరంలో వచ్చిన మొత్తం కన్నా రూ.3750 కోట్లు ఎక్కువ అని ఈ కథనంలో చెప్పారు. అంతటితో ఆగి ఉంటే బాగుండేది. కానీ, ఈ పెరిగిన ఆదాయమంతా జగన్ హయాంలో జరిగిందనడంలోనే పచ్చమీడియా తన కుట్ర స్వభావాన్ని సిగ్గు లేకుండా బయటపెట్టుకుంది. నిజానికి ఇది పిచ్చి వాదన. దీని సాయంతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న విషయాన్ని ప్రజల దృష్టి నుంచి తప్పించాలన్నది ప్లాన్ కావచ్చు.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపేది. నిర్దిష్ట వేళలు ఉండేవి. మద్యం ప్రియులు కూడా ఇబ్బంది పడేలా దుకాణాలు దూరంగా ఉంచేవారు. బెల్ట్‌షాపుల్లేకుండా చూసుకున్నారు. ఇదంతా చేసింది ప్రజలు మద్యానికి బానిసలు కాకూడదనే. మద్యపాన నియంత్రణకే. అందుకే అప్పట్లో తాగే మద్యం మోతాదు తగ్గినా ఆదాయం మాత్రం రూ.25,082 కోట్ల వరకూ వచ్చింది. అయినా ఇందులో ఏదో కుంభకోణం జరిగిందని కాకి లెక్కలు రాసి వైఎస్సార్సీపీ నేతలను ఇరికించడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏ రంగమైనా ఏటా ఎంతో కొంత వృద్ధి చెందుతూ ఉంటుంది. బడ్జెట్ల మాదిరిగానే ఎల్లో మీడియా తలతిక్క రాతలను పరిగణనలోకి తీసుకుంటే బడ్జెట్ల రూపకల్పనలోనే కుంభకోణాలున్నట్లు అనుకోవాలి.చంద్రబాబు ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని మళ్లీ ప్రైవేటు వారికి అప్పగించింది. ఆ షాపుల వేలం పాటల ద్వారా కూడా సుమారు రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది. బెల్ట్ షాపుల సంగతి చెప్పనవసరం లేదు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా విధిస్తామని చంద్రబాబు ఉత్తుత్తి హెచ్చరికలు చేస్తున్నట్లు కనిపిస్తున్నా.. టార్గెట్లు పెట్టి అమ్మకాలు చేయిస్తుండటంతో ఇవి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. బెల్ట్ షాపులషాపుల నిర్వాహకుల్లో ఎక్కువ మంది టీడీపీ, జనసేనకు చెందినవారే. గుడి, బడి తేడా లేకుండా, నివాస ప్రాంతం, వ్యాపార ప్రాంతం తేడా లేకుండా షాపులు పెడుతున్నారు. గుంటూరు తదితర ప్రాంతాలలో వైన్ షాపులు తీసివేయండి అని మహిళలు మొత్తుకున్నా, ధర్నాలు చేసినా ఎక్సైజ్ శాఖ అధికారులు చీమ కుట్టినట్లుగా కూడా స్పందించడం లేదు!.త్రీస్టార్ హోటల్స్, బార్లు, ప్రివిలేజ్ ఫీజ్ తగ్గించడం, వ్యాపారుల మార్జిన్ పెంచడం స్కామ్‌లు కాదట. ప్రభుత్వపరంగా విక్రయిస్తే స్కామ్ అట. ఏపీలో ఉన్న విచ్చలవిడి మద్యం అమ్మకాల పరిస్థితిని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలే బహిరంగంగానే విమర్శించారు. అంతేకాదు.. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో, ఆ తర్వాత..‘తాగండి తమ్ముళ్లు’ అంటూ సామాన్యులకు మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, అదేదో గొప్ప విషయంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. మద్యం డిస్టిలరీల ద్వారా అధికారికంగా ఎంత కొనుగోలు చేస్తున్నారు? అనధికారికంగా మరెంత వస్తున్నదో ఎవరైనా చెప్పగలరా?. 2014-19 మధ్య ఐదు డిస్టిలరీల నుంచే ఏభై శాతం మద్యాన్ని కొనుగోలు చేశారట. పవర్ స్టార్, లెజెండ్, తదితర కొత్త బ్రాండ్లు వచ్చింది కూడా చంద్రబాబు టైమ్‌లోనే. వాటి సంగతి ఏమిటి?.ఆ కుంభకోణాలపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విచారణ జరిపించి కేసు పెట్టడంతో, ఆ కక్షతో ఎలాగోలా వైఎస్సార్సీపీ సీనియర్ నేతలను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి కదా?. ఇందుకోసం గతంలో వైఎస్సార్సీపీలో ప్రముఖుడిగా ఉన్న విజయసాయి రెడ్డిని వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం స్కాం అంటూ తొలుత విజయసాయి రెడ్డిపై కూడా కూటమి నేతలు అభియోగాలు మోపారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎన్నికలకు ముందు విజయసాయి రెడ్డిపై ఎన్ని వేల కోట్ల ఆరోపణలు చేశారు. ఆయన పార్టీని వీడిన తర్వాత సిట్ విచారణకు హాజరవడానికి ముందు ఏదో బ్రహ్మాండం బద్దలవుతుందన్నట్లుగా ఎల్లో మీడియా ఊదరగొట్టింది. తీరా ఆయన విచారణకు హాజరై, ఒక్క రాజ్ కేసిరెడ్డి అన్న వ్యక్తిపై ఆరోపణలు చేసి, మద్యంలో స్కామ్ జరిగినట్లు తనకు తెలియదని, అందువల్ల వ్యక్తుల ప్రమేయం తనకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించడంతో కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు నిరుత్సాహం వచ్చింది.ఆ తర్వాత వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విచారణకు పిలిచారు. కానీ, ఏమీ సాధించలేక పోయారన్నది తెలిసిపోతోంది. తదుపరి రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్ రెడ్డిలను విచారించినా, వారు రిమాండ్ రిపోర్టుపై సంతకాలే చేయలేదు. అలాంటప్పుడు ఆ రిపోర్టులకు ఎంత విలువ ఉంటుంది?. అయినా అందులో సీఐడీ రాసిన కథలన్నిటినీ ఎల్లో మీడియా బ్యానర్లుగా పరిచి జగన్‌పై తమకు ఉన్న విద్వేషాన్ని కక్కాయి తప్ప, అందులో సరుకు కనిపించడం లేదు. సాధారణంగా సిట్ అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించి ప్రశ్నిస్తారు. కానీ, మిథున్ రెడ్డిని తమ వద్ద ఉన్న ఊహాజనిత ఆరోపణలు, బలవంతంగా కొందరి నుంచి తీసుకున్న వాంగ్మూలాల బేసిస్‌తో ప్రశ్నలు అడగడంతో ఆయన వాటికి గట్టిగా బదులిచ్చారు.గతంలో చంద్రబాబుపై స్కిల్‌స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు సిట్ బృందం స్పష్టమైన ఆధారాలు సేకరించింది. అంతకుముందే ఈడీ ఆ కేసును డీల్ చేసి కొందరిని అరెస్టు చేసింది. ఆ అంశంతో పాటు, స్కిల్ స్కామ్ డబ్బు టీడీపీ బ్యాంక్ ఖాతాలోకి కూడా చేరిందని, షెల్ కంపెనీలు ఎలా పనిచేశాయన్నది వివరాలతో సహా అధికారులు బయటపెట్టడంతో వాటి గురించి చెప్పకుండా చంద్రబాబు తప్పించుకునే యత్నం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అన్ని ఆధారాలు చూపించినా, అవి అక్రమ కేసులంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. అధికారం రావడంతో ఇప్పుడు వాటన్నిటిని కప్పిపుచ్చుతున్నారు. మరో సంగతి చెప్పాలి. మార్గదర్శి డిపాజిట్లు, చిట్ ఫండ్స్‌లో అక్రమాల గురించి ఆధారాలను చూపి రామోజీరావును విచారించినప్పుడు ఆయన తనకు గుర్తులేదు.. తెలియదు.. అని మాత్రమే జవాబిచ్చారు. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ, ఎదుటివారిపై మాత్రం బురద వేయడం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ మూల సిద్దాంతాలలో ఒకటిగా మారిపోయింది.ఎల్లో మీడియా రాసిందే కొలమానం అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఈ పది నెలల్లో ఎన్ని స్కాంలకు పాల్పడినట్లు?. ఉదాహరణకు జగన్ టైమ్ లో ఇసుక విక్రయం ద్వారా ఏడాదికి సుమారు రూ.700 కోట్ల ఆదాయం సమకూరింది. కొన్ని వందల కోట్ల విలువైన ఇసుకను స్టాక్ యార్డులలో నిల్వ చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే టీడీపీ, జనసేన నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందినకాడికి దోచేశారు. పోనీ ఇప్పుడు ఉచితం అని చెబుతున్నా, వినియోగదారుడికి ఏమైనా రేటు తగ్గిందా అంటే అదీ లేదు. అంటే కూటమి నేతలు రోజూ ఎంత పెద్ద స్కామ్ చేస్తున్నట్లు?. జగన్ టైమ్ లో వచ్చిన ఆదాయం ఇప్పుడు రావడం లేదు కనక అదంతా కూటమి కుంభకోణం అని ఎల్లో మీడియా అంగీకరించాలి.టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక్క తిరువూరు ప్రాంతంలోనే వందల ట్రక్కుల ఇసుక అక్రమ రవాణా అవుతోందని వెల్లడించారు కదా!. ఆ మొత్తం అంతా ఎవరి ఖాతాలోకి వెళుతోంది?. బహుశా ఎల్లో మీడియాకు కూడా వాటాలు ఉన్నాయేమో?.. అందుకే టీడీపీ ఎమ్మెల్యే అక్రమ వ్యవహారాలను బయటపెట్టడం తప్పన్నట్లు రాశారా?. గనుల శాఖలో కూడా గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఇప్పుడు తక్కువ వచ్చింది. పైగా ఈ శాఖలో అవినీతి జరిగిపోతోందని ఎల్లో మీడియానే కథనాలుగా ఇచ్చింది కదా? దాని గురించి ఏమంటారు? ఏది ఏమైనా జగన్ టైమ్ లో మద్యం స్కామ్ అటూ వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చి మళ్లీ ఎంపీ అయిన లావు కృష్ణదేవరాయలతో ఢిల్లీలో ప్రచారం చేయించినా, రాష్ట్రంలో సిట్‌తో దర్యాప్తు చేయించినా, ఎల్లో మీడియాతో పిచ్చి కథనాలు రాయించినా ఆ ఆరోపణలకు ఆధారాలు కనిపించడం లేదే!. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఉర్సా భూ రచ్చపై సుప్రీంకోర్టు న్యాయవాది కామెంట్స్
-
మూసివేతకు సిద్ధమవుతున్న ఏపీ ఫైబర్ నెట్
-
‘ఇది చాలా తప్పు చంద్రబాబు’.. ఉర్సా ల్యాండ్ డీల్‌పై సుప్రీం న్యాయవాది ఆగ్రహం
సాక్షి,విజయవాడ: ఉర్సా ల్యాండ్ డీల్‌పై దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఉర్సాకి రూ.3వేల కోట్ల విలువైన భూముల్ని చంద్రబాబు కట్టబెట్టారు. అయితే, ఊరుపేరు లేని ఉర్సాకి వేలకోట్ల భూముల్ని కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆఫీస్,ట్రాక్ రికార్డ్ లేని ఉర్సాకి భూ కేటాయింపులపై ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎక్స్ వేదికగా స్పందించారు.రెండు నెలల కిందట పెట్టిన ఉర్సాకు కోట్ల విలువైన భూముల్ని కేటాయించడంపై విమర్శలు గుప్పించారు. ఆఫీసు లేదు, ట్రాక్ రికార్డ్ లేదు. రెండు నెలల కిందట పెట్టిన ఉర్సాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్ల రూపాయల ఒప్పందం ఎలా కుదుర్చుకుంది? వావ్! చంద్రబాబు ప్రభుత్వం ఘోస్ట్ కంపెనీకి 59.6 ఎకరాల భూమిని దాదాపు ఉచితంగా బహుమతిగా ఇచ్చింది! పూర్తిగా చట్టవిరుద్ధం! 59.6 ఎకరాలు ఘోస్ట్ కంపెనీకి కేటాయించడం చట్ట వ్యతిరేకం’ అని ట్వీట్లో పేర్కొన్నారు. No Office, No Track Record: How a Two-Month-Old Firm Landed a Multi-Crore Deal With Andhra Govt. Wow!59.6 Acres of land gifted virtually free to this ghost company by the CB Naidu govt! Totally illegal!Is it kickbacks or connections with Top officials? https://t.co/XzoU8HVCp4— Prashant Bhushan (@pbhushan1) April 22, 2025ఒక్క రూపాయికి కనీసం ఓ ఇడ్లీ కూడా రాదు..! మరి 99 పైసలకు రూ.3,000 కోట్ల భూములు ఎలా..? అంటూ ఉర్సా ల్యాండ్ డీల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీసీఎస్ కంటే ఎక్కువగా ఉర్సాకి భూ కేటాయింపులపై అనుమానాలు తలెత్తతున్నాయి.అయినా సరే ఉర్సా ల్యాండ్ డీల్‌పై ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నోరు మెదకపోవడం గమనార్హం. ఉర్సా డైరెక్టర్ అబ్బూరి సతీష్‌తో టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి భాగస్వామ్యం ఉంది. కేశినేని చిన్ని, అబ్బూరి సతీష్ బంధం బయటపడటంతో ఉర్సా ల్యాండ్ డీల్‌పై గల్లీ నుంచి ఢిల్లీ వరకు చర్చాంశనీయంగా మారింది. -
బినామీలకు కారుచౌకగా బాబు భూ పందేరం
-
ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!
-
ఆశల పల్లకిలో కొల్లేరు
కైకలూరు: కొల్లేరు అనే ఈ మూడక్షరాల పదం రాష్ట్రంలో మరోమారు చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు చెబుతున్న సూచనలను రాజకీయ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటున్నారు. తాజాగా మరోసారి కొల్లేరు సరిహద్దుల పరిశీలన చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర సాధికారిత కమిటీని ఆదేశించింది. కొల్లేరు ఆపరేషన్ ద్వారా అక్రమ చెరువులను ధ్వంసం చేసి 19 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అభయారణ్యం ఆక్రమణల చెరలోనే చిక్కుకుంది. కొల్లేరు కాంటూరు కుదింపు సాధ్యం కాదని అధ్యయన కమిటీలు గతంలోనే నివేదిక ఇచ్చాయి. కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపుతామంటున్న నేతల వాగ్దానాలు నెరవేరేనా అనే అనుమానాలు కొల్లేరు ప్రజల్లో సర్వత్రా వినిపిస్తున్నాయి. మరోమారు తెరపైకి.. కొల్లేరు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అంతర్జాతీయ రామ్సర్ ఒడంబడిక ప్రకారం 1999 అక్టోబరు 4న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీఓ 120ను తీసుకొచ్చింది. పూర్వపు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 9 మండలాల్లో + 5 కాంటూరు పరిధి వరకు 77,138 ఎకరాలను అభయారణ్యంగా నిర్ణయించారు. అక్రమ చేపల చెరువులు అభయారణ్యంలో పెరగడంతో 2006లో కొల్లేరు ఆపరేషన్ ద్వారా వేలాది ఎకరాల్లో అక్రమ చెరువులను ధ్వంసం చేశారు. కొల్లేరు సంరక్షణకు 2006 ఏప్రిల్ 10న సుప్రీం కోర్టు జారీచేసిన ఉత్తర్వులను ప్రభుత్వ అధికారులు అమలు చేయలేదని ఇది కోర్టు ధిక్కరణకు వస్తుందని కాకినాడకు చెందిన కె.మృత్యుంజయరావు 2004 సెపె్టంబరులో సుప్రీం కోర్టులో కేసు వేశారు. కాంటూరు కుదింపు సాధ్యమయ్యేనా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచం గుర్తించిన ఏకైక చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు. 10వ కాంటూరు పై వరకు కొల్లేరు విస్తరించి ఉన్నప్పటికీ 5వ కాంటూరు వరకు మాత్రమే 77,138 ఎకరాల్లో అభయారణ్యంగా గుర్తించారు. కొల్లేరు అభయారణ్యాన్ని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదిస్తే 48,777 ఎకరాలు మిగులుతోంది.అభయారణ్యంలో పట్టా భూములు 14,932 ఎకరాలు, సొసైటీ భూములు 5,510 ఎకరాలు ఉన్నాయి. నష్టపరిహారం చెల్లించకుండా ధ్వంసం చేశారని కొల్లేరు ప్రజలు వాదన వినిపిస్తోన్నారు. కొల్లేరుపై అధ్యయనం చేసిన పలు కమిటీలు కాంటూరు కుదింపు సాధ్యం కాదని నివేదికలు అందించాయి. కూటమి నేతలు మాత్రం కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేసినట్లుగానే ప్రచార చేస్తున్నారు. ప్రధాని హామీ అమలు చేయాలి ఎన్నికల ప్రచారంలో భాగంగా 2014లో భీమవరం వచ్చిన ప్రధాని మోదీ కొల్లేరు కాంటూరును కుదిస్తానని హామీ ఇచ్చారు. ఆ సభలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం ఉన్నారు. 2015 జూలైలో అప్పటి కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేవకర్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొల్లేరులో సమావేశం నిర్వహించారు. అనంతరం కాంటూరు కుదింపుపై త్రిసభ్య కమిటీని నియమించారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్, రివ్వూ పిటీషన్లు దాఖలు చేసి వాదనలు వినిపించాలని కొల్లేరు ప్రజలు కోరుతున్నారు. కాంటూరు కుదింపు జరగాలంటే జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు (ఎన్టీడబ్ల్యూఎల్) ఆమోదం జరగాలంటే రాష్ట్ర బోర్డు తీర్మాణం చేయాల్సి ఉంది. అలాగే కొల్లేరులో నిత్యం నీరు నిల్వ ఉండాలంటే రెగ్యులేటర్ల నిర్మాణం జరగాలి. ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలని పలువురు కోరుతున్నారు. రాజకీయం చేయద్దు కాంటూరు కుదింపు చేస్తామని రాజకీయ నాయకులు చెబుతున్నారు. ముందుగా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలి. కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి ఏళ్లు గడిచిపోయాయి. అమాయకులైన కొల్లేరు ప్రజలకు వాస్తవ పరిస్థితులు చెప్పండి. ప్రధాని మోదీ ఇచ్చిన హామీ అమలు చేయడానికి కూటమి నేతలు కృషి చేయాలి. –బలే గణేష్, శృంగవరప్పాడు,కైకలూరు మండలం -
అందినకాడికి దోచుకో..పంచుకో..!
సాక్షి, అమరావతి: ద్రవిడియన్ వర్సిటీలో అడ్డగోలు దందా రాజ్యమేలుతోంది. అకడమిక్ సంబంధిత వ్యవహారాల కంటే అవినీతి కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్‌డీలు జారీ చేయడం దగ్గర నుంచి దొడ్డిదారిన అడహక్ నియామకాలకు ఒడిగట్టడం వరకూ పలు అంశాలు వర్సిటీ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. వాస్తవానికి బోధనేతర వ్యక్తులకు పాలన పగ్గాలు అప్పగించడంతోనే వర్సిటీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇలాకాలో వర్సిటీ ఉండడంతో, ‘తాము ఏం చేసినా అడిగేవారు లేరని’ కొందరు రాజకీయ పలుకుబడి కలిగినవారు భావిస్తున్నారు. దీనితో అందినకాడికి దోచుకోవడం..పంచుకోవడం సర్వసాధారణమైపోయింది. వర్సిటీ ఆస్తులను, ఆదాయాన్ని అప్పనంగా మింగేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అడహక్ పేరుతో అడ్డుగోలు వ్యవహారం ద్రవిడియన్ వర్సిటీలో అకడమిక్ పాలన పూర్తిగా గాడితప్పింది. తాజాగా ఒక అకడమిక్ కన్సల్టెంట్‌కు ఏకంగా ‘అడహక్ నియామకం ద్వారా’ భారీ పే స్కేల్‌ను ఇచ్చేందుకు చకచకా పావులు కదపడం వర్సిటీలో పెనుదుమారం రేపింది. వాస్తవానికి వర్సిటీలో వివిధ విభాగాల్లో 30 మందికిపైగా అకడమిక్ కన్సల్టెంట్లు పని చేస్తున్నట్లు సమాచారం. కానీ, వర్సిటీ పాలకులు మాత్రం ‘ఆ ఒక్క వ్యక్తి’పై మాత్రమే ప్రత్యేక ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. గతంలో వర్సిటీలో ఎంఎస్సీ గణిత విభాగంలో అకడమిక్ కన్సల్టెంట్‌గా సదరు ఉద్యోగి చేరారు. ఆ తర్వాత ప్రవేశాలు లేకపోవడంతో ఈ విభాగాన్ని మూసివేశారు. దీంతో అప్పటి అకడమిక్ కన్సల్టెంట్లు వర్సిటీ నుంచి బయటకు వెళ్లిపోయారు. కానీ, ఈ ఉద్యోగి మాత్రం తన పలుకుబడితో అక్కడే డిగ్రీ విభాగంలోని బీఎస్సీ (ఎంఎస్సీఎస్)లోకి మారిపోయారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్సిటీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంతో అడహక్ నియామకం పొందేందుకు బాటలు వేసుకున్నారు. నేడో, రేపో నియామక పత్రం కూడా రానున్నట్టు సమాచారం. దీంతో మిగిలిన విభాగాల అకడమిక్ కన్సల్టెంట్లు అగ్గిమీద గుగ్గిళం అవుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయ ఉపాధి కేంద్రం.. కుప్పం నియోజకవర్గంలోని టీడీపీకి చెందిన ఒక మహిళా నాయకురాలు కుమారుడికి రాజకీయ ఉపాధిలో భాగంగా వర్సిటీలో ఉద్యోగం కట్టబెట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిని కూడా నిబంధనలు పాటించకుండానే అడహక్ నియామకం కింద చేపట్టి, ఇంజనీరింగ్ విభాగంలో ఏఈ పోస్టులో కూర్చో బెట్టేందుకు మార్గం సుగుమం చేశారు. సాక్షాత్తు ముఖ్యనేత కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదేశాలతోనే ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ విభాగంలో సిబ్బందికే పని లేనప్పుడు కొత్తవారిని తీసుకొచ్చి వర్సిటీపై ఆరి్థక భారం పెంచడం తప్ప ఒరిగేది ఏమీలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. త్వరలో వంద మందికిపైగా ఉద్వాసన! వాస్తవానికి వర్సిటీ ఖజానాలో ఎటువంటి నిధులు లేవు. ప్రభుత్వం కూడా కొత్తగా అభివృద్ధి నిధులు కేటాయించలేదు. ఏడాదిగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో వర్సిటీ ఉంటే..కొత్తగా నియామకాలు చేపట్టి ఏం సందేశం ఇస్తున్నారని వర్సిటీ వర్గాలు మండిపడుతున్నాయి. మరోవైపు 235 మందికిపైగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిలో వంద మందికిపైగా సిబ్బందికి ఉద్వాసన పలికేందుకు వర్సిటీ యాజమాన్యం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు? వాస్తవానికి వర్సిటీల్లో ప్రత్యక్షంగా నియామకాలు చేపట్టే అధికారం ఇన్చార్జ్ పాలకులకు ఉండదు. ఇందుకు ప్రభుత్వం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందస్తు అనుమతి తప్పనిసరి. ఆ తర్వాత ఉద్యోగ వివరాలతో బహిరంగ ప్రకటనల ద్వారా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది సాధారణ, అడహక్ నియామకాలకు వర్తిస్తుంది. కానీ, ద్రవిడియన్ వర్సిటీలో మాత్రం ఇన్చార్జ్ పాలకులు ‘తాము చెప్పిందే వేదం.. చేసేదే శాసనం’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది జనవరిలో జారీ చేసిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ నియామక, ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
ఇన్ స్టాల్మెంట్ లో తల్లికి వందనం.. బాబు వ్యాఖ్యలకు మేరుగు నాగార్జున కౌంటర్
-
‘జత్వానీ కౌంటర్ కేసు ఒక దుష్ట సంప్రదాయానికి రోల్ మోడల్’
సాక్షి, తాడేపల్లి: కాదంబరీ జత్వానీతో కూటమి ప్రభుత్వం పెట్టించిన తప్పుడు కౌంటర్ కేసు దేశంలో ఒక దుష్ట సంప్రదాయానికే రోల్‌మోడల్‌గా మిగిలిపోతుందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికార దుర్వినియోగానికి ఈ కేసు పరాకాష్టగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో మేజిస్ట్రేట్ ముందు ఏనాడు పోలీసులపై ఫిర్యాదు చేయని జత్వానీతో ఏడు నెలల తరువాత కూటమి ప్రభుత్వం కావాలనే పిలిపించి తప్పుడు ఫిర్యాదు చేయించిందని, దేశంలోనే ఇటువంటి కౌంటర్ కేసు ఇదే మొదటిదని అన్నారు.ఇంకా ఆయనేమన్నారంటే..దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మాత్రమే ఇటు పోలీస్ వ్యవస్థలో, అటు న్యాయ ప్రక్రియ విషయంలో వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముంబైకి చెందిన కాదంబరీ జత్వానీ సినీనటి. దేశ వ్యాప్తంగా ఆమెపై కేసులు ఉన్నాయి. ఏపీలో కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పాటు చేసుకుని, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్, హనీ ట్రాప్‌తో రూ.కోటికి పైగా బ్యాంక్‌ల ద్వారా తన ఖాతాలకు జమ చేయించుకున్నారని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది.దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్లాక్ మెయిలింగ్‌కు లొంగకపోవడంతో కుక్కల విద్యాసాగర్ ఆస్థిని కాజేసేందుకు దొంగ సంతకాలతో డాక్యుమెంట్లను సృష్టించి ఇతరులకు అమ్మేందుకు రూ.5 లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు తేలింది. కొనుగోలు చేసిన వ్యక్తులు దీనిపై కుక్కల విద్యాసాగర్‌తో క్రాస్ చెక్ చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.చట్టప్రకారమే జత్వానీ అరెస్ట్కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుపై పోలీసులు చట్టప్రకారం దర్యాప్తు జరిపి, ఇందులో ముద్దాయి కాదంబరీని అరెస్ట్ చేసేందుకు విజయవాడ న్యాయస్థానంలో పిటీషన్ వేసి, సెర్చ్ వారెంట్ తీసుకున్నారు. అనంతరం ముంబై జూహూ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి, స్థానిక పోలీసుల సహకారంతో ముద్దాయిని, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి, అంథేరీ కోర్ట్‌లో హాజరుపరిచారు. అక్కడి న్యాయస్థానం సంతృప్తి చెందిన తరువాత విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. తరువాత ఈ కేసుకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లు, సిమ్ కార్డ్, సెల్ఫోన్లను మద్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.అనంతరం మొత్తం ఆధారాలతో ముద్దాయిలను కోర్ట్‌లో హాజరుపరిచారు. దీనిపై కోర్ట్ వారిని రిమాండ్‌కు పంపారు. అనంతరం పోలీసులు తదుపరి విచారణ కోసం పోలీస్ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై అయిదు రోజుల పోలీస్ కస్టడీకి జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులను అప్పగించారు. కస్టడీలో కూడా వారు అనేక విషయాలను వెల్లడించారు. తరువాత ముద్దాయిలు వేసుకున్న రెండు బెయిల్ పిటీషన్లు కూడా డిస్మిస్ అయ్యాయి. 2024 ఏప్రిల్ 24న ముద్దాయిలు వేసుకున్న కండీషన్ బెయిల్ మంజూరయ్యింది.23 రోజుల తరువాత మోడిఫికేషన్ జరిగి బెయిల్ కండీషన్లను రిలాక్స్ చేశారు. ముంబైలో అరెస్ట్ చేసిన నాటి నుంచి విజయవాడ కోర్ట్‌కు తీసుకువచ్చిప్పడు, పోలీస్ కస్టడీలో విచారణ విషయలో ఎక్కడా పోలీస్ అధికారులపై ఆమె ఫిర్యాదు చేయలేదు. నాతో పోలీస్ అధికారులు చట్టప్రకారమే వ్యవహరించారని, ఎటువంటి ఇబ్బంది పెట్టలేదని మేజిస్ట్రేట్ ముందు చెప్పారు. అలాగే ఎలాంటి ఫిర్యాదు కూడా చేయలేదు. పోలీస్ కస్టడీలో అడ్వకేట్ సమక్షంలోనే పోలీసులు విచారణ జరిపారు. మద్యవర్తులు, అడ్వకేట్ సమక్షంలో పోలీస్ కస్టడీలో జరిగిన విచారణలో జత్వానీ అంగీకరించిన అన్ని విషయాలను మధ్యవర్తులు రాసిన తరువాత దానిపై సంతకం చేసేందుకు ఆమె నిరాకరించారు. మద్యవర్తులు మాత్రం సంతకాలు చేశారు. దీనిని బట్టి ఆమెను ఎక్కడా పోలీసులు నిర్భందం, వత్తిడి చేయలేదు. పోలీసులు సమర్పించిన నివేదికలోనూ ఆమె సంతకం చేసేందుకు నిరాకరించారనే రాసి, కోర్ట్‌లో సమర్పించారు.కుట్రపూరితంగా జత్వానీతో తప్పుడు ఫిర్యాదు చేయించారువిజయవాడ, ముంబై కోర్ట్‌ల్లో తనపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని, తప్పుడు కేసు పెట్టారని జత్వాని ఎటువంటి ఆరోపణలు చేయలేదు. దర్యాప్తు ప్రక్రియ ముందుకు సాగుతున్న తరుణంలో ఆగస్టు 2024 అంటే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత టీవీ5 కి జత్వానీ ఇచ్చిన ఇంటర్వూలో నాపైన తప్పుడు కేసులు పెట్టాయంటూ ఆరోపణలు చేశారు. ఈ ఇంటర్వూ తరువాత ఆన్లైన్ ద్వారా పోలీస్ అధికారులు ఒక ఫిర్యాదు తెప్పించుకున్నారు. దానిని ఎల్లో మీడియాలో ప్రముఖంగా ప్రచురించారు. జత్వానీపై అప్పటి పోలీస్ అధికారులు దురుసుగా ప్రవర్తించి, తప్పుడు కేసులు పెట్టారంటూ కథనాలు రాశారు.ఎల్లో మీడియా వార్తల ఆధారంగా సిటీ పోలీస్ కమిషనర్ ఒక విచారణాధికారిని నియమించారు. తరువాత 2024 సెప్టెంబర్ 5న జత్వానీ విజయవాడకు వచ్చి నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తరువాత కొందరి స్టేట్మెంట్లను కూడా పోలీసులు తీసుకున్నారు. దీనిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందే జత్వానీ కేసులో కొందరు పోలీస్ అధికారులు సీఐ నుంచి సూపర్ వైజర్ స్థాయిలో ఉన్న డీజీపీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు వరకు కేసులు పెట్టారు. కుక్కల విద్యాసాగర్‌ను అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 13న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అంతకు ముందే విచారణాధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు.ఒక కేసులో నేరం చేశారన్న అభియోగాల నేపథ్యంలో చట్టప్రకారం అరెస్ట్ అయి ప్రధాన నిందితురాలుగా ఉన్న కాందబరీ జత్వానీ తనపై ఉన్న కేసుల దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే, ఇంకా చార్జ్‌షీట్ కూడా దాఖలు కాని సందర్భంలో, కోర్ట్‌లో ఉన్న కేసులో ఆ ప్రక్రియను నీరుగార్చేలా కేసును డైవర్ట్ చేసి, ఆ కేసులో ఫిర్యాదు ఇచ్చిన కుక్కల విద్యాసాగర్, ఆ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులపైన కౌంటర్ కేసులు పెట్టారు. ఇది దేశ చరిత్రలో ఎక్కడా ఇలా జరగలేదు. కేసు అండ్ కౌంటర్ కేసులంటే ఇరు వర్గాల మధ్య ఘర్షన జరిగిన్పపుడు ఇరు పక్షాలు కేసులు పెట్టుకుంటాయి.జత్వానీకి కూటమి సర్కార్ రాచమర్యాదలుజత్వానీ కేసులో ఏడు నెలల తరువాత ప్రభుత్వం మారగానే కూటమి ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు జత్వానీని విలాసవంతమైన హోటల్లో పెట్టి, ఆమెకు రాచమర్యాదలు చేసి, ప్రోటోకాల్ దర్శనాలు చేయిం, ఆమెతో తప్పుడు ఫిర్యాదులు తీసుకుని కేసు పెట్టారు. ఇది చట్ట ప్రకారం తప్పు. ఇది సెక్షన్ 195 సీఆర్పీసీ ప్రకారం ఆ న్యాయస్థానంలో ఏదైనా తప్పుడు కేసు పెట్టారని, తప్పుడ డాక్యుమెంట్లు చూపించారని, దర్యాప్తులో ఒక వర్గంకు అనుకూలంగా చేశారనే విషయాలు ఉంటే ఏ కోర్టులో ఆ వ్యవహారంలో జరుగుతుందో ఆ కోర్ట్ కొన్ని ఆదేశాలు ఇవ్వవచ్చు. దానిపై దర్యాప్తు చేయమని, బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని, డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకోవాలని కోర్ట్ మాత్రమే ఆదేశాలు ఇచ్చే అధికారం ఉంది. కానీ ఈ కౌంటర్ కేసు ఏడు నెలల తరువాత పోలీస్ అధికారులపై కక్ష తీర్చుకోవడానికి ఇలా తప్పుడు కేసు పెట్టారు.చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని, పెద్ద ఎత్తున అల్లర్లు జరగాలని చంద్రబాబు సంకల్పించిన సమయంలో అప్పటి అధికారులు రాజమండ్రి జైలు వరకు ఎటువంటి అల్లర్లు జరగకుండా పకడ్భందీగా బందోబస్త్ నిర్వహించారనే కక్షతోనే వారిపై ఇలా తప్పుడు కేసులు పెట్టించారు. అలాగే సిట్ దర్యాప్తులో స్కిల్ డెవలప్మెంట్ ఇతర స్కాంలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా కొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. సిట్‌లోని అధికారులపై కక్ష తీర్చుకునేందుకు ఇలాంటి తప్పుడు కేసులు బనాయించారు. అలాగే సిట్‌కు సలహాదారుగా ఉన్న అడ్వకేట్ ఐ.వెంకటేశ్వర్లుపై కూడా కేసు పెట్టడం చాలా దురదృష్టకరం. ఇలాంటి సందర్భంలో ఈ కేసు చట్టం ముందు నిలబడదని తెలిసి, తాత్కాలికంగా అధికారులను వేధించేందుకు జత్వానీ వ్యవహారాన్ని ప్రభుత్వం వాడుకుంటోంది.పోలీస్ అధికారుల మనోస్థైర్యం దెబ్బతీశారుకూటమి సర్కార్ వల్ల కక్షసాధింపులు ఎదుర్కొంటున్న అధికారులు తమ సుదీర్ఘ కెరీర్లో ఒక్క చిన్న మచ్చ కూడా లేదు. వారికి అనేక అవార్డులు, మెడల్స్, ప్రభుత్వాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థలను పతనం చేసేందుకు ఎంతకైనా దిగజారుతోంది. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇదే పద్దతి వచ్చే ప్రభుత్వం కూడా అమలు చేస్తే ఏమవుతుంది? సోషల్ మీడియా, పలు తప్పుడు కేసుల్లో పోలీసులు తమపైన బలవంతంగా స్టేట్మెంట్లు తీసుకున్నారని ముద్దాయిలు ఎదురు కేసులు పెట్టే అవకాశం ఉంది. బలవంతంగా మాతో సాక్షాలు చెప్పించారంటూ పోలీసులపై సాక్షులు కేసులు పెట్టే అవకాశం ఉంది.ఒక దుష్ట సంప్రదాయంకు ఆజ్యం పోస్తున్నారు. పోలీసులు కూడా ఆలోచించాలి. పై అధికారుల ఒత్తిడితో ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారు. వచ్చే ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తే, దాని పరిణామాలు ఎలా ఉంటాయి? గూగూల్ టేక్ అవుట్స్, ఫోన్ రోమింగ్ సమాచారం, ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు ఇలా ప్రతి అంశాన్నీ పరిగణలోకి తీసుకుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్లుగానే వచ్చే ప్రభుత్వం చేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పటికే అనేక మంది పోలీస్ అధికారులకు జీతాలు చెల్లించకుండా, రీజనల్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలంటూ వేధింపులకు గురి చేస్తోంది. పోలీస్ అధికారుల సంఘాలు కూడా దీనిపై స్పందించాలి. రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు పెట్టి, అధికారులను సంతృప్తి పరిచామంటూ చేతులు దులుపుకుంటే, భవిష్యత్తులో న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా కేసుల్లో పోలీస్ అధికారులు గతంలో అరెస్ట్ చేసిన ముద్దాయిలతో ఎదురు కేసులు పెట్టిస్తున్నారు.మద్యంపైనా ఇదే తరహా కౌంటర్ కేసులుతెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మద్యంలో జరిగిన అక్రమాలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. చంద్రబాబు దీనిలో ముద్దాయిగా ఉన్నారు. ఈ కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారనే కక్షతోనే బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు పలువురు అధికారులపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కాం అంటూ కౌంటర్ కేసులు పెట్టింది. ప్రభుత్వమే మద్యంను విక్రయించిన నేపథ్యంలో స్కాం అనే దానికే అర్థం లేదు. అలాంటిది రాజకీయంగా వైఎస్సార్సీపీ నాయకులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని లిక్కర్ స్కాం అంటూ కేసులు పెట్టారు.అధికారులను దీనిలో భాగస్వాములు చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాల్లో మద్యం కేసుల్లో ఏ అధికారి ఎవరి ఇంటికి వెడుతున్నారు, ఏ డిస్టిలరీ యజమానితో మాట్లాడారు, ఎవరితో ఏ రకంగా ఫిర్యాదులు చేయిస్తున్నారో అందరికీ తెలుసు. భవిష్యత్తులో వీటిపై పోలీసులు న్యాయస్థానాల ముందు ఇబ్బందులను ఎదుర్కొంటారు. పోలీసులు చట్ట ప్రకారం, న్యాయ ప్రక్రియ ప్రకారం పనిచేయాలి. రాజకీయ విశ్వాసం కోసం కాకుండ ప్రజల విశ్వాసం కోసం పనిచేయాలి. -
సూపర్ సిక్స్ కు డబ్బుల్లేవ్.. అమరావతికి మాత్రం లక్షల కోట్లు..
-
‘తల్లికి వందనం అమలు ఎప్పుడు చంద్రబాబూ?’
సాక్షి, తాడేపల్లి: విద్యతోనే పేదరికంను నిర్మూలించాలన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూసిన ఘనత వైఎస్ జగన్‌ది అయితే, విద్యను పేదలకు దూరం చేస్తున్న దుర్మార్గం చంద్రబాబుదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించిన చంద్రబాబు దానిని అమలు చేయడానికి ఖజానా ఖాళీ అంటూ వంకలు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లల చదువులపైనా చంద్రబాబు కర్కశత్వం చూపుతున్నారని, విద్యార్ధుల ఉసురుపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..ఏపీలో కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగ స్పూర్తికి తిలోదకాలు ఇస్తోంది. పేదల స్థితిగతులు మార్చాల్సిన కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా పనిచేస్తోంది. సామాజిక రుగ్మతలు పోవాలంటే చదువే ప్రామాణికమని ఆనాడు బీఆర్ అంబేద్కర్ చెప్పారు. విద్యతోనే పేదల తలరాతలు మారుతాయని వైయస్ జగన్ నమ్మి, తన పాలనలో దానిని ఆచరణలోకి తీసుకువచ్చారు. సామాజిక మార్పు కోసం విద్యకు పెద్దపీట వేశారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్షేత్రస్థాయి నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేశారు. ప్రతి తల్లి ఖాతాలో రూ.15వేలను జమ చేయడం ద్వారా రాష్ట్రంలో గొప్ప సంస్కరణలకు ఆద్యుడు అయ్యారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించారు. ఏ కుటుంబంలో అయినా ఎంతమంది పిల్లలు బడికి వెళ్ళేవారు ఉంటే ప్రతి ఒక్కరికీ రూ.15 వేల చొప్పున ఆ పిల్లల తల్లికి ఇస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు గొప్పగా ప్రచారం చేసుకున్నాయి.ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు బహిరంగసభల్లో ఏం మాట్లాడారో కూడా ఈ మీడియా సమావేశంలో ప్రజలు గమనించేందుకు వీలుగా ప్రదర్శిస్తున్నాం. అలాగే ప్రస్తుత మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ప్రతి ఇంటికి వెళ్ళి 'నీకు పదిహేను... నీకు పదిహేను వేలు అంటూ' అందరినీ నమ్మించారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ప్రజలు చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తల్లికి వందనం కింద ఇస్తామన్న సొమ్ము ఏమయ్యిందని ప్రశ్నిస్తున్నాం. సీఎం చంద్రబాబు చదువులమ్మ తల్లిని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.వాయిదాల రూపంలో ఇస్తారా..కూటమి ప్రభుత్వం మిగిలిన అన్ని హామీలతో పాటు తల్లికివందనంను కూడా గాలికి వదిలేసింది. దీనిపై మేం బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నిస్తుంటే, ఖజానా ఖాళీ అయ్యిందని చంద్రబాబు వంకలు వెతుకుతున్నాడు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తల్లికివందనం కింద ఇచ్చే రూ.15వేలను కూడా వాయిదాల రూపంలో ఇస్తానని మాట మార్చారు. మేం అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంటే... 'అమ్మ ఒడి-నాన్న బుడ్డీ' అంటూ కూటమి పార్టీలు అత్యంత హేయంగా విమర్శించారు. ఇప్పుడు కూటమి పాలనలో మంచినీళ్ళు దొరకడం లేదు, కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోంది. విద్యపట్ల, విద్యార్ధుల తల్లులకు ఇచ్చే అమ్మ ఒడి పట్ల చంద్రబాబుకు ఉన్న చిన్నచూపుకు గతంలో ఆయన చేసిన విమర్శలే నిదర్శనం.విద్యారంగానికి పెద్దపీట వేసిన వైఎస్ జగన్‘‘డబ్బు లేక పిల్లలు విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో వైయస్ జగన్ అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా నాలుగేళ్ల పాటు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. అయిదో ఏడాది కూడా 2024 జూన్ నాటికి ఇవ్వడానికి అన్ని సిద్దం చేసి ఎన్నికలకు వచ్చారు. జగన్ ప్రభుత్వంలో 83 లక్షల మంది పిల్లలకు 44,48,865 మంది తల్లుల ఖాతాలకు రూ. 26,౦67 కోట్లు జమ చేశారు. 57 నెలల్లో విద్య కోసం ఆనాడు వైఎస్ జగన్ జగనన్న విద్యాకానుక కోసం రూ.3366 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం రూ.4417 కోట్లు, మాబడి నాడు-నేడు రెండు దశలకు కలిపి రూ. 13000 కోట్లు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ కోసం రూ.6688 కోట్లు, ఆడపిల్లల నాప్కిన్ల కోసం రూ.32 కోట్లు, విద్యార్ధులకు బైజూన్ కంటెంట్ ట్యాబ్‌ల కోసం రూ.1300 కోట్లు..విద్యాదీవెన కోసం 12610, వసతి దీవెన కోసం రూ.5392 కోట్లు, విదేశీ విద్యాదీవెన కోసం రూ.107 కోట్లు ఇలా వివిధ పథకాల కోసం మొత్తం దాదాపు 72,919 కోట్లు ఖర్చు చేశారు. ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చదువుల కోసం, విద్యాప్రమాణాలను పెంచడం కోసం ఇలా ఖర్చు చేయలేదు. ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి అక్కచెల్లెమ్మల పిల్లలకు మేనమామగా వారి విద్యకు అండగా నిలుస్తానని ఆనాడు వైఎస్ జగన్ ముందుకు వచ్చారు. కానీ నేడు ఆ పరిస్థితిని చంద్రబాబు పూర్తిగా మార్చేశారు. తల్లికి వందనంపై రోజుకో మాట చెబుతూ, విద్యార్ధులను వారి తల్లులను ఏమార్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతాం. ఇచ్చిన మాట ప్రకారం తక్షణం తల్లికి వందనం కింద విద్యార్ధులకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. -
అప్పు కోసం బరితెగించిన కూటమి సర్కార్
-
‘బాబూ.. సూపర్ సిక్స్‌కు డబ్బుల్లేవ్.. లక్ష కోట్ల అమరావతి!’
సాక్షి, అనంతపురం: ఏపీలోని సహజ వనరులను తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని అంటూ అమరావతిలో మళ్లీ శంకుస్థాపనలు హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతి పునర్ నిర్మాణం పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు.. మరోవైపు లక్ష కోట్ల రాజధాని ఎలా?. ఏపీలోని సహజ వనరులను తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కింది. సూపర్ సిక్స్ హామీల అమలులో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. చంద్రబాబు 11 మాసాల పాలన విశ్వాసం ఘాతుకానికి నిదర్శనం. మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి సంతకం నేటికీ అమలు కాలేదు. అమ్మ ఒడి లేదు.. రైతు భరోసా పథకం సాయం లేదు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఉందా అన్న అనుమానం కలుగుతోంది. రైతుల ఆత్మహత్యలు చంద్రబాబుకు పట్టావా?. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఏపీ అభివృద్ధి పై ప్రధాన మంత్రి స్పష్టత ఇవ్వాలి. పునర్విభజన చట్టం హామీలను అమలు చేయాలి. పోలవరం ఎత్తు తగ్గింపు తగదు. చంద్రబాబు పాలనలో 99 రూపాయలకే మద్యం దొరుకుతోంది. చంద్రబాబు అస్మదీయులకు 99పైసలకే విశాఖలో ఎకరం భూమి దొరుకుతోంది అని ఎద్దేవా చేశారు. -
అమ్మా అనితా ఎందుకా అబద్ధాలు.. అంబటి మాస్ వార్నింగ్
-
ఉర్సా కంపెనీ పెట్టింది దోచుకోవడానికే : కేశినేని నాని
-
బాబు మార్క్ పాలన.. సీఎం బంధువుకు దక్కలేదని టెండర్ రద్దు
సాక్షి, అమరావతి: అస్మదీయులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టి కమీషన్ల రూపంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని దండుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు. కనీస అనుభవం, అర్హతలేని సంస్థలకు రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్‌లను అడ్డగోలుగా కట్టబెడుతున్నారు. ప్రభుత్వ పెద్దల బంధువులు, సన్నిహితులు, కమీషన్లు ముట్టజెప్తే కంపెనీలకు కాంట్రాక్ట్ దక్కని పరిస్థితుల్లో ఏకంగా టెండర్లనే రద్దు చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్ టెండర్లలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది.చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన సంస్థ2014–19 మధ్య అధికార బలంతో సీఎం బంధువు దేవదాయ, వైద్య శాఖల్లో పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్ట్‌లు దక్కించుకున్నారు. పనులు సక్రమంగా చేయకపోయినప్పటికీ సీఎం బంధువు కావడంతో అధికారులు సైతం నోరెత్తకుండా అడ్డగోలుగా బిల్లులు చేశారు. గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం బంధువు కంపెనీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు కూడా దేవదాయ, వైద్య శాఖల్లో కాంట్రాక్ట్‌లపై సీఎం బంధువు కన్నేశారు. కొద్దినెలల క్రితం ఏపీ ఎంఎస్ఐడీసీ ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ పనుల కోసం టెండర్లు పిలవగా.. బిడ్ దాఖలు చేయడంతో పాటు, సీఎంవో నుంచి ఉన్నతాధికారులకు సదరు కంపెనీ సిఫార్సు చేయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, పరిశీలన దశలోనే బిడ్ అనర్హతకు గురైంది. దీనికి తోడు వివిధ మార్గాల్లో ప్రభుత్వ పెద్దలతో డీల్ కుదుర్చుకున్న సంస్థలకు పనులు దక్కే అవకాశం లేకుండా పోయింది. దీంతో కోర్టు కేసులు, వివాదాలు, ఇతర కారణాలను బూచిగా చూపి మొత్తం టెండర్‌నే ప్రభుత్వం రద్దు చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కుట్ర బట్టబయలుడీఎంఈ, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ నిర్వహణకు ఒకేసారి టెండర్లు పిలిచారు. కాగా, ఒక్క శానిటేషన్ టెండర్లనే ప్రభుత్వం రద్దు చేసింది. వాస్తవానికి సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ టెండర్ల ప్రక్రియలోనూ అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. సెక్యూరిటీ విభాగంలో ఒక సంస్థ టెండర్ నిబంధనలకు విరుద్ధంగా తక్కువకు ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసింది. నిర్దేశిత నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేస్తే రద్దు చేస్తామని టెండర్ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.అయినప్పటికీ ఈ సంస్థ బిడ్‌ను ప్రభుత్వం తిరస్కరించలేదు. కోర్టు కేసులు, బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయని, వారికి పనులు కట్టబెట్టకుండా చూడాలని కోర్టులో కేసులు దాఖలయ్యాయి. టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగానే పెస్ట్ కంట్రోల్ విభాగంలో సాయి సెక్యూరిటీ అనే సంస్థపై చీటింగ్ కేసు నమోదైంది. కాగా, ఆయా సంస్థలన్నీ అమాత్యుడు, ఇతర ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ముట్టజెప్పేలా డీల్ కుదుర్చుకోవడంతో ఈ పనుల వరకూ కాంట్రాక్టర్ల ఎంపిక ముగించేశారు. కుంటి సాకులతో ఒక్క శానిటేషన్ టెండర్లను రద్దు చేయడంతో ప్రభుత్వ పెద్దల కుట్ర బట్టబయలైంది. -
‘సిట్’ చిలకమ్మ.. కట్టుకథలు
సాక్షి, అమరావతి: టీడీపీ వీరవిధేయ సిట్ కట్టుకథలు అంతూ పొంతూ లేకుండా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు నివేదికల పేరిట అవాస్తవాలు, అభూతకల్పనలతో కనికట్టు చేసేందుకు బరితెగిస్తోంది. ఆ కేసులో అక్రమంగా అరెస్టు చేస్తున్నవారి వాంగ్మూలాల పేరిట న్యాయస్థానానికి సమర్పిస్తున్న రిమాండ్ రిపోర్టులే చంద్రబాబు ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తున్నాయి. మొన్న రాజ్ కేసిరెడ్డి.. నిన్న చాణక్య.. నేడు శ్రీధర్ రెడ్డి.. ఈ ముగ్గురి రిమాండ్ రిపోర్టులు పరిశీలిస్తే ప్రభుత్వ కుతంత్రం బయటపడుతోంది. అంతా కనికట్టే! వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోంది. దీనికోసం టీడీపీ వీరవిధేయ అధికారులతో కూడిన సిట్ ద్వారా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతోంది. ఈ కేసులో న్యాయస్థానానికి సమర్పించిన వరుసగా మూడో రిమాండ్ రిపోర్ట్ కూడా సిట్ కుయుక్తులను బయటపెట్టింది. ఈ కేసులో ఆరో నిందితుడిగా శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానంలో శనివారం హాజరు పరుస్తూ సిట్ రిమాండ్ రిపోర్టు సమర్పిoచింది. అంతకుముందు రాజ్ కేసిరెడ్డి, చాణక్య రిమాండు రిపోర్టుల్లో పేర్కొన్న అవాస్తవ ఆరోపణలు, కల్పిత అభియోగాలనే శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులోనూ సిట్ పునరుద్ఘాటించింది. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి తదితరుల పేర్లను ప్రస్తావిస్తూ అవాస్తవాలను వండి వార్చింది. పైగా అవన్నీ కూడా శ్రీధర్‌రెడ్డి తమ విచారణలో వెల్లడించారని సిట్ పేర్కొనడం గమనార్హం. కానీ ఆ వాంగ్మూలంపై సంతకం చేసేందుకు శ్రీధర్ రెడ్డి నిరాకరించారని ఆ నివేదికలో పేర్కొంది. మధ్యవర్తుల సమక్షంలో తాము వాంగ్మూలాన్ని నమోదు చేశామని తెలిపింది. అంటే ఈ కేసులో కుట్ర క్రమం అంటూ సిట్ వివరించిన విషయాలేవీ వాస్తవం కాదని స్పష్టమైంది. వాటిని శ్రీధర్‌రెడ్డి చెప్పనే లేదని.. అందుకే ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారన్నది బయటపడింది. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేస్తూ సిట్ అధికారులే అవాస్తవాలు, అభూతకల్పలను వాంగ్మూలంగా నమోదు చేసేశారని స్పష్టమైంది. ఇదే కేసులో రాజ్ కేసిరెడ్డి, చాణక్య కూడా చెప్పని విషయాలను చెప్పినట్టుగా సిట్ ఏకపక్షంగా వారి పేరిట వాంగ్మూలంగా నమోదు చేసింది. కానీ తాము సంతకాలు చేయలేదనే విషయాన్ని వారే న్యాయస్థానం దృష్టికి తీసుకువెళితే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే సిట్ అధికారులు ఆ విషయాన్ని రిమాండ్ రిపోర్టులో తప్పనిసరై వెల్లడించారు. ఇంత బరి తెగింపా..! ఇంత నిర్భీతిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సిట్ దర్యాప్తు పేరుతో అటు న్యాయస్థానాలను ఇటు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు అధికారులు యత్నిస్తుండటం విస్మయపరుస్తోంది. ఆ అబద్ధపు వాంగ్మూలాలను టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడమే సిట్ లక్ష్యమన్నది తేటతెల్లమవుతోంది. ఈ కేసు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తుంది కేవలం రెడ్ బుక్ కక్ష సాధింపు కుట్రేనన్నది స్పష్టమవుతోంది. -
‘మత్స్యకారులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఇవాళ చంద్రబాబు.. మత్సకారుల సంక్షేమం కోసం ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారని.. ఈ 44 ఏళ్ల కాలంలో వారి సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నిలదీశారు. టీడీపీ 44 ఏళ్ల చరిత్రలో ఈ రాష్ట్రంలో ఎన్ని హార్బర్లు కట్టారు?, ఎన్ని పోర్టులు కట్టారు? అంటూ ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో మత్సకారుల కష్టాలను చూసి వారి సంక్షేమానికి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారన్నారు.‘‘గత ప్రభుత్వంలో చేపట్టిన హార్బర్ల పనులు అన్ని అర్ధాంతరంగా ఆపేశారు. మీరు ఈ రోజు అదే ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో చంద్రబాబు మీటింగ్ పెట్టారు. రివైజ్ డీపీఆర్ పేరుతో అన్ని ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలు ఆపేశారు. చంద్రబాబుకు ఎప్పుడూ మత్స్యకారులు అంటే చిన్న చూపే. వైఎస్ జగన్ హయాంలో ప్రతీ జిల్లాకు ఒక హార్బర్ ఉండాలని మొదలు పెట్టి నాలుగు హార్బర్ల నిర్మాణం పూర్తి చేశారు. చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఎన్ని పోర్టులు కట్టారు?. ఒక్క పోర్టు కూడా కట్టలేదు. వైఎస్ జగన్ హయాంలో నాలుగు పోర్టులు ప్రారంభమయ్యాయి.మత్స్యకార భరోసా 20 వేలు ఇచ్చామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. మరి గత సంవత్సరం మత్స్యకార భరోసా బకాయిల పరిస్థితి ఏంటి?. గత టీడీపీ హయాంలో 4 వేల మత్స్యకార భరోసా ఇస్తే.. వైఎస్ జగన్ పాలనలో రూ.10 వేలు రూపాయలు అందించాం. 2023-24 మధ్యలో మత్స్యకార భరోసా బకాయిలు కూడా చంద్రబాబు ఇవ్వాల్సిందే. ఐదేళ్ల కాలంలో ఇవ్వాల్సిన మత్స్యకార భరోసా 3 ఏళ్లు ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది...తక్షణమే ఆపేసిన బుడగట్లపాలెం హార్బర్ పనులు ప్రారంభించండి. నువ్వులరేవు హార్బర్ పనులకు అనుమతులు తీసుకురండి. చంద్రబాబుకు పరిపాలన చేతగాక లక్షా యాభై వేల కోట్లు రూపాయలు అప్పు చేశారు. అచ్చెన్నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జిల్లాకు ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకు రాలేదు. ఉర్సా ట్రస్టు భూములు ఎలా అప్పనంగా ప్రవేట్ కంపెనీలు కట్టబెడతారు?. 6 నెలల క్రితం అమెరికాలో పెట్టిన కంపెనిపై ఎందుకంత ఆసక్తి’’ అంటూ అప్పలరాజు ప్రశ్నించారు. -
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మెలిక
సాక్షి,శ్రీకాకుళం జిల్లా: తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మరో మెలిక పెట్టారు. తల్లికి వందనాన్ని ఇన్స్టాల్మెంట్ స్కీంగా మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నారు. 15 వేలు ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నాం. ఒకే ఇన్‌స్టాల్‌మెంటా? లేక ఇంకెలా ఇవ్వాల్లో ఆలోచిస్తున్నామంటూ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో తల్లికి వందనంపై సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటికే 2024-25 విద్యా సంవత్సరం ‘తల్లికి వందనం’ ఇవ్వలేదు...విద్యా సంవత్సరం ముగిసినా తల్లికి వందనం ఇవ్వకుండా పిల్లలు, తల్లులను చంద్రబాబు మోసం చేశారు. ఈ ఏడాది స్కూల్, ఇంటర్ ఫీజుల కోసం పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. ఇన్నాళ్లు మే లో 15 వేలు ఒకేసారి ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు.. తాజాగా ఇన్స్టాల్మెంట్ మెలిక పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చేబ్రోలు కిరణ్‌ను పెంచి పోషించేది చంద్రబాబే: అంబటి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఏడాది కాలం పాలనలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏమీ చేయకపోయినా చంద్రబాబును హీరోలా చూపిస్తూ ఆయన అనుకూల మీడియా కథనాలు ప్రసారం చేస్తుందని.. చంద్రబాబు హీరో కాదు.. విలన్’’ అంటూ ఆయన దుయ్యబట్టారు. గతంలోనూ విలన్ లాగే వ్యవహరించారు. సోషల్ మీడియా సైకోల తోక కత్తిరిస్తానంటూ అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టేవారి కోరలు పీకేస్తామన్నారు. పిడి యాక్ట్ పెట్టి తాటతీస్తామన్నారు. చంద్రబాబు అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.‘‘వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై చాలా దారుణమైన పోస్టులు పెట్టారు. తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చేబ్రోలు కిరణ్‌ను పెంచిపోషించింది చంద్రబాబు కాదా?. చేబ్రోలు కిరణ్ ఎంతో మందిపై చాలా దారుణంగా మాట్లాడాడు. చేబ్రోలు కిరణ్‌ను అరెస్ట్ చేసి వదిలేశారు. చేబ్రోలు కిరణ్ విడుదలైనంత తొందరగా సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయిన వారెవరూ విడుదల కాలేదు. వైఎస్సార్సీపీ నుంచి ఎవరు అరెస్ట్ అయినా వారిని పిటిషన్ వేసి కస్టడీకి తీసుకుంటున్నారు. కానీ చేబ్రోలు కిరణ్‌ను మాత్రం పోలీస్ కస్టడీకి తీసుకోలేదు. చంద్రబాబు పెంచి పోషించాడు కాబట్టే.. చేబ్రోలు కిరణ్ కేసులో 24 గంటల్లో విచారణ పూర్తయిపోయింది..చంద్రబాబు చేయించిన ఏ అరెస్ట్ లోనూ ఇంత త్వరగా విచారణ పూర్తికాలేదు. చంద్రబాబు డైరెక్షన్లో కొన్ని వందల మంది ఐ-టీడీపీలో పనిచేస్తున్నారు. ఎవరిని ఎక్కువ బూతులు తిడితే వారిని అంత పోషిస్తామని చెబుతున్నారు. చంద్రబాబు మాటలన్నీ దొంగమాటలు. స్వాతి రెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్త పేరు స్వాతి చౌదరి. వైఎస్ జగన్ ఫోటోలు మార్ఫింగ్ చేయించేది చంద్రబాబు, లోకేష్‌లే. టీడీపీని మేం ప్రశ్నిస్తే వాళ్లకంటే ముందు సీమ రాజా అనేవాడు స్పందిస్తాడు. వైఎస్సార్సీపీ కండువా వేసుకుని టీడీపీ తరపున మమ్మల్ని తిడతాడు. సీమరాజాపై ఒకసారి కేసుపెట్టా.. మళ్లీ పెడతా. కిరాక్ ఆర్పీ అనేవాడు రోజూ వైఎస్ జగన్‌ను, నన్ను, రోజాను తిడతాడు. చంద్రబాబుతో ఫోటోలు దిగుతాడు. వ్యక్తిత్వ హననం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టి విద్య. ఎన్టీఆర్‌తో మొదలుపెట్టి ఇప్పటికీ ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూనే ఉన్నాడు..వ్యక్తిత్వ హననం చేసి చంద్రబాబు పైశాచికానందం పొందుతున్నాడు. సోషల్ మీడియాలో వారిని పెంచి పోషించేది వారికి డబ్బులిచ్చేది చంద్రబాబే. సోషల్ మీడియాలో పనిచేస్తే పేమెంట్ ఇస్తానని చెప్పింది చంద్రబాబు. ఎవరు బాగా తిడితే వారికి ఎక్కువ పేమెంట్ ఇస్తామని సాక్షాత్తూ చంద్రబాబే చెప్పారు. యూ ట్యూబ్లలో సైతం ఎంతో దుర్మార్గంగా.. దారుణమైన పోస్టులు పెడుతున్నారు. వెంకట కృష్ణ ఒక కీ ఇచ్చే బొమ్మ. వెనకుండి నడిపించేది రాధాకృష్ణ. మార్ఫింగ్ చేసిన పోస్టులు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరు. చేబ్రోలు కిరణ్ వంటి వారిని పెంచి ప్రోత్సహిస్తూ.. మహిళలను ఏదైనా అంటే సహించేది లేదని బిల్డప్ ఇస్తున్నారు...చంద్రబాబుని మోసేది సీమరాజా, కిర్రాక్ ఆర్పీ వంటి వారే. ఇంత నీచమైన స్థితికి టీడీపీ దిగజారిపోవడం బాధాకరం. ఐ-టీడీపీ ద్వారా జరుగుతున్న నీచమైన ప్రచారాలకు చంద్రబాబు చెక్ పెట్టాలి. ఏ ఒక్కరినీ వదలం అందరిపైనా కేసులు పెడతాం. అనిత పేరుకే హోంమంత్రి. హోంశాఖ గురించి ఆమెకు తెలియదు.. హోంశాఖను నడిపించేది లోకేష్. మా ఫిర్యాదులపై పోలీసులు కేసులు రిజిస్టర్ చేయకపోతే న్యాయపరంగా పోరాడతా. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వికృతచేష్టలపై పోరాడతాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు. -
చంద్రబాబు ఘరానా మోసం కార్యక్రమం చేపట్టిన అభినయ్ రెడ్డి
-
‘ఏపీలో స్కీములు లేవు.. అన్నీ స్కాములే’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో స్కీములు లేవు కానీ.. స్కాములు మాత్రం విచ్చలవిడిగా ఉన్నాయంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండిపడ్డారు. ఇసుక, మట్టి, లిక్కర్, మైనింగ్, రాజధాని పనుల్లో సైతం అవినీతి విలయ తాండవం చేస్తోందన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకు వారి సన్నిహితులకు కారుచౌకగా భూములు కట్టబెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కనీసం ఒక టీ కంటే తక్కువ ఖర్చుకు భూములు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు.అమరావతిలో జి+1 బిల్డింగ్లు కట్టేందుకు అధిక ధరలకు తన అనుంగులకు చంద్రబాబు కట్టబెట్టారు. వారి ద్వారా హైదరాబాద్‌లో ఒక బిల్డింగ్, మంగళగిరిలో పార్టీ కార్యాలయం కట్టించుకున్నారు. టెక్నాలజీ కంపెనీల పేరుతో చంద్రబాబు తన మనుషులకు భూములు దోచిపెడుతున్నాడు. ఊరూ పేరులేని ఉర్సా కంపెనీకి 3 వేల కోట్ల ఖరీదైన భూమిని కట్టబెట్టారు. ఏం అర్హత ఉందని... ఉర్సాకు 59.65 ఎకరాలు కేటాయించారు’’ అంటూ శివశంకర్‌రెడ్డి నిలదీశారు.2024 సెప్టెంబర్ 27వ తేదీన అమెరికాలో ఉర్సా కంపెనీ రిజిస్టర్ అయ్యింది. అక్టోబర్‌లో లోకేష్ పర్యటన తర్వాత పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ ఓ కథ అల్లారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన భారత దేశంలో ఉర్సా కంపెనీ రిజిస్టర్ చేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇంటిలో ఉర్సా కంపెనీ కార్యాలయం ఉంది. పది లక్షల రూపాయల మూలధనం పెట్టుబడితో ఉర్సా కంపెనీ పెట్టారు. అరసెంటు భూమి కూడా కేటాయించే అర్హత కూడా ఉర్సాకు లేదు. ఆఫీస్ కూడా లేని ఉర్సాకు మూడువేల కోట్ల రూపాయలు భూములు కట్టబెడతారా?’ అంటూ శివశంకర్‌రెడ్డి ప్రశ్నించారు.21st సెంచ్యూరీ కంపెనీ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి పారిపోయిన వ్యక్తులు అబ్బూరి సతీష్. ఉర్సా కంపెనీ కేటాయింపులపై ఇంత రచ్చ నడుస్తుంటే ప్రభుత్వం, సీఎం, మంత్రులు ఎందుకు స్పందించరు?. ప్రభుత్వానికి బదులు ఉర్సా కంపెనీ ప్రతిధులు ఎలా సమాధానం చెబుతారు?. ప్రైవేట్ కంపెనీని టీడీపీ పార్టీ ఎందుకు భుజాన వేసుకుంటుంది?. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకోవడం దేనికి?. మూడు వేల కోట్ల రూపాయలు భూములు కేటాయింపులో ఎవరెవరికి ఎంత వాటాలు వెళ్లాయి? ఈ వాటాల లెక్కలు తేలాల్సిందే’’ అని శివశంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఉర్సాకు భూముల కేటాయింపు అతిపెద్ద కుంభకోణం. ఉర్సా భూ కుంభకోణం పై సీబిఐతో విచారణ జరిపించాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. భవిష్యత్తు ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీఎండీసీ 9 వేల కోట్ల రుణంతీసుకున్నారు. రోడ్లను సైతం ప్రైవేట్ పరం చేస్తోంది. రాజధానిలో ప్రజల సొమ్ముతో చంద్రబాబు ఐదెకరాల్లో ఇల్లు కట్టుకుంటున్నారు’’ అని శివశంకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
అవినీతి 'ఐకానిక్'!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణానికి చదరపు అడుగు రూ.8,981.56 చొప్పున రూ.4,688.82 కోట్లను కాంట్రాక్టుగా విలువగా నిర్ణయించి సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలవడంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు. ఇదే ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ నాడు టీడీపీ సర్కారు ఒప్పందం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. అప్పటితో పోల్చితే స్టీలు, సిమెంటు, నిర్మాణ సామగ్రి, ఇంధన ధరల్లో పెద్దగా మార్పులేదు. పోనీ.. నిర్మాణ పద్ధతి ఏమైనా మారిందా? అంటే అదీ లేదు. అప్పుడూ ఇప్పుడూ డయాగ్రిడ్ విధానమే. పైగా ఇసుక ఉచితం. ఈ లెక్కన ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం పెరగకూడదు. కానీ.. 2018తో పోల్చితే చదరపు అడుగుకు ఏకంగా రూ.4,631.14 చొప్పున ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేశారు. దీన్నిబట్టి ఐకానిక్ టవర్ల టెండర్లలో భారీ గోల్మాల్ జరిగినట్లు స్పష్టమవుతోందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యనేత తన సిండికేట్‌లో ముగ్గురు బడా కాంట్రాక్టర్లు ఒక్కొక్కరికి ఒక్కో ప్యాకేజీ చొప్పున పనులు అప్పగించాలని నిర్ణయించారు. కాంట్రాక్టు విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి అందులో 8 శాతాన్ని తొలి విడత కమిషన్‌గా రాబట్టుకుని.. ఆ తర్వాత ప్రతి బిల్లులోనూ పెంచిన అంచనా వ్యయాన్ని కమీషన్ రూపంలో రాబట్టుకోవడానికి ఎత్తులు వేస్తున్నారని పేర్కొంటున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను 2015లో చ.అడుగు రూ.3,350 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించి ఆ తర్వాత డిజైన్లలో మార్పు, పని స్వభావం మారిందనే సాకులతో చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున పెంచేశారు. ఈ లెక్కన ఇప్పుడు ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందోనన్న చర్చ అధికారవర్గాల్లో జోరుగా సాగుతోంది.డయాగ్రిడ్ విధానంలో నిర్మాణం..సంప్రదాయ పద్ధతిలో భవనాలను కాలమ్స్ (నిలువు కాంక్రీట్ దిమ్మెలు), బీమ్స్ (అడ్డు కాంక్రీట్ దిమ్మెలు) నిర్మించి కాంక్రీట్‌తో శ్లాబ్ వేస్తారు. ఇటుకలతో గోడలు కట్టి సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తారు. ఐకానిక్ టవర్ల(ఆకాశ హర్మ్యాలు)ను సంప్రదాయ పద్ధతిలో నిర్మించడం సాధ్యం కాదు. డయాగ్రిడ్ విధానంలో నిర్మించేలా ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ డిజైన్ చేసింది. డయాగ్రిడ్ విధానంలో కాలమ్స్, బీమ్స్‌ను ఒక మూల నుంచి మరో మూలకు కలుపుతూ కాలమ్స్ నిర్మిస్తారు. దీనివల్ల గాలి వేగాన్ని తట్టుకుని గురుత్వాకర్షణ శక్తితో ఉంటుంది. అమరావతి ఐకానిక్ టవర్లలో నాలుగింటిని బీ+జీ+39 అంతస్తులతో.. జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో కడుతున్నారు. సచివాలయంలో 1, 2, 3, 4, జీఏడీ టవర్‌లో ఒక్కో అంతస్తు 47 మీటర్లు వెడల్పు, 47 మీటర్ల పొడవుతో 2,209 చదరపు మీటర్లు (23,777 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో నిర్మించనున్నారు. ఇందులో 1,200 చదరపు మీటర్లు(12,916 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతాన్ని వినియోగించేలా నిర్మిస్తారు.వాస్తవానికి చ.అడుగు రూ.2 వేలకు మించదు..!సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ వ్యయం అవుతుందని చెబుతున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని పేర్కొంటున్నారు. అయినా సరే.. 2018తో పోల్చితే ఐకానిక్ టవర్ల అంచనా వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేసి సీఆర్డీఏ టెండర్లు పిలవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మొత్తం ఐదు ఐకానిక్ టవర్లను పరిశీలిస్తే.. సగటున చదరపు అడుగుకు రూ.8,981.56 చొప్పున కాంట్రాక్టు విలువగా నిర్దేశించినట్లు స్పష్టమవుతోంది. రాజధానిలో ఇప్పటివరకూ ఆమోదించిన టెండర్లను పరిగణలోకి తీసుకుంటే.. ఐకానిక్ టవర్ల పనులను కాంట్రాక్టు విలువ కంటే కనీసం 4.5 శాతం అధిక ధరకు టెండర్లలో నిర్మాణ సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. ఈ లెక్కన అంచనా వ్యయం నిర్మాణం ప్రారంభించక ముందే పెరగనుంది. గతంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని బట్టి చూస్తే.. ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో ఊహించుకోవచ్చని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.నాడూ నేడూ అదే దోపిడీ..!2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ఆ తర్వాత అమరావతి నుంచి పాలన అంటూ ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఏకంగా రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసిన వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో ఐటీ శాఖకు పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి తెరతీసినట్లు స్పష్టమవుతోంది.సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం..అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్ విధానంలో ఐకానిక్ టవర్లు నిర్మించేలా పోస్టర్ అండ్ పార్టనర్స్– జెనిసిస్ ప్లానర్స్–డిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు 2018లో డిజైన్లు రూపొందించాయి. ఆ పనులను 2018 ఏప్రిల్‌లో కాంట్రాక్టు సంస్థలకు టీడీపీ సర్కారు అప్పగించింది. పునాదులు అప్పట్లోనే పూర్తి కాగా మిగిలిన పనులకు సీఆర్డీఏ ఇప్పుడు టెండర్లు పిలిచింది.» సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,897.86 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,698.77 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో షాపూర్జీ పల్లోంజీ సంస్థకు రూ.932.46 కోట్లకు అప్పగించడం గమనార్హం.» సచివాలయం 3, 4 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,664.45 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,488.92 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో ఎల్ అండ్ టీ సంస్థకు రూ.784.62 కోట్లకు అప్పగించారు.» ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,126.51 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,007.82 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థకు అప్పగించింది. -
ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి అండగా ఉంటాం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం చేపట్టే పోరాటంలో అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని ఆయన ప్రధానితో చెప్పారు. అమరావతిలో మే 2న చేపట్టే రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమరావతిలో చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి ప్రధానికి వివరించగా, పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ సూచించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని, ఆర్ఐఎన్ఎల్ గురించి ప్రధానికి వివరించిన చంద్రబాబు.. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈసారి రాష్ట్ర పర్యటనలో శ్రీశైలం కూడా సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు కోరారు. -
మాకు అన్యాయం చేయొద్దు బాబుపై డీఎస్సీ అభ్యర్థుల ఆగ్రహం
-
DYFI ఆధ్వర్యంలో విజయవాడలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
-
విద్యా రంగంలో బెడిసికొట్టిన కూటమి సర్కార్ ప్రయోగాలు
-
ప్రభుత్వంపై చంద్రబాబు పట్టు పోయిందా?
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్, చంద్రబాబు ప్రభుత్వాల మధ్య తేడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ హయాంలో అడ్డగోలుగా కేసులు పెట్టడం, అరెస్ట్‌లు చేసిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఆధారాలుంటే మాత్రం పూర్తిస్థాయి విచారణ తరువాత అరెస్టులు జరిగాయి. అయినా కూడా అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం.. అక్రమ కేసులంటూ గగ్గోలు పెట్టేది. దబాయింపులకు దిగేవారు. దుష్ప్రచారానికి తెర లేపారు.టీడీపీకి న్యాయవ్యవస్థపై ఉన్న పట్టు కూడా ఇందుకు ఉపకరించిందని విమర్శకుల అంచనా. మరి ఇప్పుడు? టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంలో అంతా వారి ఇష్టారాజ్యమే. గిట్టనివారిపై మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై ఎడాపెడా తోచిన కేసులు పెట్టేస్తున్నారు. అదేమంటే.. రెడ్‌బుక్ ఎఫెక్ట్ అంటున్నారు. ఈ పైశాచికత్వం ఎంతదాకా వెళ్లిందంటే.. పోలీసు అధికారులూ బలయ్యేంత స్థాయికి!. సీనియర్ పోలీస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను ఆధారాలతోపాటు పట్టుకోవడమే ఈయన చేసిన తప్పు. ఆ కక్షతోనే టీడీపీ తప్పుడు కేసులో అరెస్టుకు దిగిందని విశ్లేషకుల అంచనా.పీఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ, వైఎస్సార్సీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని, వారికి సలహాలు ఇస్తున్నారని ఈనాడులో ఒక కథనం వచ్చిన కొంత కాలానికే ఆయన్ను అరెస్ట్ చేయడం గమనార్హం. స్వతంత్రంగా వ్యవహరిస్తున్నామన్న ముసుగులో ఒక వర్గానికి కొమ్ము కాస్తుండే మీడియా, రాజకీయ పార్టీ ఏకమై పాలన చేస్తే ఎంత ప్రమాదకరమో ఇదే ఉదాహరణ. ఫలానా వారిని ఇంకా అరెస్టు ఎందుకు చేయలేదంటూ.. సీఐడీ విచారణకు హాజరైన ఒక వైఎస్సార్సీపీ నేతను రెండు గంటలే ప్రశ్నించారని.. ఎల్లో మీడియా వార్తలు ఇస్తోందంటే.. పాలకపక్షానికి వీరికి మధ్య ఉన్న లోపాయకారి అవగాహన ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది.మోసాలు చేస్తుందని స్పష్టంగా తెలిసిన ఒక నటి చేసిన ఆరోపణల ఆధారంగా సీనియర్ పోలీస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారు. ఇది ప్రభుత్వానికి అప్రతిష్ట అని, ఐపీఎస్ వర్గాల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని అధికార వర్గాలు భావిస్తున్నా చంద్రబాబు సర్కార్ మొండిగా ముందుకు వెళ్లింది. ఈ కేసులో ఇప్పటికే మరో ఇద్దరు పోలీసు అధికారులు ముందస్తు బెయిల్ పొందగా ఆంజనేయులు మాత్రం ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించ లేదు. తనను అరెస్టు చేస్తారని తెలిసినా ఆయన అందుకు సిద్దపడ్డారంటేనే తాను తప్పు చేయలేదన్న విశ్వాసం అన్నమాట. తాను టీడీపీకి లొంగిపోనని, జైలుకైనా వెళతానని ఆంజనేయులు మాదిరి ధైర్యంగా నిలబడ్డ అధికారి ఇటీవలి కాలంలో ఇంకొకరు లేరు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని ఏపీ ప్రభుత్వం ఆయనను జైలుకు పంపించింది. మోసకారి నటి కేసులో ఇప్పటికే ఒకరు అరెస్టు అవ్వడం, బెయిల్‌పై బయటకు రావడం కూడా జరిగింది.డీజీపీ స్థాయి అధికారిని అరెస్టు చేసిన టైమింగ్ కూడా గమనించదగినదే. ఒక వైపు అమరావతిలో 44 వేల ఎకరాలు అదనంగా తీసుకోవాలన్న కూటమి ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. విశాఖలో విలువైన భూములను పరిశ్రమల పేరుతో రూపాయికి, అర్ధ రూపాయికి కట్టబెట్టడంపై పలు విమర్శలు ఉన్నాయి. రెండు నెలల క్రితం రిజిస్టర్ అయిన ఉర్సా అనే కంపెనీకి ఏకంగా మూడు వేల కోట్ల విలువైన భూమి కేటాయించాలని తలపెట్టడం వివాదంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు యూరప్ నుంచి తిరిగి రాగానే అరెస్టులు జరగడం కూడా గమనార్హం. ప్రభుత్వం పరపతి కోల్పోతున్నప్పుడు ఇలాంటి డైవర్షన్ వ్యూహాలు అమలు చేయడంలో చంద్రబాబు దిట్ట. ఒకవైపు ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ రెడ్ బుక్ ప్రయోగం, మరోవైపు చంద్రబాబు కుట్రలతో రాష్ట్రానికి నాశనం చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న ఘటన జరిగితే చాలు.. చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు ఆయనను సైకో అని, మరొకటనీ, నీచమైన రీతిలో విమర్శలు చేసేవారు. ఇప్పుడు నమోదు అవుతున్న కేసులు, అరెస్టులు చూస్తే నైతిక పతనం ఎన్ని విధాలుగా ఉండవచ్చో ప్రపంచానికి చాటి చెబుతున్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు హయాంలో జరిగిన ఘటనలకు బాధ్యులుగా జగన్ కూడా అప్పట్లో పలువురు పోలీసు అధికారులపై కేసులు పెట్టేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఆ పని చేయలేదు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసిన వ్యవహారంలో ఒక పోలీసు ఉన్నతాధికారి పాత్రపై పలు అభియోగాలు ఉన్నాయి. రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు గాను ఆయనపై కేసు పెట్టి ఉండవచ్చు కదా. కానీ, ఆ పని జగన్ ప్రభుత్వం చేయలేదు. ఇతర ఆరోపణలపై ఆయనను సస్పెండ్ చేస్తేనే చాలా పెద్ద ఘోరం జరిగినట్లు ప్రచారం చేశారు. ఆయన ఏకంగా టీడీపీ కొమ్ము కాయడమే కాకుండా, రిటైరయ్యాక కుల సభలలో పాల్గొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.సోషల్ మీడియాలో జగన్ కుటుంబంపై, పలువురు వైఎస్సార్సీపీ నేతలపై అరాచకపు పోస్టింగులు పెట్టినా టీడీపీ వారికి ఏమీ కాలేదు. చంద్రబాబు అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ వారిపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవచ్చు. కానీ, కేవలం వైఎస్సార్సీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపైనే కేసులు ఎందుకు వస్తున్నాయంటే అదే రెడ్ బుక్ పాలన అని అంటున్నారు. చంద్రబాబుతో సహా కొందరు టీడీపీ ప్రముఖులపై గత ప్రభుత్వ టైమ్‌లో పై కేసులు పెట్టలేదా? అరెస్టులు చేయలేదా అని కొందరు ప్రశ్నించవచ్చు. చంద్రబాబుపై కేసు పెట్టడానికి ముందు పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఉదాహరణకు స్కిల్ స్కామ్ కేసులో ఈడీ మొదట కేసు పెట్టింది. ఆ తర్వాత ఏపీ సీఐడీ కేసు తీసుకుంది. టీడీపీ ఆఫీస్ బ్యాంక్ ఖాతాలో కూడా అవినీతి డబ్బు వచ్చిందని సీఐడీ ఆధార సహితంగా ఆరోపించింది. దానికి ఇంతవరకు టీడీపీ కౌంటర్ చేయలేకపోయింది.మరికొన్ని కేసులు అయితే సీబీఐ దర్యాప్తు చేయడానికి అభ్యంతరం లేదని గత ప్రభుత్వం తెలిపినా, మేనేజ్ చేశారో, లేక మరే కారణమో తెలియదు కాని కేంద్రం అందుకు సిద్దపడలేదు. ఇప్పుడు మాత్రం ఏపీ ప్రభుత్వం మనోభావాల పేరుతో, మరో పేరుతో, ఒక తరహా ఫిర్యాదును అనేక పోలీస్ స్టేషన్లలో పెట్టడం, నిందితులను వందల కిలోమీటర్లు తిప్పి వారిని అనారోగ్యం పాలు చేయడం వంటి ఘటనలు గమనిస్తే ఈ ప్రభుత్వం మానవత్వంతో వ్యవహారించడం లేదన్న భావన కలుగుతుంది. మరో వైపు కూటమి ఎమ్మెల్యేలు మద్యం, ఇసుక, భూదందాలు, పరిశ్రమల యజమానులను బెదిరించడం వంటి పలు సంఘటనలు జరుగుతున్నా పోలీసులు వారి జోలికి వెళ్లడం లేదు.మోసకారి నటి కేసు కారణంగా ఏపీకి వచ్చే అవకాశం ఉన్న పరిశ్రమలు కూడా రాకుండా పోతున్నాయని చెబుతున్నా, ఏమాత్రం లెక్క పెట్టకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుండడం దురదృష్టకరం. చంద్రబాబు ఎంతో అనుభవజ్ఞుడు. కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదని ఆయనకు తెలుసు. వచ్చే ఎన్నికలలో కూటమి ఓడిపోతే ఎదురయ్యే పరిణామాలు తెలియనంత అమాయకుడు ఏమీ కాదు. అయినా సర్కార్‌ను ఇంత అరాచకంగా నడుపుతున్నారంటే ప్రభుత్వం చంద్రబాబు కంట్రోల్లో లేదేమో అనిపిస్తుంది!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
436 మైనర్ మినరల్ ప్రాజెక్టులపై ఏపీఎండీసీకి హక్కులు
-
తాజాగా చింతా గ్రీన్ ఎనర్జీ సంస్థకు భూముల కేటాయింపు
-
బాబు ష్యూరిటీ-గ్యారంటీ ఏమైంది? బుగ్గన దిమ్మతిరిగే కౌంటర్
-
చంద్రబాబు ఆర్ధిక విధానాలపై YSRCP ఆందోళన
-
Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
రూటు మార్చిన చంద్రబాబు.. ఏపీలో ఆర్థిక విధ్వంసం
తాడేపల్లి,సాక్షి: దేశంలో ఎప్పుడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో రాజ్యంగ విరుద్ధమైన విధానాలకు తెగబడింది. సీఎం చంద్రబాబు ఆర్థిక విధానాలపై వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది.ఈ మేరకు ఎక్స్ వేదికగా.. అందకారంగా రాష్ట్ర భవిష్యత్ అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో ‘వినాశకర ఆర్థిక విధానాలు అప్పులకోసం రాజ్యాంగ ఉల్లంఘనలు. 436 గనులను తాకట్టు పెట్టిన చంద్రబాబు. ఈ గనులన్నీ ఏపీ ఎండీసీకి అప్పగిస్తూ ఉత్తర్వులు. ఏపీఎండీసీ ద్వారా అప్పుల సృష్టి. రూ.1,91,000 కోట్ల విలువైన గనులు తాకట్టుపెట్టి రూ.9వేల కోట్ల అప్పు. భవిష్యత్తు ఆదాయాలను రుణ సంస్థలకు కట్టబెడుతూ నిర్ణయం. రుణాలిచ్చే సంస్థలు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచే వాయిదాలు తీసుకునే అవకాశం. రుణ సంస్థలకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ఏకైక ప్రభుత్వంగా నిలిచిన చంద్రబాబు సర్కారు. చరిత్రలో ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం తొలిసారి. వినాశ ఆర్థిక విధానాలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అంటూ’ పేర్కొంది. .@ncbn వినాశకర ఆర్థిక విధానాలు అప్పులకోసం రాజ్యాంగ ఉల్లంఘనలు436 గనులను తాకట్టు పెట్టిన చంద్రబాబుఈ గనులన్నీ ఏపీ ఎండీసీకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఏపీఎండీసీ ద్వారా అప్పుల సృష్టిరూ.1,91,000 కోట్ల విలువైన గనులు తాకట్టుపెట్టి రూ.9వేల కోట్ల అప్పుభవిష్యత్తు ఆదాయాలను రుణ సంస్థలకు… pic.twitter.com/ET5g0nWA2J— YSR Congress Party (@YSRCParty) April 24, 2025 -
మోసాల కూటమిని ప్రజలు క్షమించరు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నులమడం అసాధ్యం..! ఇచ్చిన మాట, మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టుకోకుంటే నీ తోలు తీస్తాం.. అని చెప్పగలిగిన సత్తా వైఎస్సార్ సీపీకి ఉంది..’ అని చంద్రబాబు సర్కారును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. హామీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై గ్రామ గ్రామాన వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిలదీస్తారని చెప్పామని గుర్తు చేశారు. ‘వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో తెగువ ఎలా ఉంటుందనేది రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు సెల్యూట్ చేస్తున్నా’ అని పార్టీ శ్రేణులను అభినందించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ మండలం స్థానిక సంస్థల వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. టీడీపీ కూటమి సర్కారు ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పక్షాన గట్టిగా నిలబడిన ప్రజాప్రతినిధులను అభినందించారు. ఆయా మున్సిపల్ ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్లతో పాటు ఎంపీపీలు, ఎంపీటీసీలు, జిల్లాల పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారికి వైఎస్ జగన్, నాయకులు నివాళులు అర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే..మీ తెగువకు మరోసారి సెల్యూట్..ఇవాళ రాష్ట్రంలో ప్రజలు యుద్ధ వాతావరణంలో బతుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గమైన, రెడ్ బుక్ పాలన రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూసి ఉండరు. ఇలాంటి పరిస్థితుల మధ్య కూటమి సర్కారు అన్యాయాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు నుంచి వచ్చిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, గోపవరం పంచాయితీ నుంచి వచ్చిన సర్పంచి, వార్డు మెంబర్లకు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్ల తెగువకు మరోసారి సెల్యూట్ చేస్తున్నా.జీర్ణించుకోలేక అక్రమ కేసులు..» ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడా టీడీపీకి బలం లేదు. ప్రతి చోటా వైఎస్సార్సీపీ జెండా మీద, గుర్తు మీద గెలిచిన సభ్యులే ఉన్నారు. » అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కంబదూరులో 15కు 15 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలిచింది. మరి అక్కడ టీడీపీ ఎందుకు పోటీ పెట్టింది? అక్కడ ఎన్ని ప్రలోభాలు పెట్టినా 13 మంది వైఎస్సార్సీపీ వెంట నిలబడ్డారు. అది మనమే గెల్చుకున్నాం.» ప్రొద్దుటూరులో గోపవరం చిన్న పంచాయితీ. అక్కడ ఉప సర్పంచ్ ఎన్నికలో చంద్రబాబు తన బుద్ధి ప్రదర్శించారు. 20 మంది వార్డు మెంబర్లకుగానూ 19 మంది వైఎస్సార్సీపీకి చెందిన వారే ఉన్నా చంద్రబాబు ఎందుకు పోటీ పెట్టారు? అక్కడ ఎంత దారుణంగా భయపెట్టారో, దాడులు చేయించారో రాష్ట్రమంతా చూసింది. చివరికి గొడవల ద్వారా మొదటిసారి ఎన్నికలు వాయిదా వేశారు. రెండోసారి కారణం దొరక్క.. ఎన్నికల అధికారికి హఠాత్తుగా గుండెపోటు అని చెప్పి వాయిదా వేశారు.» తిరుపతి రూరల్ మండలానికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు ఇల్లు ఉంది. చంద్రబాబు మొదటిసారి గెలిచింది, మళ్లీ ఓడిపోయింది ఇక్కడే. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఓడిస్తే.. ఇక్కడ ప్రజలు తంతే చంద్రబాబు కుప్పం వెళ్లారు.బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో వారికి ప్రాధాన్యతనిచ్చి పైకి తేవాలని ఎవరైనా ప్రయత్నిస్తారు. బీసీలు ఆర్థికంగా అంత బలంగా ఉండరు కాబట్టి వారిని తొక్కిపెట్టవచ్చని చంద్రబాబు అక్కడ పాగా వేశారు. చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి రూరల్ మండలంలో 40 మంది ఎంపీటీసీలకు గానూ 34 మంది వైఎస్సార్సీపీ తరపున గెలిచారు. అక్కడ నామినేషన్ వేయకుండా రకరకాలుగా భయపెట్టారు. 34 మందిలో 33 మందితో మోహిత్ ఓటేయించాడు. ఒక్కరే జారిపోయారు. మిగిలిన అందరూ ఒక్క తాటిమీద నిలబడి వైఎస్సార్సీపీ తెగువను చూపించారు. దాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక ఎన్నికలు అయిపోయిన తర్వాత జై జగన్, జై వైఎస్సార్సీపీ అన్నారని వారి మీద కేసులు పెట్టించారు.» వెంకటగిరి మున్సిపాలిటీకి సంబంధించి 25 మంది కౌన్సిలర్లు ఉంటే ఒక్కరూ టీడీపీ నుంచి గెలవలేదు. అక్కడ ఛైర్మన్‌ను దింపాలని చంద్రబాబు ఆరుగురిని భయపెట్టి, బెదిరించి కొనుగోలు చేయగలిగారు. మిగిలిన 19 మంది వైఎస్సార్సీపీ వెంట నిలబడ్డారు.» అంతకుముందు రాష్ట్రంలో 50 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. చంద్రబాబుకి ఎక్కడా బలం లేదు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు. ఆయన ఎందుకు ఇంతలా దిగజారిపోయాడంటే సంవత్సరం పాటు చేసిన పాలనే నిదర్శనం. అన్నీ కోతలు.. అవకతవకలేఇవాళ వ్యవస్థలు పూర్తిగా అధ్వాన్నమైన పరిస్థితుల్లో నీరుగారిపోయాయి. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఏ గ్రామంలో చూసినా బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి. ఏ బెల్టు దుకాణాన్ని చూసినా.. షాపుల్లో ధర కన్నా రూ.20 ఎక్కువకు అమ్ముతున్న పరిస్థితి కళ్లముందే కనిపిస్తోంది. మన హయాంలో కన్నా ఇసుక రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. మన హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మట్టి, మైనింగ్, నియోజకవర్గంలో ఏ పరిశ్రమ నడవాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి అంతో ఇంతో ముట్టజెప్పాల్సిందే. ఆయన ముఖ్యమంత్రికి ముట్టజెప్పాలి. నాకింత.. నీకింత అని దోచుకుని తింటున్న పరిస్థితి రాష్ట్రమంతా కనిపిస్తోంది. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకొక డైవర్షన్ టాపిక్ ఎంచుకుంటున్నారు. అడ్డగోలుగా భూ పందేరాలు..విశాఖపట్నంలో ఊరూపేరు లేని ‘ఉర్సా’ లాంటి కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువైన భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో నివాస గృహాలకు చెల్లించే కరెంటు బిల్లును ఆ కంపెనీ కడుతోంది. ఇక అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. ఊరూపేరు లేని కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువ చేసే భూమి, అది కూడా కేవలం రూ.99 పైసలకే ఎకరా భూమి కట్టబెడుతున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు..చంద్రబాబు వచ్చిన తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సు ముందే ఇస్తారు. వాళ్ల దగ్గర నుంచి 8 శాతం చంద్రబాబు తీసుకుంటారు! ఇలా రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. అప్పు అంతా ఏమైపోతోంది..?మరి చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయి? సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లు ఎందుకు లేవు? గతంలో జగన్ చేయగలిగాడు...మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? అంటే అందుకు కారణం ఎన్నికలప్పుడే చెప్పా. జగన్ నేరుగా బటన్ నొక్కుతాడు. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళుతుంది. అదే చంద్రబాబు ఉంటే బటన్లు ఉండవు. నేరుగా ఆయన జేబుల్లోకే పోతుందని ఆ రోజు ఎన్నికలప్పుడు నేను మొత్తుకుని చెప్పా. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. ఆ రోజు నేను చెప్పింది మీరు మళ్లీ వింటే.. జగన్ కరెక్టుగా చెప్పాడు, మనమే మోసపోయామని మీకే అర్ధం అవుతుంది. ఈరోజు ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతోంది.ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్‌జరుగుతున్న వాటికన్నింటికీ సమాధానం చెప్పుకోలేకే ప్రతి రోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్ ఆధికారుల అరెస్టులు అంటాడు. షాక్ కొట్టేలా పెంచిన కరెంట్ బిల్లుల గురించి అడిగితే... ఆయన చేసిన లిక్కర్ స్కాంను ఇంకొకరి మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒకటి సృష్టించి టాపిక్ డైవర్షన్ చేయడం పరిపాటిగా మారింది. చరిత్రలో రోమన్ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తోందని గ్లాడియేటర్స్ అని గేమ్స్ నిర్వహించేవారు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను బరిలో దించి చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటిని ప్రజలు చూసేలా చేసి మభ్యపెట్టి డైవర్ట్ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు వాటి గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలా ప్రతి రోజూ ఒక డైవర్షన్ టాపిక్, డ్రామా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతోంది.హామీలకు దిక్కులేని పరిస్థితుల్లో పాలన..చాలా మంది ఇళ్లల్లో చంద్రబాబు మేనిఫెస్టో ఉంది. అప్పట్లో భారీగా ప్రకటనలు ఇచ్చారు. మేనిఫెస్టోను ప్రతి ఇంటికి పంపి బాండ్లు కూడా రాసిచ్చారు. జగన్ ఇచ్చినవన్నీ చంద్రబాబు కూడా ఇస్తారని, అంతేకాదు అదనంగా కూడా ఇస్తారంటూ వాళ్ల కార్యకర్తలతో చెప్పించి బాండ్లు కూడా ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇంకా 143 హామీలు ఇచ్చారు. మరి నా అక్కచెల్లెమ్మలు ప్రొద్దుటూరు, కడపలో నిరీక్షిస్తున్నారు. ఉచిత బస్సు ద్వారా విశాఖపట్నం వెళ్లి రావాలని ఎదురు చూస్తున్నారు. దానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది.వ్యవస్థలన్నీ విధ్వంసం.. » మరోవైపు వ్యవస్థలన్నీ ఇప్పుడు పూర్తిగా విధ్వంసం అయ్యాయి. వైఎస్సార్సీపీ హయాంలో మా పిల్లలు ప్రభుత్వ బడులలో చదువుతున్నారని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండేది. అప్పట్లో ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ బోర్డులు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు సందేహిస్తున్న దుస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వ స్కూళ్లు అంతలా నాశనం అయ్యాయి. ఇంగ్లిషమీడియం, మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసేశారు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ని సైతం పీరియడ్‌గా పెట్టి చదివించే గొప్ప కార్యక్రమాన్ని రద్దు చేశారు. నాడు–నేడు ఆగిపోయింది. గోరుముద్ద నాసిరకంగా అయిపోయింది. పిల్లలను బడికి పంపిస్తే తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చిన అమ్మ ఒడి గాలికెగిరిపోయింది. నాడు 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపించే పరిస్ధితి ఉండేది. ఇప్పుడు వాటిని కూడా ఆపేశారు. బడికి పిల్లలు పోవటాన్ని ఇవాళ నరకంగా మార్చేశారు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచితంగా పూర్తి ఫీజులు కట్టి వారి వసతి ఖర్చుల సైతం ఇచ్చిన కార్యక్రమాలు రద్దయ్యాయి. విద్యాదీవెన, వసతి దీవెన అందక ఇంజనీరింగ్ విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి నెలకొంది.» వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైంది. ఏ పేదవాడికైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఉచితంగా పెద్దాసుపత్రిలో వైద్యం చేయించుకుని చిరునవ్వుతో ఇంటికి వెళ్లే పరిస్థితి గతంలో ఉండేది. రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 3,300 ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించుకునే పరిస్థితి గతంలో ఉండేది. ఇవాళ ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు చొప్పున 12 నెలలకు రూ.3,600 కోట్లు బకాయిలు పెట్టారు. రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయలేమని బోర్డు పెట్టాయి. ఇవాళ దురదృష్టవశాత్తూ ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేకపోతే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుని అప్పులు పాలైతేగానీ పేదవాడు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు.» ఇక వ్యవసాయం రంగం గురించి చూస్తే ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఉచిత పంటల బీమా గాలికెగిరిపోయింది. ఈ–క్రాప్ ఎక్కడుందో తెలియని దుస్థితి. రైతులు రోడ్డున పడి అల్లాడుతున్నారు. జగన్ ఇచ్చిన రూ.13,500 పెట్టుబడి సాయం ఆగిపోయింది. అన్నదాతా సుఖీభవ కింద చంద్రబాబు ఇస్తానన్న రూ.26 వేలు పెట్టుబడి సాయం కూడా గాలికెగిరిపోయిందని ఇవాళ ప్రతి రైతూ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.వైఎస్సార్సీపీ అఖండ విజయంతో అధికారంలోకి రావడం తథ్యం..నేను అందరికీ ఒక్కటే చెబుతున్నా. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయని, మోసం చేసిన చంద్రబాబునాయుడు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పరిస్థితి ఒకేలా ఉంటుంది. ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు. తప్పకుండా ఆరోజు వస్తుంది. మరో మూడేళ్లు గడిచిన తర్వాత.. కచ్చితంగా వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ఈసారి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నా. గతంలో మీరు అనుకున్నంత స్థాయిలో కార్యకర్తలకు తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కారణం.. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. రెండేళ్లు కోవిడ్ వల్ల వేరే అంశాల మీద ధ్యాస పెట్టలేకపోయాం. పూర్తిగా ప్రజల బాగోగులు, వారి ఆరోగ్యం మీదనే ధ్యాస పెట్టాల్సిన పరిస్థితుల మధ్య పాలన సాగింది. -
చంద్రబాబు సర్కార్ మరో భూ పందేరం
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం మరో భూ పందేరానికి తెరలేపింది. చింతాస్ గ్రీన్ ఎనర్జీ సంస్థకు భూములు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల కిందటే పుట్టిన చింతాస్కు భారీగా భూ కేటాయింపులు చేసింది. 2 వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఎకరం 31 వేలకే లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.నవయుగ సంస్థకు చెందిన డైరెక్టర్లతో చింతాస్ ఏర్పాటు చేయగా, చింతాస్కు ఆగమేఘాల మీద భూముల కేటాయింపులు జరిగిపోయాయి. చింతాస్ డైరెక్టర్లతో ఈనాడు యాజమాన్యానికి బంధుత్వం ఉన్నట్లు సమాచారం. 2 నెలలకే భారీగా భూములు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో భూములను కేటాయించింది. హరే సముద్రం, బుల్లసముద్రం, ఉప్పెర్లపల్లి, ఎర్రబొమ్మన హల్లి, కల్లుమరి, మానూరె పరిసర గ్రామాల్లో భూముల కేటాయింపు జరిగింది.కాగా, ఊరు పేరు లేని ‘ఉర్సా క్లస్టర్స్’కు విశాఖలో దాదాపు రూ.3,000 కోట్ల విలువైన భూమిని చంద్రబాబు సర్కారు అప్పనంగా కట్టబెట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కేవలం రెండు నెలల వయసు, కనీసం ఓ ఆఫీసు, ఫోన్ నెంబర్, వెబ్సైట్ కూడా లేని ఓ ఊహల కంపెనీకి మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన అనంతరం రూ.వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేయడం పట్ల అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఉర్సా క్లస్టర్స్ రూ.5,728 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, ఐటాక్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం విశాఖ మధురవాడలోని ఐటీ హిల్ నెంబర్ 3లో ఐటా క్యాంపస్‌కు 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో డేటా సెంటర్‌కు 56.36 ఎకరాలు కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు చేసుకున్న ఉర్సా కంపెనీ గురించి ‘సాక్షి’ పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
అప్పుల కోసం చంద్రబాబు సర్కార్ కొత్త మార్గం!
సాక్షి, విజయవాడ: సంపద సృష్టించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు.. అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్నారు. అప్పులు చేయడంతో సరికొత్త మార్గాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలో అప్పుల కోసం చంద్రబాబు సర్కార్ కొత్త మార్గం ఎంచుకుంది. ఏపీ ఎండీసీ ద్వారా 9 వేల కోట్లు బాండ్లు జారీ చేయాలని నిర్ణయించింది. రాజ్యాంగ విరుద్ధమని విమర్శలొస్తున్నా వెనక్కి తగ్గని ప్రభుత్వం.. 436 మైనర్ మినరల్ ప్రాజెక్టులపై ఏపీఎండీసీకి హక్కులు ఇచ్చేసింది. క్వారీ లీజు హోల్డ్ హక్కులు ఏపీ ఎండీసీకి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.మైనింగ్ హక్కులు కూడా ఏపీఎండీసీకి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని చూపించి ఏపీఎండీసీ బాండ్లు జారీ చేయనుంది. రాష్ట్ర ఖజానాను తాకట్టుపెడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు నేరుగా రాష్ట్ర ఖజానా నుండి వెసులుబాటు కల్పించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారాయన.సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసిన సంగతి తెలిసిందే. ఒక వైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వం.. పది నెలల కాలంలో రూ.90 వేల కోట్లు అప్పులు చేసిందని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కార్యకర్తలే తోలు తీస్తారు జాగ్రత్త.. బాబుకు జగన్ మాస్ వార్నింగ్
-
చంద్రబాబు మాత్రం 21 ఎకరాలు ఇస్తాడు: YS Jagan
-
రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసం: YS జగన్
-
LIVE: జీవితంలో మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: YS Jagan
-
తెగువ చూపారు.. వారందరికీ సెల్యూట్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు తెగువ చూపారని.. వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ముందుగా జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి మృతికి సంతాపంగా వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నాయకులు కాసేపు మౌనం పాటించారు. అనంతరం సమావేశం ప్రారంభించారు. దుర్మార్గమైన రెడ్‌బుక్ పాలనలో..‘ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. యుద్ధ వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారు. దుర్మార్గమైన రెడ్‌బుక్ పాలన జరుగుతోంది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రజావ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదన్న ఆయన.. మేనిఫెస్టో అమలు చేయకపోతే ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త నిలదీస్తాడని చెప్పారు. ‘‘బలం లేకపోయినా స్థానిక సంస్థల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ప్రజలు ఓడించారు కాబట్టే.. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని విడిచిపెట్టి కుప్పం వెళ్లిపోయాడు. అక్కడ బీసీలు ఉన్నారు.. వారు ఆర్థికంగా ఇతరత్రా బలంగా ఉండరు కాబట్టి, వారిని తొక్కితొక్కిపెట్టవచ్చని చంద్రబాబు కుప్పంలో పాగావేశారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.జై జగన్.. అన్నారని కేసులు పెట్టారు..చంద్రగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో గెలిచాక జై జగన్, జై వైఎస్సార్సీపీ అన్నారని కేసులు పెట్టారు. గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు తిరిగే ధైర్యంలేదు. తిరిగితే ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసం. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లడాన్ని నరకంగా మార్చేశారు. విద్యా, వైద్య రంగాలు దారుణంగా తయారయ్యాయి. చంద్రబాబుగారు అధికారంలో వచ్చాక 4 లక్షలు పెన్షన్లు తీసేశారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి.రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ....ప్రతి బాటిల్‌పైన రూ.20ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. వైఎస్సార్సీపీలో కన్నా ఇసుక రేటు రెండింతలు పెరిగింది. ఉచితం అని చెప్పి.. దోచుకుంటున్నారు. పైనుంచి కిందిదాకా ముడుపులు చెల్లిస్తేనే మైనింగ్ అయినా, పరిశ్రమ అయినా నడిచేది. అవినీతినుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ టాపిక్స్ ఎంచుకుంటున్నారు. విశాఖపట్నంలో ఊరూపేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకు రూ.3,000 కోట్లు ఖరీదు చేసే భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో రెషిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడుతుంది. అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు హయాంలో ఉర్సా లాంటి ఊరూ పేరు కంపెనీకి రూ.3,000 కోట్ల డబ్బులు దోచిపెడుతున్నారు. విశాఖఫట్నంలో లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు రూ.1500- 2000 వేల కోట్లు ఖరీదు చేసే భూములను.. టెండర్లు లేకుండా కట్టబెట్టారు.జగన్ చేయగలిగాడు.. బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’..లెఫ్ట్, రైట్, సెంటర్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అమరావతి నిర్మాణ పనుల్లోనూ దోపిడీ. 2018లో ఐదేళ్ల కిందట చంద్రబాబు హయాంలో టెండర్లు పిలిచినప్పుడు పనుల విలువ రూ. రూ.36,000 కోట్లు. అప్పట్లో ఇప్పటికన్నా స్టీలు, సిమెంట్లు రేట్లు ఎక్కువ. అయినా కూడా ఆ రూ.36,000 కోట్ల విలువ ఈరోజు రూ.78,000 కోట్లకు పెంచేశారు. టెండర్లు రింగ్ ఫార్మ్ చేసి వాళ్ల కాంట్రాక్టర్లకే ఇచ్చుకుంటున్నారు. మొబలైజేషన్ అడ్వాన్వులు కొత్తగా ఇవ్వడం మొదలుపెట్టాడు. 10 శాతం మొబలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడం, అందులో 8శాతం కమీషన్లుగా తీసుకోవడం.. ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఎక్కడకు పోతున్నాయో తెలియడంలేదు. గతంలో ఎందుకు జగన్ చేయగలిగాడు.. చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.బాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే డబ్బులు‘‘జగన్ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే పోతున్నాయి. ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో మొత్తుకుని చెప్పాను. చంద్రబాబు నాయుడుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రతిరోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్ ఆధికార్ల అరెస్టులు అంటూ డైవర్షన్లుఇలాంటి పాలనే రాష్ట్రంలో జరుగుతోంది....కరెంటు బిల్లులు షాక్ కొట్టేలా పెంచారు.. వీటి గురించి అడిగితే.. ఆయన చేసిన లిక్కర్ స్కాంను మరలా ఇంకొకరు మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సెన్షేషన్ క్రియేట్ చేసి దాన్నుంచి టాపిక్ డైవర్షన్ చేయడం పరిపాటిగా మారింది. రోమన్ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తుందని గ్లాడియేటర్స్‌ను పెట్టిన గేమ్స్ ఆడించేవాళ్లు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను పెట్టి.. చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటని ప్రజలు చూసేలా చేసి వారిని మభ్యపెట్టి డైవర్ట్ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు ఆ ఆటలు గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతుంది. ఎంతో మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయకుండా, మోసం చేసిన చంద్రబాబు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు..ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్ డిజిట్ రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు.ఆ రోజు వస్తుంది. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నాను. ఈ రోజు కార్యకర్త ఎంతలా ఇబ్బంది పడుతున్నాడో చూస్తున్నాను’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు ప్రలోభాలు.. ప్రత్యేక విమానాలేంటి?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతామని కూటమి నేతలు బెదిరించడం కరెక్ట్ కాదని మండిపడ్డారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాజకీయాల్లో ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదని హితవు పలికారు. కూటమి నేతలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మెజార్టీ కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారని అన్నారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా విశాఖలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా బొత్స మాట్లాడుతూ.. కశ్మీర్లో తీవ్రవాదుల కాల్పులు కారణంగా 26 మంది చనిపోవడం బాధాకరం. మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు చనిపోవడం దురదృష్టకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతామని కూటమి నేతలు బెదిరించారు. నేనెప్పుడూ ఇటువంటి రాజకీయాలను చూడలేదు. రాజకీయాల్లో ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. 11 నెలల మేయర్ పదవి కోసం అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ 11 నెలల కాలంలో ఏం చేస్తారో ప్రజలకు చెబుదాం. ఎన్ని ప్రలోభాలు పెట్టినా మెజార్టీ కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారు. వారందరినీ అభినందిస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు. -
సంపద సృష్టిస్తామని చెప్పి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది
-
బాబు పాలన.. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు!
బాబు పాలన.. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు! -
బాబూ.. అప్పనంగా అప్పగించేస్తారా?
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని నిశ్చేష్టులను చేస్తున్నాయి. అపర కుబేరులకు మరింత సంపద సృష్టించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందా? అన్న అనుమానం వస్తోంది. దేశంలోనే అత్యంత ధనవంతమైన కంపెనీలలో ఒకటిగా పేరొందిన టాటా కంపెనీకి చెందిన టీసీఎస్‌కు ఏపీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఎకరం 99 పైసలకే అమ్మాలని నిర్ణయిస్తుందా? పైగా అది ఒక డీల్ అని చెబుతారా? వారి సొంత ఆస్తిని కూడా ఇలాగే పప్పు బెల్లాలకు పంచిపెడతారా?. ప్రజల ఉమ్మడి ఆస్తులకు జవాబుదారిగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు, వ్యవహరించడం సమర్దనీయమా?.విశాఖపట్నంలో ఐటీ కంపెనీ టీసీఎస్‌కు 21.6 ఎకరాల భూమి దాదాపు ఉచితంగా అందచేసేందుకు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. టీసీఎస్‌కు భూమి ఇలా ఇవ్వడం ఏమిటని అంతా ఆశ్చర్యపడుతూంటే రెండు నెలల క్రితం మాత్రమే నమోదైన ఉర్సా అనే కంపెనీకి ఇదే తరహాలో 60 ఎకరాలు ఇచ్చే ప్రతిపాదన నిశ్చేష్టులను చేస్తోంది. విశాఖకు లేదా, ఏపీలో మరోచోటకైనా ఏవైనా పరిశ్రమలు వస్తుంటే స్వాగతిస్తారు. అయితే, ఆ కంపెనీల వల్ల ఏపీకి ఉపయోగం ఉండాలి. అదే టైమ్‌లో ఆ కంపెనీలను ఆకర్షించడానికి కొన్ని రాయితీలు ఇవ్వడం తప్పు కాదు. ఏ ప్రభుత్వమైనా ఆ రకంగా కొన్ని విధానాలు రూపొందించుకుంటుంది.కానీ, ఏపీలో కూటమి ప్రభుత్వం భూముల విషయంలో ఒక విధానమంటూ లేకుండా ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. తమకు నచ్చిన ప్రైవేటు కంపెనీలకు ఉచితంగా భూములు ఇవ్వడం, ప్రభుత్వ సంస్థలకు మాత్రం కోట్ల రూపాయలకు అమ్మడం ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో తెలియ చేస్తుంది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల కన్నా, సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్ పవర్ ఫుల్‌గా ఉంటున్నారని, ఆయన మాట కాదనలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్న అభిప్రాయం ఉంది. అది ప్రతి రోజూ రుజువు చేస్తున్నట్లుగా లోకేశ్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిని మంత్రివర్గం అంతా వంత పాడటం సర్వ సాధారణంగా మారిపోయినట్లుంది. పైకి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ అంటూ ప్రచారం చేస్తూ లోకేశ్ స్వయంగా కార్పొరేట్, ప్రైవేటు రంగంలో తన పరపతి పెంచుకునే పనిలో ఉన్నారేమో అనిపిస్తుంది.తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగుళూరు, తమిళనాడుకు చెన్నై బ్రాండ్లు అయితే.. ఏపీకి చంద్రబాబు బ్రాండ్ అని లోకేశ్ గొప్పగా చెప్పుకుంటారు. కానీ, అందులో వాస్తవం లేదని ఈ తాజా నిర్ణయం తెలియచేస్తుంది. ఎవరికైనా బ్రాండ్ ఇమేజీ ఉంటే ఏపీకి ఆయా ప్రముఖ సంస్థలు వాటంతట అవే రావాలి. లేదా కూటమి సర్కార్ కోరగానే ప్రభుత్వ విధానాల ప్రకారం పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలి. అవేవీ కాకుండా అత్యంత విలువైన ప్రజల ఆస్తులను తమకు ఉచితంగా ఇస్తేనే వస్తామని ఆ ప్రైవేటు సంస్థలు చెబితే చంద్రబాబు బ్రాండ్ ఏమైనట్లు?. విశాఖలో 99 పైసలకే ఎకరా భూమి అప్పగించడం అంటే చంద్రబాబు బ్రాండ్ విలువ ఇంతేనా అన్న సందేహం మేధావులలో వస్తోంది. టీసీఎస్‌కు ఈ రకంగా స్థలం ఇచ్చాక, మిగిలిన సంస్థలు కూడా ఇదే రకంగా భూమి ఇవ్వాలని కోరవా?. అందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా?. ఈ ముసుగులో కూటమి పెద్దలు తమ అస్మదీయ కంపెనీలకు విలువైన భూములను ఈ రకంగా అప్పగిస్తే పరిస్థితి ఏమిటి?. ఒక్కసారి అమ్మాక ఆ సంస్థలు సరిగా పని చేయకపోయినా, ఆ భూమి అమ్ముకున్నా చేయగలిగేది ఏం ఉంటుంది?.ఐటీ పరిశ్రమకు ప్రభుత్వ స్థలాలను లీజుకు ఇస్తే అదో రకం. కానీ, ఏకంగా వాటిని ఉచితంగా దానం చేస్తున్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తే అది ఏ రకంగా ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది?. మన సంపదతో వారు ఎంజాయ్ చేసినట్లు కాదా?. కాకపోతే తమకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా తమ చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడం సబబేనా?. గతంలో జగన్ ప్రభుత్వంలో అదానీ, తదితర సంస్థలకు లీజ్ పద్దతిలో భూములు కేటాయిస్తేనే మొత్తం అదానికి రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారని ఎల్లో మీడియా నానా గగ్గోలు పెట్టాయి కదా?. అప్పుడు ఆ మీడియాకు టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చాయి కదా!. ఇప్పుడు వందల కోట్ల విలువైన భూములను వేల కోట్ల లాభాలు గడించే టాటా సంస్థకు ఉచితంగా ఇస్తున్నారు. దీన్ని ఎలా సమర్ధించుకుంటారు?. నిజమే ఆ కంపెనీ వస్తే కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు. అవన్నీ ఏపీలోని వారికే వస్తాయన్న గ్యారంటీ ఉండదు. అయినా ఫర్వాలేదు. రిజిస్ట్రేషన్ విలువకో, మార్కెట్ విలువకో, దానికన్నా కాస్త తక్కువకో భూములు కేటాయిస్తే తప్పు కాదు.సాధారణంగా పారిశ్రామిక వసతుల కల్పన సంస్థ ఆయా చోట్ల మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలు పెట్టుకునేవారికి నిర్దిష్ట రేటుకు విక్రయిస్తుంటుంది. అంతే తప్ప ఉచితంగా ఇవ్వదు. కానీ, టాటా సంస్థకు విశాఖ రిషికొండ వద్ద 21.6 ఎకరాల భూమిని కేవలం 22 రూపాయలకే అమ్ముతున్నామని, తానే ఈ కంపెనీతో డీల్ చేశానని లోకేశ్ ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. దానికి ఆ ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఆశ్చర్యపోయారు. అదెలాగా ప్రభుత్వం అలాంటి విధానం తయారు చేసిందా? లేక కంపెనీల వారీగా ఇలాగే అమ్ముతుందా? అని అడిగితే ప్రభుత్వం విధానం కాదని, టాటా సంస్థ కేటలిస్టుగా ఉంటుందని భావించి తాము ఈ నిర్ణయం చేశామని 1990 దశకంలో కూడా ఇలేగే జరిగిందని అన్నారు.టాటా కన్సల్టెన్సీకి నికర లాభమే రూ.48554 కోట్లట. అంత పెద్ద కంపెనీ ఎకరా పది కోట్లు పెట్టి కొనుగోలు చేసినా వారికి అయ్యే వ్యయం 220 కోట్లే. ఆ మాత్రం భరించలేని స్థితిలో ఆ కంపెనీ లేదా?. కానీ, ప్రభుత్వమే ఇంత విలువైన భూమిని లీజుకు కాకుండా దాదాపు ఉచితంగా ఇచ్చేస్తామని అంటే ఏ సంస్థ కాదంటుంది?. రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచుతామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం, ప్రజల సంపదను ప్రైవేటు కంపెనీలకు దోచిపెడుతోందని ఐఏఎస్ వర్గాలలోనే చర్చ జరుగుతోందట. పీ-4 విధానంలో ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చి పేదలను దత్తత తీసుకోవాలి. కానీ, ఇలా కుబేరులను దత్తత తీసుకుని, ప్రజల సంపదను కోటీశ్వరులకు అప్పగించడం పీ-4 విధానమా అన్న ప్రశ్నను పలువురు వేస్తున్నారు. నిజానికి విశాఖలో యూనిట్ పెట్టడానికి టీసీఎస్ గత ప్రభుత్వ టైమ్‌లోనే అంగీకరించింది. ఆ కంపెనీ అధినేత చంద్రశేఖరన్ అప్పట్లోనే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌తో భేటీ కూడా అయ్యారు. కానీ, ఇంతలోనే ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడు లోకేశ్ తానే దీనిని సాధించానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పు కాదు.. అదే మార్కెట్ రేటుకు ఈ భూమిని వారికి ఇచ్చేలా ఒప్పందం చేసుకుని ఉంటే అప్పుడు క్రెడిట్ తీసుకున్నా ఫర్వాలేదు.అలా కాకుండా ఉత్త పుణ్యానికి వందల కోట్ల ఆస్తిని ధారాదత్తం చేసి. అదేదో గొప్ప సంగతి అన్నట్లు చెప్పుకుంటే ఏమి లాభం. పైగా ఈ ప్రక్రియ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్దంగా ఉందని మేధావులు చెబుతున్నారు. రిషికొండ వద్ద రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే చదరపు గజం విలువ ముప్పై వేల వరకు ఉంది. మార్కెట్ ధర ఇంకా అధికంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ విలువను పరిగణనలోకి తీసుకుంటే ఆ భూమి విలువ 320 కోట్లకు మించి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ చెప్పారు. 2012లో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ప్రభుత్వ భూములను మార్కెట్ విలువలో 10 శాతం కంటే తక్కువకు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వరాదు. అలాగే అమ్మదలిస్తే మార్కెట్ ధరకన్నా తక్కువకు విక్రయించ రాదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. వీటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే టైంలో విశాఖలో నావికా దళానికి, సీబీఐకి ఎకరా రూ.కోటి చొప్పున, పోస్టల్ శాఖకు ముప్ఫై సెంట్లకే రూ.కోటి చొప్పున వసూలు చేశారు. ఇప్పుడు టీసీఎస్‌కు 22 రూపాయలకు ఇవ్వడం ఏమిటని శర్మ ప్రశ్నించారు.టీసీఎస్ రూ.1370 కోట్లు పెట్టుబడి పెడితే 12వేల ఉద్యోగాలు వస్తాయని లోకేశ్ అంటున్నారు. నిజంగా అంతమందికి ఉద్యోగాలు వస్తాయా అన్నది ఒక డౌటు. అది కూడా ఏపీ వారికే ఇస్తారా అన్నది మరో ప్రశ్న. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ వచ్చాక కాని, ఇతరత్రా కాని, ఐటీ రంగంలో కూడా ఉద్యోగాలు ఇవ్వడం తగ్గిందని చెబుతున్నారు. ఈ మధ్యనే గూగుల్ వంటి ప్రముఖ సంస్థలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయని చెబుతున్నారు. అసలు టీసీఎస్‌కు మాత్రమే 21 ఎకరాల స్థలం అవసరమా? పోనీ ఏ ముప్పై ఏళ్లో, ఏభై ఏళ్లకో లీజుకు వస్తే తిరిగి ప్రభుత్వానికి ఆ స్థలం వస్తుందిలే అని అనుకోవచ్చు. రూ.22 లకే ఇచ్చేస్తే దానిపై ప్రభుత్వానికి హక్కులు కూడా ఉండవు.నిజంగానే 12 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్లయితే ఆ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం అవుతుందా?. అమరావతిలో సైతం కూటమి సర్కార్ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భారీ రేట్లకు, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు అందులో మూడో వంతు ధరకే భూములు ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా ఉచితంగా భూములు ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారు. దీనినే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అంటారని పలువురు చమత్కరిస్తున్నారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పక్కా ప్లాన్ తోనే అరెస్ట్.. బట్టబయలైన కూటమి సర్కార్ కుట్ర
-
రూపాయి సంపాదన లేదు.. లక్ష కోట్ల అప్పు.. మాట్లాడితే కేసులు..
-
Big Question: నారా వారి సారా కథలు
-
నారా లోకేష్ బినామీలు, ఫేక్ కంపెనీలు సృష్టించి భూములు కొట్టేస్తున్నారు
-
Margani Bharat: కూటమి పాలనలో స్కీమ్ లు కాదు.. స్కామ్‌లు పెరిగాయి
-
‘మంత్రి నారా లోకేష్ బినామీలదే ఉర్సా కంపెనీ’
సాక్షి, తాడేపల్లి: విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను 99 పైసలకే డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్స్‌కు కేటాయించడం వెనుక మంత్రి నారా లోకేష్, ఆయన బినామీలే సూత్రదారులని వైఎస్సార్సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ తన సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను సృష్టించి, వాటికి ప్రభుత్వం ద్వారా కారుచౌకగా విలువైన భూములను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తానని చెబుతున్న చంద్రబాబు ప్రజల సంపదను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వం విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు దోచిపెడుతోంది. ఊరు, పేరు లేని ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకు విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని కారుచౌకగా కట్టబెట్టింది. గత వారం రోజులుగా దీనిపై రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ డొల్ల కంపెనీ హైదరాబాద్‌లోని ఒక అపార్ట్మెంట్లో రెండు నెలల కిందటే రిజిస్టర్ అయ్యింది. అటువంటి కంపెనీకి 56 ఎకరాల భూమిని కట్టబెడతారనే దానిపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ అవినీతిపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా, దీనిపై రాష్ట్రంలోని ఒక్క మంత్రి కూడా ధైర్యంగా ప్రజల ముందకు వచ్చి వివరణ ఇవ్వలేదు.ఎందుకంటే ఇది డొల్ల కంపెనీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు డైరెక్టర్లు తప్ప ఒక్క ఉద్యోగి కూడా లేని ఈ కంపెనీకి ఎకరం రూ.50 కోట్ల విలవైన భూములు, అంటే దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇటువంటి సూట్‌కేస్ కంపెనీలను పెద్ద ఎత్తున రిజిస్టర్ చేయించడం, వాటికి కారుచౌకగా ఖరీదైన భూములను కట్టబెట్టించడం చేయిస్తున్నారు. ఇది ఒక ఆర్గనైజ్డ్ స్కామ్. ప్రభుత్వమే తమ బినామీలను ముందు పెట్టి, ఆస్తులను దోచేస్తోంది.వైఎస్ జగన్ హయాంలోనే టీసీఎస్‌తో సంప్రదింపులువైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే టీసీఎస్ ప్రతినిధులతో చర్చలు జరిగాయి. తరువాత కోవిడ్ కారణంగా టీసీఎస్ ఏపీకి రావడం ఆలస్యం అయ్యింది. 2022లో టీసీఎస్‌కు చెందిన చంద్రశేఖరన్ ఏపీకి వచ్చి ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. తరువాత ఎన్నికలు రావడంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. టీసీఎస్‌తో ప్రభుత్వ సంప్రదింపులు కొనసాగాయి. టీసీఎస్‌కు విశాఖలో 21.16 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే విక్రయిస్తూ కూటమి ప్రభుత్వం ఈనెల 21వ తేదీన జీవో జారీ చేసింది. ఈ భూముల విలువ వేలకోట్ల రూపాయలు ఉంటుంది. కనీసం వాటి మార్కెట్ విలువపై కొంతశాతం తగ్గించి విక్రయించినా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది.అలా కాకుండా 99 పైసలకు విక్రయించడం చూస్తే, దేశంలో ఎక్కడైనా ఇలా జరిగిందా అనే అనుమానం కలుగుతోంది. ప్రజాసంపదను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే సమయంలో ప్రోత్సహాకరంగా విధానాలు ఉండాలే తప్ప, పూర్తిగా ఉచితంగా దారాదత్తం చేసేలా ఏ ప్రభుత్వమైనా వ్యవహరిస్తుందా? ఇలా 99 పైసలకే భూములను విక్రయించినందుకు ఏపీకి టీసీఎస్ నుంచి ఏదైనా ప్రత్యేకమైన మేలు జరుగుతుందా అని చూస్తే, ఆ సంస్ధ కల్పించే 12వేల ఉద్యోగాల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఉంటారు. వైయస్ జగన్ సీఎంగా ఈ రాష్ట్రంలో ఏర్పాటయ్యే సంస్థలు ఖచ్చితంగా డెబ్బై శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని నిబంధనలు తీసుకువస్తే, ఆనాడు కూటమి పార్టీలు వ్యతిరేకించాయి. ఇప్పుడు టీసీఎస్ కల్పించే ఉద్యోగాల్లో ఓ రెండు వేల మంది ఏపీకి చెందిన వారు ఉంటే, మిగిలిన పదివేల మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటారు. అలాంటప్పుడు ఈ కేటాయింపులను ప్రశ్నిస్తే, పరిశ్రమలను, ఐటీ సంస్థలను అడ్డుకుంటున్నారని మాపైన దుష్ర్పచారం చేస్తున్నారు.డొల్ల కంపెనీలకు భూకేటాయింపులుటీసీఎస్ను చూపిస్తూ, ఉర్సా లాంటి డొల్ల కంపెనీలను కూడా ఇదే విధంగా గొప్ప ఐటీ సంస్థలుగా చిత్రీకరిస్తూ భూకేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం తెగబడింది. ఇరవై వేల రూపాయల అద్దె ప్లాట్‌లో నడిచే ఉర్సా సంస్థ ఏకంగా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెడుతుందంటే, ప్రభుత్వం ఎలా నమ్మింది? పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ, ఆమోదం తెలిపిన బోర్డ్‌లు ఏ అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశాయి? ఈ కంపెనీ ప్రమోటర్లు ఎవరు, వారి ఆర్థిక సామర్థ్యం ఎంత, గత అనుభవం ఏమిటీ, ఎంత మంది ఉద్యోగులు దీనిలో పనిచేస్తున్నారనే కనీస వివరాలను కూడా పరిశీలించకుండానే ప్రభుత్వం ఈ సంస్థకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది?ఎందుకంటే ఇది నారా లోకేష్‌కు చెందిన బినామీలకు చెందిన సంస్థ. ఉర్సా ప్రతినిధిలు పెందుర్తి విజయ్‌కుమార్, ఆయన కుమారుడు పెందుర్తి కౌశిక్, మరో వ్యక్తి అబ్బూరి సతీష్. వీరు అమెరికాలోని తన సొంత ఇంట్లో ఒక కంపెనీని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ కంపెనీని చూపించి ఇటీవల దావోస్‌లో తెలంగాణలో అయిదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామంటూ ఎంఓయు చేసుకున్నారు. తరువాత ఎపీలో కూడా ఇదే తరహాలో మరో అయిదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటూ స్కామ్‌ను నడిపించారు. గతంలో ఐఎంజీ భారత్ పేరుతో వేల కోట్ల రూపాయల విలువైన భూములను బిల్లీరావుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ఏరకంగా ప్రయత్నించాడో అందరికీ తెలుసు. ఇప్పుడు లోకేష్ తండ్రిని మించిన తనయుడిగా ఉర్సా సంస్థను తెరమీదికి తీసుకువచ్చారు. ఉర్సాకు చేసిన భూకేటాయింపులకు సంబంధించిన జీఓను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. టీసీఎస్‌కు జీఓ ఇచ్చారు, ఉర్సాకు మాత్రం జీఓను జారీ చేయలేదు. అంటే ఉర్సాకు సంబంధించిన జీఓను రహస్యంగా ఉంచుతున్నారా?ఉర్సా సంస్థ ఫైలు ఉరుకులు పెట్టించారుఉర్సా సంస్థ ప్రతినిధులు పెందుర్తి విజయ్‌కుమార్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక ఉద్యోగి. మరో డైరెక్టర్ అబ్బూరి సతీష్ అమెరికాలో ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీరిద్దరూ కలిసి ఏపీలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని చెబుతున్నారు. దీనిని స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆమోదించడం, వెంటనే కేబినెట్‌కు వెళ్ళడం, కేబినెట్ కూడా కాపులుప్పాడులో 56 ఎకరాలను 99 పైసలకే అమ్మేయాలని నిర్ణయించడం. ఇదంతా ఎంత ప్రణాళికాబద్దంగా స్కామ్‌ను నడిపించారో అర్థం అవుతోంది. గత వారం రోజులుగా దీనిపై వైఎస్సార్సీపీ మాట్లాడుతూ ఉంటే ఎల్లోమీడియాలో పెట్టుబడులను అడ్డుకుంటే రాష్ట్రానికే నష్టం అంటూ సిగ్గులేకుండా తప్పుడు రాతలు రాశాయి.డొల్ల కంపెనీలకు విలువైన భూములను దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? వైఎస్సార్సీపీ హయాంలో అనేక కంపెనీలను ప్రోత్సహించాం, మీలా ఉచితంగా భూములను దారాదత్తం చేయలేదు. పలు ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి విశాఖలో 161 స్టార్ట్ అప్ ఐటీ కంపెనీలు ఉంటే, వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కొత్తగా 425 కంపెనీలు ఏర్పాటయ్యాయి. తెలుగుదేశం దిగిపోయే నాటికి ఐటీ ఉద్యోగులు ఏపీలో 27643 మంది ఉంటే వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో 75,551 మందికి పెరిగారు. మేం అడ్డుకునే వారిమే అయితే వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కంపెనీలు ఎలా పెరిగాయి, ఉద్యోగులు ఎలా పెరిగారు? ఉర్సా, లులూ వంటి సంస్థలకు కారుచౌకగా భూములను కట్టబెట్టడం ద్వారా, పెద్ద ఎత్తున లబ్ధి పొందాలని చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి విధానాలను ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం. -
సుగవాసి సుబ్రమణ్యం పార్టీ వీడనున్నారా?
రాజంపేట: తెలుగుదేశం పార్టీ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గ స్థానం నుంచి పోటీ చేసిన సుగవాసి సుబ్రమణ్యం సైలెంట్ అయ్యారంటే.. అవుననే చెప్పాల్సివస్తోంది. గత కొద్దినెలలుగా అధికారపార్టీకి దూరంగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో సుగవాసికి అధిష్టానం టికెట్ ఇచ్చి పోటీ చేయించినా అధిష్టానం ఆయనను ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడంలేదన్న వాదన టీడీపీలో హాట్‌టాపిక్‌గా కొనసాగుతోంది. నియోజకవర్గంలోని ఒంటమిట్ట రాములోరి కళ్యాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తే ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా సుగవాసి కనిపించలేదు. ఆయన పార్టీ వీడనున్నారా? అన్న సందేహాలు రేకేత్తిస్తున్నాయి. రాజంపేటలో కాపు (బలిజ)సామాజికవర్గానికి సరైన ప్రాధాన్యత లేదన్న భావనలు పుట్టుకొస్తున్నాయి. రాజంపేట వైపు మళ్లీ బత్యాల చూపు? మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు రైల్వేకోడూరుకే పరిమితమయ్యారు. సుగవాసి సుబ్రమణ్యం గత కొద్దిరోజులుగా పారీ్టకి దూరంగా..నియోజకవర్గం పార్టీ కార్యక్రమానికి రాకపోవడంతో బలిజ సామాజికవర్గం మదనపడుతోంది. బత్యాల చెంగల్రాయుడు, సుగవాసి సుబ్రమణ్యంలు రాజంపేట టీడీపీలో పట్టుకోల్పోయిన తరుణంలో ఆయన వెంట నడిచిన ఆయన సామాజికవర్గ నేతలు, అభిమానులు మాత్రం నిస్తేజంగా ఉండిపోయారు. మళ్లీ బత్యాల చూపు రాజంపేట వైపును మళ్లిస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్చార్జి ఎవరో తేల్చని అధిష్టానం రాజంపేట టీడీపీలో కుల వర్గపోరు, అంతర్గత కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. అధిష్టానం ఇన్చార్జి ఎవరో తేల్చుకోలేకుంది. ఇన్చార్జి రేసులో ఉన్న వారితో అ«ధికారులు తలపట్టుకుంటున్నారు. ఏ నేత వద్దకు పోతే, మరోనేతకు వ్యతిరేకమవుతామని, ఎవరి దగ్గరికి పోకుంటే పోలా అనే భావనలో పార్టీ క్యాడర్ కొనసాగుతోంది. సీఎం బర్త్‌డే వేడుకలను కలిసికట్టుగా కాకుండా చమర్తి జగన్మోహన్రాజు, బత్యాల చెంగల్రాయుడు, మేడా విజయశేఖర్‌రెడ్డి వేర్వేరుగా చేసుకున్నారు. మహానాడు తర్వాత ఇన్చార్జి ప్రకటిస్తారా? ముందుగానే ప్రకటిస్తారా అనేది టీటీడీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధిష్టానం ఎటువైపుపోటీ చేసి ఓడిపోయిన సుగవాసి సుబ్రమణ్యంను కాదని, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజుకు అధిష్టానం ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో బలిజ వర్గాలు జీరి్ణంచుకోలేకున్నాయి. రాజంపేట దేశంపారీ్టలో వర్గపోరు అంతర్గతంగా కొనసాగుతోంది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల విషయంలో చేతివాటం ప్రదర్శించారని ఆరోపణలు ఉన్నాయి. రాజంపేట ప్రాంతీయ వైద్యశాలలో ఔట్సోర్సింగ్ నియామకాల్లో కూడా ఓ నేత చేయి తడిపారనే ఆరోపణలు ఆ పార్టీ వర్గాలే బహిరంగగానే చెప్పుకుంటున్నాయి. -
కూటమి పాలనలో స్కీమ్‌లు కాదు.. స్కామ్‌లు పెరిగాయి: భరత్
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. కూటమి ప్రభుత్వంలో స్కీములు అమలు చేయడం లేదను కానీ స్కాములు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు చెప్పారు కదా అని అధికారులు ఆలోచించకుండా అరెస్టులకు పాల్పడితే కచ్చితంగా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఉర్సా కంపెనీ ద్వారా వేల కోట్ల రూపాయలు విలువైన భూములను అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇది అధికార దుర్వినియోగం కాదా?. నీతి నిజాయితీలకు మారుపేరైన ఐపీఎస్ అధికారి సీఎస్ఆర్ ఆంజనేయులను అరెస్టు చేయటం దారుణం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోంది. జిందాల్ లాంటి సంస్థలను అవమానపరుస్తుంది. దావోస్ వెళ్ళిన చంద్రబాబు ఒక్క రూపాయి అయినా ఎంఓయూ చేసుకోగలిగారా?.ఉర్సా భూముల స్కామ్ నుండి ప్రజలను డైవర్ట్ చేయటానికి మాజీ ఏపీఎస్ ఆఫీసర్ సిఎస్సార్ ఆంజనేయులును అరెస్టు చేశారు. చంద్రబాబు చెప్పారు కదా అని అధికారులు ఆలోచించకుండా అరెస్టులకు పాల్పడితే కచ్చితంగా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఒక్క ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కూడా రాష్ట్రానికి తీసుకురాలేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ధారాదత్తం చేయడం ఏమిటి?.రాజమండ్రిలో అవినీతి జరగకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. నగరంలో అధికార పార్టీ నేతలు భూములను కబ్జా చేసే ప్రయత్నాలు అడ్డుకుంటాం. బెల్ట్ షాపులు, మద్యం దుకాణాల వద్ద అనధికార పర్మిట్ రూములు విషయంలో కచ్చితంగా ఆందోళన చేస్తాం. రాజమండ్రిలో మెజారిటీ రావడానికి నీ గొప్పతనం నీ కుటుంబం గొప్పతనం కాదు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ జగన్. వైఎస్సార్సీపీ రాజకీయ భిక్ష పెట్టంది. బొల్లినేనిలో మృతి చెందిన యువతికి ప్రభుత్వం తరఫున ఇప్పటివరకూ ఎటువంటి సహాయం అందించలేదు. ఈవీఎం ఎమ్మెల్యేకు ఇంగ్లీషే రాదనుకున్నాను.. తెలుగు కూడా సరిగ్గా రాదని అర్థమైంది.. పుట్టినరోజుకి నివాళులర్పించడమేమిటి?. మాల వేసుకుని ఎమ్మెల్యే పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ప్రజా సంబంధాల వ్యవహారాలు సోషల్ మీడియాలో వస్తే కచ్చితంగా స్పందించాలి.ప్రైవేట్ ఆసుపత్రిల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం జరుగుతుందా?. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు చేపడుతూ.. స్కాంను గత ప్రభుత్వానికి అంటకట్టడం దారుణం. చంద్రబాబు సమయంలోనే కొత్త డిస్టరీలకు అనుమతులు వచ్చాయి. లిక్కర్ వ్యవహారంతో సంబంధంలేని మిషన్ రెడ్డిని ఎందుకు లాగుతున్నారు. ఇవి కేవలం ప్రభుత్వం అనుసరిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. ఉర్సా భూముల కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రముఖులను ప్రభుత్వం అరెస్టు చేసే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలి’ అని హెచ్చరించారు. -
తండ్రి బాటలోనే లోకేశ్.. ఎంకరేజ్ చేస్తున్న పవన్!
ఏపీలో ప్రజాస్వామ్యం మూడు కుట్రలు, ఆరు ప్రలోభాలుగా పరిఢవిల్లుతోంది!. విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ పదవి నుంచి వైఎస్సార్సీపీకి చెందిన వెంకట కుమారిని దించివేయడానికి ఇన్ని కుట్రలు పన్నాలా?. పదవీకాలం ఏడాది కూడా లేకపోయినా, ఎందుకు ఇంత కక్కుర్తి?. బహుశా కూటమి నేతలు, కార్యకర్తల అరాచకాలు త్వరితగతిన తెలిసిపోతున్నాయనో, విశాఖలో తమ పెత్తనం సాగాలనో మరే కారణంతోనో అవిశ్వాస తీర్మానం పెట్టి కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు నిర్ణయం తీసుకుని ఉండాలి.అయితే, ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు సర్కార్ స్థానిక సంస్థల స్వతంత్రను దెబ్బతీస్తోంది. ఇందుకు అధికార యంత్రాంగాన్ని వాడుకుంటుంది. చంద్రబాబు తొలుత ముఖ్యమంత్రి అయింది ఇలాంటి కుట్రలతోనే అని అంతా అంటారు. అదే పద్దతిని ఆయన ఇప్పటికీ కొనసాగించడం దురదృష్టకరం. ఇప్పుడు ఆయన కుమారుడు లోకేశ్ కూడా అదే బాటలో ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు, లోకేశ్‌లకు విధేయుడుగా ఉంటూ ప్రశ్నించడం లేదు కనుక వారికి ఇబ్బంది ఉండడం లేదు.గతంలో జగన్ ప్రభుత్వ టైమ్‌లో ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదు. ఎన్నికలలో కేవలం రెండు మున్సిపాలిటీల్లోనే టీడీపీ గెలిచే అవకాశం ఉన్నప్పుడు కూడా వారిని డిస్టర్బ్ చేయలేదు. ఇందుకు ఆ రోజుల్లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర రెడ్డి ఓపెన్ గానే అంగీకరించారు. కానీ, చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రాగానే స్థానిక సంస్థలలో వేధింపుల పర్వం ఆరంభించారు. పలు మండల పరిషత్తులలో వివిధ కారణాలతో ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూటమి పెద్దలు పెద్ద ఎత్తున కొనుగోలు లావాదేవీలను సాగించారు. అయినా కేవలం 11 చోట్ల మాత్రమే మెజార్టీ లేకపోయినా మండలాలను కైవశం చేసుకున్నారు. మిగిలిన 39 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. ఎర్రగొండపాలెం వద్ద ఒక మండల పరిషత్ ఎన్నికలో వైఎస్సార్సీపీ మహిళా ఎంపీటీసీ టీడీపీ వారి దాష్టికాన్ని తట్టుకుని ఓటు వేయడం సంచలనమైంది.ఈ మధ్యనే ఆదోని మున్సిపల్ ఛైర్పర్సన్ వైఎస్సార్సీపీ నుంచి మారిన నేపథ్యంలో అక్కడ మెజార్టీ కౌన్సిలర్లు ఒకే తాటిపై నిలబడి ఆమెను పదవి నుంచి దించేశారు. పార్టీ ఫిరాయింపునకు జవాబు ఇచ్చారు. అలా అన్ని చోట్ల సాధ్యపడదు. ఉదాహరణకు తిరుపతి ఉప మేయర్ ఎన్నికకు సంబంధించి పోలీసుల మద్దతుతో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడడం, ఒక్క టీడీపీ కార్పొరేటరే ఉన్నప్పటికీ ఆ పదవిని గెలుచుకోవడం జరిగింది. ఈ ఓటింగ్ తర్వాత కొందరు కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వద్దకు వచ్చి టీడీపీ వారి వేధింపులకు తట్టుకోలేక వైఎస్సార్సీపీకి ద్రోహం చేశామని కన్నీరు, మున్నీరయ్యారు. అవకాశం ఉన్న చోట్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జెడ్పీ ఛైర్మన్లను ప్రలోభ పెట్టి టీడీపీలోకి చేర్చుకుంటున్నారు. లొంగకపోతే అధికారుల చేత ఒత్తిడి చేయిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఛైర్మన్లకు సహకరించకుండా ఐఏఎస్‌లు సైతం దారుణంగా వ్యవహరిస్తున్నారు.ఉదాహరణకు గుంటూరు కమిషనర్, ఐఏఎస్ అధికారి మేయర్‌కు కనీసం సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది. దాంతో మేయర్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ మేయర్‌కు ఇవ్వవలసిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదు. ఇది స్థానిక సంస్థలను అవమానించడమే. విశాఖపట్నంలో బీసీ వర్గానికి చెందిన మహిళ మేయర్‌ను పదవి నుంచి దించడానికి కొద్ది నెలలుగా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. కార్పొరేటర్లను రకరకాల ప్రలోభాలకు లోను చేయడానికి యత్నించింది. కొంతమందిని విదేశీ యాత్రలకు పంపారు. టీడీపీ కూటమి దాష్టికాలకు తట్టుకోవడానికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కొందరు కేరళ వెళ్లారట. అక్కడకు వెళ్లి కూడా టీడీపీ నేతలు కొందరిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ఒక కార్పొరేటర్ వెల్లడించారు.కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకున్నా వారికి పూర్తి బలం రాలేదు. దాంతో ముప్పై మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను టీడీపీ కొనుగోలు చేసిందని చెబుతున్నారు. ఎలాగైతేనేం విశాఖ నగర పాలక సంస్థను కైవసం చేసుకున్నామని కూటమి పెద్దలు సంబర పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశామని వారు బాధపడడం లేదు. ఈ వైఖరిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ .. కూటమి ఇలా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బలం లేకపోయినా ఎలా పదవులలోకి వస్తారని ఆయన ప్రశ్నించారు.ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు పార్టీ ఫిరాయింపులపై స్పష్టమైన విధాన నిర్ణయం చేశారు. వేరే పార్టీవారు ఎవరైనా టీడీపీలోకి రావాలంటే పదవి వదలి పెట్టి రావాలని కండిషన్ పెట్టారు. ఆ సూత్రానికి చంద్రబాబు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చారు. సొంత మామ ఎన్టీ రామారావును పార్టీ చీల్చి ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన చంద్రబాబుకు ఇలాంటి కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు పెద్ద విషయమా అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తుంటారు. 2014 టర్మ్‌లో కూడా ఇలాగే చేశారు. ఉదాహరణకు మూడు నగరపాలక సంస్థలలో వైఎస్సార్సీపీ గెలిస్తే, నెల్లూరు మేయర్‌ను టీడీపీలోకి లాగేసింది. అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు ఆధ్వర్యంలో కొనుగోలు చేశారన్నది బహిరంగ రహస్యం. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజ్యాంగానికి గండి కొట్టారు.జగన్ దీనికి నిరసనగా అసెంబ్లీని బహిష్కరించి ప్రజలలోకి వెళ్లారు. 2024లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చినా, చంద్రబాబు తన పద్దతులను మార్చుకోలేదు. ఒకప్పుడు పార్టీ ఫిరాయింపులను విమర్శిస్తూ ఎమ్మెల్యేలను పశువుల మాదిరి కొంటారా అని వ్యాఖ్యానించిన చంద్రబాబు, తాను అధికారంలోకి వచ్చినప్పుడల్లా అదే పనిచేయడం ఆయన ప్రత్యేకత. దీనిపై బీజేపీ లోక్ సభ సభ్యుడు సీఎం రమేష్ హర్షం వ్యాక్తం చేస్తూ అరాచక పాలనకు ముగింపు పలికారని అన్నారు. అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశామన్న సంగతిని మాత్రం విస్మరించారు. ఆయన పేరుకు బీజేపీ తప్ప, ఒరిజినల్‌గా చంద్రబాబు సొంత మనిషిగానే అంతా పరిగణిస్తారు.టీడీపీ నేతలు తాము విశాఖ నగరంలో అధికారంలోకి వచ్చామని సంబర పడుతుండవచ్చు. కానీ, ప్రజలలో మాత్రం ఏహ్య భావాన్ని మూట కట్టుకున్నారని చెప్పాలి. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా కూటమి నేతలు, ఇలాంటి అరాచకాలకు పాల్పడుతుండటం దురదృష్టకరం. స్థానిక సంస్థలలో అధికారం వచ్చినంత మాత్రాన పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అనుభవం చెబుతున్నప్పటికీ, చంద్రబాబు అండ్ కో మాత్రం యథా ప్రకారం ఈ కుట్రలను కొనసాగిస్తున్నారు. 1995లో కుట్రతోనే అధికారంలోకి వచ్చి.. అప్పటి నుంచి వాటినే అమలు చేస్తున్న చంద్రబాబు ఇంతకన్నా గొప్పగా ఉంటారని ఆశించలేమేమో!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల విశ్లేషకులు. -
సిట్ సాక్షిగా చంద్రబాబు కుట్ర బట్టబయలు
-
చింతమనేని అరాచక శక్తి.. మోదీ అమరావతి టూర్ లో బాబు స్కామ్ బట్టబయలు?
-
'ఛీ'ఎం చంద్రబాబు.. నికృష్ట పాలన
-
సూపర్ సిక్స్ హామీలు గాలికి.. అవినీతిలో పైపైకి
-
వాటే మార్క్ బాబు.. రోజుకో అరెస్ట్.. ఇటు అవినీతి.. అటు సూపర్ సిక్స్
-
ఆదు‘కొనలేం’
రైతులను కూటమి ప్రభుత్వం నిండా ముంచింది. వరి కోతలు ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. అప్పుడే ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తయిందని, ఇక కొనడం కుదరదని చెప్పేసింది. దీంతో తూర్పు గోదావరి జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కూటమి ప్రభుత్వం తీరు వల్ల ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు ఆపసోపాలు పడుతున్నారు. రైతు సేవా కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని తిరిగి ఇళ్లకు తరలించలేక కర్షకులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. సర్కారు కరుణిస్తుందేమోనని ఆశగా నిరీక్షిస్తున్నారు.– సాక్షి, రాజమహేంద్రవరంతప్పుడు లెక్కలు తూర్పుగోదావరి జిల్లాలో వరి సాధారణ విస్తీర్ణం రబీలో 60,042 హెక్టార్లు. ఈ ఏడాది 58,586 హెక్టార్లలో సాగైంది. 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు 216 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రోజుల వ్యవధిలోనే 1.35 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని, 65 వేల మెట్రిక్ టన్నులు సేకరించి కేంద్రాలు మూసివేస్తామని పేర్కొంటున్నారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 50శాతం కోతలు కూడా పూర్తికాలేదని, పండించిన ధాన్యం మొత్తం తమ వద్దే ఉందని, అలాంటప్పుడు లక్ష్యం ఎలా పూర్తవుతుందని ప్రశి్నస్తున్నారు. అధికారులు తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆవేదన చెందుతున్నారు.దళారుల దందా ఈ నేపథ్యంలో దళారులు దందా సాగిస్తున్నారు. వాతావరణ పరిస్థితులను ఆసరాగా తీసుకుని రైతులను దోచుకుంటున్నారు. తక్కువ ధరకే ధాన్యాన్ని ఎగరేసుకుపోతున్నారు. 75 కేజీల బస్తాకు ప్రభుత్వం నిర్దేశించిన ధర రూ.1,725 ఉండగా దళారులు రూ.1,300 నుంచి రూ.1,500కు కొంటున్నారు. గత్యంతరం లేని స్థితిలో అన్నదాతలు అయినకాడికి తెగనమ్ముకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పండిన ప్రతి గింజా కొనుగోలుగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల హడావుడి ఉన్నా.. రైతులకు ఎంలాంటి ఇబ్బందులూ కలగకుండా ఏప్రిల్ 1వ తేదీ నాటికి రైతు భరోసా కేంద్రాల్లో 231 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిని ప్రారంభించిన వెంటనే కొనుగోళ్లకు నాంది పలికారు. కొనుగోళ్లకు ముందుగానే నాటి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. క్వింటాల్‌కు రూ.143 పెంచింది. కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. పండిన ప్రతి గింజా కొన్నది. మరో 15 రోజుల్లో 75శాతం కోతలు పూర్తి జిల్లావ్యాప్తంగా రబీ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం సోమవారం నాటికి 28,287 హెక్టార్లలో (48.3 శాతం) పూర్తయ్యాయి. మరో 15 రోజుల్లో 75 శాతానికిపైగా పూర్తవనున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇంకా కోతలు పూర్తవకుండానే అధికారులు ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తయిందని ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది.ధాన్యం తీసుకోవడం లేదురైతు సేవా కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకెళుతుంటే లక్ష్యం పూర్తయిందంటున్నారు. మళ్లీ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకు నిరీక్షించాలని చెబుతున్నారు. అప్పటి వరకూ ధాన్యం పెట్టుకుని ఉండాలంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో భయమేస్తోంది. ధాన్యం అమ్మినా చెల్లింపులు జరగడం లేదు. రైతు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలి. – గారపాటి వెంకట సుబ్బారావు, రైతు సంఘం నేత, చాగల్లు -
వ్యవస్థల విధ్వంసం: వైఎస్ జగన్
కూటమి ప్రభుత్వం దేన్నీ వదిలి పెట్టడం లేదు. వైఎస్సార్సీపీ మీద బురదజల్లి, డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోంది. రోమన్ రాజుల కాలంలో గ్లాడియేటర్లను పెట్టి.. గ్యాలరీల్లో మనుషులను చంపుకునే పోటీలు పెట్టేవారు. వినోదం కింద రోజుకో దుర్మార్గమైన ఆట ఆడిస్తూ ప్రజలను అందులో మునిగేలా చేసేవారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతోంది. ఏదైనా ముఖ్యమైన సమస్య తలెత్తిన వెంటనే చంద్రబాబు డైవర్షన్ చేస్తున్నాడు. ఏమీ లేకపోతే ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి జగన్ మీద మాట్లాడిస్తున్నాడు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నారు. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి : రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించి.. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్రలో కూటమి ప్రభుత్వం నిత్యం మునిగి తేలుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వ్యవస్థలన్నీ దిగజారిపోయేలా చేస్తూ.. వాటి విధ్వంసానికి పాల్పడుతోందని, రాష్ట్రంలో మొదటిసారిగా ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నామని నిప్పులు చెరిగారు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ కనిపించదన్నారు. చరిత్రలో తొలిసారిగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి ప్రలోభపెట్టి, భయపెట్టి, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని చెప్పారు. ఈ పరిణామాలతో రాష్ట్రం ఎటువైపు వెళ్తోందో అర్థం కావడం లేదని, దుర్మార్గపు సంప్రదాయాలకు తెర లేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు చేయడం దారుణమని, ఇదే కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారుల పట్ల ప్రభుత్వ తీరును కోర్టు తప్పు పట్టినా పద్ధతి మార్చుకోలేదన్నారు. మంగళవారం ఆయన తాడుపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశంలో సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. జగన్ ఇంకా ఏమన్నారంటే..అసలు లిక్కర్ స్కాం ఎవరిది? » లోక్‌సభ సభ్యుడు మిథున్‌రెడ్డిని టార్గెట్ చేసి, ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు. తన కాలేజీ రోజుల్లో చంద్రబాబును.. పెద్దిరెడ్డి ఎదిరించారు కాబట్టి.. ఆయన పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష పెట్టుకున్నాడు. లేని ఆరోపణలు సృష్టించి, తప్పుడు సాక్ష్యాలతో వారిని ఇబ్బంది పెడుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌పై సీఐడీ గతంలో కేసు కూడా పెట్టింది. » లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? దుకాణాలకు తోడు పర్మిట్ రూములు, బెల్టుషాపులు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూములు రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?» 2014–19 మధ్య చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లు కొనసాగిస్తే లంచాలు వస్తాయా? ఇప్పుడున్న డిస్టిలరీల్లో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అన్ని పథకాలకు మంగళం ప్రజల నోటిలోకి నాలుగు వేళ్లు ఎందుకు పోవడం లేదు? మన ప్రభుత్వ పథకాలన్నింటినీ ఎందుకు రద్దు చేశారు? సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయి? ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ.3,500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు? ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద రూ.3,900 కోట్లు బకాయి పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కలుపుకుంటే, మొత్తం రూ.7,800 కోట్లకు గాను రూ.700 కోట్లు ఇచ్చారు. దీనివల్ల ప్రజలు కష్టాల్లో, బాధల్లో మునిగి ప్రభుత్వ నిర్వాకాలపై దృష్టి పెట్టరని అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు అదే చేస్తున్నారు.భూ పందేరాలు.. పనుల్లో యథేచ్ఛగా దోపిడీలులూ గ్రూపునకు రూ.1500–2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే స్టీల్, సిమెంటు రేట్లు పెద్దగా పెరగక పోయినా.. పెరిగాయని చెబుతూ రూ.36 వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేల కోట్లకు పెంచారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానం తీసుకొచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. బటన్లు నొక్కితే దోపిడీకి వీలు కాదని..గతంలో అనేకసార్లు నేను చెప్పాను. గతంలో మనం చేసినట్టుగా చంద్రబాబు ఎందుకు బటన్లు నొక్కలేదు అని అడిగాను. బటన్లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తుంది. అందుకనే చంద్రబాబు బటన్లు నొక్కడం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కానీ దేశ వ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయి. ఏ రైతుకూ గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడి సహాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. దాదాపు 4 లక్షల పెన్షన్లు తగ్గించారు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. గతంలోనూ మనపై తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చినప్పుడు మనపై ఇప్పటి మాదిరిగానే తప్పుడు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు చేశారు. కానీ ప్రజలు మనల్ని నమ్మారు. ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా చంద్రబాబునాయుడిపై వ్యతిరేకతను కప్పి పుచ్చడానికి వాళ్ల మీడియా ప్రయత్నిస్తోంది. కానీ ప్రజల తీర్పే అంతిమం. వాళ్లిచ్చే నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి, పాలన కొనసాగించాలన్న చంద్రబాబునాయుడి ధోరణిపై కచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు.వక్ఫ్ చట్టం విషయంలో టీడీపీ వ్యవహార శైలిపై చర్చ వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు సంబంధించి టీడీపీ పార్లమెంట్ ఉభయ సభల్లో మద్దతు పలికి, కింది స్థాయిలో కప్పదాటు వైఖరితో వ్యవహరిస్తోందని పలువురు పీఏసీ సభ్యులు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. టీడీపీ చేసిన ద్రోహాన్ని మైనార్టీలు ఎండగడుతున్నారని.. ఊరూరా ర్యాలీలు, ధర్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ.. వక్ఫ్ చట్టం అన్నది కేవలం ఒక మతానికో, ఒక వర్గానికో సంబంధించినది కాదని, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగింది కాబట్టే దీనిపై న్యాయపరంగా పోరాడేందుకు సుప్రీంకోర్టులో కేసు వేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గడం గురించి సమావేశంలో చర్చకు వచ్చింది. ధాన్యం, పెసలు, మినుములు, కందులు, శనగలు, పొగాకు, మిర్చి, అరటి, టమాటా, కోకో సహా అన్ని పంటల ధరలు తగ్గిపోయాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని, టారిఫ్‌ల బూచి చూపి రైతులను నిలువునా దోచుకున్నారని చెప్పారు. ఆక్వా రైతులకు మేలు చేయడానికి, వారికి ప్రభుత్వం అండగా ఉండేందుకు మన ప్రభుత్వం హయాంలో చట్టాలు తీసుకు వచ్చి, విద్యుత్ రాయితీలు కూడా కల్పించామని, కానీ ఈ ప్రభుత్వం ఆ చట్టాలను వాడుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతులకు జరుగుతున్న నష్టంపై పార్టీ పలు దఫాలుగా స్పందించిందని, దీనిపై పార్టీ పరంగా మరింతగా పోరాటం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని.. కమిటీలుగా ఏర్పడి ముందుకెళ్లాలని వైఎస్ జగన్ చెప్పారు.చంద్రబాబు పెడుతున్న కేసులతో ఏమవుతుంది? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచి వేయలేరు. 16 నెలల పాటు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారు. కాని ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెడితే, ప్రజలు అంతగా స్పందిస్తారు. కలియుగంలో రాజకీయాలు ఈ రీతిలోనే ఉంటున్నాయి. ఇందుకు భయపడి రాజకీయాలు మానుకుంటారు అనుకోవడం పొరపాటు. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం. మన పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత మనల్ని ముందుండి నడిపిస్తాయి. ప్రజలకు చేసిన మంచి ఇంకా ఆయా కుటుంబాల్లో బతికే ఉంది. ఈ మేరకు పీఏసీ సభ్యులు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయాలి. వారిలో స్ఫూర్తి నింపాలి. - వైఎస్ జగన్యుద్ధ వాతావరణంలో పుట్టిన పార్టీ» పార్టీని పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాలను నిర్మిస్తూ వస్తున్నాం. ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షులందర్నీ నియమించాం. వాళ్లు క్షేత్ర స్థాయిలో గట్టిగా యుద్ధం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ యుద్ధ వాతావరణంలోనే పుట్టింది. పార్టీ పుట్టిన తర్వాత పదేళ్లపాటు మనం యుద్ధ వాతావరణంలోనే ఉన్నాం. రాబోయే రోజుల్లో పార్లమెంటు నియోజకవర్గాలకూ పరిశీలకులను నియమిస్తాం. పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లకు వారు అన్ని రకాలుగా సహాయపడతారు. ఇది పార్టీలో సమన్వయానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ నియామకాల తర్వాత పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిర్మాణం అవుతుంది.» జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీలకులు, పీఏసీ ఏర్పాటు.. ఇలా అన్ని రకాలుగా పార్టీ నిర్మాణం అవుతోంది. కింది స్థాయిలో జిల్లా కమిటీలు, నియోజకవర్గాల కమిటీలు, మండల స్థాయి కమిటీలు కూడా దాదాపు ఏర్పాటయ్యాయి. ఇక గ్రామ స్థాయికి కూడా పార్టీ వెళ్లాలి. బూత్ లెవెల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే ఆరు నెలల్లో మొత్తం నిర్మాణం పూర్తి కావాలి. మన పార్టీ బలోపేతంగా ఉంటేనే, మనకు చాలా ప్రయోజనకరం. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. » ప్రజల తరఫున మనం పోరాటాలు ఇప్పటికే మొదలుపెట్టాం. ఈ పోరాటాలు మరింత ముమ్మరం అవుతాయి. వచ్చే రెండు, మూడేళ్లలో ప్రజల తరఫున ప్రణాళికా బద్ధంగా పోరాటం చేస్తాం. చివరి ఏడాదిలో ఎన్నికలపై దృష్టి పెడతాం. పార్టీ పీఏసీ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలి. ప్రజల తరఫున గొంతు విప్పాలి. అందరూ ప్రజల తరఫున మాట్లాడాలి. దీనివల్ల అన్ని అంశాలూ ప్రజల్లోకి వెళ్తాయి.» మన పార్టీకి పెద్దగా మీడియా లేదు. టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నాయి. సోషల్ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు. అందుకనే గ్రామ స్థాయిలో కార్యకర్తలను తయారు చేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్ అనే ఒక బ్రహ్మాండమైన సా«ధనాన్ని వాడుకోవాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి.» కష్టాల నుంచే నాయకులు ఎదుగుతారు. ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలను ప్రజలు గుర్తిస్తారు. ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పోరాటాలు, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఒక పార్టీకి నాయకుడిగా వారి పని తీరు కూడా నా దృష్టికి వస్తుంది. ఇంకా టైముందిలే, తర్వాత చూద్దాంలే అన్న ధోరణి వద్దు. పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు స్పందిస్తే, ఆ సంకేతం పార్టీ శ్రేణులకూ వెళ్తుంది.. ప్రజల్లోకీ వెళ్తుంది. ఈ మూడేళ్లూ ప్రజల్లోకి ఉధృతంగా వెళ్లాలి. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి. పోరాటం చేయాలి. ఇందులో ఎలాంటి రాజీ పడొద్దు. -
‘ఆ విషయంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?’
తాడేపల్లి : లిక్కర్ స్కామ్ ను వైఎస్సార్ సీపీ పై మీద వేసి తాము రాష్ట్రాన్ని దోచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎత్తుగడ వేశారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. అసలు లిక్కర్ స్కామ్ జరిగిందే చంద్రబాబు హయాంలోనని, 2014 19లో లిక్కర్ స్కామ్ జరిగిందని సీఐడీ చంద్రబాబు మీద కేసు పెట్టిన విషయాన్ని టీజేఆర్ ప్రస్తావించారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ‘ ఆ లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు ఏ 3గా ఉన్నారు. దాని గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?, టీడీపీ నేతలకు చెందిన డిస్టిలరీలకు అడ్డదిడ్డంగా కాంట్రాక్టులు ఇచ్చారు. ఇందుకోసం ఎక్సైజ్ పాలసీనే చంద్రబాబు మార్చారు. ప్రభుత్వానికి రావాల్సిన రూ.2,984 కోట్లు తమవారి జేబుల్లోకి వేసుకున్నారు. ఈ పాలసీ ద్వారా ప్రభుత్వానికి నష్టం, టీటీడీ నేతలకు లాభం జరిగింది. ఆ స్కామ్ గురించి మాట్లాడటం లేదు. 2019లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పట్నుంచి పోలింగ్ మధ్యలో అనేక డిస్టలరీలకు ఎందుకు అనుమతులు ఇచ్చారు?, క్యాబినెట్ కు తెలియకుండానే నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలి. బార్లకు మేలు చేస్తూ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వెనుక కారణం ఏమిటి?, వీటిన్నంటిపై విచారణ చేస్తే అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నాడంటూ వాసుదేవరెడ్డి మీద నాలుగు కేసులు పెట్టారు. కాగితాలపై సంతకాలు పెట్టించుకుని రిలీవ్ చేయటం వెనుక కారణం ఏంటి?, ఈ అక్రమ కేసులు పెట్టడం ద్వారా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అధికారులు గుర్తుంచుకోవాలి. ఇష్టానుసారం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి లిక్కర్ పాలసీతో ఏం సంబంధం ఉంది?, చిత్తూరులో చంద్రబాబుకు ప్రత్యర్థిగా ఉన్నందున అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా?, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిజంగా కేసిరెడ్డికి లిక్కర్ పాలసీ గురించి తెలిసి ఉంటే బేవరేజ్ కార్పోరేషన్ లో పదవి ఇచ్చేవాళ్లం కదా? , ఆయన ఐటీకి సంబంధించి సలహాదారుడు మాత్రమే. చంద్రబాబు, జగన్ హయాంలో లిక్కర్ పాలసీలపై చర్చకు మేము సిద్ధం. ప్రజలు పడుతున్న కష్టాలపై ఎల్లోమీడియా ఎందుకు చర్చలు పెట్టటం లేదు?పులివెందుల ఎమ్మెల్యే పదవిని రద్దు చేసి తిరిగి గెలిచే దమ్ముందా?, ఎన్నికలలో పోటీ చేసే సత్తా టీడీపీ కి ఉందా?, చంద్రబాబు సాధించిన ఘనత వైన్ షాపులు, పర్మిట్ రూములు పెట్టడమే. అధిక ధరలకు మదగయం అమ్ముతుంటే ఒక్క కేసు కూడా ఎక్సైజ్ శాఖ ఎందుకు నమోదు చేయలేదు? , విజయసాయిరెడ్డి ఎవరితోనో కమిట్ అయ్యారు. అందుకే మాపై ఆరోపణలు చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు టీజేఆర్. -
విజన్ కాదు, విస్తరాకుల కట్ట.. బాబుపై నిప్పులు చెరిగిన రోజా
-
కుప్పంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో టీడీపీ నేతల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. పెద్దవంక నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. రోజుకు సుమారు 150 టిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. హంద్రీనీవా పేరుతో అక్రమంగా ఇసుకను అమ్ముకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.పగలు రాత్రి తేడా లేకుండా అతివేగంతో టిప్పర్లు నడుపుతుండటంతో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. టిప్పర్ అతివేగంగా రావడంతో ఎదురుగా ద్విచక్ర వాహనంలో వచ్చిన తాము కింద పడటంతో తృటిలో ప్రాణాపాయం తప్పిందని బాధితులు అంటున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కుప్పంలో అధికార పార్టీకి చెందిన బడా నాయకుడి బావమరిది కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో భారీ ఎత్తున ఇసుక మాఫియా అక్రమ రవాణా చేస్తోంది. -
'చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బట్టబయలు'
సాక్షి, తాడేపల్లి: హామీలు అమలు చేయలేక ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు లేనిపోని హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు ఎవరూ భయపడరని ఆర్కే రోజా అన్నారు.దమ్ముంటే ఫైబర్ నెట్, స్కిల్ స్కామ్‌పై విచారణ జరిపించాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు పెట్టిన మొదటి సంతకం ఎందుకు అమలు కాలేదు?. చంద్రబాబు మొదటి సంతకం చిత్తు కాగితంతో సమానం. గ్రామాల్లోకి టీడీపీ నేతలు వెళ్ళే ధైర్యం ఉందా?. డైవర్షన్ డర్టీ కేసులతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. చంద్రబాబుకు సపోర్ట్ చేసే వాళ్లు భవిష్యత్‌లో జైలులో ఉంటారు. పోలీసు అధికారులకు హైకోర్టు అనేకసార్లు అక్షింతలు వేసింది. రాష్ట్రాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నాడని గతంలో మోదీనే చెప్పారు’’ అని ఆర్కే రోజా గుర్తు చేశారు.‘‘అమరావతిలో 36 వేల కోట్ల టెండర్లు.. 77 వేల కోట్లకు ఎందుకు పెంచారు?. అమరావతి టెండర్ల అంచనాలు పెంచి దోపిడీకి సిద్ధమవుతున్నారు. చంద్రబాబుకు ఆయన మనుషులు తప్పితే ఎవరూ అభివృద్ధి చెందకూడదా?. అమరావతి రాజధాని టెండర్లపై ప్రధాని మోదీ విచారణ జరిపించాలి. రూపాయి కూడా అవినీతి లేకుండా వైఎస్ జగన్ లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చారు. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రా? తెలంగాణకు ముఖ్యమంత్రా?. చంద్రబాబు పాలనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు’’ అని రోజా ఎద్దేవా చేశారు...చంద్రబాబు మళ్లీ తన నిజ స్వరూపం చూపిస్తున్నారు. డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతున్నారు. రైతుల వెన్నుముక విరిచేశారు. ల్యాండ్, లిక్కర్, మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు డర్టీ డైవర్షన్ పాలిటిక్స్‌కి నిదర్శనం. తప్పు చేయని పీఎస్ఆర్ని అరెస్టు చేయటం దారుణం. కొందరు పోలీసులు తీవ్రమైన తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసిన వారెవరినీ వదిలిపెట్టేదే లేదు. అలాంటి వారందరినీ జైలుకు పంపుతాం. స్కిల్ కేసులో అక్రమాలు చేసి చంద్రబాబు అరెస్టు అయ్యారు. ఆయన తప్పులను ఈడీ కూడా గుర్తించి కొందరిని అరెస్టు చేసింది. ఆ కేసును చంద్రబాబు ఎందుకు తొక్కి పెట్టారు?. చంద్రబాబుకు దమ్ముంటే తన కేసులపై సీబిఐ విచారణ జరిపించండి..చంద్రబాబు సంతకాలకు విలువ లేదు. నాలుగోసారి సీఎం అయినా మొదటి సంతకానికే దిక్కులేదు. హామీలు అమలు చేయలేని పాలకులు జనంలోకి వెళ్తే జనం వెంటపడి కొడతారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ మీద విష రాజకీయాలు చేశారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అమరావతిలో గతంలో రూ.36వేల కోట్లతో టెండర్లు వేశారు. ఇప్పుడు అవే పనులకు రూ.76 కోట్లకు ఎలా పెంచారో ప్రధాని గుర్తించాలి. రాజధానిలో ఆయన మనుషులు, ఆయన కులంవారు తప్ప మరెవరూ ఉండకూడదా?. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండకూడదా?. దేశంలోనే అత్యధిక ధనిక సీఎంగా చంద్రబాబు ఎలా అయ్యారో జనానికి తెలుసుకుప్పంలో చంద్రబాబు ఎందుకు ఇల్లు కట్టు కోలేదు?. అమరావతిలో మాత్రమే ఇల్లు కట్టుకోవడం వెనుక కారణం ఏంటో జనానికి చెప్పాలి. వీకెండులో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు?. చంద్రబాబుది విజన్ కాదు.. విస్తరాకుల కట్ట. ఆయనపై ఉన్న కేసులను విచారిస్తే ఎవరు విజనరీనో, నేరస్తుడో తేలుతుంది. ప్రధాని మోదీ.. చంద్రబాబు అక్రమాలపై విచారణ జరపాలి. అమరావతిలో శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాని.. చంద్రబాబు మీద విచారణకు ఆదేశించాలి. అడ్రెస్ కూడా లేని ఉర్సా కంపెనీకి 60 ఎకరాల భూమిని ఎలా ధారాదత్తం చేశారు?. దావోస్ వెళ్తే ఒక్క కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టటానికి రాలేదు. కానీ ఊరూ పేరు లేని కంపెనీలకు భూములు ఇవ్వటం వెనుక కారణాలేంటి?ఉర్సా భూముల కేటాయింపును వెంటనే ఆపేయాలి. టీటీడీ గోశాలలో 191 ఆవులు చనిపోతే అసలేమీ చనిపోలేదని చంద్రబాబు నిస్సిగ్హుగా మాట్లాడుతున్నారు. గోవుల మృతిపై ఛాలెంజ్‌లు చేసి వెనక్కు వెళ్లారు. తిరుమలలో తాగి మర్డర్లు చేసుకునే పరిస్థితులు తలెత్తాయి. శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోవటం అనర్ధం. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. తిరుమల, శ్రీకూర్మం ఘటనలపై ఎందుకు నోరు మెదపటం లేదు?. చంద్రబాబు చేస్తున్న తప్పులు బీజేపీకి కనపడటం లేదా?. జగన్ అధికారంలోకి వచ్చాక 43 వేల మద్యం బెల్టుషాపులు తొలగించాం. మద్యం షాపులను బాగా తగ్గించాంమద్యం షాపులు పెంచితే లంచాలు వస్తాయా? తగ్గిస్తే వస్తాయా?. మిథున్‌రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అసలు మద్యం పాలసీకి, మిథున్‌రెడ్డి కి ఏం సంబంధం?. చంద్రబాబు లక్ష కోట్లు రాజధానిలో పెట్టి, కమీషన్లు కొట్టేస్తున్నారు. చంద్రబాబు లిక్కర్ పాలసీ వలనే మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయి. రాజకీయాల కోసం భగవంతుడిని వాడుకుంటే కష్టాలు తప్పవని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గ్రహించాలి. పిఠాపురంలో మహిళపై అత్యాచారం జరిగినా పవన్ పట్టించుకోలేదు. దళితులను వెలేసినా పట్టింపులేదు. చంద్రబాబుకు కష్టం, నష్టం వచ్చినప్పుడు మాత్రమే పవన్ బయటకు వస్తారు’’ అంటూ ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. -
Ambati: ఒక్క హామీ కూడా నెరవేర్చకోపోగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
-
Garam Garam Varthalu: గరం గరం ముచ్చట్లు
-
విజయసాయిరెడ్డి చంద్రబాబు చేతిలోకి వెళ్లారు: అంబటి
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వ అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.సూట్‌కేస్ కంపెనీ ఉర్సుకు విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టారని, రాజధాని అమరావతిలో కోట్ల రూపాయల కమిషన్లు విలువైన పనులను కావాల్సిన వారికి కట్టబెట్టి కోట్లాధి రూపాయలు కమీషన్లుగా దండుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుంచి వారి దృష్టిని మళ్ళించేందుకే ఈ తాజా అరెస్ట్‌ల డ్రామాకు చంద్రబాబు తెరతీశారని మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గాలకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంకా ఆయనేమన్నారంటే..తన అవినీతి, అసమర్థ పాలన నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తున్నారు. అరెస్ట్‌లకు ఎవరూ అతీతం కాదని చంద్రబాబు అంటున్నారు. తనకు నచ్చని వారిని ఎవరినైనా సరే అరెస్ట్ చేసేస్తాననే పద్దతిలో ఈ ప్రభుత్వం నడుస్తోంది. తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ పీఎస్ఆర్ ఆంజనేయులును హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయన ఏపీలో అనేక చోట్ల పనిచేశారు. నీతీ, నిజాయితీ కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు.పదోన్నతులతో డీజీపీ స్థాయికి వచ్చారు. డీజీపీ కావాల్సిన అధికారిని ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. గతంలో ఒక కేసులో ఆనాటి ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్లుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై కూడా ఎదురు కేసులు నమోదు చేశారు. వారిద్దరూ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పీఎస్ఆర్ ఆంజనేయులు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకు వెళ్లలేదు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదు. ఈ రోజు హఠాత్తుగా ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.డైవర్షన్ పాలిటిక్స్‌లో చంద్రబాబు సిద్దహస్తుడుఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేయలేకపోతున్నాను, బడ్జెట్ చూస్తుంటే భయం వేస్తోందంటూ మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తూ చంద్రబాబు అబద్దాల కోరు అని జనం చర్చించుకుంటున్నారు. ఒక్క హమీని కూడా నెరవేచ్చని దుర్మార్గమైన పాలన సాగుతోంది. దీనిపై ప్రజల దృష్టిని మళ్ళించేందుకు తాజాగా ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారు. ఉర్సు అనే కంపెనీకి విశాఖలో మూడు వేల కోట్ల రూపాయల ఆస్తిని కేవలం 99 పైసలకు ఎకరం చొప్పున ఇచ్చేశారు. ఇది దోపిడీ కార్యక్రమం కాదా?ఇది ప్రజలు చర్చించుకోకుండా పీఎస్ఆర్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కసిరెడ్డిలను అరెస్ట్ చేసి, దానిపై పెద్ద హంగామా సృష్టిస్తున్నారు. మరోవైపు రాజధాని పేరుతో విపరీతంగా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకువస్తున్నారు. ఆ సొమ్ముతో కాంట్రాక్ట్‌లకు ఇస్తూ, వారి నుంచి కమిషన్లు దండుకుంటున్నారు. ఈ పనులకు రెండో తేదీన అమరావతిలో రెండోసారి శంకుస్థాపనకు ప్రధానమంత్రిని ఆహ్వానించారు. విపరీతమైన దోపిడీతో రాష్ట్రం సతమతమవుతోంది.లిక్కర్, ఇసుక, మట్టి పేరుతో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రంలోని టీడీపీ నాయకులు, చంద్రబాబు, నారా లోకేష్‌లు విపరీతంగా దోచుకుంటూ, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కేవలం పదకొండు నెలల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం దేశంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఒక్కటే. ఏపీలో లిక్కర్ స్కాం అంటూ హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే, దానిలో కుంభకోణం ఎలా జరుగుతుంది. ఒక్క కొత్త డిస్టలరీకి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. గత ప్రభుత్వం కన్నా తక్కువ రేట్లకే మద్యం విక్రయించాం, బెల్ట్ షాప్‌లను తొలగించాం దీనికి ఎవరైనా లంచాలు ఇస్తారా? పర్మిట్ రూంలు ఎత్తేస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టలరీలకు అర్డర్లు ఇచ్చాం. దీనిలో ఏదో స్కాం జరిగిపోయిందంటూ చంద్రబాబు హంగామా చేస్తున్నారు.రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారుకూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని తప్పుడు కేసులతో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయా? చంద్రబాబే శాశ్వతంగా సీఎంగా ఉంటారా? సీఎంలు మారితే ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయవచ్చా? డీజీపీలుగా పనిచేసిన వారిని కూడా అరెస్ట్‌లు చేయవచ్చా? ఏమిటీ ఈ అన్యాయం? కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గాలపై న్యాయస్థానాలు వాతలు పెడుతున్నా వారికి బుద్ది రావడం లేదు. పోసాని కృష్ణమురళిపై బీఎన్ఎస్ 111 సెక్షన్ పెట్టినందుకు సదరు విచారణాధికారిని కోర్ట్ ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తి మీద ఎక్స్ట్రార్షన్ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే, కోర్టు దానిని తీవ్రంగా ఆక్షేపించింది. అవసరమైతే డీజీపీని కోర్ట్‌కు పిలుస్తామని కూడా హెచ్చరించాయి. కలకాలం చంద్రబాబే సీఎంగా ఉండరని గుర్తుంచుకోవాలి. పరిపాలన చేయలేక, కక్షసాధింపులతో పనిచేస్తున్నారు. కూటమి పార్టీలకు ఓటు వేసిన వారు సిగ్గుపడేలా పరిపాలన చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని పాలన చేయాలనుకున్న వారు ఎవరూ మనజాలలేదు.గోరంట్ల మాధవ్ వ్యవహారంలో పదకొండు మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఇది కక్షసాధింపు చర్యలు కావా? నిజంగా పోలీసులు తప్పు చేశారని నిర్ధారిస్తే దీనికి బాధ్యత వహించి హోమంత్రి రాజీనామా చేయాలి. డీజీపీ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు పోలీసులు ఆలోచించాలి. మీ తోటి అధికారులను కక్షసాధింపుల్లో భాగంగా తప్పుడు కేసులతో మీతోనే అరెస్ట్ చేయించింది. ఇదే పద్దతి కొనసాగితే రేపు ప్రభుత్వాలు మారితే మీమ్మల్ని కూడా అరెస్ట్ చేసేయవచ్చు కదా? ఈ సంప్రదాయం వల్ల ఎవరికి నష్టం జరుగుతోంది? ప్రతి ఐపీఎస్ అధికారి దీనిపై ఆలోచించుకోవాలి.అణిచివేస్తే భయపడతామా?గతంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, ఇందిరాగాంధి, జయలలిత, వైయస్ జగన్ వంటి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ చేసిన ఐపీఎస్ అధికారులపై వారి ప్రభుత్వాలు వచ్చిన తరువాత ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? చంద్రబాబును అరెస్ట్ చేశారనే కక్షతోనే ఇలా అరెస్ట్‌లు చేసుకుంటూ పోతున్నారు. రేపు చంద్రబాబు, లోకేష్‌లు మాజీలు కాకుండా పోతారా? ప్రభుత్వాలు మారి, మీరు ప్రతిపక్షంలోకి రాకుండా పోతారా? ఎవరు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని అరెస్ట్ చేస్తారా?కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మరింత బలంగా ఈ అక్రమాలపై పోరాడేందుకు ముందుకు వచ్చే పరిస్థితిని కల్పిస్తున్నారు. మా పార్టీ నుంచి బయటకు వెళ్లిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉన్నారు. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు. మూడున్నరేళ్ళ పదవీకాలాన్ని విజయసాయిరెడ్డి వదులుకున్నారు. కూటమి కోసం తన పదవిని వదిలేశారు. కూటమికి లాభం చేసే నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వ్యక్తి మాటలకు, సాక్ష్యాలకు విశ్వసనీయత ఏముంటుందీ? వారి మాటలకు, వాదనలకు విలువ ఏముంటుందీ? -
ఊరూపేరు లేని ఉర్సా సంస్థకు 60 ఎకరాలు
-
కూటమి పాలనలో దళితులపై దాడులు
-
చంద్రబాబు.. మరీ ఇంతగానా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసాలు విన్నా.. చదివినా రక్తపోటు, మధుమేహం గ్యారెంటీ అనిపిస్తోంది. కించపరచాలన్న ఉద్దేశం కాదు కానీ.. ఇటీవలి కాలంలో ఆయన అబద్ధాలకు, అతిశయోక్తులకు అంతు లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ విషయంలో ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవు. స్వోత్కర్ష వరకూ ఓకే గానీ.. మితిమీరితే అవే ఎబ్బెట్టుగా మారతాయి.కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం మూడు మతాలను వాడుకుంటున్నట్లు ఆరోపించారు. ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉండదు. కూటమి సర్కారు పగ్గాలు చేపట్టింది మొదలు ఇప్పటివరకూ ఏనాడైనా జగన్ మతపరమైన అంశాలు మాట్లాడారా? లేదే! కానీ జగన్ ఫోబియాతో బాధపడుతున్న చంద్రబాబు మాత్రం ప్రతిదానికీ మాజీ సీఎంపై అభాండాలు వేసేస్తున్నారు. ఈ తీరు చూసి ఆయన కేబినెట్ మంత్రులే విస్తుపోతున్నట్లు కథనాలు వచ్చాయి. జగన్‌ను ఎందుకు విమర్శించడం లేదు.. అంటూ సీఎం ప్రశ్నిస్తున్నారని ఒక మంత్రి వాపోయారట.తిరుమల గోవుల మరణాలపై భూమన కరుణాకర రెడ్డి వెలుగులోకి తీసుకు వచ్చిన విషయాలపై ఎందుకు మాట్లాడడం లేదని సీఎం అన్నారట. టీటీడీ ఛైర్మన్, ఈవో, సీఎం తలా ఒక్కోలా మాట్లాడుతూంటే వాటిల్లో దేన్ని ప్రామాణికంగా తీసుకుని తాము మాట్లాడాలని ఒక మంత్రి తన సన్నిహితులతో వాపోయినట్లు సమాచారం. గోవులేవీ చనిపోలేదని సీఎం చెబుతూంటే.. వృద్ధాప్యంతో 23 ఆవులు మరణించాయని టీటీడీ ఛైర్మన్, 43 ఆవులు చనిపోయాయని ఈవో చెబుతున్నారని దీన్నిబట్టి చూస్తే సీఎం అబద్ధమాడినట్లే కదా అని మంత్రులు కొందరు ఉన్నట్లు తెలుస్తోంది.జగన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డితో అబద్ధాలు చెప్పించారని చంద్రబాబు ఆరోపిస్తూన్నారు. భూమన ఎవరైనా చెబితే మాట్లాడే వ్యక్తేనా? తను నమ్మితే, ఆధారాలు ఉంటేనే మాట్లాడతారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అందువల్లే ఆయన ధైర్యంగా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేసిన సవాల్‌ను స్వీకరించి తన ఆరోపణలను రుజువు చేయడానికి సిద్దమయ్యారు. పల్లా అసలు తిరుపతి రాకుండా ముఖం చాటేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, వారి మనుషులు గోశాల వద్దకు వెళ్లి హడావుడి చేసి భూమన రావడం లేదని వ్యాఖ్యానించారు. తీరా చూస్తే భూమనను పోలీసులు అడ్డుకోవడం, గృహ నిర్భంధం చేయడం అందరు చూశారు.టీడీపీ నిస్సిగ్గుగా డబుల్ గేమ్ ఆడిన విషయం బహిర్గతమైంది. భూమన తిరుమల గోవుల, లేగ దూడల మరణాల గురించి ఆధార సహితంగా బయటి ప్రపంచానికి తెలియ చేయడంతో చంద్రబాబు ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. దానిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు అసలు గోవుల మరణాలు జరగలేదని అబద్దం చెప్పారన్నది చాలామంది భావన. దానిని టీటీడీ చైర్మన్, ఈవోలే నిర్థారించారు. దాంతో ఏమి చేయాలో పాలుపోని స్థితి చంద్రబాబుకు ఏర్పడింది. అయినా టీడీపీలో అందరూ తన వాదననే ప్రచారం చేయాలన్నది సీఎం ఉద్దేశం కావచ్చు. ఇలాంటివి విన్నా, చదివినా ఎవరికైనా రక్తపోటు రాకుండా ఉంటుందా?. హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కుట్ర అని ఆయన అంటున్నారు.అసలు అలాంటి ఆలోచనలు చేయడంలో చంద్రబాబుకు ఉన్నంత సమర్ధత మరెవరికైనా ఉంటుందా అన్నది విశ్లేషకుల ప్రశ్నగా ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్‌పై ఒక పచ్చి అబద్దాన్ని ప్రచారం చేశారే. వెంకటేశ్వర స్వామి తన ఇంటి దైవం అని చెప్పుకుంటూనే, తిరుమల ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించి తీరని అపచారం చేశారే! పోనీ అది నిజమని ఇంతవరకు ఎక్కడైనా రుజువు చేశారా? ఈ విషయంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరచామన్న కించిత్ పశ్చాత్తాపం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారే?. నిజంగా దైవ భక్తి ఉన్నవారెవరైనా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా?. పవన్ కళ్యాణ్ కూడా ఆయన దారిలోనే పిచ్చి ఆరోపణలు చేసి పరువు పోగొట్టుకున్నారే! లడ్డూ వివాదాన్ని ఎలాగొలా జగన్‌కు అంటగట్టాలని విశ్వయత్నం చేశారే. కాని విఫలమయ్యారే. ఆ తర్వాత అయినా చేసిన పాపం కడుక్కోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? అంటే లేదే !జగన్ టైమ్‌లో ఏ చిన్న విషయం దొరికినా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. అంతర్వేది వద్ద ఆలయ రథం దగ్దమైతే బీజేపీ, జనసేనలతో కలిసి చంద్రబాబు రచ్చ చేశారు. అయితే జగన్ సీబీఐ విచారణకు ఓకే చేస్తే కేంద్రం ఎందుకు సిద్దపడలేదు? రికార్డు సమయంలో కొత్త రథాన్ని తయారు చేయించిన జగన్ మతాల మధ్య ద్వేషం పెంచుతారంటే ఎవరైనా నమ్ముతారా? కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలే ఆలయాలపై దాడులు చేస్తే, దానిని కప్పిపుచ్చి జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ఆ రోజుల్లో కూటమి పార్టీలు ఎంత ప్రయత్నించి తెలియనిది కాదు. తన హయాంలో విజయవాడ తదితర చోట్ల నలభై గుడులను పడగొట్టిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే హిందూ మతోద్దారకుడిగా ప్రచారం చేసుకున్నారు.జగన్‌పైనే కాకుండా, ఆనాటి డీజీపీపై కూడా క్రిస్టియన్ మత ముద్ర వేసి ప్రజలలో ద్వేషం పెంచడానికి యత్నించారా? లేదా? తిరుమలలో ఏ చిన్న ఘటన జరిగినా జగన్ పై నెట్టేయడమే పనిగా పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు తిరుమలలో మద్యం అమ్ముతున్నా, బిర్యానీలు తెచ్చుకుంటున్నా, చెప్పులు వేసుకుని గుడి వరకు వెళుతున్నా, ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఒక చర్చిపై హిందూ మత రాతలు కనిపించాయి. వెంటనే హోం మంత్రి దానిని వైసీపీపై ఆరోపించారు. తీరా చూస్తే ఇద్దరు పాస్టర్ ల మధ్య గొడవలలో ఆ పని చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరి దీనికి చంద్రబాబు ఏమి బదులు ఇస్తారు? ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో ఇలా మతపరమైన వివాదాలు సృష్టించడానికి ప్రయత్నాలు జరిగిన సందర్భాలు చాలా తక్కువ. చంద్రబాబు చేతిలోకి టీడీపీ వచ్చాక అధికారం కోసం ఎలాంటి ద్వేషాన్ని అయినా రెచ్చగొట్డడానికి వెనుకాడరన్న అభియోగాలు ఉన్నాయి.వక్ఫ్ బిల్లుపై జగన్ రాజకీయం చేస్తున్నారట. ఇది విన్నవారికి ఏమనిపిస్తుంది? వైసీపీ అంత స్పష్టంగా వక్ఫ్ బిల్లును వ్యతిరేకించినా, పచ్చి అసత్యాలను ప్రచారం చేయడానికి టీడీపీ ఏ మాత్రం సిగ్గుపడడం లేదని అనిపించదా? తాజాగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది కదా? అసలు వక్ఫ్ చట్టంపై చంద్రబాబు, పవన్‌ల వైఖరి ఏమిటి అన్నది ఇంతవరకు చెప్పారా? ఒకప్పుడు ప్రధాని మోదీపై తీవ్రంగా విమర్శలు చేస్తూ ముస్లింలను బతకనివ్వడని, తలాఖ్ చట్టం తెచ్చారని ఆరోపించిన చంద్రబాబు బతిమలాడుకుని మరీ బీజేపీతో ఎలా జతకట్టారు? పోనీ ఇప్పుడు వక్ప్ చట్టాన్ని ఏపీలో అమలు చేయబోమని చెప్పగలరా? లేదా సుప్రీం కోర్టు విచారణలో ఇంప్లీడ్ అవ్వగలరా? అటు బీజేపీకి మద్దతు ఇవ్వాలి. ఇటు ముస్లింలను మోసమో, మాయో చేయాలని ప్రయత్నించడం చంద్రబాబుకే చెల్లుతుంది. అందుకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏపీ సీఎం చంద్రబాబు ముస్లింలను మోసం చేశారని విమర్శించారు.ఇక పాస్టర్ ప్రవీణ్ మృతిపై కూడా వైసీపీ మీద ఆయన ఆరోపణలు చేశారు. ఈ పాస్టర్ మృతిపై క్రైస్తవ సమాజానికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయకుండా ప్రభుత్వం ఎందుకు దబాయించే యత్నం చేస్తున్నదీ ఎవరికి అర్థం కాదు. దీనిపై ఒక రిటైర్డ్ ఐఎఎస్‌తో సహా పలువురు వేస్తున్న ప్రశ్నలకు పోలీసు అధికారులు జవాబు ఇస్తున్నట్లు అనిపించదు. సీసీటీవీ దృశ్యాలపై కొందరు తమ అనుమానాలను తెలియచేస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు. జగన్ కాని, వైసీపీ నేతలు ఎవరూ ఈ అంశం జోలికి వెళ్లకపోయినా, తాను ఇబ్బంది పడినప్పుడల్లా జగన్ పై తోసేసి కథ నడిపించాలన్నది చంద్రబాబు వ్యూహం.జగన్ టైమ్‌లో ఒక డాక్టర్ మద్యం మత్తులో రోడ్డుపై నానా యాగీ చేస్తే అక్కడ ఉన్న పోలీసు కానిస్టేబుల్ అతని రెక్కలు కట్టి పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. అంతే! అదేదో జగనే దగ్గరుండి చేయించినట్లుగా దుర్మార్గంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ విషయంలో మాత్రం తాను చెప్పిందే రైటు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. కులపరమైన, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ఢిల్లీలో కూర్చుని టీవీలలో లైవ్ లో మాట్లాడిన ఒక నేతకు ఇదే చంద్రబాబు పెద్ద పదవి ఇచ్చారే!నిజానికి మతపరమైన అంశాలకు ఎంత తక్కువ ప్రాధాన్యత ఇస్తే అంత మంచిది. కాని ఒకప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని, మత తత్వ పార్టీ అని ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుని, ఎదుటివారిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే ఏమనిపిస్తుంది. హేతుబద్దంగా ఆలోచించేవారికి ఎవరికైనా చంద్రబాబు ఇలాంటి నీతులు చెబుతున్నప్పుడు వినాలంటే బీపీ రాకుండా ఉంటుందా! -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
టీడీపీ ఎంపీ చిన్ని బినామీదే ‘ఉర్సా’.. డీల్ బట్టబయలు చేసిన కేశినేని నాని
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ భూమిని పెట్టుబడుల పేరుతో దోచుకునేందుకు కేశినేని చిన్ని ప్రయత్నం చేశారంటూ ‘ఉర్సా’ వెనుక డీల్‌ను మాజీ ఎంపీ కేశినేని నాని బయటపెట్టారు. టీడీపీ ఎంపీ కేశినేని బినామీదే "ఉర్సా" అంటూ ట్వీట్ చేశారు. కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్‌లు భాగస్వాములు. 21 సెంచరీ ఇన్వెస్టమెంట్ ప్రాపర్టీస్ పేరుతో గతంలో కోట్లు వసూళ్లు చేశారు. కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్, కోట్లు వసూళ్లు చేసి జనాన్ని మోసం చేశారు’’ అంటూ కేశినేని నాని ఎక్స్ వేదికగా తలిపారు."ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్" అనే కంపెనీకి విశాఖలో 60 ఎకరాల కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దురుద్దేశం ఉన్నట్టు పేర్కొన్న నాని.. 5,728 కోట్ల డేటా సెంటర్ ప్రాజెక్ట్ పేరుతో ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పడలో 56.36 ఎకరాలు.. మొత్తం 60 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయని.. ఈ కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ తమ బినామీ పేరుతో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని నాని ఆరోపించారు.‘‘ఉర్సా క్లస్టర్స్ కేవలం కొన్ని వారాల క్రితమే రిజిస్టర్ అయ్యింది. వీరికి ఎటువంటి అనుభవం లేదు. ప్రాజెక్ట్ చేయగల సామర్థ్యం కూడా లేదు. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, ఎంపీ చిన్ని ఇంజినీరింగ్ క్లాస్మేట్. అబ్బూరి సతీష్ ఎంపీ చిన్ని బిజినెస్ భాగస్వామి కూడా. ఇద్దరు కలిసి 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ప్రజల నుండి కోట్లు వసూలు చేసి ప్రజలను మోసం చేసిన నేపథ్యం ఉంది. ఈ భూమి కేటాయింపు వెనుక చిన్ని తన ఎంపీ పదవి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న పరపతిని ఉపయోగించారు’’ అని నాని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఊరూపేరు లేని 'ఉర్సా'చిన్ని సాండ్ మైనింగ్, ఫ్లై ఆష్, రియల్ ఎస్టేట్ మాఫియాలతో కలిసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు ఉన్నాయన్న కేశినేని నాని.. ఉర్సా క్లస్టర్స్‌కు ఇచ్చిన భూ కేటాయింపు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కంపెనీ యజమానులు, డబ్బు మూలాలు, రాజకీయ కనెక్షన్లపై సంపూర్ణ దర్యాప్తు చేయాలన్నారు. ప్రభుత్వ భూమిని "పెట్టుబడుల" పేరుతో దోచుకునే ఈ ప్రయత్నాన్ని ఆపాలంటూ చంద్రబాబుకు కేశినేని నాని ఫిర్యాదు చేశారు.Respected @ncbn garu,I would like to begin by sincerely appreciating your bold and visionary step in allotting land to Tata Consultancy Services (TCS) in Visakhapatnam. Such initiatives will pave the way for real investments, job creation, and the upliftment of Andhra Pradesh’s… pic.twitter.com/pJMQeSGgNi— Kesineni Nani (@kesineni_nani) April 22, 2025 -
పంచుకుతినేందుకే ఉర్సా కంపెనీకి 60ఎకరాలు ఇచ్చారు
-
చేతకానప్పుడు హామీలు ఎందుకు ఇచ్చావు.. బాబుపై కామ్రేడ్ల ఫైర్
-
ఆడపిల్లలు తిరిగే చోట వైన్ షాప్ పెడతారా ?
-
లోకేశా మజాకా.. బాబును అడ్డంగా ఇరికించేశాడుగా
-
విశాఖలో భూములే కాదు.. ప్రజాస్వామ్యమూ గోవిందా
-
బాబు మాటల్లో నిజం.. నేతిబీర చందమే!
పొంతన లేని మాటలతో జనాల్ని తికమకపెట్టడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది తిరుగులేని రికార్డు. తాజాగా కొద్ది రోజుల క్రితం జ్యోతీరావు ఫూలే జయంతి ఉత్సవాల్లో ఇది మరోసారి నిరూపితమైంది. ఎల్లోమీడియా ‘బీసీల సంక్షేమానికి రూ.48 కోట్లు’ అంటూ బాబుగారి ప్రసంగాన్ని భాజాభజంత్రీలతో కథనంగా వండి వార్చినప్పటికీ వివరాలు చూస్తే ప్రజలు ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఎందుకంటే.. బాబు గారు తన ప్రసంగంలో సంక్షేమ వసతి గృహాలకు రూ.405 కోట్లు, గ్రూప్ పరీక్షల అభ్యర్థులకు శిక్షణ శిబిరాలు, బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు, అమరావతిలో 500 మంది బ్యాచ్‌తో ఉచిత శిక్షణ, ఆదరణ పథకం కింద ఏటా రూ.వెయ్యికోట్లు ఖర్చు వంటివి మాత్రమే ప్రస్తావించారు. .. ఇవేవీ కొత్తవి కాకపోవడం ఒక వింతైతే.. వీటికయ్యే ఖర్చు ఏటా రెండు వేల కోట్లకు మించకపోవడం ఇంకోటి. మరి.. రూ.48 వేల కోట్లు ఎక్కడ? ఎప్పుడు? ఎలా వ్యయం చేస్తారు? ఎల్లో కథనం చదివిన వారి ఊహకే వదిలేయాలి దీన్ని. పోనీ మొత్తం ఐదేళ్లకు ఇంత మొత్తం అనుకుంటే.. ఒక ఏడాది గడచిపోయింది కాబట్టి.. మిగిలిన నాలుగేళ్లలో ఏటా రూ.12 వేల చొప్పున ఖర్చు పెట్టాలి. దీనిపై కూడా స్పష్టత లేదు. అయినా చంద్రబాబు(Chandrababu) బీసీ సంక్షేమానికి 48 వేల కోట్లు అని ఒక అంకె చెప్పడం, అదేదో మొత్తం ఇచ్చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేసి బ్యానర్ కథనాలు రాసేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయడం ఎల్లో మీడియా మార్కు జర్నలిజమై పోయింది. 👉బాబు గారు ఇంకొన్ని మాటలూ ఆడారు. ఆర్థిక అసమానతలను రూపుమాపే బ్రహ్మాస్త్రం పీ-4 అని, దీని ద్వారా లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని చెప్పనైతే చెప్పారు కానీ.. ఎలా అన్నది మాత్రం చెప్పడం మరిచారు!. సాధారణంగా ఏ నేత అయినా వేల కోట్ల మొత్తాలను ప్రకటించినప్పుడు దేనికెంత ఖర్చు చేస్తారు? బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి? వంటి వివరాలు ఇవ్వడం జర్నలిజమ్ ప్రాథమిక లక్షణం. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాంటి భారీ కేటాయింపులు జరిగినప్పుడు దానికి కట్టుబడి ఉన్నట్టు సమాచారం ఉండేది. అప్పటి విపక్షం టీడీపీ కూడా తప్పు పట్టే పరిస్థితి ఉండేది కాదు. పోనీలే... ఏదో ఒక రీతిన బీసీల సంక్షేమానికి రూ.48 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని సంతోషిస్తూండగానే చంద్రబాబు అన్నమాటతో నిరాశ కమ్మేసింది. 👉అప్పు చేసి సంక్షేమం అమలు చేస్తే రాష్ట్రం కష్టాలలో కూరుకుపోతుందని, సంపద సృష్టించి సంక్షేమానికి ఖర్చు చేస్తామని చంద్రబాబు ప్రకటించారని ఎల్లో మీడియా(Yellow Media)నే తెలిపింది. చంద్రబాబు అక్కడితో ఆగలేదు. కాని టీడీపీకి నష్టం అని భావించి ఎల్లో మీడియా ఆ భాగం రాయకుండా వదలి వేసింది. మిగిలిన మీడియాలో ఆ వివరాలు ఉన్నాయి. చెప్పినవన్నీ చేయాలని ఉన్నా గల్లా పెట్టే ఖాళీగా కనిపిస్తోందని, అప్పు చేద్దామన్నా ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావడం లేదని అన్నారు. పరపతి లేకపోతే అప్పు ఎలా పుడుతుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు దాటిపోయింది. ఈ కాలంలో సంపద సృష్టించ లేకపోయానని ఆయన చెబుతున్నట్లే కదా? పైగా అప్పు పుట్టని పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబే కదా దానికి బాధ్యుడు అవుతారు. పోనీ అదే నిజమనుకున్నా, ఇప్పటికే రూ.లక్ష కోట్ల అప్పు ఎలా చేశారు? దానిని ఎందుకోసం ఖర్చు పెట్టారు అన్నది ఎప్పుడైనా చెప్పారా అంటే లేదు. ఒక్క అమరావతి(Amaravati) నిర్మాణాలకే ఏభైవేల కోట్ల అప్పు ఎలా తీసుకు వస్తున్నారు? ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ, ఎన్నికల ప్రణాళిక అంటూ తెగ వాగ్దానాలు ఇచ్చేశారు కదా? బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ ఇస్తానన్నారు కదా? ఇప్పుడు ప్రతి దానికి గల్లా పెట్టె ఖాళీగా ఉందని చెప్పడం ప్రజలను చీట్ చేయడమే కాదా? ఈ లెక్కన ఇప్పుడు బీసీల సంక్షేమానికి ప్రకటించిన రూ.48 వేల కోట్లు ఉత్తుత్తి ప్రకటనగానే తీసుకోవాలా? లేక దాని అమలుకు వేరే మార్గం ఏమైనా ఉందని చెబుతారా?. తల్లికి వందనం కింద త్వరలో డబ్బులు ఇస్తామని అంటారు. ఒక ఏడాది ఇప్పటికే ఎగవేసిన విషయాన్ని మాత్రం ప్రస్తావించరు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే రూ.ఆరు వేలు పోను మిగిలిన రూ.14 వేలు ఇస్తామని చెప్పారు. మరి ఈ ఏడాది ఎందుకు ఎగవేశారో వివరించాలి కదా? కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా రైతులకు సాయం చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చుతున్నారు. ఇవైనా ఏ మేరకు అమలు చేస్తారో తెలియదు. చంద్రబాబు మాత్రం వాటిని నివృత్తి చేయరు. తాను చెప్పదలచుకున్నది ఏదో అది ప్రజలు నమ్ముతారా? లేదా ?అనేదానితో నిమిత్తం లేకుండా ప్రచారం చేసి వెళుతుంటారు. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకు వస్తామని, వారికి 34 శాతం రిజర్వేషన్లు తెస్తామని, నామినేటెడ్ పోస్టులలో 33 శాతం బీసీలకు కేటాయిస్తామని, కల్లు గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయించామని.. ఇలా ఆయా విషయాలను చెప్పారు. విశేషం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం సత్యసాయి జిల్లాలో బీసీ వర్గానికి చెందిన ఒక వైసీపీ నేత లింగమయ్యను టీడీపీ వారు హత్య చేస్తే వీరు కనీసం ఖండించలేదు. ఆ కేసులో ఇరవైమంది నిందితులు ఉన్నారని చెబుతున్నా ఇద్దరిపైనే కేసు నమోదు చేశారని బాధితులు ఆరోపిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం బీసీ రక్షణ చట్టం గురించి ఉపన్యాసం ఇస్తున్నారు.ఏపీలో సోషల్ మీడియా(AP Social Media) నేరస్తులకు అడ్డాగా మారిందని, వ్యక్తిత్వ హననం చేస్తే అది వారికి అదే చివరి రోజు అవుతుందని చంద్రబాబు అంటున్నారు. నిజానికి సోషల్ మీడియాను దుర్వినియోగం ఎక్కువగా చేసింది టీడీపీ వారే అనే సంగతి ఆయనకూ తెలుసు. వారిని ప్రోత్సహించింది తాను, తన కుమారుడు అన్న విషయం అందరికి విదితమే. ఈ మధ్య తప్పని స్థితిలో ఒక టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతనిని విచారించి ,అతను వాగిన పిచ్చివాగుడు వెనుక ఎవరు ఉన్నారో పోలీసులు తేల్చుతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు. సీమ రాజా అని, ఇంకేవేవో పేర్లతో వైఎస్సార్సీపీ మహిళా నేతలపై దారుణమైన నీచమైన వ్యాఖ్యలు చేసినవారంతా రాష్ట్రంలో సేఫ్‌గా తిరుగుతున్నారు. మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి అసహ్యకరమైన ఆరోపణ చేసిన ఒక టీడీపీ నేతకు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసిన చరిత్ర కూడా సార్‌దే కదా! ఏదైనా చిత్తశుద్దితో చెబితే పర్వాలేదు. కాని సుద్దులు పైకి చెప్పి, టిడిపి సోషల్ మీడియా అరాచక శక్తులకు అండగా నిలబడుతున్నారన్న అపకీర్తి మూట కట్టుకుంటే ఏమి చేస్తాం. అందువల్ల నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో చంద్రబాబు మాటల్లో వాస్తవం అంత ఉంటుందని ఆయన ప్రత్యర్ధులు వ్యాఖ్యానిస్తుంటారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఊరూపేరు లేని ఉర్సా.. బట్టబయలైన బాబు సర్కార్ భారీ భూకుంభకోణం
-
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం
-
మెగా డీఎస్సీ పేరిట నిరుద్యోగులకు కూటమి సర్కారు టోకరా
-
ఆంధ్రప్రదేశ్‌లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ
-
విశాఖలో ఎకరా స్థలం 99పైసలే.. రండి బాబు రండి!
-
‘మెగా డీఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం 11 మాసాలుగా వాయిదా వేస్తూ వచ్చిన మెగా డీఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనేక దఫాలుగా వాయిదాలు వేస్తూ వచ్చిన మెగా డీఎస్సీకి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్‌ను కేవలం పరీక్ష నిర్వహణకే పరిమితం చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశమేమిటని నిలదీశారు.టీచర్ పోస్ట్‌ల నియామక ప్రక్రియపై నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా ఆరు లక్షల మంది అభ్యర్ధుల ఆశలతో ప్రభుత్వం ఆటలాడితే సహించేది లేదని హెచ్చరించారు. మెగా డీఎస్సీని చిత్తశుద్దితో నిర్వహించకపోతే అభ్యర్ధుల తరుఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.ఇంకా ఆయనేమన్నారంటే..డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియలో లోపాలను సవరించకపోతే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిపై నిరుద్యోగుల తరుఫున ప్రభుత్వాన్ని మేలుకొలుపేందుకు కొన్ని అంశాలను మీడియా ద్వారా ఈ ప్రభుత్వం ముందు పెడుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే కేబినెట్లో మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారు. పదకొండు నెలల తరువాత చంద్రబాబు పుట్టినరోజు నాడు తాజా నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే చంద్రబాబు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చేందుకేనా ఈ పదకొండు నెలలుగా మెగా డీఎస్సీని ఆలస్యం చేశారు?.గత ఏడాది జూన్ 14న కూటమి ప్రభుత్వం తొలి కేబినెట్ సమవేశంలో మెగా డీఎస్సీ కింద 16,357 పోస్ట్‌ల భర్తీపై సంతకం చేశారు. వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తాం, పరీక్ష ప్రక్రియ, నియామకాలను వెంటవెంటనే చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే తొలిఫైల్ పై సంతకం చేసిన రెండు రోజుల్లోనే టెట్ నిర్వహించిన తరువాతే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం అంతకు ముందు నిర్వహించిన టెట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలు కూడా అదే జూన్ నెలలో వెలువడ్డాయి. మళ్లీ టెట్ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం సాకు చెప్పడం పెద్ద మోసం కాదా?తరువాత గత ఏడాది కూటమి ప్రభుత్వం టెట్ నిర్వహించి, నవంబర్ 4వ తేదీన ఫలితాలను విడుదల చేసింది. అదే సందర్భంగా నవంబర్ 6వ తేదీన మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. అయితే నవంబర్ 5వ తేదీన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ఒక వ్యక్తితో కోర్ట్‌లో పిటీషన్ వేయించారు. కోర్ట్‌లో కేసు పెండింగ్‌లో ఉన్నందున వర్గీకరణ బిల్లు ఆమోదం తరువాతే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామంటూ ప్రభుత్వం మళ్లీ మాట మార్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తూ వచ్చిన వైయస్ఆర్సీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించింది. శాసనమండలిలో ప్రతిసారీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, నిరుద్యోగుల తరుఫున గళాన్ని వినిపించడం ద్వారా ఒత్తిడి తీసుకువచ్చింది.వైఎస్సార్సీపీ ఒత్తిడితో ఎట్టకేలకు నోటిఫికేషన్మెగా డీఎస్సీపై వైఎస్సార్సీపీ చేసిన ఒత్తిడి కారణంగానే కూటమి ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు రోజుల కిందట ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చి, చంద్రబాబు పుట్టినరోజున మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న ఆరు లక్షల మంది అభ్యర్థుల్లో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత పదకొండు నెలలుగా వాయిదాల మీద వాయిదాల వేయడం, కోర్టుల్లో పిటీషన్లు వేయడం చూస్తుంటే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్‌ను అయినా కార్యరూపంలోకి తీసుకువస్తారా అని పలువురు ప్రభుత్వ చిత్తశుద్దిని శంకిస్తున్నారు.స్కూల్స్ తెరిచే నాటికి అంటే జూన్ 1వ తేదీ నాటికి డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసి, మొత్తం పోస్ట్‌లను భర్తీ చేస్తామని లోకేష్, చంద్రబాబు చెబుతున్నారు. నాలుగు రోజుల కిందట ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకువచ్చారు. ఈ ఆర్డినెన్స్‌లో ఎస్సీల్లో ఆర్ఓఆర్పై కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయకుండానే ఆర్డినెన్స్‌ను అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని ప్రభావం డీఎస్సీపై పడుతోంది. ప్రభుత్వం ఇప్పుడు కేవలం సుమారు పదహారు వేల టీచర్ పోస్ట్‌లను భర్తీ చేస్తూ, ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును సాకుగా చూపడం ఎంత వరకు సమంజసమని అభ్యర్ధులు ప్రశ్నిస్తున్నారు.టీచర్ పోస్ట్‌ల నియామక ప్రక్రియలో స్పష్టత ఏదీ?ఏప్రిల్ 20న నోటిఫికేషన్, జూన్ 6 నుంచి జులై 6వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షల ప్రక్రియను నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. డీఎస్సీ పరీక్షా ఫలితాలు ఆగస్టులో ఇస్తామని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో ఫలితాలను ప్రకటిస్తే, ఉద్యోగాల భర్తీ ఎప్పుడూ? మరోవైపు మే నెలలో టీచర్ల బదిలీలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. సుమారు 16 వేల పోస్ట్‌లను బ్లాక్ చేయకుండానే బదిలీలను ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అంటే మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో ఉండే టీచర్ పోస్ట్‌లు ఖాళీగానే ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. కొత్త డీఎస్సీ ఫలితాలే ఆగస్టు మొదటి వారంలో వస్తే, ఉద్యోగాల నియామకాలు సెప్టెంబర్ దాటి పోయే అవకాశం ఉంది.అంటే అప్పటి వరకు మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో ఉపాధ్యాయుల ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులు టీచర్ లేక, విద్యాసంవత్సరం ప్రారంభమైన నాలుగు నెలల పాటు పాఠాలు చెప్పేవారు లేక నష్టపోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ మొత్తం ప్రక్రియపైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? జూన్‌లోగానే నియామక ప్రక్రియను పూర్తి చేస్తే, విద్యార్ధులకు ఈ నష్టం జరగదు. కానీ ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ వరకు టీచర్ పోస్ట్‌ల భర్తీని సాగదీయడం వల్ల విద్యార్ధులే అంతిమంగా నష్టపోతున్నారు. పదకొండు నెలల కిందట 16347 పోస్ట్‌లకు కేబినెట్లో సంతకం చేశారు. నేటికీ అదే పోస్ట్‌లకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం ఎంత వరకు సమంజసం? ఈ మధ్య కాలంలో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి? వాటి పరిస్థితి ఏమిటీ?అసమర్థతతో విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారుకూటమి ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలో విద్యారంగం నాశనమవుతోంది. ఆనాడు సీఎంగా వైయస్ జగన్ గారు జీఓ 117 ద్వారా ప్రభుత్వ విద్యావ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుతూ మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పించాలని సంకల్పించారు. దీనిపై కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తూ అనేక అసత్య ఆరోపణలు చేసింది. జీఓ 117లో ఏమున్నాయో తెలియకుండానే ఆ జీఓను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. తరువాత ఆ జీవో మీద ఒక కొత్త మెమోను తీసుకువచ్చారు. ఈ మెమో కారణంగా అనేక ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించారు. సుమారు 19271 ప్రైమరీ స్కూళ్ళు వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్‌గా మారిపోతున్నాయి.ఒక పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్‌ను పెడతామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో దాదాపు 31 వేల ప్రైమరీ స్కూల్స్ ఉంటే, పంచాయతీకి ఒక్క స్కూలే పెడితే 19,271 స్కూల్స్ మాత్రమే మిగులుతాయి. రాష్ట్రంలో మొత్తం 3156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఈ స్కూల్స్‌నే తీసివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉన్న ఈ స్కూళ్ళలో 83 శాతం ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు అరవై మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఈ స్కూళ్ళన్నీ కూడా ప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్ల కింద పడిపోయే ప్రమాదం ఉంది.కేవలం 17 శాతం స్కూళ్లను మాత్రమే హైస్కూళ్ళుగా మారుస్తామని ప్రభుత్వం చెప్పింది. అలాగే 510 హైస్కూల్ ప్లస్ విద్యా సంస్థలను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 1800 మందికి పీజీటీలుగా పదోన్నతులు కల్పించి, ఇంటర్మీడియేట్ వరకు ఈ స్కూళ్లలో విద్యాబోధన కల్పించాలన్న వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు అవసరమైతే విద్యార్థుల కోసం పోరాడతామని చెప్పడంతో వాటిల్లో ఈ ఒక్క ఏడాది మాత్రమే 290 హైస్కూల్ ప్లస్ విద్యాసంస్థలను కొనసాగిస్తామని చెప్పి, వాటిపైనా కూడా ఒక అయోమయాన్ని కల్పించారు. అలాగే 117 జీఓ రద్దు వల్ల స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన వారి 8000 మంది పరిస్థితి ప్రశ్నార్థకం అయ్యింది.ఉద్యోగాల కల్పనపైనా అబద్దాలేనా?చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగాల వెల్లువ అంటూ తప్పుడు ప్రచారంతో అబద్దాలను గొప్పగా చెప్పుకుంటున్నారు. అయిదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో ఏకంగా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామని పచ్చి అబద్దాలు చెప్పారు. మేం దానిని ప్రశ్నించగానే పొరపాటుగా చెప్పామంటూ మాట మార్చారు. మరోవైపు ఉన్న ఉద్యోగాలను కూడా క్రమంగా తొలగిస్తూ యువత జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పదకొండు నెలల్లోనే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వారిని ఏకంగా మూడు లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.ఇప్పుడు ఏడాది సమయం తరువాత 16 వేల టీచర్ పోస్ట్‌లను భర్తీ చేస్తామంటుంటేనే అనేక సందేహాలు కలుగుతున్నాయి. 2014-19లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2018లో ఏడు వేలకు పైగా పోస్ట్‌లకు నోటిఫికేషన్ జారీ చేశారు. తీరా ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారా అని చూస్తే కేవలం 300 పోస్ట్‌లు భర్తీ చేసి, 6900 మందిని గాలిలో పెట్టారు. తరువాత వైయస్ జగన్ గారి ప్రభుత్వం వాటిని భర్తీ చేసింది. అలాగే 1998 డీఎస్సీని కూడా సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఇరవై అయిదేళ్ళ తరువాత వైఎస్ జగన్ ప్రభుత్వంలో వారికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది.తాజా నోటిఫికేషన్లో వైఎస్ జగన్ అయిదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని చెప్పారు. చంద్రబాబు గత అయిదేళకల పాలనలో ఎన్ని టీచర్ పోస్ట్‌లను భర్తీ చేశారని చూస్తే, 2014-19లో 10,313 పోస్ట్‌లు మాత్రమే భర్తీ చేశారు. వైఎస్ జగన్ అయిదేళ్ల కాలంలో రెండేళ్ళు కోవిడ్ సంక్షోభం ఉన్నా కూడా మూడేళ్ళలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన పాపాలను సరిచేసి అనేక వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. 1998 డీఎస్సీలో నాలుగు వేల మందికి పాతికేళ్ళ తరువాత ఉద్యోగాలు ఇచ్చారు.2018 డీఎస్సీ కింద వైఎస్ జగన్ హయాంలో 6954 మందికి టీచర్ పోస్ట్‌లు ఇచ్చారు. 2008 డీఎస్సీలో ఉతర్ణులైన వారికి 2193 మందికి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే టీచర్ పోస్ట్‌లు ఇచ్చింది. 602 పోస్ట్‌లను స్పెషల్ డీఎస్సీ ద్వారా, కేబీబీవీల్లో 1200 పోస్ట్ లను ఇలా మొత్తం 15008 టీచర్ పోస్ట్‌లను ఆయన హయాంలో భర్తీ చేయడం జరిగింది. అలాగే 2024 లో 6100 పోస్ట్‌లకు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే 21000 టీచర్ పోస్ట్‌ల భర్తీకి వైయస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.కేవలం పదివేల పోస్ట్‌లను భర్తీ చేసిన చంద్రబాబ ప్రభుత్వం తమదే గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా? ఎక్కడా బర్త్‌డే గిఫ్ట్‌లుగా ప్రచారం చేసుకుంటూ ఉద్యోగాలు ఇవ్వలేదు. భారతదేశంలోనే 1.36 లక్షల ఉద్యోగాలను ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి, రెండు నెలల్లో భర్తీ చేయడం ఒక రికార్డ్. ఇన్ని చేసిన వైఎస్ జగన్‌పై కూటమి పార్టీలు విమర్శలు చేయడం హాస్యాస్పదం. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే వరకు వారికి నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పారు. ఒక్కరికైనా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఉద్యగాలు లేవు, భృతి అంతకన్నా లేదు. కనీసం ఈ మెగా డీఎస్సీన అయినా చిత్తశుద్దితో నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వానికి చెబుతున్నాం. -
చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి
కర్నూలు జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఆలూరులో జరిగిన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. చంద్రబాబు పుట్టిన రోజులో భాగంగా మండుటెండలో టీడీపీ ర్యాలీ నిర్వహించింది. అయితే ర్యాలీలో టీడీపీ జిల్లా యూత్ అధికార ప్రతినిధి బోయ సురేంద్ర సొమ్ముసిల్లి పడిపోయారు. అయితే హుటూహుటీనా ఆలూరు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. బోయ సురేంద్ర అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. -
చంద్రబాబు నీకు దమ్ముంటే.. వర్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల నిరసన
-
KSR Comment: సూపర్ సిక్స్ డైవర్షన్ కోసం చంద్రబాబు కొత్త ప్రకటన
-
ఐటీకి ప్రోత్సాహం పేరుతో పైసా తక్కువ రూపాయ్ పథకం
-
Magazine Story: విశాఖ మేయర్ పీఠంపై పచ్చ ముఠా బరితెగింపు
-
బీసీల వెన్ను విరిచిన ఘనుడు చంద్రబాబు
-
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల కోత
-
తప్పుడు కేసులకు భయపడం.. ధైర్యంగా ఎదుర్కుంటాం
-
చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో చంద్రబాబు జీవించాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు.Happy Birthday to @Ncbn Garu! Wishing you a peaceful and healthy long life!— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2025 -
ఎట్టకేలకు డీఎస్సీ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: దాదాపు 11 నెలలుగా మెగా డీఎస్సీ అంటూ అభ్యర్థులను ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం శనివారం రాత్రి ఎట్టకేలకు డీఎస్సీ–2025 షెడ్యూల్ విడుదల చేసింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఖాళీలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించారు. గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. మెగా డీఎస్సీ ఇస్తామంటూ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించారు. అధికారం చేపట్టాక 16,347 డీఎస్సీ పోస్టుల భర్తీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు గతేడాది డిసెంబర్ నాటికే పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎట్టకేలకు అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 16,347 పోస్టుల కోసం షెడ్యూల్ వెలువరించింది. ఇందులో ఎస్జీటీ 6,599, స్కూల్ అసిస్టెంట్ 7,487, పీఈటీ 2 పోస్టులు ఉన్నాయి. దీంతోపాటు ఏపీఆర్ఎస్, ఏపీఎంఎస్, సాంఘిక, బీసీ, ట్రైబల్ వెల్ఫేర్‌కు సంబంధించి మరో 2,259 స్టేట్/జోనల్ పోస్టులు ఉన్నాయి. పోస్టుల వివరాలు, పరీక్షల షెడ్యూల్, సిలబస్ తదితర వివరాలను ఆదివారం ఉదయం 10 గంటల నుంచి విద్యా శాఖ వెబ్సైట్లో ఉంచనున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. వివరాలకు https:// cse. ap. gov.in / https// apdsc. apcfss. in వెబ్సైట్లను చూడవచ్చు. షెడ్యూల్ ఇదీదరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు: నేటినుంచి మే 15వ తేదీ వరకూమాక్ టెస్ట్: మే 20 నుంచిహాల్టికెట్ల డౌన్లోడ్: మే 30 నుంచిపరీక్షలు: జూన్ 6 నుంచి జూలై 6 వరకుప్రాథమిక కీ విడుదల: ప్రతి పరీక్ష పూర్తయిన రెండవ రోజునఅభ్యంతరాల స్వీకరణ: ప్రాథమిక కీ విడుదలైన 7 రోజుల వరకు ఫైనల్ కీ: అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత విడుదల చేస్తారుమెరిట్ జాబితా: ఫైనల్ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత విడుదల చేస్తారు -
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటాం
చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షతో పెడుతున్న తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘కూటమి ప్రభుత్వం వచి్చన తరువాత పెట్టిన ఎన్నో కేసుల్లో ఆరోపణలు అవాస్తవమని ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. అదే రీతిలో ప్రస్తుతం మద్యం విధానంపై పెట్టిన అక్రమ కేసులో ఆరోపణలు కూడా అవాస్తవమేనని త్వరలో నిర్ధారణ అవుతుంది’ అని ఆయన చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణ అనంతరం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం పూర్తి విషయాలు మాట్లాడలేను. చంద్రబాబు ప్రభుత్వం మొదట మదనపల్లిలో ఏదో జరిగిందని రెండు నెలలు రాద్ధాంతం చేసింది. ఆ కేసులో అనుమానితుడిని తీసుకెళ్లి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసి విచారించారు. ఆరోపణలన్నీ కట్టు కథ అని తేలింది. తర్వాత గనుల శాఖలో అవకతవకలు, ఇసుకలో రూ.వేల కోట్లు అవినీతి అని అన్నారు. అది కూడా అవాస్తవ ఆరోపణలు, తప్పుడు కథనమేనని తేలింది. వందల గనులు అన్యాక్రాంతం అని మరో తప్పుడు ఆరోపణలు చేశారు. అవీ నిరూపించలేదు. మా సొంత భూములను అటవీ భూముల ఆక్రమణ అని కొన్నాళ్లు రాద్ధాంతం చేశారు. దీనిపై మేం కోర్టుకు వెళ్లాం. అవన్నీ అటవీ భూములు కాదని అంతా సక్రమంగానే ఉందని మళ్లీ వాళ్లే కోర్టుకు నివేదిక ఇచ్చారు. తర్వాత భూముల ఆక్రమణ అని మరో తప్పుడు కేసు పెట్టారు. ఏదీ నిరూపించలేకపోయారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అని ఆరోపణ చేశారు. దీనిపై బహిరంగ చర్చకు రమ్మని సవాల్ విసిరాం. ఒక్కరూ రాలేదు. ప్రతి రెండు నెలలకు కూటమి ప్రభుత్వం ఏదో ఒక స్కాం అంటూ మాపై నిందలు వేస్తోంది. ఇదంతా రాజకీయ కక్షలో భాగమే. ఇప్పుడు లిక్కర్ స్కాం అని మరో ఆరోపణ చేస్తున్నారు. అన్నింటి మాదిరిగానే ఇదీ తప్పుడు కేసని నిర్ధారణ అవుతుంది. ఇదంతా రాజకీయ కక్షలో భాగమే. డ్రగ్స్, మానవ అక్రమ రవాణా మినహా అన్ని కేసులను మా పార్టీ నాయకులపై పెట్టి వేధించాలని ప్రయత్నించారు. లిక్కర్ స్కాం కేసు కోర్టు పరిధిలో ఉన్నందున అన్ని వివరాలు చెప్పలేకపోతున్నాను. కోర్టు నిర్ణయం వచ్చిన తరువాత మీడియా ముఖంగా అన్ని వివరాలు చెబుతాను’’ అని పేర్కొన్నారు. -
పైసా తక్కువ రూపాయ్!
‘‘కాసులతో ప్రలోభపెట్టారు. వినకపోతే కేసులతో భయ పెట్టారు. 27 మంది విశాఖ కార్పొరేటర్లను కూటమి నేతలు ఈ విధంగా లొంగదీసుకున్నారు. సొంత బలం లేకున్నా మేయర్‌పై అవిశ్వాసాన్ని నెగ్గించుకున్నారు. ఈ అప్రజాస్వామిక చర్యకు కూటమి నేతలు పెట్టుకున్న ముద్దుపేరు ‘ధర్మ విజయం’.’’ నూరు ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందట! (ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ చిత్రమిది)‘‘విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానంలో వెళ్లాలంటే హైదరాబాద్‌కు వెళ్లి రావాల్సి వస్తున్నది. ఇదీ మన పరిస్థితని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు. దీన్ని బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు సమర్థించారు. అభివృద్ధికిబ్రాండ్ అంబాసిడర్‌నంటూ తన ఆటోబయోగ్రఫీని ప్రణాళికా సంఘం సభ్యులకు చంద్రబాబు వినిపించిన మరునాడే ఈపరిణామం.’’ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందట! (ఇదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖచిత్రం)‘‘ఐటీకి ప్రోత్సాహం పేరుతో పైసా తక్కువ రూపాయ్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ముందుగా ప్రముఖ కంపెనీ టీసీఎస్‌కు 21 ఎకరాలు కేటాయించారు. ఆ వెంటనే ఊరూపేరూ లేని కంపెనీలు ఈ స్కీములో లైను కట్టాయి. ఐఎమ్జీ భారత్‌కు అయ్యలాంటి స్కెచ్.’’‘లూటీ’ కోసం కోటి విద్యలు’! (ఇది కొత్తపుంతలు తొక్కుతున్న అవినీతి చంద్రిక)‘‘మద్యాన్ని ఏరులై పారిస్తే లోకకల్యాణార్థమట. దాన్ని నియంత్రిస్తే మహా పాతకమట!’’వినేవాడు వెర్రివాడైతే, చెప్పేవాడు... ... ! (ఇదీ ఆంధ్రప్రదేశ్ సమాచార స్రవంతి)రూపాయంటే నూరు పైసలు. ఒక్క పైసా తక్కువైనా అది రూపాయి కాదు. ఆ విలువ రాదు. మాటలైనా అంతే! ఆచరణకు నోచుకోకపోతే విలువుండదు. ఆచరణయోగ్యం కాని వాగ్దానాలు చేయడం, ఎగవేయడంలో ఇప్పటికే చంద్రబాబుది ఆలిండియా రికార్డు. మాటలతో మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడంలో కూడా ఆయనకే వీరతాడు వేయాలి. మంచినీళ్లడిగితే మబ్బులవంక చూపెట్టి, ‘అదిగదిగో’ అన్న చందంగా కూటమి ప్రజాపాలన సాగుతున్నది. మరోపక్కన కాంట్రాక్టుల పేరుతో కమీషన్లు, కంపెనీల పేరుతో స్వీయ కైంకర్యాల కార్యక్రమం య«థేచ్ఛగా జరుగుతున్నది.రాజధాని నిర్మాణం పేరుతో పిలిచిన 40 వేల కోట్ల రూపాయల విలువైన టెండర్లలో తొమ్మిదివేల కోట్లు ‘మూల విరాట్టు’ హుండీలోకి చేరుకునేవిధంగా మంత్రాంగం నడిచిందని ‘సాక్షి’ ఒక కథనంలో నిరూపించింది. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం గానీ, ఖండించే సాహసం గానీ ప్రభుత్వం చేయ లేదు. చేయదు. నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు అనే ధోరణి. రాజధాని కాంట్రాక్టుల్లో ఈ లెక్కన ఇరవై రెండున్నర శాతం హుండీ ఖాతాకు చేరాలన్నమాట. ఇటీవల ప్రణాళికా సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి చెప్పిన వివరాలను బట్టి ఇంకో 37 వేల కోట్ల రూపాయలకు టెండర్లను పిలవాల్సి ఉన్నది.అమరావతి పేరుతో జరుగుతున్న ఈ తతంగంలో కాంట్రాక్టర్లు చేసే సంతర్పణ కంటే అక్కడ జరిగిన, జరుగుతున్న భూభాగోత లబ్ధి చాలా ఎక్కువని ఇప్పటికే పలు ఆరోపణలు, విమర్శలు వెలువడ్డాయి. అందుబాటులో ఉన్న 55 వేల ఎక రాలకు తోడు మరో 45 వేల ఎకరాలతో అమరావతి పార్ట్–2ను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజధాని కోసం ప్రభుత్వమే లక్ష ఎకరాలను సేకరించడం ఎందుకని విజ్ఞులూ, తటస్థ రాజ కీయవేత్తలూ ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ప్రతిపాదిత వైశాల్యం సుమారు మూడింట రెండొంతులు. అక్కడ కోటీ ఇరవై లక్షలమంది నివసిస్తున్నారు. దాని ప్రకారం ఆలోచిస్తే మొత్తం విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి – తాడేపల్లి నగరాలను పూర్తిగా ఖాళీ చేసి ఇక్కడ నింపేసినా ఇంకా సగం స్థలం ఖాళీగానే ఉంటుంది.రాజధాని నిర్మాణానికి సంబంధించి నిన్ననే ‘ఈనాడు’ పత్రిక ఒక ఆకర్షణీయమైన కథనాన్ని అచ్చేసింది. సరికొత్త సచి వాలయ టవర్ల నిర్మాణం కోసం రూ.4,688 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్డీఏ టెండర్లను పిలిచిందట! ఇందులో ఐదు ఐకానిక్ టవర్లుంటాయని ఆ గ్రాఫిక్ బొమ్మను కూడా అచ్చేశారు. రాబోయే వంద సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించిన కొత్త పార్లమెంటు భవనాన్ని కూడా వెయ్యి కోట్ల లోపు వ్యయంతోనే పూర్తి చేశారు. ఈమధ్యనే కట్టిన తెలంగాణా సెక్రటే రియట్‌కయిన ఖర్చు కూడా వెయ్యి కోట్ల లోపే! అమరావతిలో మాత్రం ఎంత భారీ ఖర్చయితే అంత ప్రయోజనం అను కున్నారేమో గాని ఐదు ఐకానిక్ టవర్లను నిర్మించే పనిలో పడ్డారు. ‘ఈనాడు’ రాసిన ఈ కథనంలోనే ఇంకో గమనించదగ్గ విషయం కూడా ఉన్నది.ఈ గ్రాండ్ సెక్రటేరియట్ నిర్మాణానికి 60 వేల టన్నుల స్టీల్ అవసరమవుతుందట! దీనికోసం సీఆర్డీఏ అధికారులు రాయ గఢలోని ఫ్యాక్టరీని పరిశీలించి వచ్చారట! ఇక్కడ స్టీల్ కొనుగోలు చేసి బళ్లారి, తిరుచిరాల్లి వర్క్‌షాపుల్లో ఫ్యాబ్రికేట్ చేయించాలని నిర్ణయించారట! ఈ విషయం తెలిసిన తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు భగ్గుమంటున్నారు. మెడ మీద ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్న విశాఖ ఫ్యాక్టరీకి ప్రభుత్వ ఆర్డర్లను అప్పగిస్తే ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉండేది కదా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కును ఆంధ్రుల హక్కుగా నిలబెట్టడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో ఈ వ్యవహారంతో తేలిపోయిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.విశాఖ ఉక్కు సంగతే కాదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబు సర్కార్ ఏపీ ప్రజలను మోస గిస్తున్నది. 45.72 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలబెట్టుకునేందుకు పోలవరం ప్రాజెక్టుకు గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఉన్నది. తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కేబినెట్ ఇటీవల దాని ఎత్తును 41.5 మీటర్లకు కుదిస్తూ ఆ మేరకు నిధులనుఅందజేయాలని నిర్ణయించింది. చంద్రబాబు సర్కార్ తలూపింది. ‘పోలవరం ఆంధ్రుల జీవనాడి’ అని బాబు మాట్లాడు తూంటారు. ఇప్పుడా నాడి స్పందన కోల్పోయినట్టే! 35 మీటర్ల ఎత్తునకు పైన లభ్యత ఉంటేనే జలాలు కుడి, ఎడమ కాల్వలకు పారుతాయి. ఇప్పుడా లభ్యత 45.72 మీటర్లకు బదులుగా 41.5 మీటర్లకు మాత్రమే పరిమితం కానున్నది. నిల్వ సామర్థ్యం 194 టీఎమ్సీల నుంచి 115 టీఎమ్‌సీలకు తగ్గిపోతుంది. ఈ కారణం వల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, కృష్ణా ద్వారా పెన్నాతో అను సంధానం వంటి మాటలన్నీ కాకమ్మ కబుర్లు కాబోతున్నాయి.ఈ విషయాన్ని దాచేసి ప్రజలను మభ్యపెట్టడానికి ‘గోదా వరి – బనకచర్ల అనుసంధానం’ అనే పాటను చంద్రబాబు పదేపదే ఆలపిస్తున్నారు. పోలవరం ఆయకట్టుకే సరిపోనివిధంగా కుదించిన ప్రాజెక్టుతో ఈ అనుసంధానం ఎట్లా సాధ్య మవుతుందో ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులైనా ప్రజలకు వివరించాలి. ఎన్నికలకు ముందు చెప్పిన ‘సూపర్ సిక్స్’ హామీలను అటకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన ‘అభివృద్ధికి ఆరు మెట్లు’ అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రవచిస్తున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ప్రణాళికా సంఘం బృందానికి కూడా తన ఆరు మెట్ల సిద్ధాంతాన్ని వివరించినట్టు ‘ఈనాడు’ రాసింది.‘ఆరు మెట్ల’ అభివృద్ధిలో మొదటి మెట్టుగా పోలవరం – బనకచర్ల అనుసంధానాన్నే ఆయన ప్రస్తావించారు. ఇదెంత బోగస్ వ్యవహారమో పోలవరం ఎత్తు కుదింపుతోనే తేలిపో యింది. ఇక రెండో అభివృద్ధి మెట్టు – తాగునీటి ప్రాజెక్టట! ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించిన గణాంకాలనే తీసుకుందాము. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో 2019 ఆగస్టు 15 నాటికి 30 లక్షల 74 వేల గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా నీటి సరఫరా జరిగేది. 2019 ఆగస్టు 15 – 2025 మే మధ్యకాలంలోనే, అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలోనే అదనంగా 39 లక్షల 34 వేల గృహాలకు తాగునీటి కుళాయిలు అందుబాటులోకి వచ్చాయి.మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి చివరి నాటికి 36 వేల గృహాలకు మాత్రమే కొత్తగా నీటి కుళాయిలు బిగించారు. తాగునీటి రంగంలో అభివృద్ధి మెట్టును వేసిందెవరో ఈ గణాంకాలు చెప్పడం లేదా?అభివృద్ధి మూడో మెట్టుగా పర్యాటక హబ్‌ల ఏర్పాటు, నాలుగో మెట్టుగా నాలెడ్జి ఎకానమీ, క్వాంటమ్ వ్యాలీ, స్కిల్ డెవలప్మెంట్ వగైరాలుంటాయట! ఐదో మెట్టుగా నౌకా శ్రయాలు, ఫిషింగ్ హార్బర్లు, మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు తదితరాలు. ఆరో మెట్టు – అమరావతి, తిరుపతి, విశాఖపట్నం గ్రోత్ సెంటర్లు. తిరుపతి, విశాఖ, అరకు వంటి ప్రాంతాల్లో జరిగిన పర్యాటకాభివృద్ధిపై ఆచరణే గీటురాయిగా ఎవరి హయాంలో ఏమి జరిగిందో చర్చకు పూనుకోవచ్చు. నాలెడ్జి ఎకానమీ, క్వాంటమ్ వ్యాలీ వంటి ‘నేమ్ డ్రాపింగ్’ వాగాడంబరం చంద్రబాబుకు పరిపాటే! మంత్రదండం చేతబూని ‘ఓపెన్ ససేమ్’ అనగానే పుట్టుకొచ్చేవి కావవి. అదొక సేంద్రియ అభివృద్ధి. అందుకు అనువైన పరిస్థితులు పూర్తిగా ఏర్పడేందుకు ఐదేళ్లు పట్టవచ్చు. పదేళ్లు పట్టవచ్చు. కానీ బాబు మాత్రం తన ఆలోచనలోకి రావడమే అమల్లోకి వచ్చినట్టుగా భావిస్తారు. అనుబంధ మీడియా తాళం వేస్తుంది. అనుయాయులు వీరతాళ్లు వేస్తారు.ఇక ఐదో మెట్టుగా నౌకాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లు, రవాణా సదుపాయాల పెంపుతో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నిలబెట్టాలట! కేవలం ఐదేళ్ల పదవీకాలంలోనే నాలుగు నౌకాశ్రయాలను, పది ఫిషింగ్ హార్బర్లను, ఆరు ఫిష్ ల్యాండర్ల నిర్మాణాన్ని ప్రారంభించి కొన్నిటిని పూర్తిచేసిన జగన్మోహన్రెడ్డి ఆచరణ ఎక్కడ? ఇంకో ఇరవై రెండేళ్లలో వాటిని నిర్మించాలనుకుంటున్న చంద్రబాబు ఆలోచన ఎక్కడ? మిడిమిడి జ్ఞానపు, మీడియా జ్ఞానపు మేధావులంతా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆరో అభివృద్ధి మెట్టుగా గ్రోత్‌సెంటర్లుగా అమరావతి, విశాఖ, తిరుపతిలను అభివృద్ధి చేయాలని పెట్టుకున్నారు. దీనిపై కూడా ఆచరణే గీటురాయిగా విస్తృత చర్చ జరగవలసిన అవసరం ఉన్నది.ఈమధ్య రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల ఏర్పాటు పేరుతో పైసా తక్కువ రూపాయి పథకాన్ని ప్రారంభించింది. టీసీఎస్ ఆఫీసు ఏర్పాటు కోసం విశాఖలో విలువైన 21 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. టీసీఎస్ అనేది పేరున్న సంస్థ కనుక ఆ కంపెనీ ఏర్పాటయితే మన నిరుద్యోగులకు ఉద్యోగా లొస్తాయనే ఆశ ఉండవచ్చు. కాకపోతే ప్రభుత్వ ఐటీ పాలసీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే షరతు లేకపోవడంఆందోళన కలిగించే విషయం. టీసీఎస్‌కు భూకేటాయింపు జరిగిన వెంటనే అసలైన అవినీతి కథ మొదలైంది. ‘ఉర్సా’ అనే ఊరూపేరూ లేని, రెండు మాసాల వయసున్న ఓ కంపెనీకి విశాఖలోనే ఖరీదైన 60 ఎకరాల స్థలాన్ని ఎకరా 99 పైసలకే కట్టబెట్టారు. ఇలాంటి కంపెనీలు పైప్‌లైన్‌లో ఇంకా చాలా ఉన్నాయట!కాంట్రాక్టుల్లో కమీషన్లు, భూకేటాయింపుల్లో చేతివాటంతో అగ్రనేతలు చెలరేగుతుంటే గ్రాస్ రూట్స్ నాయకులు గడ్డి మేయకుండా ఉంటారా? అవినీతి గబ్బు ఆంధ్రావనిని అతలా కుతలం చేస్తున్నదని వార్తలు వస్తున్నాయి. వాగ్దాన భంగం కారణంగా జనంలో తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత బాహాటంగానే వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలోనే అభివృద్ధిని మబ్బుల్లో చూపడం, అవినీతిని గత ప్రభుత్వంలో చూపడమనే కార్య క్రమాన్ని కూటమి సర్కార్ తలకెత్తుకున్నది. అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ పేరుతో ఓ నిత్యాగ్నిహోత్రాన్ని నిరంతరం మండించే పనిలో పడ్డారు. అసలు స్కామ్ అంటే ఏమిటి? ఎటువంటి ప్రభుత్వ విధానం వల్ల స్కామ్ జరిగే అవకాశం ఉంటుంది అనే మౌలికమైన ప్రశ్నల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నారు.మద్యం తయారీదారులకు ఉపయోగపడేలా మద్యం ఉత్పత్తులకు ఊతమిచ్చి, అమ్మకందారులు లబ్ధిపొందేలా ప్రవా హాలను ప్రోత్సహించే పాలసీలో స్కామ్ ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్‌కు మద్యం సరఫరా చేసిన డిస్టిలరీలలో సింహభాగం గతంలో చంద్రబాబు ప్రభుత్వం అనుమతులతో పుట్టినవేనని చెబుతున్నారు. మునుపటి చంద్రబాబు పాలనా కాలంలో ఊరూవాడల్ని మద్యం ముంచెత్తింది. గజానికో బెల్టు షాపు, పది గజాలకో పర్మిట్ రూమ్‌తో మహమ్మారి విలయతాండవంచేసింది. జగన్ సర్కార్ మద్య నియంత్రణను తన పాలసీగా ప్రకటించింది. కొత్తగా డిస్టిలరీలకు అనుమతులివ్వలేదు. 43 వేల బెల్టు షాపులను ఎత్తేసింది. పర్మిట్ రూమ్‌లను అనుమతించలేదు. షాపుల సంఖ్యను సగానికి సగం కుదించింది. అమ్మకం ద్వారా లాభాలను గడించే ప్రైవేట్ వ్యాపార వర్గాన్ని పూర్తిగా తొలగించింది. ప్రభుత్వ యాజమాన్యంలోనే నిర్ణీత వేళల్లోనే అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకున్నది. ఒకే ఒక్క ప్రశ్న: ‘మా ప్రభుత్వంలో తమ్ముళ్లకు బాగా తాపిస్తా’ అని చెప్పిన ప్రభుత్వంలో స్కామ్ ఉంటుందా? ‘మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టాల్సిందే’నని హెచ్చరించిన ప్రభుత్వంలో స్కామ్ ఉంటుందా? బుద్ధిజీవులే నిర్ణయించాలి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
కట్టు కథలు.. తప్పుడు ప్రచారాలు.. కూటమి సర్కార్‌పై మిథున్‌రెడ్డి ఫైర్
సాక్షి, విజయవాడ: కూటమి సర్కార్ వచ్చాక తమపై కక్ష సాధింపులకు దిగుతున్నారని.. కట్టు కథలు అల్లి తప్పుడు ప్రచారాలకు తెగబడుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ తమ ప్రతిష్టను దిగజారుస్తున్నారని.. తమ సొంత భూములను అటవీ భూములు అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీ మిథున్‌రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్ కోర్టు పరిధిలో ఉందని.. అందుకే మద్యం కేసు గురించి తాను పూర్తిగా మాట్లాడలేనని తెలిపారు. మద్యం కేసు కూడా రాజకీయ వేధింపుల్లో భాగంగా పెట్టిన కేసు మాత్రమే. నాపై పెట్టడానికి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి’’ అని మిథున్‌రెడ్డి వ్యాఖ్యానించారు.‘‘మద్యం కేసు తప్పుడు కేసు అని చెప్పగలను. ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానంలో కేసు గురించి తేలిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ అంశంపై వివరంగా మాట్లాడతాను’’ అని మిథున్‌రెడ్డి చెప్పారు. -
బాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అరాచకాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ‘‘చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని.. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ గుర్తుపై పోటీచేసి 58 స్థానాలను మా పార్టీవాళ్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచింది. మరి మీకు మేయర్ పదవి ఏరకంగా వస్తుంది?..బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను మేం మేయర్ పదవిలో కూర్చోబెడితే, మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్‌పై మీ నాయకులతోనూ, పోలీసులతోనూ దాడులు చేయించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా ఇది?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్ పదవీకాలం పూర్తవుతుందని తెలిసీ, మళ్లీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా, ప్రజలకు ఫలానా మంచి చేశాను అని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబూ.. మీకులేదు. అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారు. మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెప్తారు.ఇన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు గురిచేసినా తలొగ్గక పార్టీవైపు, ప్రజలవైపు నీతి, నిజాయితీగా నిలబడి చిత్తశుద్ధి చాటుకున్న వైయస్సార్సీపీ కార్పొరేటర్లను, అలాగే వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లను అభినందిస్తున్నాను.రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమకు అధికారం లేకపోయినా అధికార దుర్వినియోగం, కండబలంతో వాటిని చేజిక్కించుకోవడానికి చంద్రబాబుగారి కుటిల ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొని నిలబడుతున్న మా పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మరోసారి హ్యాట్సాప్ చెప్తున్నా’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. .@ncbn గారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.ప్రజలు ఇచ్చిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2025 -
కుట్రలు, కుతంత్రాలతో కూటమి మ్యాజిక్ ఫిగర్
-
చంద్రబాబు చెవిలోనైనా ఆ విషయం చెబుతారా?
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వంపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వద్ద కంచ గచ్చిబౌలి వద్ద ఉన్న 400 ఎకరాల భూమికి సంబంధించి ఒకవైపు సుప్రింకోర్టు విచారణ జరుపుతుండగా, ప్రధానమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతుంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడవులపై బుల్డోజర్లు ప్రయోగిస్తోందని మోదీ ఆరోపించారు. అక్కడ జంతువులను ప్రమాదంలో పడేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ సంపదను నాశనం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అయితే.. .. ఏపీలో కూటమి ప్రభుత్వం(AP Kutami Prabhutvam) ఇప్పటికే 33 వేల ఎకరాల పచ్చటి పంటల భూములను పర్యావరణంతో సంబంధం లేకుండా నాశనం చేస్తే మద్దతు ఇచ్చిన బీజేపీ పెద్దలకు.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి నైతికంగా అర్హత ఎంత మేర ఉంటటుందన్నది ఆలోచించుకోవాలి. అది చాలదన్నట్లుగా మరో 45 వేల ఎకరాలు సమీకరిస్తామని బాబు సర్కార్ చెబుతుంటే కనీసం స్పందించని బీజేపీ.. తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 👉అయినా తెలంగాణలో బీజేపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక విమర్శలు, ఆరోపణలు చేస్తే చేయవచ్చు. కాని దేశ ప్రధాని అంతటివారు ఈ వివాదంలో వేలు పెట్టడం పద్దతేనా?. అది సుప్రీం కోర్టు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందా? ఉండదా? అనే చర్చకు ఆస్కారం ఇస్తోంది. హామీలు అమలు చేయకుండా రేవంత్ సర్కార్ బుల్డోజర్లను వాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాలలో అభివృద్ది పరుగులు తీస్తోందని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్రాలను పొగుడుకుంటే పొగుడుకోవచ్చు. కాని ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలపై మోదీ అధిక విమర్శలు చేయడం ద్వారా ఆయనలోని రాజకీయ నేత కోణం అంతగా మంచి పేరు తేకపోవచ్చు. ఉత్తరప్రదేశ్ తదితర కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలలో నేరస్తుల పేరుతో ఇళ్లను ఇష్టారాజ్యంగా కూల్చివేస్తున్న తీరుపై చాలా అసంతృప్తి ఉంది. సుప్రీంర్టు సైతం దీనిపై పలుమార్లు వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. ఆ విషయాలను మోదీ గమనంలోకి తీసుకుంటారో లేదో తెలియదు. రేవంత్ ప్రభుత్వం కంచ గచ్చి బౌలి భూముల విషయంలో అనుసరిస్తున్న వైఖరి సరైనదా? కాదా? అనేది ఇక్కడ చర్చ కాదు. దానిని సమర్ధించవచ్చు. వ్యతిరేకించవచ్చు. స్థానిక ప్రజలు తమ అభీష్టాన్ని ప్రభుత్వానికి చెప్పవచ్చు. అది వేరే సంగతి. కాని గతంలో దేశ ప్రధానులలో ఎవరూ ఇలా రాష్ట్రాలపై తరచు విమర్శలు చేసినట్లు అనిపించదు. ఎన్నికల సమయంలో పార్టీ పరంగా, విధానపరంగా విమర్శలు,ప్రతి విమర్శలు చేయడానికి వారు ప్రాధాన్యత ఇచ్చి ఉండవచ్చు. అంతే తప్ప, ఏ రాష్ట్రానికి వెళ్లినా అదే పనిలో ఉండడం గతంలో ఈ స్థాయిలో ఉండేది కాదని చెప్పవచ్చు. లేదా మహా అయితే పరోక్షంగా ఏమైనా ఒకటి,రెండు విమర్శలు చేసి ఉండొచ్చు. 👉మన్మోహన్ సింగ్(Manmohan Singh) ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలపై పనికట్టుకుని ఆరోపణలు చేసేవారుకాదు. కాకపోతే సింగ్ బ్యూరోక్రాట్ నుంచి రాజకీయనేతగా మారారు. మోదీ మొదట ఆర్ఎస్ఎస్ లో ఉండి ,తదుపరి రాజకీయ నేతగా ఎదిగారు. ఆ సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలోని కంచ గచ్చిబౌలి వద్ద 400 ఎకరాల భూమిపై వివాదం ఏర్పడిన మాట నిజం. ఆ భూములలోఎలాంటి పనులు చేపట్టవద్దని పలువురు కోరిన సంగతి కూడా నిజమే. దానిపై కేంద్రప్రభుత్వపరంగా ఏవైనా ఆలోచనలు ఉంటే వాటిని సజెస్ట్ చేస్తూ రాష్ట్రానికి లేఖ రాసి ఉండవచ్చు. కాని అవేవీ చేయలేదు. 👉తెలంగాణ బీజేపీ నేతలు(Telangana BJP) ఏ విమర్శలు చేశారో వాటినే ప్రధాని మోదీ కూడా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం అవి అసలు అటవీశాఖ భూములే కాదు. ప్రభుత్వ భూములని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాతే అక్కడ కొన్ని కార్యకలాపాలు చేపట్టడం జరిగింది. ఆ భూముల ఆధారంగా పదివేల కోట్ల రుణ సమీకరణ కూడా చేశారు. ఈలోగా దీనిపై యూనివర్శిటీలో విద్యార్దులు వ్యతిరేకించి ,ఆ భూమి కూడా సెంట్రల్ యూనివర్శిటీకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దానికి బీజేపీ, బీఆర్ఎస్లు మద్దతు ఇవ్వడం, సడన్‌గా సుప్రీం కోర్టు కూడా సుమోటోగా జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడం జరిగింది. దీనికి రేవంత్ సర్కార్ బదులు ఇస్తూ కంచగచ్చిబౌలి(kanche Gachibowli) భూములు అటవీ భూములు కాదని, ప్రభుత్వం అధీనంలో ఉన్న భూములని స్పష్టం చేసింది. అక్కడ జంతువులకు ఆవాసం లేదని,వాటికి తగు రక్షణ కల్పించడానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. 👉ఇక్కడ కొట్టేసిన చెట్లు నిషేదిత జాబితాలో లేవని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే సుప్రీం కోర్టు దీనిపై కూడా అంత సంతృప్తి చెందలేదు. చెట్లు కొట్టివేయడానికి అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించింది. ఆ కేసు ఇంకా పూర్తి కాలేదు..కాని ఈలోగా ప్రధాని మోదీ అవి అడవులని, అక్కడ జంతువులు ఉన్నాయని, అడవిని, జంతువులను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తోందని రాజకీయంగా మాట్లాడడం పద్దతేనా అనే అభిప్రాయం కలుగుతుంది. తెలంగాణలో అధికారం సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుండవచ్చు. దానికి తగిన విధంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుంటారు. తెలంగాణకు వచ్చినప్పుడు కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు చేస్తే అదో తరహా. కాని ఎక్కడో హర్యానాలో ఒక సభలో మాట్లాడుతూ ఈ విమర్శలు చేశారు. నిజంగానే పర్యావరణంపైన ప్రధానమంత్రికి అంత శ్రద్దాసక్తులు ఉన్నట్లయితే ఏపీలో రాజధాని పేరుతో 33వేల ఎకరాలు సమీకరించినప్పుడు బిజెపి ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?. మోదీ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి వెళ్లారే. అవసరమైనమేర ప్రభుత్వ భూమిని వాడుకుంటే మంచిదని అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మోడీ ఎందుకు సలహా ఇవ్వలేదు. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ విడిపోయాక.. పోలవరం, అమరావతి టీడీపీ నేతలకు ఏటీఎంగా మారాయని ఆయనే ఆరోపించారు కదా?. ఆ తర్వాత 2024లో మళ్లీ పొత్తు పెట్టుకున్నాక అవన్ని తూచ్ అయిపోయినట్లనుకోవాలా?. ఇంతకుముందు తీసుకున్న 33 వేల ఎకరాలు కాకుండా,మరో 45వేల ఎకరాల భూమి సమీకరించడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించడం సరైనదా? కాదా? అనేదానిపై మోదీ మాట్లాడడానికి సిద్దంగా ఉంటారా?. మరోసారి రాజధాని పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మే 2 న వస్తారట.అప్పుడైనా పర్యావరణానికి విఘాతం కలిగేలా ఇన్నివేల ఎకరాల భూములు ఎందుకు?అక్కడ పంటలను ఎందుకు నాశనం చేస్తున్నారు? పక్కనే ఉన్న కృష్ణానది మరింత కలుషితంగా మారడానికి ఈ చర్య అవకాశం ఇస్తుంది కదా? అని ప్రధాని ప్రశ్నించితే.. తెలంగాణ భూములపై చేసిన వ్యాఖ్యలను సమర్దించవచ్చు. అలా కాకపోతే అవకాశవాద రాజకీయాలకే ప్రధాని ప్రాధాన్యం ఇస్తున్నారన్న సంగతి ప్రజలకు తెలిసిపోదా?. తెలంగాణలో ఒక రకంగా, ఏపీలో మరో రకంగా మాట్లాడితే మోదీకి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.., ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు మద్య తేడా ఏముంటున్నదన్న ప్రశ్న వస్తుంది. ఏది ఏమైనా ప్రతి అంశంలోను పార్టీపరంగా కాకుండా దేశ ,రాష్ట్ర ప్రయోజనాలను గమనంలోకి తీసుకుని ప్రధాని మోదీ వ్యవహరిస్తే బాగుంటుంది కదా!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘చంద్రబాబు మహిళా ద్రోహిగా మిగిలిపోతారు’
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాలతో కూటమి సర్కార్ మేయర్ పీఠం కైవసం చేసుకుందని ఆరోపించారు. కూటమి పాలనలో ధర్మం వధ, సత్యం చెరలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.విశాఖ మేయర్ పీఠం కూటమి గెలుపుపై వైఎస్సార్సీపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ..‘యాదవ మహిళకు వైఎస్ జగన్ మేయర్ పదవి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. కుట్రలు, కుతంత్రాలతో కూటమి సర్కార్ మేయర్ పీఠం కైవసం చేసుకుంది. పార్టీ మారని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను బెదిరించాలని చూస్తున్నారు. చావుబతుకుల మధ్య కూటమి సర్కార్ మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకుంది. వైఎస్సార్సీపీ పాలనలో గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో మేం ప్రలోభపెట్టలేదు. కూటమి పాలనలో ధర్మం వధ, సత్యం చెరలో పడిపోయింది. కూటమి నేతలు గెలిచే బలం లేకున్నా అవిశ్వాస తీర్మాన లేఖ ఇచ్చారు. ధర్మం గెలిచిదంటున్న కూటమి నేతలకు మాట్లాడే అర్హత లేదు. కూటమి చావు బతుకుల మీద మ్యాజిక్ ఫిగర్ చేరుకుంది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచారు. కుట్రలు తంత్రాలకు తెర తీశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. విలువలు విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు. కూటమిని తట్టుకొని నిలబడ్డ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్..బలం లేకుండా అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు..ధర్మం న్యాయం గురించి మాట్లాడే హక్కు కూటమి నాయకులకు లేదు.మేయర్ మీద అవిశ్వాసం గెలిచారు. విశాఖ ప్రజల మనసుల్లో విశ్వాసం కోల్పోయారు.విప్ ఉల్లంఘించిన వారి పదవులు పోవడం కాదు..యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు మేయర్ పదవి ఇచ్చారు..ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని ప్రలోభ పెట్టారు.99 పైసలకే విశాఖ భూములను ఇష్టానుసారంగా కట్టబెడుతున్నారు.ఇదే తరహాలో భూములు కట్టబెడతామని లోకేష్ చెప్తున్నారు..టీసీఎస్ విశాఖ రాక ముందే భూములు అప్పనంగా కట్టబెడుతున్నారు.విశాఖ మేయర్ పీఠం చేతిలో ఉంచుకొని విశాఖను దోచుకోవాలని చూస్తున్నారు.ధర్మశ్రీ పాయింట్స్ కామెంట్స్..మేయర్ ఎన్నికలో వైఎస్సార్సీపీ నైతికంగా గెలిచింది..కూటమి నిజంగా గెలిచే పరిస్థితి ఉంటే నెల రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు..జీవీఎంసీ డబ్బులతో ప్రత్యేక విమానాలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల కోసం తీసుకువెళ్లారు..యాదవ్ కుల ద్రోహులు కూటమిలో ఉన్నారు..ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..పది నెలల పదవి కోసం ఒక మహిళను పదవి నుంచి దించుతారా?.చంద్రబాబు మహిళా ద్రోహిగా మిగిలిపోతారు..ప్రజలు 164 సీట్లు ఇచ్చిన చంద్రబాబుకు అధికార దాహం తీరలేదు..వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను భయబ్రాంతులకు గురి చేశారు.చంద్రబాబు ప్రలోభాలకు పెట్టింది పేరున్యాయం ధర్మం గెలిచిందని కూటమి నేతలు మాట్లాడడం సిగ్గుచేటు.కుట్రలు తంత్రాలకు మేయర్ ఎన్నికలో గెలిచాయి. -
అమరావతిలోనే లక్షల కోట్లు పెట్టడమంటే రాష్ట్రంపై అప్పుల భారం వేయడమే