
విజయవాడ: రాజధాని కోసం అంటూ ఇప్పటికే వేల ఎవరాలు సేకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మళ్లీ భూముల సమీకరణకు సిద్ధమయ్యారు. ఎయిర్ పోర్ట్, క్రికెట్ స్టేడియం పేరుతో మళ్లీ భూ సమీకరణ చేపట్టడానికి సిద్ధమైంది చంద్రబాబు సర్కారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రైతుల సమావేశంలో చెప్పేశారు.
ఎయిర్ పోర్టు, స్టేడియం నిర్మాణంతో భూముల విలువ పెరుగుతుందని మరో కథ చెప్పేశారు చంద్రబాబు. రాజధాని పనులు పునః ప్రారంభ కార్యక్రమానికి రైతులను ఆహ్వనిస్తామన్నారు. రైతులకు రిటర్న్ బుల్ ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామన్నారు. త్యాగాలు చేసిన రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ కార్యక్రమమూ ఉండదన్నారు చంద్రబాబు.