యాత్ర 2 సినిమా కొత్త ఒరవడి సృష్టిస్తోంది. విదేశాల్లో ఉంటోన్న ప్రవాసాంధ్రులను, ముఖ్యంగా వైఎస్సార్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. యూకే & యూరప్ YSRCP వింగ్ ఆధ్వర్యంలో లండన్ మహానగరంలోని హౌన్సలో ప్రాంతంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు.
మనం చూసే ప్రతి సినిమా మనలో ఒకరి జీవన ప్రతిబింబం. కొందరి జీవితాలు స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం. దివంగత నేత వైఎస్సార్ జీవితంలోని అటువంటి సంఘటనలను ఆధారంగా చేసుకొని వినోదాత్మకంగా మరియు సందేశాత్మకంగా సినిమాని మలచడంలో దర్శకుడు మహి రాఘవ సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు లండన్‌లోని YSRCP వింగ్ నాయకులు. ప్రజల మనసులను గెలిచిన మారాజు డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జీవన వృత్తాంతాన్ని చక్కగా సినిమాగా రూపొందించారని ప్రశంసించారు. యాత్ర2 సినిమా చూసిన తరువాత ఇది అద్భుతం అని అనకుండా వుండలేమన్నారు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి జీవితాన్ని హృద్యంగా చిత్రీకరించిన సన్నివేశాలతో మహీ రాఘవ ప్రేక్షకులను కట్టిపడేశాడని కొనియాడారు. అలాగే నిజజీవితంతో పెనవేసుకున్న ఎమోషనల్ డ్రామాను చాలా రియలిస్టిక్ గా చిత్రీకరించారని మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆఖర్లో రియల్ సీన్లను కలిపి చేసిన జగన్ గారి ప్రమాణస్వీకార సన్నివేశం రోమాలు నిక్కపొడుచుకునేలా తీశారని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా చరిత్రలో చెరగని పేజీగా యాత్ర 2 నిలిచిపోతుందన్నారు. భవిష్యత్తులో యాత్ర 3 సినిమా కూడా వస్తే మరింత బాగుంటుందన్నారు. నటులు మమ్ముట్టి, జీవా పాత్రలకు ప్రాణం పోశారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment