సాక్షి, విశాఖపట్నం: ఇక్కడ ఉన్నది అర్జునుడు.. ఇటు పక్క పాండవ సైన్యం ఉంది. అటు పక్క కౌరవ సైన్యం ఉంది. అక్కడ పద్మ వ్యూహం పొంచి ఉంది. ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు. ఈ అర్జునుడికి తోడు కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. భీమిలి నియోజకవర్గం సంగివలస బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ యుద్ధంలో 175కి 175 సీట్లు గెలుపే మన లక్ష్యమన్నారు.
‘‘ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. మరో 25 ఏళ్ల పాటు మన జైత్ర యాత్రకు శ్రీకారం చుడుతున్నాం. మన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చాం చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. అందుకే దత్త పుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు. గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు. చేసిన మంచిని నమ్ముకునే.. మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడు’’ అని సీఎం పేర్కొన్నారు.
‘‘మరో 75 రోజుల్లోనే ఎన్నికలు. అబద్దానికి, నిజానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. గతంలో చంద్రబాబు 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదు. మనం మేనిఫెస్టో లోని ప్రతి హామీని నెరవేర్చాం. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ప్రతి గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు. 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం. లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశాం. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాం. రైతులకు తోడుగా ఆర్బీకే లను నిర్మించాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
‘‘ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. ప్రతి గ్రామానికి డిజిటల్ లైబ్రరీలు, బ్రాడ్ బాండ్ లు తీసుకొచ్చాం’’ అని సీఎం తెలిపారు.
‘‘14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయాలనే ఆలోచన లేదు. ఎందుకంటే చంద్రబాబు అండ్ కో పెత్తందార్లు కాబట్టి చంద్రబాబు సీఎంగా ఉంటే ఏ గ్రామం బాగుపడదు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నిలువునా ముంచాడు. మీ జగన్.. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు
3,527 ప్రొసీజర్ల కు ఆరోగ్యశ్రీ ని విస్తరించాం. ఒక్క వైద్యరంగంలోనే 53 వేల కొత్త నియామకాలు చేపట్టాం. అందుకే ఎక్కడ చూసినా వైఎస్ జగన్ మార్కే కనిపిస్తోంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువును అందుబాటులోకి తెచ్చాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం . నామినేటెడ్ పదవుల్లో సగం పదవులు బలహీనవర్గాలకే ఇచ్చాం. స్థానిక సంస్థల పదవులు ఆన్నింటిలోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. లంచాలు, వివక్ష లేకుండా రూ. 2 లక్షల 53 వేల కోట్లు నేరుగా మీ ఖాతాలో వేశాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
‘‘పేదల సొంతింటి కలను నెరవేర్చాం. అక్కచెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మాది. 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇచ్చాం. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారు. అన్నింటిలోనూ చంద్రబాబు మోసమే కనిపిస్తుంది. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు అన్నారు బడుగుబలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమ లేదు. మీ జగన్ రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు.
సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. గత పదేళ్ల మీ బ్యాంకు అకౌంట్ల ను చెక్ చేసుకోండి. చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి అయినా పడిందా ?. మన పాలనలో మీ ఖాతాల్లో రూ. 2 లక్షల 53 వేల కోట్లు వేశాం. ఎన్ని కష్టాలు ఎదురైనా .. అన్ని వర్గాలకు మంచి చేశాం. మీ జగన్.. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు. 56 నెలల కాలంలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం. కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి మనం చేసిన మంచిని చెప్పండి. మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమల్ని మాత్రమే.
ప్రజలే .. నా స్టార్ క్యాంపెయినర్లు. పేదల భవిష్యత్ మారాలంటే .. జగనే గెలవాలని చెప్పండి. ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే .. జగన్ గెలవాలని చెప్పండి
ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే .. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి. రైతు భరోసా, ఇన్ ఫుట్ సబ్సిడీ అందాలంటే .. మీ జగన్ సీఎం కావాలని చెప్పండి’’ అని సీఎం చెప్పారు.
మీరు వేసే ఓటు.. పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ఓటు అని చెప్పండి. ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇస్తాయి. మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం.. మోసాలు చేయడం తెలియదు. మీ బిడ్డ చెప్పాడంటే.. చేస్తాడంతే. ఈ యుద్దానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?. ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా ?. దుష్టచతుష్టయాన్ని.. గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా?. వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే. ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి. దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ, 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే’’ అని సీఎం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment