Bheemili
-
గంటా కొడుకు.. ‘అధికార’ దర్జా
మధురవాడ: అధికారంలోకి వచ్చిందే పెత్తనం చెలాయించడానికన్నట్లు టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ప్రజా ప్రతినిధి కాకపోయినా తండ్రి హోదాను అడ్డుపెట్టుకుని భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ రెచ్చిపోయారు.గురువారం సాయంత్రం మధురవాడ చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ఆయన హెచ్ఎం కుర్చీలో కూర్చుని లా అండ్ ఆర్డర్‌పై సమీక్ష నిర్వహించారు. హైస్కూల్ ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ, జీవీఎంసీ జోనల్ కమిషనర్, పీఎం పాలెం లా అండ్ ఆర్డర్ పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం వారంతా ఇది కూటమి మహిమ అంటూ గుసగుసలుపోయారు. -
భీమిలిలో దారుణం.. బాలిక వీడియో చిత్రీకరించి..
సాక్షి, విశాఖపట్నం: భీమిలిలో దారుణం జరిగింది. బాలిక న్యూడ్ వీడియో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతున్న కామాంధుడి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. బాలిక దుస్తులు మార్చుకుంటుండగా గాజువాకకు చెందిన సమీప బంధువు జానకిరామ్ (53).. నగ్న వీడియోలు తీసి తల్లిని బెదిరించాడు. కుమార్తె నగ్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసిన జానకిరామ్.. వివాహిత నుండి పలుమార్లు లక్షల్లో వసూలు చేశాడు. దీంతో భీమిలి పోలీసులను బాధిత మహిళ ఆశ్రయించింది. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.చిట్టివలసలో తల్లి, కూతురు ఆత్మహత్యమరో ఘటనలో భీమిలిజోన్ చిట్టివలసలో తల్లి, ఇద్దరు కూతుర్లు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ మృతి చెందిన తల్లి, ఒక కుమార్తె మృతి చెందారు. భర్త రామకృష్ణ దివీస్ ఉద్యోగి. భర్తతో మనస్పర్థల కారణంగా ఇద్దరి పిల్లలకు పురుగుల మందు తాగించిన తల్లి.. తాను తాగింది. తల్లి మాధవి(25), కూతురు రితిక్ష (2) మృతి చెందారు. మరో కుమార్తె ఇషిత (5) హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. -
యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు.
-
ఎర్రమట్టి దిబ్బలను ఎత్తుకెళ్తున్న పచ్చ మూకలు
-
జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..
-
జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
విశాఖపట్నం, సాక్షి: భీమిలి నియోజకవర్గంలో జనసేన నాయకులకు ఘోర అవమానం జరిగింది. టీడీపీ ప్రచార రథంపై నుంచి జనసేన నేతలను బలవంతంగా గెంటేశారు. టీడీపీ ప్రచార రథంపై జనసేన జెండాలు లేకుండా చేశారు. టీడీపీ నేతలు చేసిన అవమానాన్ని తలుచుకొని జనసేన నేతలు రగిలిపోతున్నారు.ప్రచారానికి పిలిచి అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా టీడీపీ నాయకులు తమను అవమానిస్తున్నారని మండిపడుతున్నారు. జరిగిన అవమానాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లేందుకు జనసేన నేతలు సిద్ధమవుతున్నారు. -
భీమిలి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం
-
Bheemili: టీడీపీలో సీట్లకు వేలంపాట.. చంద్రబాబుపై కోరాడ రాజబాబు ఫైర్
సాక్షి, విశాఖపట్నం: గంటా శ్రీనివాసరావుపై భీమిలి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు మండిపడ్డారు. మంత్రిగా అనేక భూ అక్రమాలకు గంటా పాల్పడ్డారని దుయ్యబట్టారు. గంటా ఒక అవినీతిపరుడు. గంటా భూ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు అందాయి. జీవీఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్ పార్టీ టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తి గంటా. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర గంటాది’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చిన నేతకు భీమిలిలో సీటు ఎలా ఇస్తారు?. నాలుగేళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉన్నారు. డబ్బున్న వారికే చంద్రబాబు టికెట్ల ఇస్తున్నారు. టీడీపీలో సీట్లకు వేలంపాట పెడుతున్నారు. యువతకి 40 శాతం సీట్లు ఇస్తామన్నారు. స్థానిక కాపులకు ఎందుకు సీట్లు ఇవ్వలేదు’’ అని రాజబాబు ప్రశ్నించారు. -
‘ఉత్తర’ కుమారుడు.. మళ్లీ భీమిలికి..
సాక్షి, విశాఖపట్నం: ఆయనో రాజకీయ సంచారజీవి.. పిల్లిపిల్లలను మార్చిన చందంగా ఎన్నికలకో నియోజకవర్గం మారుస్తూ.. పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో ప్రజల్ని ఏమారుస్తూ.. గెలిచిన తర్వాత.. ఓటర్లను మోసం చేస్తూ.. చివరి నిమిషంలో అక్కడి నుంచి జంప్ అయిపోతారు. ఎన్నికలకో సెగ్మెంట్ మారుస్తున్న గంటా శ్రీనివాసరావు అడ్డగోలు సంపాదన, స్థిర, చరాస్థులను కూడబెట్టడంలో మాత్రం ఏకరీతినే దూసుకుపోయారు. నిన్న మొన్నటి వరకూ టికెట్ కోసం అధిష్టానం చుట్టూ కాళ్లరిగేలా తిరిగే స్థితికి చేరుకున్న గంటాకు.. చీపురుపల్లిలో పోటీ చేయాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పగా.. చివరికి బతిమాలుకొని భీమిలి టికెట్ సంపాదించుకున్నారు. ఈ ఎన్నికల్లో తన వలస రాజకీయంతో మరోసారి భీమిలి ప్రజలను మోసం చేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా నుంచి బతుకుదెరువు కోసం విశాఖకు వలస వచ్చి ఓ దినపత్రికలో యాడ్ ఎగ్జిక్యూటివ్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. చిరుద్యోగిగా ఆదాయ ప్రస్థానం మొదలుపెట్టిన గంటా.. ఆ తర్వాత షిప్పింగ్ రంగంలో వ్యాపారవేత్తగా ఎదిగారు. 1999లో అనూహ్య రీతిలో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా, ఆ తర్వాత 2004లో చోడవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా, 2009లో ప్రజారాజ్యం తరఫున అనకాపల్లి ఎమ్మెల్యేగా, 2014లో భీమిలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా, 2019లో విశాఖ ఉత్తర ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిజానికి 1999లో ప్రజాప్రతినిధిగా రాజకీయ జీవితం మొదలుపెట్టినా.. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనమైన పరిణామాల నేపథ్యంలో 2011లో తొలిసారి మంత్రి బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి క్రమక్రమంగా ఆరోపణలు వెల్లువెత్తుతూ వచ్చాయి. ఇక 2014లో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరడంతో గంటాకు మళ్లీ మంత్రి పదవి రావడం దరిమిలా మొదలైన అవినీతి, అక్రమార్జన పర్వం, దోపిడీ పరాకాష్టకు చేరుకుంది. అంతులేని గంటా గ్యాంగ్ దందాలు ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా లెక్క చెయ్యకుండా.. అవినీతిని కొనసాగించడమే గంటా స్టైల్. గంటా విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో ఉంటున్న బహుళ అంతస్తుల భవంతితో పాటు.. ప్రత్యూష పేరుతో కంపెనీ స్థాపించి.. రూ.200 కోట్లకు పైగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టేశారు. దీంతో సదరు ఇండియన్ బ్యాంకు గంటా అండ్ కో అడ్డగోలుగా సంపాదించిన పలు స్థలాల్ని వేలం వేస్తుండగా.. మరికొన్ని స్థలాల్ని స్వా«దీనం చేసుకుంది. గంటా దోపిడీ పర్వాన్ని మొత్తం లెక్క కడితే రూ.వందల కోట్లపైనే ఉంటుందని టీడీపీ నేతలే అంచనా వేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకూ గంటా గ్యాంగ్ భీమిలిలో సాగించిన భూదందాలతో మళ్లీ అక్కడ మొఖం చూపించలేని పరిస్థితిని తెచ్చుకున్నారు. నమ్ముకొని ఓటేసిన భీమిలి ప్రజలకు ఏమాత్రం మంచి చెయ్యకుండా కనిపిస్తే కబ్జా పేరుతో దందా సాగించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు అండ్ కో విశాఖలో భూ దందాలకు తెగబడినప్పుడు కీలక సూత్రధారి గంటాయేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంటా శ్రీనివాసరావే భూదొంగ అంటూ అదే పారీ్టకి చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడే స్వయంగా సిట్‌కు ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది. అక్రమాల ఆరోపణలు చుట్టుముట్టడంతో తరుణంలో భీమిలి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని గంటా నిర్ణయించుకున్నారు. ఓటేసిన జనాన్ని లెక్క చేయని గంటా.. తాను చేసిన అక్రమాలు, అవినీతి పనులు బట్టబయలు కావడంతో 2019 ఎన్నికల్లో భీమిలి ప్రజలు ఛీకొడతారని ముందుగానే ఊహించిన గంటా.. వ్యూహాత్మకంగా బీజేపీకి కేటాయించిన విశాఖ ఉత్తర సీటును దక్కించుకున్నారు. ఎలాగోలా భీమిలి నుంచి బయటపడి టికెట్ తెచ్చుకున్న గంటా.. ఎన్నికల సమయంలో ఉత్తర నియోజకవర్గ ప్రజల్ని మోసపూరిత హామీలతో మభ్యపెట్టారు. పోలింగ్ సమయంలో చివరి నిమిషంలో బర్మాక్యాంపు తదితర కొండవాలు ప్రాంతాల్లో దొంగ ఓట్ల వ్యవహారంతో గట్టెక్కి విజయం సాధించారు. అంతే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నేటి వరకూ ఉత్తర ప్రజలకు ఒక్కసారైన మొహం చూపించకుండా ఎంవీపీలోనే తిష్టవేసుక్కూర్చున్నారు. తాము ఓటేసి గెలిపించిన పాపానికి తగిన శాస్తి జరిగిందంటూ ఆవేదన చెందుతున్న నియోజకవర్గ ప్రజలకు వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేకే రాజు అండగా నిలబడ్డారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఈసారి ఉత్తరంలో పోటీ చేస్తే.. ఓటమి తప్పదని భావించిన గంటా.. మరోసారి భీమిలికి వెళ్లిపోవాలని అక్కడి నేతలతో మంతనాలు ప్రారంభించారు. గెలుపొందిన చోట్ల దోపిడీకి పాల్పడే గంటా చేతిలో మరోసారి తాము మోసపోయే స్థితిలో లేమని భీమిలి ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. అయినా నిస్సిగ్గుగా భీమిలిని దోచుకునేందుకు గంటా మళ్లీ బయలుదేరడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
విశాఖ భీమిలి జనసేనలో టికెట్ల రచ్చ
-
భీమిలిలో గంటాపై IVRS సర్వే
-
భీమిలి నియోజకవర్గ ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్న కోరాడ రాజబాబు
-
YSRCP: జనక్షేత్రంలో జేజేలు
సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లలో దాదాపు రూ.4.21 లక్షల కోట్లను డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో రాష్ట్ర ప్రజలకు అందించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమంతో పలుకరించింది. సుపరిపాలనతో ఎన్నికల హామీలను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదిస్తూ ప్రజలు ప్రతి అడుగులోనూ వెన్నంటే నిలుస్తున్నారు. తాజాగా నిర్వహించిన భీమిలి సభ సీఎం జగన్‌కు జనామోదం ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపించింది. సముద్రంలా ఉప్పొంగిన జన వాహిని సంక్షేమ ప్రభుత్వానికి మద్దతు పలికింది. మరోవైపు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు లక్షల మందిని సమీకరించాలని ఆదేశించినా ఏ సభ చూసినా పట్టుమని 10 – 15 వేల మంది కూడా రాకపోవడంతో బేజారెత్తుతున్నారు. నియోజకవర్గాల ఇన్‌చార్జీలపై కన్నెర్ర చేస్తున్నారు. ప్రజాభీష్టం అలా ఉన్నప్పుడు తామేం చేయగలమని పార్టీ నేతలు నిస్పృహ వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు 15 సభలకు వచ్చిన జనం మొత్తం అంతా కలిపినా కూడా సీఎం జగన్ తాజాగా పాల్గొన్న ఒక్క భీమిలి సభతో పోలిస్తే సగం మంది కూడా లేకపోవడం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీలపై ప్రజల్లో అసంతృప్తి కలగడం సాధారణం! కానీ రాష్ట్రంలో మాత్రం ఎన్నిక ఏదైనా సరే ఏకపక్షంగానే ఫలితాలు వెలువడటం ప్రజాభీష్టానికి తార్కాణంగా నిలుస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజురోజుకూ ప్రజాదరణ వెల్లువెత్తుతోంది. పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక.. బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో ఇది స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 25కు 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఇటీవల టైమ్స్ నౌ లాంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. గత 56 నెలలుగా ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పే వైఎస్సార్సీపీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరగడానికి దారి తీస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకవైపు సీఎం జగన్‌కు జనం నీరాజనాలు పలుకుతుండటం, వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ప్రతి నియోజకవర్గంలోనూ జనం పోటెత్తుతుండటం.. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభలకు జనం మొహం చాటేస్తుండటాన్ని బట్టి చూస్తే 2019కి మించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అత్యంత భారీ విజయాన్ని సాధించడం ఖాయమని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. నిబద్ధతతో పెరుగుతున్న విశ్వసనీయత.. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు తన దృష్టికి తెచ్చిన వాటితోపాటు తాను స్వయంగా గుర్తించిన సమస్యలను క్రోడీకరించి వాటి పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను రూపొందించి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ (88 శాతం) స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. దేశ చరిత్రలో ఇంత ఘనవిజయం సాధించిన పార్టీ మరొకటి లేదు. టీడీపీ 39.17 శాతం ఓట్లతో 23 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకే పరిమితమైంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం హామీలను అమలు చేసిన సీఎం జగన్ నిబద్ధత చాటుకుంటూ ఇప్పటికే 99.5 శాతం హామీలను నెరవేర్చారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదు. ఇప్పటిదాకా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.53 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.1.68 లక్షల కోట్లు వెరసి మొత్తం రూ.4.21 లక్షల కోట్ల మేర పేదలకు ప్రయోజనాన్ని చేకూర్చారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో ప్రజలకు మరెవరూ మేలు చేసిన దాఖలాలు లేవు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం పదవులు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా సామాజిక న్యాయం అంటే ఇదీ అని దేశానికి సీఎం జగన్ చాటి చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. వలంటీర్ల ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను చేరువ చేశారు. విద్య, వ్యవసాయ, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో అగ్రభాగాన నిలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్‌పై ప్రజల్లో విశ్వసనీయత రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నడూ ఇచ్చిన మాటకు కట్టుబడని నైజం కలిగిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరి పట్ల నానాటికీ వ్యతిరేకత పెరుగుతోంది. విశ్వసనీయతకు పట్టం.. టీడీపీ చరిత్రలో 2019 ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు చెల్లాచెదరయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల.్లో పోటీ చేసేందుకు ఆపార్టీకి అభ్యర్థులు సైతం దొరకని దుస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో ఆందోళన చెందిన చంద్రబాబు నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్ర చేశారు. 2021 ఫిబ్రవరిలో 13,094 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా వైఎస్సార్సీపీ మద్దతుదారులు 10,299 పంచాయతీల్లో (80 శాతం) గెలుపొందారు. టీడీపీని 2,166, జనసేనను 157 పంచాయతీలకు ప్రజలు పరిమితం చేశారు. ► ఆ తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించిన చంద్రబాబు పంచాయతీ ఎన్నికల కంటే మరింత ఘోర పరాభవం తప్పదని పసిగట్టి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలకు భారీ ఎత్తున ఇం‘ధనం’ సమకూర్చి నిమ్మగడ్డ రమేష్‌తో కలిసి కుట్రలకు పాల్పడినా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించింది. ► మండల, జిల్లా పరిషత్ ఎన్నికల తరహాలోనే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ నిమ్మగడ్డ రమేష్‌తో కలిసి చంద్రబాబు పన్నిన కుట్రలను ప్రజలు చిత్తు చేశారు. వైఎస్సార్సీపీకి చారిత్రక విజయాన్ని అందించారు. ► స్థానిక సంస్థల ఎన్నికల్లో (పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్) టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సైకిల్ నామరూపాలు లేకుండా పోయింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ గెలుస్తూ వస్తున్న, ప్రస్తుతం బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోనూ చిత్తుగా ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నెగ్గిన 23 నియోజకవర్గాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం గమనార్హం. ► తిరుపతి లోక్‌సభ, బద్వేలు శాసనసభ స్థానాలకు 2021లో, ఆత్మకూరు శాసనసభ స్థానానికి 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కంటే అత్యధిక మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ► సీఎం జగన్ విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారనేందుకు అధికారం చేపట్టిన నాటి నుంచి వైఎస్సార్సీపీ సాధించిన వరుస ఘనవిజయాలే తార్కాణమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ► ఇటీవల జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ప్రజా తీర్పు పేరుతో నిర్వహించిన సర్వేలో 1.16 కోట్ల కుటుంబాలు (80 శాతం కుటుంబాల ప్రజలు) మా నమ్మకం నువ్వే జగన్ అంటూ నినదించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో 25కు 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని తాజాగా టైమ్స్ నౌ లాంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ వెల్లడైంది. -
మీటింగ్ లో జనాన్ని చూస్తే డ్రామా కంపెనీకి నిద్రపట్టదు
-
అభిమన్యుడు కాదు..అర్జునుడు..
-
యుద్ధానికి సిద్ధమన్న క్యాడర్..ప్రతిపక్షాల గుండెల్లో గుబులు
-
ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు..అర్జునుడు: సీఎం వైఎస్ జగన్
-
ఈ యుద్ధానికి నేను సిద్ధం..మీరు సిద్ధమా ?
-
కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం
-
లంచాలు లేని ప్రభుత్వం..
-
అంతటి జనసంద్రంలోను ప్రజలపైనే ద్యాస..
-
ఎన్నికల కురుక్షేత్రంలో అభిమన్యుడిని కాను.. అర్జునుడిని: సీఎం జగన్
అటు సముద్రం.. ఇటు జన సముద్రం కనిపిస్తోంది. ఇక్కడకు వచ్చిన ప్రతి అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, స్నేహితుడు, అవ్వ, తాతల్లో కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం, సేనాధిపతులు కనిపిస్తున్నారు. ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తుంటే.. అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది. గజదొంగల ముఠా ఉంది. వారి వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు మోసపూరిత వాగ్దానాలు, ఎత్తులు, పొత్తులు, చిత్తుల పద్మవ్యూహం కనిపిస్తోంది. ఆ పద్మవ్యూహంలో చిక్కుకొని బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఈ అర్జునుడికి మీ అందరి తోడు.. కృష్ణుడి రూపేణా అండదండలున్నాయి. అందుకే మీ బిడ్డ భయపడడు. దేనికీ తొణకడు. గత ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేశాం. తద్వారా చెప్పాడంటే చేస్తాడంతే.. అని నిరూపించాం. ఇది నా ఒక్కడి పార్టీ కాదు. ఇది అందరి పార్టీ. అందుకే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని పదవులు, నియామకాల్లో అగ్రభాగం కల్పించాం. రానున్న ఎన్నికలు పేదలకు ఎంతో కీలకం. మన పిల్లలకు ఇంగ్లిష్ విద్య అందాలన్నా.. వారికి ట్యాబ్‌లు రావాలన్నా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఐఎఫ్బీ ప్యానల్స్‌తో విద్యను అందించాలన్నా.. పోటీ ప్రపంచంతో మన విద్యార్థులు ధైర్యంగా ఢీకొట్టాలన్నా.. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే పింఛను చేతికి అందాలన్నా.. ఆర్బీకేల ద్వారా రైతుల అవసరాలు తీరాలన్నా.. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ విధానం కొనసాగాలన్నా.. మనందరి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి. ఇందుకోసం ప్రతీ ఒక్కరు గడప గడపకు వెళ్లి మన ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భీమిలిలో అటు సముద్రం.. ఇటు జన సముద్రం సాక్షిగా దిక్కులు పిక్కటిల్లేలా లక్షలాది జన నినాదాల నడుమ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. అబద్ధానికి, నిజానికి.. మోసానికి, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఇక్కడున్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడని సీఎం జగన్ స్పష్టం చేశారు. పొత్తులు, జిత్తుల పద్మవ్యూహాలతో చంద్రబాబు నేతృత్వంలోని కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ వంటి కృష్ణుడి ఆశీస్సులతో మీ బిడ్డ జగన్ సిద్ధంగా ఉన్నాడని ప్రకటించారు. 2024 జైత్ర యాత్రకు భీమిలి నుంచే శంఖం పూరిస్తున్నామని చెప్పారు. భీమిలి నియోజకవర్గం తగరపువలస జంక్షన్ వద్ద శనివారం ‘సిద్ధం’ పేరుతో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర వైఎస్సార్ కుటుంబ సమావేశానికి సీఎం హాజరయ్యారు. సభలో అభిమాన జనం మధ్య ఏర్పాటు చేసిన ర్యాంపుపై అడుగులు ముందుకు వేస్తూ అభివాదం చేశారు. శంఖం పూరించి.. నగారా మోగించి 2024 ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధమని లక్షలాది మంది శ్రేణుల ఈలలు, కేకలు, నినాదాల మధ్య ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సాధించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గత 56 నెలలో కాలంలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్ని చూసినా మనం చేసిన మంచి కనపడుతుందని తెలిపారు. సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాడు–నేడుతో మారిన పాఠశాలలతో రాష్ట్రమంతటా వైఎస్సార్సీపీ మార్క్, జగన్ మార్క్ కనిపిస్తోందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు హయాంలో ఆయన మార్క్ పని ఒక్కటీ లేదని దుయ్యబట్టారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పథకాలే ఎన్నికల బాణాలు, అస్త్రాలు ► 2024 ఎన్నిల్లో మన పార్టీ జైత్ర యాత్రకు.. మరో పాతికేళ్ల పాటు సంక్షేమ, అభివృద్ధి పాలన కొనసాగింపునకు.. ఈ భీమిలిలో సన్నాహక సమావేశం జరుగుతోంది. మన పార్టీని భుజాన మోసిన, మోస్తున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆత్మీయులలో ఆత్మవిశ్వాసం నింపేందుకే ఇక్కడ సమావేశమయ్యాం. మేనిఫెస్టో ద్వారా మనం ఇచ్చిన ప్రతి మాటా అధికారంలోకి వచ్చాక త్రికరణ శుద్ధితో ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చిన ఈ పార్టీలో మీతో నా ఆలోచనలను పంచుకోడానికే ఈ సమావేశం. ► పేద ప్రజల మీద ప్రేమతో, బాధ్యతతో 56 నెలల కాలంలో అమలు చేస్తున్న పథకాలే మనకు రానున్న ఎన్నికలకు బాణాలు, అస్త్రాలు. ఈ యుద్ధంలో 175కు 175 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. గెలుపే మన లక్ష్యం. దేవుడి దయతో ప్రతి ఇంటికి, ప్రాంతానికి, ఊరికి చేసిన మేలుతో చంద్రబాబుతో సహా వారంతా ఓడాల్సిందే. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం వారికి లేదు ► గత ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు చెప్పిన మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్తబుట్టలో వేశాయి. మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది. అందుకే ప్రజలకు మనం దగ్గరయ్యాం. వైఎస్సార్ కాంగ్రెస్‌ను ప్రజలు తమ పార్టీగా భావిస్తున్నారు. చంద్రబాబు 75 ఏళ్ల వయస్సు మళ్లిన నాయకుడు. ► ఒంటిరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడు తున్నాడంటే దాని అర్థం ఏమిటో ఆలోచించండి. చంద్రబాబు తాను మంచి పని చేశానని, ఒక స్కీమ్ పెట్టామని చెప్పలేక.. కొత్త వాగ్దానాలతో గారడి చేయాలని చూస్తున్నాడంటే ప్రజల్లో వారు లేరని అర్థం. చివరికి 2019లో వచ్చినన్ని 23 స్థానాలు కూడా వారికి రావని అర్థం. 175 స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు అభ్యర్థులు కూడా లేరని అర్థం. మన చరిత్ర ఇంటింటి విజయగాథ ► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఓ విప్లవ గాథ. మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయ గాథ. మన భవిష్యత్తు.. సామాజిక వర్గాల ఇంద్ర ధనస్సు. మనది వయస్సుతో పాటు మంచి భవిష్యత్తు ఉన్న పార్టీ. మన పాలనలో అన్ని రంగాల్లో చిత్తశుద్ధితో సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తుంది. ఈ రెండింటిలో సరికొత్త రికార్డును సృష్టించిన పార్టీ అని గర్వంగా చెబుతున్నా. నేను మోసాన్ని నమ్ముకోలేదు. ఇంటింటికి చేసిన సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకొని ప్రజల దగ్గరకు మళ్లీ వెళుతున్నాను. ► పేదరికం, అసమానత సంకెళ్లను బద్దలు కొట్టి.. ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ.. 21 శతాబ్ధంలోకి నడిపిస్తున్న మనసున్న, బాధ్యత గల ప్రభుత్వం మనది. ఇదే విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. 70 రోజుల్లో ఎన్నికల యుద్ధానికి ప్రతి ఒక్కరి భుజస్కందాలపై బాధ్యతలు పెడుతున్నాం. అబద్ధానికి నిజానికి.. మోసానికి, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న యుద్ధమిది. 2014లో చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో 650 వాగ్దానాలు ఇచ్చారు. అందులో 10 శాతం కూడా అమలు చేయలేదు. మన ప్రభుత్వం 99 శాతం వాగ్దానాలు అమలు చేయడం వల్ల ప్రతి ఇంట్లో సంతోషం చూసి సంబర పడుతున్నాం. నా గుండెల నిండా మీరే.. ► పేద సామాజిక వర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టే నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంటూ నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరీ సగం పదవులన్నీ ఈ వర్గాలకే ఇచ్చాం. కేబినెట్లో ఏకంగా 68 శాతం మంత్రి పదవులు, నలుగురు డిప్యూటీ సీఎంలు, చట్టసభ స్పీకర్ ఒక బీసీ, కౌన్సిల్ చైర్మన్‌గా ఒక ఎస్సీ, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఒక మైనార్టీ కనిపిస్తున్నారు. స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసి వారిని గుండెల్లో పెట్టుకున్నాం. ఆలయ కమిటీ చైర్మన్లుగా, ఏఎంసీ చైర్మన్లుగా కనిపిస్తున్నారు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు. ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టే ఇది మనందరి ప్రభుత్వం. ► ఈ 56 నెలల్లో 2.13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకొచ్చాం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 4 లక్షల ఉద్యోగాలు ఉంటే.. మీ బిడ్డ ప్రభుత్వం మరో 2.13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది. ఇందులో ఏకంగా 80 శాతం నా.. నా.. నా.. అని పిలుచుకొనే నా తమ్ముళ్లు, చెల్లెమ్మలు ఉన్నారని గర్వంగా తెలియజేస్తున్నా. ► అక్కచెల్లెమ్మలపై ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టే లంచాలు, వివక్ష లేకుండా మీ బిడ్డ ఒక బటన్ నొక్కి రూ.2.53 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి వేశాడు. ఇంతటి ఆప్యాయత చూపిస్తున్నాం కాబట్టే అట్టడుగున ఉన్న వారికి అధికారుల నుంచి లీడర్ల దాకా చిక్కటి చిరునవ్వుతో సెల్యూట్ కొడుతున్నారు. పేద, సామాజిక వర్గాల మీద ప్రేమ చూపించడంలో చంద్రబాబు మార్క్ ఎక్కడ? ► పేద వర్గాలు కనిపిస్తే ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా.. అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడతాడు. సాక్షాత్తు సీఎం నోటి నుంచి అటువంటి మాటలు వస్తే గ్రామాల్లో ఎవరైనా ఆ ఎస్సీలను పట్టించుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తా ఖబడ్దార్.. అంటే గ్రామాల్లో వారిని పట్టించుకుంటారా? చంద్రబాబుకు పేద, సామాజిక వర్గాలపై, వారి అభ్యున్నతిపై ప్రేమ ఎక్కడుంది? ఎక్కడ చూసినా, ఏ పేదవాడి ఇంటికి వెళ్లినా కనిపించేది వైఎస్సార్సీపీ, జగన్ మార్క్ మాత్రమే. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు.. ► రాష్ట్రంలో కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామానికైనా వెళ్లండి. మీ ఇష్టం. ఎక్కడకు వెళ్లినా ఆ గ్రామానికి చంద్రబాబు ఏం చేశారంటే చెప్పడానికి ఏమీ కనిపించదు. జగన్ ఏం చేశాడంటే.. ఈ 56 నెలల్లో ప్రతి గ్రామంలో ఎన్నెన్నో మార్పులు కనిపిస్తున్నాయి. గ్రామ సచివాలయాలు కనిపిస్తాయి. 540 పౌర సేవలు. అందులో దాదాపు 10 మంది మన పిల్లలు శాశ్వత ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. ఎక్కడా అవినీతి, లంచాలు, వివక్ష ఉండదు. ► ఇంటింటికీ ఒకటో తేదీ ఉదయాన్నే పెన్షన్ అయినా, పౌర సేవలైనా, ఏ పథకమైనా మన గడపకే తెచ్చి చిరునవ్వుతో అందించే మనలో భాగమైన ఓ గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. రైతన్నను చేయి పట్టుకొని నడిపించే ఆర్బీకే వచ్చింది. అదే గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం.. ఇటువంటివన్నీ మీ బిడ్డ పాలనలోనే వచ్చాయి. ► నాడు–నేడుతో విద్యా రంగానికి మంచి రోజులు వచ్చాయి. ఇంగ్లీష్ మీడియంతో మొదలు ట్యాబ్‌లు, ఐఎఫ్బీ, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్‌లు ఇలా అన్నీ మన ప్రభుత్వంలోనే అమలయ్యాయి. అదే గ్రామంలో సచివాలయంలో మహిళా పోలీస్. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలోని ఫోన్లో దిశ యాప్.. వారికి ఎటువంటి అపాయం సంభవించినా కేవలం బటన్ నొక్కిన వెంటనే లేదా మొబైల్ అయిదుసార్లు ఊపితే 10 నిమిషాల్లో పోలీస్ సోదరుడు వచ్చి చెల్లమ్మను ఏమైందని అడిగే వ్యవస్థ వచ్చింది ఇప్పుడే. బ్రాడ్ బ్యాండ్, డిజిటల్ లైబ్రరీలు కట్టిందీ ఇప్పుడే. ► ఇలాంటి మంచి పనులు చేయాలనే ఆలోచన 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు ఏనాడూ రాలేదు. ఎందుకంటే వీరు పెత్తందారులు కాబట్టి. పల్లె ప్రజలంటే బాబు దృష్టిలో పని మనుషులు. పెత్తందారుల పొలాల్లో, ఇళ్లలో పని చేసే పని మనుషులు. పొట్ట పోసుకోవడం కోసం ఉండే జనావాసం ఆ పల్లె అని చంద్రబాబు నమ్మకం. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ గ్రామం, పల్లె బాగుపడదు. ప్రజలు, పేదవాడు బాగుపడాలి, గొప్పగా చదవాలి, భవిష్యత్తు మారాలన్న తాపత్రయం పెత్తందార్లకు లేదు. ఎక్కడ చూసినా వైఎస్సార్సీపీ, జగన్ మార్క్ ► రైతు సంక్షేమాన్ని చూస్తే మనమక్కెడ.. చంద్రబాబు ఎక్కడ? అని ఆలోచన చేయాలి. రుణమాఫీ చేస్తానని నిలువునా ముంచింది చంద్రబాబు. రైతులు 87,612 కోట్లు బ్యాంకులకు కట్టొద్దని పిలుపిచ్చాడు. మొట్టమొదటి సంతకంతో రుణమాఫీ అని వాగ్దానం చేశాడు. మేనిఫెస్టోలో పెట్టి రైతులను మోసం చేశాడు. ► ఈ రోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఆర్బీకే అంటే జగన్. సకాలంలో విత్తనమైనా, ఎరువులైనా, ఇన్పుట్ సబ్సిడీ అయినా సకాలంలో అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగన్. పగటి పూట ఉచిత్ విద్యుత్, ఉచిత బీమా, సున్నా వడ్డీ అందుతున్నాయన్నా, ఆక్వా రైతులకు కరెంట్ సబ్సిడీ అందుతోందంటే గుర్తుకొచ్చేది జగన్. ► ఏ పొలంలోకి వెళ్లినా చంద్రబాబు చెప్పుకోడానికి ఏముంది? చంద్రబాబు మార్క్ ఎక్కడుంది? ఎక్కడ చూసినా వైఎస్సార్సీపీ, జగన్ మార్క్ కనిపిస్తోంది. ప్రజల వైద్యం, ఆరోగ్యం విషయానికి వస్తే.. 108, 104 చూసినా, 3,257 ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ విస్తరించినా.. ఆరోగ్య ఆసరా చూసినా, గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్, ఇంటింటినీ జల్లెడ పడుతూ నిర్వహిస్తున్న ఆరోగ్య సురక్ష, 17 కొత్త మెడికల్ కాలేజీలు, వైద్య రంగంలో 53 వేల కొత్త నియామకాలు.. నాడు–నేడుతో బాగుపడుతున్న ఆస్పత్రులు.. ఇలా ఏది తీసుకున్నా ఒక వైఎస్సార్సీపీ, జగన్ మార్క్ కనిపిస్తోంది. ► ఏ ప్రభుత్వ బడిని తీసుకున్నా.. మొత్తంగా విద్యా రంగాన్ని తీసుకున్నా.. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, తెలుగు, ఇంగ్లిష్ భాషలు ఉన్న పాఠ్యపుస్తకాలు, బైజూస్ కంటెంట్, మన ప్రభుత్వ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, క్లాస్‌రూమ్‌లలో ఐఎఫ్‌పీలు, గోరుముద్ద, బడి తెరిచే సరికే విద్యా కానుక, పెద్ద చదువులు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలు అవ్వకూడదని ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తూ జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, విదేశాల్లోని టాప్ యూనివర్శిటీల్లో ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా డిగ్రీల అనుసంధానం ఇలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. జాబ్ ఓరియంటెడ్ కరిక్యులం ద్వారా ఇంటర్న్‌షిప్‌తో డిగ్రీలో చేర్చడం, ఇలా విద్యా రంగంలో ఏది తీసుకున్నా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పెత్తందారులను ఓడిద్దాం ► వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం. వారి వంచనకు, మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు వారి దోచుకో, పంచుకో, తినుకో అనే విధానానికి మన డీబీటీ అంటే బటన్ నొక్కడం.. నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బు వెళ్లిపోడానికి మధ్య జరుగుతున్న యుద్ధం. వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారి కుట్రలకు, మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య యుద్ధం. వచ్చే రెండు నెలలు మనందరికీ నిత్యం యుద్ధమే. ఈ 70 రోజులు ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీకి ఒక సైన్యంలా పని చేయాలి. ► ప్రతిపక్షాలు పది వైపుల నుంచి చేసే దాడులను వారి ఎల్లో మీడియాను, వారి సోషల్ మీడియాను, అందులో చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి. ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్పోన్లు ఉన్నాయి. అవే మీకు అస్త్రాలు. సెల్‌ఫోన్ ఉన్న ప్రతి పేద వాడు కూడా సోషల్ మీడియాను శాసించవచ్చు. బూత్ కమిటీల సభ్యులు, గృహ సారథులు, వలంటీర్లు, సామాన్య కార్యకర్త మొదలు, రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కీలకమైన పాత్ర పోషించాలి. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు. 25కి 25 ఎంపీలు మన లక్ష్యం. ► ప్రతి ఇంటికి మంచి చేశాం. ప్రతి గ్రామంలో మంచి జరిగింది. అందులో 60 శాతం కుటుంబాలు మీ వెంట, మన వెంట ఉంటే అన్ని సీట్లు మనవే. మంచి చేసిన, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, ప్రతి పేదవాడి భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన, చేస్తున్న ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం. ఈ యుద్ధానికి సిద్ధం, సై అంటున్న మీ బిడ్డకు మీరందరూ తోడుగా ఉండడానికి సిద్ధమా అని అడుగుతున్నా. (సిద్ధం.. అని జనం నుంచి కేకలు) జనంలో లేని, పేదవారి గుండెల్లో లేని వారు, దిగజారుడు పార్టీలన్నింటికీ మీ జగనన్నే టార్గెట్. పేదవాడి భవిష్యత్తు, వైఎస్సార్సీపీయే లక్ష్యంగా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. దుష్ట చతుష్టయాన్ని, గజదొంగల ముఠాను, ఓడించేందుకు మీరు సిద్ధమా.. (సిద్ధమేనని నినాదాలు) వారందరిపై ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు, దేవుడి దయ ఉన్నంత వరకు మీ బిడ్డ ఏ ఒక్కరికీ భయపడడు. సమరనాదం చేస్తూ ఎన్నికల శంఖారావం పూరిస్తూ మేం యుద్ధానికి సిద్ధమని వైఎస్సార్సీపీ ఇక్కడి నుంచి పిలుపునిస్తోంది. -
దుష్టచతుష్టయం.. గజదొంగల ముఠాతో ఇక సమరమే: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని.. అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. భీమిలి నియోజకవర్గం సంగివలసలో ఎన్నికల శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావని.. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరన్నారు. చేసిన మంచిని నమ్ముకునే .. మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడు. మరో 75 రోజుల్లోనే ఎన్నికలు. అబద్దానికి, నిజానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. గతంలో చంద్రబాబు 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదు. మనం మేనిఫెస్టో లోని ప్రతి హామీని నెరవేర్చాం. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయాలనే ఆలోచన లేదని.. ఎందుకంటే చంద్రబాబు అండ్ కో పెత్తందార్లు కాబట్టి.. చంద్రబాబు సీఎంగా ఉంటే ఏ గ్రామం బాగుపడదని సీఎం ధ్వజమెత్తారు. ‘‘ప్రజలే .. నా స్టార్ క్యాంపెయినర్లు. పేదల భవిష్యత్ మారాలంటే.. జగనే గెలవాలని చెప్పండి. ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే.. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి. రైతు భరోసా, ఇన్ ఫుట్ సబ్సిడీ అందాలంటే .. మీ జగన్ సీఎం కావాలని చెప్పాలన్నారు ‘‘మీరు వేసే ఓటు.. పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ఓటు అని చెప్పండి. ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇస్తాయి. మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం.. మోసాలు చేయడం తెలియదు. మీ బిడ్డ చెప్పాడంటే.. చేస్తాడంతే. ఈ యుద్దానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా ?. ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా ?. దుష్టచతుష్టయాన్ని.. గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా.? వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే. ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి. దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ , 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే’’ అని సీఎం స్పష్టం చేశారు. -
ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు..
-
సంగివలసలో సీఎం జగన్ సింహనాదం
సాక్షి, విశాఖపట్నం: ఇక్కడ ఉన్నది అర్జునుడు.. ఇటు పక్క పాండవ సైన్యం ఉంది. అటు పక్క కౌరవ సైన్యం ఉంది. అక్కడ పద్మ వ్యూహం పొంచి ఉంది. ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు. ఈ అర్జునుడికి తోడు కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. భీమిలి నియోజకవర్గం సంగివలస బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ యుద్ధంలో 175కి 175 సీట్లు గెలుపే మన లక్ష్యమన్నారు. ‘‘ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. మరో 25 ఏళ్ల పాటు మన జైత్ర యాత్రకు శ్రీకారం చుడుతున్నాం. మన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చాం చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. అందుకే దత్త పుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు. గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు. చేసిన మంచిని నమ్ముకునే.. మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడు’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘మరో 75 రోజుల్లోనే ఎన్నికలు. అబద్దానికి, నిజానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. గతంలో చంద్రబాబు 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదు. మనం మేనిఫెస్టో లోని ప్రతి హామీని నెరవేర్చాం. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ప్రతి గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు. 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం. లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశాం. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాం. రైతులకు తోడుగా ఆర్బీకే లను నిర్మించాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. ప్రతి గ్రామానికి డిజిటల్ లైబ్రరీలు, బ్రాడ్ బాండ్ లు తీసుకొచ్చాం’’ అని సీఎం తెలిపారు. ‘‘14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయాలనే ఆలోచన లేదు. ఎందుకంటే చంద్రబాబు అండ్ కో పెత్తందార్లు కాబట్టి చంద్రబాబు సీఎంగా ఉంటే ఏ గ్రామం బాగుపడదు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నిలువునా ముంచాడు. మీ జగన్.. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు 3,527 ప్రొసీజర్ల కు ఆరోగ్యశ్రీ ని విస్తరించాం. ఒక్క వైద్యరంగంలోనే 53 వేల కొత్త నియామకాలు చేపట్టాం. అందుకే ఎక్కడ చూసినా వైఎస్ జగన్ మార్కే కనిపిస్తోంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువును అందుబాటులోకి తెచ్చాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం . నామినేటెడ్ పదవుల్లో సగం పదవులు బలహీనవర్గాలకే ఇచ్చాం. స్థానిక సంస్థల పదవులు ఆన్నింటిలోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. లంచాలు, వివక్ష లేకుండా రూ. 2 లక్షల 53 వేల కోట్లు నేరుగా మీ ఖాతాలో వేశాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘పేదల సొంతింటి కలను నెరవేర్చాం. అక్కచెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మాది. 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇచ్చాం. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారు. అన్నింటిలోనూ చంద్రబాబు మోసమే కనిపిస్తుంది. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు అన్నారు బడుగుబలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమ లేదు. మీ జగన్ రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. గత పదేళ్ల మీ బ్యాంకు అకౌంట్ల ను చెక్ చేసుకోండి. చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి అయినా పడిందా ?. మన పాలనలో మీ ఖాతాల్లో రూ. 2 లక్షల 53 వేల కోట్లు వేశాం. ఎన్ని కష్టాలు ఎదురైనా .. అన్ని వర్గాలకు మంచి చేశాం. మీ జగన్.. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు. 56 నెలల కాలంలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం. కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి మనం చేసిన మంచిని చెప్పండి. మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమల్ని మాత్రమే. ప్రజలే .. నా స్టార్ క్యాంపెయినర్లు. పేదల భవిష్యత్ మారాలంటే .. జగనే గెలవాలని చెప్పండి. ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే .. జగన్ గెలవాలని చెప్పండి ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే .. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి. రైతు భరోసా, ఇన్ ఫుట్ సబ్సిడీ అందాలంటే .. మీ జగన్ సీఎం కావాలని చెప్పండి’’ అని సీఎం చెప్పారు. మీరు వేసే ఓటు.. పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ఓటు అని చెప్పండి. ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇస్తాయి. మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం.. మోసాలు చేయడం తెలియదు. మీ బిడ్డ చెప్పాడంటే.. చేస్తాడంతే. ఈ యుద్దానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?. ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా ?. దుష్టచతుష్టయాన్ని.. గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా?. వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే. ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి. దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ, 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే’’ అని సీఎం పేర్కొన్నారు. -
YSRCP సిద్ధం సభ
-
ఎన్నికల శంఖారావం.. సీఎం జగన్ భారీ బహిరంగ సభ @ సంగివలస
-
భీమిలి సభలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చే సందేశం ఇదే !
-
సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసిన ఘనత జగన్ దే: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
-
జగన్ కు మద్దతుగా మత్స్యకారులు బోటు ర్యాలి
-
Bheemili : యుద్ధానికి YSRCP సిద్ధం
సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు 5.45pm, జనవరి 27, 2024 భీమిలిలో అటు సముద్రం ... ఇటు జనసముద్రం కనిపిస్తోంది కురుక్షేత్ర యుద్దానికి సిద్ధమైన పాండవుల సైన్యం కనిపిస్తోంది అటు కౌరవ సైన్యం ఉంది .. గజ దొంగల ముఠా ఉంది ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు .. అర్జునుడు 175కు 175 ఈ యుద్ధంలో 175 కు 175 సీట్లు గెలుపే మన లక్ష్యం ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే మరో 25 ఏళ్ల పాటు మన జైత్రయాత్ర కు శ్రీకారం చుడుతున్నాం మన మేనిఫెస్టో లో 99 శాతం హామీలను నెరవేర్చాం చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీ కి రావు 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు మంచి చేసాం.. ఓట్లు అడుగుతున్నాం చేసిన మంచిని నమ్ముకునే .. మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడు మరో 75 రోజుల్లోనే ఎన్నికలు అబద్దానికి, నిజానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది గతంలో చంద్రబాబు 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదు మనం మేనిఫెస్టో లోని ప్రతి హామీని నెరవేర్చాం ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు చంద్రబాబు చేసిందేమీ లేదు ప్రతి గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశాం ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాం రైతులకు తోడుగా ఆర్బీకే లను నిర్మించాం ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం ప్రతి గ్రామానికి డిజిటల్ లైబ్రరీలు, బ్రాడ్ బాండ్ లు తీసుకొచ్చాం ఇదీ వెన్నుపోటు బాబు పాలనకు, రాజన్న రాజ్యానికి తేడా 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయాలనే ఆలోచన లేదు ఎందుకంటే చంద్రబాబు అండ్ కో పెత్తందార్లు కాబట్టి చంద్రబాబు సీఎంగా ఉంటే ఏ గ్రామం బాగుపడదు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నిలువునా ముంచాడు మీ జగన్ ... రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు 3,527 ప్రొసీజర్ల కు ఆరోగ్యశ్రీ ని విస్తరించాం ఒక్క వైద్యరంగంలోనే 53 వేల కొత్త నియామకాలు చేపట్టాం అందుకే ఎక్కడ చూసినా వైఎస్ జగన్ మార్కే కనిపిస్తోంది విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువును అందుబాటులోకి తెచ్చాం పదవుల్లో, అధికారంలో పెద్దపీట బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం నామినేటెడ్ పదవుల్లో సగం పదవులు బలహీనవర్గాలకే ఇచ్చాం స్థానిక సంస్థల పదవులు ఆన్నింటిలోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం లంచాలు, వివక్ష లేకుండా రూ. 2 లక్షల 53 వేల కోట్లు నేరుగా మీ ఖాతాలో వేశాం పేదల సొంతింటి కలను నెరవేర్చాం అక్కచెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మాది 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇచ్చాం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారు అన్నింటిలోనూ చంద్రబాబు మోసమే కనిపిస్తుంది ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు అన్నారు బడుగుబలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమ లేదు మీ జగన్ రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే మీ ఖాతాను అడగండి చెబుతుంది గత పదేళ్ల మీ బ్యాంకు అకౌంట్ల ను చెక్ చేసుకోండి చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి అయినా పడిందా ? మన పాలనలో మీ ఖాతాల్లో రూ. 2 లక్షల 53 వేల కోట్లు వేశాం ఎన్ని కష్టాలు ఎదురైనా .. అన్ని వర్గాలకు మంచి చేశాం మీ జగన్ .. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు 56 నెలల కాలంలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి మనం చేసిన మంచిని చెప్పండి మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమల్ని మాత్రమే ప్రజలే .. నా స్టార్ క్యాంపెయినర్లు పేదల భవిష్యత్ మారాలంటే .. జగనే గెలవాలని చెప్పండి ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే .. జగన్ గెలవాలని చెప్పండి ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే ... జగన్ గెలవాలని చెప్పండి పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే .. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి రైతు భరోసా, ఇన్ ఫుట్ సబ్సిడీ అందాలంటే .. మీ జగన్ సీఎం కావాలని చెప్పండి మీరు వేసే ఓటు .. పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ఓటు అని చెప్పండి ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇస్తాయి మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం .. మోసాలు చేయడం తెలియదు మీ బిడ్డ చెప్పాడంటే .. చేస్తాడంతే ఈ యుద్దానికి నేను సిద్ధం .. మీరు సిద్ధమా ? ఒంటరి పోరాటానికి నేను సిద్ధం .. మీరు సిద్ధమా ? దుష్టచతుష్టయాన్ని ..గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా ? వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి దుష్టచతుష్టయం సోషల్ మీడియా లో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ , 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే Updates.. సంగివలసలో సీఎం జగన్ ఎన్నికల శంఖారావం మీరు వేసే ఓటు .. పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ఓటు అని చెప్పండి ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇస్తాయి మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం.. మోసాలు చేయడం తెలియదు మీ బిడ్డ చెప్పాడంటే... చేస్తాడంతే ఈ యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?: ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? దుష్ట చతుష్టయాన్ని, గజ దొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా? వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి మన టార్గెట్ 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే ప్రతి పక్షాలకు ఓటేయడం అంటే దాని అర్ధం.. మాకు ఈ స్కీములు వద్దని, ఈ స్కీములకు రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని గ్రహించండి అలా చేస్తే మళ్లీ లంచాలు, వివక్ష కల్గిన జన్మభూమి కమిటీలకు ఆమోదం తెలిపినట్లే పొత్తు లేకపోతే పోటీ చేయడానికే అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు వారి మాటలు వింటుంటే కొన్ని సామెతలు గుర్తుకువస్తున్నాయి ఓటి కుండకు మోత ఎక్కువ.. చేతగాని వాడికి మాటలు ఎక్కువ అనే సామెతలు గుర్తుకు వస్తున్నాయి. కార్యకర్తలు.. మన ప్రభుత్వం చేసిన మంచిని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి పేదల భవిష్యత్ మారాలంటే.. జగనే గెలవాలని చెప్పండి ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే జగన్ గెలవాలని చెప్పండి ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే.. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమ్మల్ని మాత్రమే ప్రజలే.. నా స్టార్ క్యాంపెయినర్లు 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు ప్రభుత్వం ఏం సంక్షేమం అందించిందో మీ బ్యాంక్ అకౌంట్లు చూస్తే అర్ధమవుతుంది ఏ ఒక్క రూపాయి అయినా సంక్షేమం ద్వారా అందించారా అని వారినే అడగండి మళ్లీ అడగండి.. 2019 నుంచి 2024 వరకూ మీ జగన్ ప్రభుత్వం అందించిన సొమ్మును చూడమనండి రూ. 2 లక్షల 53 వేల కోట్లు వేశాం కోవిడ్ కష్టకాలంలో సాకులు వెతుక్కోలేదు కోవిడ్ కష్టాలు ఎన్నొచ్చినా, ఆదాయాలు తగ్గినా సాకులు చెప్పలేదు.. తోడుగా అండగా నిలబడింది మీ బిడ్డ ప్రభుత్వమని అందరికీ చెప్పండి వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్జీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, మేయర్లు, కార్పోరేటర్లు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ఇలా ప్రతి ఒక్కరికీ ఒక్కటే చెబుతున్నా ఇది మీ పార్టీ.. ఇది ఒక జగన్ పార్టీ కాదు.. మీ అందరి పార్టీ వైఎస్సార్సీపీలో ఉన్నవారు.. వైఎస్సార్సీపీ కోసం కష్టపడ్డవారందరికీ కూడా ఏ రాజకీయ పార్టీ ఇవ్వని గౌరవం ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్సీపీనే 58 నెల కాలంలో ప్రతీ ఇంటికి మంచి చేయగలిగాం పేద సామాజిక వర్గాల మీద ప్రేమ చూపడంలో చంద్రబాబు మార్క్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నా పేద వర్గాలు కనిపిస్తే.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలా అంటాడు ఇటువంటి మాటలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడితే గ్రామాల్లో ఉన్న ఎస్సీలు ఎవరైనా పట్టించుకుంటారా? బీసీలు తోకలు కత్తిరిస్తా ఖబడ్దార్ అంటాడు చంద్రబాబు.. అలా చేస్తే గ్రామాల్లో ఉన్న బీసీలు పట్టించుకుంటారా? అసలు ఎక్కడ ఉంది.. చంద్రబాబుకు సామాజిక వర్గాలపై ప్రేమ అసలు ఎక్కడ ఉంది.. పేద సామాజిక వర్గాల అభ్యున్నతిలో చంద్రబాబు మార్క్ డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానని అక్కా చెల్లెమ్మలకు చంద్రబాబు మోసం చేశాడు అక్కా చెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మాది 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశాం ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాం రైతులకు తోడుగా ఆర్బీకేలను నిర్మించాం ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం ప్రతి గ్రామానికి డిజిటల్ లైబ్రరీలు, బ్రాడ్‌బ్యాండ్‌లు తీసుకొచ్చాం 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయాలనే ఆలోచన లేదు ఎందుకంటే చంద్రబాబు అండ్ కో పెత్తందార్లు కాబట్టి సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నిలువునా ముంచాడు మీ జగన్.. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం పేద పిల్లలకు ఇంగ్లిష్ చదువును అందుబాటులోకి తెచ్చాం ఏ రంగంలో చూసినా వైఎస్జగన్ మార్కే కనిపిస్తోంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం నామినేటెడ్ పదవుల్లో సగం పదవులు బలహీన వర్గాలకే ఇచ్చాం స్థానిక సంస్థల పదవులు అన్నింటిలోను సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం 3,257 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని విస్తరించాం ఒక్క వైద్య రంగంలోనే 53 వేల కొత్త నియామకాలు నాడు-నేడు ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మార్చాం అందుకే ఎక్కడ చూసినా వైఎస్ జగన్ మార్కే కనిపిస్తోంది భీమిలిలో అటు సముద్రం.. ఇటు జన సముద్రం కనిపిస్తోంది ఇక్కడకు వచ్చిన ప్రతీ అక్క, చెల్లెమ్మల్లోనూ, ప్రతి అన్న, తమ్ముడిలోనూ, ప్రతి అవ్వలోనూ నాకు సేనాధిపతులే కనిపిస్తున్నారు ఇటు పక్క పాండవ సైన్యం ఉంది అటు పక్క కౌరవ సైన్యం ఉంది అక్కడ పద్మ వ్యూహం పొంచి ఉంది ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ అభిమన్యుడు కాదు..ఇక్కడ ఉన్నది అర్జునుడు ఈ అర్జునుడికి తోడు కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారు ఈ యుద్ధంలో చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందే మరో 25 ఏళ్లపాటు జైత్రయాత్రకు శ్రీకారం చుడుతున్నాం చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు మన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చాం పేదరికాన్ని, అసమానతలను పోగొట్టిన బాధ్యతల ప్రభుత్వం మనది అని గర్వంగా చెబుతున్నా 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది ఆలోచన చేయండి.. ప్రతీ ఒక్కరి భుజస్కందాలపై బాధ్యత పెడుతున్నాను ఇంటింటికీ వెళ్లి మన ప్రభుత్వం చేసిన మంచిని చెప్పండి.. ప్రతీ పేద కుటుంబానికి వివరించండి ఈ యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య జరుగుతోంది ఈ యుద్ధం మోసానికి, నిజాయితీకి మధ్య జరుగుతుంది మీరే చూడండి.. చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో కనీసం 10 శాతం కూడా నెరవేర్చలేదు మన ప్రభుత్వం 99 శాతం హామీలను నెరవేర్చి ప్రజల పట్ల విశ్వసనీయతతో ఉన్నాం చంద్రబాబు ఏమి చేశాడో చెప్పడానికి ఏమీ కనిపించదు.. చేసింది ఏమీ లేదు కాబట్టి ఆ పెద్ద మనిషి ఏమీ చెప్పలేడు మన ప్రభుత్వం అలా కాదు.. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ చంద్రబాబు చేసేందేమీ లేదు ప్రతీ గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం 3:40PM, Jan 27, 2024 సంగివలస చేరుకున్న సీఎం జగన్ సంగివలస సభ ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ భీమిలి నియోజకవర్గం సంగివలసలో బహిరంగ సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు 3:30PM, Jan 27, 2024 పేదల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేర్చారు: మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్ పాలనలో కార్యకర్తలకు గౌరవం పెరిగింది చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు గమనించాలి కుల, మత పార్టీలకతీంగా అందరికీ సంక్షేమం అందించాం 3:23PM, Jan 27, 2024 విశాఖ చేరుకున్న సీఎం జగన్ భీమిలి నియోజకవర్గం సంగివలసలో బహిరంగ సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం జగన్ 175కు 175 అసెంబ్లీ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యం విశాఖ బయల్దేరిన సీఎం జగన్ ►కాసేపట్లో భీమిలి నియోజకవర్గం సంగివలసలో బహిరంగ సభ ►ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం జగన్ ►టీడీపీ, జనసేన కుట్రలను చిత్తు చేసేలా శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం ►34 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ►175కు 175 అసెంబ్లీ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యం ►రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. ►వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ సాంగ్.. ఓ వైసీపీ కార్యకర్తలారా Full Song! 🎵🎶#Siddham pic.twitter.com/jaP4ASEMFH — YSR Congress Party (@YSRCParty) January 27, 2024 ►ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన సహా వివిధ పార్టీల జెండాలతో జతకట్టి.. కుటుంబాలను చీల్చుతూ పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలను చిత్తుచేసి, విజయభేరి మోగించడానికి.. పార్టీ శ్రేణులను సిద్ధంచేయడానికి ఆయన నడుం బిగించారు. జగనన్న పాలనలో పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకుంటున్న పెత్తందార్లపై యుద్ధానికి సిద్ధం…✊🏻 పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకునేందుకు జెండాలు జతకట్టే టీడీపీ, జనసేన దోపిడీదారులపై యద్ధానికి సిద్ధం….✊🏻#Siddham#JaganannaAgenda pic.twitter.com/ypxwmcgfY7 — YSR Congress Party (@YSRCParty) January 26, 2024 ►ఇందుకు ‘సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో నాలుగుచోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో శనివారం నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి భారీఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ►సుమారుగా 15 ఎకరాల స్థలంలో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. అంతేకాక.. నియోజకవర్గాల వారీగా పలువురు కార్యకర్తలతో కూడా సీఎం ముఖాముఖి మాట్లాడనున్నారు. ►సామాజిక న్యాయం చేకూర్చడంలో మరో అడుగు ముందుకేస్తూ శాసనసభ, లోక్‌సభ స్థానాల సమన్వయకర్తలను సీఎం జగన్ మారుస్తున్నారు. ఇప్పటికే 58 శాసనసభ, 10 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించారు. గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాల కోసం అవసరమైన చోట్ల సమన్వయకర్తలను మార్చడంపై కసరత్తు కొనసాగిస్తున్నారు. సీఎం జగన్ పర్యటన ఇలా.. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి శనివారం మ.2.05 గంటలకు బయల్దేరి మూడు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో సభాస్థలికి చేరుకుంటారు. సభానంతరం తిరిగి హెలికాప్టర్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని గన్నవరానికి బయల్దేరుతారు. బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి.. ►మరోవైపు.. గత మూడ్రోజులుగా జరుగుతున్న ‘సిద్ధం’ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ఏర్పాట్లను శుక్రవారం సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్, వరుదు కల్యాణి, విశాఖ పశ్చిమ సమన్వయకర్త ఆడారి ఆనంద్, సాంస్కృతిక శాఖ చైర్మన్ వంగపండు ఉష పరిశీలించారు. -
భీమిలి సభ..ప్రతిపక్షాల గుండెల్లో వణుకు
-
వైఎస్సార్సీపీ సిద్ధం సభకి సర్వం సిద్ధం
-
నేడు భీమిలిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం జగన్
-
వైఎస్సార్ సీపీ ఎన్నికల శంఖారావం
-
ఈ నెల 27న భీమిలిలో వైఎస్ఆర్సీపీ బహిరంగ సభ
-
ఈ నెల 25న YSRCP ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశం
-
ఉత్తరాంధ్ర నుంచే వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం
సాక్షి, విశాఖపట్నం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారని వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. గురువారం ఎండాడలోని పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25న సుమారు 3 లక్షల మందితో భీమిలిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. భీమిలిలో జరిగే బహిరంగ సభ ద్వారా పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో 175/175 లక్ష్యంతో ఎన్నికల ప్రచారం సాగుతుందని స్పష్టం చేశారు. గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో ఇచి్చన హామీలను అధికారం చేపట్టిన తరువాత పూర్తిగా అమలుచేసి చూపించారన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని భీమిలి బహిరంగ సభ ద్వారా ప్రజలకు వివరిస్తారని పేర్కొన్నారు. బహిరంగ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరుకానున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5 ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సీఎం వైఎస్ జగన్ సమావేశమవుతారని చెప్పారు. పార్టీ క్యాడర్లో అసంతృప్తిని తొలగించడంతోపాటు ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులకు గల కారణాలను నేరుగా సీఎం వైఎస్ జగన్ వివరిస్తారన్నారు. విశాఖ రాజధాని కావడం తథ్యం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖ పరిపాలన రాజధాని కావడం తథ్యమని, దివంగత సీఎం వైఎస్, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే విశాఖ నగరం, ఉత్తరాంధ్ర అభివృద్ధి బాట పట్టిందని కొనియాడారు. కాదని చేప్పే దమ్ము ఎవరికైనా ఉందా అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భీమిలి బహిరంగ సభకు ముందు ఈ నెల 21 నుంచి 23 వరకు ఉత్తరాంధ్రలో నియోజకవర్గస్థాయి పార్టీ సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళారులు, మధ్యవర్తులు లేకుండా నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు జమ చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, దీనిని ప్రజలు చూస్తూ ఊరుకోరని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు. తమ సంకల్పం ఉత్తరాంధ్ర అభివృద్ధి అని స్పష్టం చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స సమాధానమిస్తూ.. రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమన్నారు. జూనియర్ ఎనీ్టఆర్ ఫ్లెక్సీలు ఎందుకు తీసేశారనేది టీడీపీ ఇష్టమని.. తమకు సంబంధం లేని అంశంపై తాను మాట్లాడనన్నారు. -
మందుబాబులకు భీమిలీ కోర్టు షాక్
సాక్షి, విశాఖపట్నం: మందుబాబులకు భీమిలీ కోర్టు షాక్ ఇచ్చింది. మత్తులో డ్రైవింగ్ జోలికి వెళ్లకుండా న్యాయమూర్తి శిక్ష విధించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న 121 మందిని భీమిలి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. 15వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జి. విజయ లక్ష్మి ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానాతో పాటు కమ్యూనిటీ సర్వీసు క్రింద బీచ్ రోడ్డులో ఉన్న కోకొనట్ పార్కు, సెయింట్ ఆన్స్ హై స్కూల్, ట్రాఫిక్ పొలీస్ స్టేషన్ పరిసరాలు శుభ్రం చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో రోడ్లు ఎక్కి ముందుబాబులు శుభ్రం చేస్తున్నారు. ఆదేశాలను ధిక్కరిస్తే జైలుకు పంపాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: ‘దృశ్యం’ తరహాలో హత్య! -
వైఎస్సార్సీపీ బస్సు యాత్ర..భీమిలి సభకు సర్వం సిద్ధం
-
పవన్ కళ్యాణ్ పై భీమిలి రైతుల ఫైర్
-
భీమిలిలో జనసేన చీప్ పాలిటిక్స్
-
భీమిలీ కబడ్డీ జట్టు హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా!
సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. కొంతకాలం ఓ వెలుగు వెలిగిన కూడా అంతలోనే కనుమరుగైన వారు కూడా ఉన్నారు. ఒక్క సినిమాతో స్టార్డమ్ సొంతం చేసుకున్నా.. దాన్ని నిలబెట్టుకోవాలంటే అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అలా వచ్చి ఇలా వెళ్లినవారిలో శరణ్య మోహన్ కూడా ఒకరు. తెలుగుతో పాటు తమిళంలో శరణ్య మోహన్ హీరోయిన్గా మెప్పించింది. అయితే తను ఇప్పుడే చేస్తోంది? ఇప్పుడెలా ఉందో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో.. టార్గెట్ అదే..) నేచురల్ స్టార్ నాని సరసన భీమీలి కబడ్డీ జట్టు చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది శరణ్య మోహన్. ఈ చిత్రం 2010లో విడుదలైంది. అతి తక్కువ కాలంలోనే తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. కల్యాణ్ రామ్ మూవీ కత్తి సినిమాలో ఆయనకు చెల్లెలిగా కనిపించింది. కానీ ఆ తర్వాత అంతే వేగంగా సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు అరవింద్ కృష్ణన్‌ను వివాహమాడింది. ఆమెకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు సంతానం కాగా.. తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్న ఈ మలయాళ కుట్టి లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేస్తుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు. నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పి ఫ్యామిలీతోనే కాలం గడిపేస్తోంది. (ఇది చదవండి: క్రికెటర్‌ను పెళ్లి చేసుకుంటున్నారా?.. ఓపెన్‌గానే చెప్పేసిన హీరోయిన్!) View this post on Instagram A post shared by Saranya Mohan (@saranyamohanofficial) -
భిమిలి బీచ్ లో ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటనలో ఒకరి మృతదేహం లభ్యం
-
భీమిలి బీచ్‌లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ భీమిలి బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సరదగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు సముద్రంలోకి దిగగా.. వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. తగరపువలసలో ఇంజనీరింగ్ చదువుతున్న ఈసీఈ బ్రాంచ్‌కు చెందిన సాయి, సూర్య గల్లంతైనట్టు పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేవీ హెలికాప్టర్లతోనూ గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్ వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: అమ్మా.. నాన్నకు ఏమైంది? ఎప్పుడు వస్తాడు?.. కంటతడి పెట్టించే ఘటన -
కడలి కోత పెడుతోంది!
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సాగర తీరం మళ్లీ కోతకు గురవుతోంది. తరచూ సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. గతంలో తుపానులు, పెను తుపానుల సమయంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తేది. కానీ ఇప్పుడు స్వల్పంగా ప్రభావం చూపే అల్పపీడనాలు, ఆవర్తనాలు వంటివి ఏర్పడినప్పుడు కూడా కడలి కన్నెర్ర చేస్తోంది. గతంలో 2014, 2015, 2016 సంవత్సరాల్లో విశాఖ సాగర తీరం కోతకు గురైంది. 2015లో మరింత అధికంగా.. కిలోమీటర్ల మేర తీరం దెబ్బతింది. ఆర్కే బీచ్ సహా పలుచోట్ల బీచ్‌లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. అప్పట్లో జీవీఎంసీ అధికారులు తీరంలో పెద్దపెద్ద బండ రాళ్లను దింపి కోతను తాత్కాలికంగా కట్టడి చేశారు. యారాడ నుంచి భీమిలి వరకూ.. సముద్రం నుంచి అలలు ఎగసిపడుతూ దూకుడుగా ముందుకు రావడం వల్ల తీరంలో ఇసుక పెద్దమొత్తంలో సముద్రంలోకి కొట్టుకుపోతోంది. సాధారణంగా ఏటా నైరుతి రుతుపవనాల సీజనులో అలల ఉధృతి అధికంగా ఉండటం వల్ల తీరం కోతకు గురవుతోంది. కొన్నిసార్లు ఈశాన్య రుతుపవనాల సీజన్లోనూ ఇక్కడి తీరం కోత సమస్య ఎదుర్కొంటోంది. ముఖ్యంగా యారాడ నుంచి భీమిలి వరకు దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో కొన్నిచోట్ల సముద్ర తీరం తరచూ కోతకు గురవుతున్నట్టు నిపుణులు ఇప్పటికే గుర్తించారు. ఇందులో యారాడ బీచ్, కోస్టల్ బ్యాటరీ, ఆర్కే బీచ్, కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం, చిల్డ్రన్ పార్క్, జోడుగుళ్లపాలెం, రుషికొండ, భీమిలి తదితర ప్రాంతాలున్నాయి. ఈ పరిస్థితిని నివారించడానికి విశాఖ పోర్టు అథారిటీ (వీపీఏ) డ్రెడ్జర్లతో డ్రెడ్జింగ్ చేయిస్తుంటుంది. ఏటా ఏప్రిల్, మే నెలల్లో డ్రెడ్జింగ్ ద్వారా కోతకు గురైన ప్రాంతాల్లో ఇసుకను పంపింగ్ చేస్తుంది. దీంతో తీరం కోతకు ఒకింత అడ్డుకట్ట పడుతోంది. తాజాగా దూకుడు తాజాగా విశాఖ తీరం మరోసారి కోతకు గురవుతోంది. దాదాపు వారం రోజులుగా ఈ పరిస్థితి ఉంది. కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు ఉన్న మధ్య ప్రాంతంతోపాటు మరికొన్ని చోట్ల కోత ప్రభావం కనిపిస్తోంది. విశాఖ బీచ్‌లో నాలుగైదు చోట్ల పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచడానికి ఓ రిసార్ట్స్ సంస్థ కొన్నేళ్ల క్రితం సుమారు 600 కొబ్బరి చెట్లను నాటింది. ఈ చెట్లు బీచ్ అందాలను ఆస్వాదించడానికి వచ్చే పర్యాటక ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సముద్ర తీరం కోతకు గురవుతుండడంతో వీటిలో కొన్ని కొబ్బరి చెట్లు, బీచ్‌లో వివిధ ఆకృతులతో జీవీఎంసీ ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు కూలుతున్నాయి. అలల ఉధృతి ఎక్కువైంది ఈ నెల 7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 11వ తేదీన పౌర్ణమి వచ్చింది. మరోవైపు ఉత్తరం వైపు నుంచి గాలుల ఉధృతి కూడా పెరిగింది. వీటి ప్రభావంతో అలల ఉధృతి సాధారణం కంటే అధికమైంది. సముద్ర కెరటాలు ముందుకు చొచ్చుకు వచ్చాయి. ఈ పరిస్థితులన్నీ తాజాగా విశాఖ తీరం కోతకు కారణమవుతున్నాయి. – ప్రొఫెసర్ కేవీఎస్ఆర్ ప్రసాద్, వాతావరణం–సముద్ర అధ్యయన విభాగ పూర్వ అధిపతి, ఏయూ -
తప్పు మీద తప్పు.. ప్రియురాలి చెంత చేరి.. పోలీసులకు చిక్కి..
సాక్షి, విశాఖటపట్నం, పీఎం పాలెం(భీమిలి): టీడీపీ నేత, రియల్టర్ పాసి రామకృష్ణను ఇటీవల కిడ్నాప్ చేసిన ముఠాను పీఎం పాలెం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు కోలా వెంకట హేమంత్‌తో పాటు ఓ మహిళ, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు ఈ కేసు వివరాలను నగర డీసీపీ సునీల్ సుమిత్ గరుడ పీఎంపాలెం పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. భీమిలి మండలం గొల్లల తాళ్లవలసకు చెందిన కోలా వెంకట హేమంత్ రౌడీషీటర్‌గా పోలీస్ స్టేషన్లో రికార్డులకెక్కాడు. మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి హత్యలో ప్రధాన నిందితుడు కూడా. దొంగతనం, కొట్లాట వంటి ఐదారు నేరాలపై ఈయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. జైలులో శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు. ఈయనకు విశాలాక్షినగర్‌లో ఉంటున్న సుబ్బలక్ష్మి(48) అనే ప్రియురాలు ఉంది. హేమంత్‌కు ఆమె అన్ని విధాలా సహకరిస్తుంటుంది. కిడ్నాప్‌కు ఉపయోగించిన కారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు బయటకు చెప్పుకుంటారు. సుమారు రూ.35 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ఆ అప్పుల నుంచి బయట పడాలంటే పెద్ద మొత్తంలో డబ్బు రాబట్టడానికి కిడ్నాప్ ఒకటే మార్గమని హేమంత్ పథకం రచించాడు. ఇందు కోసం భీమిలి మండలం జేవీ అగ్రహారానికి చెందిన రియల్టర్, టీడీపీ నేత పాసి రామకృష్ణను పావుగా ఎంచుకున్నాడు. తాను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటానని ఆయనను పరిచయం చేసుకుని సుమారు 20 రోజుల పాటు చాలా నమ్మకంగా వ్యవహరించాడు. చదవండి: (Chandrababu: ఒప్పందాలంటూ అమెరికన్లతో ఫొటోలు.. 20 సంస్థల్లో ఒక్కటొస్తే ఒట్టు) ఈ క్రమంలో ఓ స్థలం డెవలప్మెంట్కు సంబంధించి డీల్ కుదుర్చుకోవడానికి ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం రుషికొండ ఏరియాలోని ఎంబీకే గెస్ట్‌హౌస్‌కు రప్పించాడు. అప్పటికే పీఎం పాలెం ఆర్‌హెచ్ కాలనీకి చెందిన రౌడీషీటర్ మున్నా(27)తో పాటు మరో ఇద్దరు రౌడీషీటర్లు పెంటకోట కిరణ్(19), అంబటి మధుసూదన్‌రావు(31), కొలగాని రాజ్‌కుమార్‌లను తనకు సహాయంగా గెస్ట్‌హౌస్‌లో అందుబాటులో ఉంచాడు. హేమంత్ మాటలు నమ్మి వచ్చిన పాసి రామకృష్ణను తాళ్లతో బంధించి నోటికి ప్లాస్టర్ అంటించారు. వారంతా కలిసి ఆయనను అప్పటికే అద్దెకు తీసుకున్న కారులోకి బలవంతంగా ఎక్కించారు. కోటి రూపాయలు ఇస్తేనే విడిచి పెడతామని కత్తులతో బెదిరించి విజయనగరం వైపు తీసుకుపోయారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, కత్తులు సీసీ కెమెరాతో అడ్డం తిరిగిన కథ ఈ కిడ్నాప్ తతంగం అంతా సీసీ కెమోరాలలో కనిపించడంతో గెస్ట్‌హౌస్ సిబ్బంది పీఎం పాలెం పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీలో కారు నంబర్‌ను గుర్తించారు. కారు యజమానికి ఫోన్ చేసి, డ్రైవర్ ఫోన్ నంబరు సంపాదించారు. ఆ నంబర్‌కు ఫోన్ చేయడంతో.. కిడ్నాప్ విషయం పోలీసులకు తెలిసిపోయిందని గ్రహించి కారులో ఉన్నవారందరూ తలో దిక్కుకూ పారిపోయారు. అదే సమయంలో కట్లు విడిపించుకుని బాధితుడు రామకృష్ణ కారులోంచి దూకి తప్పించుకున్నాడు. ఏదోలా భీమిలి చేరుకుని పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. చదవండి: (ఆపసోపాలు.. పడరాని పాట్లు.. నవ్వులపాలైన టీడీపీ) తప్పు మీద తప్పు చేసిన కిడ్నాపర్ కిడ్నాప్ పథకం బెడిసికొట్టడంతో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కిడ్నాపర్ వెంకటహేమంత్ తప్పుల మీద తప్పులు చేశాడు. పోలీసులు వెంటాడుతూనే ఉన్నారు. గంట్యాడ పోలీసులను అప్రమత్తం చేయగా కారుకు అడ్డంగా స్టాపర్లు పెట్టగా వాటిని గుద్దుకుంటా ఉడాయించాడు. ఎస్.కోట పోలీసులు అడ్డుకోగా వారి నుంచి కూడా దౌర్జన్యంగా తప్పించుకున్నాడు. ఈ రెండు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ప్రియురాలి చెంత చేరి.. పోలీసులకు చిక్కి.. పోలీసుల నుంచి తప్పించుకున్న వెంకట హేమంత్ తన నిత్య స్థావరమైన విశాలాక్షినగర్‌లో నివసిస్తున్న సిరంగి సుబ్బలక్ష్మి ఇంట్లో తల దాచుకున్నాడు. గతంలో పలుమార్లు నేరాలకు పాల్పడినప్పుడు ఇలాగే చేసేవాడు. పోలీసులు ఈ కేసు ఛేదనలో నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించి, ఆమెతో పాటు హేమంత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మిగతా నలుగురు నిందితులను మధురవాడ ఐటీ సెజ్ సమీపంలో అరెస్ట్ చేశారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన సీఐ రవికుమార్, సిబ్బందిని డీసీపీ ఈ సందర్భంగా అభినందించారు. -
Bheemili: అన్న.. చెల్లి.. అదుర్స్ .. జాతీయ స్థాయిలో పతకాల పంట
కొమ్మాది(భీమిలి)/ విశాఖపట్నం: పోటీకి దిగితే ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించి పతకం సాధించడమే వారి లక్ష్యం. విజయం సాధించాలనే పట్టుదలకు నైపుణ్యం తోడవడంతో స్కేటింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నారు ఎండాడకు చెందిన అన్నా చెల్లెలు బొల్లాప్రగడ శ్రీ సాకేత్, శ్రీ సాహితి. రింక్‌లో అద్భుత ప్రదర్శన సాగిస్తూ.. జాతీయస్థాయిలో పతకాలు సొంతం చేసుకుంటున్నారు. అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధమవుతున్నారు. ఎండాడ స్కైలైన్‌లో నివాసం ఉంటున్న బొల్లా ప్రగడ ప్రభాకర్, మాధురి దంపతుల సంతానమే ఈ చిచ్చర పిడుగులు. ఆరేళ్ల ప్రాయంలోనే శ్రీ సాకేత్ స్కేటింగ్‌లో ప్రతిభ కనపరిచాడు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతూ.. మరో వైపు స్కేటింగ్‌లో రాణిస్తూ అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నాడు. అన్న స్ఫూర్తితోనే చెల్లి కూడా స్కేటింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. నాలుగేళ్ల ప్రాయంలోనే ఆర్టిస్టిక్ స్కేటింగ్‌లో ప్రవేశం పొందిన శ్రీ సాహితి.. శివాజీ పార్కులోని స్కేటింగ్ రింక్‌లో కోచ్‌లు సత్యం, చిట్టిబాబు వద్ద శిక్షణ తీసుకుంది. ఏడాదిలోనే నైపుణ్యం సాధించి జిల్లాస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు పతకాలు సాధించింది. శ్రీ సాకేత్ సాధించిన పతకాలివీ.. శ్రీ సాకేత్ జాతీయస్థాయిలో 7, రాష్ట్రస్థాయిలో 14 పతకాలతో పాటు జిల్లాస్థాయిలో 14 పతకాలు సాధించాడు. ఇందులో 17 బంగారు, 16 వెండి, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇన్లైన్ స్కేటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 9వ తరగతి చదువుతున్న శ్రీ సాకేత్, 7వ తరగతి చదువుతున్న శ్రీ సాహితి చదువులోనూ రాణిస్తున్నారు. జాతీయస్థాయి పోటీల్లో అత్యధిక పతకాలు సాధించడంతో పలువురు అభినందిస్తున్నారు. శ్రీ సాహితి ప్రతిభ ఇదీ.. శ్రీ సాహితి జాతీయస్థాయిలో 18, రాష్ట్రస్థాయిలో 24, జిల్లాస్థాయిలో 33 పతకాలు కైవసం చేసుకుంది. ఇందులో 41 బంగారం, 31 వెండి, 3 కాంస్యం పతకాలు ఉన్నాయి. శాప్ నిర్వహించిన పోటీల్లో 6 పతకాలను సొంతం చేసుకోవడంతో పాటు విశాఖ, చంఢీగర్, పంజాబ్‌లోని మొహలీలో జరిగిన 57, 58, 59వ జాతీయ స్థాయి పోటీల్లో 9 బంగారు, 9 వెండి పతకాలు సాధించింది. అంతర్జాతీయ పోటీలకు ముమ్మర సాధన ఇటీవల జరిగిన జాతీయ రోలర్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ శిక్షణ శిబిరంలో అంతర్జాతీయ కోచ్ మార్క్ టోనీ వద్ద క్రీడా మెళకువలు నేర్చుకున్నారు. అతి త్వరలో జరగబోయే అంతర్జాతీయ క్రీడాపోటీల్లో దేశం తరఫున పతకం సాధించాలనే లక్ష్యంతో ముమ్మరంగా సాధన చేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. ఓ వైపు చదువుకుంటూ.. మరోవైపు శిక్షణ పొందుతున్నాం. పోటీల్లో పాల్గొంటూ విజయాలు సాధిస్తున్నామంటే.. దీని వెనుక మా తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిది. చదువుకుంటూ అంతర్జాతీయ క్రీడా పోటీలకు సిద్ధమవుతున్నాం. కచ్చితంగా పతకాలు సాధించి విశాఖ జిల్లా పేరును అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తాం. – శ్రీ సాకేత్, శ్రీ సాహితి -
సండేసీన్
-
ఒక్కసారి వేస్తే 30 ఏళ్ల పాటు పంట: ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం
తగరపువలస/విశాఖపట్నం: సేద్యంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు భీమిలి నియోజకవర్గ రైతులు. ఒక్క సారి పెట్టుబడి పెడితే.. 30 ఏళ్లు వరసగా ఆదాయం పొందే ఆయిల్‌పామ్ తోటల వైపు మళ్లుతున్నారు. భీమిలి డివిజన్లో నారాయణరాజుపేట, దాకమర్రి, సంగివలస, రావాడ, గెద్దపేట, కురపల్లి, రెడ్డిపల్లి, కుసులవాడ, మజ్జిపేట తదితర పంచాయితీల్లో 200 ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ సాగు చేస్తుండగా.. ప్రస్తుతం దిగుబడి ఇస్తున్నాయి. ఏడాదిలో 8 నెలల పాటు 15 రోజులకొకసారి ఎకరానికి 10–12 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను ఆయిల్‌పామ్ గెలల ధర రూ.21 వేలకు కంపెనీల యజమానులు కొనుగోలు చేస్తున్నారు. నర్సీపట్నం వద్ద బంగారుమెట్ట, విజయనగరం జిల్లా పార్వతీపురంలో కంపెనీలకు ఆయిల్‌పామ్ గెలలను తరలిస్తున్నారు. మొదటి నాలుగేళ్లే.. నిరీక్షణ సాధారణంగా ఎక్కువ ఎకరాలు భూమి కలిగిన రైతులు ఆయిల్‌పామ్ తోటలను సాగు చేస్తుంటారు. ఒకసారి పంటకు ఉపక్రమించిన తర్వాత నాలుగేళ్లు వరసగా పెట్టుబడి పెట్టాలి. గోదావరి జిల్లాల్లో అయితే చిన్న కమతాలు కలిగిన రైతులు కూడా ఆయిల్‌పామ్‌కే మొగ్గు చూపుతారు. గత ప్రభుత్వాల హయాంలో రూ.60 ఉండే ఆయిల్‌పామ్ మొక్కను రాయితీ పోను మూడు ఎకరాల్లోపు రైతులకు రూ.5, మూడు నుంచి ఐదు ఎకరాల్లోపు రైతులకు రూ.10, ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు రూ.30 వంతున ప్రభుత్వం సరఫరా చేసేది. ప్రస్తుతం రూ.300 ఉన్న మొక్కను.. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రైతులకు ఎన్ని కావాలంటే అన్ని అందిస్తోంది. గత ప్రభుత్వాలు దిగుబడి వచ్చే నాలుగేళ్ల వరకు హెక్టారుకు ఏడాదికి రూ.4 వేల విలువైన ఎరువులు ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వం రూ.4 వేల నగదును నేరుగా రైతుల ఖాతాకు జమ చేస్తోంది. పెట్టుబడి గోరంత.. ఆదాయం కొండంత ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు మొక్కలు ఉచితంగా లభిస్తుండగా ఎకరాకు గాను పెట్టుబడి నిమిత్తం రూ.30 వేల నుంచి 40 వేలు అవుతుంది. మొక్కకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో రోజుకు 250 లీటర్ల నీరు, మూడు నెలలకు ఒకసారి మొక్కకు 3–4 కిలోల ఎరువులు, అవసరమైన చోట మట్టలు నరకడం చేస్తే సరిపోతుంది. నాలుగేళ్ల తర్వాత ఏడాదిలో ఎనిమిది మాసాలకు కలిపి 16సార్లు దిగుబడి వస్తుంది. దీంతో ఖర్చులు పోను ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం లభిస్తుంది. అంతర పంటగా వేస్తే అదనపు ఆదాయం 2013లో నాకున్న 9 ఎకరాల్లో మొదట ఆయిల్‌పామ్ వేశాను. తర్వాత 18 ఎకరాలకు విస్తరించాను. మొత్తంగా 27 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌తో పాటు అరటి, బొప్పాయి అంతర పంటలుగా వేశాను. మధ్యలో కోళ్ల ఫారాలు ఏర్పాటు చేశాను. సోలార్ ద్వారా బిందుసేద్యం మొదలుపెట్టాను. ఆయిల్‌పామ్ నాలుగేళ్లు తర్వాత దిగుబడి ప్రారంభయి జీవితకాలం 30 ఏళ్ల వరకు ఆదాయం ఇస్తుంది. అరటి, బొప్పాయి వలన ఏడాదికి రూ.లక్ష అదనపు ఆదాయం లభిస్తుంది. మార్కెటింగ్ సమస్య లేదు. – కాద సూర్యనారాయణ, సర్పంచ్, నారాయణరాజుపేట, భీమిలి మండలం పక్షుల బెడద ఉంటుంది ఆయిల్‌పామ్‌కు తెగుళ్ల బాధ తక్కువ. ఒకవేళ తెగుళ్లు సోకినా ఇబ్బంది లేదు. పంట దిగుబడి సమయంలో ఆయిల్‌పామ్ పండ్లను గోరపిట్టలు, కాకులు, ఉడతలు తినేస్తుంటాయి. సాధారణంగా ఆయిల్‌పామ్ గెల 30 కిలోలు ఉండగా.. గెలకు అరకిలో వరకు నష్టం ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా రక్షణ చర్యలు తీసుకోవాలి. వచ్చే ఆదాయం ముందు నష్టం ఏమంత కాదు. – మజ్జి చినపైడితల్లి, రైతు, మజ్జిపేట, భీమిలి మండలం -
కొత్త లైట్‌హౌస్ నిర్మాణానికి సన్నాహాలు
భీమునిపట్నం: భీమిలి బీచ్ సమీపంలో కొత్త లైట్‌హౌస్ నిర్మాణానికి అధికారులు ప్రయత్నాలు చేస్తుండడంతో త్వరలో ఇది కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. బ్రిటిష్ వారు ఇక్కడ ఉన్న సమయంలో సముద్రంలో పోర్టును ఏర్పాటు చేసుకోవడం ద్వారా వస్తువులు, సామాగ్రిని ఎగుమతులు, దిగుమతులు చేసుకునేవారు. ఇందుకోసం ఇక్కడకు వచ్చి వెళ్లే ఓడలకు దిక్సూచిగా ఉండడం కోసం 1854లో బీచ్ వద్ద లైట్‌హౌస్‌ను ఏర్పాటు చేశారు. దాంతోపాటు మున్సిపల్ కార్యాలయం వద్ద పోర్టు షిప్పింగ్ కార్యాలయం, బీచ్‌కు సమీపంలో లైట్‌హౌస్ నిర్వహణ చూసుకునే సిబ్బంది క్వార్టర్లు నిర్మించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వీటి నిర్వహణ బాధ్యత కాకినాడ పోర్టు ఆధీనంలోకి వెళ్లింది. కాగా పోర్టు కార్యాలయంలో ఒక కన్సర్వేటర్, ఇద్దరు సిబ్బంది ఉండేవారు. వారు లైట్‌హౌస్ నిర్వహణ చేసేవారు. అయితే సిబ్బంది క్వార్టర్స్‌లో ఎవరూ ఉండకపోవడంతో అవి శిథిలమైపోయాయి. ఇదిలా ఉండగా సుమారు పది సంవత్సరాల క్రితం కాకినాడ పోర్టు ఆధీనంలో ఉన్న ఈ లైట్‌హౌస్ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖకు చెందిన షిప్స్ అండ్ లైట్‌హౌసెస్ విభాగం ఆధీనంలోకి వెళ్లగా వారి పర్యవేక్షణలో ఉంది. అలాగే పోర్టు కార్యాలయం మూతపడిపోవడంతో సిబ్బందిని వేరే ప్రాంతాలకు బదిలీ చేసేశారు. మత్స్యకారులకు ఉపయోగం ఇక్కడ ఉన్న లైట్‌హౌస్ బ్రిటిష్ వారి పోర్టు మూతపడిపోయి కాకినాడ పోర్టు ఆధీనంలోకి వెళ్లినప్పటికీ పని చేస్తూనే ఉంది. సాయంత్రం చీకటి పడిన తర్వాత సిబ్బంది దీన్ని వెలిగిస్తారు. ఉదయం ఆర్పేస్తారు. ఇలా రోజూ జరుగుతుంది. కాగా భీమిలితోపాటు చుట్టుపక్కల చిప్పాడ, అన్నవరం బీచ్‌రోడ్డులోని చేపలుప్పాడ, మంగమారిపేట మరికొన్ని గ్రామాల్లోని మత్స్యకారులు రోజూ రాత్రి, తెల్లవారుజామున సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తుంటారు. వారికి ఇది దిక్సూచిగా ఉండి ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఇది బాగా పాతపడిపోవడం వల్ల కాంతి విహీనంగా మారడంతో అంతంత మాత్రంగానే పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏడు సంవత్సరాల క్రితం మరో ప్రాంతంలో వంద అడుగుల ఎత్తులో పెద్ద లైట్‌హౌస్ ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు ప్రకటించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో ఇటీవల కొత్త లైట్‌హౌస్ నిర్మాణానికి స్థల పరిశీలన కోసం అధికారుల బృందం వచ్చింది. పాత లైట్‌హౌస్ సమీపంలో శిథిలమైన సిబ్బంది క్వార్టర్స్ స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ లైట్‌హౌస్ నిర్మించడమే కాకుండా పర్యాటకులు వచ్చి సందర్శించడానికి అనుకూలంగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఈ స్థలంలో లైట్‌హౌస్ నిర్మాణం పూర్తయితే సముద్రంలో తిరిగే ఓడలకు, తీరప్రాంత మత్స్యకారులకు ఎంతో సదుపాయంగా ఉండడంతోపాటు, పర్యాటకులు సందర్శించడానికి బాగుంటుంది. -
ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేరుస్తా
తగరపువలస (విశాఖపట్నం): సీఎం వైఎస్ జగన్ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేరుస్తానని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. కర్తవ్య నిర్వహణలో వెనుకడుగు వేసే ప్రశ్నేలేదన్నారు. చిట్టివలస బంతాట మైదానంలో సోమవారం జీవీఎంసీ భీమిలి జోన్‌కు చెందిన 363 మంది వలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర అవార్డుల కింద ప్రోత్సాహకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో పదవులు అదనపు అర్హత మాత్రమేనని చెప్పారు. శక్తియుక్తులన్నీ ఉపయోగించి భీమిలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రప్రభుత్వ భాగస్వామ్యంతో త్వరలో భీమిలిలో రూ.25 కోట్లతో ఫిష్‌ల్యాండింగ్ సెంటర్, సీఎస్ఆర్ నిధులతో ఆర్టీసీ కాంప్లెక్స్ హామీ నెరవేరిస్తే 95% ఎన్నికల హామీలు నెరవేర్చినట్టేనని చెప్పారు. విద్యుత్ సమస్యలపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు పెద్ద వయసు, అనుభవం ఉన్నా జగన్‌లా పెద్ద మనసు లేదన్నారు. ఇన్నాళ్లు జగన్ కేబినెట్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది నూరుశాతం మంచివారని చెప్పారు. టీడీపీ నేతలు వలంటీర్లను హేళన చేశారని గుర్తుచేశారు. వలంటీర్లే లేకుంటే కరోనా కాలంలో మరిన్ని ప్రాణాలు పోయేవని ఆయన పేర్కొన్నారు. -
Bheemili Beach: విశాఖ భీమిలీ బీచ్‌లో అరుదైన దృశ్యం..
భీమునిపట్నం(విశాఖపట్నం): భీమిలి తీరంలో సముద్రం శుక్రవారం వెనక్కి తగ్గింది. అలల ఉధృతితో ప్రతి రోజూ సముద్రం ముందుకు వస్తుంది. చాలా అరుదుగా వెనక్కి వెళ్తుంది. అయితే శుక్రవారం సముద్రం వెనక్కి వెళ్లడంతో రాళ్లు బయటపడ్డాయి. అలల ఉధృతి లేకపోవడం, హోలీ కావడంతో సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చి.. ఇక్కడ స్నానాలు చేశారు. కాగా.. ఇక్కడి తీరం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. స్నానాలకు దిగే వారిలో చాలా మంది ప్రమాదాలకు గురవుతుంటారు. నీటి అడుగున ఉండే రాళ్లకు తగలడం వల్ల తీవ్రగాయాలపాలవడం, లేదా చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ బయటపడ్డ రాళ్లను చూస్తే తీరం ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. చదవండి: అమ్మాయిలను రప్పించి.. లాడ్జీ రూంలో గుట్టుగా వ్యభిచారం.. -
భీమిలి హయగ్రీవ రిసార్ట్స్‌లో పేకాట
తగరపువలస (విశాఖ): విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం పంచాయతీలోని హయగ్రీవ రిసార్ట్స్‌లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై శనివారం అర్ధరాత్రి తర్వాత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు దాడిచేసి 22 మందిని అరెస్టు చేశారు. పేకాట ఆడుతున్న వీరి నుంచి రూ.5,70,270 నగదు, ఎనిమిది కార్లు, 23 సెల్ఫోన్లు, నగదుకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్న రూ.21.53 లక్షల విలువైన 323 ప్లాస్టిక్ కాయిన్లు స్వాధీనం చేసుకున్నారు. మధురవాడ జోన్ ఏసీపీ చుక్కా శ్రీనివాసరావు, సీఐ జి.వి.రమణ ఆదివారం భీమిలి పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఎస్ఈబీ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇన్స్పెక్టర్లు పి.అప్పలరాజు, నమ్మి గణేష్, జగదీష్, ఎస్ఐలు సంతోష్, ఖగేష్, అమాన్రావు, జ్ఞానేశ్వరి, పద్మావతి దాడులు జరిపారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాలకు చెందిన 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టీడీపీ ఇన్చార్జ్ బడేటి రాధాకృష్ణయ్య కూడా ఉండడం గమనార్హం. స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, ప్లేయింగ్ కార్డులు, నగదు, ప్లాస్టిక్ కాయిన్లు వీరే సూత్రధారులు విశాఖ నగరానికి చెందిన దాట్ల కృష్ణంరాజు, చేబోలు శ్రీనివాస్‌పై పేకాట నిర్వహణ, క్రికెట్ బుకీలుగా నగరంలోని పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. వీరే బెంగళూరు తదితరచోట్ల ఉన్న పరిచయాలతో వివిధ జిల్లాలకు చెందిన వారితో వీకెండ్లలో పేకాట డెన్లు నిర్వహిస్తున్నారు. అరెస్టు అయింది వీరే.. అరెస్టైన వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సాగిరాజు శ్రీనివాసరాజు(జక్కవరం, కాళ్ల మండలం), కుంచంపూడి రామకృష్ణంరాజు(గణపవరం మండలం), గాదిరాజు శరత్ (భీమవరం), సాగిరాజు హరివర్మ(జువ్వలపాలెం, కాళ్ల మండలం), వేగేశ్న ఆదిత్య (భీమవరం), మంతెన నాగరాజు (మలవని దిబ్బ, కాళ్ల మండలం), నరహరిశెట్టి రాధాకృష్ణ (మేడవల్లి, ఏలూరు), అడ్డాడ సోమరాజు (ఏఎస్ఆర్ నగర్, భీమవరం) ఉన్నారు. విశాఖకు చెందిన వారిలో దాట్ల కృష్ణంరాజు(విశాలాక్షినగర్), సప్పా రవి(మాధవధార), కంతేటి శేషుబాబు(రామ్‌నగర్), చేబోలు శ్రీనివాస్(విశాలాక్షినగర్), కొల్లిమల్ల నాగ అప్పలరాజు (అనకాపల్లి), ఆడారి జగ్గారావు(చింతల అగ్రహారం), ఆడారి వేణుగోపాలకృష్ణ(అక్కయ్యపాలెం) ఉన్నారు. కృష్ణాజిల్లాకు చెందిన వారిలో చల్లగుల్ల శ్రీకృష్ణ (పెద పాలపర్రు, ముదినేపల్లి మండలం), బలుసు హరికిరణ్ (అడ్డాడ, పామర్రు మండలం), పొట్లూరి మురళీధర్ (దొండపాడు, గుడివాడ మండలం), కొర్ని నాగరాజు(భూషణగుళ్ల, పెద్దపారుపూడి మండలం), తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారిలో యడ్ల రాజారమేష్(వేమగిరి, కడియం మండలం), కూనదరాజు సత్యనారాయణరాజు(మణికిపురం, రాజోలు మండలం) ఉన్నారు. రిసార్ట్స్ యజమాని చిలుకూరి జగదీశ్వరుడు, మేనేజర్ పాతూరి కృష్ణకాంత్‌లను అరెస్ట్ చేయాల్సి ఉంది. -
రుషికొండ బీచ్‌లో మంగ్లీ సందడి
కొమ్మాది (భీమిలి): ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ బీచ్‌లో శనివారం సాయంత్రం ప్రముఖ గాయని మంగ్లీ సందడి చేసింది. ఓ ప్రైవేటు ఆల్బమ్ పాట చిత్రీకరణలో భాగంగా ఇక్కడ పడవలో ప్రయాణిస్తూ మంగ్లీ పాట పాడుతున్న సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈమెతో ఫొటోలు తీసుకునేందుకు పర్యాటకులు పోటీ పడ్డారు.అలాగే మునగపాక మండలం వాడ్రాపల్లి ఆవలోని శివలింగాన్ని దర్శించుకున్నారు. చదవండి: (మహాత్ముడికి సీఎం వైఎస్ జగన్ నివాళి) -
కాళ్లకు తాడు కట్టుకుని బావిలో ఈత.. ఎలా సాధ్యం?
తగరపువలస (భీమిలి): రీసు అప్పన్న అలియాస్ శివయ్య పుట్టుకతోనే పోలియో బాధితుడు. నిరక్షరాస్యుడైన ఆయనకు ఎడమచేయి పూర్తిగా లేదు, కుడిచేతికి రెండు వేళ్లు మాత్రమే. ప్రస్తుతం తనకంటూ ఎవరూలేరు. శివయ్య మొదట్లో విద్యుదీకరణ పనులలో సహాయకుడిగా ఉండేవాడు. ఆరేళ్ల క్రితం దాతల సాయంతో భీమిలి మండలం అన్నవరం–అమనాం పంచాయతీల మధ్య బసవపాలెంలో బసవేశ్వరుని పేరుతో శివాలయం నిర్మించాడు. అంతేకాదు శివాలయం నుంచి ప్రతి సోమవారం అన్నదానం చేస్తూ 300 మందికి భీమిలి, తగరపువలసలలో ఆహార పొట్లాలు పంచుతూ ఉంటాడు. ఈతే రాని శివయ్య 15 ఏళ్ల క్రితం నదిని దాటుతుండగా తేలుతూ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి తాను ఈదకపోయినా నీటిపై తేలగలనని రుజువయినట్టు శివయ్య తెలిపాడు. కాళ్లకు తాడు కట్టుకుని.. సాధారణంగా ఈతకు దిగేవారు కాళ్లతో, చేతులతోనూ ఈదుతుంటారు. కానీ శివయ్య కాళ్లతో కూడా ఈదే అవకాశం లేకుండా తాళ్లతో కట్టేసుకుంటాడు. బావిలో దూకిన తరువాత ఒక్కసారి మునిగి వెంటనే తేలుతుంటాడు. దీంతో శివయ్యలో ఏదో తెలియని రహస్యం ఉందని పలువురు అంటున్నారు. ఈయన నీటిపై తేలితే చూడటానికి పలువురు వస్తుంటారు. నిరక్షరాస్యుడైన శివయ్య తాను నిర్మించిన ఆలయంలో స్వయంగా శివలింగానికి అష్టోత్తరాలు, పూజలు జరిపిస్తుంటాడు. బావిలోని నీటిపై తేలుతున్న శివయ్య సాధన చేస్తే నీటిపై తేలవచ్చు నీటిలో దేనినైనా తేల్చి ఉంచగల శక్తి గాలికి ఉంది. మనకు ఉన్న రెండు ఊపిరితిత్తులు తమ సామర్థ్యంలో 60 శాతం గాలిని మాత్రమే శ్వాస ద్వారా పీల్చుకుంటాయి. ప్రతిరోజూ బోర్లా పడుకుని గట్టిగా గాలి పీల్చుకుని రెండు నిముషాల తరువాత విడుదల చేస్తే ఛాతీ విశాలమవుతుంది. దీంతో మిగిలిన 40 శాతం గాలి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. పూర్వీకులు ఇలా సాధన చేసి ఊపిరి బిగబట్టి నీళ్లపై బాసింపట్లు వేసుకుని కూర్చునేవారు. నీటి ఉపరితలంపై ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకోవడం ద్వారా తేలవచ్చు. నాణెం మునగడానికి, పడవలు తేలడానికి ఇదే సూత్రం పనిచేస్తుంది. –డాక్టర్ ఎన్.ఎల్.రావు, సీనియర్ వైద్యుడు కాళ్లకు తాడు కట్టుకుని బావిలో శివయ్య బావిలో నిలువుగా శివయ్య -
యువతిని మోసగించిన కానిస్టేబుల్‌పై కేసు
పీఎం పాలెం (భీమిలి) : వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కానిస్టేబుల్‌పై పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఇందుకు సంబంధించి స్థానిక సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మహారాణిపేట వార్డు సచివాలయ కార్యదర్శిగా పని చేస్తున్న యువతి(29)కి మహారాణిపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నిమ్మకాయల నరేష్‌తో 2021 ఫిబ్రవరి నెలలో పరిచయం ఏర్పడింది. వాట్సాప్ చాటింగ్, ఫోను సంభాషణలతో మరింత చేరువయ్యారు. యువతిని పెళ్లి చేసుకుంటానని నరేష్ తరచూ ప్రతిపాదన చేసేవాడు. ఈ క్రమంలో గత ఏడాది ఏప్రిల్ 23న ఆ యువతిని తానుంటున్న పోలీస్ క్వార్టర్స్‌లోని గదికి తీసుకెళ్లి లోబరుచుకున్నాడు. అనంతరం పలుమార్లు రుషికొండ, పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగికంగా లోబర్చుకోవడంతో యువతి గర్భం దాల్చింది. ప్రాథమిక దశలోనే గుర్తించి మాత్రలతో గర్భస్రావం చేయించాడు. ఈ క్రమంలో వివాహం చేసుకోవాల్సిందిగా యువతి కోరడంతో ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో తనకు జరిగిన అన్యాయంపై బాధిత యువతి పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు. చదవండి: కాపురంలో మద్యం పెట్టిన చిచ్చు! చక్కగా ముస్తాబై భర్తకోసం ఎదురు చూస్తుంటే.. -
దుస్తులు సరిగా కుట్టలేదని హత్య
సాక్షి, విశాఖపట్నం, పీఎంపాలెం (భీమిలి): కొత్త దుస్తులు సరిగా కుట్టలేదని ఆగ్రహించిన ఇద్దరు వ్యక్తులు ఓ టైలర్‌పై దాడి చేయగా మృతి చెందిన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. పీఎం పాలెం పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన బుడు లిమా భార్య లక్ష్మి, కుమార్తె సుమంత, కొడుకు సుమన్‌తో మారికవలసలోని రాజీవ్ గృహకల్ప జీఎఫ్–1 బ్లాక్ నంబర్ 104లో నివసిస్తున్నాడు. ఇంటివద్దనే లిమా టైలరింగ్ చేస్తుంటాడు. మిగతా కుటుంబ సభ్యులు కూలి పనులకు వెళుతుంటారు. ఇదిలా ఉండగా కాలనీకి చెందిన గణేష్ లిమా వద్ద కొత్త దుస్తులు కుట్టించుకున్నాడు. కొలతలు ప్రకారం సరిగా కుట్టకపోవడంతో సరిచేసి ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే అనుకున్న సమయానికి దుస్తులు సరిచేసి ఇవ్వకపోవడంతో టైలర్‌ను గట్టిగా ప్రశ్నించాడు. ఆ సమయంలో టైలర్ కుమార్తె, అల్లుడు సుశాంత్ ఇంట్లోనే ఉండడంతో గణేష్ వెళ్లిపోయాడు. అయితే గణేష్ తన మిత్రులు క్లింటన్, సూర్యనారాయణ మరికొందరిని వెంట తీసుకుని తిరిగొచ్చాడు. టైలర్ లిమాను విచక్షణారహితంగా గుండెలపై పిడిగుద్దులు గుద్దడంతో స్పృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు 108 వైద్య సిబ్బంది తెలిపారు. చదవండి: (కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం.. ఇంటర్ విద్యార్థిని మృతి..!) -
భీమిలిలో డిఫెన్స్ ఎంఎస్ఎంఈ పార్కు
మధురవాడ(భీమిలి): భీమిలి నియోజకవర్గంలో డిఫెన్స్ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. రుషికొండ సమీపంలోని రాడిసన్స్ బ్లూ హోటల్లో సోమవారం నిర్వహించిన ‘దేశీ–2021 ఆంధ్రప్రదేశ్’ వర్క్‌షాప్‌నకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 5 శాతంగా ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు చేపట్టి సమర్ధవంతమైన పాలన అందిస్తోందన్నారు. కరోనా కాలంలోనూ రాయితీలు కరోనా కష్టకాలంలోనూ టెక్స్టైల్ రంగానికి రూ.600 కోట్ల ప్రోత్సాహకాలతోపాటు ఎంఎస్ఎంఈ పార్కులకు సంబంధించి..రూ.వెయ్యి కోట్ల గత ప్రభుత్వ బకాయిలు చెల్లించామని వెల్లడించారు. ఐటీ పరిశ్రమలకు సంబంధించిన బకాయిలు రూ.30 కోట్లు ఉన్నాయని వాటిని, ఈ ఏడాది చెల్లిస్తామని చెప్పారు. ఈ –గవర్నెన్స్, ఇంటర్నెట్ వంటి అంశాల్లో భవిష్యత్‌లో దేశంలోనే ఏపీ బెస్ట్ అనిపించుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 2 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించిందని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభించాలని నిర్ణయించారని చెప్పారు. 2 వేలు పైబడి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు కస్టమ్స్ సహా పలు రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో రాష్ట్రం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా నిలుస్తోందని మంత్రి మేకపాటి తెలిపారు. కొత్త పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు ఎటువంటి అవాంతరాలు ఉండకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పెట్టుబడిదారుల అనుకూల విధానాలతో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్స్ సొసైటీ(ఏపీఐఎస్).. అరŠాత్యన్ ప్రైవేట్ లిమిటెడ్, ఏపీఈఐటీఏ–నేషనల్ రీసెర్చ్ డిజైన్ కార్పొరేషన్ల మధ్య మంత్రుల సమక్షంలో అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, వర్చువల్‌గా డీఆర్డీవో చైర్మన్ సతీష్‌రెడ్డి, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. -
బోన్సాయ్ హాయ్ హాయ్..
తగరపువలస (భీమిలి): విశాఖ జిల్లా భీమిలి మండలం పాతమూలకుద్దు సమీపంలో గోస్తనినదీ తీరంలో 400కు పైగా స్వదేశీ, విదేశీ రకాలకు చెందిన బోన్సాయ్ మొక్కలు ఒకేచోట కొలువుతీరి ఉన్నాయి. విశాఖకు చెందిన దువ్వి కిశోర్ అలియాస్ బోన్సాయ్ కిశోర్ కుటుంబం 22 ఏళ్లుగా వీటిని కంటిపాపల్లా సాకుతోంది. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో కలెక్షన్ కలిగిన బోన్సాయ్ మొక్కలు ఇక్కడే ఉండటం ప్రత్యేకం. గతంలో విశాఖలో కిశోర్ ఇంటి టెర్రాస్ 50–60 మొక్కలకే నిండిపోవడంతో పుష్కలంగా నీరు, స్వచ్ఛమైన గాలి ఉన్న గోస్తని నది తీర ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఉద్యోగ రీత్యా ముంబై వెళ్లిన కిశోర్ బోన్సాయ్ ప్రదర్శన చూసి ముగ్ధుడై వీటి పెంపకాన్ని ప్రవృత్తిగా ఎంచుకోవడమే కాకుండా 22 ఏళ్లుగా ఇందులో నైపుణ్యం సాధించారు. కేవలం బోన్సాయ్ మొక్కల పెంపకమే కాకుండా ఔత్సాహికులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం, విద్యార్థులకు బోటానికల్ టూర్‌గా విజ్ఞానాన్ని అందించడం, వధూవరులకు ప్రీ వెడ్డింగ్ షూట్ స్పాట్‌గా అందుబాటులో ఉంచడం, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫొటోగ్రఫీ, జర్నలిజం పాఠాలు నేర్చుకునే విద్యార్థులకు ప్రయోగశాలగా విశాలమైన ప్రదేశంలో ఈ బోన్సాయ్ వనాన్ని తీర్చిదిద్దారు. ప్రతి ఏటా ఔత్సాహికులకు బోన్సాయ్ మొక్కల పెంపకంపై పోటీలు నిర్వహించి విజేతలకు వీటినే బహుమతులుగా ఇస్తుంటారు. అమ్మా బోన్సాయ్గా పరిచయం బోన్సాయ్ వనాన్ని తీర్చిదిద్దడంలో కిశోర్ తల్లి పద్మావతి కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఆయన వృత్తి రీత్యా బిజీగా ఉన్న సమయంలో ఆమే ఈ మొక్కల సంరక్షణ మొత్తం చూసుకుంటారు. రీ పాటింగ్, ప్రూనింగ్, నీరు పెట్టడం వంటివి చేస్తుంటారు. అందుకే ఈ గార్డెన్‌ను అమ్మా బోన్సాయ్ గార్డెన్‌గా అందరికీ పరిచయం చేస్తుంటారు. ఈ గార్డెన్లో వివిధ దేశాలకు చెందిన ఖరీదైన పక్షి జాతులు, కుక్కపిల్లలు, చేపలను కూడా పెంచుతున్నారు. వీటికోసం ఫిష్పాండ్లు, కేజ్‌లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఒక కుటుంబంలో సభ్యుల వేర్వేరు అభిరుచులకు అనుగుణంగానే వీటికి స్థానం కలించారు. వయ్యారాలు ఒలకబోసేలా.. బోన్సాయ్ మొక్కలను తీర్చిదిద్దడం ఒక అద్భుతమైన కళ. దీనికి తగినంత ఓర్పుతో పాటు నేర్పు అవసరం. మహావృక్షాన్ని సైతం చిన్నతొట్టెలో ఒదిగించే కళ ఈ బోన్సాయ్ మొక్కలకే ఉంది. పెద్ద వృక్షాలను చిన్నగా చూడడమే కాదు రెండు నుంచి మూడు అడుగులు పొడవుతోనే వృక్షాలుగా కనిపిస్తాయి. సాధారణ చెట్ల మాదిరిగానే ఈ బోన్సాయ్లు ఫలాలు దిగుబడినిస్తున్నాయి. ఇంటీరియల్ డెకరేషన్లో ప్రధాన భాగమైన వీటిని ఆరోగ్యంగా పెంచుకోవడానికి మెలకువలు అవసరం. వీటి స్టైల్, వయసు, మొక్కను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.2లక్షల వరకు ధరలు పలుకుతుంటాయి. చూపు మరల్చుకోలేని కలెక్షన్ ఈ బోన్సాయ్ మొక్కల పొదరింట్లో ఇప్పటి తరం వారికి అంతగా పరిచయం లేని స్వదేశీ రకాలైన రావి, మర్రి, జువ్వి, బోగన్విల్లా, మామిడి, కామిని, బోధి, సపోటా, దానిమ్మ, సీమచింత, చింత, చెర్రీస్, ఆరెంజ్, సుబాబుల్, అత్తి, కంటి, మినీలోటస్ వంటి వందకు పైగా రకాలు ఉన్నాయి. అలాగే విదేశీ రకాలైన ఆఫ్రికన్ తులిప్, అర్జున, బాటిల్ బ్రష్, చైనీస్ ఇఎల్ఎమ్, బొబాబ్, దివిదివి, బ్రెజిలిన్ రెయిన్‌ట్రీ, పోర్షియా, పౌడర్ పఫ్, రబ్బర్, సాండ్ పేపర్, షూ ఫ్లవర్, సిల్వర్ ఓక్, ఉడ్ యాపిల్, చైనా తులసి, చైనీస్ పెప్పర్, కాపర్ పాడ్, నోడా, డ్వార్ఫ్, ఫైకస్ లాంగ్ ఇస్ల్యాండ్, గోల్డెన్ షవర్, గుల్మొహర్, జకరండా, కామిని, కేండిల్ ట్రీ, ఇండోనేషియా బ్రయా, ఆస్ట్రేలియా సరుగుడు, బార్బడోస్ చెర్రీ, పోడ్ కార్పన్, ఆస్ట్రేలియన్ ఫైకస్, దివి అవండి, టైగర్ ఫైకస్, లుసీడా, వెలగ, సెబు కేసికర్, బుంజింగి, జాక్వెనియా, కవ, గమిలన్ ట్రయాంగల్ ఫైకస్ వంటి 300 రకాలు ఉన్నాయి. చిన్నారులు మొబైల్స్‌కు అలవాటు పడిపోయిన ప్రస్తుత కాలంలో చెట్ల విలువ తెలపడానికి బోధి చెట్టు–బుద్ధుడు, నేరేడు–దత్తాత్రేయుడు, జమ్మి–పాండవులు, మర్రి–త్రిమూర్తులు మధ్య సంబంధాలు తెలిసేలా ఆయా పొట్టివృక్షాల కింద వీరి ప్రతిమలు ఏర్పాటు చేశారు. రాత్రి వేళ కూడా తిలకించేందుకు వీటికి విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. మొక్కల విలువ తెలిసింది కోవిడ్ పరిచయం కారణంగా ప్రతి ఒక్కరూ మొక్కల విలువ గుర్తించారు. కాలు ష్యం లేకుండా చెట్ల మధ్య ఉన్నవారికి కరోనా సోకలేదు. చెట్ల పెంపకానికి స్థల సమస్య ఉన్నవారికి బోన్సాయ్ మొక్కలు పెంపకం చక్కటి పరిష్కారం. బాల్కనీ, టెర్రస్, హాలులో, గోడపై కలిపి ఏభై వరకు ఈ మొక్కలను పెంచుకోవచ్చు. నీటివనరులు, కాలుష్యరహిత వాతావరణం, సారవంతమైన భూమి అందుబాటులో ఉండటంతోనే మూలకుద్దులో ఈ బోన్సాయ్ గార్డెన్ ఏర్పాటు చేశాం. – దువ్వి పద్మావతి అమ్మ వల్లనే... బోన్సాయ్ మొక్కల పెంపకం డబ్బుతో కూడుకున్నదన్నది ఒట్టి భ్రమే. మన చుట్టూ ఉన్న పాత భవనాలు, నూతుల నుంచి వీటిని సేకరించుకోవచ్చు. లోతు తక్కువ కలిగిన పాత్రలకు పెయింట్ చేసి అందులో పెంచుకోవచ్చు. స్వచ్ఛమైన గాలిని అందించే మొక్కలే మనకు మంచి నేస్తాలు. అమ్మ పద్మావతి వలనే నాకు బోన్సాయ్ మొక్కల పెంపకంపై ఆసక్తి పెరిగింది. ఆసక్తి కలిగిన వారికి వీటి పెంపకంపై శిక్షణ ఇస్తాను. వివరాలకు 79956 79999లో సంప్రదించవచ్చు. –దువ్వి కిశోర్, మూలకుద్దు, భీమిలి మండలం -
రోడ్డు ప్రమాదంలో స్నేహితుల దుర్మరణం
సాక్షి, విశాఖపట్నం: అప్పటి వరకు స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో ఆనందంగా గడిపారు. అక్కడకు కొద్ది సేపటికే రోడ్డు ప్రమాదానికి గురై అనంతలోకాలకు వెళ్లిపోయారు. జాతీయ రహదారిపై విశాఖ కన్వెన్షన్ సెంటర్ ఎదురుగా మంగళవారం రాత్రి ఒంటి గంటన్నర ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. పీఎంపాలెం ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలివీ.. స్వతంత్రనగర్‌కు చెందిన వినోద్ ఖన్నా డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. చదవండి: (ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై..) మారికవలస న్యూ శారదా కాలనీకి చెందిన పల్లా ధనరాజ్ బీటెక్ పూర్తి చేసి ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ మంగళవారం సాయంత్రం పనోరమ హిల్స్‌లో మరో స్నేహితుడి పుట్టినరోజు పార్టీకి వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కొమ్మాది వచ్చి బంకులో పెట్రోల్ వేయించి.. తిరిగి నగరం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న లారీని ద్విచక్రవాహనంతో ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యారు. సంఘటన స్థలంలోనే ఇద్దరూ మృతి చెందారు. వినోద్‌ఖన్నా సోదరుడు అరవింద్ ఖన్నా ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ('నూటొక్క జిల్లాల అందగాడు': విగ్గుతో అమ్మాయిలకు వలేస్తాడు.. ఆ తర్వాత..) -
ఇది.. తెలుగుదేశం పార్టీ భీమిలి ‘జూదాలయం’
ఆనందపురం (భీమిలి): తెలుగుదేశం పార్టీ కార్యాలయమంటే తమకు దేవాలయమన్నది చంద్రబాబు నాయుడి నిన్నటి మాట. కాబట్టే.. ఆ కార్యాలయంలో టీడీపీ నేతలు రెచ్చిపోయి బూతులు మాట్లాడారన్నది వేరే విషయం. ఇది విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం. వీళ్లు దీన్నెలా భావిస్తారో తెలియదు కానీ.. శనివారం ఇలా పేకాట ఆడుకుంటూ 9 మంది స్థానిక టీడీపీ నేతలు పోలీసులకు దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ నగరంలోని ఆనందపురం జంక్షన్లో తెలుగుదేశం పార్టీ భీమిలి ఇన్చార్జి కోరాడ రాజబాబు నిర్వహిస్తున్న పార్టీ కార్యాలయంలో పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఇక్కడ చాలా రోజులుగా జూద శిబిరం నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి కూడా ఆ కార్యాలయంలో పేకాట నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందటంతో సీఐ వై.రవి ఆదేశాల మేరకు ఎస్ఐలు నరసింహమూర్తి, శ్యామ్‌సుందర్ దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న పిల్లా వినయ్, బంటుబిల్లి రాజు, మీసాల నాగరాజు, కనకుర్తి అఖిల్, సారిక విజయ్‌కుమార్, కోరాడ సురేష్, పిల్లా తరుణ్, కోరాడ ప్రదీప్, కోర్రాయి తేజలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10,610 నగదును స్వాధీనం చేసుకున్నారు. -
ఇదో రియల్ సస్పెన్స్ కథ: బెడ్రూమ్లోని రూ.55 లక్షలు మాయం!
తగరపువలస (భీమిలి): ఇదో రియల్ సస్పెన్స్ కథ. బెడ్రూమ్లో పాతిపెట్టిన రూ.55 లక్షలు మాయమయ్యాయని ఓ ఆసామి ఫిర్యాదు చేయడం.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగటం.. ఆ వెనుకే క్లూస్‌టీమ్.. తరువాత డాగ్ స్క్వాడ్ రావడం.. పలుచోట్ల తవ్వకాలు జరపటం.. సోదాలు చేయటం.. ఎదురింట్లో రూ.19 లక్షలు లభించటం వంటి పరిణామాలు రోజంతా కనిపించాయి. సీన్ కట్‌చేస్తే.. ఉన్నట్టుండి ‘మేమూ.. మేమూ.. పరిష్కరించుకుంటాం. ఇక మీరు వెళ్లి రావొచ్చు’ అని ఆ ఆసామి చెప్పటం.. మారుమాట్లాడకుండా పోలీసులు వెనుదిరగడం జరిగిపోయాయి. భీమిలి జోన్ రెండో వార్డు సంగివలసలో జాతీయ రహదారిని ఆనుకుని ఉంటున్న మేడ చిన్నారావు అలియాస్ గురుమూర్తి కర్ర పెండలం వ్యాపారం చేస్తుంటాడు. ఈ ఏడాది మార్చిలో విజయనగరం జిల్లా గజపతినగరంలో భూమి విక్రయించగా రూ.75 లక్షలు వచ్చాయి. అందులో రూ.20 లక్షలు బంధువులకు చెల్లించి మిగిలిన రూ.55 లక్షల్ని డబ్బాలో ఉంచి బెడ్రూమ్లో గొయ్యి తీసి పాతిపెట్టాడు. ఆపై సిమెంట్‌తో ప్లాస్టింగ్ చేయించాడు. ఈ నెల 17న ఇద్దరు కుమారులు, కోడళ్లు అత్తారింటికి వెళ్లి సాయంత్రం వచ్చి చూడగా డబ్బులు పాతిపెట్టిన చోట కొత్తగా సిమెంట్ ప్లాస్టింగ్ చేసి ఉండటంతో కంగారుపడి అక్కడ తవ్విచూశారు. డబ్బులు కనిపించకపోవడంతో అదే రోజు రాత్రి పోలీసులను ఆశ్రయించారు. దీంతో క్రైమ్ విభాగం క్లూస్ టీమ్ వచ్చి సోమవారం సాయంత్రం వరకు కుటుంబ సభ్యులను విచారించారు. పోలీసులు వచ్చి ఇంట్లో, ఆవరణలో పలుచోట్ల తవ్వి చూశారు. అయినా ప్రయోజనం లేక.. అదే ఇంటికి ఎదురుగా చిన్నారావు (గురుమూర్తి)కే చెందిన పెంకుటింట్లో సోదాలు నిర్వహించగా.. అక్కడ గొయ్యి తీసి దాచిన రూ.19 లక్షలు బయటపడ్డాయి. ఇది ఇంట్లో వాళ్ల పనేనని అనుమానించిన పోలీసులు విచారణ ప్రారంభించగా.. సీన్ మారిపోయింది. ఈ సమస్యను తామే పరిష్కరించుకుంటామని ఫిర్యాదుదారు చిన్నారావు చెప్పడంతో పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. రూ.55 లక్షలు మాయమైన భవనంలో ఫిర్యాదుదారు చిన్నారావు నివసిస్తుండగా.. రూ.19 లక్షలు లభ్యమైన ఎదురింట్లో అతని ఇద్దరు కుమారులు ఉంటున్నారు. -
అరుదైన సీతాకోకచిలుక.. ఎప్పుడైనా చూశారా ?
తగరపువలస (భీమిలి): విశాఖ జిల్లా భీమిలి బ్లూజే అపార్ట్మెంట్లో ఆదివారం ఉదయం అరుదైన సీతాకోకచిలుక సందడి చేసింది. ఆరెంజ్, బిస్కట్ కలర్లో ఉన్న ఈ సీతాకోకచిలుక 18 సెంటీమీటర్ల పొడవు ఉంది. ఇలాంటి అరుదైన సీతాకోకచిలుకను గతంలో ఎప్పుడూ చూడలేదని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. -
ఫోన్ మాట్లాడొద్దన్న మామ, భవనంపై నుంచి దూకిన యువతి
సాక్షి, పీఎంపాలెం (భీమిలి): అతిగా ఫోన్లో మాట్లాడవద్దని మామయ్య మందలించడంతో ఓ యువతి అపార్టుమెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పీఎంపాలెం ఎస్ఐ హరికృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన రీటా (20) ఇంటర్ వరకూ చదువుకుంది. తల్లి ఇటీవల మృతి చెందగా...తండ్రి ఎక్కడున్నాడో తెలియదు. అప్పటి నుంచి మధురవాడ భరత్‌నగర్‌లో నివాసముంటున్న మామయ్య సోబన్‌కుమార్ పాణీ సంరక్షణలో ఉంటోంది. తరుచూ ఆమె ఫోన్లో మాట్లాడడం గమనించి మందలించాడు. దీనిని అవమానంగా భావించిన రీటా బుధవారం అపార్టుమెంటు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సోబన్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. చదవండి: ఫ్యాన్సీ స్టోర్‌లో చొరబడి.. కత్తులతో పొడిచి మహిళ హత్య -
విషాదం: పెళ్లయిన నాలుగు నెలలకే..
సాక్షి, కొమ్మాది (భీమిలి): పెళ్లయిన నాలుగు నెలలకే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో విబేధాల కారణంగా మనస్తాపం చెందిన ఆయన ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. జీవీఎంసీ నాలుగో వార్డు మంగమారిపేట ప్రాంతానికి చెందిన గరికిన తాతారావు అలియాస్ టోని (24)కి నాలుగు నెలల కిందట శ్రీకాకుళం జిల్లా సంతమ్మాళి మండలం మరువాడకు చెందిన పావనితో వివాహం జరిగింది. తాతారావు నగరంలో ఓ రెస్టారెంట్లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల వరకు వీరి జీవితం సరదాగా సాగింది. తర్వాత వీరిద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. వారం రోజుల కిందట పావని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పోయింది. రోజూ ఆమెకు ఫోన్ చేస్తూ ఇంటికి రమ్మని ప్రాధేయ పడినట్టు తాతారావు తల్లిదండ్రులు గరికిన ఎల్లయ్య, పోలమ్మ తెలిపారు. అయితే ఆమె రాకపోవడంతో మనస్తాపానికి గురైన తాతారావు శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం విగతజీవిగా వేలాడుతున్న తన కుమారుడిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే భీమిలి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎప్పుడు సరదాగా ఉంటూ.. అందరిని ఆప్యాయంగా పలకరించే తాతారావు మృతి చెందడంతో.. మంగమారిపేట గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. చదవండి: కూకట్పల్లి: యువతిని ఎరగా వేస్తారు, ఆశపడ్డావో అంతే! విచారణ కోసం వెళ్లిన పోలీసుని రాళ్లతో కొట్టి.. -
అయిదో ఫ్లోర్ నుంచి పడి బాలుడు మృతి
సాక్షి, తగరపువలస (భీమిలి): అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి అకస్మాత్తుగా మరలిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అప్పటి వరకూ లోకాన్ని మరిచిపోయి నిద్రపోయిన బాలుడు... ఆ నిద్రకళ్లతో బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి ఈ లోకాన్ని వీడివెళ్లిపోయాడు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చి న ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా చింతాడకు చెందిన రావాడ జగదీశ్వరరావు దివీస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగరీత్యా జీవీఎంసీ భీమిలి జోన్ సంగివలస శ్రీబాసర విద్యాసంస్థల వెనుక రాయల్ అపార్ట్మెంట్ అయిదో ఫ్లోర్లో భార్య, కుమారుడితో నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుమారుడు రావాడ కృతిక నందా(5) బుధవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రపోయాడు. 2.30 గంటల సమయంలో మేల్కొని... నిద్ర కళ్లతో నడుచుకుంటూ బాల్కనీలోకి వచ్చాడు. అక్కడి నుంచి ప్రమాదవశాత్తూ కిందకు పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలపాలైన నందాను సంగివలసలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ అనూహ్య పరిణామంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇప్పటి వరకూ తమ కళ్లెదుటే ఉన్న చిన్నారి అర్ధంతరంగా తమను విడిచిపోయాడని బోరున విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న భీమిలి పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: మహిళతో సంబంధం: విద్యార్థి ఆత్మహత్య) -
విశాఖ: భీమిలీ రోడ్డులో ప్రభుత్వ భూమి కబ్జా
-
మహా నగరంగా భీమిలి: విజయసాయి రెడ్డి
సాక్షి, విశాఖ : రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఆకాంక్షించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఆయన పేర్కొన్నారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. రాజధాని ఏర్పాటుతో భీమిలి పట్టణం మహా నగరంగా మారుతుందని విజయసాయి రెడ్డి తెలిపారు. చినగదిలి మండలం కొమ్మాదిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో శనివారం ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను విశాఖకు తరలిస్తున్నామని నిర్ణయం తీసుకుంటే... దానికి చంద్రబాబు నాయుడు అడ్డుపుల్ల వేస్తున్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మహోద్దేశంతో రాజధానిని నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాజధానిని ఇక్కడకు తరలించడం వల్ల ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. భీమిలి ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీనివాసరావు ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి. ఆయన హయాంలోనే రాజధాని విశాఖకు రావడం సంతోషకరమైన విషయం. అలాగే రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో, అన్ని సామాజిక వర్గాలకి, అన్నిప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు 13 జిల్లాలు...భవిష్యత్‌లో 25 జిల్లాలు... అన్ని కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాలన్న కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్య నారాయణతో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. మరోవైపు భీమిలి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రభావతి, కొప్పుల రమేష్‌తో పాటు పలువురు వైఎస్సార్ సీపీలో చేరారు. చదవండి: ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు! వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ -
మహా నగరంగా భీమిలి: విజయసాయి రెడ్డి
-
వైజాగ్‌లో భీమిలి ఉత్సవ్
-
ఏపీని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం:అవంతి
సాక్షి, విశాఖపట్నం: ఏపీని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఆదివారం పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతున్న భీమిలి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. భీమిలి ఖ్యాతిని ప్రపంచపటంలో నిలిచేలా అభివృద్ధి చేస్తామన్నారు. 13 జిల్లాల్లో అంతర్జాతీయ స్థాయి రిసార్ట్స్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. విశాఖ పర్యాటక శాఖ ‘భీమిలి చరిత్ర’ను మరోసారి ప్రపంచానికి తెలియచెప్పిందన్నారు. సినిమారంగ అభివృద్ధికి భీమిలి కేంద్రంగా ఉందన్నారు. వంపులు తిరిగిన సముద్రం భీమిలి అందాలకు ప్రత్యేకత అని తెలిపారు. ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సైరా.. అన్నట్టుందని, నాకు సినిమా కెరీర్ ఇచ్చిన ‘చామంతి’ చిత్రం షూటింగ్ ఇక్కడే చేశామని పేర్కొన్నారు. భీమిలి మంత్రిగా గంటా దోచుకుంటే.. ఇప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్ అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా తెలిపారు. -
రెండు నెలల ముందే భీమిలికి సంక్రాంతి
తగరపువలస(భీమిలి): అంగరంగ వైభవంగా జరుగుతున్న భీమిలి ఉత్సవాలను చూస్తుంటే రెండు నెలల ముందే ఇక్కడి ప్రజలకు సంక్రాంతి వచ్చినట్టుందని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన తగరపువలసలో జ్యోతి ప్రజ్వలన చేసి బెలూన్లు ఎగురవేసి భీమిలి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అదికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మనస్పూర్తిగా జరుపుతున్న ఉత్సవాలు ఇవి అని అన్నారు. విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హయాంలో భీమిలి అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ, విజయనగరం పట్టణాల మద్య ఉన్న భీమిలిలో అతి పురాతన ఆలయాలతో బౌద్ధమతం విలసిల్లిన ప్రాంతమన్నారు. జిల్లాలో టూరిస్ట్‌లపై అరాచకాలు తగ్గించడానికి గాను టూరిస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సహకరించాలని సీపీ ఆర్కే మీనా, కలెక్టరు వినయ్‌చంద్‌లను కోరారు. వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో రెండో మున్సిపాల్టీ అయిన భీమిలిలో జిల్లా అవసరాలకు కావలసిన ల్యాండ్ బ్యాంక్ ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, ఇంచార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు కంకణబద్ధులై ఉన్నారన్నారు. అధికారభాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతినెలా రాష్ట్రంలో కొండవీటి, విజయవాడ వంటి ఉత్సవాలు చేయాలని సూచిస్తే మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముందుగా భీమిలి ప్రజలకు అవకాశం కలి్పంచారన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ అత్యంత సుందరమైన భీమిలికి పండగ వచ్చిందన్నారు. పర్యాటకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో తూర్పుగోదావరిపులసకు, నెల్లూరు ఫ్లెమింగ్ పక్షలకు, ఒంగోలు గిత్తలకు, కాకినాడ కాజాకు, అరకు కాఫీ, నర్సాపూర్ లేస్‌లు ఇలా కలంకారి, సిల్‌్క, కూచిపూడి వంటివి ప్రఖ్యాతమైనవి ఉన్నాయన్నారు. కలెక్టరు విజయ్‌చంద్ మాట్లాడుతూ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు భీమిలి ఉత్సవాల మాదిరిగానే రానున్న 6,7 నెలల్లో అరకు, విశాఖ ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. వేడుకలలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అనకాపల్లి, విజయనగరం ఎంపీలు భీశెట్టి సత్యవతి, బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల, గజపతినగరం ఎమ్మెల్యేలు బడుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, రాష్ట్ర నాయకులు కొయ్యప్రసాదరెడ్డి, రొంగలి జగన్నాథం, నగర మహిళ అధ్యక్షురాలు గరికిన గౌరి తదితరులు పాల్గొన్నారు. -
‘అప్పుడే గొప్పదనం తెలుస్తుంది’
సాక్షి, భీమునిపట్నం: భీమిలి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం విశాఖ డైరెర్ట్ మార్గంలోని రెల్లివీధి వద్ద నుంచి నిర్వహించిన కార్నివాల్‌ను ప్రారంభించారు. ప్రతి ఏడాది ఈ ఉత్సవాలు జరగాలని.. అప్పుడే అన్ని ప్రాంతాల వారికి ఇక్కడి చరిత్ర, గొప్పదనం గురించి తెలుస్తుందన్నారు. ఉత్సవాల్లో విద్యార్థులు కూడా భాగస్వాములు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంక్రాంతి ముందే వచ్చింది.. భీమిలి ఉత్సవాలతో సంక్రాంతిపండగ ముందుగానే వచ్చినట్లుందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధితో పాటు సంప్రదాయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. వచ్చే నెలలో విశాఖ ఉత్సవ్.. వచ్చే నెలలో విశాఖ ఉత్సవ్ తర్వాత అరకు ఉత్సవ్లు నిర్వహిస్తామని విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్ వెల్లడించారు. విశాఖ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆకట్టుకున్నవిద్యార్థుల వేషధారణలు విద్యార్థులు పలు వేషధారణలను ప్రదర్శిస్తూ.. చిన్నబజారు నుంచి మెయిన్‌రోడ్డు మీదగా బీచ్ వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. -
గంటలో వస్తానన్నాడు..
భీమునిపట్నం/ఆరిలోవ(విశాఖ తూర్పు): నాగుల చవితి రోజున ఆరిలోవలో విషాద చాయలు అలముకున్నాయి. భీమిలి తీర ప్రాంతంలో గురువారం ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గల్లంతైన ఘటనలో ఓ విద్యార్థి మృతదేహం తీరానికి కొట్టుకురావడంతో అతని కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. మరో విద్యార్థి ఆచూకీ లభ్యంకాకపోవడంతో అతని కుటుంబం ఆందోళన చెందుతోంది. ఈ ఘటనలో మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు, కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలివి.. ఆరిలోవ ప్రాంతం ఒకటో వార్డు నెహ్రూనగర్‌కు చెందిన దువ్వి శ్రీను(16), రెండోవార్డు పరిధి టి.ఐ.సి పాయింట్ ఎస్టీకాలనీకి చెందిన లంకిలపల్లి నవీన్(16), అదే ప్రాంతానికి చెందిన ఎస్.కె.గఫూర్, కె.అరుణ్, కె. సంతోష్‌లు నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్(ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరు గురువారం భీమిలి సముద్ర తీరానికి చేరుకుని.. ఇసుకలో కొద్ది సేపు సరదాగా గడిపారు. అనంతరం గోస్తనీ, సముద్రం కలిసే సాగర సంగమం ప్రాంతంలో స్నానానికి దిగి బంతితో ఆడుకున్నారు. ఆ సమయంలో ఓ అల ఎల్.నవీన్, దువ్వి శ్రీనులను(17) లోపలకు లాక్కుపోయింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు మిగిలిన ముగ్గురు బిత్తరపోయి తీరానికి చేరుకున్నారు. ఇది గమనించిన మత్స్యకారులు పరుగెత్తుకుంటూ వచ్చి.. వారి కోసం చాలా సేపు గాలించినా ఫలితం లేకపోయింది. సాయంత్రానికి దువ్వి శ్రీను మృతదేహం గోస్తనీ అవతల వైపున తీరానికి కొట్టుకు వచ్చింది. నవీన్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. భీమిలి ఎస్ఐ సంతోష్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం పుట్టలోపాలుపోసి.. దువ్వి శ్రీను ఉదయం తల్లిదండ్రులతో కలసి ముడసర్లోవలో నాగుల చవితి వేడుకలు జరుపుకున్నాడు. అక్కడ పుట్టలో పాలుపోసి తిరిగి వచ్చారు. ఒంటి గంట సమయంలో ఇంటి వద్ద తల్లి సునీత ప్రసాదం పెట్టింది భోజనం వడ్డిస్తుండగా.. ఓ స్నేహితుడు వచ్చి బయటకు రమ్మన్నాడు. దీంతో శ్రీను తోటగరువు హైస్కూ ల్ మైదానానికి వెళ్లి గంటలో వచ్చేస్తానని, ఆ తర్వాత భోజనం చేస్తానని తల్లితో చెప్పి వెళ్లిపోయాడు. భోజనం కోసం వస్తాడని ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులకు భీమిలి తీరంలో కొడుకు మరణించాడన్న వార్త కలచివేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ కుమారుడు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి పైడిరాజు, తల్లి సునీత కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు కుమారులు శ్రీను, కిట్టు(8వ తరగతి)లను చదివిస్తున్నారు. గల్లంతైన మరో విద్యార్థి నవీన్ తండ్రి నారాయణరావు కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. నవీన్‌కు తల్లి ఆదిలక్ష్మి, తమ్ముడు శివ (8వ తరగతి) ఉన్నారు. వీరిద్దరూ ఆయా కుటుంబాలకు పెద్ద కుమారులే. ఈ ఘటనతో ఆరిలోవ ప్రాంతంలో విషాద చాయలు నెలకొన్నాయి. -
నవంబర్ 9,10 తేదీల్లో భీమిలి ఉత్సవ్
-
యువకుడి హత్యకు ఆధిపత్య పోరే కారణం!
సాక్షి, విశాఖ : నగర శివారు జీవీఎంసీ 5వ వార్డులోని మధురవాడ వాంబే కాలనీలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సంచలనం రేపిన ఈ హత్యకు ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరే కారణమని భావిస్తున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో జరిగిన ఘటనకు సంబంధించి స్థానికులు, పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వాంబేకాలనీ జీఎఫ్ 6లో నివసిస్తున్న విల్లపు రమణబాబు సుమారు 8 సంవత్సరాల కిందట వాల్తేరు ప్రాంతం నుంచి కుటుంబంతోసహా ఇక్కడికి తరలివచ్చాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న అతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు రాంబాబు(24) అలియాస్ రాము పెయింటింగ్ పనులు చేస్తూ ఆటో కూడా నడుపుతాడు. అదే కాలనీలో నివసిస్తున్న వెంకట్ అనే యువకుడు ఒక వర్గం, రాంబాబు మరో వర్గం నడుపుతున్నారు. ఈ క్రమంలో తరచూ ఈ రెండు వర్గాల నడుమ ఘర్షణలు, కొట్లాటలు జరుగుతుండేవి. వీరిపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి రాంబాబును అంతమొందించాలని వెంకట్ ప్రణాళిక రచించాడు. తమ గ్యాంగు ఉన్న ప్రాంతం వైపునకు మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత రాంబాబు రావడాన్ని వెంకట్ గమనించాడు. ఇదే అదనుగా కత్తులు, బీరు బాటిళ్లతో ఒక్కసారిగా దాడి చేసి క్రూరంగా హత్య చేశారు. ఒకదశలో ప్రాణాలు కాపాడుకునేందుకు రాము పారిపోతున్నా వెంకట్ వర్గం వెంబడించి మరీ హతమార్చారు. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న సీఐ రవికుమార్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. హత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో గొడవలు జరగకుండా నగర కమిషనర్ ఆర్కే మీనా ఆదేశాల మేరకు ఆనందపురం, పద్మనాభం సీఐల పర్యవేక్షణలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుని సోదరుడు సింహాచలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతుడు రాముపై పలు కేసులున్నాయని తెలిపారు. హత్యకు దారితీసిన వర్గపోరు పెద్దగా చదువుకోని స్థానిక యువకులు కొందరు గంజాయి, మద్యానికి బానిసలై అల్లరచిల్లరగా తిరుగుతున్నారు. వాంబేకాలనీకి సమీపంలోని ఒక ప్రాంతంలో రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ గొడవలకు దిగుతున్నారు. వీరంతా బరితెగించినా పోలీసులు కనీస చర్యలు చేపట్టలేదు. మరోవైపు స్థానికులు కూడా మనకెందుకులే అని అటువైపు చూడడం మానేశారు. ఈ క్రమంలోనే వెంకట్, రాంబాబు వర్గాలుగా విడిపోయి రెచ్చిపోయారు. కొద్దిరోజుల కిందట రాంబాబు, వెంకట్ వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో అంజి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ క్రమంలో జరిగిన దాడి రాము ప్రాణాలను తీసేసింది. వర్గపోరు హత్యల వరకూ దారి తీయడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే పోలీసులు స్పందించి కాలనీలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
ఉపాధ్యాయుల ఇళ్లలో భారీ చోరీ
సాక్షి, పద్మనాభం (భీమిలి): మండలలంలోని చేరిఖండంలో ఇద్దరు ఉపాధ్యాయునుల ఇళ్లలో శనివారం చోరీ జరిగింది. 41.75 తులాల బంగారు అభరణాలు, రూ.2.60 లక్షలు నగదు అపహరించారు. వివరాలిలా ఉన్నాయి. చేరిఖండం గ్రామానికి చెందిన పల్లంటి రాణి దువ్వుపేట ప్రాథమిక పాఠశాలల్లో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె ఇంటిలో తగరపువలసకు చెందిన ఎన్.ఎం.సి మాధురి అద్దెకు ఉంటుం ది. మాధురి రెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు టీచర్‌గా పనిచేస్తోంది. వీరిద్దరు ఉదయం ఇళ్ల గేట్లకు తాళాలు వేసి విధులకు వెళ్లారు. వీరు ఇళ్ల వద్ద లేరని గమనించిన దుండగులు గేటు తాళం కప్పలు విరగొట్టి లోపలికి ప్రవేశించారు. మాధురి పాఠశాల నుంచి విధులు ముగించుకుని సాయంత్రం 4.45 గంటలకు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చే సరికి గేట్లు, లోపల ఉన్న బీరువాలు తెరిచి ఉన్నాయి. బీరువాలో ఉన్న మూడు తులాల బంగారం గొలుసు, రెండు తులాల చిన్న చిన్న బంగారు అభరణాలు, రూ.30వేలు నగదు అపహరించినట్టు గుర్తించింది. రాణి పాఠశాల నుంచి రెడ్డిపల్లిలో ఉన్న అమ్మగారి ఇంటి వద్దకు వెళ్లింది. రాణి ఇంటిలో దొంగతనం జరిగిందని ఆమె తండ్రి ఆదినారాయణకు విద్యార్థుల ద్వారా మాధురి సమాచారం అందించింది. తండ్రి ఆదినారాయణ ఫోన్ చేసి ఈ విషయం రాణికి తెలిపారు. వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్ టీమ్ ఆమె ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటిలో బీరువులో ఉన్న 36.75 తులాల బంగా>రు అభరణాలు, రూ.2.30లక్షలు నగదు అపహరించినట్టు గుర్తించారు. రాణి కుమారుడు తరుణ్‌తేజకు ఎంబీబీఎస్ ప్రవేశానికి ఫీజు కట్టడానికి ఈ నగదును శుక్రవారం తెచ్చి బీరువాలో ఉంచినట్టు పేర్కొన్నారు. తన ఇంటిలో దొంగతనం జరగడంతో రాణి బోరున విలపించింది. మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో దొంగతనం జరిగినట్టు భావిస్తున్నారు. క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించింది. క్రైమ్ ఏడీసీపీ వి.సురేష్‌బాబు చోరీ జరిగిన సంఘటన ప్రాంతాలను పరిశీలించారు. ఎస్ఐ అప్పలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భీమిలిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి అవంతి శ్రీనివాస్ విస్తృత ప్రచారం
-
చివరికి సబ్బం..!
అనూహ్యంగా మేయర్ అయ్యాడు.. కలలోనైనా ఊహించని విధంగా అనకాపల్లి ఎంపీ అయ్యాడు.మహానేత ఆశీస్సులతోనే ఎవ్వరికీ దొరకని అవకాశాల అందలాలు అధిరోహించాడు..కానీ ఆ మహానేత హఠాన్మరణం తర్వాత ఆ కుటుంబానికే తీరని ద్రోహం చేశాడు. మహానేత సతీమణి పోటీ చేస్తే ఏ మేరకు ‘కృతజ్ఞత’ చూపించాడో అందరికీ తెలుసు.. ఆ తర్వాత ఐదేళ్లు బయటకు మొహం చూపించలేని దుస్థితి దాపురించింది.తిరిగి కొన్ని నెలలుగా అయ్యా.. బాబూ.. అంటూ టీడీపీ చంద్రబాబు కాళ్ళావేళ్లా పడ్డాడు. చివరి వరకు అక్కడా గేట్లు తెరవలేదు. చివరాఖరికి ఎవ్వరూ వద్దన్న భీమిలి టికెట్ మొహాన పడేశారు.. ఇదంతా ఎవరి గురించో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది.అవును.. అతడే.. చేతల కంటే మాటలతోనే పబ్బం గడిపేసే సబ్బం హరే..ఎట్టకేలకు టీడీపీ టికెట్ దొరకబుచ్చుకుని దక్కిందేచాలని భావిస్తున్న ఆయనగారి దుస్థితి చూసి.. ఒకప్పుడు అతని ప్రాభవాన్ని గురు్తతెచ్చుకుని హతవిధీ అంటున్నారు రాజకీయవిశ్లేషకులు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చిల్లర వేషాలు, రౌడీ వ్యవహారాలు, సెటిల్మెంట్లు చేస్తూ కాలం గడిపేసిన సబ్బం హరి.. అదృష్టం వరించి 1995లో అనూహ్యంగా మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ అయ్యాడు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్‌లో ముద్రపడ్డాడు. ఓసారి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణతో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి సస్పెండ్ చేయించారు. అప్పుడు కూడా వైఎస్ పెద్దమనసుతో మన్నించి నేదురుమల్లిని ఒప్పించి తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గరుండి అనకాపల్లి లోక్‌సభ సీటు ఇప్పించి గెలిపించారు. మహానేత హఠాన్మరణం తర్వాత సబ్బంహరి ఆ కుటుంబం పట్ల ఎంత కృతజ్ఞత చూపించాడో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ విషయం ప్రస్తావిస్తే తేనెతుట్టెను కదిపినట్టే అవుతుంది. 2014 ఎన్నికల తర్వాత అడపాదడపా సీఎం చంద్రబాబును కీర్తించేందుకే ఇంటి నుంచి బయటికొచ్చిన సబ్బం హరి.. 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని చెబుతూవచ్చాడు. తాను కోరుకున్న నియోజకవర్గం నుంచి పోటీ చేయగలనని బీరాలు పోయాడు. భీమిలియే గతి టీడీపీలో తాను ఆశించిన టికెట్‌ను తెచ్చుకోగలనని బిల్డప్ ఇచ్చిన సబ్బం హరి చివరికి ఎవరూ కాదన్న భీమిలికి పోవాల్సి వచ్చింది. భీమిలిలో టీడీపీ పరిస్థితి బాగోలేదని స్వయంగా టీడీపీ మీడియా కోడై కూసినప్పటికీ భీమిలి నుంచే మళ్లీ పోటీ చేస్తానని మంత్రి గంటా శ్రీనివాసరావు మూడు నెలల కిందటి వరకు చెప్పుకొచ్చారు. అయితే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ భీమిలి సమన్వయకర్తగా రంగంలోకి దిగడంతో గంటా అక్కడి నుంచి పరుగు అందుకున్నారు. ఇక సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ అక్కడ పోటీ చేస్తారని ప్రచారం సాగినా.. చివరికి లోకేష్ మంగళగిరికి తరలిపోయారు. ఓ దశలో భీమిలికి వెళ్ళేదెవరు.. అని టీడీపీలో కాగడా పట్టుకుని వెతికినా ఎవరూ దొరకని పరిస్థితి ఎదురైంది. మరోవైపు ఎక్కడైనా సరే.. ఏదో ఒక టికెట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న సబ్బం హరిని చంద్రబాబు పిలిపించి భీమిలికి వెళ్లమని పురమాయించారు. తొలుత సబ్బం దానికి అంగీకరించలేదని అంటున్నారు. సామాజికవర్గ కోణంలో కూడా భీమిలికి తాను సరిపోనని వాదించినప్పటికీ వెళ్తే అక్కడికి వెళ్ళు.. లేదంటే లేదు.. అని బాబు తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో లేక ఐదేళ్ళు ఇంటికే పరిమితమైన సబ్బం ఏదో ఒక చోట పోటీ చేస్తే పోలా... అని మనుసు కుదుటపర్చుకుని పోటీకి దిగాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నాడు వైఎస్ అనుచరుడిగా ఓ వెలుగు వెలిగిన సబ్బం నేడు ఓ టికెట్ కోసం.. అది కూడా ఎవరూ వద్దన్న టికెట్ కోసం వెంపర్లాడే దుస్థితికి చేరుకోవడం స్వయంకృతాపరాధమేనని అంటున్నారు. -
విశాఖ జిల్లా టీడీపీలో భీమిలి పచాయితీ
-
భీమిలి ఉత్సవ్‌లో అపశృతి!
సాక్షి, విశాఖపట్నం : భీమిలి బీచ్‌లో జరుగుతున్న ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. కార్నివాల్లో వదిలిన గ్యాస్ బెలూన్లు చెట్టుకున్న తేనెపట్టును ఢీకొట్టాయి. దీంతో ఒక్కసారిగా తేనేటీగలు అక్కడున్న విద్యార్థులపై దాడిచేశాయి. స్వల్పగాయాలు కావడంతో చికిత్స అందించారు.సుమారు పదిహేను మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరంతా ఏఎంజీ పాఠశాలకు చెందిన వారుగా గుర్తించారు. -
బాబు పాలనలో భీమిలిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు
-
భూములు కనిపిస్తే కబ్జా చేస్తున్నారు: వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం : భీమిలి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎక్కడ భూములు కనిపించినా కబ్జా చేస్తున్నారని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడి పాలనపై మండిపడ్డారు. 264వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆనందపురం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇంకా ఈ సభలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు.. ‘భీమిలిలో తిరుగుతున్నప్పుడు ఇక్కడి ప్రజలు నా దగ్గరకు వచ్చి అన్న మాటలు.. బాబుగారు పాలన చేపట్టి నాలుగున్నరేళ్లయినా ఒక్క పనిచేపట్టలేదన్నా. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఇక్కడ భూములను దోచేస్తున్నారు. ప్రభుత్వ, ఇనామ్, అసైన్డ్ భూములు కనిపిస్తలేవన్నా.. ఎక్కడైనా కనిపిస్తే మాయం చేస్తున్నారన్నా.. అని చెబుతున్నారు. మా మంత్రి గంటా శ్రీనివాస రావు, సీఎం చంద్రబాబు ట్రైనింగ్‌లో ఆరితేరిపోయాడు. ఎన్నికలు వచ్చేప్పటికి దొంగల ముఠా స్థావరాలు మార్చినట్లు ఆయన తన నియోజకవర్గాలను మారుస్తాడన్నా అని అంటున్నారు. భీమిలీ, ఆనందపురం, మధురవాడ తహసీల్దార్ ఆఫీసుల్లో జరగిన అవినీతిపై సీట్ ముందు ప్రజలు బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంత్రి గంటా అండదండలతో ఎమ్మార్వోలు అన్యాయాలు చేస్తున్నారు. హుద్ హుద్ తుఫాను పేరుతో రికార్డులను మాయం చేశారు. తుఫాన్ కారణం చూపించి ఎమ్మార్వో ఆఫీసుల్లో ఎఫ్‌ఎంబీలు, ఆర్ఎంబీలు, మ్యాపులు మాయమైపోయ్యాయని చెప్పి రికార్డులను తారుమారు చేసి భూములను దోచుకుంటున్నారు. పేదలను భయపెట్టి అసైన్డ్ భూములను కొంటారు. తర్వాత ల్యాండ్ పూలింగ్ పేరుతో దందా చేస్తారు. విద్యాశాఖ గురించి మాట్లాడితే.. మంత్రి గంటా వియ్యంకుడు నారాయణ. ఆయన విద్యాసంస్థల్లో ఫీజులు బాదుడే బాదుడు. పెంచడానికి మంత్రి గంటా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇదే నారయణ కాలేజీల్లో సుమారు 30 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కాలేజీలు మూసేయించాల్సిన మంత్రి మౌనం వహిస్తారు. ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసి నారయణ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్ట్‌లను భర్తీ చేయకుండా నిర్వీర్యం చేసి చంద్రబాబు బంధువైన ఎంవీవీఎస్ మూర్తి గీతం యూనివర్సిటీకి వెళ్లేలా ప్రోత్సహిస్తారు. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. చిట్టివలస జ్యూట్ మిల్లులో 6 వేల మంది పనిచేసేవారు. ఎన్నికలకు ముందు మంత్రి గంటా నెలరోజుల్లో ఈ మిల్లును తెరిపిస్తానని హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్లయినా ఇంత వరకు ఆ జ్యూట్ మిల్లు తెరుచుకోలేదు. కార్మికులకు రూ.119 కోట్లు బకాయి పడ్డారు. ఈ జ్యూట్ మిల్లుకు ఉన్న రెండెకరాల గోడౌన్ స్థలాన్ని వేరే వ్యక్తుల చేత కొనుగోలు చేయించారు. ఆ సొమ్ము అన్నా కార్మికులకు ఇచ్చారా అంటే.. అది లేదు. ఆ డబ్బులతో వ్యాపారం చేస్తారు. విశాఖ సమ్మిట్ పేరిట మూడు రోజులు తినడానికే రూ. 53 కోట్లు ఖర్చు పెట్టారు. 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. వచ్చాయా అని అడుగుతున్నా?(లేదు..లేదు అని ప్రజల నుంచి సమాధానం) ఉత్తరాంధ్రలో 35 జ్యూట్ మిల్లులు ఉంటే దాదాపు 50 వేల మందికి ఉపాధి కలుగుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం 18 జ్యూట్ మిల్లులు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో ఏకంగా 30 వేల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కరెంట్ యూనిట్‌కు రూ. 3.15 పైసలు ఉండేది. ఈ పెద్దమనిషి వచ్చిన తరువాత అదే యూనిట్ ధరను రూ. 8.40 రూపాయలకు పెంచారు. ఇలా పెంచితే జ్యూట్ మిల్లులు మూతపడక ఏం చేస్తాయని చంద్రబాబు అని అడుగుతున్నా.? చెక్కర ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయి. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగలు ఊడిపోతుంటే ఈ పెద్దమనిషికి చీమకుట్టినట్లు కూడా లేదు. ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పుడు ఆ శంకుస్థాపన శిలాఫలకాన్ని కూడా తీసేశారు. ఎందుకంటే మీ మంత్రి గంటా భీమిలీ నుంచి పోటీ చేయడు. అందుకే ఆ శంకుస్థాపనను కూడా తీసుకెళ్లారు. ఆరోగ్య శ్రీ అటకెక్కింది.. పోలవరం పనులను చూస్తే పునాది గోడలు దాటవు. చంద్రబాబు మాత్రం కుటుంబ సభ్యులతో గ్యాలరీ వాక్ చేస్తారు. పునాదులు వేసి గృహ ప్రవేశానికి పిలిస్తే పిచ్చోడంటారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడు ధర్మ పోరాట దీక్షలతో కొత్త డ్రామాలాడుతున్నారు. చంద్రబాబు పాలనలో ఆరోగ్య శ్రీ నిర్వీర్యమైంది. ఆపరేషన్ కోసం హైదరాబాద్‌కు వెళ్తే ఆరోగ్య శ్రీ వర్తించదంటున్నారు. మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ప్రతి పేదవాడికి చికిత్స రూ. వెయ్యిదాటితే ఆరోగ్య శ్రీ కిందకు తీసుకొస్తాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా ఎక్కడ ఆపరేషన్ చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తాం. ఆపరేషన్ చేశాక విశ్రాంతి సమయంలో పేషెంట్‌కు ఆర్థికసాయం అందిస్తాం. మరో ఆరునెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మీ మనస్సాక్షికి తగ్గట్లు ఓటేయండి. అధికారంలోకి వస్తే నవరత్నాలతో అన్ని వర్గాలను ఆదుకుంటాను.’ అని వైఎస్ జగన్ ప్రజలను కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భీమిలి నియోజకవర్గంలోకి ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర భీమిలి నియోజకర్గంలోకి విజయవంతగా ప్రవేశించింది. 262వ రోజు పాదయాత్రలో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో శనివారం పాదయాత్ర ముగించుకున్న వైఎస్ జగన్ అడవివరం వద్ద భీమిలి నియోజవర్గంలోకి ప్రవేశించించారు. ఈ సందర్భంగా పార్టీ అభిమానుల ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారీ కటౌట్లు ఏర్పాట్లు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని ఆ ప్రాంత ప్రజలకు జగన్ వద్ద వాపోయారు. -
మోటార్ సైక్లిస్ట్‌పై పిడుగు
సాక్షి, హుకుంపేట : మండలంలోని మారుమూల మత్స్యపురం పంచాయతీ తురకలమెట్ట సమీపంలో బుధవారం సాయంత్రం బైక్‌పై ఒక్కసారిగా పిడుగుపడడంతో మోటార్‌సైక్లిస్ట్ మృతి చెందాడు. సమీపంలో ఉన్న మరో గిరిజనుడికి గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఉప్ప బైరోడివలస గ్రామానికి చెందిన కొర్రా సుబ్బారావు (40) పాడేరులో పనులు పూర్తి చేసుకుని, తురకలమెట్ట గ్రామానికి చెందిన ఉబ్బేటి మహేష్(30)తో కలిసి బైక్‌పై స్వగ్రామానికి వస్తున్నాడు. సాయంత్రం ఐదు గంటల సమయంలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. తురకలమెట్ట జంక్షన్లో తన బైక్ వెనుక కూర్చున్న మహేష్‌ను దింపి, వెళుతున్న సమయంలో బైక్‌పై పిడుగుపడింది. ఈ పిడుగు ధాటికి బైక్ నడుపుతున్న సుబ్బారావు కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న మహేష్ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సమీపంలోని గిరిజనులు మహేష్‌ను ఉప్ప ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక వైద్యసేవలు కల్పిం చారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో రాత్రి పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. మృతుడు సుబ్బారావు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుతో జీవనోపాధి పొందుతున్నాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న వీఆర్వో జ్యోతి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పిడుగు పడి ఆవు మృతి పద్మనాభం(భీమిలి) : బి.తాళ్లవలసలో బుధవారం సాయంత్రం పిడుగు పడి ఒక చూడి ఆవు మృతి చెందింది. గెద్ద నాగరాజుకు చెందిన ఆవు కళ్లంలో చెట్టు కింద ఉంది. పిడుగు పడడంతో ఆవు అక్కడికక్కడే దుర్మరణం చెందింది. దీని విలువ రూ. 35వేలు. మరో నెల రోజుల్లో ఈ ఆవు ప్రసవించనుంది. ఇంతలో పిడుగు మృత్యువు రూపంలో ఆవును కబళించకపోవడంతో నాగరాజు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
భీమిలీ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం, యువకుడి మృతి
విశాఖపట్నం: విశాఖ జిల్లా భీమిలి క్రాస్ రోడ్డు జంక్షన్ వద్ద మంగళవారం ప్రమాదం జరిగింది. హోండా ఆక్టివాపై వస్తున్న ఇద్దరిని వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంవీపీ కాలనీకి చెందిన మహ్మద్ అబ్దుల్ ఫిరోజ్(20), అనిశ్చితలకు తీవ్రగాయాలు అయ్యాయి. మధురవాడలోని గాయత్రి ఆసుపత్రికి తరలిస్తుండగా ఫిరోజ్ మార్గమధ్యంలోనే చనిపోయాడు. ఫిరోజ్ వరంగల్ నిట్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రి గంటాకు చేదు అనుభవం
-
ఆ కూల్చివేతలు ఆపండి..
సాక్షి, విశాఖపట్నం: భీమిలి మండలం చేపల తిమ్మాపురంలో మత్స్యకారులకు చెందిన ఇళ్ల కూల్చివేతను ఆపేయాలని కేంద్ర ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ కలెక్టర్ యువరాజ్‌ను కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక లేఖ రాశారు. 30 ఏళ్ల క్రితం మత్స్యకారులకు కేటాయించిన 15 ఎకరాల స్థలంలో ఇళ్లు, ఇతర కట్టడాలు నిర్మించుకున్నారని పేర్కొన్నారు. కానీ రాజకీయ ఒత్తిళ్లు, ఇతరుల ప్రయోజనాల కోసం ఇటీవల అధికారులు వాటిని దౌర్జన్యంగా కూల్చివేశారన్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. దీనిపై ఈ నెల 21న బాధిత మత్స్యకారులు జిల్లా మంత్రిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారని తెలిపారు. దీంతో మంత్రి స్పందించి ఇకమీదట మిగిలిన ఇళ్ల కూల్చివేత ఆపేయాలని అధికారులను ఆదేశిస్తానని, బాధితులకు కొత్తగా ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే పంచాయతీ అధికారులు మాత్రం మిగిలిన ఇళ్లను కూల్చేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే ఇళ్ల కూల్చివేత ఆలోచనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు మత్స్యకార నాయకులు, బాధితులు శనివారం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. -
ఆయన సూపర్ ఎమ్మెల్యే..
గంటా బంధువు హల్చల్ ఆయన వెంట అధికారులు ఇద్దరు టీచర్లుకు షోకాజ్‌లు సాగర్‌నగర్ : భీమిలి నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు సమీప బంధువు ఒకరు ఎమ్మెల్యే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఆరో వార్డులో అధికారులను వెంటేసుకుని ప్రజా సమస్యలపై సోమవారం పర్యటించి కలకలం రేపారు. అధికారం లేని ఆయన వెంట అధికారులు పాల్గొని జీ హుజూర్ అన్నారు. ఆ వివరాలివి. నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న పరుచూరి భాస్కరరావు అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పరిపాటిగా మారింది. సోమవారం ఆరో వార్డులోని పర్యటించారు. ఎండాడ బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలు, వరహాగిరినగర్, శాంతినగర్, రాజీవ్‌నగర్ ప్రాంతాలను సందర్శించారు. గొల్లల ఎండాడ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి సమయానికి ఉపాధ్యాయులు రాకపోవడంతో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట కృష్ణారెడ్డికి ఫోన్ చేశారు. టీచర్లు సమయానికి స్కూళ్లు తెరవలేదు.. మంత్రిగారితో చెప్పి చర్యలు తీసుకోమంటారా? అని హెచ్చరించారు. దీంతో వెంటనే ఎంఈవో ద్వారా ఆ పాఠశాల ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయించారు. పక్కనే ఉన్న అంగన్వాడీ కార్యకర్త సకాలంలో కే ంద్రాన్ని తెరవక పోవడంతో ఐసీడీఎస్ పీవోకు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలా ఒకపక్క ప్రజా సమస్యలు పరిష్కారిస్తామని హామీలిస్తూ, మరోపక్క ఉపాధ్యాయులు, ఉద్యోగులపై అధికారం చెలాయించారు. టీడీపీ ప్రతినిధి భాస్కరరావు వెంట జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఎం. సత్యవాణి, ఏఈ భరణ్‌కుమార్, టీడీపీ వార్డు కమిటీ అధ్యక్షుడు చెట్టుపల్లి గోపి, పార్టీ శ్రేణులు సారిపల్లి శ్రీనివాస్, కార్యదర్శి ఉమ్మడి దాసు తదితరులు పాల్గొన్నారు. -
విలీనంపై మాటమార్చారు!
విశాఖ : గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్లో భీమిలి, అనకాపల్లి మునిసిపాలిటీ విలీనంపై మళ్లీ గందరగోళం నెలకొంది. మంత్రులు కూడా మాట మార్చారు. ఇన్నాళ్లూ తొందర్లోనే విలీన ప్రతిష్టంభనకు తెరపడుతుందని భావించిన అధికారులకు మంత్రులు షాకిచ్చారు. వుడాలో నిన్న జరిగిన విలేకర్ల సమావేశంలో మంత్రులు పి.నారాయణ, గంటా శ్రీనివాసరావును ప్రశ్నించగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. విలీన పంచాయతీలన్ని విలీనం నుంచి ఉపసంహరించి ఎన్నికలు నిర్వహించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, దీనిపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మూడు మాసాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా సమస్యల్ని పరిష్కరిస్తామంటూ భరోసా ఇచ్చారు. ఇన్నాళ్లూ స్థానిక మంత్రి, భీమిలీకి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా శ్రీనివాసరావు స్థానికుల అభిప్రాయం మేరకే విలీనంపై నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పుకొచ్చిన ఆయన మున్సిపల్ మంత్రి సమక్షంలో మాత్రం ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. -
కొంప ముంచిన పుట్టినరోజు!!
ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ప్రతి ఒక్క విషయాన్నీ క్షుణ్ణంగా చూసుకోవాలి. పార్లమెంటుకు గానీ పోటీ చేయాలంటే కనీసం 25 ఏళ్ల వయసు ఉండాలని భారత రాజ్యాంగంలోని 84 (బి) అధికరణం స్పష్టంగా చెబుతోంది. అలాగే, అసెంబ్లీకి పోటీ చేయాలన్నా కూడా ఇంతే వయసు ఉండాలని రాజ్యాంగంలోని 173(బి) అధికరణం, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 36(2) సెక్షన్ చెబుతున్నాయి. తనకు ఎటూ పాతికేళ్ల వయసు వచ్చేసింది కదా అని ఓ యువకుడు ఉత్సాహం చూపించాడు. అభ్యర్థులు దొరకడం లేదు కదా.. దొరికిన వాళ్లు ఎవరో ఒకరికి ఇచ్చేద్దాం అని ఓ పార్టీ కూడా ఉత్సహం చూపించింది. అయితే అటు పార్టీ నాయకులు గానీ, ఇటు పోటీ చేసిన అభ్యర్థి గానీ.. ఇద్దరూ ఆయన వయసు విషయాన్ని పట్టించుకోలేదు. పదోతరగతి సర్టిఫికెట్ ప్రకారం ఉన్న వయసును పరిగణనలోకి తీసుకుంటారు. విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున వినోద్‌కుమార్ అనే యువకుడు నామినేషన్ దాఖలు చేశాడు. అయితే, అతడి వయసు 25 సంవత్సరాలకు రెండు రోజులు తక్కువగా ఉన్నట్లు నామినేషన్ల పరిశీలనలో తేలింది. దాంతో.. వినోద్‌కుమార్ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి సుబ్బరాజు ప్రకటించారు. అంతే.. తొలిసారి అసెంబ్లీ బరిలోకి దూకుదామనుకున్న వినోద్‌కుమార్ ఆశలు కాస్తా అడియాసలయ్యాయి. -
భీమిలి ఓటర్ లిస్టులో సినీనటి స్నేహ ఉల్లాల్
-
భీమిలి మీ సేవా కేంద్రంలో దోపిడికి యత్నం
విశాఖపట్నం జిల్లా బీమిలి పట్టణంలోని మీ సేవా కేంద్రాన్నిలో గత అర్థరాత్రి దుండగులు చోరీకి యత్నించారు. అందులోభాగంగా లాకర్‌ను డ్రిల్లింగ్ మిషన్‌తో ఒపెన్ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. ఆ క్రమంలో మీ సేవా కేంద్రంలో పెద్ద పెద్ద శబ్దాలు వెలువడ్డాయి. దీంతో నిద్ర పోతున్న స్థానికులు మెల్కొన్నారు. ఆ విషయాన్ని గ్రహించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే స్థానికులు దుండగులను వెంబడించారు. దుండగల వేగాన్ని స్థానికులు అందుకోలేకపోవడంతో వారు పారిపోయారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల మీ సేవా కేంద్రానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.