సాక్షి, విశాఖపట్నం: మందుబాబులకు భీమిలీ కోర్టు షాక్ ఇచ్చింది. మత్తులో డ్రైవింగ్ జోలికి వెళ్లకుండా న్యాయమూర్తి శిక్ష విధించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న 121 మందిని భీమిలి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.
15వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జి. విజయ లక్ష్మి ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానాతో పాటు కమ్యూనిటీ సర్వీసు క్రింద బీచ్ రోడ్డులో ఉన్న కోకొనట్ పార్కు, సెయింట్ ఆన్స్ హై స్కూల్, ట్రాఫిక్ పొలీస్ స్టేషన్ పరిసరాలు శుభ్రం చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో రోడ్లు ఎక్కి ముందుబాబులు శుభ్రం చేస్తున్నారు. ఆదేశాలను ధిక్కరిస్తే జైలుకు పంపాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి: ‘దృశ్యం’ తరహాలో హత్య!
Comments
Please login to add a commentAdd a comment