సాక్షి, విశాఖపట్నం: భీమిలిలో దారుణం జరిగింది. బాలిక న్యూడ్ వీడియో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతున్న కామాంధుడి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. బాలిక దుస్తులు మార్చుకుంటుండగా గాజువాకకు చెందిన సమీప బంధువు జానకిరామ్ (53).. నగ్న వీడియోలు తీసి తల్లిని బెదిరించాడు. కుమార్తె నగ్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసిన జానకిరామ్.. వివాహిత నుండి పలుమార్లు లక్షల్లో వసూలు చేశాడు. దీంతో భీమిలి పోలీసులను బాధిత మహిళ ఆశ్రయించింది. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
చిట్టివలసలో తల్లి, కూతురు ఆత్మహత్య
మరో ఘటనలో భీమిలిజోన్ చిట్టివలసలో తల్లి, ఇద్దరు కూతుర్లు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ మృతి చెందిన తల్లి, ఒక కుమార్తె మృతి చెందారు. భర్త రామకృష్ణ దివీస్ ఉద్యోగి. భర్తతో మనస్పర్థల కారణంగా ఇద్దరి పిల్లలకు పురుగుల మందు తాగించిన తల్లి.. తాను తాగింది. తల్లి మాధవి(25), కూతురు రితిక్ష (2) మృతి చెందారు. మరో కుమార్తె ఇషిత (5) హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment