
హెచ్‌ఎం కుర్చీలో కూర్చొని శాంతి భద్రతలపై సమీక్ష
మధురవాడ: అధికారంలోకి వచ్చిందే పెత్తనం చెలాయించడానికన్నట్లు టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ప్రజా ప్రతినిధి కాకపోయినా తండ్రి హోదాను అడ్డుపెట్టుకుని భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ రెచ్చిపోయారు.
గురువారం సాయంత్రం మధురవాడ చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ఆయన హెచ్‌ఎం కుర్చీలో కూర్చుని లా అండ్ ఆర్డర్‌పై సమీక్ష నిర్వహించారు. హైస్కూల్ ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ, జీవీఎంసీ జోనల్ కమిషనర్, పీఎం పాలెం లా అండ్ ఆర్డర్ పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం వారంతా ఇది కూటమి మహిమ అంటూ గుసగుసలుపోయారు.

Comments
Please login to add a commentAdd a comment