
విశాఖ భీమిలి బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సరదగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సాక్షి, విశాఖపట్నం: విశాఖ భీమిలి బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సరదగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు సముద్రంలోకి దిగగా.. వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.
తగరపువలసలో ఇంజనీరింగ్ చదువుతున్న ఈసీఈ బ్రాంచ్‌కు చెందిన సాయి, సూర్య గల్లంతైనట్టు పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేవీ హెలికాప్టర్లతోనూ గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్ వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
చదవండి: అమ్మా.. నాన్నకు ఏమైంది? ఎప్పుడు వస్తాడు?.. కంటతడి పెట్టించే ఘటన