engineering students
-
కృత్రిమ మేధ.. కేరాఫ్ భారత్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ప్రపంచాన్ని చాలా వేగంగా మారుస్తోంది. మనిషిలా ఆలోచించి నేర్చుకోవడమే కాదు.. మనిషిలానే తర్కించడం, కొత్త అర్థాన్ని కనుక్కోవడం, అనుభవం నుంచి నేర్చుకోవడం, సామర్థ్యం పెంచుకోవడం వంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. అలుపు, విరామమన్నది లేకుండా పనిచేసే ఈ టెక్నాలజీ మనిషి సృష్టించిన మరో అద్భుతం. పంటలు ఎలా పండిస్తే లాభమో చెబుతుంది. పిల్లలకు లెక్కలు (మ్యాథమెటిక్స్) సులభంగా నేర్పిస్తుంది. మన రహదారుల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తుంది. అమెరికా వంటి పెద్ద దేశాల్లోనే కాకుండా ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడంలో, వినియోగంలో భారతదేశం కూడా దూసుకెళుతోంది.ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అన్ని రంగాల్లోనూ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ఇప్పటికే దేశంలోని కీలక రంగాల్లో దాదాపు 48 శాతం పని కృత్రిమ మేధతోనే నిర్వహిస్తున్నారు. 2025 ఆర్థిక సంవత్సరానికి ఇది 55 శాతానికి పెరుగుతుందని అంచనా. చాలా రంగాలు 75 శాతం పైగా కార్యకలాపాలు ఏఐ సాయంతోనే నిర్వహిస్తాయని చెబుతున్నారు. ఇంటి అవసరాల నుంచి పంట పండించడం వరకు ఏఐ వినియోగం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్‌లో ప్రపంచ మానవాళి జీవితాలనే మార్చేసే ఏఐ రంగంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్రస్తుతం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. అనేక రంగాలు ఇప్పుడిప్పుడే ఏఐ సామర్థ్యాన్ని వినియోగించుకునే మార్గాలను అన్వేషించడం ప్రారంభించాయి. రోబోటిక్స్, మెషిన్ లెరి్నంగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఫ్లాట్‌ఫారాలు రోజురోజుకూ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. – సాక్షి, అమరావతిపెరుగుతున్న వినియోగం.. అవగాహన ఓ పక్క ఆరోగ్య సంరక్షణ, విద్య, బ్యాంకింగ్, వ్యవసాయంతో సహా అనేక పరిశ్రమలలో ఏఐ ఉపయోగిస్తుంటే.. మరో పక్క స్కూల్ స్థాయి నుంచి సాధారణ ప్రజల వరకు ఈ సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. ఇంకో వైపు భారత ప్రభుత్వం కనీసం 10,000 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూ) ఉన్న ఏఐ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి పెడుతుందని ఇటీవల జరిగిన గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్–2024లో ప్రకటించింది.గతేడాది ఏప్రిల్‌లో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ విడుదల చేసిన ‘వార్షిక ఏఐ ఇండెక్స్’ ప్రకారం 2022లో ఏఐ ఆధారిత ఉత్పత్తులు, సేవలు అందించే స్టార్టప్‌లు 3.24 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయని.. దక్షిణ కొరియా, జర్మనీ, కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశాలను సైతం అధిగమించాయని పేర్కొంది. మనకంటే ముందు యూఎస్, చైనా, యూకే, ఇజ్రాయిల్ మాత్రమే ఉన్నట్టు వివరించింది. భారతదేశంలోని ఏఐ స్టార్టప్‌లు 2013 నుంచి 2022 వరకు మొత్తం 7.73 బిలియన్ డాలర్లు పొందగా, కేవలం 2022 ఏడాదిలోనే దాదాపు 40 శాతం పెట్టుబడులు పెరిగాయి. 2028 నాటికి ఇది 20 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఈ రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్రమే బాధ్యత తీసుకుంటుంది. ఏఐ పరిశోధకులు, కంపెనీలను ప్రోత్సహించేందుకు త్వరలో ఏఐ ఇన్నోవేషన్ సెంటర్‌ను స్థాపించనున్నారు. దీంతో పాటు ఏఐ స్కిల్ డెవలప్మెంట్, అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌ను కూడా రూపొందించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల ప్రారంభ దశలో ఏఐ, డీప్ టెక్నాలజీకి అవసరమైన నిధులను కేంద్రం అందించనుంది. దీని ద్వారా టెక్ నిపుణులకు భారీ డిమాండ్ ఏర్పడుతుందని అంచనా. బలమైన జాబ్ మార్కెట్ ఇలా» గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మన దేశ ప్రాధాన్యం పెరుగుతుందన్నది జగమెరిగిన సత్యం. అందుకు తగ్గట్టే దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) ఉద్యోగ మార్కెట్ వృద్ధి చెందుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఇందులో స్టార్టప్స్‌తో పాటు బహుళ జాతి కంపెనీల్లో ఏఐ టెక్ నిపుణులకు అవకాశాలు భారీగా ఉన్నాయి. » మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, రోబోటిక్స్ వంటి ఏఐ నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ వల్ల తాజా గ్రాడ్యుయేట్లతో పాటు అనుభవజ్ఞులైన నిపుణులకు ఈ డైనమిక్ రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో ప్రతి ఐదు ఉద్యోగాలలో ఒకటి కచ్చితంగా ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్ రంగాలకు చెందినదై ఉంటుందని చెబుతున్నారు. » ఈ క్రమంలో ఇంజినీరింగ్ విద్యార్థులు సాధారణ కంప్యూటర్ కోర్సుల కంటే టెక్ రంగంలో కఠినమైన సమస్యలను పరిష్కరించడంలో సరికొత్త అంశాలను నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రంగంలో పరిశోధన–ఆవిష్కరణలు, విద్యావేత్తలు– పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం బలమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ‘డిజిటల్ ఇండియా, నేషనల్ ఏఐ స్ట్రాటజీ’ వంటి ప్రోగ్రామ్‌లను అందుబాటులోకి తెచ్చింది.నమ్మశక్యం కాని అద్భుతాలు » భారత ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని మార్చగల శక్తి ఏఐకి ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సమీప కాలంలోనే ఈ టెక్నాలజీ కీలకం కానుందంటున్నారు. » వ్యవసాయంలో వాతావరణ మార్పులను అంచనా వేసి, ఏ సమయంలో ఏ పంట వేయాలో.. పంటల సస్యరక్షణ, దిగుబడులను పెంచడంలో రైతులకు నేరుగా సహాయం చేయగల సామర్థ్యం దీనికుంది. » ఈ నేపథ్యంలో అన్ని రంగాలకు కావాల్సిన ఏఐ టెక్నాలజీ సహకారం అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పెట్టుబడులు, నిపుణుల నియామకం కొత్త సాంకేతిక పరిజ్ఞానం పెంపునకు ఏఐ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు స్థాపించనున్నారు. అంటే ఈ టెక్నాలజీపై శిక్షణ నుంచి కొత్త సృష్టి వరకు అనేక విభాగాలకు భారత్ అంతర్జాతీయ మార్కెట్‌కు కేంద్రం కానుంది. » కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఉపయోగించి నమ్మశక్యం కాని అద్భుతాలు ఆవిష్కరించేందుకు భారతదేశానికి చాలా మంచి అవకాశం ఉందని, ఇది మునుపటి కంటే మరింత అభివృద్ధి చెందడానికి, ఇంటెలిజెన్స్ భారత్‌ను సృష్టించడానికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ టెక్నాలజీ వినియోగం శాతాల్లో68 బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్విసెస్65 టెక్ పరిశ్రమ52 ఫార్మా అండ్ హెల్త్‌కేర్43 ఎఫ్ఎంసీజీ అండ్ రిటైల్ 28 తయారీ రంగం22 మౌలిక వసతులు, రవాణ12 మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్68 బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్విసెస్ -
ముద్దొచ్చే మర చేప
ఇదేమిటో తెలుసా? రోబోచేప. పేరు ఈవ్. సిలికాన్ తోకను విలాసంగా ఊపుకుంటూ స్విట్జర్లాండ్‌లో జ్యూరిచ్ సరస్సులోని అతి శీతల జలాల్లో ఇలా విలాసంగా విహరిస్తోంది. దీన్ని రూపొందించేందుకు జ్యూరిచ్ ఈటీహెచ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏకంగా రెండేళ్లు పట్టిందట! ఇతర చేపలు, సముద్ర జీవాలు బెదిరిపోకుండా ఉండాలని దీన్ని అచ్చం చేపలా కని్పంచేలా డిజైన్ చేశారు. సోనార్ టెక్నాలజీ సాయంతో అడ్డొచ్చే వాటన్నింటినీ సునాయాసంగా తప్పించుకుంటూ సాగిపోగలదీ మర చేప. ఇంతకూ దీని పనేమిటంటారా? నీటి లోపలి పరిస్థితులను కెమెరా కంటితో ఒడిసిపట్టడం. సముద్ర జీవుల డీఎన్ఏను (‘ఇ–డీఎన్ఏ’గా పిలుస్తారు) సేకరించడం. ‘‘సముద్రం లోతుల గురించి, అక్కడి జీవుల గురించీ మనకు తెలిసింది నిజానికి చాలా తక్కువ. ఆ జీవులన్నీ నిరంతరం ‘ఇ–డీఎన్ఏ’ను జలాల్లోకి విడుదల చేస్తుంటాయి. దాన్ని సేకరించి ల్యాబుల్లో పరీక్షిస్తే వాటి గురించి మనకిప్పటిదాకా తెలియని విశేషాలెన్నో వెలుగులోకి వస్తాయి’’ అని అధ్యయన బృందం చెబుతోంది. ఈ రోబో చేపలు మున్ముందు సముద్రాల అధ్యయనం రూపురేఖలనే మార్చగలవని భావిస్తున్నారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
Hyderabad: ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
దుండిగల్: అతివేగం ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లిలోని వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన అక్షయ్, అస్మిత్, జస్వంత్, నవనీత్‌తో పాటు మరో స్నేహితుడు హరి కారులో దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్–5 వద్ద దిగారు. అక్కడి నుంచి సరీ్వస్ రోడ్డులో బౌరంపేట వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్షయ్, హరి, అస్మిత్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జస్వంత్, నవనీత్‌లను సూరారంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యార్థులు నడిపిన కారుపై ఇప్పటికే అయిదు చలాన్లు నమోదయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్న్‌షిప్‌కు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ, బీటెక్ విద్యార్థుల దీర్ఘకాలిక ఇంటర్న్‌షిప్‌నకు సర్వం సిద్ధమైంది. ఈ విద్యార్థులకు విద్యతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం ఇంటర్న్‌షిప్ ప్రవేశపెట్టింది. ఇంజనీరింగ్ విద్యార్థులకు సోమవారం నుంచి ఇంటర్న్‌షిప్ ప్రారంభమవుతుంది. డిగ్రీ విద్యార్థులకు వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. గతేడాది 2.56 లక్షల మంది ఇంటర్న్‌షిప్ చేయగా, ఈ ఏడాది 3.46 లక్షల మంది ఇందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం 30కి పైగా ప్రపంచ స్థాయి సంస్థల్లో వర్చువల్‌గా, మరో 30 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల ద్వారా ఇంటర్న్‌షిప్ కల్పిస్తోంది. ఇంటర్న్‌షిప్ కోసం ఉన్నత విద్యా మండలి పోర్టల్‌లో లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్) ఏర్పాటు చేశారు. జిల్లాలవారీగా గుర్తించిన సంస్థల వివరాలను వెబ్సైట్లో అప్డేట్ చేస్తున్నారు. ఆ సంస్థలతో సమన్వయం చేసేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం నియమించింది. ప్రపంచ స్థాయి సంస్థలతో ఒప్పందం విద్యార్థుల ఇంటర్న్‌షిప్ కోసం పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వర్తక, వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్, మెగా సంస్థలను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిలో మాన్యుఫాక్చరింగ్‌తో పాటు సర్వీసు సంస్థలూ ఉన్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకుంటోంది. ఎల్ఎంఎస్–ఐఐసీ పోర్టల్‌లో వీటి వివరాలు ఉంచింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, స్మార్ట్ ఇంటన్జ్, ఎక్సల్ ఆర్, సెలర్ అకాడమీ, సిస్కో, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, వాద్వానీ ఫౌండేషన్, టీమ్ లీజ్ వంటి సంస్థల ద్వారా ఇంటర్న్‌షిప్ అందిస్తోంది. ఈ ఏడాది సుమారు 40 వేల మంది సంప్రదాయ డిగ్రీ విద్యార్థులకు స్ట్రైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్ కల్పిస్తోంది. వీరితో పాటు 2వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ కింద సేవలు వినియోగించుకోనుంది. వీరికి నెలకు రూ.12 వేల చొప్పున చెల్లిస్తూ ఆరు నెలల పాటు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు డిజిటల్ టెక్నాలజీపై అవగాహన పెంపొందించనుంది. చదువుకొనే సమయంలోనే జీతాన్నీ అందుకుంటారు విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు డిగ్రీతో పాటు ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అమలు చేస్తున్నాం. దీర్ఘకాలిక ఇంటర్న్‌షిప్‌ను చివరి సెమిస్టర్లో పెట్టడం ద్వారా విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న పాఠ్యాంశాలతో పాటు పరిశ్రమల్లో నేర్చుకున్న విజ్ఞానంతో వేగంగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 10 లక్షల మందికి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్ అందించింది. ఏపీలో విద్యార్థులు తొలిసారిగా చదువుకొనే సమయంలోనే జీతాన్నీ అందుకోనున్నారు. – ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
టాప్ కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్ల పరిమితి ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: అత్యుత్తమ ప్రతిభగల ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశానికి పరిమితి ఎత్తివేయబోతున్నారు. ఇందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు ముసాయిదా ప్రతిని రూపొందించింది. దీన్ని రాష్ట్రాల ఉన్నతవిద్యా మండళ్లకు పంపింది. వచ్చే ఏడాది (2024) నుంచి దీన్ని అమల్లోకి తేవాలని భావిస్తోంది. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కోర్సుల విషయంలోనూ ఈ విధానాన్ని అనుసరించాలని ప్రతిపాదించింది. ఇటీవల విడుదల చేసిన హ్యాండ్‌బుక్‌లోనూ ఏఐసీటీఈ దీన్ని ప్రస్తావించింది. ముసాయిదా ప్రతిని సమీక్షించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది. యూనివర్సిటీల వీసీలు, మండలి ఉన్నతాధికారులు ఈ అంశంపై చర్చించేందుకు సమావేశమవుతున్నారు. రాష్ట్రంలో పది కాలేజీలకు అవకాశం.. రాష్ట్రంలో 174 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా అటానమస్ కాలేజీలను కలుపుకొని 100 కాలేజీలకు ‘న్యాక్’అక్రెడిటేషన్ ఉంది. వాటిల్లో అత్యుత్తమ ప్రమాణాలు కనబరిచే కాలేజీల జాబితాను గుర్తించాల్సి ఉంటుంది. దీనికోసం ఎక్స్పర్ట్ విజిటింగ్ కమిటీ (ఈవీసీ)ని మండలి నియమించాల్సి ఉంటుంది. ఇందులో ఏఐసీటీఈ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి, అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీల సభ్యులు ఉంటారు. విద్యార్థుల హాజరు శాతం, ఏటా కౌన్సెలింగ్‌లో ఏ కాలేజీకి ఎందరు దరఖాస్తు చేస్తున్నారు? ఏయే కోర్సులను డిమాండ్ చేస్తున్నారు? ఆయా కోర్సుల్లో చేరేవారి పురోగతి ఎలా ఉంది? కాలేజీలో చేరిన విద్యార్థుల మార్కుల వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఉపాధి పొందిన తీరు, లభించిన వార్షిక వేతనం వంటి అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఇలా రాష్ట్రంలో అన్ని అర్హతలు ఉన్న కాలేజీలు 10 వరకూ ఉంటాయని మండలి వర్గాలు చెబుతున్నాయి. అయితే కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ పెరిగాక సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారా? అనే విషయమై ఏఐసీటీఈ స్పష్టత ఇవ్వలేదు. కాలేజీల్లో ఉండే మౌలికవసతులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పినా, దానిపైనా స్పష్టత ఇవ్వలేదని అధికారులు అంటున్నారు. సీట్లు పెరిగేనా? ప్రస్తుతం ప్రతి కాలేజీలోని ఒక్కో బ్రాంచిలో గరిష్టంగా 4 సెక్షన్లనే అనుమతిస్తున్నారు. ఒక్కో సెక్షన్లో 60 సీట్ల చొప్పున మొత్తం 240 సీట్లు ఉంటున్నాయి. అయితే నాలుగు సెక్షన్లు ఉన్న కాలేజీలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. వాటిల్లోనూ ఎక్కువగా సీఎస్ఈ, కొత్తగా వచి్చన కంప్యూటర్ కోర్సులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిమితి ఎత్తేసినా కొత్తగా సీట్లు పెరుగుతాయా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. కొత్త విధానం వల్ల యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు తీసుకోవాల్సిన అవసరం ఉండదని అధికారులు అంటున్నారు. విస్తృత చర్చ చేపడతాం.. ఏఐసీటీఈ ముసా యిదా ప్రతిపై త్వరలో ఉన్నతస్థాయి చర్చ చేపడతాం. ఏఐసీటీఈ ప్రతిపాదనలు రాష్ట్రంలో అమలు చేయగలమా లేదా? అనేది పరిశీలించాల్సి ఉంది. వీసీలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నాక దీనిపై ఏఐసీటీఈకి అభిప్రాయం తెలియజేస్తాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
అర్థరాత్రి కాలువలోకి దూసుకెళ్లిన కారు..
-
ఇంజినీరింగ్ విద్యార్థులపై దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్స్
సాఓఇ, బాపట్ల: నాలుగు సంవత్సరాలు కష్టపడి ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులందరూ నా దృష్టిలో సూపర్ స్టార్సేనని సినీ దర్శకుడు రావిపూడి అనీల్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన పూర్వ విద్యార్థుల కలయికలో భాగంగా యంగ్ డైరెక్టర్ రావిపూడి అనీల్ విజ్ఞాన్లోని విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. అనీల్ మాట్లాడుతూ అవకాశాలనేవి మన దగ్గరకు రావని.. విద్యార్థులే వాటికి ఎదురెళ్లి తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి జీవితంలో నిర్ధిష్టమైన లక్ష్యం ఉండాలన్నారు. దాని సాధించేంతవరకు కష్టపడాలన్నారు. వినూత్న ఆలోచనలకు కాసింత క్రియేటివిటీ, టెక్నాలజీను ఉపయోగించుకుంటే జీవితంలో విద్యార్థులు ముందుకు దూసుకెళ్లి పోవచ్చన్నారు. ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చదవండి: (అదే నా కోరిక.. నటనకు బ్రేక్ ఇచ్చయినా ఆ విషయాలు తెలుసుకుంటా) -
భీమిలి బీచ్‌లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ భీమిలి బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సరదగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు సముద్రంలోకి దిగగా.. వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. తగరపువలసలో ఇంజనీరింగ్ చదువుతున్న ఈసీఈ బ్రాంచ్‌కు చెందిన సాయి, సూర్య గల్లంతైనట్టు పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేవీ హెలికాప్టర్లతోనూ గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్ వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: అమ్మా.. నాన్నకు ఏమైంది? ఎప్పుడు వస్తాడు?.. కంటతడి పెట్టించే ఘటన -
బాపట్లలో విషాదం.. నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు
చీరాల టౌన్: విహారయాత్ర కోసం బీచ్‌కు వచ్చిన నలుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యా రు. వారిలో ఒకరి మృతదేహం లభించింది. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో గురువారం జరిగింది. చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు... గుంటూరుకు చెందిన జీవీఆర్‌ఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు రామాపురం బీచ్‌కు వచ్చా రు. వారు సముద్రంలో స్నానం చేస్తుండగా పెద్ద అలలు వచ్చాయి. తెనాలికి చెందిన యడవల్లి రమణ (19), పులివర్తి గౌతమ్ (20), అమరావతి మండలం పరిమి గ్రామానికి చెందిన తాళ్లూరి రోహిత్ (20), హైదరాబాద్‌కు చెందిన తిరుణగిరి మహదేవ్ (18) అలల తాకిడికి నీటిలో మునిగిపోయారు. ఆ సమయంలో కేకలు వేస్తున్న విద్యార్థుల ను కాపాడేందుకు రామాపురం మత్స్యకారులు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. కొద్దిసేపటి తర్వాత మహదేవ్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొ చ్చింది. మిగిలిన ముగ్గురు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. మహదేవ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. తీరంలో మిన్నంటిన రోదనలు... గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థులు రామాపురానికి చేరుకున్నారు. కుమారులు సముద్రంలో గల్లంతుకావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కష్టపడి బిడ్డలను చదివించుకుంటున్న తమపై విధి కక్షగట్టి తీసుకెళ్లిందని, తమకు కడుపుకోత మిగిల్చిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా రు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అక్కడికి చేరుకుని విద్యార్థులు, డీఎస్పీ పి.శ్రీకాంత్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
AP: బీటెక్ సీటు హాట్ కేకు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు హాట్‌కేకుల్లా భర్తీ అవుతున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా రాష్ట్రంలోని కాలేజీల్లో చదవడానికి ఇంజనీరింగ్ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఏపీ ఈఏపీ సెట్–2022 అడ్మిషన్ల కౌన్సెలింగ్ (ఎంపీసీ స్ట్రీమ్)లో గురువారం తొలి విడత సీట్ల కేటాయింపులో 82% సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటా ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో ఇదో రికార్డు. గత ఏడాదిలో కూడా తొలి విడతలోనే 75 శాతానికి పైగా భర్తీ అయ్యాయి. ఇప్పుడు మరిన్ని ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. జగన్ సీఎం అయిన తర్వాత కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులందరికీ ప్రభుత్వమే జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుంది. దీంతోపాటు జగనన్న వసతి దీవెన కింద ఏడాదికి రూ.20 వేలు చెల్లిస్తుంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రమాణాలు మెరుగుపరుస్తోంది. ఏడాది ఇంటర్న్‌షిప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. నైపుణ్య శిక్షణ ఇప్పిస్తోంది. ప్రముఖ పరిశ్రలతో కాలేజీలను అనుసంధానిస్తోంది. ఈ చర్యలన్నిటి ఫలితంగా రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సీట్లు హాట్ కేకులే అయ్యాయి. రాష్ట్రంలోని 248 ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 1,11,864 సీట్లు ఉన్నాయి. వీటిలో తొలి విడతలోనే 91,249 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 20,615 సీట్లు మిగిలి ఉన్నట్లు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ సి.నాగరాణి చెప్పారు. ఏపీ ఈఏపీ సెట్లో 1,73,572 మంది అర్హత సాధించగా ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 1,01,318 మంది వెబ్ ఆప్షన్లకు అర్హత సాధించారు. వీరిలో 99,025 మంది ఆప్షన్లను నమోదుచేశారు. తొలివిడతలో ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లను కేటాయించారు. స్పోర్ట్సులో 492, ఎన్సీసీలో 984 సీట్ల కేటాయింపును పెండింగ్‌లో పెట్టారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) నుంచి మెరిట్ జాబితా అందిన అనంతరం ఆ సీట్లు కేటాయిస్తారు. భారీగా కంప్యూటర్ సైన్సు సీట్లు ఇంజనీరింగ్ సీట్లలో కంప్యూటర్ సైన్సు, తత్సంబంధిత సీట్లు అత్యధికంగా భర్తీ అయ్యాయి. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా కంప్యూటర్ సైన్సు కోర్సుల్లోనే అత్యధిక శాతం సీట్లకు అనుమతులు తెచ్చుకున్నాయి. గతంలోకన్నా ఈసారి ఎక్కువ సీట్లు ఈ విభాగంలోనే ఉన్నాయి. సీఎస్ఈ, తత్సంబంధిత సీట్లు 41,991 భర్తీ కాగా అందులో సీఎస్ఈ సీట్లు 27,261 ఉన్నాయి. ఆ తరువాత ఈసీఈ, ఈఈఈలో ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. తొలివిడతలోనే ఈ సీట్లు దాదాపు పూర్తిగా భర్తీ అయ్యాయి. బాబు హయాంలో సీట్ల భర్తీ అంతంతే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కన్వీనర్ కోటా ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి విద్యార్ధుల నుంచి స్పందన పెద్దగా ఉండేది కాదు. విద్యార్థుల్లో చాలా మంది హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని ప్రైవేటు కాలేజీల్లో చేరేందుకే మొగ్గు చూపేవారు. జేఈఈ మెరిట్ విద్యార్థులు ఏపీ ఎంసెట్‌లో టాప్ ర్యాంకులో నిలిచి మంచి కాలేజీలో సీటు వచ్చినా, దానిని వదులుకొని వేరే రాష్ట్రాలకు వలస వెళ్లే వారు. అప్పట్లో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు కాకుండా కాలేజీ ఫీజు లక్షల్లో ఉన్నా కేవలం రూ.35 వేలు మాత్రమే చెల్లించేది. చంద్రబాబు హయాంలో చివరి దశ కేటాయింపులు పూర్తయ్యాక కూడా కాలేజీల్లో దాదాపు 40 శాతం సీట్లు ఖాళీగా ఉండేవి. 2016లో 58 శాతం, 2017లో 60 శాతం, 2018లో 61 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రభుత్వ చర్యల ఫలితంగా రాష్ట్రంలోని కాలేజీల్లోనే చదవడానికి విద్యార్థులు మొగ్గు చూపిస్తున్నారు. నేడు బీ కేటగిరీ నోటిఫికేషన్ ఇంజనీరింగ్ కాలేజీల్లోని యాజమాన్య కోటా అయిన బీ కేటగిరీ సీట్ల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సీట్ల భర్తీని కాలేజీలో ప్రత్యేక పోర్టల్ ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపడతాయి. విద్యార్థులు కాలేజీలకు నేరుగా దరఖాస్తు చేయడానికి లేదా ఈ పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నారు. ఫార్మసీ సీట్ల భర్తీకి బ్రేకు ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లోనే ఫార్మసీ సీట్లు కూడా భర్తీ చేయాల్సి ఉన్నా వాటికి బ్రేకు పడింది. ఫార్మసీ కాలేజీల సీట్లకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు రాకపోవడంతో వీటి భర్తీని నిలిపివేశారు. అనుమతుల మంజూరు ప్రక్రియ వచ్చే నెలలో పూర్తవుతుందని ఫార్మసీ కౌన్సిల్ ఉన్నత విద్యాశాఖకు తెలిపింది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని ఉన్నత విద్యా మండలి ఫార్మసీ కౌన్సిల్‌కు మరోసారి లేఖ రాసింది. -
పదివేల లోపు నిబంధన బీసీ, ఈబీసీల ఆవేదన
విఘ్నేష్ కుమార్ గండిపేట సమీపంలోని పేరున్న కళాశాలలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 2019 సంవత్సరంలో ఎంసెట్‌లో 10025 ర్యాంకు రావడంతో ఆ కాలేజీలో సీటు వచ్చింది. మంచి ర్యాంకు రావడం, బీసీ–బీ కేటగిరీలోని రిజర్వేషన్‌తో పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని భావించిన విఘ్నేష్ ఫీజు ఎక్కువైనా అందులో చేరాలనుకున్నాడు. అయితే అడ్మిషన్ ఖరారు చేసే సమయంలో రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని అధికారులు సూచించారు. దీనిపై ఉన్నతాధికారులను ఆరా తీయగా పదివేలలోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు మాత్రమే పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని, ఈ లెక్కన కాలేజీలో వ్యక్తిగతంగా రూ.90 వేలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అప్పటికే పూర్తి ఫీజు రీయింబర్స్ చేయాలనే డిమాండ్ ఉండటంతో, తర్వాతైనా ప్రభుత్వం ఇవ్వకపోతుందా అనే ఆశతో తొలిఏడాది ఎలాగోలా ఫీజు మొత్తం సర్దుబాటు చేసుకుని అందులో చేరాడు. కానీ ఇప్పటికీ డిమాండ్ నెరవేరక పోవడంతో.. ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో ఫీజు చెల్లించడానికి ఎన్నో ఇబ్బందులకు గురికావలసి వచ్చింది. ఒక దశలో కోర్సు మానేద్దామనుకున్నా అష్టకష్టాలూ పడి ఫైనల్ ఇయర్ పూర్తిచేసి కొలువు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో పదివేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్ చేస్తుండటం..చాలామంది వెనుకబడిన తరగతుల విద్యార్థులు, ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒక ర్యాంకు ఎక్కువ వచ్చినా ఆ పథకం కింద విద్యార్థికి కేవలం రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని టాప్–10 ఇంజనీరింగ్ కాలేజీల్లో వార్షిక ట్యూషన్ ఫీజు రూ.80 వేలకు పైమాటే ఉంది. నాలుగైదు కాలేజీల్లో రూ.లక్ష కంటే ఎక్కువ ఉండగా.. మిగతా కాలేజీల్లో రూ.80 వేలకు అటుఇటుగా ఉంది. ఇక టాప్ 10 నుంచి 20 వరకు కాలేజీల్లో రూ.55 వేలకు మించి ఫీజు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కాగా పదివేల ర్యాంకు సీలింగ్ దాటిన విద్యార్థులకు ప్రభుత్వం కనీస ఫీజు అయిన రూ.35 వేలు మాత్రమే ఇస్తుండగా.. చాలా కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రూ.50 వేల కంటే ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే సీలింగ్ ర్యాంకు దాటిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరిన పక్షంలో అదనపు ఫీజును వ్యక్తిగతంగా చెల్లించాల్సి వస్తోంది. సీఎం సానుకూలంగా స్పందించినా.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ర్యాంకు సీలింగ్‌ను కొన్నేళ్ల క్రితం విధించారు. అప్పట్నుంచీ విద్యార్థి సంఘాలతో పాటు బీసీ సంఘాలు, ఇతర సామాజిక సంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు సమానంగా బీసీలు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు పూర్తి ఫీజును రీయింబర్స్ చేయాలంటూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలు సందర్భాల్లో ర్యాంకు సీలింగ్ ఎత్తివేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. బీసీ డిక్లరేషన్ ప్రతిపాదనల్లోనూ ఈ మేరకు సూచనలు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి మూడేళ్లు గడిచినా ఈ అంశం ఎటూ తేలలేదు. ర్యాంకు సీలింగ్ నిబంధనతో ఏటా వేలాది బీసీ, ఈడబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అరకొరగానే ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుండగా.. ఆయా కాలేజీల్లో అదనపు ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. వారిలో సగం మందే బీసీలు ఎంసెట్‌లో 10వేల లోపు ర్యాంకులు సాధించిన వారిలో బీసీలు సగం మంది మాత్రమే ఉంటున్నారు. జనరల్ కేటగిరీతో పాటు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులను మినహాయిస్తే బీసీలు సగటున 3 వేల నుంచి గరిష్టంగా 6 వేల మంది ఉంటున్నట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఏటా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్న విద్యార్థులు 6 వేలకు మించడం లేదని స్పష్టమవుతోంది. రాష్ట్ర పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లోని వివిధ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా లక్ష మంది ఉండగా.. ఇందులో గరిష్టంగా 6వేల మంది బీసీ విద్యార్థులకు మాత్రమే ఫుల్ ఫీజు అందుతోంది. మొత్తం విద్యార్థుల్లో 10 శాతం మందికి పూర్తి ఫీజు మంజూరవుతుండగా.. అందులో బీసీల వాటా 6శాతం మాత్రమే. -
మీ కెరీర్ మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్.. నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే..
రాజానగరం(తూర్పుగోదావరి): చదివిన చదువు విద్యార్థికి ఉపయోగపడాలి. ఉపాధికి మార్గం చూపాలి. విజ్ఞానం పంచాలి. ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటంతో విద్యార్థులు చదువు పూర్తయ్యాక పట్టా చేత పట్టుకుని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అటు ఉద్యోగం పొందలేక ఇటు బయట ప్రపంచంలో మనలేక అవస్థలు పడుతున్నారు. చదవండి: మగవాళ్లకు మాత్రమే.. ఆడవారికి నో ఎంట్రీ.. ఎందుకంటే? కొద్దిరోజులుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. విద్యార్థికి ఎదురవుతున్న ఇటువంటి క్లిష్ట పరిస్థితిని చక్కదిద్దేందుకు విద్యా సంస్థలు మార్గాన్వేషణ చేస్తున్నాయి. స్కిల్ బోధన చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఇస్తూ ఉపాధి బాట చూపుతున్నాయి. నన్నయ విశ్వ విద్యాలయం ఈ విషయంలో చురుకైన పాత్ర పోషిస్తోంది. ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసి, బయటకొస్తున్నారు. వారిలో చాలామందిలో పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలు కొరవడుతున్నాయి. ఫలితంగా సరైన ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు. ఈ కొరతను నివారించి, తరగతి గదిలో నేర్చుకున్న పరిజ్ఞానం ఉపయోగపడేలా విద్యాసంస్థలు ఇప్పుడు బాట వేస్తున్నాయి. పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యంతో కూడా అవగాహన కలిగించేందుకుగాను ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ ఇంటర్న్‌షిప్ ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాదు పరిశోధనలు చేసే విద్యార్థులకు కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు అధ్యాపకులు. ఈ కారణంగానే ప్రతి విద్యార్థి తన కోర్సులో ఏదోఒక పరిశ్రమలో ఇంటర్న్‌షిప్ చేయాలని రాష్ట్ర ఉన్న విద్యామండలి నిబంధన కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో ఇంటర్న్‌షిప్ అనేది ఇంజినీరింగ్ విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు మార్గాన్ని చూపటంతోపాటు ఉపాధి అవకాశాలకు తొలి మెట్టుగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. అందుకే కాలేజీల నుంచి ఇంటర్న్‌షిప్‌నకు మరో పరిశ్రమ లేదా సంస్థకు వెళ్లే విద్యార్థులు దీనిని సదవకాశంగా భావించాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. దీనిని క్యాజువల్‌గా పరిగణిస్తే భవిష్యత్‌కు ఇబ్బందికరమంటున్నారు. ఉపాధి పొందే అవకాశం ♦ తరగతి గదిలో నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానానికి మరింత పదును పెట్టి, వర్కుపై అవగాహన పెంచడం ఇంటర్న్‌షిప్ ప్రధాన ఉద్దేశం. ♦ పరిశ్రమలు, కొన్నిరకాల సంస్థలు ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ అవకాశాన్ని అందిస్తున్నాయి. ♦ తొలినాళ్లలోనే పని నేర్చుకునే వీలు కల్పిస్తున్నాయి. ♦ ప్రాజెక్టులు రూపొందించడం, ఫీల్డ్ గురించి తెలుసుకోవడం, హార్డ్, సాప్ట్ స్కిల్స్‌ని అభివృద్ధి చేయడం వంటి వాటి కోసం ఇంటర్న్‌షిప్‌లో సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయంలో వారు చూపించే ప్రతిభాపాటవాలతో కొన్ని సంస్థలు వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఆఫర్ చేస్తుంటాయి. ♦ వేసవిలో 10 నుండి 12 వారాలపాటు ఇంటర్న్ షిప్ చేయవలసి వస్తే ఇతర కాలాలలో ఆరు మాసాలకు లోబడి సమయాన్ని ఆయా సంస్థలు, పరిశ్రమలు నిర్ణయిస్తాయి. ♦ ఈ సమయంలో గౌరవ వేతనాలను కూడా పొందే అవకాశాలుంటాయి. ♦ అనుభవజ్ఞులతో పరిచయాలు ఏర్పడం, వారి అనుభవాలను షేర్ చేసుకోవడం జరుగుతుంటుంది. ♦ విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు ఇంటర్న్‌షిప్ ఎంతగానో దోహదపడుతుంది. ♦ ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు, ఉన్నత అవకాశాలను పొందేందుకు కూడా తోడ్పడుతుంది. ♦ ఏ ఉద్యోగానికైనా అనుభవం కొలమానికంగా ఉన్న నేపథ్యంలో ఇంటర్న్‌షిప్ అనుభవంగా సహకరిస్తుంది. పీహెచ్డీ చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది కంపెనీలు ఇచ్చే జాబ్ సెలక్షన్స్‌లో ఇంటర్న్‌షిప్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎంటెక్ చేసి, పీహెచ్డీ చేయాలనుకునే వారికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఆదికవి నన్నయ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌ల విద్యార్థులు చదువు పూర్తి చేసి బయటకు వెళ్లారు. ప్రస్తుతం 800 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీ, ఎన్టీఆర్ఐ, సీఐటీడీ వంటి సంస్థలలో ఇంటర్న్‌ఫిప్ చేసే అవకాశాలు వచ్చాయి. – ఆచార్య ఎం.జగన్నాథరావు, వైస్‌చాన్సలర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ మార్గదర్శకాలను అనుసరించే.. ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలను అనుసరించి ఇంజినీరింగ్ విద్యార్థులంతా ఇంటర్న్‌షిప్ చేయవలసి ఉంటుంది. దీనిని ఆన్‌లైన్‌లోగాని, ఆఫ్‌లైన్‌లోగాని తప్పనిసరిగా చేయవలసిందే. ఇందుకోసం కంపెనీలు ఒక్కోసారి నోటిఫికేషన్స్ ఇస్తుంటాయి, వాటిని విద్యార్థులు చూసి, దరఖాస్తు చేసుకుంటారు. ఇంటర్న్షిప్స్ ఎక్కువగా సమ్మర్ హాలిడేస్‌లో చేస్తుంటారు. – డాక్టర్ వి.పెర్సిస్, ప్రిన్సిపాల్, ‘నన్నయ’ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అనుభవాన్ని అందించింది ఎలక్రిక్టకల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో మూడో సంవత్సరం చదువుతున్న నాకు ప్రాసెస్ కంట్రోల్ రంగంలో ప్రతిష్టాత్మక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( తిరుచిరాపల్లి)లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా ఇది మాకు వర్కుపై కొత్త అనుభవాన్ని అందించింది. తద్వారా లక్ష్యాన్ని సాధించాగలమనే ధీమాను ఇచ్చింది. – కార్తీక్‌కుమార్‌రెడ్డి, వసంతకుమార్, మౌనిక -
గంగాధర నెల్లూరులో చోరీలకు పాల్పడుతున్న బీటెక్ స్టూడెంట్స్
-
ఏఐసీటీఈ సర్వే: గణితంలో ఇంజనీరింగ్ విద్యార్థులు వీక్
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ విద్యార్థుల్లో గణితం సబ్జెక్టులో వెనుకబాటు ఎక్కువగా ఉంటోందని, ఫలితంగా ఆయా కోర్సుల్లో వారు తగిన నైపుణ్యాలను అలవర్చుకోలేకపోతున్నారని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పరఖ్ సర్వే వెల్లడించింది. ఇంజనీరింగ్ కోర్సుల్లో కీలకమైన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఏఐసీటీఈ ‘పరఖ్’ పేరిట ఈ స్టూడెంట్ లెర్నింగ్ అసెస్మెంట్ (విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మూల్యాంకనం)ను ఇటీవల నిర్వహించింది. చదవండి: పరిశ్రమలకు ఊరట.. ఏపీఈఆర్సీ కీలక ఆదేశాలు.. ఈ సర్వే ఫలితాలను బుధవారం విడుదల చేసింది. సాంకేతిక విద్యలో అభ్యసన లోపాలను గుర్తించేందుకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఏఐసీటీఈ పరఖ్ పేరిట ఆన్లైన్ పరీక్షను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 2,003 సాంకేతిక విద్యాసంస్థలకు సంబంధించిన 1.29 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అభ్యర్థులు తమ అభ్యసన సామర్థ్యాలను ఈ పరఖ్ సర్వే ద్వారా స్వయం మూల్యాంకనం చేసుకునేలా దీన్ని నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నమోదైన ఈ సర్వే గణాంకాలను ఏఐసీటీఈ విశ్లేషించి నివేదికలు విడుదల చేసింది. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థులకు పరఖ్ ద్వారా ఏఐసీటీఈ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టు అంశాలతోపాటు ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహించింది. సెకండియర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులకు ఆయా కోర్ సబ్జెక్టు అంశాలను ఆధారం చేసుకొని మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అంశాల్లో స్వయం సామర్థ్య పరీక్షలను పెట్టింది. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులకు కోర్ సబ్జెక్టుల్లోనే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) అంశాలపైనా నిర్వహించింది. మ్యాథ్స్‌లోనే సమస్యలు.. ఏఐసీటీఈ విడుదల చేసిన నివేదికల ప్రకారం.. ఫస్టియర్ ఇంజనీరింగ్ విద్యార్థులు అన్ని మేజర్ ప్రోగ్రాముల్లోనూ మ్యాథమెటిక్స్లోనే సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఈ విద్యార్థులకు గణితం సబ్జెక్టులో ప్రాథమిక స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు సరిగా అలవడకపోవడమేనని పేర్కొంది. ప్రాథమిక, మాధ్యమిక, హయ్యర్ సెకండరీ స్థాయిల్లో గణితం సబ్జెక్టులో వీరికి తగిన సామర్థ్యాలు అలవడలేదని వివరించింది. అత్యధిక శాతం మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠశాల స్థాయిలోని సామర్థ్యలోపాలు ఇప్పుడు సమస్యగా మారాయని పేర్కొంది. 22,725 మంది ఫస్టియర్ విద్యార్థులకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే.. ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాల్లో నైపుణ్యాలు అంతంతమాత్రంగా ఉండగా.. గణితంలో మరింత అధ్వానంగా ఉన్నారని తేల్చింది. ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు సంబంధించి జనరల్ నాలెడ్జి, తదితర అంశాల్లోనూ చాలా వెనుకబడి ఉన్నారని స్పష్టం చేసింది. సబ్జెక్టులవారీగా స్కోర్లు ఎంతంటే.. పరఖ్ ద్వారా నిర్వహించిన సర్వే పరీక్షలో విద్యార్థులు ఇచ్చిన సమాధానాలను అనుసరించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ టెస్టుల్లో ఏయే విభాగాల విద్యార్థులు ఎంత స్కోర్ చేశారో పరిశీలిస్తే అన్ని విభాగాల్లోనూ సగం శాతమే స్కోర్ ఉంది. గణితంలో.. ♦గణితంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు సాధించిన సగటు స్కోరు 37.48 శాతం మాత్రమే. ♦ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) విద్యార్థుల సగటు స్కోరు 38.9 శాతం. ♦మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల సగటు స్కోర్ 39.48 శాతం ♦ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల సగటు స్కోర్ 40.02 శాతం ♦కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థుల సగటు స్కోర్ 40.12 శాతం ఫిజిక్స్‌లో.. ♦ఫిజిక్స్ అంశాల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు.. 52.5 శాతం సగటు స్కోర్‌తో మంచి ప్రతిభ చూపారు. ♦వీరి తర్వాత 51 శాతం స్కోర్‌తో కంప్యూటర్ సైన్స్, 50 శాతం స్కోర్‌తో మెకానికల్ విద్యార్థులు వరుస స్థానాల్లో ఉన్నారు. కెమిస్ట్రీలో.. కెమిస్ట్రీ ప్రశ్నలకు సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు 53.1% సగటు స్కోర్‌తో అగ్రభాగాన ఉన్నారు. సీఎస్ఈ విద్యార్థులు 53%, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు 51.3 శాతంతో తర్వాత స్థానాల్లో నిలిచారు. ఆప్టిట్యూడ్ టెస్టులో.. ఆప్టిట్యూడ్ టెస్టుకు సంబంధించి జనరల్ నాలెడ్జి తదితర అంశాల్లో విద్యార్థుల లోపాలు పరఖ్ సర్వేలో వెల్లడయ్యాయి. జనరల్ నాలెడ్జి, లాజికల్ రీజనింగ్ తదితర అంశాల్లో విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. సర్వేలో పాల్గొనని అనేక విద్యాసంస్థలు పరఖ్ సర్వేలో ఐఐటీలు సహా అనేక సాంకేతిక విద్యాసంస్థలు పాల్గొనలేదు. తమిళనాడు నుంచి 24,499 మంది పాల్గొనగా.. అత్యల్పంగా గోవా నుంచి ముగ్గురు విద్యార్థులే పాల్గొన్నారు. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ల నుంచి 12,387 మంది విద్యార్థులు ఈ పరఖ్ సర్వేలో భాగస్వాములయ్యారు. ఏపీ నుంచి 5,628, తెలంగాణ నుంచి 4,234, కర్ణాటక నుంచి 8,739, కేరళ నుంచి 3,431, మహారాష్ట్ర నుంచి 11,334, యూపీ నుంచి 5,288 మంది పాల్గొన్నారు. -
డ్రగ్స్‌తో పట్టుబడ్డ ఇంజనీరింగ్ విద్యార్థులు
-
విషాదం మిగిల్చిన ఈత సరదా
అబ్దుల్లాపూర్‌మెట్: సరదాగా కుంటలో ఈత కొట్టేందుకు దిగిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వాసం స్వామి కథనం ప్రకారం.. నాదర్గుల్లోని స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న మహబూబ్‌నగర్ జిల్లా కొమిరెడ్డిపల్లికి చెందిన ఎస్.క్రాంతికుమార్‌రెడ్డి (20), సంగారెడ్డి జిల్లా పాంపాడ్‌కు చెందిన పటోళ్ల శ్రీకాంత్ (20) శుక్రవారం సప్లిమెంటరీ పరీక్షలు రాసి మిగతా ఆరుగురు స్నేహితులతో కలిసి సంఘీనగర్ దేవాలయాల పరిసరాలకు వచ్చారు. కొహెడ శివారులోని నీటి కుంటలో సరదాగా ఈత కొట్టేందుకు దిగారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన మిగతా విద్యార్థులు.. 100కు డయల్ చేసి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కుంటలోకి దిగి ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
2000 మందికి సున్నా మార్కులు.. నోరెళ్లబెట్టిన విద్యార్థులు, కారణమేంటి?
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపు 2 వేల మంది విద్యార్థులకు కొన్ని పేపర్లలో సున్నా మార్కులు రావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగగా.. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ 2, 3 సంవత్సరాల విద్యార్థుల ఆఖరి సెమిస్టర్ మార్కులను ఇటీవల ప్రకటించారు. ఈ ఫలితాల్లో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులకు కొన్ని సబ్జెక్టుల్లో జీరో మార్కులు వచ్చాయి. వీరిలో ఎక్కువమంది పాలిటెక్నిక్ డిప్లొమా చేసి, ఐసెట్ ద్వారా నేరుగా ఇంజనీరింగ్ రెండో ఏడాది ప్రవేశాలు పొందిన వాళ్లు కావడం గమనార్హం. ఇంటర్నల్ పరీక్షల్లో వీరిలో చాలామందికి 25కు గాను 23 వరకు మార్కులొచ్చాయి. అయితే ఎక్స్టర్నల్స్లో మాత్రం ఏకంగా జీరో రావడం విస్మయం కలిగిస్తోంది. ఈ విధంగా మార్కులొచ్చిన వారు ఇప్పటివరకు 2 వేల మందిని గుర్తించినట్టు విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. అన్ని కాలేజీల నుంచి డేటా తెప్పిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనం దశలోనో, మార్కుల వెల్లడిలోనో జరిగిన సాంకేతిక లోపం ఇందుకు కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. (చదవండి: దీపం ఆరింది.. దిశగా వెలిగింది.. ‘దిశ’ విషాదానికి నేటితో రెండేళ్లు ) ఇప్పటికీ వినియోగంలో పాత సాఫ్ట్వేర్ కళాశాలలకు చెందిన జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసిన తర్వాత మార్కులను ఆయా కాలేజీల వారీగా జేఎన్టీయూహెచ్ సాఫ్ట్‌వేర్‌లో ఆప్‌లోడ్ చేస్తారు. దీనికోసం వర్సిటీ ఇప్పటికీ ఎప్పుడో పాతకాలం నాటి సాఫ్ట్‌వేర్‌నే వాడుతోంది. ఆప్‌లోడ్ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాన్ని తప్పుగా గుర్తించే విధానం ఈ సాఫ్ట్‌వేర్‌లో లేదని, తప్పులు ఆటోమేటిక్‌గా గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను వర్సిటీ ఇప్పటికీ అందిపుచ్చుకోలేదని నిపుణులు అంటున్నారు. మరోవైపు అధ్యాపకులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత నెలలో జరిగిన పరీక్షలకు దాదాపు రెండు లక్షల వరకు విద్యార్థులు హాజరయ్యారు. అయితే అతి తక్కువ మందితో వాల్యుయేషన్ చేయించడం, వేగంగా మార్కులు అప్లోడ్ చేయించడం జరిగిందని చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు జీరో మార్కులు రావడానికి ఇవన్నీ కారణాలై ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. జేఎన్టీయూహెచ్ అధికారులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకుంటే గానీ ఏమీ చెప్పలేమంటున్నారు. (చదవండి: మల్లాపూర్: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్) సాంకేతిక సమస్యలు సరిదిద్దుతాం ఎంతమందికి జీరో మార్కులొచ్చాయో డేటా తెప్పిస్తున్నాం. సమాధాన పత్రాలు పరిశీలిస్తాం. ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తిస్తాం. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసే అవకాశం లేదు. సాంకేతికపరమైన సమస్యలుంటే సరిదిద్దుతాం. విద్యార్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని, వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. – మంజూర్ హుస్సేన్, రిజిస్ట్రార్, జేఎన్టీయూహెచ్ అధ్యాపకులపై ఒత్తిడే కారణం.. వాల్యుయేషన్ నేపథ్యంలో అధ్యాపకులపై విపరీ తమైన ఒత్తిడి ఉంటోంది. వర్సిటీ అధికారులు త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు పరుగులు పెట్టిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ పని చేయిస్తున్నారు. వాల్యుయేషన్‌కు వెళ్లినా కాలేజీల్లో బోధన చేయాల్సి వస్తోంది. జీరో మార్కులు రావడానికి ఈ పరిస్థితులే కారణమని భావిస్తున్నాం. – అయినేని సంతోష్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, సాంకేతిక కాలేజీల ఉద్యోగుల సంఘం అప్పుడు 82 శాతం.. ఇప్పుడు జీరో ఇంటర్నల్స్‌లో నాకు 82% మార్కులొచ్చాయి. రెండో ఏడాది మ్యాథ్స్ పేపర్లో సున్నా మార్కులు వేశారు. పరీక్ష బాగానే రాశాను. అందుకే ఇదేం అన్యాయమని కాలేజీ వాళ్లను అడిగాను. జవాబు పత్రం మూల్యాంకనం చేసేది మేము కాదు యూనివర్సిటీ వాళ్లని, అక్కడకెళ్లి అడగాలని చెబుతున్నారు. – సంజయ్, విద్యార్థి, అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ అధికారులే బాధ్యత వహించాలి వర్సిటీ అధికారుల మొద్దు నిద్రకు ఇది ఓ ఉదాహరణ. ఇంటర్నల్స్‌లో 90 శాతానికి పైగా మార్కులొచ్చిన విద్యార్థులకు ప్రధాన పరీక్షలో సున్నాలు ఎలా వస్తాయి? విద్యార్థుల జీవితాలతో అధికారులు చెలగాటమాడటం అన్యాయం. ఇందుకు అధికారులు బాధ్యత వహించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ -
ఇంజనీరింగ్, ఫార్మసీలో 1.45 లక్షల సీట్లు
సాక్షి, అమరావతి: ఏపీఈఏపీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. వెబ్ కౌన్సెలింగ్‌కు కాలేజీల్లోని కోర్సులవారీగా సీట్ల సంఖ్యను ప్రభుత్వం సోమవారం ఖరారు చేసింది. ఈ మేరకు వేర్వేరు జీవోలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర విడుదల చేశారు. తొలిసారిగా యూనివర్సిటీల కాలేజీలు, ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలతో పాటు ప్రైవేటు యూనివర్సిటీల్లోని 35 శాతం సీట్లు కూడా కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. 2021–22 విద్యా సంవత్సరంలో తొలి విడత కౌన్సెలింగ్‌కు 1,45,421 ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యధికం కంప్యూటర్ సైన్సు విభాగంలో ఉన్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మెకానికల్, కెమికల్, సివిల్ వంటి కోర్ సబ్జెక్టులకు సంబంధించినవి ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి మొత్తం 435 కాలేజీలు ఈసారి కౌన్సెలింగ్‌లో ఉన్నాయి. నేటినుంచి వెబ్ ఆప్షన్లు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 5వ తేదీ వరకు ఆప్షన్లను నమోదు చేయవచ్చు. 6వ తేదీన మార్పులు చేసుకోవచ్చు. 10వ తేదీన తొలి విడత సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్ధులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు సంబంధిత కాలేజీల్లో ఈనెల 15వ తేదీలోపు చేరాలి. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. -
ఇంజనీరింగ్ విద్యార్థినులకు స్కాలర్షిప్.. ఏడాదికి 50 వేలు
ఇంజనీరింగ్, డిప్లొమా చదివే విద్యార్థినులకు ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్షిప్ ప్రకటన వచ్చేసింది. ప్రతిభావంతులైన విద్యార్థినులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించే ఉద్దేశంతో అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ప్రతి ఏటా ఈ స్కాలర్షిప్ అందిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల విద్యార్థులు నవంబర్ 30వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఇలా ఏఐసీటీఈ గతంలో 4వేల మందికి స్కాలర్‌షిప్స్‌ను అందించేది. ఇందులో బీటెక్ అభ్యసించేవారికి 2000, డిప్లొమా వారికి 2000 చొప్పున కేటాయించింది. ప్రస్తుతం 2021 ఏడాది సంబంధించి ఈ స్కాలర్షిప్స్ సంఖ్యను భారీగా పెంచింది. 4 వేల నుంచి 10వేలకు(బీటెక్–5000, డిప్లొమా–5000)పెంచింది. ఆర్థిక ప్రోత్సాహం ప్రగతి స్కాలర్షిప్ పథకం కింద ఎంపికైన ప్రతి విద్యార్థినికి ఏడాదికి రూ.50వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. కాలేజీ ఫీజు, కంప్యూటర్ కొనుగోలు, స్టేషనరీ, బుక్స్, ఎక్విప్మెంట్ తదితర అవసరాలన్నింటికీ కలిపి ఈ మొత్తాన్ని డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానంలో అందజేస్తారు. అర్హత ఏఐసీటీఈ గుర్తింపు పొంది టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ ఇయర్ బీటెక్/డిప్లొమా కోర్సుల్లో చేరి ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకుండా ఉండాలి. కుటుంబంలో అర్హులైన విద్యార్థినులు ఇద్దరూ ఉంటే ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంబంధిత కాలేజీలో బీటెక్/పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ధ్రువపత్రాలు పదోతరగతి/ఇంటర్ అకడమిక్ సర్టిఫికెట్లు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, సంబంధిత ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ పొందిన సర్టిఫికేట్, ట్యూషన్ ఫీజు రిసిప్ట్, ఆధార్‌తో లింక్ అయి ఉన్న బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఫోటోగ్రాఫ్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, తల్లిదండ్రుల ధ్రువీకరణ పత్రం ఉండాలి. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.11.2021 ► వెబ్సైట్: https://www.aicte-india.org/ -
ఇంజనీరింగ్ విద్యార్థులకు వీఎల్ఎస్ఐ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా పాఠ్యాంశాల ప్రసారాలు అందించిన టీ–శాట్ ఇక ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ప్రత్యేక శిక్షణా ప్రసారాలను అందుబాటులోకి తేనుంది. టాస్క్, పీవీసీ (ఫోటానిక్స్ వాలి కార్పొరేషన్), వేద ఐఐటీ సంయుక్తంగా వెరీ లార్జ్‌స్కేల్ ఇంటిగ్రేషన్ (వీఎల్ఎస్ఐ) ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్లపై టీ–శాట్ చానళ్ల ద్వారా ఈనెల 26 నుంచి పాఠాలను బోధించనున్నట్టు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. టీ–శాట్ ద్వారా అందించే ఎక్స్పోజర్ ట్రైనింగ్‌తో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమల పురోగతి, మెరుగైన నైపుణ్యం, ఉద్యోగాల కల్పన, వివిధ సంస్థల సాంకేతికత తదితర అంశాలపై ప్రసారమయ్యే ప్రత్యేక బోధనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 8:15 గంటల నుంచి నేటి ఉదయం 8:15 గంటల నుంచి 10:30 గంటల వరకు టీ–శాట్ నిపుణ చానల్లో ఈ ప్రత్యేక శిక్షణ ప్రసారాలు ఉంటాయని టీ–శాట్ నెట్వర్క్ చానళ్ల సీఈవో ఆర్.శైలేశ్‌రెడ్డి తెలిపారు. 15 రోజులపాటు 30 గంటలు ఈ ప్రసారాలు కొనసాగుతాయని, సాయంత్రం 7 గంటల నుంచి 9 వరకు పునఃప్రసారమవుతాయని వెల్లడించారు. టీ–శాట్ నిపుణ చానల్‌తోపాటు టీశాట్ ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్‌లోనూ ఈ ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. సందేహాల నివృత్తి కోసం 040–23540326, 23540726, టోల్‌ఫ్రీ నంబర్ 18004254039లను సంప్రదించాలని శైలేశ్‌రెడ్డి చెప్పారు. -
ఇంజనీరింగ్ పూర్తి: మతిస్థిమితం కోల్పోయి తల్లిని చంపిన కూతుళ్లు
టీ.నగర్: తల్లిని హతమార్చిన మతిస్థిమితం లేని ఇద్దరు కుమార్తెలపై కేసు నమోదైంది. తిరునెల్వేలి జిల్లా పాళయంకోటైకి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి కోయిల్పిచ్చై, ఉషా (50) దంపతులకు కుమార్తెలు నీనా(21), రీనా(19) ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. కోయిల్పిచ్చై మున్నీర్‌పల్లంలో ఉంటున్నాడు. నీనా, రీనా ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కొద్ది నెలల క్రితం నుంచి కుమార్తెలు ఇరువురికి మతిస్థిమితం లేకుండా పోయింది. మంగళవారం మధ్యాహ్నం ఉషాతో కుమార్తెలు గొడవపడ్డారు. కేకలు విని ఇరుగుపొరుగువారు ఉషా ఇంట్లోకి వచ్చి చూడగా ఆమె నిర్జీవంగా కనిపించింది. పోలీసుల విచారణలో కత్తి, ఇనుపరాడ్‌తో దాడి చేయడం వల్లే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. -
బైక్ అంబులెన్సులు.. ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభ
గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు బైక్ అంబులెన్సులను రూపొందించారు. అత్యవసర సమయాల్లో కరోనా రోగులకు ఉపయోగపడేలా వీటిని తయారు చేశారు. ఆక్సిజన్ సిలిండర్, వీల్ చైర్, ఎమర్జెన్సీ మెడికల్ కిట్ ఇందులో ఉంటాయి. పూణేకు చెందిన డసల్ట్ సిస్టమ్స్ కంపెనీ ప్రతినిధి సుహాస్ ప్రీతిపాల్ పర్యవేక్షణలో మెకానికల్ సెకండియర్ చదువుతున్న గుత్తికి చెందిన యశ్వంత్, ఎజాజ్ అహ్మద్ 45 రోజులు శ్రమించి బైక్ అంబులెన్సులను రూపొందించారు. ఇప్పటిదాకా తయారైన పది బైక్ అంబులెన్సులను త్వరలోనే సచివాలయాలకు ఉచితంగా అందజేస్తామని గేట్స్ కాలేజీ ఎండీ గజ్జల రఘునాథ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఒక్కో అంబులెన్స్ తయారు చేయడానికి దాదాపు రూ.50 వేలు ఖర్చయ్యిందని, కరోనా రోగులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే వీటిని రూపొందించామని విద్యార్థులు యశ్వంత్, ఎజాజ్ అహ్మద్ చెప్పారు. -
ఎంసెట్ ఇక ఈఏపీసెట్
సాక్షి, అమరావతి: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సహా పలు ప్రొఫెషనల్ యూజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం ప్రకటించారు. ఇంజినీరింగ్ తదితర కోర్సులకు ఇంతకు ముందు ఏపీ ఎంసెట్ నిర్వహించేవారు. మెడికల్ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్’ నిర్వహిస్తుండటంతో మెడికల్ విభాగాన్ని ఎంసెట్ నుంచి మినహాయిం చారు. మెడికల్‌ను తొలగించినందున ఏపీ ఎంసెట్ ను ఏపీ ఈఏపీసెట్(ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)–2021 పేరుతో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఆగస్టు 19 నుం చి 25 వరకూ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. సెప్టెంబర్ మొదటి, రెండో వారాల్లో ఇతర ప్రవేశ పరీక్షలు.. ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ మొదటి, రెండో వారాల్లో నిర్వహించే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఏపీ ఈఏపీసెట్–2021 షెడ్యూల్.. ►అపరాధ రుసుము లేకుండా జూన్ 26 నుంచి జూలై 25వ తేదీ వరకు ►రూ.500 ఫైన్‌తో జూలై 26 నుంచి ఆగస్టు 5 వరకు ►రూ.1,000 లేట్ ఫీజుతో ఆగస్టు 6 నుంచి 10 వరకు ►రూ.5,000 లేట్ ఫీజుతో ఆగస్టు 11 నుంచి 15 వరకు ►రూ.10 వేల అపరాధ రుసుముతో ఆగస్టు 16 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి తెలిపారు. -
లాంగ్ డ్రైవ్: ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం
మాదాపూర్: లాంగ్‌డ్రైవ్ కోసం వచ్చిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు డివైడర్‌ను ఢీకొని మృత్యువాత పడ్డారు. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... బీఎన్ రెడ్డి నగర్‌లోని హాస్టల్లో ఉంటున్న వినయ్‌కుమార్‌రెడ్డి(23) గురునానక్ కళాశాలలో, సన్ని రామిరెడ్డి(21) శ్రీదత్త కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. డ్యూక్ బైక్ పై లాంగ్‌డ్రైవ్ కోసం ఎల్బీనగర్ నుంచి డీఎల్ఎఫ్ వెళ్తూ కొత్తగూడలో డివైడర్‌ను ఢీకొన్నారు. ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘డేటింగ్ ట్రాప్’ ముంబై వ్యక్తి పనే.. -
జిరాక్స్ కాపీలే కాలేజీలకు ఇవ్వండి
సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్–2020 ద్వారా వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలో చేరే సమయంలో సర్టిఫికెట్లకు సంబంధించి జిరాక్స్ కాపీలు మాత్రమే సమర్పించాలని అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్ ఎంఎం నాయక్ కోరారు. ఈ మేరకు విద్యార్థులకు జారీచేసిన అలాట్మెంట్ ఆర్డర్లలో పలు సూచనలు పొందుపరిచారు. ఇలా చేయాలి.. ► అభ్యర్థులు ముందుగా అలాట్మెంట్ ఆర్డర్‌ను ‘ఏపీఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఆ తరువాత అభ్యర్థి లాగిన్ అయి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ► తదుపరి జాయినింగ్ రిపోర్ట్, అలాట్మెంట్ ఆర్డర్, రిసీప్ట్ ఆఫ్ సర్టిఫికెట్లను రెండు కాపీల చొప్పున ప్రింట్ తీసుకుని వారికి కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలి. ► ఒక కాపీని కాలేజీలో సమర్పించి.. రెండో కాపీపై అకనాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. ► ఆన్లైన్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు వెబ్సైట్ నుంచి రిసీప్ట్ ఆఫ్ సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకుని దాన్ని కూడా కాలేజీలో సమర్పించాలి. సీటు కేటాయింపు అయిన అభ్యర్థులు దాన్ని నిలుపుకోవాలంటే సెల్ఫ్ రిపోర్టింగ్‌తో పాటు, కాలేజీలో రిపోర్టు చేయడం తప్పనిసరి. ఇందుకు చివరి తేదీ 2021 జనవరి 8. ► వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్, అనంతరం కాలేజీలో రిపోర్టు చేయని వారి అలాట్మెంట్ సీటును ఖాళీగా పరిగణిస్తారు. తరువాత కౌన్సెలింగ్ సమయంలో మొదటి విడత సీటు కేటాయింపు రద్దవుతుంది. ► రెండో కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థుల్లో అర్హులకు దాన్ని కేటాయిస్తారు. ► విద్యార్హతలకు సంబంధించిన వివరాలు పరిశీలనలో తప్పని తేలితే సదరు అభ్యర్థికి సీటును రద్దుచేయడంతో పాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకుంటారు. ► అభ్యర్థులు అడ్మిషన్ల సమయంలో సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులనే సమర్పించాలి. ► ఒరిజినల్ సర్టిఫికెట్లను కేవలం పరిశీలన వరకు అందించి తదుపరి వెనక్కి తీసుకోవాలి. ► ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు అర్హులు కాని అభ్యర్థులు తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తరువాత మాత్రమే ఆయా కాలేజీల్లో ట్యూషన్ ఫీజులు చెల్లించాలి. ► తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యే వరకు విద్యార్థుల నుంచి కాలేజీ యాజమాన్యాలు ఎలాంటి ఫీజులు వసూలుచేయకూడదు. నేటి నుంచి ఇంజనీరింగ్ తరగతులు తొలివిడత కౌన్సెలింగ్ ముగియడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ తరగతులను బుధవారం నుంచి ప్రారంభించేలా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. కోవిడ్–19 నేపథ్యంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించేలా ఆదేశాలు జారీచేసింది. ఇదీ క్యాలెండర్.. ప్రొఫెషనల్ యూజీ కోర్సుల తరగతుల ప్రారంభం : జనవరి 6 ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు : ఏప్రిల్ 17 సెకండ్ సెమిస్టర్ ప్రారంభం : మే 3 సెకండ్ సెమిస్టర్ పరీక్షలు : ఆగస్టు 23 థర్డ్ సెమిస్టర్ ప్రారంభం : సెప్టెంబర్ 1