ఈజీ మనీకి అలవాటు పడిన ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఏకంగా కొకైన్ అమ్మకాలకు తెగబడ్డారు.
ఈజీ మనీకి అలవాటు పడిన ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఏకంగా కొకైన్ అమ్మకాలకు తెగబడ్డారు. తమిళనాడులో కొకైన్ కొని.. దాన్ని బెంగళూరులో విక్రయించేందుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసు వివరాలను అనంతపురం ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు. కడప జిల్లాకు చెందిన ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు మరికొంతమంది కూడా ఈ ముఠాలో ఉన్నట్లు ఆయన చెప్పారు.
తమిళనాడులో 13 లక్షల రూపాయలకు కొకైన్ కొని, దాన్ని రూ. 60 లక్షలకు అమ్మాలని అనుకున్నారని, బెంగళూరులో దీన్ని విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారని ఆయన తెలిపారు. కేవలం ఈజీ మనీకి అలవాటు పడటం వల్లే వాళ్లు ఈ నేరానికి పాల్పడ్డారని అన్నారు. విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.